05-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రిని ప్రేమగా స్మృతి చేసినట్లయితే మీరు పూర్తిగా తృప్తి చెందుతారు, దృష్టితో పూర్తిగా తృప్తి చెందడము అనగా విశ్వాధిపతులుగా అవ్వడము’’

ప్రశ్న:-

స్వామి, సద్గురువైన పరమాత్ముని ఒక్క చల్లని దృష్టి ఎంతో తృప్తిని ఇస్తుంది... దీని వాస్తవిక అర్థము ఏమిటి?

జవాబు:-

ఆత్మకు తండ్రి ద్వారా ఎప్పుడైతే మూడవ నేత్రము లభిస్తుందో మరియు ఆ నేత్రము ద్వారా తండ్రిని గుర్తిస్తుందో అప్పుడు పూర్తిగా తృప్తి చెందుతుంది అనగా సద్గతి లభిస్తుంది. బాబా అంటారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అయి మీరు నా వైపు దృష్టిని ఉంచండి అనగా నన్ను స్మృతి చేయండి, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క నాతోనే సాంగత్యాన్ని జోడించండి, అప్పుడు దిగులు చెందడము నుండి అనగా నిరుపేదల నుండి పూర్తిగా తృప్తి చెందుతారు అనగా షావుకార్లుగా అవుతారు.

ఓంశాంతి

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఎవరి వద్దకు వస్తున్నారు? ఆత్మిక తండ్రి వద్దకు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము అని భావిస్తారు. శివబాబా ఆత్మలందరికీ తండ్రి అని కూడా మీకు తెలుసు. వారు సుప్రీమ్ టీచర్ కూడా, అలాగే సుప్రీమ్ గురువు కూడా అని పిల్లలకు నిశ్చయము ఉండాలి. సుప్రీమ్ ను పరమ్ అని అంటారు. వారొక్కరినే స్మృతి చేయాలి. దృష్టితో దృష్టిని కలుపుతారు. స్వామి, సద్గురువైన పరమాత్ముని ఒక్క చల్లని దృష్టి ఎంతో తృప్తినిస్తుంది అని గాయనము ఉంది. దీని అర్థమేమిటో తెలియాలి. దృష్టి ద్వారా ఎవరిని తృప్తి పరిచారు? ఈ మాట తప్పకుండా మొత్తం ప్రపంచమంతటి గురించీ అంటారు ఎందుకంటే వారు సర్వుల సద్గతిదాత. వారు సర్వులనూ ఈ పతిత ప్రపంచము నుండి తీసుకువెళ్ళేవారు. ఇప్పుడు ఇది ఏ దృష్టి? ఈ కళ్లదా? కాదు, జ్ఞానమనే మూడవ నేత్రము లభిస్తుంది. దాని ద్వారా - వారు ఆత్మలమైన మనందరికీ తండ్రి అని ఆత్మ తెలుసుకుంటుంది. తండ్రి ఆత్మలకు - నన్ను స్మృతి చేయండి అని సలహాను ఇస్తారు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మలే పతితముగా, తమోప్రధానముగా అయ్యాయి. ఇప్పుడు ఇది మీ 84వ జన్మ, ఈ నాటకం పూర్తవుతోంది. తప్పకుండా పూర్తవ్వాలి కూడా. ప్రతి కల్పము పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచముగా అవుతుంది. కొత్తది మళ్ళీ పాతదిగా అవుతుంది. దాని పేరు కూడా వేరు. కొత్త ప్రపంచము పేరు సత్యయుగము. తండ్రి అర్థం చేయించారు - మొదట మీరు సత్యయుగములో ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలను గడిపారు. ఇప్పుడు మీ ఆత్మ తమోప్రధానముగా అయిపోయింది. తండ్రిని స్మృతి చేసినట్లయితే పూర్తిగా తృప్తి చెందుతారు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి సమ్ముఖముగా చెప్తున్నారు. నేను ఎవరిని? పరమపిత పరమాత్మను. తండ్రి అంటారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి, దేహాభిమానులుగా అవ్వకండి. ఆత్మాభిమానులుగా అయి మీరు నా వైపు మీ దృష్టిని ఉంచినట్లయితే తద్వారా మీరు పూర్తిగా తృప్తి చెందుతారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, ఇందులో ఏ కష్టమూ లేదు. ఆత్మయే చదువుతుంది, పాత్రను అభినయిస్తుంది. ఆత్మ ఎంత చిన్ననిది. ఎప్పుడైతే ఇక్కడకు వస్తారో అప్పుడు 84 జన్మల పాత్రను అభినయిస్తారు. మళ్ళీ అదే పాత్రను రిపీట్ చేయాలి. 84 జన్మల పాత్రను అభినయిస్తూ ఆత్మ పతితముగా అయిపోయింది. ఇప్పుడు ఆత్మలో ఏ మాత్రమూ శక్తి మిగలలేదు. ఇప్పుడు ఆత్మ తృప్తిగా లేదు, దిగులుగా ఉంది అనగా నిరుపేదగా ఉంది. మళ్ళీ అది తృప్తిగా ఎలా అవుతుంది? ఈ పదాలు భక్తి మార్గానికి చెందినవి. వీటి గురించి తండ్రి అర్థం చేయిస్తారు. వేదశాస్త్రాలు, చిత్రాలు మొదలైనవాటి గురించి కూడా అర్థం చేయిస్తారు. మీరు ఈ చిత్రాలను శ్రీమతమనుసారముగా తయారుచేసారు. అసురీ మతముపైనైతే లెక్కలేనన్ని చిత్రాలను తయారుచేసారు. వాటికి ఆక్యుపేషన్ (కర్తవ్యము) ఏమీ లేదు. ఇక్కడైతే తండ్రి వచ్చి పిల్లలను చదివిస్తారు. ఇది భగవానువాచ అంటే ఇది వారి జ్ఞానము అయినట్లు. వీరు ఫలానా టీచర్ అని విద్యార్థులకు తెలిసి ఉంటుంది. ఇక్కడైతే పిల్లలైన మీకు తెలుసు - ఈ అనంతమైన తండ్రి ఒకేసారి వచ్చి ఇటువంటి అద్భుతమైన చదువును చదివిస్తారు. ఈ చదువుకు మరియు ఆ చదువుకు రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఆ చదువును చదువుతూ, చదువుతూ రాత్రి అయిపోతుంది, ఈ చదువు ద్వారా పగలులోకి వెళ్తారు. ఆ చదువులనైతే జన్మజన్మాంతరాలూ చదువుతూనే వచ్చారు. ఇందులోనైతే తండ్రి స్పష్టముగా తెలియజేస్తున్నారు - ఆత్మ ఎప్పుడైతే పవిత్రముగా అవుతుందో అప్పుడు ధారణ జరుగుతుంది. పులి పాలు బంగారుపాత్రలోనే నిలుస్తాయి అని అంటారు. ఇప్పుడు మనం బంగారుపాత్రగా అవుతున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యులుగానే ఉంటారు కానీ ఆత్మ సంపూర్ణ పవిత్రముగా అవ్వాలి. 24 క్యారెట్లువారిగా ఉండేవారు, ఇప్పుడు 9 క్యారెట్లువారిగా అయిపోయారు. ఆత్మ జ్యోతి ఏదైతే వెలుగుతూ ఉండేదో అది ఇప్పుడు ఆరిపోయింది. వెలిగి ఉన్న జ్యోతి మరియు ఆరిపోయిన జ్యోతి కలవారిలో కూడా తేడా ఉంది. జ్యోతి ఏ విధంగా వెలిగింది మరియు పదవిని ఏ విధంగా పొందారు అన్నది తండ్రే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు - మీరు నన్ను స్మృతి చేయండి. ఎవరైతే నన్ను బాగా స్మృతి చేస్తారో నేను కూడా వారిని బాగా స్మృతి చేస్తాను. దృష్టితో పూర్తిగా తృప్తి పరిచే ఆ తండ్రి ఒక్కరే స్వామి అని కూడా పిల్లలకు తెలుసు. ఇతని ఆత్మ కూడా పూర్తిగా తృప్తి చెందుతుంది. మీరందరూ దీపపు పురుగులు, వారిని దీపము అని అంటారు. కొన్ని దీపపు పురుగులు అయితే కేవలం దీపం చుట్టూ తిరిగేందుకే వస్తాయి. కొన్ని దీపపు పురుగులు వారిని బాగా గుర్తిస్తే జీవిస్తూనే మరణిస్తాయి. కొన్ని దీపపు పురుగులు చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి, మళ్ళీ అప్పుడప్పుడూ వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. ఈ గాయనమంతా ఈ సంగమయుగానిదే. ఈ సమయంలో ఏదైతే నడుస్తుందో, అదే శాస్త్రాలుగా తయారవుతుంది. తండ్రి ఒకేసారి వచ్చి వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే ఇస్తారు. 21 తరాలు అన్న గాయనము కూడా ఉంది. సత్యయుగములో వారసత్వాన్ని ఎవరు ఇస్తారు? భగవంతుడైన రచయితయే అర్ధకల్పం కొరకు రచనకు వారసత్వాన్ని ఇస్తారు. స్మృతి కూడా అందరూ వారినే చేస్తారు. వారే తండ్రి కూడా, అలాగే టీచర్ కూడా, అలాగే స్వామి మరియు సద్గురువు కూడా. మీరు ఇంకెవరినైనా కూడా స్వామి లేక సద్గురువు అని పిలుస్తుండవచ్చు కానీ సత్యమైనవారు ఒక్క తండ్రే. ట్రూత్ అని ఎల్లప్పుడూ తండ్రినే అంటారు. ఆ సత్యమైనవారు వచ్చి ఏమి చేస్తారు? వారే పాత ప్రపంచాన్ని సత్యఖండముగా తయారుచేస్తారు. సత్యఖండము కొరకు మనం పురుషార్థము చేస్తున్నాము. ఎప్పుడైతే సత్యఖండము ఉండేదో అప్పుడు ఇంకే ఖండాలు ఉండేవి కావు. ఇవన్నీ తర్వాత వస్తాయి. సత్యఖండము గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. మిగిలిన ఖండాలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో వాటిని గురించి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికీ తమ-తమ ధర్మస్థాపకుల గురించి తెలుసు. కానీ సూర్యవంశీయుల గురించి, చంద్రవంశీయుల గురించి మరియు ఈ సంగమయుగ బ్రాహ్మణ కులము గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మాను అంగీకరిస్తారు. బ్రాహ్మణులమైన మేము బ్రహ్మా సంతానము అని అంటారు, కానీ వారు కుఖవంశావళులు, మీరు ముఖవంశావళులు. వారు అపవిత్రులు, ముఖవంశావళులైన మీరు పవిత్రులు. మీరు ముఖవంశావళులుగా అయి ఇక ఛీ-ఛీ ప్రపంచమైన రావణ రాజ్యం నుండి వెళ్ళిపోతారు. అక్కడ రావణ రాజ్యమనేది ఉండదు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోకి వెళ్తారు. దానిని నిర్వికారీ ప్రపంచము అని అంటారు. ప్రపంచమే కొత్తదిగా మరియు పాతదిగా అవుతుంది. అది ఏ విధంగా అవుతుంది అనేది కూడా మీరు తెలుసుకున్నారు. ఇది ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. లక్షల సంవత్సరాల విషయమునైతే ఎవ్వరూ తెలుసుకోలేరు కూడా. ఇది కొద్ది సమయం యొక్క విషయమే. ఈ విషయాలను తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు.

తండ్రి అంటారు - ఎప్పుడైతే విశేషముగా భారత్ లో ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడే నేను వస్తాను. ఇతర స్థానాలలో అసలు నిరాకారుడైన పరమాత్మ అంటే ఎవరు అనేది ఎవరికీ తెలియనే తెలియదు. పెద్ద-పెద్ద లింగాలను తయారుచేసి పెట్టేసారు. ఆత్మ సైజ్ ఎప్పుడూ చిన్నగా, పెద్దగా అవ్వదని పిల్లలకు అర్థం చేయించారు. ఏ విధంగా ఆత్మ అవినాశీయో అలాగే తండ్రి కూడా అవినాశీయే. వారు సుప్రీమ్ ఆత్మ. సుప్రీమ్ అనగా వారు ఎల్లప్పుడూ పవిత్రముగా మరియు నిర్వికారిగా ఉంటారు. ఆత్మలైన మీరు కూడా నిర్వికారిగా ఉండేవారు, ప్రపంచము కూడా నిర్వికారిగా ఉండేది. వారిని సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. కొత్త ప్రపంచము మళ్ళీ తప్పకుండా పాతదిగా అవుతుంది. కళలు తగ్గిపోతూ ఉంటాయి. రెండు కళలు తగ్గి చంద్రవంశ రాజ్యం ఉండేది, ఇక ప్రపంచము పాతబడుతూ ఉంటుంది. తర్వాత ఇతర ఖండాలు వస్తూ ఉంటాయి. వాటిని ఉపశాఖలు అని అంటారు, కానీ అవన్నీ కలిసిపోతాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. బౌద్ధుల యొక్క పెద్ద ఒకరు వచ్చినప్పుడు ఎంతమందిని బౌద్ధ ధర్మంలోకి తీసుకువెళ్ళారు. వారి మతం మార్చేసారు. హిందువులు తమ ధర్మాన్ని తామే మార్చుకున్నారు ఎందుకంటే కర్మ భ్రష్టంగా అవ్వడంతో ధర్మ భ్రష్టంగా కూడా అయ్యారు, వామ మార్గంలోకి వెళ్ళిపోయారు. జగన్నాథ మందిరానికి కూడా వెళ్ళి ఉంటారు, కానీ ఎవరికీ ఏ ఆలోచన నడవదు. వారు స్వయమే వికారులుగా ఉన్నారు కావున దేవతలను కూడా వికారులుగానే చూపించారు. దేవతలు వామమార్గంలోకి వెళ్ళినప్పుడు ఆ విధంగా అయ్యారు అని ఎవరూ అర్థం చేసుకోరు. ఈ చిత్రాలు ఆ సమయంలోనివే. దేవత అన్న పేరు చాలా బాగుంది. హిందువు అన్నది హిందూస్థాన్ పేరు. అలా వారు స్వయాన్ని హిందువులు అని పిలుచుకున్నారు. ఇది ఎంత పెద్ద పొరపాటు. అందుకే తండ్రి అంటారు - యదా యదాహి ధర్మస్య... బాబా భారత్ లో వస్తారు. నేను హిందుస్థాన్ లో వస్తాను అని అయితే వారు అనరు. ఇది భారత్. హిందుస్థాన్ లేక హిందూ ధర్మం అనేది లేదు. ముసల్మాన్లు హిందుస్థాన్ అన్న పేరును పెట్టారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది కూడా జ్ఞానమే. పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ వామమార్గంలోకి వస్తూ, వస్తూ భ్రష్టాచారులుగా అయిపోతారు, అప్పుడు దేవతల ముందుకు వెళ్ళి, మీరు సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము, పాపులము అని అంటారు. ఇంకే ఖండం వారూ ఈ విధంగా అనరు. మేము నీచులము లేక మాలో ఏ గుణాలు లేవు అని అనడం ఎప్పుడూ విని ఉండరు. సిక్కులు కూడా గ్రంథ్ ముందు కూర్చుంటారు కానీ వారు కూడా ఎప్పుడూ ఇలా - నానక్, నీవు నిర్వికారివి, మేము వికారులము అని అనరు. నానక్ సాంప్రదాయము వారు కడియం వేసుకుంటారు. అది నిర్వికారీతనానికి గుర్తు, కానీ వారు వికారాలు లేకుండా ఉండలేరు. అసత్యమైన గుర్తులను పెట్టుకున్నారు. ఏ విధంగా హిందువులు జంధ్యాన్ని ధరిస్తారు, అది పవిత్రతకు గుర్తు. ఈ రోజుల్లోనైతే ధర్మాన్ని కూడా నమ్మరు. ఈ సమయంలో భక్తి మార్గం నడుస్తోంది. దీనిని భక్తి సాంప్రదాయము అని అంటారు. జ్ఞాన సాంప్రదాయము సత్యయుగములో ఉంటుంది. సత్యయుగములో దేవతలు సంపూర్ణ నిర్వికారులు. కలియుగములో సంపూర్ణ నిర్వికారులు ఎవ్వరూ ఉండరు. ప్రవృత్తి మార్గం వారి స్థాపనను తండ్రే చేస్తారు. మిగిలిన గురువులందరూ నివృత్తి మార్గం వారు, వీరి కన్నా వారి ఫోర్సు ఎక్కువ పెరిగింది. తండ్రి అంటారు, వీటినేవైతే మీరు చదివారో వీటి ద్వారా నేను లభించను. నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు అందరినీ దృష్టితో పూర్తిగా తృప్తి పరుస్తాను. స్వామి, సద్గురువైన పరమాత్ముని ఒక్క చల్లని దృష్టి ఎంతో తృప్తినిస్తుంది... అన్న గాయనము కూడా ఉంది. ఇక్కడకు మీరు ఎందుకు వచ్చారు? పూర్తిగా తృప్తి చెందడానికి, విశ్వాధిపతులుగా అవ్వడానికి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పూర్తిగా తృప్తి చెందుతారు. ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఇలా తయారవుతారు అని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. మీరు ఇలా తయారవ్వాలి అని తండ్రే చెప్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఎలా తయారయ్యారు? ఇది ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకు తండ్రి అంతా తెలియజేస్తారు. వీరే 84 జన్మలను తీసుకొని పతితముగా అయ్యారు, మళ్ళీ మిమ్మల్ని ఈ విధంగా తయారుచేయడానికి నేను వచ్చాను.

తండ్రి తమ పరిచయాన్ని కూడా ఇస్తారు, అలాగే దృష్టి ద్వారా పూర్తిగా తృప్తిగా కూడా చేస్తారు. ఇలా ఎవరి గురించి అంటారు? ఒక్క సద్గురువు గురించి. ఆ గురువులైతే లెక్కలేనంతమంది ఉన్నారు. మాతలు, అబలలు కూడా అమాయకులు, మీరందరూ కూడా భోళానాథుని పిల్లలే. నేత్రం తెరవగానే వినాశనం జరిగింది అని శంకరుని గురించి అన్నారు. అది కూడా పాపమే అవుతుంది కదా. తండ్రి ఎప్పుడూ అటువంటి పని కోసం డైరెక్షన్ ఇవ్వరు. వినాశనమైతే వేరే వస్తువులతో జరుగుతుంది కదా. తండ్రి ఇటువంటి డైరెక్షన్లు ఇవ్వరు. వీటన్నింటినీ సైన్స్ వారే కనుగొంటూ ఉంటారు. మా కులాన్ని మేమే వినాశనం చేసుకుంటున్నామని భావిస్తారు. వారు కూడా బంధించబడి ఉన్నారు. దానిని వదలలేరు. పేరు ఎంత ప్రఖ్యాతమవుతుంది? చంద్రమండలములోకి వెళ్తారు కానీ లాభమేమీ లేదు.

మధురాతి మధురమైన పిల్లలూ, మీరు కూడా తండ్రితో దృష్టిని జోడించండి. హే ఆత్మా, నీ తండ్రిని స్మృతి చేసినట్లయితే నీవు పూర్తిగా తృప్తి చెందుతావు. తండ్రి అంటారు - ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో, ఎవరైతే నా కొరకు సేవ చేస్తారో, నేను కూడా వారిని స్మృతి చేస్తాను, కావున వారికి బలం లభిస్తుంది. ఇక్కడ మీరందరూ కూర్చున్నారు, ఎవరైతే పూర్తిగా తృప్తి చెందుతారో, వారే రాజులుగా అవుతారు. ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి అన్న గాయనం కూడా ఉంది. ఆ ఒక్కరు నిరాకారుడే. ఆత్మ కూడా నిరాకారియే. తండ్రి అంటారు, మీరు నన్ను స్మృతి చేయండి. ఓ పతిత-పావనా, అని మీరు స్వయము అంటారు, ఈ విధంగా ఎవరిని అన్నారు? బ్రహ్మానా, విష్ణువునా, శంకరుడినా? ముగ్గురినీ కాదు. పతిత-పావనుడు ఒక్కరే, వారు ఎల్లప్పుడూ పావనంగా ఉంటారు. వారినే సర్వశక్తివంతుడు అని అంటారు. తండ్రే సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు మరియు వారికి శాస్త్రాలన్నింటి గురించి తెలుసు. ఆ సన్యాసులు శాస్త్రాలు మొదలైనవాటిని చదివి టైటిల్స్ తీసుకుంటారు. తండ్రికైతే ముందు నుండే టైటిల్ లభించి ఉంది, వారేమీ ఏదో చదివి టైటిల్ తీసుకోవలసిన అవసరం లేదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దీపముపై జీవిస్తూ మరణించే దీపపు పురుగులుగా అవ్వాలి, అంతేకానీ కేవలం చుట్టూ తిరిగేవారిగా కాదు. ఈశ్వరీయ చదువును ధారణ చేయడానికి బుద్ధిని సంపూర్ణ పావనంగా తయారుచేసుకోవాలి.

2. ఇతర సాంగత్యాలన్నింటినీ తెంచి ఒక్క తండ్రి సాంగత్యములోనే ఉండాలి. ఒక్కరి స్మృతితో స్వయాన్ని పూర్తిగా తృప్తి పరచుకోవాలి.

వరదానము:-

హృదయపూర్వకమైన రియలైజేషన్ ద్వారా హృదయాభిరాముని ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే స్వ పరివర్తక భవ

స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు రెండు విషయాలలో సత్యమైన హృదయముతో కూడిన రియలైజేషన్ అవసరము. 1-తమ బలహీనత యొక్క రియలైజేషన్. 2-ఏ పరిస్థితి లేక వ్యక్తి అయితే నిమిత్తం అవుతారో, వారి కోరిక మరియు వారి మనసులోని భావన యొక్క రియలైజేషన్. పరిస్థితి అనే పరీక్ష యొక్క కారణాన్ని తెలుసుకొని స్వయం పాస్ అయ్యేందుకు శ్రేష్ఠ స్వరూపము యొక్క రియలైజేషన్ ఉండాలి. స్వ స్థితి శ్రేష్ఠమైనది, పరిస్థితి అనేది కేవలం పేపర్ మాత్రమే - ఈ రియలైజేషన్ సహజంగా పరివర్తన తీసుకొస్తుంది మరియు సత్యమైన హృదయముతో రియలైజ్ అయినట్లయితే హృదయాభిరాముని ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి.

స్లోగన్:-

ఎవరైతే ఎవర్రెడీగా అయ్యి ప్రతి కార్యములో ‘చిత్తం ప్రభూ, నేను హాజిరై ఉన్నాను’ అని అంటారో వారే వారసులు.