01-05-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అనంతమైన తండ్రి మనకు తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు సద్గురువు కూడా, వారు సర్వవ్యాపి కారు అన్నది మీరు నిరూపించి చెప్పండి’’

ప్రశ్న:-

ఈ సమయంలో ప్రపంచంలో అత్యంత దుఃఖము ఎందుకు ఉంది, దుఃఖానికి కారణము వినిపించండి?

జవాబు:-

మొత్తం ప్రపంచమంతటి పైనా ఈ సమయంలో రాహు దశ ఉంది, దీని కారణంగానే దుఃఖము ఉంది. వృక్షపతి అయిన తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు అందరి పైనా బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్య-త్రేతాయుగాలలో బృహస్పతి దశ ఉంటుంది, రావణుడి నామ-రూపాలు ఉండవు అందుకే అక్కడ దుఃఖము ఉండదు. సుఖధామాన్ని స్థాపన చేయడానికి తండ్రి వచ్చారు, అక్కడ దుఃఖము ఉండదు.

ఓంశాంతి

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఎందుకంటే పిల్లలందరికీ - మనం ఆత్మలము అని, మన ఇంటి నుండి మనం ఎంతో దూరం నుండి ఇక్కడికి వస్తామని తెలుసు. ఇక్కడికి వచ్చి పాత్రను అభినయించేందుకు ఈ శరీరములోకి ప్రవేశిస్తాము. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఇక్కడ కూర్చుని ఉన్నారు ఎందుకంటే స్మృతి ద్వారా పిల్లలైన మీ జన్మజన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి అని తండ్రి అర్థం చేయించారు. దీనిని యోగము అని కూడా అనకూడదు. యోగమునైతే సన్యాసులు నేర్పిస్తారు. విద్యార్థులకు టీచర్ తో కూడా యోగము ఉంటుంది, పిల్లలకు తండ్రితో యోగము ఉంటుంది. ఇదేమో ఆత్మలు మరియు పరమాత్ముని యొక్క మేళా అనగా పిల్లలు మరియు తండ్రి యొక్క మేళా. ఇది కళ్యాణకారీ మిలనము. మిగిలినవన్నీ అకళ్యాణకారి అయినవే. ఇది పతిత ప్రపంచము కదా. మీరెప్పుడైతే ప్రదర్శని లేక మ్యూజియంలో అర్థం చేయిస్తారో, అప్పుడు ఆత్మ మరియు పరమాత్మల పరిచయాన్ని ఇవ్వడం కరెక్ట్. ఆత్మలందరూ పిల్లలు మరియు వారు పరమపిత పరమ ఆత్మ, వారు పరంధామంలో నివసిస్తారు. పిల్లలు ఎవ్వరూ కూడా తమ లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. పరమపితను - ఓ పరమపిత పరమాత్మా అని దుఃఖములోనే తలచుకుంటారు. పరమ ఆత్మ పరంధామంలో నివసిస్తారు. ఇప్పుడు మీరు ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానాన్ని అర్థం చేయించినప్పుడు కేవలం ఇద్దరు తండ్రులు ఉన్నారని మాత్రమే అర్థం చేయించకూడదు. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా అన్నది తప్పకుండా అర్థం చేయించాలి. మనమందరమూ సోదరులము, వారు ఆత్మలందరికీ తండ్రి. భక్తిమార్గంలో అందరూ భగవంతుడైన తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే భగవంతుడి నుండి భక్తి ఫలం లభిస్తుంది అనగా తండ్రి నుండి పిల్లలు వారసత్వాన్ని తీసుకుంటారు. భగవంతుడు భక్తి ఫలాన్ని పిల్లలకు ఇస్తారు. ఏమిస్తారు? విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. కానీ వారు తండ్రి అని మాత్రమే మీరు నిరూపించకూడదు. వారు తండ్రి కూడా, అలాగే శిక్షణను ఇచ్చేవారు కూడా, సద్గురువు కూడా. ఈ విధంగా అర్థం చేయించినట్లయితే సర్వవ్యాపి అన్న ఆలోచన దూరమైపోతుంది. ఈ విషయాన్ని కలపండి. ఆ తండ్రి జ్ఞానసాగరుడు. వారు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ విధంగా అడగండి - వారు శిక్షణను ఇచ్చే టీచర్ కూడా, మరి వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? ఏ విధంగా తండ్రి వేరు మరియు పిల్లలు వేరూ, అదే విధంగా తప్పకుండా టీచర్ వేరు, విద్యార్థులు వేరు. ఆత్మలు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేస్తారు, వారి మహిమను కూడా చేస్తారు. తండ్రే మనుష్య సృష్టికి బీజరూపుడు. వారు వచ్చి మనకు మనుష్య సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి స్వర్గ స్థాపనను చేస్తారు, మనం స్వర్గవాసులుగా అవుతాము. అలాగే ఇద్దరు తండ్రులు ఉన్నారు అని కూడా అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి పాలన చేస్తారు, ఆ తర్వాత చదువుకునేందుకు టీచర్ వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థావస్థలోకి వెళ్ళేందుకు గురువులను ఆశ్రయించాల్సి ఉంటుంది. తండ్రి, టీచర్, గురువు వేర్వేరుగా ఉంటారు. ఈ అనంతమైన తండ్రి ఆత్మలందరికీ తండ్రి, జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్-చిత్-ఆనంద స్వరూపుడు, సుఖసాగరుడు, శాంతిసాగరుడు. వారి మహిమను చేయడం మొదలుపెట్టండి ఎందుకంటే ప్రపంచంలో మతకలహాలు ఎన్నో ఉన్నాయి కదా. వారు సర్వవ్యాపి అయినట్లయితే మళ్ళీ టీచర్ గా అయి ఎలా చదివిస్తారు! వారు సద్గురువు కూడా, మార్గదర్శకునిగా అయి అందరినీ తీసుకువెళ్తారు. వారు శిక్షణను ఇస్తారు, అనగా స్మృతి చేయడం నేర్పిస్తారు. భారత్ యొక్క ప్రాచీన రాజయోగము కూడా మహిమ చేయబడింది. అతి పురాతనమైనది సంగమయుగము. ఇది కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము మధ్యలో ఉంది. నేటికి 5,000 సంవత్సరాల క్రితం తండ్రి వచ్చి తమవారిగా చేసుకున్నారు మరియు మనకు టీచర్ గా, సద్గురువుగా కూడా అయ్యారని మీరు అర్థమవుతుంది. వారు కేవలం మనకు తండ్రి కారు, వారు జ్ఞానసాగరుడు అనగా టీచర్ కూడా, వారు మనకు శిక్షణను ఇస్తారు. వారు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఎందుకంటే వారు బీజరూపుడు, వృక్షపతి. వారు ఎప్పుడైతే భారత్ లోకి వస్తారో, అప్పుడు భారత్ పై బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్యయుగములో అందరూ సదా సుఖమయమైన దేవీ-దేవతలుగా ఉంటారు. అందరిపైనా బృహస్పతి దశ కూర్చుంటుంది. మళ్ళీ ఎప్పుడైతే ప్రపంచం తమోప్రధానంగా అవుతుందో, అప్పుడు అందరిపైనా రాహు దశ కూర్చుంటుంది. వృక్షపతి గురించి ఎవ్వరికీ తెలియదు. వారి గురించి తెలియకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది.

మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అశరీరులుగా అయి కూర్చోండి. ఆత్మ వేరు, ఇల్లు వేరు అన్న జ్ఞానమైతే లభించింది. 5 తత్వాలతో కూడిన బొమ్మ (శరీరం) తయారవుతుంది, అందులోకి ఆత్మ ప్రవేశిస్తుంది. అందరి పాత్ర నిశ్చయించబడి ఉంది. తండ్రి ఉన్నతోన్నతుడైన తండ్రి, ఉన్నతోన్నతుడైన టీచర్ అని ఈ ముఖ్యమైన విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి. లౌకిక తండ్రి, టీచర్, గురువుల మధ్యన వ్యత్యాసాన్ని వివరించడం ద్వారా వెంటనే అర్థం చేసుకుంటారు, వాదించరు. ఆత్మిక తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇదే విశేషత. వారే మనకు రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఋషులు, మునులు మొదలైనవారు - మాకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అని చెప్పేవారు ఎందుకంటే ఆ సమయంలో వారు సతోగా ఉండేవారు. ప్రతి వస్తువూ సతోప్రధానము, సతో, రజో, తమోలలోకి తప్పకుండా వస్తుంది. కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. మీకు ఈ సృష్టిచక్రము యొక్క ఆయువు గురించి కూడా తెలుసు. దీని ఆయువు ఎంత అనేది మనుష్యులు మర్చిపోయారు. ఇకపోతే ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కొరకు తయారుచేస్తారు. ఎన్నో ప్రగల్భాలు వ్రాసేసారు. అందరికీ తండ్రి అయితే ఒక్కరే. సద్గతిదాత ఒక్కరే. గురువులు అనేకం ఉన్నారు. సద్గతిని ఇచ్చే సద్గురువు ఒక్కరే ఉంటారు. సద్గతి ఎలా లభిస్తుంది అన్నది కూడా మీ బుద్ధిలో ఉంది. ఆదిసనాతన దేవీ-దేవతా ధర్మాన్నే సద్గతి అని అంటారు. అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుష్యులు ఉన్నారు. అక్కడ కేవలం దేవతల రాజ్యమే ఉంటుంది, ఆ తర్వాత వారి వంశము వృద్ధి చెందుతుంది. లక్ష్మీనారాయణ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే లక్ష్మీనారాయణ ది ఫస్ట్ ఉంటారో, అప్పుడు ఎంత కొద్దిమంది మనుష్యులు ఉంటారు. ఈ ఆలోచనలు కూడా కేవలం మీకే నడుస్తాయి. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు - ఆత్మలైన మీ అందరికీ తండ్రి, భగవంతుడు ఒక్కరే. వారు అనంతమైన తండ్రి. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము - 21 తరాల స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. 21 తరాలు అనగా ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుందో, అప్పుడు శరీరాన్ని వదులుతారు. అక్కడ నేను ఒక ఆత్మను అన్నది తెలుసు. ఇక్కడ దేహాభిమానులుగా ఉన్న కారణంగా ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుందని తెలుసుకోరు. ఇప్పుడు దేహాభిమానులను ఆత్మాభిమానులుగా ఎవరు తయారుచేయాలి? ఈ సమయంలో ఆత్మాభిమానులు ఒక్కరు కూడా లేరు. తండ్రే వచ్చి ఆత్మాభిమానులుగా తయారుచేస్తారు. అక్కడ - ఆత్మ ఒక పెద్ద శరీరాన్ని వదిలి చిన్నపిల్లవానిగా అవుతుందని తెలుసు. సర్పం ఉదాహరణ కూడా ఉంది. ఈ సర్వము, భ్రమరము మొదలైన ఉదాహరణలన్నీ ఇక్కడికి చెందినవి మరియు ఈ సమయానికి చెందినవే. ఇవి మళ్ళీ భక్తిమార్గంలో కూడా ఉపయోగపడతాయి. వాస్తవానికి బ్రాహ్మణీలు మీరు, మీరే పేడ పురుగులను భూ-భూ చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. తండ్రిలో జ్ఞానం ఉంది కదా. వారే జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు. అందరూ శాంతిని కోరుకుంటూ ఉంటారు. శాంతిదేవా... అని ఎవరిని పిలుస్తారు? శాంతి దాత అనగా శాంతిసాగరుడు ఎవరైతే ఉన్నారో, వారి మహిమను కూడా పాడుతారు కానీ అర్థం తెలియకుండా పాడుతారు. అలా అనేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు - ఈ వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవి. 63 జన్మలు భక్తి చేయాల్సిందే. ఎన్ని లెక్కలేనన్ని శాస్త్రాలు ఉన్నాయి. నేనేమీ శాస్త్రాలను చదవడం ద్వారా లభించను. నన్ను పిలుస్తారు కూడా - మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. ఇది తమోప్రధానమైన చెత్త ప్రపంచము, ఇది దేనికీ ఉపయోగపడదు. ఎంత దుఃఖము ఉంది. ఈ దుఃఖము ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి అయితే మీకు ఎంతో సుఖాన్ని ఇచ్చారు, మళ్ళీ మీరు మెట్లు ఎలా దిగారు? జ్ఞానం మరియు భక్తి అన్న గాయనము కూడా ఉంది. జ్ఞానాన్ని తండ్రి వినిపిస్తారు, భక్తిని రావణుడు నేర్పిస్తాడు. కానీ చూడడానికైతే తండ్రీ కనిపించరు, అలాగే రావణుడూ కనిపించడు. ఇరువురినీ ఈ కనుల ద్వారా చూడలేరు. ఆత్మను అర్థం చేసుకోవడం జరుగుతుంది. నేను ఆత్మను కావున ఆత్మకు తండ్రి కూడా తప్పకుండా ఉన్నారు. తండ్రే మళ్ళీ టీచర్ గా కూడా అవుతారు, ఇంకెవ్వరూ ఈ విధంగా అవ్వనే అవ్వరు.

ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు సద్గతిని పొందుతారు, ఇక మళ్ళీ గురువుల అవసరమే ఉండదు. తండ్రి అందరికీ తండ్రి కూడా, అలాగే చదివించేటువంటి శిక్షకుడు కూడా. సర్వులకు సద్గతిని ఇచ్చే సద్గురువు, ఉన్నతోన్నతమైన గురువు కూడా. ముగ్గురినీ సర్వవ్యాపి అనైతే అనలేరు. వారు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తారు. మనుష్యులు ఈ విధంగా తలచుకుంటారు కూడా - ఓ పతిత పావనా, సర్వుల సద్గతిదాతా రండి, అందరి దుఃఖాలను హరించండి, సుఖాన్ని ఇవ్వండి. ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్. అలాగే మమ్మల్ని తీసుకువెళ్ళేందుకు మాకు మార్గదర్శకునిగా కూడా అవ్వండి. ఈ రావణరాజ్యం నుండి విముక్తులుగా చేయండి అని. రావణరాజ్యం లంకలో ఏమీ లేదు. ఈ భూమి అంతా ఏదైతే ఉందో, అక్కడ ఈ సమయంలో రావణరాజ్యం ఉంది. రామరాజ్యం కేవలం సత్యయుగంలోనే ఉంటుంది. భక్తి మార్గంలో మనుష్యులు ఎంతగా తికమక పడిపోయారు.

ఇప్పుడు మీకు శ్రేష్ఠంగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తుంది. సత్యయుగములో భారత్ శ్రేష్ఠాచారిగా ఉండేది, పూజ్యులు ఉండేవారు. ఇప్పటివరకూ కూడా వారిని పూజిస్తూ ఉంటారు. భారత్ పై బృహస్పతి దశ ఉన్నప్పుడు సత్యయుగము ఉండేది. ఇప్పుడు రాహు దశలో భారత్ యొక్క పరిస్థితి ఏమైపోయిందో చూడండి. అందరూ అధర్మయుక్తంగా అయిపోయారు. తండ్రి ధర్మయుక్తంగా తయారుచేస్తారు, రావణుడు అధర్మయుక్తంగా తయారుచేస్తాడు. రామరాజ్యం కావాలి అని కూడా అంటారు. అంటే రావణ రాజ్యంలో ఉన్నారు, నరకవాసులుగా ఉన్నారనే కదా. రావణరాజ్యాన్ని నరకము అని అంటారు. స్వర్గము మరియు నరకము రెండూ సగం-సగం ఉంటాయి. రామరాజ్యం అని దేనినంటారు మరియు రావణరాజ్యం అని దేనినంటారు అనేది కూడా పిల్లలైన మీకే తెలుసు. కావున మొట్టమొదట ఈ విషయంలో నిశ్చయబుద్ధి కలవారిగా చేయాలి. వారు మన తండ్రి, ఆత్మలైన మనమందరమూ సోదరులము. తండ్రి నుండి అందరికీ వారసత్వము లభించే హక్కు ఉంది. అది ఒకప్పుడు లభించింది కూడా. తండ్రి రాజయోగాన్ని నేర్పించి సుఖధామానికి యజమానులుగా తయారుచేసారు. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్ళిపోయారు. పిల్లలకు తెలుసు - వృక్షపతి చైతన్యమైనవారు. వారు సత్-చిత్ ఆనంద స్వరూపుడు. ఆత్మ సత్యమైనది కూడా, చైతన్యమైనది కూడా. తండ్రి కూడా సత్యమైనవారు, చైతన్యమైనవారు, వృక్షపతి. ఇది తలక్రిందుల వృక్షము కదా. దీని బీజము పైన ఉంది. తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు - ఎప్పుడైతే మీరు తమోప్రధానంగా అయిపోతారో, అప్పుడు తండ్రి సతోప్రధానంగా చేయడానికి వస్తారు. చరిత్ర-భౌగోళికము రిపీట్ అవుతాయి. ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది - హిస్టరీ-జాగ్రఫీ... అన్న ఇంగ్లీషు పదాలను ఉపయోగించకండి. హిందీలో చరిత్ర-భౌగోళికము అని అంటారు. ఇంగ్లీష్ అయితే అందరూ ఎలాగూ చదువుతారు. భగవంతుడు గీతను సంస్కృతములో వినిపించారు అని భావిస్తారు. శ్రీకృష్ణుడు సత్య యుగ రాకుమారుడు. అక్కడ ఈ భాష ఉండేది. ఈ విధంగా ఎక్కడా వ్రాయబడి లేదు. భాష అయితే తప్పకుండా ఉంది. రాజులు ఎవరెవరైతే ఉంటారో, వారికి తమ తమ భాషలు ఉంటాయి. సత్యయుగ రాజుల భాష వేరుగా ఉంటుంది. అక్కడ సంస్కృతము లేదు. సత్యయుగం యొక్క ఆచార-వ్యవహారాలే వేరు. కలియుగీ మనుష్యుల ఆచార-వ్యవహారాలు వేరు. మీరందరూ మీరలు, మీరు కలియుగ గౌరవ-ప్రతిష్టలను, కుల మర్యాదలను ఇష్టపడరు. మీరు కలియుగ గౌరవ-ప్రతిష్టలను వదలడం వలన ఎన్ని గొడవలు జరుగుతాయి. మీకు తండ్రి శ్రీమతాన్ని ఇచ్చారు - కామం మహాశత్రువు, దీనిపై విజయాన్ని పొందండి. జగజ్జీతులుగా అయ్యేవారి ఈ చిత్రము కూడా మీ ఎదురుగా ఉంది. విశ్వంలో శాంతిస్థాపన ఎలా జరుగుతుంది అని అనంతమైన తండ్రి నుండి మీకు సలహా లభిస్తుంది. ‘శాంతిదేవా’ అని అనడంతో తండ్రే గుర్తుకొస్తారు. తండ్రే వచ్చి కల్పకల్పమూ విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారు. కల్పపు ఆయువును ఎక్కువగా చూపించడం వలన మనుష్యులు కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు.

వారు మన తండ్రి కూడా, అలాగే టీచర్ కూడా అని మొట్టమొదట మనుష్యులకు ఇది పక్కా నిశ్చయం చేయించండి. టీచర్ ను సర్వవ్యాపి అని ఎలా అంటారు? తండ్రి ఏ విధంగా వచ్చి మనల్ని చదివిస్తారు అనేది పిల్లలైన మీకు తెలుసు. మీకు వారి చరిత్ర గురించి తెలుసు. నరకాన్ని స్వర్గంగా తయారుచేసేందుకే తండ్రి వస్తారు. వారు టీచర్ కూడా, అలాగే తమతో పాటు తీసుకువెళ్తారు కూడా. ఆత్మలైతే అవినాశీ. వారు తమ పూర్తి పాత్రను అభినయించి ఇంటికి వెళ్తారు. ఇంటికి తీసుకువెళ్ళే మార్గదర్శకుడు కూడా కావాలి కదా. వారు దుఃఖాల నుండి విముక్తులుగా చేస్తారు. మళ్ళీ మార్గదర్శకునిగా అయి అందరినీ తీసుకువెళ్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కలియుగీ గౌరవ-ప్రతిష్టలు, కుల మర్యాదలను వదిలి ఈశ్వరీయ కులం యొక్క మర్యాదలను ధారణ చేయాలి. అశరీరి అయిన తండ్రి ఏదైతే వినిపిస్తారో, దానిని అశరీరిగా అయి వినే అభ్యాసాన్ని పక్కా చేసుకోవాలి.

2. అనంతమైన తండ్రి, తండ్రి కూడా, టీచర్ కూడా, అలాగే సద్గురువు కూడా, ఈ వ్యత్యాసాన్ని అందరికీ అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి సర్వవ్యాపి కారు అన్నది నిరూపించాలి.

వరదానము:-

హద్దు యొక్క బాల్యపు చేష్టల నుండి బయటపడి ఆత్మిక గర్వములో ఉండే ప్రీతి బుద్ధి భవ

కొంతమంది పిల్లలు హద్దులోని స్వభావ-సంస్కారాలతో కూడిన బాల్యపు చేష్టలను చాలా చేస్తుంటారు. ఎక్కడైతే - నా స్వభావము, నా సంస్కారము అన్న మాట వస్తుందో, అక్కడ ఇటువంటి బాల్యపు చేష్టలు మొదలవుతాయి. ఈ ‘నాది’ అన్న పదమే చక్రంలోకి తీసుకువస్తుంది. కానీ ఏదైతే తండ్రి నుండి వేరుగా ఉంటుందో, అది నాది కానే కాదు. నా స్వభావము తండ్రి స్వభావము నుండి వేరు కానే కాదు, అందుకే హద్దులోని బాల్యపు చేష్టల నుండి బయటపడి ఆత్మిక గర్వంలో ఉండండి. ప్రీతిబుద్ధి కలవారిగా అయి ప్రేమతోకూడిన ప్రియమైన చేష్టలను కావాలనుకుంటే చెయ్యండి.

స్లోగన్:-

తండ్రి పట్ల, సేవ పట్ల మరియు పరివారం పట్ల ప్రేమ ఉన్నట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు.