02-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఉన్నత పదవిని పొందేందుకు తండ్రి మీకేదైతే చదివిస్తారో, దానిని అచ్చంగా అదే విధంగా ధారణ చేయండి, సదా శ్రీమతముపై నడుస్తూ ఉండండి

ప్రశ్న:-

ఎప్పుడూ దుఃఖము కలగకుండా ఉండేందుకు ఏ విషయము గురించి మంచి రీతిలో ఆలోచించాలి?

జవాబు:-

ప్రతి ఆత్మ ఏ పాత్రనైతే అభినయిస్తున్నారో, అది డ్రామాలో ఏక్యురేట్ గా నిశ్చయించబడి ఉంది. ఇది అనాది మరియు అవినాశీ డ్రామా. ఈ విషయం గురించి ఆలోచించినట్లయితే ఎప్పుడూ దుఃఖం కలగదు. ఎవరైతే డ్రామా ఆదిమధ్యాంతాలను రియలైజ్ అవ్వరో, వారికే దుఃఖం కలుగుతుంది. పిల్లలైన మీరు ఈ డ్రామాను ఉన్నది ఉన్నట్లుగా సాక్షీగా అయి చూడాలి, ఇందులో ఏడ్వాల్సిన లేక అలగాల్సిన విషయమేదీ లేదు.

ఓంశాంతి

ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు ఆత్మ ఎంత చిన్ననిదో అర్థం చేయిస్తున్నారు. అది చాలా చిన్ననిది మరియు చిన్నని ఆత్మతో పోల్చి చూస్తే శరీరం ఎంత పెద్దగా కనిపిస్తుంది. చిన్నని ఆత్మ వేరైపోతే ఇక ఏమీ చూడలేరు. ఆత్మ గురించే ఆలోచించడం జరుగుతుంది. ఇంత చిన్నని బిందువు ఏమేమి పనులు చేస్తుందో చూడండి. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ (భూతద్దము) ఉంటుంది, దాని ద్వారా చిన్న-చిన్న వజ్రాలపై ఏ మచ్చలూ లేవు కదా అని చూడడం జరుగుతుంది. మరి ఆత్మ కూడా ఎంత చిన్ననిది. ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆత్మకు ఏం కనెక్షన్ ఉంది అని చూడడానికి ఎటువంటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది? ఈ కనులతో భూమి, ఆకాశం ఎంత పెద్దగా కనిపిస్తాయి! ఆ బిందువు వెళ్ళిపోతే ఇక ఏమీ ఉండదు. ఏ విధముగా బిందువైన తండ్రి ఉన్నారో, అదే విధంగా బిందువైన ఆత్మ ఉంది. ఇంత చిన్నని ఆత్మయే పవిత్రముగా మరియు అపవిత్రముగా అవుతుంది. ఇవి చాలా ఆలోచించవలసిన విషయాలు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు అన్నది ఇంకెవ్వరికీ తెలియదు. ఇంత చిన్నని ఆత్మ శరీరములో ఉంటూ ఏమేమి చేస్తుందో మరియు ఏమేమి చూస్తుందో చూడండి. ఆ ఆత్మలో మొత్తం 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ ఎలా పని చేస్తుంది అనేది అద్భుతము. ఇంత చిన్నని బిందువులో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది, అది ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం మరణిస్తుంది. శరీరం ఎంత పెద్దది మరియు ఆత్మ ఎంత చిన్నది. ఈ సృష్టి చక్రము ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత తిరుగుతుంది అన్న విషయము మనుష్యులకు ఏ విధంగా తెలుస్తుంది అనేది తండ్రి ఎన్నో సార్లు అర్థం చేయించారు. ఫలానావారు మరణించారు, అది కొత్త విషయమేమీ కాదు. అతని ఆత్మ ఆ శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంది. 5,000 సంవత్సరాల క్రితం కూడా ఈ నామ-రూపాలను ఇదే సమయంలో వదిలారు. తాను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకదానిలో ప్రవేశిస్తుంది అని ఆత్మకు తెలుసు.

ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటారు. 5,000 సంవత్సరాల క్రితం కూడా శివ జయంతిని జరుపుకున్నారు అన్నది చూపిస్తారు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వజ్రతుల్యమైన శివజయంతిని జరుపుకుంటూనే వస్తారు. ఇవి యథార్థమైన విషయాలు. ఇతరులకు అర్థం చేయించగలిగేందుకు విచార సాగర మంథనము చేయవలసి ఉంటుంది. పండుగలు జరుగుతాయి, మీరు అంటారు - ఇది కొత్త విషయమేమీ కాదు, చరిత్ర పునరావృతమవుతుంది, మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత పాత్రధారులు ఎవరెవరైతే ఉన్నారో వారు తమ శరీరాన్ని తీసుకుంటారు. ఒక నామ, రూప, దేశ, కాలాలను వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఈ విషయంపై విచార సాగర మంథనము చేసి మనుష్యులు ఆశ్చర్యపోయే విధంగా వ్రాయాలి. ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా? అని పిల్లలను నేను అడుగుతాను కదా. ఇంత చిన్నని ఆత్మనే అడగడం జరుగుతుంది కదా. మీరు ఈ నామ, రూపాలతో ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా? అని అడుగుతారు. ఆత్మ వింటుంది. అవును బాబా, మిమ్మల్ని కల్పపూర్వము కూడా కలుసుకున్నాము అని చాలామంది అంటారు. మొత్తం డ్రామా పాత్ర అంతా బుద్ధిలో ఉంది. వారు హద్దులోని డ్రామా యొక్క పాత్రధారులుగా ఉంటారు. ఇది అనంతమైన డ్రామా. ఈ డ్రామా చాలా ఏక్యురేట్ గా ఉంటుంది. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. ఆ సినిమాలు హద్దులోనివి, అవి మెషీన్ల ఆధారంగా నడుస్తాయి. 3,4 రీళ్ళు కూడా ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. కానీ ఇది అనాది, అవినాశీ అయిన ఒకే అనంతమైన డ్రామా. ఇందులో ఎంత చిన్నని ఆత్మ, ఒక పాత్రను అభినయించి మళ్ళీ ఇంకొక పాత్రను అభినయిస్తుంది. ఇది 84 జన్మల ఎంతటి పెద్ద ఫిల్మ్ రీల్. ఇది ప్రకృతి సిద్ధమైనది. ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చొంటుందా! ఇది రికార్డ్ వంటిది, చాలా అద్భుతమైనది. 84 లక్షల జన్మలైతే ఉండవు. ఇది 84 జన్మల చక్రమే, దీని పరిచయాన్ని ఎలా ఇవ్వాలి. వార్తాపత్రికల వారికి అర్థం చేయించినట్లయితే వారు వేస్తారు. మ్యాగజీన్లలో కూడా పదే, పదే వేయవచ్చు. మనము ఈ సంగమయుగ విషయాలను గురించే మాట్లాడుతాము. సత్యయుగములో ఈ విషయాలేవీ ఉండవు, అలాగే కలియుగములోనూ ఉండవు. జంతువులు మొదలైనవేవైతే ఉన్నాయో, వాటన్నింటినీ మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత చూస్తారు అని అనడం జరుగుతుంది, తేడా ఏమీ రాదు. డ్రామాలో అంతా నిశ్చితమై ఉంది. సత్యయుగములో జంతువులు కూడా చాలా సుందరముగా ఉంటాయి. ఈ మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికము పునరావృతమవుతుంది. డ్రామా షూటింగ్ జరిగినట్లుగా అవుతుంది. ఈగ ఎగిరినప్పుడు అది కూడా షూటింగ్ అయితే మళ్ళీ పునరావృతమవుతుంది. ఇప్పుడు మనం ఈ చిన్న-చిన్న విషయాలను గురించి ఆలోచించము. మొదటైతే స్వయంగా తండ్రి అంటారు - నేను కల్పకల్పమూ సంగమయుగములో ఈ భాగ్యశాలి రథములోకి వస్తాను. ఆత్మ అంటుంది - వీరిలోకి ఎలా వస్తారు? వారు ఎంతో చిన్నని బిందువు, వారినే మళ్ళీ జ్ఞానసాగరుడు అని అంటారు. ఈ విషయాలను పిల్లలైన మీలో కూడా తెలివైనవారు ఎవరైతే ఉన్నారో వారే అర్థం చేసుకోగలరు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత నేను వస్తాను. ఇది ఎంత విలువైన చదువు. తండ్రి వద్దే ఏక్యురేట్ జ్ఞానం ఉంది, దానిని పిల్లలకు ఇస్తారు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే సత్యయుగ ఆయువు 1,250 సంవత్సరాలు అని చెప్తారు. ఒక్కొక్క జన్మ యొక్క ఆయువు 150 సంవత్సరాలు ఉంటుంది. ఎంతటి పాత్ర నడుస్తుంది. బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతుంది. మనం 84 జన్మలను తీసుకుంటాము. మొత్తం సృష్టి అంతా ఈ విధంగా చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఇది అనాది, అవినాశీ తయారై, తయారుచేయబడిన డ్రామా. ఇందులో కొత్త విషయాలేవీ కలవవు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగినా కానీ చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నిశ్చితమై ఉన్న సృష్టి నాటకము. ఏది ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది. సాక్షీగా అయి చూడవలసి ఉంటుంది. ఆ నాటకములో కొన్ని అటువంటి సంఘటనలు జరిగితే, బలహీన హృదయం కలవారు ఏడవడం మొదలుపెడతారు. కానీ అది నాటకమే కదా. ఇది నిజమైనది, ఇందులో ప్రతి ఆత్మా తన పాత్రను అభినయిస్తుంది. డ్రామా ఎప్పుడూ ఆగిపోదు. ఇందులో ఏడవవలసిన, అలగవలసిన విషయమేదీ లేదు. ఇది ఏమైనా కొత్త విషయమా. ఎవరైతే డ్రామా ఆదిమధ్యాంతాలనూ రియలైజ్ అవ్వరో, వారికే దుఃఖము కలుగుతుంది. ఇది కూడా మీకు తెలుసు. ఈ సమయంలో మనం ఈ జ్ఞానం ద్వారా ఏ పదవినైతే పొందుతామో, చక్రాన్ని చుట్టి వచ్చి మళ్ళీ అదే విధముగా అవుతాము. ఇవి చాలా ఆశ్చర్యకరమైన, విచార సాగర మంథనము చేయవలసిన విషయాలు. మానవమాత్రులెవ్వరికీ ఈ విషయాల గురించి తెలియదు. ఋషులు, మునులు కూడా - మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని అనేవారు. రచయిత ఇంత చిన్నని బిందువని వారికేమి తెలుసు. వారే కొత్త సృష్టి యొక్క రచయిత. వారు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు, వారే జ్ఞానసాగరుడు. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేయిస్తారు. మీరేమైనా మాకు తెలియదు అని అంటారా. తండ్రి మీకు ఈ సమయంలో అన్నీ అర్థం చేయిస్తారు.

మీరు ఏ విషయములోనూ దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎల్లప్పుడూ హర్షితముగా ఉండాలి. ఆ డ్రామా ఫిల్మ్ నడుస్తూ, నడుస్తూ అరిగిపోతుంది, పాతబడిపోతుంది, అప్పుడు దానిని మారుస్తారు, పాతదానిని తీసివేస్తారు. కానీ ఇది అనంతమైన అవినాశీ డ్రామా. ఇటువంటి విషయాలపై ఆలోచించి పక్కా చేసుకోవాలి. ఇది ఒక డ్రామా. మనం తండ్రి శ్రీమతంపై నడుస్తూ పతితుల నుండి పావనులుగా అవుతున్నాము. మనం పతితుల నుండి పావనులుగా మరియు తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అయ్యేందుకు ఇంకే మార్గమూ ఉండదు. పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ మనం సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యాము, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. ఆత్మా వినాశనమవ్వదు, అలాగే ఆత్మ పాత్ర కూడా వినాశనమవ్వదు. ఇటువంటి విషయాలపై ఎవ్వరి ఆలోచనా నడవదు. మనుష్యులు విని ఆశ్చర్యపోతారు. వారు కేవలం భక్తి మార్గపు శాస్త్రాలనే చదువుతారు. రామాయణం, భాగవతం, గీత మొదలైనవన్నీ అవే. ఇందులో విచార సాగర మంథనము చేయవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని అచ్చంగా అదే విధంగా మనం ధారణ చేసినట్లయితే మంచి పదవినే పొందుతాము. అందరూ ఒకే విధముగా ధారణ చేయలేరు. కొందరైతే చాలా సూక్ష్మంగా అర్థం చేయిస్తారు. ఈ రోజుల్లో భాషణ ఇవ్వడానికి జైళ్ళకు కూడా వెళ్తారు. వేశ్యల వద్దకు కూడా వెళ్తారు, చెవిటి, మూగ వారి వద్దకు కూడా పిల్లలు వెళ్తూ ఉండవచ్చు ఎందుకంటే వారికి కూడా హక్కు ఉంది. సైగల ద్వారా వారు అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకునే ఆత్మ అయితే లోపల ఉంది కదా. చిత్రాన్ని ముందు పెట్టండి, చదవగలుగుతారు కదా, బుద్ధి అయితే ఆత్మలో ఉంది కదా. అంధులుగా, చేతులు లేనివారిగా, కాళ్లు లేనివారిగా ఉన్నా కానీ, ఏదో ఒక విధముగానైతే అర్థం చేసుకోగలరు. అంధులకు చెవులైతే ఉంటాయి కదా. మీ మెట్ల చిత్రము చాలా బాగుంది. ఈ జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించి స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేయగలరు. ఆత్మ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోగలదు, స్వర్గములోకి వెళ్ళగలదు. అక్కడ లోపము ఉన్నది ఇంద్రియాలలో కదా. ఆ ప్రపంచములోనైతే చేతులు లేనివారు, కాళ్లు లేనివారు ఎవరూ ఉండరు. అక్కడ ఆత్మ మరియు శరీరము రెండూ కాంచనముగా లభిస్తాయి. ప్రకృతి కూడా కాంచనముగా ఉంటుంది. కొత్త వస్తువు తప్పకుండా సతోప్రధానముగా ఉంటుంది. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. ఒక క్షణము మరొక క్షణముతో కలవదు. ఎంతో కొంత తేడా ఉంటుంది. ఇటువంటి డ్రామాను ఉన్నది ఉన్నట్లుగా సాక్షీగా అయి చూడాలి. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభించింది, ఇది మళ్ళీ ఇంకెప్పుడూ లభించదు. ఇంతకుముందు ఈ జ్ఞానం ఏమైనా ఉండేదా. దీనిని అనాది, అవినాశీ తయారై, తయారుచేయబడిన డ్రామా అని అనడం జరుగుతుంది. దీనిని బాగా అర్థం చేసుకొని మరియు ధారణ చేసి ఇంకెవరికైనా అర్థం చేయించాలి.

బ్రాహ్మణులైన మీకే ఈ జ్ఞానము గురించి తెలుసు. ఇది శక్తిశాలి మందు, ఇది మీకు లభిస్తుంది. చాలా మంచి వస్తువును మహిమ చేయడం జరుగుతుంది. కొత్త ప్రపంచం ఏ విధంగా స్థాపన అవుతుంది, మళ్ళీ ఈ రాజ్యం ఎలా వస్తుంది అనేది మీలో కూడా నంబరువారుగా తెలుసు. ఎవరికైతే తెలుసో, వారు ఇతరులకు అర్థం చేయించగలుగుతారు కూడా, ఎంతో సంతోషము ఉంటుంది. కొందరికైతే పైసకు విలువ చేసే సంతోషము కూడా లేదు. అందరికీ తమ-తమ పాత్ర ఉంది. ఎవరి బుద్ధిలోనైతే కూర్చుంటుందో, ఎవరైతే విచార సాగర మంథనము చేస్తారో, వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఇది మీ చదువు, దీని ద్వారా మీరు ఈ విధముగా అవుతారు. మీరు ఆత్మ - అని మీరు ఎవరికైనా అర్థం చేయించండి. ఆత్మయే పరమాత్మను స్మృతి చేస్తుంది. ఆత్మలందరూ సోదరులు. గాడ్ ఈజ్ వన్ అన్న నానుడి ఉంది. మిగిలిన మానవులందరిలోనూ ఆత్మ ఉంది. ఆత్మలందరి పారలౌకిక తండ్రి ఒక్కరే. పక్కా నిశ్చయబుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో, వారి బుద్ధిని ఎవ్వరూ మార్చలేరు. అపరిపక్వంగా ఉన్నవారి బుద్ధిని త్వరగా మార్చేస్తారు. సర్వవ్యాపి జ్ఞానంపై ఎంతగా వాదన చేస్తారు. వారు కూడా తమ జ్ఞానంలో పక్కాగా ఉన్నారు, వారు మన ఈ జ్ఞానానికి చెందినవారు కాకపోవచ్చు, వారిని దేవతా ధర్మానికి చెందినవారు అని ఎలా అనగలరు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది. మన ఆది సనాతన ధర్మం పవిత్ర ప్రవృత్తి కలదిగా ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు అది అపవిత్రముగా అయిపోయింది. ఎవరైతే మొదట పూజ్యులుగా ఉండేవారో, వారే పూజారులుగా అయిపోయారు. ఎన్నో పాయింట్లు కంఠస్థమై ఉంటే, అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి మీకు అర్థం చేయిస్తారు, మళ్ళీ మీరు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఇతరులకు అర్థం చేయించండి. దీని గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు.

బాబా కూడా ఘడియ-ఘడియ పాయింట్లను రిపీట్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే కొత్త-కొత్త వారు వస్తారు. ప్రారంభంలో స్థాపన ఎలా జరిగింది అని మిమ్మల్ని అడిగితే, మీరు కూడా రిపీట్ చేయవలసి ఉంటుంది. మీరు చాలా బిజీగా ఉంటారు. చిత్రాలపై కూడా మీరు అర్థం చేయించవచ్చు. కానీ జ్ఞాన ధారణ అయితే అందరికీ ఒకే విధముగా జరుగదు. ఇందులో జ్ఞానము కావాలి, స్మృతి కావాలి, చాలా మంచి ధారణ కావాలి. సతోప్రధానులుగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. కొందరు పిల్లలైతే తమ వ్యాపారాలలోనే చిక్కుకొని ఉంటారు. ఎటువంటి పురుషార్థమూ చేయరు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. కల్పపూర్వము ఎవరు ఎంత పురుషార్థం చేసారో, అంతే చేస్తారు. చివరిలో మీరు పూర్తిగా ఆత్మిక సోదరులుగా ఉండాలి. వివస్త్రులుగా వచ్చారు, వివస్త్రులుగా వెళ్ళాలి. చివరిలో ఇంకెవరో గుర్తుకు రావడమనేది జరగకూడదు. ఇప్పుడైతే ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ఎప్పటివరకైతే వినాశనం జరగదో, అప్పటివరకూ స్వర్గములోకి ఎలా వెళ్ళగలుగుతారు. తప్పకుండా సూక్ష్మవతనములోకి అయినా వెళ్తారు లేక ఇక్కడే జన్మ తీసుకుంటారు. ఇకపోతే లోపాలేవైతే మిగిలి ఉన్నాయో వాటి గురించి పురుషార్థము చేస్తారు. అది కూడా ఎప్పుడైతే పెద్ద అవుతారో అప్పుడే అర్థం చేసుకోగలుగుతారు. ఇది కూడా అంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. మీ ఏకరస అవస్థ అయితే చివరిలోనే ఉంటుంది. వ్రాసుకున్నంత మాత్రాన అంతా గుర్తుంటుందని కాదు. అలాంటప్పుడు మరి ఈ లైబ్రరీలు మొదలైనవాటిలో ఇన్ని పుస్తకాలు ఎందుకు ఉంటాయి. డాక్టర్లు, వకీలులు ఎన్నో పుస్తకాలను పెట్టుకుంటారు, చదువుతూ ఉంటారు. ఆ మనుష్యులు మనుష్యులకు వకీలుగా అవుతారు, ఆత్మలైన మీరు ఆత్మలకు వకీలుగా అవుతారు. ఆత్మలు ఆత్మలను చదివిస్తాయి. అది దైహికమైన చదువు, ఇది ఆత్మిక చదువు. ఈ ఆత్మిక చదువుతో ఇక 21 జన్మలు ఎప్పుడూ పొరపాట్లు జరగవు. మాయా రాజ్యంలో ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఆ కారణముగా సహించవలసి ఉంటుంది. ఎవరైతే పూర్తిగా చదవరో, కర్మాతీత అవస్థను పొందరో, వారు సహించవలసే ఉంటుంది. అప్పుడు పదవి కూడా తక్కువైపోతుంది. విచార సాగర మంథనము చేసి ఇతరులకు వినిపిస్తూ ఉన్నట్లయితే చింతన జరుగుతుంది. కల్పపూర్వము కూడా ఈ విధంగా తండ్రి వచ్చారని, వారి శివజయంతి జరుపబడుతుందని పిల్లలకు తెలుసు. యుద్ధము మొదలైనవాటి విషయమేమీ లేదు. అవన్నీ శాస్త్రాల విషయాలు, ఇది చదువు. సంపాదనలో సంతోషము కలుగుతుంది. ఎవరి వద్దనైతే లక్షలు ఉంటాయో, వారికి ఎక్కువ సంతోషము ఉంటుంది. కొందరు లక్షాధికారులూ ఉంటారు, కొందరు సామాన్యమైనవారూ ఉంటారు అనగా ఏదో కొద్ది ధనము ఉన్నవారు కూడా ఉంటారు. మరి ఎవరి వద్ద ఎన్ని జ్ఞాన రత్నాలు ఉంటే వారికి అంత సంతోషము కూడా ఉంటుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. విచార సాగర మంథనము చేసి స్వయాన్ని జ్ఞాన రత్నాలతో నిండుగా చేసుకోవాలి. డ్రామా రహస్యాన్ని మంచి రీతిలో అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి. ఏ విషయములోనూ దుఃఖపడకుండా సదా హర్షితముగా ఉండాలి.

2. తమ అవస్థను బహుకాలం నుండి ఏకరసంగా తయారుచేసుకోవాలి, తద్వారా చివరిలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. మేము సోదరులము, ఇప్పుడు తిరిగి వెళ్తాము అని అభ్యాసం చేయాలి.

వరదానము:-

నిర్లక్ష్యము యొక్క అలకు వీడ్కోలును ఇచ్చి సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే వివేకవంతమైన ఆత్మా భవ

కొంతమంది పిల్లలు ఇతరులను చూసి స్వయం నిర్లక్ష్యులుగా అయిపోతారు. ఇదైతే జరుగుతూనే ఉంటుంది... నడుస్తూనే ఉంటుంది... అని ఆలోచిస్తారు. ఒకరు దెబ్బ తిన్నారు, వారిని చూసి నిర్లక్ష్యములోకి వచ్చి స్వయం కూడా దెబ్బ తినటమంటే - ఇది వివేకమా? బాప్ దాదాకు దయ కలుగుతుంది, ఈ విధంగా నిర్లక్ష్యులుగా ఉన్నవారికి పశ్చాత్తాప ఘడియలు ఎంత కఠినంగా ఉంటాయి, అందుకే వివేకవంతులుగా అయ్యి నిర్లక్ష్యము యొక్క అలకు, ఇతరులను చూసే అలకు మనస్సుతో వీడ్కోలు ఇవ్వండి. ఇతరులను చూడకండి, తండ్రిని చూడండి.

స్లోగన్:-

వారస క్వాలిటీ వారిని తయారుచేయండి, అప్పుడు ప్రత్యక్షతా నగారా మోగుతుంది.