03-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - స్వదర్శన చక్రధారి భవ - మీరు లైట్ హౌస్ గా అవ్వాలి, స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇందులో నిర్లక్ష్యము చేయకండి

ప్రశ్న:-

మీరు అందరికన్నా అద్భుతమైన విద్యార్థులు - ఎలా?

జవాబు:-

మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటారు, శరీర నిర్వహణ కొరకు 8 గంటలు కర్మలు కూడా చేస్తారు, దానితోపాటు భవిష్య 21 జన్మల కొరకు కూడా 8 గంటలు తండ్రి సమానంగా తయారుచేసే సేవను చేస్తారు, అన్నీ చేస్తూ తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేస్తారు - ఇదే మీ అద్భుతమైన విద్యార్థి జీవితము. జ్ఞానం చాలా సహజము, కేవలం పావనంగా అయ్యేందుకు కృషి చేస్తారు.

ఓంశాంతి

తండ్రి పిల్లలను నంబరువారు, పురుషార్థానుసారంగా అడుగుతారు. మూలవతనము కూడా తప్పకుండా నంబరువారుగానే గుర్తుకొస్తూ ఉండవచ్చు. మేము మొదట శాంతిధామ నివాసులుగా ఉండేవారము, ఆ తర్వాత సుఖధామంలోకి వస్తాము అని కూడా పిల్లలకు తప్పకుండా గుర్తుకొస్తూ ఉండవచ్చు, ఈ విధంగా లోలోపల తప్పకుండా భావిస్తూ ఉండవచ్చు. మూలవతనము నుండి మొదలుకుని ఈ సృష్టి వరకు ఈ చక్రము ఏదైతే ఉందో, అది ఎలా తిరుగుతుంది అన్నది కూడా బుద్ధిలో ఉంది. ఈ సమయంలో మనం బ్రాహ్మణులుగా ఉన్నాము, తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఈ విధంగా బుద్ధి ద్వారా చక్రము తిప్పాలి కదా. పిల్లలకు బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి అర్థం చేయించారు, ఇంతకుముందు ఇది తెలియదు. ఇప్పుడు మీరే తెలుసుకున్నారు. రోజురోజుకు మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. అనేకులకు నేర్పిస్తూ ఉంటారు. తప్పకుండా మొదట మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు ఇక్కడ కూర్చున్నారు, వారు మన తండ్రి అని బుద్ధి ద్వారా మీకు తెలుసు. వారే సుప్రీమ్ టీచర్, వారే నేర్పిస్తారు. మనం 84 జన్మల చక్రమును ఎలా తిరుగుతాము అనేది వారే వచ్చి అర్థం చేయించారు. బుద్ధిలో తప్పకుండా గుర్తుంటుంది కదా. ఈ విషయాన్ని బుద్ధిలో అన్నివేళలా గుర్తుంచుకోవాలి, ఈ పాఠము అంత పెద్దదేమీ కాదు, ఇది ఒక్క సెకండ్ యొక్క పాఠము. మేము ఎక్కడి నివాసులము, మళ్ళీ ఇక్కడికి పాత్రను అభినయించేందుకు ఎలా వస్తాము అన్నది బుద్ధిలో ఉంటుంది. ఇది 84 జన్మల చక్రము. సత్యయుగములో ఇన్ని జన్మలు, త్రేతాలో ఇన్ని జన్మలు ఉంటాయి అంటూ ఈ చక్రమునైతే స్మృతి చేస్తారు కదా. తమకు ఏ పొజిషన్ అయితే లభించిందో, ఏ పాత్రనైతే అభినయించారో అది కూడా తప్పకుండా బుద్ధిలో గుర్తుంటుంది. మేము ఈ విధంగా డబల్ కిరీటధారులుగా ఉండేవారము, తర్వాత సింగిల్ కిరీటధారులుగా అయ్యాము, ఆ తర్వాత మొత్తం రాజ్యమంతా పోయింది, తమోప్రధానంగా అయిపోయాము అని అంటారు. ఈ చక్రమైతే తిరగాలి కదా, అందుకే స్వదర్శన చక్రధారులు అన్న పేరునే పెట్టారు. ఆత్మకు జ్ఞానం లభించింది. ఆత్మకు దర్శనమయ్యింది. నేను ఈ-ఈ విధంగా అంతా చుట్టి వస్తాను అని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే ఇంటికి చేరుకుంటారు అని తండ్రి అన్నారు. అలాగని ఈ సమయంలో మీరు ఆ అవస్థలో కూర్చుండిపోగలరు అని కాదు. అలా కాదు. బయటి విషయాలు ఎన్నో బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఒక్కొక్కరికీ ఒక్కొక్క విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక్కడైతే తండ్రి అంటారు, ఇతర విషయాలన్నింటినీ ఇముడ్చుకొని ఒక్కరినే స్మృతి చేయండి. శ్రీమతం లభిస్తుంది, దానిపై నడవాలి. స్వదర్శన చక్రధారులుగా అయి మీరు అంతిమం వరకూ పురుషార్థం చేయాలి. మొదట ఏమీ తెలియదు, ఇప్పుడు తండ్రి తెలియజేస్తారు. వారిని స్మృతి చేయడం ద్వారా అన్నీ వచ్చేస్తాయి. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక్కడైతే పాఠము లభిస్తుంది, దానిని ఇంటిలో కూడా గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయం. మీరు అద్భుతమైన విద్యార్థులు. తండ్రి అర్థం చేయించారు - 8 గంటలు విశ్రాంతిని కూడా తీసుకోండి, 8 గంటలు శరీర నిర్వహణ కొరకు పని కూడా చేయండి. ఆ వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. వాటితోపాటు తండ్రి - తమ సమానంగా తయారుచేయమని ఏ వ్యాపారమునైతే ఇచ్చారో, దానిని కూడా చేయాలి. ఇది కూడా శరీర నిర్వహణే అయ్యింది కదా. అది అల్పకాలం కొరకు మరియు ఇది 21 జన్మల శరీర నిర్వహణ కొరకు. మీరు ఏ పాత్రనైతే అభినయిస్తారో, అందులో దీనికి కూడా చాలా భారీ మహత్వము ఉంది. ఎవరు ఎంతగా కష్టపడతారో అంతగానే మళ్ళీ భక్తిలో వారి పూజ కూడా జరుగుతుంది. ఇదంతా పిల్లలైన మీరే ధారణ చేయాలి.

పిల్లలైన మీరు పాత్రధారులు. బాబా అయితే కేవలం జ్ఞానాన్ని ఇచ్చే పాత్రను అభినయిస్తారు. ఇకపోతే శరీర నిర్వహణ కొరకు పురుషార్థం మీరే చేస్తారు, బాబా అయితే చేయరు కదా. బాబా అయితే - ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికము ఏయే విధంగా పునరావృతమవుతుంది, ఈ చక్రము ఎలా తిరుగుతుంది అని పిల్లలకు అర్థం చేయించేందుకే వస్తారు. ఇది అర్థం చేయించేందుకే వస్తారు. యుక్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, నిర్లక్ష్యము చేయకండి. స్వదర్శన చక్రధారులుగా మరియు లైట్ హౌస్ లుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరము లేకుండా ఆత్మ పాత్రను అభినయించలేదు అనైతే మీకు తెలుసు. మనుష్యులకు ఏమీ తెలియదు. మీ వద్దకు వస్తారు, బాగుంది, బాగుంది అని అంటారు కానీ స్వదర్శన చక్రధారులుగా అవ్వలేరు, ఇందులో ఎంతగానో అభ్యాసము చేయవలసి ఉంటుంది. తద్వారా ఎక్కడికి వెళ్ళినా కానీ జ్ఞానసాగరుని వలె అయిపోతారు. ఏ విధంగా విద్యార్థులు చదువుకుని టీచర్లుగా అవుతారో, ఆ తర్వాత కాలేజీలలో చదివిస్తారో మరియు వ్యాపారంలో నిమగ్నమైపోతారో, అలా మీ వ్యాపారము టీచరుగా అవ్వడము. అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారుచేయండి. డబల్ కిరీటధారులైన రాజులుగా, ఆ తర్వాత సింగిల్ కిరీటధారులైన రాజులుగా ఎలా అవుతారు అని పిల్లలు చిత్రాన్ని తయారుచేసారు. అది బాగానే ఉంది, కానీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు డబల్ కిరీటధారులుగా ఉండేవారు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు సింగిల్ కిరీటధారులుగా అయ్యారు, మళ్ళీ ఎప్పుడు, ఎలా రాజ్యం దోచుకోబడింది, ఆ తారీఖులను వ్రాయవలసి ఉంటుంది. ఇది అనంతమైన పెద్ద డ్రామా. మనం మళ్ళీ దేవతలుగా అవుతాము అన్నది నిశ్చితము. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము. బ్రాహ్మణులే సంగమయుగానికి చెందినవారు. ఎప్పటివరకైతే మీరు తెలియజేయరో అప్పటివరకూ ఇది ఎవ్వరికీ తెలియదు. ఇది మీ అలౌకిక జన్మ. లౌకిక మరియు పారలౌకిక తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది. అలౌకిక తండ్రి నుండి వారసత్వము లభించదు. వీరి ద్వారా తండ్రి మీకు వారసత్వాన్ని ఇస్తారు. ఓ ప్రభూ అని గానం చేస్తారు కూడా. ఓ ప్రజాపిత బ్రహ్మా అని ఎప్పుడూ అనరు. లౌకిక మరియు పారలౌకిక తండ్రులను స్మృతి చేస్తారు. ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియవు, ఇవి మీకే తెలుసు. పారలౌకిక తండ్రిది అవినాశీ వారసత్వము, లౌకిక తండ్రిది వినాశీ వారసత్వము. ఎవరైనా రాజు కొడుకుకు 5 కోట్ల వారసత్వం లభిస్తే, అప్పుడు అతను ఈ అనంతమైన తండ్రి వారసత్వాన్ని ఎదురుగా చూస్తే, అతను అంటారు - దాంతో పోల్చి చూస్తే ఇది అవినాశీ వారసత్వము మరియు అదైతే అంతా అంతమైపోనున్న వారసత్వము. ఈ నాటి కోటీశ్వరులెవరైతే ఉన్నారో వారిని మాయ పట్టుకొని వేలాడుతోంది, వారు రారు. తండ్రి పేదల పాలిటి పెన్నిధి. భారత్ చాలా నిరుపేదగా ఉంది, భారత్ లో చాలామంది మనుష్యులు కూడా నిరుపేదలుగా ఉన్నారు. ఇప్పుడు మీరు అనేకుల కళ్యాణాన్ని చేయడానికి పురుషార్థం చేస్తున్నారు. చాలా వరకు రోగగ్రస్తులకే వైరాగ్యం వస్తుంది. అసలు బతకడం ఎందుకు, ముక్తిధామానికి వెళ్ళిపోయేందుకు మార్గమేదైనా లభించాలి అని వారు భావిస్తారు. దుఃఖము నుండి విముక్తులయ్యేందుకే ముక్తిని కోరుకుంటారు. సత్యయుగంలో అలా కోరుకోరు ఎందుకంటే అక్కడ దుఃఖము లేదు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. బాబా పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఎవరైతే సూర్యవంశీ, చంద్రవంశీ దేవతలుగా అవ్వనున్నారో, వారే వచ్చి నంబరువారు పురుషార్థానుసారంగా జ్ఞానాన్ని తీసుకుంటారు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని వదిలి ఎక్కడికీ వెళ్ళరు. ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉంటుందో వారు జ్ఞానం చాలా సహజమైనది అని అర్థం చేసుకోగలరు. ఇకపోతే పావనంగా అవ్వడంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. ఏదైనా విషయంలో నిర్లక్ష్యము చేస్తే, ఆ నిర్లక్ష్యము వల్లే ఓడిపోతారు. దీనిని బాక్సింగ్ తో బాగా పోల్చగలము. బాక్సింగ్ లో ఒకరిపై ఒకరు విజయాన్ని పొందుతారు. మాయ మనల్ని ఓడించివేస్తుందని పిల్లలకు తెలుసు.

తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇందులో శ్రమ ఉందని స్వయం తండ్రి కూడా భావిస్తారు. తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తారు. మనం ఒక ఆత్మ, ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము, పాత్రను అభినయిస్తాము. మేము అనంతమైన తండ్రి పిల్లలము - ఇది బాగా పక్కా చేసుకోవాలి. మాయ వీరి బుద్ధియోగాన్ని తెంచేస్తుంది అని బాబాకు కూడా అనిపిస్తుంది. నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు, ఈ లెక్క అనుసారంగానే రాజధాని తయారవుతుంది. అందరూ ఏకరసంగా అయిపోతే ఇక రాజ్యం తయారవ్వదు. రాజు, రాణి, ప్రజలు, షావుకారులు అందరూ తయారవ్వనున్నారు. ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మనం మన రాజధానిని స్థాపిస్తున్నాము. ఈ విషయాలన్నీ మీలో కూడా అనన్యులు ఎవరైతే ఉన్నారో, వారికే గుర్తుంటాయి. ఈ విషయాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. కానీ తాము మర్చిపోతున్నారని పిల్లలకు తెలుసు, లేదంటే - మేము విశ్వాధిపతులుగా అవుతాము అని ఎంతో సంతోషంగా ఉండాలి. పురుషార్థం ద్వారానే అలా తయారవుతారు, అంతేకానీ కేవలం అలా అనడం ద్వారా కాదు. బాబా అయితే రావడంతోనే అడుగుతారు - పిల్లలూ, అటెన్షన్, స్వదర్శన చక్రధారులుగా కూర్చున్నారా. తండ్రి కూడా స్వదర్శన చక్రధారులే కదా, వారు వీరిలోకి ప్రవేశిస్తారు. విష్ణువు స్వదర్శన చక్రధారి అని మనుష్యులు భావిస్తారు. వారికి లక్ష్మీ-నారాయణులే అలా అవుతారు అన్నది తెలియదు. వీరికి జ్ఞానాన్ని ఎవరిచ్చారు? ఏ జ్ఞానం ద్వారా వీరు ఈ లక్ష్మీ-నారాయణుల పదవిని పొందారు? స్వదర్శన చక్రముతో హతమార్చినట్లు చూపిస్తారు. మీకు ఈ చిత్రాలను తయారుచేసేవారిని తల్చుకుంటే నవ్వు వస్తుంది. విష్ణువే కంబైన్డ్ గృహస్థాశ్రమానికి గుర్తు. ఆ చిత్రము శోభిస్తుంది కానీ అదేమీ సరైన చిత్రము కాదు. మొదట మీకూ తెలియదు. 4 భుజాలు కలవారు ఇక్కడికి ఎక్కడి నుండి వచ్చారు. ఈ విషయాలన్నింటి గురించి మీలో కూడా నంబరువారుగానే తెలుసు. తండ్రి అంటారు, మొత్తం ఆధారమంతా మీ పురుషార్థంపైనే ఉంది. తండ్రి స్మృతితోనే పాపాలు అంతమవుతాయి. అన్నింటికన్నా ఎక్కువగా నెంబర్ వన్ గా ఈ పురుషార్థమే నడవాలి. తండ్రి అయితే సమయాన్ని ఇచ్చారు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. లేకపోతే పిల్లలు మొదలైనవారిని ఎవరు సంభాళిస్తారు! అవన్నీ చేస్తూ కూడా అభ్యాసం చేయాలి. అంతేకానీ ఇంకే విషయమూ లేదు. శ్రీకృష్ణుడు అకాసురుడు, బకాసురుడు మొదలైనవారిని స్వదర్శన చక్రముతో హతమార్చినట్లుగా చూపిస్తారు. చక్రము మొదలైనవాటి విషయమే లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఎంత తేడా ఉంది. ఈ విషయాలను తండ్రే అర్థం చేయిస్తారు. మనుష్యులు మనుష్యులకు అర్థం చేయించలేరు. మనుష్యులు మనుష్యుల సద్గతిని చేయలేరు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. స్వదర్శన చక్రము యొక్క అర్థమేమిటి అనేది కూడా ఇప్పుడు తండ్రే అర్థం చేయించారు. శాస్త్రాలలోనైతే ఎలాంటి కథలను తయారుచేసారంటే, ఇక అడగకండి. దేవతలను కూడా హింసాయుతముగా చేసేసారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై ఏకాంతములో కూర్చుని విచార సాగర మంథనం చేయవలసి ఉంటుంది. రాత్రివేళలో ఏ పిల్లలైతే కాపలా కాస్తారో వారికి సమయం చాలా మంచిగా లభిస్తుంది. వారు ఎంతగానో స్మృతి చేయవచ్చు. తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని కూడా త్రిప్పుతూ ఉండండి. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆ సంతోషంలో నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఎవరికైతే ధనం లభిస్తుందో వారు ఎంతో సంతోషంగా ఉంటారు. వారెప్పుడూ కునికిపాట్లు పడరు. మనం సదా ఆరోగ్యవంతులుగా, సదా సుసంపన్నులుగా అవుతామని మీకు తెలుసు, కావున ఇందులో బాగా నిమగ్నమైపోవాలి. డ్రామానుసారంగా ఏదైతే నడుస్తుందో అదంతా సరియైనదేనని కూడా ఇప్పుడు తండ్రికి తెలుసు. అయినా కానీ పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి శిక్షణను ఇస్తారు. జ్ఞానం కానీ, యోగము కానీ లేనివారు ఎందరో ఉన్నారు. అటువంటివారు, ఎవరైనా వివేకవంతులు, విద్వాంసులు మొదలైనవారు వస్తే మాట్లాడలేకపోతారు. సేవాధారులైన పిల్లలకు - తమ వద్ద అర్థం చేయించే మంచివారు ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసు. బాబా కూడా చూస్తారు - ఎవరైనా మంచి వివేకవంతులు, చదువుకున్న వ్యక్తి ఉంటే, అతనికి అర్థం చేయించేవారు తెలివితక్కువగా ఉంటే, అప్పుడు బాబా స్వయమే ప్రవేశించి అతడిని పైకెత్తవచ్చు. అప్పుడు సత్యమైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు - నాలోనైతే అంతటి జ్ఞానం లేదు, తండ్రే వచ్చి ఇతనికి అర్థం చేయించారు అని అంటారు. కొందరికైతే తమ అహంకారమొచ్చేస్తుంది. తండ్రి రావడం, సహాయం చేయడం కూడా డ్రామాలో పాత్రగా నిశ్చితమై ఉంది. డ్రామా చాలా విచిత్రమైనది. దీన్ని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి.

మనం స్థాపించబోయే రాజధానిలో అందరూ తెల్లనివారే ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ నల్లనివారెవరూ ఉండరు. మీరు తెల్లని మరియు నల్లని చిత్రాన్ని తయారుచేసి ఈ విషయాన్ని వ్రాయండి. 63 జన్మలు కామ చితిపై కూర్చొని ఈ విధంగా నల్లగా అయిపోయారు. ఆత్మయే ఆ విధంగా అయింది. లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని కూడా నల్లగా తయారుచేసారు. ఆత్మయే నల్లగా అవుతుంది అని అర్థం చేసుకోరు. సత్యయుగ యజమానులుగా, తెల్లగా ఉండేవారు, మళ్ళీ కామ చితిపై కూర్చోవడంతో నల్లగా అవుతారు. ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ తమోప్రధానంగా అవుతుంది, తద్వారా ఆత్మ కూడా నల్లగా అవుతుంది మరియు శరీరము కూడా నల్లగా అయిపోతుంది. అందుకే, లక్ష్మీ-నారాయణులను కొన్నిచోట్ల నల్లగా, కొన్నిచోట్ల తెల్లగా ఎందుకు చూపించారు, దానికి కారణమేమిటి అని మీరు సరదా-సరదాగా అడగవచ్చు. వారిలో జ్ఞానమైతే లేదు. శ్రీకృష్ణుడినే తెల్లగా, మళ్ళీ ఆ శ్రీకృష్ణుడినే నల్లగా ఎందుకు తయారుచేస్తారు? ఇది మీకు ఇప్పుడు తెలుసు. మీకు ఇప్పుడు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సంతోషంతో నిండుగా ఉండేందుకు ఏకాంతంలో కూర్చొని లభించిన జ్ఞాన ధనాన్ని స్మరించాలి. పావనులుగా మరియు సదా నిరోగులుగా అయ్యేందుకు స్మృతిలో ఉండే కృషి చేయాలి.

2. తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయి అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారుచేయాలి. లైట్ హౌస్ గా అవ్వాలి. భవిష్య 21 జన్మల శరీర నిర్వహణ కొరకు ఆత్మిక టీచర్లుగా తప్పకుండా అవ్వాలి.

వరదానము:-

త్రికాలదర్శి స్థితి ద్వారా మూడు కాలాలను స్పష్టంగా అనుభవం చేసుకునే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ భవ

ఎవరైతే త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉంటారో, వారు ఒక్క క్షణంలో మూడు కాలాలను స్పష్టంగా చూడగలరు. నిన్న ఎలా ఉండేవారము, ఈ రోజు ఎలా ఉన్నాము మరియు రేపు ఎలా ఉంటాము అన్నది వారి ముందు అంతా స్పష్టంగా ఉంటుంది. ఏ విధంగా ఏ దేశములోనైనా టాప్ పాయింట్ లో నిలబడి మొత్తం నగరాన్ని చూసినప్పుడు ఆనందం కలుగుతుందో, అలాగే సంగమయుగము టాప్ పాయింట్, దీనిపై నిలబడి మూడు కాలాలను చూడండి మరియు నషాతో ఈ విధంగా అనండి - మేమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మేమే అవుతాము. వారినే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అని అంటారు.

స్లోగన్:-

ప్రతి సమయము అంతిమ ఘడియ, ఈ స్మృతితో ఎవర్రెడీగా అవ్వండి.