03-05-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ దుఃఖధామానికి జీవిస్తూనే విడాకులివ్వండి ఎందుకంటే మీరు సుఖధామములోకి వెళ్ళాలి’’

ప్రశ్న:-

తండ్రి పిల్లలకు ఏ ఒక్క చిన్న శ్రమను ఇస్తారు?

జవాబు:-

బాబా అంటారు - పిల్లలూ, కామం మహాశత్రువు, దీనిపై విజయాన్ని పొందండి. ఈ కాస్త శ్రమనే నేను మీకు ఇస్తాను. మీరు సంపూర్ణ పావనముగా అవ్వాలి. పతితము నుండి పావనముగా అనగా పారసముగా అవ్వాలి. పారసముగా అయ్యేవారు రాతి వలె అవ్వలేరు. పిల్లలైన మీరు ఇప్పుడు పుష్పాలుగా అవ్వండి, అప్పుడు బాబా మిమ్మల్ని నయనాలపై కూర్చోబెట్టుకుని తమతోపాటు తీసుకువెళ్తారు.

ఓంశాంతి

ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులమైన మనమే దేవతలుగా అవుతాము అన్నది పిల్లలు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఈ నిశ్చయం పక్కాగా ఉంది కదా! టీచర్ ఎవరినైతే చదివిస్తారో, వారిని తప్పకుండా తమ సమానంగా తయారుచేస్తారు. ఇది నిశ్చయముతో కూడిన విషయము. కల్ప-కల్పము తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, నరకవాసులైన మనల్ని స్వర్గవాసులుగా తయారుచేస్తారు. మొత్తం ప్రపంచమంతటినీ తయారుచేసేవారు ఎవరో ఒకరైతే ఉంటారు కదా. తండ్రి స్వర్గవాసులుగా తయారుచేస్తారు, రావణుడు నరకవాసులుగా తయారుచేస్తాడు. ఈ సమయంలో ఇది రావణరాజ్యము, సత్యయుగములో రామరాజ్యము ఉంటుంది. రామరాజ్యాన్ని స్థాపన చేసేవారు ఉన్నారంటే మరి తప్పకుండా రావణరాజ్యాన్ని స్థాపన చేసేవారు కూడా ఉంటారు. రాముడు అని భగవంతుడిని అంటారు, భగవంతుడు క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. జ్ఞానమైతే చాలా సహజమైనది, ఇది ఏమంత పెద్ద విషయము కాదు. కానీ ఎటువంటి రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే, అసలు వారు పారసబుద్ధి కలవారిగా అవ్వడమే అసంభవమని భావిస్తారు. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వడంలో ఎంతో శ్రమ అనిపిస్తుంది ఎందుకంటే మాయ ప్రభావము ఉంది. ఎన్ని పెద్ద-పెద్ద భవనాలను, 50-100 అంతస్తులవి నిర్మిస్తారు. స్వర్గములో ఇన్ని అంతస్తులేమీ ఉండవు. ఈ రోజుల్లో ఇక్కడే ఇలా నిర్మిస్తూ ఉంటారు. సత్యయుగములో ఆ విధంగా ఇక్కడ నిర్మించినట్లుగా ఇళ్ళు ఉండవని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు - ఆ సమయములో ఎంతో చిన్న వృక్షము మొత్తం విశ్వమంతటిపైనా ఉంటుంది, కావున అక్కడ అంతస్తులు మొదలైనవాటిని నిర్మించవలసిన అవసరమే ఉండదు. అక్కడ లెక్కలేనంత భూమి పడి ఉంటుంది, ఇక్కడైతే అంత భూమి లేదు, అందుకే భూమి ధర ఎంతగానో పెరిగిపోయింది. అక్కడైతే భూమికి ధరే ఉండదు, అలాగే మున్సిపల్ టాక్స్ మొదలైనవి కూడా ఉండవు. ఎవరికి ఎంత భూమి కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. అక్కడైతే మీకు సర్వ సుఖాలు లభిస్తాయి, కేవలం ఆ ఒక్క తండ్రి యొక్క ఈ జ్ఞానం ద్వారా లభిస్తాయి. మనుష్యులు 100 అంతస్తులు మొదలైనవేవైతే నిర్మిస్తారో, వాటికి కూడా ధనము మొదలైనవి ఖర్చవుతాయి కదా. అక్కడ అలా ధనము మొదలైనవి ఖర్చు అవ్వవు, అపారమైన ధనము ఉంటుంది. ధనము అంటే పట్టింపు ఉండదు. లెక్కలేనంత ధనముంటే మరేం చేస్తారు. బంగారము, వజ్రాలు, ముత్యాలు మొదలైనవాటితో మహళ్ళు మొదలైనవి తయారుచేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతటి వివేకం లభించింది. ఇది వివేకము మరియు అవివేకము యొక్క విషయము. సతోబుద్ధి మరియు తమోబుద్ధి. సతోప్రధానులు స్వర్గానికి యజమానులు, తమోగుణీ బుద్ధి కలవారు నరకానికి యజమానులు. ఇదైతే స్వర్గము కాదు. ఇది రౌరవ నరకము. ఇక్కడ ఎంతో దుఃఖితులుగా ఉన్నారు, అందుకే భగవంతుడిని పిలుస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఐక్యత ఏర్పడాలని ఎంతగా కష్టపడుతూ ఉంటారు, కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ వీరు పరస్పరం కలుసుకోలేరు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ వృక్షమంతా శిథిలావస్థలో ఉంది, మళ్ళీ ఇది క్రొత్తగా తయారవుతుంది. కలియుగము నుండి సత్యయుగముగా ఎలా అవుతుందో మీకు తెలుసు. ఈ జ్ఞానాన్ని మీకు తండ్రి ఇప్పుడే అర్థం చేయిస్తారు. సత్యయుగవాసుల నుండి మళ్ళీ కలియుగవాసులుగా అవుతారు, మళ్ళీ మీరు సంగమయుగవాసులుగా అయి సత్యయుగవాసులుగా అవుతారు. ఇంతమందీ సత్యయుగములోకి వెళ్తారా అని అంటారు. వెళ్ళరు. ఎవరైతే సత్యమైన సత్యనారాయణుని కథను వింటారో, వారే స్వర్గములోకి వెళ్తారు, మిగిలినవారంతా శాంతిధామములోకి వెళ్ళిపోతారు. అసలు అక్కడ దుఃఖధామమే ఉండదు. కావున ఈ దుఃఖధామానికి జీవిస్తూనే విడాకులు ఇచ్చేయాలి. ఏ విధంగా మీరు దీనికి విడాకులు ఇవ్వచ్చు అనే యుక్తుని బాబా తెలియజేస్తారు. ఈ మొత్తం సృష్టి అంతటిపైనా దేవీ-దేవతల రాజ్యము ఉండేది. ఇప్పుడు మళ్ళీ తండ్రి దాని స్థాపన చేసేందుకు వస్తారు. మనం ఆ తండ్రి నుండి విశ్వ రాజ్యాన్ని తీసుకుంటున్నాము. డ్రామా ప్లాన్ అనుసారంగా పరివర్తన తప్పకుండా జరగనున్నది. ఇది పాత ప్రపంచము. దీనిని సత్యయుగము అని ఎలా అనగలము? కానీ మనుష్యులు సత్యయుగము ఎలా ఉంటుంది అన్నది ఏమాత్రమూ అర్థం చేసుకోరు. బాబా అర్థం చేయించారు - ఎవరైతే చాలా భక్తిని చేసారో, వారే ఈ జ్ఞానానికి అర్హులు, వారికే అర్థం చేయించాలి. ఇకపోతే ఎవరైతే ఈ కులానికి చెందనివారు కారో, వారు అర్థం చేసుకోరు, కావున ఊరికే వారి వెనుక సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? వారు మన వంశానికి చెందనివారు కానే కాకపోతే ఏమీ అంగీకరించరు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో, అసలు నేను తెలుసుకోవాలనే అనుకోవటం లేదు అని అనేస్తారు. కావున అటువంటివారి వెనుక ఎందుకు కష్టపడాలి. బాబా అర్థం చేయించారు, పైన ఇలా వ్రాసి ఉంది, భగవానువాచ - నేను కల్ప-కల్పము పురుషోత్తమ సంగమయుగములో వస్తాను, సాధారణ మనుష్య తనువులోకి వస్తాను. ఎవరికైతే తమ జన్మల గురించి తెలియదో, వారికి నేను తెలియజేస్తాను. పూర్తి 5,000 సంవత్సరాల పాత్ర ఎవరికి ఉంటుంది అనేది నేను తెలియజేస్తాను. ఎవరైతే మొదటి నంబరులో వచ్చారో వారికే ఆ పాత్ర ఉంటుంది కదా. సత్యయుగ ప్రథమ రాకుమారుడని శ్రీకృష్ణుడి మహిమను కూడా గానం చేస్తారు. అతనే మళ్ళీ 84 జన్మల తర్వాత ఏమవుతారు? మొట్టమొదటి బికారిగా అవుతారు. బికారి నుండి రాకుమారునిగా, మళ్ళీ రాకుమారుడి నుండి బికారిగా. రాకుమారుడి నుండి బికారిగా ఎలా అవుతారు అనేది మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ తండ్రి వచ్చి గవ్వ నుండి వజ్రం వలే తయారుచేస్తారు. ఎవరైతే వజ్రతుల్యంగా ఉన్నారో, వారే మళ్ళీ గవ్వతుల్యంగా అవుతారు. పునర్జన్మలనైతే తీసుకుంటారు కదా. అందరికన్నా ఎక్కువగా జన్మలను ఎవరు తీసుకుంటారు అనేది మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదటైతే శ్రీకృష్ణుడినే అంగీకరిస్తారు. అతని రాజధాని ఉంది. అనేక జన్మలు కూడా అతనికే ఉంటాయి. ఇదైతే చాలా సహజమైన విషయము. కానీ మనుష్యులు ఈ విషయాలపై శ్రద్ధ ఉంచరు. తండ్రి అర్థం చేయిస్తే ఆశ్చర్యపోతారు. బాబా ఫస్ట్ సో లాస్ట్ అని ఖచ్చితంగా తెలియజేస్తారు. ఫస్ట్ లో వజ్రతుల్యంగా ఉన్నారు, లాస్ట్ లో గవ్వతుల్యంగా ఉన్నారు, మళ్ళీ వజ్రం వలే అవ్వాలి, పావనముగా అవ్వాలి, ఇందులో కష్టమేముంది? పారలౌకిక తండ్రి కామం మహాశత్రువు అని ఆజ్ఞను జారీ చేస్తారు. మీరు దేని వల్ల పతితముగా అయ్యారు? వికారాల్లోకి వెళ్ళడం వల్ల. అందుకే - పతిత పావనా రండి అని పిలుస్తారు, ఎందుకంటే తండ్రి అయితే సదా పారసబుద్ధి కలవారిగా ఉంటారు, వారు ఎప్పుడూ రాతిబుద్ధి కలవారిగా అవ్వరు. కనెక్షన్ కూడా వారికి మరియు మొదటి నంబరులో జన్మ తీసుకునేవారికి ఏర్పడింది. దేవతలైతే ఎందరో ఉంటారు కానీ మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు.

క్రైస్టుకు 3,000 సంవత్సరాలకు పూర్వం ప్యారడైజ్ (స్వర్గం) ఉండేది అని క్రిస్టియన్లు అంటారు. వారు ఎంతైనా చివరలో వచ్చారు కదా, కావున వారికి శక్తి ఉంది. వారి నుండి నేర్చుకునేందుకే అందరూ వెళ్తారు ఎందుకంటే వారిది ఫ్రెష్ బుద్ధి. వృద్ధి కూడా వారిదే జరుగుతుంది. సతో, రజో, తమోలోకి వస్తారు కదా. అన్నీ విదేశాల నుండే నేర్చుకుంటారని మీకు తెలుసు. సత్యయుగములో మహళ్ళు మొదలైనవి తయారవ్వడానికి పెద్ద సమయమేమీ పట్టదని కూడా మీకు తెలుసు. ఒక్కరి బుద్ధిలోకి వచ్చిందంటే ఇక వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకదానిని తయారుచేసి ఇక దాని తర్వాత చాలావాటిని తయారుచేస్తూ ఉంటారు. అది బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా. సైన్స్ వారి బుద్ధి మీ వద్ద ఉన్నతంగా అయిపోతుంది, క్షణంలో మహళ్ళను తయారుచేస్తూ ఉంటారు. ఇక్కడ ఇళ్ళను లేక మందిరాలను తయారుచేయడానికి 12 నెలలు పట్టేస్తుంది, అక్కడైతే ఇంజనీర్లు మొదలైనవారంతా తెలివైనవారిగా ఉంటారు, దాని పేరే గోల్డెన్ ఏజ్ (స్వర్ణిమ యుగము). రాళ్ళు మొదలైనవైతే ఉండనే ఉండవు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఆలోచిస్తూ ఉంటారు - మేము ఈ పాత శరీరాన్ని వదులుతాము, మళ్ళీ ఇంటికి వెళ్తాము, అక్కడి నుండి మళ్ళీ సత్యయుగములో యోగబలముతో జన్మ తీసుకుంటాము అని. పిల్లలకు అంత సంతోషము ఎందుకు కలగటం లేదు! వారికి చింతన ఎందుకు నడవటం లేదు! మోస్ట్ సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా చింతన నడుస్తూ ఉండవచ్చు. బ్యారిస్టర్ పరీక్షను పాస్ అయితే - నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని బుద్ధిలో నడుస్తుంది కదా. అలాగే, మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి ఇలా అవుతాము అని మీరు కూడా భావిస్తారు. స్మృతి ద్వారానే మీ ఆయువు వృద్ధి చెందుతుంది. ఇప్పుడైతే అనంతమైన తండ్రికి పిల్లలుగా ఉన్నారు, ఇది చాలా ఉన్నతమైన గ్రేడ్. మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. మీకు ఇంకే సంబంధమూ లేదు. సోదరీ-సోదరుల సంబంధం కన్నా ఇంకా పైకి తీసుకువెళ్ళారు. పరస్పరం సోదరులుగా భావించండి, దీనిని ఎంతగానో అభ్యాసం చేయాలి. సోదరుని నివాసము ఎక్కడ ఉంది? ఈ ఆసనముపై అకాల ఆత్మ ఉంటుంది. ఆత్మలందరి ఈ ఆసనములు కుళ్ళిపోయాయి. అందరికన్నా ఎక్కువగా మీ ఆసనాలే కుళ్ళిపోయాయి. ఆత్మ ఈ ఆసనంపై విరాజమానమై ఉంటుంది. భృకుటి మధ్యలో ఏముంది? ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఆత్మ చాలా సూక్ష్మమైనది, అది నక్షత్రం వంటిది. నేను కూడా బిందువునే, నేను మీకన్నా పెద్దగా ఏమీ ఉండను అని బాబా కూడా అంటారు. మనము శివబాబా సంతానము అని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, అందుకే పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించండి. తండ్రి మిమ్మల్ని సమ్ముఖంగా చదివిస్తున్నారు. మున్ముందు ఇంకా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఈ విఘ్నాలు కూడా డ్రామానుసారంగా కలుగుతూ ఉంటాయి.

ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు పతితముగా అవ్వకూడదు, ఇది ఆజ్ఞ. ఇప్పుడైతే ఇంకా తమోప్రధానంగా అయిపోయారు. వికారాలు లేకుండా ఉండలేకపోతారు. గవర్నమెంటు వారు మద్యం తాగకూడదు అని అన్నా, మద్యం తాగకుండా ఉండలేకపోతారు. మళ్ళీ వారి చేతనే మద్యం తాగించి, ఫలానా స్థానంలో బాంబు సహితంగా మీరు వెళ్ళి పడిపోండి అని డైరెక్షన్ ఇస్తారు. ఎంత నష్టం కలుగుతుంది. మీరు ఇక్కడ కూర్చుని-కూర్చునే విశ్వానికి యజమానులుగా అవుతారు. వారేమో అక్కడ కూర్చుని-కూర్చునే మొత్తం విశ్వం యొక్క వినాశనం కొరకు బాంబులను వేస్తారు. ఎంత సంఘర్షణ ఉంది. మీరు ఇక్కడ కూర్చుని-కూర్చునే తండ్రిని స్మృతి చేస్తారు మరియు విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఎలాగైనా సరే తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇందులో హఠయోగం చేసే లేక ఆసనాలు మొదలైనవి వేసే విషయం కూడా లేదు. బాబా ఎటువంటి కష్టమూ ఇవ్వరు. మీరు ఎలా కూర్చున్నా సరే - మేము అతి ప్రియమైన పిల్లలము అని మాత్రం స్మృతి చేయండి. వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులువుగా మీకు రాజ్యము లభిస్తుంది. క్షణంలో జీవన్ముక్తి అని గానం చేస్తారు కూడా. ఎక్కడైనా కూర్చోండి, తిరగండి, విహరించండి, తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వకుండా ఎలా వెళ్ళగలరు? లేకపోతే శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. ఎప్పుడైతే ధర్మరాజు వద్దకు వెళ్తారో అప్పుడు అందరి లెక్కాచారాలు తీరిపోతాయి. ఎంతగా పవిత్రంగా అవుతారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. అపవిత్రంగా ఉంటే ఎండిపోయిన రొట్టెను తింటారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా పాపాలు అంతమవుతాయి. ఇందులో ఖర్చు మొదలైనవాటి విషయమేదీ లేదు. ఇంట్లో కూర్చొని ఉన్నా కానీ, తండ్రి నుండి కూడా మంత్రాన్ని తీసుకోండి. ఇది మాయను వశపరిచే మంత్రము - మన్మనాభవ. ఈ మంత్రము లభించిన తర్వాత ఇంటికి వెళ్తే వెళ్ళండి. నోటితో ఏమీ అనకండి. అల్ఫ్ (భగవంతుడు) ను మరియు బే (రాజ్యాధికారము) ను స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మేము సతోప్రధానముగా అయిపోతాము, పాపాలు అంతమైపోతాయి అని మీరు భావిస్తారు. బాబా తమ అనుభవాన్ని కూడా వినిపిస్తారు - భోజనం చేసేందుకు కూర్చుంటాను, అచ్ఛా, నేను బాబాను స్మృతి చేస్తూ భోజనం చేద్దాము అనుకుంటాను, మళ్ళీ వెంటనే మర్చిపోతాను. ఎందుకంటే ఎవరి తల మీదనైతే బాధ్యత ఉందో... అని అంటూ ఉంటారు. ఎన్ని విషయాల గురించి ఆలోచించవలసి ఉంటుంది - ఫలానా వారి ఆత్మ ఎంతో సేవ చేస్తుంది, తనను స్మృతి చేయాలి అని అనుకుంటారు. సేవాధారులైన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు. ఈ శరీరములో ఏ ఆత్మ అయితే విరాజమానమై ఉందో, ఆ ఆత్మను స్మృతి చేయండి అని మీకు కూడా చెప్తారు. ఇక్కడ మీరు శివబాబా వద్దకే వస్తారు. తండ్రి అక్కడి నుండి క్రిందకు వచ్చారు. మీరు అందరికీ భగవంతుడు వచ్చేశారు అని చెప్తారు కూడా, కానీ వారు అర్థం చేసుకోరు. యుక్తిగా చెప్పవలసి ఉంటుంది. హద్దు తండ్రి మరియు అనంతమైన తండ్రి, ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఇప్పుడు అనంతమైన తండ్రి రాజ్యాన్ని ఇస్తున్నారు. పాత ప్రపంచ వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఏక ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము జరుగుతుంది. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. ఇది యోగాగ్ని, దీని ద్వారా మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు. ఈ విధానమును తండ్రియే తెలియజేశారు. తండ్రి అందరినీ పుష్పాలుగా తయారుచేసి తమ నయనాలపై కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. అవి ఏ నయనాలు? జ్ఞాన నయనాలు. వారు ఆత్మలను తీసుకువెళ్తారు. తప్పకుండా వెళ్ళవలసిందే కావున దాని కన్నా ముందే తండ్రి నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు అని మీరు భావిస్తారు. ఈ సంపాదన కూడా చాలా భారీ సంపాదన. తండ్రిని మర్చిపోవడం వలన నష్టం కూడా ఎంతగానో ఉంటుంది. పక్కా వ్యాపారస్తులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మళ్ళీ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొకటి తీసుకుంటారు. కావున తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇది పక్కాగా అలవాటు చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నట్లయితే నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది, శివాలయములోకి వెళ్ళిపోతారు. చంద్రకాంత వేదాంతములో కూడా ఈ కథ ఉంది. నావ ఎలా వెళ్తుంది, మధ్యలో దిగుతారు, ఏదైనా వస్తువుపై మనసు పడతారు, అంతలో స్టీమర్ వెళ్ళిపోతుంది. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు మళ్ళీ కూడా తయారవుతాయి, మీరు చదువుతారు, మళ్ళీ ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు వీటన్నింటినీ వదిలేస్తారు. అందరినీ తీసుకువెళ్ళేందుకు తండ్రి వస్తారు. భారత్ యొక్క ఉన్నతి మరియు పతనము ఏ విధంగా జరుగుతుంది అనేది ఎంత స్పష్టంగా ఉంది. ఇతనే నల్లగా మరియు తెల్లగా అవుతారు. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా. ఆ విధంగా వీరొక్కరే అయితే అవ్వరు కదా. ఇదంతా వివరణ. శ్రీకృష్ణుని విషయములో కూడా తెల్లనివారు మరియు నల్లనివారు అని వివరించడం జరిగింది. స్వర్గములోకి వెళ్తారు కావున నరకాన్ని కాలదన్నుతారు. ఇది చిత్రములో స్పష్టంగా ఉంది కదా. రాజ్యపు చిత్రాలను కూడా మీవే తయారుచేసారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఆజ్ఞను పాలన చేసేందుకు ఏ స్మృతిలో ఉండాలంటే - ఆత్మలమైన మనము సోదరులము, భృకుటి మధ్యలో మన నివాసము ఉంది, మనము అనంతమైన తండ్రికి పిల్లలము, ఇది మన ఈశ్వరీయ పరివారము. దేహీ-అభిమానులుగా అయ్యే అలవాటును ఏర్పరచుకోవాలి.

2. ధర్మరాజు శిక్షల నుండి విముక్తులయ్యేందుకు మీ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. మాయను వశం చేసుకునే మంత్రం ఏదైతే లభించిందో, దానిని గుర్తుంచుకుంటూ సతోప్రధానముగా అవ్వాలి.

వరదానము:-

బిందు రూపములో స్థితులై ఉంటూ ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని కలిగించే విఘ్నవినాశక భవ

ఏ పిల్లలైతే ఏ విషయములోనూ ప్రశ్నార్థక చిహ్నాన్ని పెట్టరో, సదా బిందు రూపములో స్థితులై ప్రతి కార్యములో ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని కలిగిస్తారో - వారినే విఘ్నవినాశకులు అని అంటారు. వారు ఇతరులను కూడా సమర్థులుగా చేసి సఫలత అనే గమ్యానికి సమీపంగా తీసుకొస్తారు. వారు హద్దులోని సఫలత యొక్క ప్రాప్తిని చూసి సంతోషించరు, వారు అనంతమైన సఫలతా మూర్తులుగా ఉంటారు. సదా ఏకరసంగా, ఒకే శ్రేష్ఠమైన స్థితిలో స్థితులై ఉంటారు. వారు తమ సఫలత యొక్క స్వస్థితితో అసఫలతను కూడా పరివర్తన చేసేస్తారు.

స్లోగన్:-

ఆశీర్వాదాలను తీసుకోండి, ఆశీర్వాదాలను ఇవ్వండి, అప్పుడు చాలా త్వరగా మాయాజీతులుగా అయిపోతారు.