01-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ ఈ జీవితము దేవతలకన్నా ఉత్తమమైనది, ఎందుకంటే మీరు ఇప్పుడు రచయిత మరియు రచనలను యథార్థముగా తెలుసుకొని ఆస్తికులుగా అయ్యారు’’

ప్రశ్న:-

మొత్తం కల్పమంతటిలోనూ ఉండని ఏ విశేషత సంగమయుగములోని ఈశ్వరీయ పరివారంలో ఉంటుంది?

జవాబు:-

ఈ సమయంలో మాత్రమే స్వయంగా ఈశ్వరుడు తండ్రిగా అయి పిల్లలైన మిమ్మల్ని సంభాళిస్తారు, టీచర్ గా అయి చదివిస్తారు, సద్గురువుగా అయి మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేసి తమతో పాటు తీసుకువెళ్తారు. సత్యయుగంలో దైవీ పరివారముంటుందే కానీ ఇటువంటి ఈశ్వరీయ పరివారముండదు. పిల్లలైన మీరు ఇప్పుడు అనంతమైన సన్యాసులు కూడా, అలాగే రాజయోగులు కూడా. మీరు రాజ్యం కోసం చదువుకుంటున్నారు.

ఓంశాంతి

ఇది స్కూల్ లేక పాఠశాల. ఇది ఎవరి పాఠశాల? ఆత్మల పాఠశాల. తప్పకుండా ఆత్మ శరీరము లేకుండా ఏమీ వినలేదు. ఆత్మల పాఠశాల అని అన్నప్పుడు ఆత్మ శరీరము లేకుండా అర్థం చేసుకోలేదు అని తెలుసుకోవాలి. కావున జీవాత్మ అని అనవలసి ఉంటుంది. వాస్తవానికి అన్ని పాఠశాలలూ జీవాత్మల పాఠశాలలే, అందుకే దీనిని ఆత్మల పాఠశాల అని, పరమపిత పరమాత్మ వచ్చి చదివిస్తారని అనడం జరుగుతుంది. అది దైహికమైన చదువు, ఇది ఆత్మిక చదువు, దీనిని అనంతమైన తండ్రే చదివిస్తారు. కావున ఇది గాడ్ ఫాదర్ యొక్క యూనివర్శిటీ. ఇది భగవానువాచ కదా. ఇది భక్తి మార్గము కాదు, ఇది చదువు. స్కూల్లో చదువు ఉంటుంది. మందిరాలు మొదలైనవాటిలో భక్తి జరుగుతుంది. ఇందులో ఎవరు చదివిస్తారు? భగవానువాచ. ఇంకే పాఠశాలలోనూ భగవానువాచ ఉండనే ఉండదు. భగవానువాచ ఉన్న స్థానము ఇది ఒక్కటే. ఉన్నతోన్నతుడైన భగవంతుడినే జ్ఞానసాగరుడని అంటారు, వారే జ్ఞానాన్ని ఇవ్వగలరు. మిగిలినదంతా భక్తియే. భక్తి ద్వారా ఎవ్వరికీ సద్గతి లభించదని భక్తి గురించి తండ్రి అర్థం చేయించారు. సర్వుల సద్గతిదాత ఒక్క పరమాత్మయే, వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మ శరీరము ద్వారా వింటుంది. ఇంకే జ్ఞానంలోనూ భగవానువాచ అనేది లేదు. శివజయంతి కూడా జరుపుకోబడేది భారత్ లోనే. భగవంతుడైతే నిరాకారుడు, మరి శివ జయంతిని ఎలా జరుపుకుంటారు? ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తారో అప్పుడు జయంతి జరుగుతుంది. తండ్రి అంటున్నారు - నేనైతే ఎప్పుడూ గర్భంలోకి ప్రవేశించను. మీరందరూ గర్భంలోకి ప్రవేశిస్తారు, 84 జన్మలు తీసుకుంటారు. అందరికన్నా ఎక్కువ జన్మలు ఈ లక్ష్మీ-నారాయణులే తీసుకుంటారు. 84 జన్మలు తీసుకొని మళ్ళీ నల్లవానిగా, పల్లెటూరి బాలుడిగా అవుతారు. లక్ష్మీ-నారాయణులు అని అనండి లేక రాధ-కృష్ణులు అని అనండి. రాధ-కృష్ణులు బాల్యంలోని వారు. వారు జన్మ తీసుకున్నప్పుడు స్వర్గంలో తీసుకుంటారు, దానినే వైకుంఠము అని కూడా అంటారు. మొదటి నెంబర్ జన్మ ఇతనిదే, కావున 84 జన్మలను కూడా ఇతనే తీసుకుంటారు. శ్యామ్ మరియు సుందర్, సుందరమైనవారి నుండి శ్యామముగా అవుతారు. శ్రీకృష్ణుడు అందరికీ ప్రియమనిపిస్తారు. శ్రీకృష్ణుని జన్మ అయితే కొత్త ప్రపంచంలోనే జరుగుతుంది. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ వచ్చి పాత ప్రపంచంలోకి చేరుకున్నప్పుడు వారు శ్యామముగా అవుతారు. ఈ ఆటయే ఇలా ఉంది. భారత్ మొదట సతోప్రధానంగా, సుందరంగా ఉండేది, ఇప్పుడు నల్లగా అయిపోయింది. తండ్రి అంటున్నారు - ఇంతమంది ఆత్మలంతా నా పిల్లలే. ఇప్పుడు అందరూ కామచితిపై కూర్చొని కాలిపోయి నల్లగా అయిపోయారు. నేను వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తాను. ఈ సృష్టి చక్రమే ఇలా ఉంది. పూలతోట మళ్ళీ ముళ్ళ అడవిగా అయిపోతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలైన మీరు ఎంత సుందరంగా, విశ్వాధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు. వారు 84 జన్మలను అనుభవించి మళ్ళీ ఆ విధంగా అవుతున్నారు, అనగా వారి ఆత్మలు ఇప్పుడు చదువుకుంటున్నారు.

సత్యయుగంలో అపారమైన సుఖముండేదని, దాని వల్ల ఎప్పుడూ తండ్రిని స్మృతి చేయవలసిన అవసరం కూడా ఉండదని మీకు తెలుసు. దుఃఖములో అందరూ స్మరిస్తారు అన్న గాయనముంది, ఎవరిని స్మరిస్తారు? తండ్రిని. ఇంతమందిని స్మరించకూడదు. భక్తిలో ఎంతగా స్మరిస్తారు, కానీ వారికేమీ తెలియదు. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చారు, అసలు వారు ఎవరు అన్నది ఏమీ తెలియదు. శ్రీకృష్ణుడు మరియు శ్రీనారాయణుడి వ్యత్యాసం గురించి కూడా తెలియదు. శివబాబా ఉన్నతోన్నతమైనవారు. మళ్ళీ వారి కింద బ్రహ్మా, విష్ణు, శంకరులు... ఉన్నారు, వారిని మళ్ళీ దేవతలు అని పిలవడం జరుగుతుంది. మనుష్యులైతే అందరినీ భగవంతుడు అని అంటూ ఉంటారు, సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రి అంటారు - పంచ వికారాలైన మాయ సర్వవ్యాపి, అవి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. సత్యయుగంలో ఏ వికారాలూ ఉండవు. ముక్తిధామంలో కూడా ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. అక్కడ అపవిత్రత అనే విషయమేదీ ఉండదు. ఈ రచయిత అయిన తండ్రే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు, ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు, తద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు. మీరు ఒకేసారి ఆస్తికులుగా అవుతారు. మీ ఈ జీవితము దేవతల కన్నా ఉత్తమమైనది. మనుష్య జీవితం దుర్లభమైనది అన్న గాయనము కూడా ఉంది. ఎప్పుడైతే పురుషోత్తమ సంగమయుగము ఉంటుందో, అప్పుడు వజ్రతుల్యమైన జీవితం తయారవుతుంది. లక్ష్మీ-నారాయణులను వజ్రతుల్యమైనవారు అని అనరు. మీ జన్మ వజ్రతుల్యమైనది. మీరు ఈశ్వరీయ సంతానము, వారు దైవీ సంతానము. ఇక్కడ మీరు - మేము ఈశ్వరీయ సంతానము, ఈశ్వరుడు మా తండ్రి, వారు మమ్మల్ని చదివిస్తున్నారు అని అంటారు, ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు కదా, వారు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ జ్ఞానం ఒకేసారి పురుషోత్తమ సంగమయుగంలో లభిస్తుంది. ఇది ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగము, దీని గురించి ప్రపంచానికి తెలియదు. అందరూ కుంభకర్ణుడి అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారు. అందరి వినాశనము ఎదురుగా ఉంది, అందుకే ఇప్పుడు పిల్లలు ఎవ్వరితోనూ సంబంధాన్ని పెట్టుకోకూడదు. అంత్యకాలములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో... అని అంటారు. అంతిమ సమయంలో శివబాబాను స్మరించినట్లయితే నారాయణ యోనిలోకి వస్తారు. ఈ మెట్లు చాలా బాగున్నాయి. మనమే దేవతలము, మళ్ళీ మనమే క్షత్రియులు... మొదలైనవారిగా అవుతామని వ్రాయబడి ఉంది. ఈ సమయంలో ఇది రావణ రాజ్యము, ఇప్పుడు తమ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని మరిచి ఇతర ధర్మాలలో చిక్కుకొని ఉన్నారు. ఈ ప్రపంచమంతా లంకయే. అంతేకానీ బంగారు లంకంటూ ఏదీ లేదు. తండ్రి అంటారు, మీరు మీ కన్నా ఎక్కువగా నన్ను నింద చేసారు, మీ కొరకైతే 84 లక్షల జన్మలు అని అన్నారు కానీ నన్నైతే కణకణములో ఉన్నారని అనేసారు. అటువంటి అపకారులకు కూడా నేను ఉపకారము చేస్తాను. తండ్రి అంటారు, అందులో మీ దోషమేమీ లేదు, ఇది డ్రామా ఆట. సత్యయుగ ఆది నుండి మొదలుకుని కలియుగ అంతిమం వరకూ ఇది ఒక ఆట, ఇది తిరగవలసిందే. దీని గురించి తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మీరందరూ బ్రహ్మాకుమార-కుమారీలు. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. మీరు ఈశ్వరీయ పరివారంలో కూర్చున్నారు. సత్యయుగంలో దైవీ పరవారముంటుంది. ఈ ఈశ్వరీయ పరివారంలో తండ్రి మిమ్మల్ని సంభాళిస్తారు కూడా, చదివిస్తారు కూడా, మళ్ళీ పుష్పాలుగా తయారుచేసి తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అని గ్రంథ్ లో కూడా ఉంది. అందుకే పరమాత్మను ఇంద్రజాలికుడు అని అంటారు. నరకాన్ని స్వర్గముగా చేయడమనేది ఇంద్రజాలమే కదా. స్వర్గం నుండి నరకంగా అవ్వడానికి 84 జన్మలు పడుతుంది, మళ్ళీ నరకం నుండి స్వర్గంగా ఒక్క చిటికెలో అవుతుంది. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. నేను ఆత్మను, ఆత్మనూ తెలుసుకున్నారు, తండ్రిని కూడా తెలుసుకున్నారు. ఆత్మంటే ఏమిటి అనేది మానవమాత్రులెవ్వరికీ తెలియదు. గురువులు అనేకులు ఉన్నారు, సద్గురువు ఒక్కరే. సద్గురు అకాలమూర్తి అని అంటారు. పరమపిత పరమాత్మ ఒక్కరే సద్గురువు. కానీ గురువులైతే లెక్కలేనంతమంది ఉన్నారు. నిర్వికారులైతే ఎవ్వరూ లేరు. అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు.

ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోంది. మీరందరూ ఇక్కడ రాజ్యం కొరకు చదువుకుంటారు. మీరు రాజయోగులు, అనంతమైన సన్యాసులు. ఆ హఠయోగులు హద్దులోని సన్యాసులు. తండ్రి వచ్చి అందరికీ సద్గతినిచ్చి సుఖవంతులుగా తయారుచేస్తారు. నన్నొక్కరినే సద్గురు అకాలమూర్తి అని అంటారు. అక్కడ మనం ఘడియ-ఘడియ శరీరాన్ని వదలడము, తీసుకోవడమూ చేయము. అక్కడ మృత్యువు కబళించదు. మీ ఆత్మ కూడా అవినాశీయే, కానీ పతితముగా మరియు పావనముగా అవుతుంది. ఆత్మ నిర్లేపి కాదు. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రే అర్థం చేయిస్తారు. రచయితయే రచన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు కదా. జ్ఞానసాగరుడు ఆ ఒక్క తండ్రే. వారే మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా, ద్వికిరీటధారులుగా తయారుచేస్తారు. మీ జన్మ గవ్వతుల్యంగా ఉండేది. ఇప్పుడు మీరు వజ్రతుల్యంగా అవుతున్నారు. తండ్రి హంసో సోహం యొక్క మంత్రాన్ని కూడా అర్థం చేయించారు. వాళ్ళేమో - ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ, హంసో సోహం అని అంటారు. తండ్రి అంటారు, ఆత్మయే పరమాత్మగా ఎలా అవ్వగలదు! తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు - ఆత్మ అయిన మనం ఈ సమయంలో బ్రాహ్మణులుగా ఉన్నాము, మళ్ళీ ఆత్మ అయిన మనమే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము, మళ్ళీ క్షత్రియులుగా అవుతాము, మళ్ళీ శూద్రులుగా అయి ఆ తర్వాత బ్రాహ్మణులుగా అవుతాము. అన్నింటికన్నా ఉన్నతమైన జన్మ మీదే. ఇది ఈశ్వరీయ ఇల్లు. మీరు ఎవరి వద్ద కూర్చున్నారు? మాతాపితల వద్ద. అందరూ సోదరీ-సోదరులు. తండ్రి ఆత్మలకు శిక్షణను ఇస్తారు. మీరందరూ నా పిల్లలు, వారసత్వానికి హక్కుదారులు, అందుకే పరమాత్మ అయిన తండ్రి నుండి ప్రతి ఒక్కరూ వారసత్వాన్ని తీసుకోవచ్చు. వృద్ధులు, చిన్నవారు, పెద్దవారు అందరికీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది. కావున పిల్లలకు కూడా ఇదే అర్థం చేయించండి - స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి, తద్వారా పాపాలు అంతమవుతాయి అని. భక్తి మార్గం వారు ఈ విషయాలను ఏమాత్రం అర్థం చేసుకోరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్:-

పిల్లలు తండ్రిని గుర్తించారు కూడా, ఆ తండ్రి చదివిస్తున్నారని అర్థం చేసుకున్నారు కూడా, వారి ద్వారా అనంతమైన వారసత్వం లభించనున్నది. కానీ కష్టమైన విషయమేమిటంటే మాయ మరిపింపజేస్తుంది. ఏదో ఒక విఘ్నాన్ని కలిగిస్తుంది, దాని వల్ల పిల్లలు భయపడిపోతారు. అందులో కూడా మొదటి నంబరులో వికారాలలో పడిపోతారు. కళ్ళు మోసగిస్తాయి. ఇక్కడ కళ్ళు తీసేసే విషయమేమీ కాదు. తండ్రి జ్ఞాన నేత్రాన్ని ఇస్తారు, జ్ఞానం మరియు అజ్ఞానం యొక్క యుద్ధం నడుస్తుంది. జ్ఞానము తండ్రి. అజ్ఞానము మాయ. వీరి యుద్ధము చాలా తీక్షణమైనది. పడిపోయినప్పుడు వారికి అర్థం కాదు. ఆ తర్వాత - నేను పడిపోయానే, నేను ఎంతగానో నా అకళ్యాణమును చేసుకున్నాను అని భావిస్తారు. మాయ ఒక్కసారి ఓడిస్తే ఇక మళ్ళీ ఎక్కడం కష్టమైపోతుంది. చాలామంది పిల్లలు - మేము ధ్యానంలోకి వెళ్తాము అని అంటారు. కానీ అందులో కూడా మాయ ప్రవేశిస్తుంది. అది తెలియను కూడా తెలియదు. మాయ దొంగతనం చేయిస్తుంది, అబద్ధాలు చెప్పిస్తుంది. మాయ ఏమి చేయించదని? అసలు చెప్పడానికి వీలు లేదు. అశుద్ధంగా చేసేస్తుంది. పుష్పాలుగా అవుతూ-అవుతూ మళ్ళీ ఛీ-ఛీగా అయిపోతారు. మాయ ఎంత శక్తివంతమైనదంటే అది ఘడియ-ఘడియ కింద పడేస్తూ ఉంటుంది.

పిల్లలు అంటారు - బాబా, మేము ఘడియ-ఘడియ మర్చిపోతున్నాము. పురుషార్థం చేయించేవారైతే ఒక్క తండ్రే, కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే పురుషార్థం కూడా చేయలేరు. ఇక్కడ ఎవరికీ విశేష పాలన కూడా జరగదు, అలాగే ఎక్స్ ట్రా చదివించరు కూడా. ఆ చదువులోనైతే ఎక్స్ ట్రా చదువుకునేందుకు టీచరును పిలుస్తారు. ఇక్కడైతే భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు అందరినీ ఏకరసంగా చదివిస్తారు. ఒకొక్కరికీ వేరువేరుగా ఎంతవరకని చదివిస్తారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు! ఆ చదువులో ఎవరైనా గొప్ప వ్యక్తుల పిల్లలుంటే, ఎక్కువ ఖర్చు ఇవ్వగలిగితే వారికి ఎక్స్ ట్రాగా కూడా చదివిస్తారు. ఇతను డల్ గా ఉన్నాడు అని టీచరుకు తెలుసు, అందుకే బాగా చదివించి అతడిని స్కాలర్షిప్ కు అర్హునిగా తయారుచేస్తారు. కానీ తండ్రి అలా చెయ్యరు. వీరైతే అందరికీ ఒకే విధంగా చదివిస్తారు. అక్కడ అది టీచర్ ఎక్స్ ట్రా పురుషార్థాన్ని చేయించడము. ఇక్కడ వీరు ఎవరి చేతా వేరుగా ఎక్స్ ట్రా పురుషార్థాన్ని చేయించరు. ఎక్స్ ట్రా పురుషార్థాన్ని చేయించడమంటేనే టీచర్ కొంత కృపను చూపించటము, అయితే అక్కడ వారు దానికోసం డబ్బు తీసుకుంటారు. విశేషముగా సమయమిచ్చి చదివిస్తారు, దాని ద్వారా వారు ఎక్కువగా చదువుకొని చురుకైనవారిగా అవుతారు. ఇక్కడైతే ఎక్కువగా చదువుకునే విషయమేమీ లేదు. వీరి విషయము ఒక్కటే - మన్మనాభవ అన్న ఒక్క మహామంత్రమునే ఇస్తారు. స్మృతి ద్వారా ఏం జరుగుతుంది అన్నది పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రే పతిత-పావనుడు, వారిని స్మృతి చేయడం ద్వారానే మనం పావనంగా అవుతామని మీకు తెలుసు. అచ్ఛా - గుడ్ నైట్.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు శ్మశానవాటికగా మారనున్నది, వినాశనము ముందు నిలిచి ఉంది, అందుకే ఎవ్వరితోనూ సంబంధాన్ని పెట్టుకోకూడదు, అంత్యకాలములో ఒక్క తండ్రే గుర్తు ఉండాలి.

2. శ్యామము నుండి సుందరముగా, పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషోత్తమ సంగమయుగము ఇది, ఇదే ఉత్తమ పురుషులుగా అయ్యే సమయము, సదా ఇదే స్మృతిలో ఉంటూ స్వయాన్ని గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారుచేసుకోవాలి.

వరదానము:-

జ్ఞాన ధనము ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలను ప్రాప్తి చేసుకొనే పదమాపదమపతి భవ

జ్ఞాన ధనము స్థూల ధనము యొక్క ప్రాప్తిని స్వతహాగానే చేయిస్తుంది. ఎక్కడైతే జ్ఞాన ధనము ఉంటుందో, అక్కడ ప్రకృతి స్వతహాగానే దాసిగా అయిపోతుంది. జ్ఞాన ధనము ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి, అందుకే జ్ఞాన ధనము అన్ని ధనాలకు రాజు వంటిది. ఎక్కడైతే రాజు ఉంటారో, అక్కడ సర్వ పదార్థాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. ఈ జ్ఞాన ధనమే పదమాపదమపతులుగా తయారుచేస్తుంది, పరమార్థాన్ని మరియు వ్యవహారాన్ని స్వతహాగానే సిద్ధింపజేస్తుంది. జ్ఞాన ధనములో ఎంతటి శక్తి ఉందంటే, అది అనేక జన్మల కొరకు రాజులకే రాజుగా తయారుచేస్తుంది.

స్లోగన్:-

‘‘నేను కల్పకల్పపు విజయీని’’ - ఈ ఆత్మిక నషా ఇమర్జ్ అయి ఉన్నట్లయితే మాయాజీతులుగా అయిపోతారు.