04-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - గృహస్థ వ్యవహారములో ఉంటూ పౌరలౌకిక తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే మీ సర్వస్వాన్ని ఎక్స్ చేంజ్ చేసుకోండి, ఇది చాలా పెద్ద వ్యాపారము’’

ప్రశ్న:-

డ్రామా జ్ఞానం ఏ విషయములో పిల్లలైన మీకు చాలా సహాయం చేస్తుంది?

జవాబు:-

ఏదైనా శారీరక అనారోగ్యము వచ్చినప్పుడు డ్రామా జ్ఞానం ఎంతో సహాయం చేస్తుంది ఎందుకంటే ఈ డ్రామా అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుందని మీకు తెలుసు. ఇందులో ఏడవవలసిన, రోదించవలసిన విషయమేదీ లేదు. కర్మల లెక్కాచారాలు సమాప్తమవ్వనున్నాయి. 21 జన్మల సుఖముతో పోలిస్తే ఈ దుఃఖము యొక్క అనుభవం అసలేమీ కాదు. జ్ఞానం పూర్తిగా లేకపోతే విలవిలలాడుతారు.

ఓంశాంతి

భగవానువాచ. ఎవరికైతే తమదంటూ శరీరము లేదో వారినే భగవంతుడు అని అంటారు. భగవంతునికి నామ, రూప, దేశ, కాలాలు లేవని కాదు, భగవంతునికి కేవలం శరీరమే ఉండదు. మిగిలిన ఆత్మలందరికీ తమ-తమ శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. నిజానికి ఆత్మయే వింటుంది, పాత్రను అభినయిస్తుంది, శరీరము ద్వారా కర్మలు చేస్తుంది. సంస్కారాలను ఆత్మయే తీసుకువెళ్తుంది. మంచి లేక చెడు కర్మల ఫలాన్ని కూడా ఆత్మయే శరీరము ద్వారా అనుభవిస్తుంది. శరీరము లేకుండా ఏ భోగమును (కష్టాలను) అనుభవించలేరు, అందుకే తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. బాబా మనకు వినిపిస్తున్నారు, ఆత్మలమైన మనము ఈ శరీరము ద్వారా వింటున్నాము. భగవానువాచ - మన్మనాభవ. దేహ సహితంగా దేహపు సర్వ ధర్మాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ విధంగా ఒక్క తండ్రే చెప్తారు, వారే గీతా భగవంతుడు. భగవంతుడు అంటేనే జనన-మరణ రహితుడు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నా జన్మ అలౌకికమైనది. నేను ఏ విధంగా ఇతనిలోకి ప్రవేశిస్తానో, ఆ విధంగా ఇంకెవ్వరూ జన్మ తీసుకోరు. దీనిని చాలా బాగా గుర్తుంచుకోవాలి. అలాగని అంతా భగవంతుడే చేస్తారు, పూజ్యులు-పూజారులు, రాళ్లు-రప్పలు, అన్నింటిలోనూ పరమాత్మయే ఉన్నారని కాదు. 24 అవతారాలను చూపిస్తారు, కూర్మ, మత్స్య అవతారాలను, పరశురాముని అవతారాన్ని చూపిస్తారు. భగవంతుడు ఏమైనా పరశురాముని అవతారాన్ని తీసుకుని గొడ్డలితో హింస చేస్తారా! ఇది పొరపాటు అని ఇప్పుడు అర్థం అవుతుంది. ఎలాగైతే పరమాత్మను సర్వవ్యాపి అని అనేసారో, అలాగే కల్పం ఆయువును కూడా లక్షల సంవత్సరాలు అని వ్రాసేసారు, దీనినే ఘోర అంధకారము అని అంటారు అనగా జ్ఞానం లేదు. జ్ఞానం ద్వారా ప్రకాశము వస్తుంది. ఇప్పుడు అజ్ఞానము యొక్క ఘోర అంధకారము ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు అత్యంత ప్రకాశములో ఉన్నారు. మీకు అందరి గురించి బాగా తెలుసు, ఎవరికైతే తెలియదో వారు పూజలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు అందరి గురించి తెలుసుకున్నారు కావున మీరు పూజలు చేయవలసిన అవసరం లేదు. మీరు ఇప్పుడు పూజారితనము నుండి ముక్తులయ్యారు. పూజ్య దేవీ-దేవతలుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరే పూజ్య దేవీ-దేవతలుగా ఉండేవారు, తర్వాత పూజారీ మనుష్యులుగా అయ్యారు. మనుష్యులలో అసురి గుణాలు ఉన్నాయి - అందుకే మనుష్యులను దేవతలుగా తయారుచేసారు అన్న గాయనము ఉంది. మనుష్యులను దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు... ఒక్క క్షణములో దేవతలుగా తయారుచేస్తారు. తండ్రిని గుర్తించగానే శివబాబా అని అనడం మొదలుపెడతారు. బాబా అని అనడంతో మేము విశ్వానికి, స్వర్గానికి యజమానులుగా అవుతాము అని మీ హృదయంలోకి వస్తుంది. వీరు అనంతమైన తండ్రి. ఇప్పుడు మీరు వెంటనే వచ్చి పారలౌకిక తండ్రికి చెందినవారిగా అయ్యారు. తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. లౌకిక వారసత్వాన్ని అయితే మీరు తీసుకుంటూనే వచ్చారు, ఇప్పుడు లౌకిక వారసత్వాన్ని పారలౌకిక వారసత్వముతో ఎక్స్ చేంజ్ చేయండి. ఇది ఎంత మంచి వ్యాపారము! లౌకిక వారసత్వము ఏముంటుంది? ఇదైతే అనంతమైన వారసత్వము, దీనిని పేదవారు వెంటనే తీసుకుంటారు. పేదవారిని దత్తత తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పాలిటి పెన్నిధి కదా. నేను పేదల పాలిటి పెన్నిధిని అన్న గాయనము ఉంది. భారత్ అన్నింటికన్నా పేదరికంలో ఉంది. నేను భారత్ లోకే వస్తాను, వచ్చి భారత్ ను షావుకారుగా తయారుచేస్తాను. భారత్ మహిమ ఎంతో అపారమైనది. ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము. కానీ కల్పము ఆయువును పెంచేసిన కారణముగా పూర్తిగా మర్చిపోయారు. భారత్ ఎంతో షావుకారుగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా అయ్యింది అని భావిస్తారు. పూర్వము ధాన్యం మొదలైనవన్నీ ఇక్కడి నుండి విదేశాలకు వెళ్ళేవి. ఇప్పుడు, ఈ భారత్ చాలా పేదది అని భావిస్తారు, అందుకే వారు సహాయం చేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా గొప్ప ఆసామి ఫెయిలైతే పరస్పరం నిర్ణయించుకొని వారికి సహాయం చేస్తారు. ఈ భారత్ అన్నింటికన్నా ప్రాచీనమైనది. భారత్ యే స్వర్గముగా ఉండేది. మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. కేవలం దాని సమయాన్ని పెంచేసారు, అందుకే తికమకపడతారు. భారత్ కు సహాయము కూడా ఎంతగా అందిస్తారు. తండ్రి కూడా భారత్ లోకే రావలసి ఉంటుంది.

మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. లౌకిక తండ్రి వారసత్వాన్ని పారలౌకిక తండ్రి ఇస్తున్న వారసత్వంతో ఎక్స్ చేంజ్ చేసుకుంటాము. ఏ విధంగా ఇతను (బ్రహ్మా) చేసారో అలా చేస్తాము. చూడండి, పారలౌకిక తండ్రి నుండైతే కిరీటము-సింహాసనము లభిస్తాయి, మరి ఆ రాజ్యం ఎక్కడ, ఈ గాడిద చాకిరి ఎక్కడ. ఫాలో ఫాదర్ అని అనడం జరుగుతుంది. ఆకలితో మరణించే విషయమైతే ఏమీ లేదు. తండ్రి అంటారు - ట్రస్టీగా అయి సంభాళించండి. తండ్రి వచ్చి సహజ మార్గాన్ని తెలియజేస్తారు. పిల్లలు ఎంతో కష్టాన్ని చూసారు, అందుకే - ఓ పరమపిత పరమాత్మా, దయ చూపించండి అని పిలుస్తారు. సుఖములో తండ్రిని ఎవరూ స్మృతి చేయరు, దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు ఏ విధంగా స్మృతి చేయాలి అన్నది తండ్రి తెలియజేస్తారు. మీకైతే స్మృతి చేయడం కూడా రాదు, నేనే వచ్చి మీకు తెలియజేస్తాను. పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు పారలౌకిక తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీ పాపాలు అంతమవుతాయి. సర్వశక్తివంతుడైన పరమాత్మను ప్రతి శ్వాసలో స్మృతి చేసినట్లయితే కలహ-క్లేశాలు, శారీరక రోగాలు తొలగిపోతాయి. శరీరం యొక్క దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీ ఆత్మ మరియు శరీరము, రెండు పవిత్రముగా అయిపోతాయి. మీరు ఆ విధంగా బంగారముగా ఉండేవారు, ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఆత్మపై తుప్పు పేరుకుపోతుంది, ఇక ఆ తరువాత శరీరము కూడా పాతదే లభిస్తుంది. బంగారములో లోహాన్ని కలపడం జరుగుతుంది. పవిత్రమైన బంగారముతో తయారుచేయబడిన నగలు కూడా పవిత్రముగానే ఉంటాయి. వాటిలో మెరుపు ఉంటుంది. లోహము కలిసిన నగలు నల్లబడిపోతాయి. తండ్రి అంటారు, మీలో కూడా మలినాలు చేరుకున్నాయి, వాటిని ఇప్పుడు తొలగించాలి. ఎలా తొలగించాలి? తండ్రితో యోగాన్ని జోడించండి. చదివించేవారితో యోగాన్ని జోడించాల్సి ఉంటుంది కదా. వారు తండ్రి, టీచర్, గురువు సర్వస్వమూ. వారిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు వారు మిమ్మల్ని చదివిస్తారు కూడా. పతిత-పావనుడు, సర్వశక్తివంతుడు అని మీరు నన్నే అంటారు. కల్పకల్పమూ తండ్రి ఈ విధముగానే అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన, చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలూ, మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలిశారు, అందుకే మిమ్మల్ని సికీలధే (చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలూ) అని అంటారు. ఇప్పుడిక ఈ దేహ అహంకారాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మ జ్ఞానాన్ని కూడా ఇచ్చారు, దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మ జ్ఞానం తెలిసిన మానవమాత్రులు ఎవ్వరూ లేరు. సాధు-సన్యాసులు, గురువులు-పండితులు మొదలైనవారికెవ్వరికీ తెలియదు. ఇప్పుడు అంతటి శక్తి లేదు. అందరి శక్తి తగ్గిపోయింది. మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్థాపన అవుతోంది. తండ్రి వచ్చి వెరైటీ వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. వారేమంటారంటే - మొదట మీరు రామరాజ్యములో ఉండేవారు, తర్వాత ఎప్పుడైతే మీరు వామమార్గంలోకి వెళ్తారో అప్పుడు రావణరాజ్యం ప్రారంభమవుతుంది, ఆ తర్వాత వేరే-వేరే ధర్మాలు వస్తాయి. భక్తి మార్గం ప్రారంభమవుతుంది. ఇంతకుముందు మీకు ఇవేవీ తెలియవు. మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలుసా - అని మీరు ఎవరినైనా వెళ్ళి అడిగితే ఏమీ చెప్పలేకపోతారు. ఇప్పుడిక మీరే నిర్ణయించండి అని తండ్రి భక్తులకు చెప్తున్నారు. బోర్డుపై కూడా వ్రాయండి - పాత్రధారులై ఉండి డ్రామా యొక్క డైరెక్టర్, క్రియేటర్, ముఖ్య పాత్రధారుని గురించి తెలియకపోతే అటువంటి పాత్రధారులను ఏమంటారు? ఆత్మయైన మనం ఇక్కడ భిన్న-భిన్న శరీరాలను తీసుకొని పాత్రను అభినయించేందుకు వస్తాము కావున తప్పకుండా ఇది నాటకమే కదా.

గీత తల్లి, శివుడు తండ్రి, మిగిలినదంతా రచనయే. గీత కొత్త ప్రపంచాన్ని రచిస్తుంది. కొత్త ప్రపంచాన్ని ఎలా రచిస్తారు? అన్నది కూడా ఎవరికీ తెలియదు. కొత్త ప్రపంచములో మొట్టమొదట మీరే ఉంటారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగ ప్రపంచము. ఇది పాత ప్రపంచము కూడా కాదు, అలాగే కొత్త ప్రపంచము కూడా కాదు. ఇది సంగమము. ఇది బ్రాహ్మణుల పిలక. విరాట రూపములో శివబాబానూ చూపించరు, అలాగే బ్రాహ్మణుల చిహ్నమైన పిలకనూ చూపించరు. మీరు పైన పిలకను కూడా చూపించారు. బ్రాహ్మణులైన మీరు కూర్చున్నారు. దేవతల తర్వాత క్షత్రియులు ఉన్నారు. ద్వాపరములో పొట్ట పూజారులు ఉన్నారు, ఆ తర్వాత శూద్రులుగా అవుతారు. ఇది పిల్లిమొగ్గల ఆట. మీరు కేవలం ఈ పిల్లిమొగ్గల ఆటను గుర్తు చేసుకోండి. ఇదే మీ కొరకు 84 జన్మల యాత్ర. క్షణములో అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. మనం ఈ విధంగా చక్రాన్ని చుట్టి వస్తాము. ఇది కరక్ట్ చిత్రము, వారిది తప్పు. బాబా తప్ప ఇంకెవ్వరూ కరక్ట్ చిత్రాన్ని తయారుచేయించలేరు. వీరి ద్వారా తండ్రి అర్థం చేయిస్తారు. మీరు ఈ విధంగా పిల్లిమొగ్గల ఆటను ఆడతారు. మీ యాత్ర క్షణములో జరుగుతుంది. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని ఆత్మిక పిల్లలు భావిస్తారు. ఇది సత్యమైన తండ్రితో జోడించే సత్సాంగత్యము. అది అసత్య సాంగత్యము. సత్య ఖండాన్ని తండ్రే స్థాపిస్తారు. మనుష్యులకు అంతటి శక్తి లేదు. దానిని భగవంతుడే చేయగలరు. భగవంతుడినే జ్ఞానసాగరుడు అని అంటారు. మనుష్యులకు ఇది పరమాత్ముని మహిమ అన్నది కూడా తెలియదు. ఆ శాంతి సాగరుడు మీకు శాంతిని ఇస్తున్నారు. ఉదయం కూడా మీరు డ్రిల్ చేస్తారు. శరీరము నుండి అతీతముగా అయి తండ్రి స్మృతిలో ఉంటారు. ఇక్కడకు మీరు జీవిస్తూనే మరణించడానికి వచ్చారు, తండ్రిపై బలిహారమవుతారు. ఇది పాత ప్రపంచము, పాత శరీరము, దీనిపై ద్వేషం కలుగుతుంది, ఇక దీనిని వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకేమీ గుర్తుకు రాకూడదు. అంతా మర్చిపోయారు. భగవంతుడే అంతా ఇచ్చారు కావున ఇప్పుడు వారికే ఇచ్చేయండి అని మీరు అంటారు కూడా. అప్పుడు భగవంతుడు - మీరు ట్రస్టీలుగా అవ్వండి అని అంటారు. భగవంతుడు ట్రస్టీగా అవ్వరు, మీరే ట్రస్టీలుగా అవుతారు. ఇక ఆ తర్వాత పాపాలు చేయరు. ఇంతకుముందు పాపాత్ములకు-పాపాత్ములకు మధ్యన ఇచ్చిపుచ్చుకోవడాలు నడుస్తూ వచ్చాయి. ఇప్పుడు సంగమయుగములో మీకు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోవడమనేది లేదు. పాపాత్ములకు దానం చేసినట్లయితే ఆ పాపం తలకు చుట్టుకుంటుంది. ఈశ్వరార్థము అని చేస్తారు కానీ పాపాత్ములకు ఇస్తారు. తండ్రి ఏమైనా తీసుకుంటారా? తండ్రి అంటారు, మీరు వెళ్ళి సెంటర్ తెరిచినట్లయితే అనేకుల కళ్యాణము జరుగుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఏదైతే జరుగుతుందో అదంతా ఖచ్చితముగా డ్రామానుసారంగా రిపీట్ అవుతూనే ఉంటుంది, కావున అందులో ఏడవవలసిన, రోదించవలసిన విషయమేదీ లేదు. కర్మల లెక్కాచారాలు తీరడం మంచిదే. రోగమంతా బయటకు వస్తుంది అని వైద్యులు చెప్తారు. అలాగే తండ్రి కూడా అంటారు, మిగిలియున్న లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి. అయితే యోగముతో లేక శిక్షలతో వాటిని తీర్చుకోవలసి ఉంటుంది. శిక్షలైతే చాలా కఠినంగా ఉంటాయి, వాటి కన్నా రోగాలు మొదలైనవాటి ద్వారా తీరిపోవడం చాలా మంచిది. ఈ దుఃఖము అనేది 21 జన్మల సుఖముతో పోలిస్తే అసలేమి కానట్లే అనిపిస్తుంది ఎందుకంటే సుఖము చాలా ఉంటుంది. జ్ఞానం పూర్తిగా లేకపోతే రోగాలలో విలవిలలాడుతూ ఉంటారు. రోగగ్రస్తులుగా అయితే భగవంతుడిని ఎంతగానో తలచుకుంటూ ఉంటారు. అది కూడా మంచిదే. ఒక్కరినే స్మృతి చేయాలి. వారు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. వారైతే గురువులను తలచుకుంటూ ఉంటారు, అనేకమంది గురువులు ఉన్నారు. ఒక్క సద్గురువు గురించి అయితే మీకే తెలుసు. వారు ఆల్మైటీ అథారిటీ. తండ్రి అంటారు, నాకు ఈ వేదాలు, గ్రంథాలు మొదలైనవాటి గురించి తెలుసు. ఇవి భక్తి మార్గపు సామాగ్రి. వీటి ద్వారా ఎవ్వరూ నన్ను పొందలేరు. తండ్రి పాపాత్ముల ప్రపంచంలోకే వస్తారు. ఇక్కడకు పుణ్యాత్ములు ఎక్కడి నుండి వచ్చారు? ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో, వారి శరీరములోకే నేను వస్తాను. అందరికన్నా ముందు ఇతనే వింటారు. తండ్రి అంటారు, ఇక్కడ మీ స్మృతియాత్ర చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ తుఫానులు కూడా వస్తాయి కానీ తండ్రి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని అర్థం చేయిస్తూ ఉంటారు. కల్పక్రితము కూడా మీరు ఈ విధంగానే జ్ఞానాన్ని విన్నారు. దినప్రతిదినమూ మీరు వింటూ ఉంటారు. రాజధాని స్థాపన అవుతూ ఉంటుంది. పాత ప్రపంచ వినాశనం కూడా జరగవలసిందే. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉదయముదయమే లేచి శరీరము నుండి అతీతముగా అయ్యే డ్రిల్ ను చేయాలి. పాత ప్రపంచము, పాత శరీరము ఏదీ గుర్తుకు రాకూడదు. అన్నింటినీ మర్చిపోవాలి.

2. సంగమయుగములో పాపాత్ములతో ఇచ్చి-పుచ్చుకోవడాలు చేయకూడదు. కర్మల లెక్కాచారాలను సంతోషంగా తీర్చుకోవాలి. ఏడవకూడదు, రోదించకూడదు. సర్వస్వాన్ని తండ్రిపై బలిహారం చేసి మళ్ళీ ట్రస్టీగా అయి సంభాళించాలి.

వరదానము:-

రియలైజేషన్ శక్తి ద్వారా స్వ పరివర్తనను చేసుకునే తీవ్ర పురుషార్థీ భవ

ఏ పరివర్తనకైనా సహజ ఆధారము రియలైజేషన్ శక్తి. ఎప్పటివరకైతే రియలైజేషన్ శక్తి రాదో, అప్పటివరకు అనుభూతి కలగదు మరియు ఎప్పటివరకైతే అనుభూతి కలగదో అప్పటివరకు బ్రాహ్మణ జీవితపు విశేషత యొక్క పునాది దృఢంగా అవ్వదు, ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన నడవడిక ఉండదు. ఎప్పుడైతే రియలైజేషన్ శక్తి ప్రతి విషయములోనూ అనుభవజ్ఞులుగా చేస్తుందో, అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. రియలైజేషన్ శక్తి సదాకాలము కొరకు సహజంగా పరివర్తన చేయిస్తుంది.

స్లోగన్:-

స్నేహ స్వరూపాన్ని సాకారములో ఇమర్జ్ చేసుకుని బ్రహ్మాబాబా సమానంగా అవ్వండి.