06-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శ్రీమతమనుసారముగా మంచి సేవ చేసేవారికే రాజ్యము యొక్క ప్రైజ్ లభిస్తుంది, పిల్లలైన మీరు ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అయ్యారు కావున మీకు చాలా పెద్ద ప్రైజ్ లభిస్తుంది’’

ప్రశ్న:-

తండ్రి యొక్క జ్ఞాన డ్యాన్స్ ఏ పిల్లల సమ్ముఖంలో చాలా బాగా జరుగుతుంది?

జవాబు:-

ఎవరికైతే జ్ఞానం పట్ల ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే యోగము యొక్క నషా ఉంటుందో, వారి ఎదురుగా తండ్రి యొక్క జ్ఞాన డ్యాన్స్ చాలా బాగా జరుగుతుంది. విద్యార్థులు నంబరువారుగా ఉన్నారు. కానీ ఇది అద్భుతమైన స్కూల్. కొందరిలో ఏ మాత్రమూ జ్ఞానము లేదు, కేవలం భావన మాత్రమే కూర్చొని ఉంది, ఆ భావన ఆధారంగా కూడా వారసత్వానికి అధికారులుగా అవుతారు.

ఓంశాంతి

ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు, దీనిని ఆత్మిక జ్ఞానం లేక ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం ఒక్క తండ్రిలో మాత్రమే ఉంటుంది, ఇంకే మనుష్యమాత్రులలోనూ ఆత్మిక జ్ఞానం ఉండదు. ఆత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్కరే, వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. మనుష్యులు ప్రతి ఒక్కరిలోనూ తమ-తమ విశేషతలు ఉంటాయి కదా. బ్యారిస్టర్ బ్యారిస్టరే, డాక్టరు డాక్టరే. ప్రతి ఒక్కరి డ్యూటీ, పాత్ర వేర్వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆత్మకు తమ-తమ పాత్ర లభించి ఉంది మరియు ఆ పాత్ర అవినాశీ అయినది. ఆత్మ ఎంత చిన్ననిది. ఇది అద్భుతము కదా. భృకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తుంది... అని పాడుతారు కూడా. నిరాకార ఆత్మకు ఈ శరీరము సింహాసనము వంటిది అని కూడా గాయనం చేయబడుతుంది. వాస్తవానికి అది చాలా చిన్నని బిందువు, మరియు ఆత్మలందరూ పాత్రధారులు. ఒక జన్మ యొక్క రూపురేఖలు మరొక జన్మతో కలవవు, ఒక జన్మ యొక్క పాత్ర మరొక జన్మతో కలవదు. మనం గతంలో ఎలా ఉండేవారము, మళ్ళీ భవిష్యత్తులో ఎలా ఉంటాము అనేది ఎవరికీ తెలియదు. ఈ విషయాలను తండ్రే కూర్చొని సంగమంలో అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఉదయం స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు ఆరిపోయిన ఆత్మ ప్రజ్వలితమవుతూ ఉంటుంది ఎందుకంటే ఆత్మలో ఎంతో తుప్పు పట్టి ఉంది. తండ్రి కంసాలి పని కూడా చేస్తారు. పతిత ఆత్మలు ఎవరిలోనైతే మాలిన్యం చేరుతుందో, వారిని పవిత్రంగా చేస్తారు. మాలిన్యమైతే చేరుతుంది కదా. వెండి, రాగి, ఇనుము మొదలైన పేర్లు కూడా అలాగే ఉన్నాయి. స్వర్ణయుగము, వెండి యుగము... సతోప్రధానము, సతో, రజో, తమో... ఈ విషయాలను ఇంకే మనుష్యులు లేక గురువులు అర్థం చేయించరు. ఒక్క సద్గురువు మాత్రమే అర్థం చేయిస్తారు. సద్గురువు యొక్క అకాల సింహాసనం అని అంటారు కదా. ఆ సద్గురువుకు కూడా సింహాసనం కావాలి కదా. ఏ విధంగా ఆత్మలైన మీకు మీ-మీ సింహాసనాలు ఉన్నాయో, అలాగే వారు కూడా తమ సింహాసనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఏ సింహాసనాన్ని తీసుకుంటాను అనేది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వారైతే నేతి-నేతి (తెలియదు-తెలియదు), మాకు తెలియదు అని అంటూ వచ్చారు. మొదట్లో మాకు ఏమీ తెలిసేది కాదు అని పిల్లలైన మీరు కూడా భావిస్తారు. ఎవరైతే ఏమీ అర్థం చేసుకోరో, వారిని వివేకహీనులు అని అంటారు. మేము చాలా వివేకవంతులుగా ఉండేవారము, విశ్వ రాజ్యభాగ్యము మాదిగానే ఉండేది అని భారతవాసులు భావిస్తారు. ఇప్పుడు వివేకహీనులుగా అయిపోయారు. తండ్రి అంటారు - మీరు శాస్త్రాలు మొదలైనవేవి చదివి ఉన్నా సరే, వాటన్నింటినీ ఇప్పుడు మర్చిపోండి. కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి. సన్యాసుల యొక్క అనుచరులు కూడా తమ-తమ ఇళ్ళలోనే ఉంటారు. కొందరు సత్యమైన అనుచరులు ఉంటారు, వారు సన్యాసులతో పాటే ఉంటారు. మిగిలినవారు ఒక్కొక్కరూ ఒక్కో చోట ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. దీనిని జ్ఞాన డ్యాన్స్ అని అంటారు. యోగము అనేది సైలెన్స్. జ్ఞానము విషయంలో డ్యాన్స్ జరుగుతుంది. యోగములోనైతే పూర్తిగా శాంతిగా ఉండవలసి ఉంటుంది. డెడ్ సైలెన్స్ అని అంటారు కదా. 3 నిమిషాలు డెడ్ సైలెన్స్ అని అంటారు. కానీ దాని అర్థము కూడా ఎవరికీ తెలియదు. సన్యాసులు శాంతి కొరకు అడవుల్లోకి వెళ్తారు కానీ అక్కడ ఏమైనా శాంతి లభించగలదా. రాణి హారము మెడలోనే ఉంది... అని ఒక కథ కూడా ఉంది. ఈ ఉదాహరణ శాంతికి సంబంధించినదే. తండ్రి ఈ సమయంలో ఏ విషయాలనైతే అర్థం చేయిస్తారో, ఆ ఉదాహరణలు మళ్ళీ భక్తి మార్గంలో కొనసాగుతాయి. తండ్రి ఈ సమయంలో పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచముగా తయారుచేస్తారు, తమోప్రధానము నుండి సతోప్రధానముగా తయారుచేస్తారు. ఇదైతే మీరు అర్థం చేసుకోగలరు. ఇకపోతే ఈ ప్రపంచమంతా తమోప్రధానముగా, పతితముగా ఉంది ఎందుకంటే అందరూ వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు. దానిని సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము అని అంటారు. వైస్ లెస్ వరల్డ్ (నిర్వికారీ ప్రపంచము) అని అంటారు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. బాబా గురించి ఎప్పుడూ ఈ విధంగా అనరు. తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు. మనుష్యులైతే కణకణములోనూ పరమాత్మ ఉన్నారని అనేస్తారు. అందుకే తండ్రి అంటారు - భారత్ లో ఎప్పుడెప్పుడైతే ఈ విధంగా ధర్మ గ్లాని జరుగుతుందో... వారైతే కేవలం ఏదో అలా శ్లోకాలను చదువుతారు కానీ వారికి వాటి అర్థమేమీ తెలియదు. వారు - శరీరమే పతితముగా అవుతుంది, ఆత్మ అలా అవ్వదు అని అనుకుంటారు.

తండ్రి అంటారు - మొదట ఆత్మ పతితముగా అయ్యింది, అందుకే శరీరము కూడా పతితముగా అయ్యింది. బంగారములోనే మాలిన్యం కలుస్తుంది, అందుకే నగ కూడా ఆ విధంగా అవుతుంది. కానీ అదంతా భక్తి మార్గానికి చెందినది. ప్రతి ఒక్కరిలో ఆత్మ విరాజమానమై ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. జీవాత్మ అని కూడా అంటారు. జీవ పరమాత్మ అని అనరు. మహాన్ ఆత్మ అని అంటారు, మహాన్ పరమాత్మ అని అనరు. ఆత్మయే భిన్న-భిన్న శరీరాలను తీసుకొని పాత్రను అభినయిస్తుంది. యోగము అంటే పూర్తి సైలెన్స్. ఇదేమో జ్ఞాన డ్యాన్స్. ఎవరైతే అభిరుచి కలిగి ఉంటారో, తండ్రి యొక్క జ్ఞాన డ్యాన్స్ కూడా వారి ముందే జరుగుతుంది. ఎవరిలో ఎంత జ్ఞానం ఉంది, ఎంతగా వారిలో యోగము యొక్క నషా ఉంది అనేది తండ్రికి తెలుసు. టీచర్ కైతే తెలిసి ఉంటుంది కదా. అలా మంచి గుణవంతులైన పిల్లలు ఎవరెవరు అనేది తండ్రికి కూడా తెలుసు. మంచి-మంచి పిల్లలనే అక్కడికీ-ఇక్కడికీ పిలవడం జరుగుతుంది. పిల్లల్లో కూడా నంబరువారుగా ఉన్నారు. ప్రజలు కూడా నంబరువారు పురుషార్థం అనుసారముగా తయారవుతారు. ఇది స్కూలు లేక పాఠశాల కదా. పాఠశాలలో ఎల్లప్పుడూ నంబరువారుగా కూర్చుంటారు. ఫలానావారు చురుకైనవారు, వీరు మధ్యస్థంగా ఉన్నారు అని అర్థం చేసుకోగలరు. ఇక్కడైతే ఇది అనంతమైన క్లాస్, ఇక్కడ ఎవరినీ నంబరువారుగా కూర్చోబెట్టలేరు. బాబాకు తెలుసు - నా ముందు వీరెవరైతే కూర్చుని ఉన్నారో, వీరిలో ఏ మాత్రమూ జ్ఞానము లేదు, కేవలం భావన మాత్రమే ఉంది. అంతేకానీ జ్ఞానమూ లేదు, స్మృతీ లేదు. వీరు బాబా, వీరి నుండి మేము వారసత్వాన్ని తీసుకోవాలి అన్నంత నిశ్చయమైతే ఉంది. వారసత్వమైతే అందరికీ లభించనున్నది. కానీ రాజ్యంలోనైతే నంబరువారు పదవులు ఉంటాయి. ఎవరైతే చాలా మంచి సేవను చేస్తారో, వారికి చాలా మంచి ప్రైజ్ లభిస్తుంది. ఇక్కడ అందరికీ ప్రైజ్ లు ఇస్తూ ఉంటారు, ఎవరైతే సలహాలను ఇస్తారో, చాలా కష్టపడతారో, వారికి ప్రైజ్ లభిస్తుంది. విశ్వములో సత్యమైన శాంతి ఎలా ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అన్నారు, వారిని అడిగి చూడండి కదా - అసలు విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేది? దాని గురించి ఎప్పుడైనా విన్నారా లేక చూసారా? ఏ రకమైన శాంతిని కోరుకుంటున్నారు? అది ఎప్పుడు ఉండేది? మీరు ప్రశ్నలను అడగవచ్చు ఎందుకంటే మీకు తెలుసు. ఎవరైతే ప్రశ్నలను అడుగుతారో వారికి జవాబు తెలియకపోతే వారిని ఏమంటారు? ఏ రకమైన శాంతిని కోరుకుంటున్నారు? అని మీరు వార్తాపత్రికల ద్వారా ప్రశ్నించండి. శాంతిధామమైతే ఉంది, అక్కడ ఆత్మలమైన మనమందరమూ ఉంటాము. తండ్రి అంటారు - ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చేయండి, ఇంకొకటి సుఖధామాన్ని స్మృతి చేయండి. సృష్టి చక్రం యొక్క పూర్తి జ్ఞానం లేని కారణంగా ఎన్ని ప్రగల్భాలు పలికారు.

మనం డబుల్ కిరీటధారులుగా అవుతాము అని పిల్లలైన మీకు తెలుసు. మనం దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ మనుష్యులుగా అయ్యాము. దేవతలను దేవతలనే అంటారు, మనుష్యులు అని అనరు, ఎందుకంటే వారు దైవీ గుణాలు కలవారు కదా. ఎవరిలోనైతే అవగుణాలు ఉన్నాయో, వారు - నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు అని అంటారు. శాస్త్రాలలో ఏ విషయాలనైతే విన్నారో, వాటిని కేవలం - అచ్యుతం కేశవం... అని అంటూ పాడుతూ ఉంటారు. చిలుకకు నేర్పించినట్లుగా పాడుతారు. వారంటారు - బాబా, మీరు వచ్చి మమ్మల్ని అందరినీ పావనంగా తయారుచేయండి. బ్రహ్మలోకాన్ని వాస్తవానికి ప్రపంచము అని అనరు. అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు. వాస్తవానికి పాత్రను అభినయించే ప్రపంచము ఇదే. అది శాంతిధామము. తండ్రి అర్థం చేయిస్తారు, నేను కూర్చుని పిల్లలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను. ఎవరికైతే తమ జన్మల గురించే తెలియదో, వారిలోకే నేను వస్తాను. వీరు కూడా ఇప్పుడే వింటారు. నేను వీరిలోకి ప్రవేశిస్తాను. ఇది పాత పతిత ప్రపంచము, రావణుడి ప్రపంచము. ఎవరైతే నంబరువన్ పావనంగా ఉండేవారో, వారే మళ్ళీ చివరి నంబరులో పతితంగా అయ్యారు. వారిని నా రథముగా చేసుకుంటాను. వారే ఫస్ట్ నుండి లాస్ట్ లోకి వచ్చారు, మళ్ళీ ఫస్ట్ లోకి వెళ్ళాలి. బ్రహ్మా ద్వారా నేను ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను అని చిత్రములో కూడా అర్థం చేయించారు. నేను దేవీ-దేవతా ధర్మంలోకి వస్తాను అని అయితే వారు అనరు కదా. ఏ శరీరములోకైతే వచ్చి కూర్చుంటారో, వారే మళ్ళీ వెళ్ళి నారాయణునిగా అవుతారు. విష్ణువు అంటే ఇంకెవ్వరో కాదు, లక్ష్మీ-నారాయణులు లేక రాధ-కృష్ణుల జోడి. విష్ణువు అంటే ఎవరు - ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటారు - నేను మీకు వేద-శాస్త్రాలు, అన్ని చిత్రాలు మొదలైనవాటి రహస్యాన్ని అర్థం చేయిస్తాను. నేను ఎవరిలోకైతే ప్రవేశిస్తానో, వారే మళ్ళీ ఈ విధంగా అవుతారు. ప్రవృత్తి మార్గం కదా. ఈ బ్రహ్మా-సరస్వతులే మళ్ళీ ఆ విధంగా (లక్ష్మీ-నారాయణులుగా) అవుతారు. వీరిలోకి (బ్రహ్మాలోకి) నేను ప్రవేశించి బ్రాహ్మణులకు జ్ఞానాన్ని ఇస్తాను. అంటే ఈ బ్రహ్మా కూడా వింటారు. వీరు ఫస్ట్ నంబరులో వింటారు. వీరు పెద్ద నది, బ్రహ్మపుత్ర. మేళా కూడా సాగరము మరియు బ్రహ్మపుత్ర నది వద్ద జరుగుతుంది. పెద్ద మేళా జరుగుతుంది, అక్కడ సాగరము మరియు నది యొక్క సంగమము జరుగుతుంది. నేను వీరిలోకి ప్రవేశిస్తాను. వీరి ఆ విధంగా తయారవుతారు. వీరికి ఆ విధంగా (బ్రహ్మా నుండి విష్ణువుగా) అవ్వడానికి ఒక్క క్షణము పడుతుంది. సాక్షాత్కారము జరుగుతుంది, దానితో వెంటనే నిశ్చయం ఏర్పడుతుంది - నేను ఈ విధంగా అవ్వనున్నాను. నేను విశ్వాధిపతిగా అవ్వనున్నాను. ఇక ఈ గాడిద చాకిరీని ఏమి చేస్తాను? అంతా వదిలేసారు. బాబా వచ్చి ఉన్నారని, ఈ ప్రపంచం ఇక అంతమవ్వనున్నదని మీకు కూడా మొదటే తెలిసింది, కావున వెంటనే పరుగుపెట్టి వచ్చారు, అంతేకానీ బాబా ఎత్తుకురాలేదు. అవును, భట్టీ జరుగవలసి ఉంది. శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయారు అని అంటారు. అచ్ఛా, కృష్ణుడు ఎత్తుకుపోయినా వారు పట్టపురాణులుగానే చేసారు కదా. కావున ఈ జ్ఞానం ద్వారా విశ్వ మహారాజు-మహారాణులుగా అవుతారు. ఇది మంచిదే కదా. ఇందులో నిందలు పడవలసిన అవసరం లేదు. ఇంకా ఎప్పుడైతే కళంకాలు మోపబడతాయో అప్పుడే కళంగీధరులుగా అవుతారు అని కూడా అంటారు. శివబాబాపైనే కళంకాలు మోపబడతాయి. ఎంతగా గ్లాని చేస్తారు. ఆత్మ అయిన మనమే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేస్తారు. కానీ ఆ విధంగా ఉండదు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మలమైన మనము ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము. బ్రాహ్మణులు అందరికన్నా ఉన్నతమైన కులం వారు. వారిని వంశము అని అనరు. వంశము అనగా అందులో రాజ్యం ఉంటుంది. ఇది మీ కులము. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వనున్నాము, అందుకే దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయాలి. సిగరెట్, బీడీ మొదలైనవాటిని దేవతలకు నైవేద్యం పెడతారా? శ్రీనాథ్ ద్వారములో నేతి వంటలు ఎన్నో తయారవుతాయి. నైవేద్యం ఎంత పెడతారంటే ఇక దానిని ఒక దుకాణంగా పెట్టేస్తారు. యాత్రికులు వెళ్ళి తీసుకుంటారు. మనుష్యులకెంతో భావన ఉంటుంది. సత్యయుగములో ఇటువంటి విషయాలేవీ ఉండవు. వస్తువులను పాడు చేసే విధంగా ఇటువంటి ఈగలు మొదలైనవేవీ ఉండవు. ఇటువంటి రోగాలు మొదలైనవేవీ అక్కడ ఉండవు. గొప్ప వ్యక్తుల వద్ద శుభ్రత కూడా ఎంతగానో ఉంటుంది. అక్కడైతే అసలు ఇటువంటి విషయాలే ఉండవు. రోగాలు మొదలైనవేవీ ఉండవు. ఈ రోగాలన్నీ ద్వాపరము నుండి వెలువడతాయి. తండ్రి వచ్చి మిమ్మల్ని సదా ఆరోగ్యవంతులుగా తయారుచేస్తారు. మీరు తండ్రిని స్మృతి చేసే పురుషార్థాన్ని చేస్తారు, తద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు, ఆయువు కూడా పెరుగుతుంది. ఇది నిన్నటి విషయమే. 150 సంవత్సరాల ఆయువు ఉండేది కదా. ఇప్పుడైతే ఆయువు సగటున 40-45 సంవత్సరాలు ఉంటుంది, ఎందుకంటే వారు యోగులుగా ఉండేవారు, వీరు భోగులుగా ఉన్నారు.

మీరు రాజయోగులు, రాజఋషులు, అందుకే మీరు పవిత్రముగా ఉన్నారు. కానీ ఇది పురుషోత్తమ సంగమయుగము, ఇది ఒక మాసము లేక సంవత్సరము కాదు. తండ్రి అంటారు - నేను కల్పకల్పమూ పురుషోత్తమ సంగమయుగములోనే వస్తాను. తండ్రి ప్రతిరోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా మళ్ళీ చెప్తారు - ఒక్క విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి, పావనంగా అవ్వాలంటే నన్ను స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ ధర్మాలన్నింటినీ త్యజించండి. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి. నేను మీ ఆత్మను శుభ్రం చేయడానికి వచ్చాను, తద్వారా శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇక్కడైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఆత్మ ఎప్పుడైతే సంపూర్ణ పవిత్రముగా అవుతుందో, అప్పుడు మీరు పాత చెప్పును వదిలివేస్తారు. మళ్ళీ కొత్తది లభిస్తుంది. వందేమాతరం అని మీకు గాయనం ఉంది. మీరు ధరిత్రిని కూడా పవిత్రముగా తయారుచేస్తారు. మాతలైన మీరు స్వర్గ ద్వారాలను తెరుస్తారు కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మ రూపీ జ్యోతిని ప్రజ్వలితం చేయడానికి ఉదయముదయమే స్మృతి యాత్రలో కూర్చోవాలి. స్మృతి ద్వారానే తుప్పు తొలగుతుంది. ఆత్మలో ఏ మాలిన్యమైతే కలిసిందో, దానిని స్మృతి ద్వారా తొలగించి సత్యమైన బంగారముగా అవ్వాలి.

2. తండ్రి నుండి ఉన్నత పదవి యొక్క ప్రైజ్ ను తీసుకునేందుకు భావనతో పాటుగా జ్ఞానవంతులుగా మరియు గుణవంతులుగా కూడా అవ్వాలి. సేవ చేసి చూపించాలి.

వరదానము:-

నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రతా అలంకారము యొక్క మెరుపును చూపించే అలంకార మూర్త భవ

పవిత్రత బ్రాహ్మణ జీవితము యొక్క అలంకారము. నిత్యం ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరులకు పవిత్రతా అలంకారము యొక్క అనుభూతి కలగాలి. దృష్టిలో, ముఖములో, చేతులలో, పాదాలలో సదా పవిత్రతా అలంకారము ప్రత్యక్షమవ్వాలి. వీరి ఫీచర్స్ ద్వారా పవిత్రత కనిపిస్తుంది, వీరి నయనాలలో పవిత్రతా మెరుపు ఉంది, వీరి ముఖముపై పవిత్రతా చిరునవ్వు ఉంది అని ప్రతి ఒక్కరూ వర్ణించాలి. వారికి ఇంకే విషయాలూ కనిపించకూడదు, ఇటువంటివారినే - పవిత్రతా అలంకారముతో అలంకరించబడిన మూర్తి అని అంటారు.

స్లోగన్:-

వ్యర్థ సంబంధ-సంపర్కాలు కూడా అకౌంట్ ను ఖాళీ చేస్తాయి, అందుకే వ్యర్థాన్ని సమాప్తము చెయ్యండి.