07-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఆత్మాభిమానము విశ్వానికి యజమానులుగా తయారుచేస్తుంది, దేహాభిమానము నిరుపేదలుగా చేస్తుంది, అందుకే ఆత్మాభిమానీ భవ

ప్రశ్న:-

ఏ అభ్యాసము అశరీరిగా అవ్వడంలో ఎంతో సహాయం చేస్తుంది?

జవాబు:-

స్వయాన్ని సదా పాత్రధారిగా భావించండి, ఏ విధంగా పాత్రధారి పాత్ర పూర్తి అవుతూనే ఆ వస్త్రాన్ని తీసేస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా ఈ అభ్యాసాన్ని చేయాలి, కర్మ పూర్తి అవుతూనే పాత వస్త్రాన్ని (శరీరాన్ని) వదిలి అశరీరిగా అయిపోండి. ఆత్మ-ఆత్మ సోదరులు, ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇదే పావనంగా అయ్యేందుకు సహజ సాధనము. శరీరాన్ని చూడడం ద్వారా అశుద్ధమైన ఆలోచనలు కలుగుతాయి, అందుకే అశరీరీ భవ.

ఓంశాంతి

తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఎందుకంటే చాలా బుద్ధిహీనులుగా అయిపోయారు. 5,000 సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించాను మరియు దైవీ కర్మలను కూడా నేర్పించాను. మీరు దేవీ-దేవతా ధర్మంలోకి వచ్చారు, ఆ తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మరియు కళలు తగ్గుతూ-తగ్గుతూ ఇక్కడ ప్రాక్టికల్ గా, పూర్తిగా కళారహితముగా అయిపోయారు, ఎందుకంటే ఇది ఉన్నదే తమోప్రధాన రావణ రాజ్యం. ఈ రావణ రాజ్యం కూడా మొదట సతోప్రధానంగా ఉండేది, ఆ తర్వాత సతో, రజో, తమోగా అయ్యింది. ఇప్పుడైతే పూర్తిగా తమోప్రధానంగా ఉంది. ఇప్పుడు ఇది దీని అంతిమము. రావణ రాజ్యాన్ని అసురీ రాజ్యం అని అంటారు. రావణుడిని కాల్చే ఫ్యాషన్ భారత్ లోనే ఉంది. రామ రాజ్యం మరియు రావణ రాజ్యం అని కూడా భారతవాసులే అంటారు. రామ రాజ్యం సత్యయుగంలోనే ఉంటుంది. రావణ రాజ్యం కలియుగంలో ఉంది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబాకు ఆశ్చర్యమనిపిస్తుంది - మంచి, మంచి పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా తమ భాగ్యానికి అడ్డు గీతను గీసుకుంటారు. రావణుడి అవగుణాలు అతుక్కుంటాయి. దైవీ గుణాలను గురించి వారు స్వయం కూడా వర్ణన చేస్తారు. తండ్రి అర్థం చేయించారు - మీరే ఆ దేవతలు, మీరే 84 జన్మలను అనుభవించారు, మీరు తమోప్రధానంగా ఎందుకు అయ్యారో ఆ తేడాను తెలియజేయడం జరిగింది. ఇది రావణ రాజ్యం. రావణుడు అందరికన్నా పెద్ద శత్రువు, అతడే భారత్ ను ఇంత నిరుపేదగా, తమోప్రధానంగా తయారుచేశాడు. రామరాజ్యంలో ఇంతమంది మనుష్యులు ఉండరు. అక్కడైతే ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడైతే అందరిలోనూ భూతాలు ప్రవేశించి ఉన్నాయి. క్రోధం, లోభం, మోహం అనే భూతాలు ఉన్నాయి కదా. మనము అవినాశీ, ఈ శరీరము వినాశీ - ఇది మర్చిపోతారు. ఆత్మాభిమానులుగా అవ్వనే అవ్వరు. ఎంతో దేహాభిమానులుగా ఉన్నారు. దేహాభిమానానికి మరియు ఆత్మాభిమానానికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఆత్మాభిమానులైన దేవీ-దేవతలు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. దేహాభిమానం ఉన్నట్లయితే నిరుపేదలుగా అవుతారు. భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది. అలా అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. శివబాబా దైవీ బుద్ధిని తయారుచేయడానికి వస్తారు. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలూ, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను, ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వీరికి రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు అన్నది ఎప్పుడైనా విన్నారా? వారు ఎటువంటి కర్మలను చేసిన కారణంగా వారు అంతటి ఉన్నత పదవిని పొందారు? ఇది కర్మల విషయం కదా. మనుష్యులు అసురీ కర్మలు చేస్తే ఆ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ కర్మల ఖాతా ఉండదు. తండ్రి అర్థం చేయిస్తారు కానీ అర్థం చేసుకోని కారణంగా ఎన్నో విఘ్నాలను కలిగిస్తారు. శివ శంకరులు ఒక్కరే అని అంటారు. అరే, నిరాకారుడైన శివుడిని ఒంటరిగా చూపిస్తారు, శంకర పార్వతులను కలిపి చూపిస్తారు, వీరిరువురి పాత్రలు పూర్తిగా వేరు. మినిస్టర్ మరియు ప్రెసిడెంటును ఒక్కరే అని ఎలా అనగలరు. ఇరువురి పదవి పూర్తిగా వేరు, మరి శివ శంకరులను ఒక్కరే అని ఎలా అనేస్తారు. ఎవరైతే రామ సాంప్రదాయంలోకి వచ్చేది లేదో వారు వీటిని అర్థం చేసుకోరు కూడా అని మీకు తెలుసు. అసురీ సాంప్రదాయులు నిందిస్తారు, విఘ్నాలను కలిగిస్తారు ఎందుకంటే వారిలో పంచ వికారాలు ఉన్నాయి కదా. దేవతలు సంపూర్ణ నిర్వికారులు. వారికి ఎంతటి ఉన్నత పదవి ఉంది. మీరు ఎంత వికారులుగా ఉండేవారు అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. సన్యాసులు కూడా వికారాల ద్వారానే జన్మ తీసుకోవలసి ఉంటుంది, ఆ తర్వాత సన్యాసం తీసుకుంటారు. సత్యయుగంలో ఈ విషయాలేవీ ఉండవు. సన్యాసులు సత్యయుగాన్ని అర్థం చేసుకోరు కూడా. సత్యయుగము ఉండనే ఉంది కదా అని అనేస్తారు. ఏ విధంగా శ్రీకృష్ణుడు అంతటా హాజరై ఉన్నారు, రాధే కూడా అంతటా హాజరై ఉన్నారు అని అంటారు కదా. అనేక మత మతాంతరాలు ఉన్నాయి, అనేక ధర్మాలు ఉన్నాయి. అర్ధకల్పం దైవీ మతము నడుస్తుంది, అది ఇప్పుడు మీకు లభిస్తోంది. మీరే బ్రహ్మా ముఖవంశావళులుగా, ఆ తర్వాత విష్ణు వంశీయులుగా, ఆ తర్వాత చంద్ర వంశీయులుగా అవుతారు. ఆ రెండింటినీ వంశావళులు అని అంటారు, ఈ ఒక్కదానిని బ్రాహ్మణ కులము అని అంటారు, దీనిని వంశము అని అనరు ఎందుకంటే దీనికి రాజ్యం ఉండదు. ఇది కూడా మీరే అర్థం చేసుకుంటారు. మీలో కూడా కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు ఏమాత్రమూ బాగుపడరు, ఏదో ఒక భూతము ఉంటుంది. లోభము యొక్క భూతము, క్రోధము యొక్క భూతము ఉన్నాయి కదా. సత్యయుగంలో ఏ భూతాలూ ఉండవు. సత్యయుగంలో దేవతలు ఉంటారు, వారు చాలా సుఖంగా ఉంటారు. భూతాలే దుఃఖాన్ని ఇస్తాయి, కామము యొక్క భూతము ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. ఇందులో ఎంతగానో కష్టపడాలి. ఇది సామాన్యమైన విషయమేమీ కాదు. సోదరీ, సోదరులుగా భావించండి, అప్పుడు అశుద్ధమైన దృష్టి కలగకుండా ఉంటుంది అని తండ్రి చెప్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ధైర్యం కావాలి. పెళ్ళి చేసుకోకపోతే ఇంటి నుండి బైటకు వెళ్ళిపో అని కొందరు అంటారు, అప్పుడు ధైర్యం కావాలి. తమను తాము పరిశీలించుకోవడం కూడా జరుగుతుంది.

పిల్లలైన మీరు ఎంతో పదమాపదమ భాగ్యశాలురుగా అవుతున్నారు. ఇదంతా అంతమైపోతుంది. అంతా మట్టిలో కలిసిపోనున్నది. కొందరైతే మంచి ధైర్యాన్ని ఉంచి ముందుకు వెళ్తారు, కొందరేమో ధైర్యాన్ని ఉంచి మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. తండ్రి ప్రతి విషయంలోనూ అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ చేయకపోతే పూర్తి యోగం లేదని భావించడం జరుగుతుంది. భారత్ యొక్క ప్రాచీన రాజయోగం ప్రసిద్ధమైనది. ఈ యోగముతోనే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. చదువు సంపాదనకు ఆధారము. చదువు ద్వారానే మీరు నంబరువారుగా ఉన్నత పదవిని పొందుతారు. సోదరీ, సోదరుల సంబంధంలో కూడా బుద్ధి చంచలమవుతుంది, అందుకే తండ్రి అంతకన్నా ఉన్నతంగా తీసుకువెళ్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇతరులను కూడా సోదర ఆత్మగా భావించండి. మనమందరము సోదరులము అన్నప్పుడు ఇక వేరే దృష్టి ఏదీ ఉండదు. శరీరాన్ని చూడడం వలన అశుద్ధమైన ఆలోచనలు వస్తాయి. తండ్రి అంటారు - పిల్లలూ, అశరీరీ భవ, దేహీ-అభిమానీ భవ. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశీ. శరీరముతో పాత్రను అభినయించిన తర్వాత మళ్ళీ శరీరము నుండి వేరైపోవాలి. ఆ పాత్రధారులు పాత్రను పూర్తి చేసి వస్త్రాలను మార్చివేస్తారు. మీరు కూడా ఇప్పుడు పాత వస్త్రాన్ని (శరీరాన్ని) వదిలి కొత్త వస్త్రాన్ని ధరించాలి. ఈ సమయంలో ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది, శరీరము కూడా తమోప్రధానంగా ఉంది. తమోప్రధాన ఆత్మ ముక్తిలోకి వెళ్ళలేదు. ఎప్పుడైతే పవిత్రముగా అవుతుందో అప్పుడే వెళ్ళగలుగుతుంది. అపవిత్రమైన ఆత్మ తిరిగి వెళ్ళలేదు. ఫలానావారు బ్రహ్మములో లీనమయ్యారు అని అసత్యము చెప్తారు. అలా ఒక్కరు కూడా వెళ్ళలేరు. అక్కడ వంశవృక్షము తయారుచేయబడి ఉన్నట్లు ఉంటుంది, అది అలాగే ఉంటుంది. ఇది బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. గీతలో బ్రాహ్మణుల పేరును ఏమీ చూపించలేదు. ప్రజాపిత బ్రహ్మా తనువులోకి ప్రవేశిస్తాను కావున తప్పకుండా దత్తత తీసుకోవడం జరగాలి అని అర్థం చేయిస్తారు. ఆ బ్రాహ్మణులు వికారులు, మీరు నిర్వికారులు. నిర్వికారులుగా అవ్వడంలో ఎన్నో అత్యాచారాలను సహించవలసి ఉంటుంది. ఈ నామ-రూపాలను చూడడం ద్వారా అనేకులకు వికల్పాలు వస్తాయి. సోదరీ-సోదరుల సంబంధంలో కూడా కింద పడిపోతారు. బాబా, మేము పడిపోయాము, నల్ల ముఖము చేసుకున్నాము అని వ్రాస్తారు. బాబా అంటారు - ఓహో! నేను సోదరీ-సోదరులుగా అయి ఉండమని చెప్తే మీరు ఈ చెడ్డ పనిని చేశారా. దానికి చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. ఆ మాటకొస్తే ఎవరైనా ఎవరినైనా పాడు చేస్తే వారిని జైల్లో వేయడం జరుగుతుంది. నేను స్థాపించిన భారత్ ఎంత పవిత్రంగా ఉండేది. దాని పేరే శివాలయం. ఈ జ్ఞానం కూడా ఎవరిలోనూ లేదు. ఇకపోతే శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ భక్తి మార్గపు కర్మకాండలు. సత్యయుగంలో అందరూ సద్గతిలో ఉంటారు, అందుకే అక్కడ ఏ పురుషార్థము చేయరు. ఇక్కడ అందరూ గతి, సద్గతుల కొరకు పురుషార్థం చేస్తారు ఎందుకంటే దుర్గతిలో ఉన్నారు. గంగా స్నానం చేయడానికి వెళ్తారు, మరి ఆ గంగ నీరు ఏమైనా సద్గతిని ఇస్తుందా? అదేమైనా పావనంగా తయారుచేస్తుందా? ఏమీ తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఎవరైతే స్వయమే అర్థం చేసుకోరో, వారు ఇతరులకు ఏమి అర్థం చేయించగలరు, అందుకే బాబా పంపించరు. బాబా, మీరు వస్తే మీ శ్రీమతంపై నడుస్తూ దేవతలుగా అవుతాము అని గానం చేస్తూ ఉంటారు. దేవతలు సత్య, త్రేతాయుగాలలో ఉంటారు. ఇక్కడైతే అన్నింటికన్నా ఎక్కువగా కామ వికారములో చిక్కుకొని ఉన్నారు. కామ వికారము లేకుండా ఉండలేకపోతారు. ఈ వికారము మాతా-పితల వారసత్వము వంటిది. ఇక్కడ మీకు రాముని వారసత్వం లభిస్తుంది. పవిత్రతా వారసత్వం లభిస్తుంది. అక్కడ వికారాల విషయం ఉండదు.

భక్తులు శ్రీకృష్ణుడు భగవంతుడు అని అంటారు. మీరు వారిని 84 జన్మలలో చూపిస్తారు. అరే, భగవంతుడైతే నిరాకారుడు. వారి పేరు శివ. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. వారికి దయ కూడా కలుగుతుంది. వారు దయార్ద్ర హృదయుడు కదా. వీరు ఎంత మంచి వివేకవంతులైన పిల్లలు. వీరి హుందాతనము కూడా బాగుంది. ఎవరిలోనైతే జ్ఞానం మరియు యోగం యొక్క శక్తి ఉంటుందో వారు ఆకర్షిస్తారు. బాగా చదువుకున్నవారికి గౌరవము మంచిగా లభిస్తుంది. చదువుకోనివారికి గౌరవము లభించదు. ఈ సమయంలో అందరూ అసురీ సాంప్రదాయులుగా ఉన్నారని మీకు తెలుసు. ఏమీ అర్థం చేసుకోరు. శివుడు మరియు శంకరుడి మధ్యన వ్యత్యాసము పూర్తిగా స్పష్టంగా ఉంది. వారు మూలవతనంలో ఉన్నారు, వీరు సూక్ష్మవతనంలో ఉన్నారు, అందరూ ఒక్కటే ఎలా అవ్వగలరు? ఇది తమోప్రధాన ప్రపంచము. రావణుడు అసురీ సాంప్రదాయపు శత్రువు, అతడు తన సమానంగా తయారుచేస్తాడు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తమ సమానంగా, దైవీ సాంప్రదాయులుగా తయారుచేస్తారు. అక్కడ రావణుడు ఉండడు, అర్ధకల్పము అతడిని కాలుస్తారు. రామ రాజ్యం సత్యయుగంలోనే ఉంటుంది. గాంధీజీ రామ రాజ్యాన్ని కోరుకునేవారు కానీ వారు రామ రాజ్యాన్ని ఎలా స్థాపించగలరు? వారేమో ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణను ఇచ్చేవారు కాదు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రే సంగమయుగంలో అంటారు. ఇది ఉత్తములుగా తయారయ్యే యుగము. తండ్రి ఎంత ప్రేమగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఘడియ, ఘడియ ఎంత ప్రేమగా ఆ తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీది అద్భుతము, మేము ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉండేవారము, మీరు మమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారుచేస్తున్నారు! మీ మతముపై తప్ప మేము ఇంకెవ్వరి మతముపైనా నడవము. చివరిలో అందరూ అంటారు - బ్రహ్మాకుమార, కుమారీలు దైవీ మతముపై నడుస్తున్నారు, వారు ఎంత మంచి-మంచి మాటలను వినిపిస్తారు, ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు, క్యారెక్టర్ ను తీర్చిదిద్దుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దృష్టిని శుద్ధముగా, పవిత్రముగా తయారుచేసుకునేందుకు ఎవరి నామ-రూపాలను చూడకుండా అశరీరులుగా అయ్యే అభ్యాసమును చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మా సోదరునితో మాట్లాడాలి.

2. సర్వుల గౌరవాన్ని పొందేందుకు జ్ఞాన-యోగాల శక్తిని ధారణ చేయాలి. దైవీ గుణాలతో సంపన్నంగా అవ్వాలి. క్యారెక్టర్ ను తీర్చిదిద్దే సేవను చేయాలి.

వరదానము:-

అనారోగ్యపు కాన్షస్ గా అయ్యేందుకు (అనారోగ్యము యొక్క స్మృతిలో ఉండేందుకు) బదులుగా సంతోషంగా లెక్కాచారాలను సమాప్తము చేసుకొనే సోల్ కాన్షస్ (ఆత్మాభిమాని) భవ

శరీరమైతే అందరిదీ పాతగానే ఉంది. ప్రతి ఒక్కరికీ చిన్నదో పెద్దదో ఏదో ఒక అనారోగ్యము ఉంది. కానీ తనువు ప్రభావము ఒకవేళ మనసుపై వచ్చిందంటే డబుల్ అనారోగ్యులుగా అయ్యి అనారోగ్యపు కాన్షస్ గా అయిపోతారు. అందుకే మనసులో ఎప్పుడూ అనారోగ్యపు సంకల్పము రాకూడదు, అప్పుడే సోల్ కాన్షస్ (ఆత్మాభిమాని) అని అంటారు. అనారోగ్యము కారణంగా ఎప్పుడూ గాభరాపడకండి. కాస్త మెడిసిన్ అనే ఫ్రూట్ ను తిని దానికి వీడ్కోలును ఇచ్చెయ్యండి. అలా సంతోషంగా లెక్కాచారాలను సమాప్తము చేసుకోండి.

స్లోగన్:-

ప్రతి గుణాన్ని, ప్రతి శక్తిని అనుభవము చెయ్యటము అనగా అనుభవీమూర్తులుగా అవ్వటము.