09-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - శివజయంతి సందర్భంగా మీరు చాలా వైభవంగా నిరాకారుడైన తండ్రి చరిత్రను అందరికీ వినిపించండి, ఈ శివ జయంతియే వజ్రతుల్యమైనది

ప్రశ్న:-

బ్రాహ్మణులైన మీ సత్యమైన దీపావళి ఎప్పుడు ఉంటుంది మరియు ఎలా?

జవాబు:-

వాస్తవానికి శివ జయంతియే మీ కొరకు సత్యాతి-సత్యమైన దీపావళి ఎందుకంటే శివబాబా వచ్చి ఆత్మా రూపీ దీపమైన మిమ్మల్ని వెలిగిస్తారు. ప్రతి ఒక్కరి ఇంటిలో దీపము వెలుగుతుంది అనగా ఆత్మ జ్యోతి వెలుగుతుంది. వారు స్థూలమైన దీపాలను వెలిగిస్తారు కానీ మీ సత్యమైన దీపము శివబాబా రావడం ద్వారా వెలుగుతుంది, అందుకే మీరు ఎంతో వైభవంగా శివజయంతిని జరుపుకోండి.

ఓంశాంతి

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు శివుని జయంతిని జరుపుకుంటారు మరియు భారత్ లోనైతే శివ జయంతిని తప్పకుండా జరుపుకుంటారు. ఒక్కరి జయంతినే జరుపుకోవడం జరుగుతుంది, మళ్ళీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు సర్వవ్యాపి అయినవారి యొక్క జయంతి అయితే ఉండదు. జయంతిని ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది? గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు. శివ జయంతినైతే తప్పకుండా జరుపుకుంటారు. ఆర్య సమాజం వారు కూడా జరుపుకుంటారు. ఇప్పుడు మీరు (2024లో) 88వ జయంతిని జరుపుకుంటారు అనగా వారు జన్మించి 88 సంవత్సరాలయ్యింది అని అర్థం. జన్మదినమైతే అందరికీ గుర్తుంటుంది, ఫలానా రోజున వీరు గర్భం నుండి బయటకు వచ్చారు అని అంటారు. ఇప్పుడు మీరు శివబాబా యొక్క 88వ జయంతిని జరుపుతారు. వారు నిరాకారుడు, వారికి జయంతి ఎలా ఉంటుంది. ఎంతో పెద్ద-పెద్ద వ్యక్తుల వద్దకు ఆహ్వానపత్రికలు వెళ్తాయి. ఎవరో ఒకరు అడగాలి కదా - మీరు జయంతిని ఎలా జరుపుతారు? వారు జన్మను ఎప్పుడు మరియు ఎలా తీసుకున్నారు? ఆ తర్వాత వారికి శారీరక పేరు ఏం పెట్టారు? కానీ ఎటువంటి రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే, అసలు ఎప్పుడూ అడగరు. మీరు వారికి తెలియజేయవచ్చు - వారు నిరాకారుడు, వారి పేరు శివ. మీరు సాలిగ్రామములైన పిల్లలు. ఈ శరీరములో సాలిగ్రామము ఉందని మీకు తెలుసు. శరీరానికే పేరు ఉంటుంది. వారు పరమాత్మ అయిన శివుడు. ఇప్పుడు మీరు ఎంత వైభవంగా కార్యక్రమాలను చేస్తారు. శివబాబా ఈ బ్రహ్మా తనువులోకి ప్రవేశించినప్పుడు, అదే వారి జయంతిగా గాయనం చేయబడుతుందని రోజురోజుకు మీరు వైభవంగా అర్థం చేయిస్తూ ఉంటారు. వారికి తిథి, తారీఖు ఏమీ ఉండదు. నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను అని అంటారు. కానీ ఎప్పుడు, ఏ ఘడియ అనేది చెప్పరు. తిథి, తారీఖు, రోజు మొదలైనవి చెప్తే ఫలానా తారీఖు అని అనవచ్చు. వీరికి జన్మపత్రి మొదలైనవి ఉండవు. వాస్తవానికి అందరికన్నా ఉన్నతమైన జన్మపత్రి అయితే వీరిదే. వీరి కర్తవ్యము కూడా అన్నింటికన్నా ఉన్నతమైనది. ప్రభూ, నీ మహిమ అపారమైనది అని అంటారు. అంటే తప్పకుండా వారు ఏదో చేస్తూ ఉండవచ్చు అని అర్థము. మహిమ అయితే అనేకులకు గాయనం చేయడం జరుగుతుంది. నెహ్రూ, గాంధీ మొదలైనవారందరి మహిమను గానం చేస్తారు. వీరి మహిమను గురించి ఎవ్వరూ తెలియజేయలేరు. వారు జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు అని మీరు అర్థం చేయిస్తారు. వారు ఒక్కరే కదా. మరి వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీరు జరుపుకున్నా అదేమిటి అని అడిగే సాహసం కూడా ఎవ్వరూ చేయరు. శివ జయంతిని జరుపుకుంటున్నారంటే, మహిమ గానం చేయబడుతుందంటే, తప్పకుండా ఎవరో ఉండి వెళ్ళారనే కదా అని అడగాలి. ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఒకవేళ గవర్నమెంట్ అంగీకరించకపోతే, మరి భక్తులు, సాధువులు, గురువుల యొక్క స్టాంపులను కూడా తయారుచేయకూడదు. ప్రభుత్వం ఎలా ఉందో, ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చరిత్రను గురించి కూడా బాగా తెలిసింది. మీకు ఎంతైతే నషా ఉంటుందో అంతటి నషా ఇంకెవ్వరికీ ఉండదు. శివ జయంతి వజ్రతుల్యమైనదని, మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవని మీరే అంటారు. తండ్రియే వచ్చి గవ్వలను వజ్రతుల్యంగా తయారుచేస్తారు. శ్రీకృష్ణుడు కూడా తండ్రి ద్వారానే అంత ఉన్నతంగా తయారయ్యారు, అందుకే వారి జన్మ వజ్రతుల్యంగా గాయనం చేయబడుతుంది. మొదట గవ్వతుల్యంగా ఉంటుంది, ఆ తర్వాత వజ్రతుల్యంగా బాబా తయారుచేసారు. ఈ విషయాల గురించి మనుష్యులకు తెలియదు. శ్రీకృష్ణుడిని ఈ విధంగా ప్రపంచ యువరాజుగా ఎవరు తయారుచేసారు? ఇది కూడా అర్థం చేయించాలి - శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుతారు. బిడ్డ అయితే మాతృ గర్భం నుండే బయటకు వచ్చాడు. అతడిని గంపలో తీసుకువెళ్ళారు. నిజానికి శ్రీకృష్ణుడు విశ్వానికి యువరాజు, కావున అతనికి భయం దేనికి? అక్కడికి కంసుడు మొదలైనవారు ఎక్కడి నుండి వచ్చారు. ఈ విషయాలన్నింటినీ శాస్త్రాలలో వ్రాసారు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేయించాలి. అర్థం చేయించే యుక్తులు చాలా బాగుండాలి. అందరూ ఒకే విధంగా చదివించలేరు. యుక్తియుక్తంగా అర్థం చేయించకపోవడం వల్ల ఇంకా డిస్సర్వీస్ జరుగుతుంది.

ఇప్పుడు శివజయంతిని జరుపుకోవడం జరుగుతుంది, కావున తప్పకుండా శివుని మహిమనే చేస్తారు. గాంధీ జయంతి నాడు గాంధీ మహిమనే చేస్తారు. వేరే ఏమీ తోచదు. ఇప్పుడు మీరు శివజయంతిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారి మహిమ, వారి బయోగ్రఫీ లేక జీవితచరిత్ర కూడా ఉంటుంది. మీరు ఆ రోజున వారి జీవిత చరిత్రనే అర్థం చేయించండి. శివ జయంతి ఎలా ప్రారంభమయ్యింది అని మనుష్యులెవ్వరూ అడగను కూడా అడగరు అని తండ్రి అంటారు. దాని గురించి వర్ణన ఏమీ లేదు. వారి మహిమ అపారమైనదిగా గాయనం చేయబడుతుంది. శివబాబాను భోళానాథుడు అంటూ ఎంతో మహిమ చేస్తారు. వారు భోళా భండారి. వారేమో శివ-శంకర అని అనేస్తారు. శంకరుడు భోళానాథుడు అని అనుకుంటారు. వాస్తవానికి భోళానాథుడు అన్నది శంకరునికి వర్తించదు. అతని విషయములో కన్ను తెరిస్తే వినాశనం జరిగింది అని అంటారు, అలాగే ఉమ్మెత్తను తింటారు అన్నట్లుగా వర్ణిస్తారు, అటువంటివారిని భోళానాథుడు అని ఎలా అనగలరు. మహిమ అయితే ఒక్కరిదే జరుగుతుంది. మీరు శివుని మందిరాలకు వెళ్ళి అర్థం చేయించాలి. అక్కడకు చాలామంది వస్తారు కావున శివుని జీవిత చరిత్రను వినిపించాలి. భోళా భండారి శివబాబా అని అంటారు. శివుడు మరియు శంకరుని భేదమును కూడా మీరే తెలియజేసారు. శివుని మందిరంలో శివుని పూజ జరుగుతుంది. కావున అక్కడకు వెళ్ళి మీరు శివుని జీవిత గాథను తెలియజేయాలి. జీవిత గాథ అన్న పదాన్ని విని - శివుని జీవిత గాథను ఎలా వినిపిస్తారు అని కొందరు ఆశ్చర్యచకితులవుతారు. కావున మనుష్యులు ఇది అద్భుతమైన విషయం అని భావించి ఎంతోమంది వస్తారు. మీరు ఇలా చెప్పండి - ఆహ్వానం అందుకొని ఎవరైతే వస్తారో వారికి మేము పరమపిత పరమాత్ముని జీవిత గాథను వినిపిస్తాము. గాంధీ మొదలైనవారి యొక్క జీవిత గాథలను కూడా వింటారు కదా. ఇప్పుడు మీరు శివుని మహిమను చేస్తారు, దానితో మనుష్యుల బుద్ధి నుండి సర్వవ్యాపి విషయము ఎగిరిపోతుంది. ఒకరి మహిమ ఇంకొకరితో కలవదు. ఇక్కడ ఏదైతే మండపాన్ని తయారుచేస్తారో లేక ప్రదర్శనీని చేస్తారో, అదేమీ శివుని మందిరము కాదు. వాస్తవానికి సత్యాతి-సత్యమైన శివుని మందిరము ఇదేనని, ఇక్కడ రచయితయే స్వయంగా కూర్చుని రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారని మీకు తెలుసు. మీరు ఇలా వ్రాయవచ్చు - రచయిత యొక్క జీవిత చరిత్రను మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని మరియు చరిత్రను వినిపిస్తాము. హిందీలో మరియు ఇంగ్లీషులో వ్రాసి ఉండాలి. పెద్ద-పెద్దవారి వద్దకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోతారు - పరమపిత పరమాత్ముని జీవిత చరిత్ర గురించి తెలియజేస్తున్న వీరు అసలు ఎవరు. మీరు కేవలం రచన గురించి మాత్రమే చెప్తే వారు అనుకుంటారు - ప్రళయం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ కొత్త రచనను రచించారు అని. కానీ అలా కాదు, తండ్రి వచ్చి పతితులను పావనంగా తయారుచేస్తారని మీరు అర్థం చేయించాలి. అప్పుడు మనుష్యులు ఆశ్చర్యపోతారు. శివుని మందిరములోకి కూడా ఎంతోమంది వస్తారు. హాలు లేక మండపము పెద్దగా ఉండాలి. మీరు ప్రభాత యాత్ర చేసినా అందులో కూడా ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని ఎవరు స్థాపన చేసారు అన్నది వారికి అర్థం చేయించాలి. సర్వాత్మలకు తండ్రి అయిన నిరాకారుడైన శివబాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. శివుని మందిరంలోకి వెళ్ళి ఏ విధంగా సేవ చేయాలి అని విచార సాగర మథనం చేయాలి. శివుని మందిరంలో ఉదయాన్నే పూజ చేస్తారు, గంటలు మొదలైనవి కూడా ఉదయమే మ్రోగుతాయి. శివబాబా కూడా ప్రభాతవేళలోనే వస్తారు. అర్ధరాత్రి వస్తారు అని అనరు. ఆ సమయంలో మీరు జ్ఞానాన్ని కూడా వినిపించలేరు ఎందుకంటే మనుష్యులు నిదురిస్తూ ఉంటారు. రాత్రివేళలో కనీసం మనుష్యులకు ఖాళీ ఉంటుంది. దీపాలు మొదలైనవి కూడా వెలుగుతూ ఉంటాయి. లైట్లు కూడా బాగా ఉండాలి. శివబాబా వచ్చి ఆత్మలైన మిమ్మల్ని మేల్కొలుపుతారు. సత్యమైన దీపావళి ఇదే. అందరి ఇళ్లలోని దీపాలు వెలుగుతాయి అనగా ఆత్మ జ్యోతి వెలుగుతుంది. వారైతే ఇళ్ళల్లో స్థూలమైన దీపాలను వెలిగిస్తారు. కానీ వాస్తవానికి దీపావళి యొక్క అర్థము ఇదే. కొందరి దీపము ఏ మాత్రమూ వెలగదు. మన దీపం ఎలా వెలుగుతుంది అనేది మీకు తెలుసు. ఎవరైనా మరణిస్తే అంధకారం ఏర్పడకూడదని దీపం వెలిగిస్తారు. కానీ మొదట ఆత్మ దీపము వెలిగితేనే అంధకారం ఉండదు. లేదంటే మనుష్యులు ఘోర అంధకారంలోనే ఉంటారు. ఆత్మ అయితే క్షణంలో ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇందులో అంధకారము మొదలైనవాటి విషయమేమీ లేదు. ఇది భక్తి మార్గపు ఆచారము. నూనె అయిపోతే దీపం ఆరిపోతుంది. అంధకారము యొక్క అర్థాన్ని కూడా ఏమీ అర్థం చేసుకోరు. పితృ భోజనాలు మొదలైనవి తినిపించే అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఇంతకుముందు ఆత్మలను పిలిచేవారు, ఏదో ఒకటి అడిగేవారు. ఇప్పుడది అంతగా నడవడం లేదు. ఇక్కడికి కూడా వస్తారు. కొన్ని సార్లు ఏదో ఒకటి చెప్తారు. మీరు సుఖంగా ఉన్నారా అని అడిగితే, హాజీ అని అంటారు. ఇక్కడి నుండి ఎవరైతే వెళ్తారో వారు తప్పకుండా మంచి ఇంట్లోనే జన్మ తీసుకుంటారు కదా. జన్మ తప్పకుండా అజ్ఞానుల ఇంటిలోనే తీసుకుంటారు. జ్ఞానుల ఇంటిలో జన్మ తీసుకోలేరు ఎందుకంటే జ్ఞానులైన బ్రాహ్మణులు వికారాలలోకి వెళ్ళలేరు, వారు పవిత్రంగా ఉంటారు. అయితే, మంచి సుఖమయమైన ఇంటిలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఎటువంటి అవస్థనో అటువంటి జన్మ అని వివేకం కూడా చెప్తుంది. అప్పుడు అక్కడ తమ ప్రభావాన్ని చూపిస్తారు. శరీరము చిన్నగా ఉన్న కారణంగా మాట్లాడలేరు. కాస్త పెద్ద అయిన తర్వాత జ్ఞాన ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తారు. కొందరు శాస్త్రాల సంస్కారాలను తీసుకువెళ్తారు, కావున బాల్యంలోనే అందులో నిమగ్నమైపోతారు. ఇక్కడి నుండి కూడా జ్ఞానాన్ని తీసుకువెళ్తారు కావున తప్పకుండా మహిమ వెలువడుతుంది.

మీరు శివజయంతిని జరుపుకుంటారు. కానీ వారు దాని అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోలేరు. ఒకవేళ వారు సర్వవ్యాపి అయినట్లయితే మరి జయంతిని ఎలా జరుపుతారు అని వారిని అడగాలి. ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. బాబా అర్థం చేయించారు, సిక్కు ధర్మం వారు కూడా వారిని సత్-శ్రీ-అకాల్ అని అంటారు. ఇప్పుడు వాస్తవానికి ఆత్మలందరూ అకాలమూర్తులే. కానీ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు, అందుకే జనన-మరణాలు అని అంటారు. ఆత్మ అయితే అదే ఉంటుంది. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. కల్పం ఎప్పుడైతే పూర్తవుతుందో, అప్పుడు వారు స్వయమే వచ్చి - వారు ఎవరు, వారు ఏ విధంగా వీరిలోకి ప్రవేశిస్తారు అనేది తెలియజేస్తారు, తద్వారా మీరు మీ అంతట మీరే అర్థం చేసుకుంటారు. మొదట అర్థం చేసుకునేవారు కాదు. అయితే, పరమాత్మ ప్రవేశించడమైతే జరిగింది కానీ ఎలా ప్రవేశించారు, ఎప్పుడు ప్రవేశించారు అన్నది ఏమైనా అర్థం చేసుకునేవారా. రోజురోజుకు మీ బుద్ధిలోకి ఈ విషయాలు వస్తూ ఉంటాయి. మీరు కొత్త-కొత్త విషయాలను వింటూ ఉంటారు. ఇంతకుముందేమైనా ఇద్దరు తండ్రుల రహస్యాన్ని అర్థం చేయించేవారా, ఇంతకుముందు చిన్న పిల్లల వలె ఉండేవారు. ఇప్పుడు కూడా చాలామంది అంటారు - బాబా, మేము మీ రెండు రోజుల పిల్లలము లేక ఇన్ని రోజుల పిల్లలము అని. ఏదైతే జరుగుతుందో అదంతా కల్పక్రితము వలె జరుగుతోందని అర్థం చేసుకుంటారు. ఇందులో ఎంతో జ్ఞానం ఉంది. ఇది అర్థం చేసుకోవడానికి కూడా సమయం పడుతుంది. జన్మ తీసుకొని మళ్ళీ మరణిస్తారు కూడా. 2 నెలలు, 8 నెలల వారిగా అయి కూడా మరణిస్తారు. మీ వద్దకు వస్తారు. ఏమంటారంటే - ఇది నిజమే, వారు మన తండ్రి, మనం వారి సంతానము. అవును, అవును అని అంటారు. చాలా ప్రభావితులవుతున్నారు అని పిల్లలు వ్రాస్తారు కూడా. మళ్ళీ బయటకు వెళ్ళగానే సమాప్తము, మరణిస్తారు. మళ్ళీ అసలు రానే రాకపోతే ఏమవుతుంది? అయితే చివరిలో వచ్చి రిఫ్రెష్ అన్నా అవుతారు లేక ప్రజలలోకైనా వస్తారు. ఈ విషయాలన్నింటినీ అర్థం చేయించాలి. మనం శివ జయంతిని ఎలా జరుపుకుంటాము, శివబాబా ఏ విధంగా సద్గతిని ఇస్తారు... ఈ విషయాలన్నీ అర్థం చేయించాలి. శివబాబా స్వర్గము అనే కానుకను తీసుకువస్తారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను అని వారు స్వయమే అంటారు. తండ్రి స్వర్గ రచయిత, కావున తప్పకుండా స్వర్గానికే యజమానులుగా తయారుచేస్తారు. మనం వారి చరిత్రను గురించి తెలియజేస్తాము. ఏ విధంగా స్వర్గ స్థాపన చేస్తారు, ఏ విధంగా రాజయోగాన్ని నేర్పిస్తారు అనేది వచ్చి తెలుసుకోండి. తండ్రి ఏ విధంగానైతే అర్థం చేయిస్తారో, అదే విధంగా పిల్లలు అర్థం చేయించలేరా? ఇందులో చాలా బాగా అర్థం చేయించేవారు కావాలి. శివుని మందిరాలలో చాలా బాగా జరుపుకుంటూ ఉండవచ్చు, అక్కడికి వెళ్ళి అర్థం చేయించాలి. లక్ష్మీ-నారాయణుల మందిరములో ఒకవేళ శివుని జీవిత గాథను వినిపిస్తే అది ఎవరికీ హత్తుకోదు, అది వారి ఆలోచనలోకి రాదు. కావున వారికి బుద్ధిలో బాగా కూర్చోబెట్టవలసి ఉంటుంది. లక్ష్మీ-నారాయణుల మందిరానికి ఎందరో వస్తారు, వారికి లక్ష్మీ-నారాయణుల, రాధ-కృష్ణుల రహస్యాన్ని అర్థం చేయించవచ్చు. వారివి వేరు-వేరు మందిరాలు ఉండకూడదు. శ్రీకృష్ణ జయంతి నాడు మీరు శ్రీకృష్ణుని మందిరంలోకి వెళ్ళి - కృష్ణుడినే తెల్లనివాడిగా, కృష్ణుడినే నల్లనివాడిగా ఎందుకు మహిమ చేస్తారు? అనేది అర్థం చేయిస్తారు. అతడిని పల్లెటూరి బాలుడు అని అంటారు. పల్లెటూర్లలో ఆవులను, మేకలను మేపుతూ ఉంటారు కదా. బాబా ఫీల్ అవుతూ ఉంటారు - నేను కూడా పల్లెటూరి బాలుడిగానే ఉండేవాడిని, టోపీ లేదు, చెప్పులూ లేవు. నేను ఎలా ఉండేవాడిని, తర్వాత బాబా వచ్చి ప్రవేశించారు అన్నది ఇప్పుడు స్మృతిలోకి వస్తుంది. కావున బాబా ఇచ్చిన ఈ లక్ష్యము అందరికీ లభించాలి, అదేమిటంటే - శివబాబాను స్మృతి చేయండి, వారే సద్గతిదాత. మీరు రామచంద్రుని జీవిత గాథను కూడా తెలియజేయవచ్చు. అతని రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది, ఎన్ని సంవత్సరాలయ్యింది. ఇటువంటి ఆలోచనలు రావాలి. శివుని మందిరంలో శివుని చరిత్రను వినిపించవలసి ఉంటుంది. లక్ష్మీ-నారాయణుల మందిరంలో లక్ష్మీ-నారాయణుల మహిమను చేయవలసి ఉంటుంది. రాముని మందిరంలోకి వెళ్తే రాముని జీవిత గాథను వినిపిస్తారు. ఇప్పుడు మీరు దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు పురుషార్థం చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని అయితే ఎవ్వరూ స్థాపించలేదు. వాస్తవానికి హిందూ అనేది ధర్మమేమీ కాదు - ఈ మాటను నేరుగా చెప్పినట్లయితే డిస్టర్బ్ అవుతారు. వీరు క్రైస్తవులేమో అని అనుకుంటారు. మీరు చెప్పండి - మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము, దానిని ఈ మధ్యన హిందూ ధర్మం అని అన్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శివ జయంతిని వైభవంగా జరపండి. శివబాబా మందిరాలలో శివబాబా యొక్క మరియు లక్ష్మీ-నారాయణుల మందిరాలలో లక్ష్మీ-నారాయణులు లేక రాధా-కృష్ణుల యొక్క చరిత్రను వినిపించండి. అందరికీ యుక్తీయుక్తమైన వివరణను అందించండి.

2. అజ్ఞానాంధకారం నుండి రక్షించుకునేందుకు ఆత్మా రూపీ దీపమును జ్ఞానమనే నూనె ద్వారా సదా ప్రజ్వలితముగా ఉంచాలి. ఇతరులను కూడా అజ్ఞానాంధకారం నుండి బయటకు తీయాలి.

వరదానము:-

సర్వ ఖజానాలతో సంపన్నంగా అయి నిరంతర సేవను చేసే తరగని, అఖండ మహాదానీ భవ

బాప్ దాదా సంగమయుగంలో పిల్లలందరికీ అచల, అఖండ అన్న వరదానాన్ని ఇచ్చారు. ఎవరైతే ఈ వరదానాన్ని జీవితంలో ధారణ చేసి అఖండ మహాదానులుగా అనగా నిరంతర సహజ సేవాధారులుగా అవుతారో వారు నెంబర్ వన్ గా అవుతారు. ద్వాపరము నుండి భక్త ఆత్మలు కూడా దాతలుగా అవుతారు కానీ తరగని ఖజానాలకు దాతలుగా అవ్వలేరు. వారు వినాశీ ఖజానాలు లేక వస్తువులకు దాతలుగా అవుతారు. కానీ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న దాత పిల్లలైన మీరు ఒక్క క్షణము కూడా దానము ఇవ్వకుండా ఉండలేరు.

స్లోగన్:-

ఎప్పుడైతే స్వభావంలో సరళత ఉంటుందో, అప్పుడు లోపలి సత్యత, స్వచ్ఛత ప్రత్యక్షమవుతాయి.