12-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - మీ మోహ బంధాలన్నీ ఇప్పుడు తెగిపోవాలి ఎందుకంటే ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది, ఈ పాత ప్రపంచము యొక్క ఏ వస్తువు పైనా మీకు అభిరుచి ఉండకూడదు

ప్రశ్న:-

ఏ పిల్లలకైతే ఆత్మిక నషా ఎక్కి ఉంటుందో, వారి టైటిల్ ఏమిటి? ఈ నషా ఏ పిల్లలకు ఎక్కుతుంది?

జవాబు:-

ఆత్మిక నషాలో ఉండే పిల్లలను - మస్త్ కలందర్ (నషాలో ఉన్న రాజు) అని అనడం జరుగుతుంది, వారే కళంగీధరులుగా అవుతారు. వారికి రాజరికపు నషా ఎక్కి ఉంటుంది. ఇప్పుడు మేము ఫకీరుల నుండి సంపన్నులుగా అవుతాము అని వారి బుద్ధిలో ఉంటుంది. రుద్రమాలలో కూర్చబడేవారు ఎవరైతే ఉంటారో, వారికి నషా ఎక్కుతుంది. ఎవరికైతే మేము ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి రావాలి అన్న నిశ్చయముంటుందో, ఆ పిల్లలకే నషా ఉంటుంది.

ఓంశాంతి

ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. దీనిని ఆత్మిక పిల్లల కొరకు ఆత్మిక జ్ఞానం అని అంటారు. ఆత్మ జ్ఞాన సాగరము. మనుష్యులెప్పుడూ జ్ఞాన సాగరులుగా అవ్వలేరు. మనుష్యులు భక్తి సాగరులు. వాస్తవానికి అందరూ మనుష్యులే. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారు జ్ఞాన సాగరుడి నుండి జ్ఞానాన్ని తీసుకొని మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతారు. దేవతలలో భక్తి ఉండదు, జ్ఞానమూ ఉండదు. దేవతలకు ఈ జ్ఞానం తెలియదు. జ్ఞాన సాగరుడు ఒక్క పరమపిత పరమాత్మయే. అందుకే వారినే వజ్రతుల్యమైనవారు అని అంటారు. వారే వచ్చి గవ్వ నుండి వజ్రముగా, రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. మనుష్యులకు ఏమీ తెలియదు. దేవతలే మళ్ళీ వచ్చి మనుష్యులుగా అవుతారు. శ్రీమతము ద్వారా దేవతలుగా అయ్యారు. అర్ధకల్పము అక్కడ ఎవరి మతము యొక్క అవసరమూ ఉండదు. ఇక్కడైతే ఎంతోమంది గురువులు మతములను తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సద్గురువు యొక్క శ్రీమతము లభిస్తుందని తండ్రి అర్థం చేయించారు. ఖాల్సా వర్గము (సిక్కు ధర్మములోని ఒక శాఖ) వారు సద్గురు అకాల్ అని అంటారు. దాని అర్థము కూడా వారికి తెలియదు. సద్గురు అకాలమూర్తి అని పిలుస్తూ ఉంటారు కూడా అనగా సద్గతిని ఇచ్చే అకాలమూర్తి అని అర్థము. అకాలమూర్తి అని పరమపిత పరమాత్మనే అంటారు. సద్గురువుకు మరియు గురువుకు కూడా రాత్రికీ, పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు బ్రహ్మా యొక్క పగలు మరియు రాత్రి అని అంటారు. బ్రహ్మా యొక్క పగలు మరియు బ్రహ్మా యొక్క రాత్రి అని తప్పకుండా అంటారు. బ్రహ్మా పునర్జన్మలు తీసుకుంటారు. బ్రహ్మాయే మళ్ళీ ఈ దేవతగా అయిన విష్ణువుగా అవుతారు. మీరు శివబాబా మహిమను చేస్తారు. వారిది వజ్రతుల్యమైన జన్మ.

ఇప్పుడు పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ పావనులుగా అవుతారు. మీరు పవిత్రముగా అయ్యి ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి. కుమారీలకైతే ఏ బంధనాలూ లేవు. వారికి కేవలం తల్లిదండ్రుల లేక సోదరీ-సోదరుల స్మృతే ఉంటుంది. మళ్ళీ అత్తవారింటికి వెళ్ళడంతో రెండు పరివారాలు అవుతాయి. ఇప్పుడు తండ్రి మీకు - అశరీరులుగా అవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరందరూ తిరిగి వెళ్ళాలి. మీకు పవిత్రముగా అయ్యే యుక్తిని కూడా తెలియజేస్తాను. పతిత-పావనుడను నేనే. నేను గ్యారంటీ ఇస్తున్నాను - మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్నితో మీ జన్మజన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. ఏ విధంగా పాత బంగారాన్ని అగ్నిలో వేయడముతో దాని నుండి మలినాలు తొలగిపోతాయి మరియు స్వచ్ఛమైన బంగారము ఉండిపోతుందో, అలా ఇది కూడా యోగాగ్నియే. ఈ సంగమములోనే బాబా ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు, అందుకే దీనికెంతో మహిమ ఉంది. భగవంతుడు నేర్పించిన రాజయోగాన్ని అందరూ నేర్చుకోవాలనుకుంటారు. సన్యాసులు విదేశాల నుండి కూడా ఎంతోమందిని తీసుకువస్తారు. వీరు సన్యాసం తీసుకున్నారు అని వారు భావిస్తారు. వాస్తవానికి మీరు కూడా సన్యాసులే. కానీ అనంతమైన సన్యాసము గురించి ఎవ్వరికీ తెలియదు. అనంతమైన సన్యాసాన్ని అయితే ఒక్క తండ్రే నేర్పిస్తారు. ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నదని మీకు తెలుసు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్లా మనకు అభిరుచి ఉండదు. ఫలానావారు శరీరాన్ని వదిలారు, పాత్రను అభినయించేందుకు వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకున్నారు, అందులో మనం ఎందుకు రోదించాలి! మోహ బంధము తొలగిపోతుంది. మన సంబంధము ఇప్పుడు కొత్త ప్రపంచముతో జోడించబడింది. ఇటువంటి పిల్లలు పక్కా మస్త్ కళంగీధరులు గా ఉంటారు. మీలో రాజరికపు నషా ఉంది. బాబాలో కూడా - నేను వెళ్ళి ఈ కళంగీధరునిగా అవుతాను, ఫకీరు నుండి సంపన్నుడిగా అవుతాను అన్న నషా ఉంది కదా. లోపల నషా ఎక్కి ఉంది, అందుకే మస్త్ కలంధర్ (నషాలో ఉన్న రాజు) అని అంటారు. వీరి యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందుతారు. ఏ విధంగా వీరికి నషా ఎక్కి ఉందో, అలాగే మీకు కూడా నషా ఎక్కాలి. మీరు కూడా రుద్రమాలలో కూర్చబడేవారు. ఎవరికైతే పక్కా నిశ్చయముంటుందో, వారికి నషా ఎక్కుతుంది. ఆత్మలమైన మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. తర్వాత కొత్త ప్రపంచములోకి వస్తాము. ఈ నిశ్చయముతో ఎవరైతే ఇతడిని చూస్తారో, వారికి ఇతనిలో చిన్న పిల్లవాడు (శ్రీకృష్ణుడు) కనిపిస్తాడు. ఎంత శోభాయమానంగా ఉంటారు. శ్రీకృష్ణుడైతే ఇక్కడ లేరు. అతని కోసం ఎంతగా హైరానా పడుతూ ఉంటారు. ఊయలలు తయారుచేస్తారు, అతనికి పాలు పట్టిస్తారు. అది జడ చిత్రము, వీరైతే రియల్ కదా. నేను బాలకునిగా అవుతాను అని వీరికి కూడా నిశ్చయముంది. కుమార్తెలైన మీరు కూడా దివ్యదృష్టితో చిన్న బాలుడిని చూస్తారు. ఈ కళ్ళతోనైతే చూడలేరు. ఆత్మకు ఎప్పుడైతే దివ్యదృష్టి లభిస్తుందో, అప్పుడు శరీర భానము ఉండదు. ఆ సమయంలో స్వయాన్ని మహారాణిగా మరియు వారిని చిన్న బాలుడిగా భావిస్తారు. ఈ సాక్షాత్కారాలు కూడా ఈ సమయంలో అనేకులకు జరుగుతాయి. శ్వేత వస్త్రధారుని సాక్షాత్కారము కూడా ఎంతోమందికి జరుగుతుంది. అప్పుడు వారితో - మీరు ఇతని వద్దకు వెళ్ళండి, జ్ఞానాన్ని తీసుకోండి, అప్పుడు ఈ విధంగా యువరాజుగా అవుతారు అని చెప్తారు, ఇది ఇంద్రజాలమే కదా. వ్యాపారము కూడా చాలా బాగా చేస్తారు. గవ్వలు తీసుకొని వజ్రాలను, ముత్యాలను ఇస్తారు. మీరు వజ్రతుల్యంగా అవుతారు. మిమ్మల్ని శివబాబా వజ్రతుల్యంగా తయారుచేస్తారు కావున బలిహారమంతా వారిదే. మనుష్యులు అర్థం చేసుకోని కారణంగా ఇంద్రజాలము, ఇంద్రజాలము అని అనేస్తారు. ఎవరైతే ఆశ్చర్యము కలిగించేలా పారిపోతారో, వారు వెళ్ళి తప్పుగా ఏవేవో వినిపిస్తారు. ఈ విధంగా ఎంతోమంది ద్రోహులుగా అవుతారు. ఈ విధంగా ద్రోహులుగా అయ్యేవారు ఉన్నత పదవిని పొందలేరు. గురువును నిందింపజేసేవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందరు అని వారి గురించే అనడం జరుగుతుంది. ఇక్కడైతే సత్యమైన తండ్రి ఉన్నారు కదా. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులైతే, వారు ప్రతీ యుగములోనూ వస్తారు అని అంటారు. అచ్ఛా, మరి 4 యుగాలు ఉన్నప్పుడు 24 అవతారాలు అని ఎలా అనగలరు? మళ్ళీ రాయిరప్పలలోనూ, కణకణములోనూ పరమాత్మ ఉన్నారు అని అంటారు, మరి అలాగైతే అందరూ పరమాత్మ అయినట్లే కదా. తండ్రి అంటారు, నేను గవ్వ నుండి వజ్రముగా తయారుచేస్తాను, కానీ నన్ను రాయిరప్పలలో తోసేసారు. సర్వవ్యాపి అంటే మరి అన్నింటిలోనూ ఉన్నట్లు, అలాంటప్పుడు వారికి విలువేమీ లేనట్లే. నాకు ఎలా అపకారము చేస్తారో చూడండి. బాబా అంటారు, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎప్పుడైతే ఈ విధంగా అవుతారో, అప్పుడు తండ్రి వచ్చి ఉపకారము చేస్తారు అనగా మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారు.

ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికము మళ్ళీ పునరావృతమవుతాయి. సత్యయుగములో మళ్ళీ ఈ లక్ష్మీ-నారాయణులే వస్తారు. అక్కడ కేవలం భారత్ యే ఉంటుంది. ప్రారంభములో చాలా కొద్దిమంది దేవతలే ఉంటారు. తర్వాత వృద్ధి పొందుతూ, పొందుతూ 5,000 సంవత్సరాలలో ఎంతమంది అయిపోయారు. ఇప్పుడు ఈ జ్ఞానం ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. మిగిలినదంతా భక్తి. దేవతల చిత్రాల మహిమను గానం చేస్తారు. వీరు చైతన్యంగా ఉండేవారు కదా, మరి ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నది అర్థం చేసుకోరు. చిత్రాల పూజను చేస్తారు కానీ అసలు వారు ఎక్కడ ఉన్నారు? వారు కూడా తమోప్రధానులుగా అయి మళ్ళీ సతోప్రధానులుగా అవ్వాలి. ఇది ఎవరి బుద్ధిలోకీ రాదు. ఇటువంటి తమోప్రధాన బుద్ధి కలవారిని మళ్ళీ సతోప్రధానులుగా తయారుచేయడం ఒక్క తండ్రి పనే. ఈ లక్ష్మీ-నారాయణులు గతించిపోయారు, అందుకే వారి మహిమ ఉంది. ఉన్నతోన్నతుడు ఒక్క భగవంతుడే, మిగిలినవారంతా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఉన్నతోన్నతుడైన తండ్రే అందరికీ ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. వారు రాకపోతే ఇంకా పైసకు కొరగానివారిగా, తమోప్రధానంగా అయిపోతారు. వీరు రాజ్యం చేసేటప్పుడు ఎంతో విలువైనవారిగా ఉండేవారు. అక్కడ పూజలు మొదలైనవేవీ చేసేవారు కాదు. పూజ్య దేవీ-దేవతలే పూజారులుగా అయిపోయారు, వామ మార్గములో వికారులుగా అయిపోయారు. వీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులైన మీలో కూడా ఈ విషయాలను నంబరువారుగా అర్థం చేసుకుంటారు. స్వయమే పూర్తిగా అర్థం చేసుకోకపోతే ఇక ఇతరులకేమి అర్థం చేయిస్తారు. బ్రహ్మాకుమార-కుమారీలు అన్న పేరు ఉంది, అర్థం చేయించలేకపోతే నష్టపరుస్తారు, అందుకే - మేము మా పెద్ద అక్కయ్యను పిలుస్తాము, వారు మీకు అర్థం చేయిస్తారు అని చెప్పాలి. భారత్ యే వజ్రతుల్యంగా ఉండేది, ఇప్పుడు గవ్వతుల్యంగా ఉంది. నిరుపేదగా ఉన్న భారత్ ను శిరోకిరీటముగా ఎవరు తయారుచేస్తారు? లక్ష్మీ-నారాయణులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చెప్పండి అని అడిగితే వారు చెప్పలేరు. వారు భక్తి సాగరులు. వారికి అదే నషా ఎక్కి ఉంది. మీరు జ్ఞాన సాగరులు. వారు శాస్త్రాలనే జ్ఞానంగా భావిస్తారు. తండ్రి అంటారు, శాస్త్రాలలో భక్తి యొక్క ఆచార-వ్యవహారాలు ఉన్నాయి. మీలో ఎంతగా జ్ఞానము యొక్క శక్తి నిండుతూ ఉంటుందో, అంతగా మీరు అయస్కాంతము వలె అవుతారు, అప్పుడు అందరికీ ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడు అది లేదు. అయినా కానీ యథా యోగము యథా శక్తి, ఎంతగా బాబాను స్మృతి చేస్తారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అలాగని ఎల్లప్పుడూ బాబాను స్మృతి చేస్తారనీ కాదు, అలాగైతే ఈ శరీరము కూడా ఉండదు. ఇప్పుడు ఇంకా ఎంతోమందికి సందేశమును ఇవ్వాలి, సందేశకులుగా అవ్వాలి. పిల్లలైన మీరే సందేశకులుగా అవుతారు, ఇంకెవ్వరూ అవ్వరు. క్రైస్టు మొదలైనవారు వచ్చి ధర్మ స్థాపనను చేస్తారు, వారిని సందేశకులు అని అనరు. క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసారు, ఇంకేమీ చేయలేదు. వారు ఎవరో ఒకరి శరీరములోకి వస్తారు, తర్వాత వారి వెనుక మిగిలినవారు వస్తారు. ఇక్కడ ఈ రాజధాని స్థాపన అవుతోంది. మున్ముందు - మేము ఏమవుతాము, మేము ఈ-ఈ వికర్మలను చేసాము అన్నది మీ అందరికీ సాక్షాత్కారమవుతుంది. సాక్షాత్కారాలు జరగడానికి పెద్ద సమయమేమీ పట్టదు. కాశీలో కత్తుల బావిలోకి దూకుతారు, వారు ఒక్కసారిగా నిలబడి బావిలోకి దూకేవారు. ఇప్పుడైతే గవర్నమెంటు దానిని ఆపు చేసింది. అలా చేయడం ద్వారా మేము ముక్తిని పొందుతాము అని వారు భావిస్తారు. తండ్రి అంటారు, అలా ముక్తినైతే ఎవ్వరూ పొందలేరు. ఆ కొద్ది సమయంలోనే అన్ని జన్మల శిక్షలు లభించినట్లు అవుతుంది, మళ్ళీ కొత్తగా లెక్కాచారాలు ప్రారంభమవుతాయి. తిరిగి అయితే ఎవ్వరూ వెళ్ళలేరు. వెళ్ళి ఎక్కడ ఉంటారు? అలాగైతే ఆత్మల వృక్షమే తేడా అయిపోతుంది. నంబరువారుగా వస్తారు, మళ్ళీ వెళ్తారు. పిల్లలకు సాక్షాత్కారాలు జరుగుతాయి, అప్పుడు ఈ చిత్రాలు మొదలైనవాటిని తయారుచేస్తారు. 84 జన్మల మొత్తం సృష్టిచక్రము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం మీకు లభించింది. మళ్ళీ మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరు ఎక్కువ మార్కులతో పాసవుతారు, కొందరు తక్కువ మార్కులతో. 100 మార్కులైతే ఎవ్వరికీ లభించవు. 100 మార్కులు ఒక్క తండ్రివే. ఇంకెవ్వరూ అలా అవ్వలేరు. కొంచెం-కొంచెం తేడా ఉంటుంది. ఒకే విధంగా కూడా అవ్వలేరు. ఎంతమంది మనుష్యులున్నారు. అందరి రూపురేఖలూ ఎవరివి వారివే. ఆత్మలన్నీ ఎంత చిన్నని బిందువులు. మనుష్యులు ఎంత పెద్ద-పెద్దగా ఉన్నారు. అయినా కానీ రూపురేఖలు ఒకరితో ఒకరివి కలవవు. ఎంతమంది ఆత్మలైతే ఉన్నారో, అంతమందే మళ్ళీ ఉంటారు, అందుకే అక్కడ ఇంటిలో ఉంటారు. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. ఒకసారి ఏదైతే షూటింగ్ జరుగుతుందో, దానినే మళ్ళీ చూస్తారు. 5,000 సంవత్సరాల క్రితం కూడా మేము ఈ విధంగా కలుసుకున్నాము అని మీరు అంటారు. ఒక్క క్షణం కూడా తక్కువ, ఎక్కువ అవ్వదు. ఇది డ్రామా కదా. ఎవరికైతే ఈ రచయిత మరియు రచనల జ్ఞానం బుద్ధిలో ఉంటుందో, వారిని స్వదర్శన చక్రధారులు అని అంటారు. తండ్రి ద్వారానే ఈ జ్ఞానం లభిస్తుంది. మనుష్యులు మనుష్యులకు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మనుష్యులు భక్తిని నేర్పిస్తారు, జ్ఞానాన్ని ఒక్క తండ్రే నేర్పిస్తారు. జ్ఞాన సాగరుడైతే ఒక్క తండ్రే, మీరు మళ్ళీ జ్ఞాన నదులుగా అవుతారు. జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన నదుల ద్వారానే ముక్తి-జీవన్ముక్తులు లభిస్తాయి. అవి నీటి నదులు. నీరు అయితే ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది. జ్ఞానము సంగమములోనే లభిస్తుంది. నీటి నదులైతే భారత్ లో ప్రవహిస్తూనే ఉంటాయి. ఇకపోతే ఇన్ని పట్టణాలేవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోతాయి. అసలు ఖండాలే ఉండవు. వర్షాలు పడుతూ ఉండవచ్చు, నీరు వెళ్ళి నీటిలో కలుస్తుంది. ఈ భారత్ మాత్రమే ఉంటుంది.

ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా లభించింది. ఇది జ్ఞానము, మిగిలినదంతా భక్తి. వజ్రతుల్యమైనవారు ఒక్క శివబాబాయే, వారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. శివబాబా ఏం చేసారు అని అడగాలి. వారు వచ్చి పతితులను పావనులుగా తయారుచేస్తారు, ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అందుకే జ్ఞాన సూర్యుడు ఉదయించారు... అని అంటూ ఉంటారు. జ్ఞానముతో పగలు, భక్తితో రాత్రి అవుతుంది. మనం 84 జన్మలను పూర్తి చేసామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు బాబాను స్మృతి చేయడం ద్వారా పావనులుగా అవుతారు. అప్పుడు శరీరము కూడా పావనమైనది లభిస్తుంది. మీరందరూ నంబరువారుగా పావనులుగా అవుతారు. ఇది ఎంత సహజమైన విషయము. ముఖ్యమైన విషయము స్మృతికి సంబంధించినది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం రానివారు ఎంతోమంది ఉన్నారు, అయినా కానీ పిల్లలుగా అయ్యారు కావున స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. ఈ సమయంలోని పురుషార్థానుసారంగానే రాజ్యస్థాపన జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మేము మాస్టర్ జ్ఞాన సాగరులము అన్న నషాలోనే సదా ఉండాలి. స్వయములో జ్ఞాన శక్తిని నింపుకొని అయస్కాంతముగా అవ్వాలి, ఆత్మిక సందేశకులుగా అవ్వాలి.

2. సద్గురువైన తండ్రి పేరును అప్రతిష్టపాలు చేసే కర్మలనేవీ చేయకూడదు. ఏమి జరిగినా కానీ ఎప్పుడూ ఏడవకూడదు.

వరదానము:-

సత్యత యొక్క ఫౌండేషన్ తో నడవడిక మరియు ముఖము ద్వారా దివ్యతను అనుభూతి చేయించే సత్యవాదీ భవ

ప్రపంచములో అనేక ఆత్మలు తమను తాము సత్యవాదులుగా పిలిపించుకుంటారు లేక అలా భావిస్తారు, కానీ సంపూర్ణ సత్యత అనేది పవిత్రత ఆధారముపైనే ఉంటుంది. పవిత్రత లేకపోతే సదా సత్యత ఉండదు. సత్యత యొక్క ఫౌండేషన్ పవిత్రత మరియు సత్యత యొక్క ప్రాక్టికల్ ప్రమాణముగా ముఖము మరియు నడవడికలో దివ్యత ఉంటుంది. పవిత్రతా ఆధారముగా సత్యత యొక్క స్వరూపము స్వతహాగా మరియు సహజముగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరము రెండూ పావనముగా ఉంటాయో, అప్పుడు సంపూర్ణ సత్యవాది అని అంటారు అనగా దివ్యతా సంపన్న దేవతలు.

స్లోగన్:-

అనంతమైన సేవలో బిజీగా ఉన్నట్లయితే అనంతమైన వైరాగ్యము స్వతహాగనే వస్తుంది.