13-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బాబా 21 జన్మల కొరకు మీ హృదయాన్ని ఏ విధంగా ఆహ్లాదపరుస్తారంటే, ఇక మీరు మళ్ళీ హృదయాన్ని ఆహ్లాదపరచుకునేందుకు ఉత్సవాలు-తిరునాళ్ళు మొదలైనవాటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు’’

ప్రశ్న:-

ఏ పిల్లలైతే ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అవుతారో వారి కొరకు ఏ గ్యారంటీ ఉంది?

జవాబు:-

శ్రీమతంపై రాజధానిని స్థాపించడంలో సహాయకులుగా అయ్యే పిల్లల కొరకు ఏ గ్యారంటీ ఉందంటే - వారిని ఎప్పుడూ మృత్యువు కబళించదు. సత్యయుగ రాజధానిలో ఎప్పుడూ అకాల మృత్యువులు సంభవించవు. సహాయకులైన పిల్లలకు తండ్రి ద్వారా ఎటువంటి ప్రైజ్ లభిస్తుందంటే దాని ద్వారా 21 తరాల వరకూ అమరులుగా అవుతారు.

ఓంశాంతి

తయారై-తయారుచేయబడిన సృష్టి చక్రము అనుసారముగా కల్పక్రితము వలె శివ భగవానువాచ. ఇప్పుడు పిల్లలకు తమ పరిచయమైతే లభించింది. అలాగే తండ్రి పరిచయం కూడా లభించింది. అనంతమైన తండ్రినైతే తెలుసుకున్నారు, అలాగే అనంతమైన సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను కూడా తెలుసుకున్నారు. నంబరువారు పురుషార్థానుసారంగా కొందరు బాగా తెలుసుకుంటారు, దానిని మళ్ళీ వారు అర్థం చేయించగలుగుతారు కూడా. కొందరు సగం తెలుసుకుంటారు, కొందరు తక్కువ తెలుసుకుంటారు. యుద్ధములో కూడా కొందరు కమాండర్ ఇన్ చీఫ్ గా, కొందరు క్యాప్టెన్ గా, మరికొందరు మరేదో అవుతారు. రాజ్యమాలలో కూడా కొందరు షావుకారు ప్రజలు, మరికొందరు పేద ప్రజలు, నంబరువారుగా ఉన్నారు. తప్పకుండా స్వయం మనమే శ్రీమతం ఆధారముగా సృష్టిపై శ్రేష్ఠ రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఎవరెవరు ఎంతెంతగా కృషి చేస్తారో అంతంతగా తండ్రి నుండి ప్రైజ్ లభిస్తుంది. ఈ రోజుల్లో శాంతి కొరకు సలహాలు ఇచ్చేవారికి కూడా ప్రైజ్ లభిస్తుంది. పిల్లలైన మీకు కూడా ప్రైజ్ లభిస్తుంది. మీకు లభించేది వారికి లభించదు. వారికి ప్రతీది అల్పకాలము కొరకే లభిస్తుంది. మీరు తండ్రి శ్రీమతంపై మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. అది కూడా 21 జన్మలు, 21 తరాల కొరకు గ్యారంటీ ఉంది. అక్కడ బాల్యంలో లేక యవ్వనంలో మృత్యువు కబళించదు. మనం ఈ విధంగా ఎక్కడైతే మన స్మృతిచిహ్నాలు ఉన్నాయో అక్కడకు వచ్చి కూర్చుంటామని మనస్సులోనూ, చిత్తములోనూ లేదని కూడా మీకు తెలుసు. ఇక్కడ 5,000 సంవత్సరాల క్రితం కూడా సేవ చేశారు, ఇక్కడ దిల్వాడా మందిరము, అచల ఘర్, గురు శిఖర్ ఉన్నాయి. సద్గురువు కూడా మీకు ఉన్నతోన్నతమైనవారు లభించారు, వారి స్మృతిచిహ్నము అలా తయారుచేయబడి ఉంది. అచల ఘర్ రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. అది ఇంటి మహిమ. మీరు మీ పురుషార్థం ద్వారా ఉన్నతోన్నత పదవిని పొందుతారు. ఇది అద్భుతమైన మీ జడ స్మృతిచిహ్నము. అక్కడికే మళ్ళీ మీరు చైతన్యంగా వచ్చి కూర్చున్నారు. ఇదంతా ఆత్మిక కార్య వ్యవహారము, ఇది కల్పపూర్వము నడిచింది. దీని పూర్తి స్మృతిచిహ్నము ఇక్కడ ఉంది. ఇది నెంబర్ వన్ స్మృతిచిహ్నము. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయితే వారిలో ఎంతో సంతోషము, కళ వస్తుంది. ఫర్నీచర్ ను, వస్త్రధారణను ఎంత బాగా ఉంచుకుంటారు. మీరైతే విశ్వాధిపతులుగా అవుతారు. మీతో ఎవ్వరూ సరిపోల్చుకోలేరు. ఇది కూడా స్కూల్. చదివించేవారిని కూడా మీరు తెలుసుకున్నారు. భగవానువాచ, భక్తి మార్గంలో ఎవరినైతే తలచుకుంటారో, పూజిస్తారో, వారి గురించి ఏమీ తెలియదు. తండ్రే సమ్ముఖంగా వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు ఎందుకంటే ఈ స్మృతిచిహ్నాలన్నీ మీ చివరిలోని అవస్థకు చెందినవే. ఇప్పుడింకా రిజల్టు వెలువడలేదు. ఎప్పుడైతే మీ అవస్థ సంపూర్ణతకు చేరుకుంటుందో, అప్పుడు ఆ అవస్థకు చెందిన స్మృతిచిహ్నాలు మళ్ళీ భక్తి మార్గంలో తయారవుతాయి. రక్షాబంధనము యొక్క స్మృతిచిహ్నము ఉంటుంది కదా. ఎప్పుడైతే పూర్తిగా పక్కా రాఖీ కట్టుకుని మనం మన రాజ్యభాగాన్ని తీసుకుంటామో అప్పుడిక స్మృతిచిహ్నాలను (పండుగలను) జరుపుకోరు. ఈ సమయంలో మీకు అన్ని మంత్రాల యొక్క అర్థాన్ని వివరించారు. ఓం యొక్క అర్థాన్ని వివరించారు. ఓం యొక్క అర్థము అంత పెద్దదేమీ కాదు. ఓం అంటే అర్థము నేను ఆత్మను, ఇది నా శరీరము. అజ్ఞానకాలంలో కూడా మీరు దేహాభిమానంలో ఉంటారు కావున స్వయాన్ని శరీరంగా భావిస్తారు. రోజురోజుకు భక్తి మార్గం కిందకు దిగజారిపోతూ ఉంటుంది, తమోప్రధానంగా అవుతూ ఉంటుంది. ప్రతి వస్తువూ మొదట సతోప్రధానంగా ఉంటుంది. భక్తి కూడా మొదట సతోప్రధానంగా ఉండేది. అప్పుడు ఒక్క సత్యమైన శివబాబానే స్మృతి చేసేవారు. అప్పుడు కూడా చాలా కొద్దిమందే ఉండేవారు. రోజురోజుకు వృద్ధి ఎంతగానో జరుగనున్నది. విదేశాలలో ఎక్కువమంది పిల్లలకు జన్మనిస్తే వారికి కానుక లభిస్తుంది. కానీ తండ్రి కామం మహాశత్రువు అని అంటారు. సృష్టి ఇప్పటికే ఎంతో వృద్ధి చెందింది, ఇప్పుడిక పవిత్రంగా అవ్వండి.

పిల్లలైన మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను ఇప్పుడు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. సత్యయుగంలో భక్తి యొక్క నామ-రూపాలు లేవు. ఇప్పుడైతే ఎంత ఆర్భాటము ఉంది, ఉత్సవాలు-తిరునాళ్ళు మొదలైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి, అక్కడకు మనుష్యులు వెళ్ళి హృదయాన్ని ఆహ్లాదపరచుకుంటారు. మీ హృదయాన్ని అయితే తండ్రి వచ్చి 21 జన్మల కొరకు ఆహ్లాదపరుస్తారు. తద్వారా మీరెల్లప్పుడూ ఆహ్లాదభరితంగా ఉంటారు. మీకు ఎప్పుడూ మేళాలు మొదలైనవాటికి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాదు. మనుష్యులు ఎక్కడికైనా సుఖము కొరకే వెళ్తారు. మీకు ఎక్కడా పర్వతాల పైకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మనుష్యులు ఎలా మరణిస్తారు! మనుష్యులకు సత్యయుగము-కలియుగము, స్వర్గము-నరకము గురించి కూడా తెలియదు. పిల్లలైన మీకైతే పూర్తి జ్ఞానమంతా లభించింది. పిల్లలైన మీరు నాతోపాటే ఉండాలని తండ్రి అనరు. మీరు ఇళ్ళూ-వాకిళ్ళను కూడా సంభాళించుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగితే అప్పుడు పిల్లలు వేరైపోతారు. అయినా కూడా మీరు తండ్రి సాంగత్యములో ఇక్కడ ఉండలేరు. అందరూ సతోప్రధానంగా అవ్వలేరు. కొందరు సతో, కొందరు రజో, కొందరు తమో అవస్థలో కూడా ఉన్నారు. అందరూ కలిసి ఉండలేరు. ఇక్కడ రాజధాని తయారవుతోంది. ఎవరు ఎంతెంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా దాని అనుసారంగా రాజధానిలో పదవిని పొందుతారు. ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయడమే. తండ్రి స్వయంగా కూర్చొని డ్రిల్ ను నేర్పిస్తారు. ఇది డెడ్ సైలెన్స్. మీరు ఇక్కడేదైతే చూస్తారో దానిని చూడకూడదు. దేహ సహితంగా అన్నింటినీ త్యాగం చేయాలి. మీరు ఏం చూస్తారు? ఒకటేమో మీ ఇంటిని గురించి మరియు చదువు అనుసారంగా ఏ పదవినైతే పొందుతారో ఆ సత్యయుగ రాజ్యం గురించి కూడా మీకే తెలుసు. ఎప్పుడైతే సత్యయుగముండేదో అప్పుడు త్రేతా లేదు, త్రేతా ఉన్నప్పుడు ద్వాపరము లేదు, ద్వాపరము ఉన్నప్పుడు కలియుగము లేదు. ఇప్పుడు కలియుగము కూడా ఉంది, సంగమయుగము కూడా ఉంది. మీరు పాత ప్రపంచములో కూర్చున్నా కానీ, బుద్ధి ద్వారా మేము సంగమయుగవాసులము అని భావిస్తారు. సంగమయుగము అని దేనినంటారు - అది కూడా మీకు తెలుసు. పురుషోత్తమ సంవత్సరము, పురుషోత్తమ మాసము, పురుషోత్తమ రోజు కూడా ఈ పురుషోత్తమ సంగమయుగములోనే ఉంటుంది. పురుషోత్తములుగా అయ్యే ఘడియ కూడా ఈ పురుషోత్తమ యుగములోనే ఉంది. ఇది చాలా చిన్నని లీప్ యుగము. మీరు పిల్లిమొగ్గల ఆటను ఆడతారు, అలా ఆడుతూ మీరు స్వర్గములోకి వెళ్తారు. సాధువులు లేక ఇతరులు ఎలా పిల్లిమొగ్గలు వేస్తూ-వేస్తూ యాత్రలకు వెళ్తారో బాబా చూసారు. ఎంతో కష్టపడతారు. ఇప్పుడిక్కడ ఎటువంటి కష్టమూ లేదు. ఇవి యోగబలానికి సంబంధించిన విషయాలు. స్మృతి యాత్ర పిల్లలైన మీకు కష్టమనిపిస్తోందా ఏమిటి? అది విని భయపడకుండా ఉండేందుకని చాలా సహజమైన పేరును పెట్టారు. బాబా, మేము యోగములో ఉండలేమని అంటారు. బాబా అప్పుడు తేలిక చేస్తారు. ఇది తండ్రి స్మృతి. స్మృతి అంటే అన్ని వస్తువులనూ స్మృతి చేయడం జరుగుతుంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు పిల్లలు కదా. వీరు మీ తండ్రి కూడా, అలాగే ప్రియుడు కూడా. ప్రేయసులందరూ వారిని స్మృతి చేస్తారు. తండ్రి అన్న ఒక్క పదమైనా సరిపోతుంది. భక్తి మార్గములో మీరు మిత్ర-సంబంధీకులను స్మృతి చేస్తారు, అయినా కానీ, ఓ ప్రభూ, ఓ ఈశ్వరా అని తప్పకుండా అంటారు. కానీ కేవలం వారు ఎవరన్నది తెలియదు. ఆత్మల తండ్రి అయితే పరమాత్మ. ఈ శారీరక తండ్రి అయితే దేహధారి. ఆత్మల తండ్రి అశరీరి. వారు ఎప్పుడూ పునర్జన్మలలోకి రారు. మిగిలినవారంతా పునర్జన్మలలోకి వస్తారు, అందుకే తండ్రినే స్మృతి చేస్తారు. తప్పకుండా వారు ఎప్పుడో సుఖాన్ని ఇచ్చారు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు, కానీ వారి నామ-రూప-దేశ-కాలాల గురించి తెలియదు. ఎంతమంది మనుష్యులో అన్ని విషయాలు ఉన్నాయి. అనేక మతాలు ఏర్పడ్డాయి.

తండ్రి ఎంత ప్రేమగా చదివిస్తారు. వారు ఈశ్వరుడు, శాంతిని ఇచ్చేవారు. ఎంతగా వారి నుండి సుఖము లభిస్తుంది. ఒక్క గీతను వినిపించి పతితులను పావనంగా తయారుచేస్తారు. ప్రవృత్తి మార్గం కూడా కావాలి కదా. మనుష్యులు కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని అనేసారు, అలాగైతే లెక్కలేనంతమంది మనుష్యులైపోతారు. ఎంత పొరపాటు చేసారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది, ఇది తర్వాత కనుమరుగైపోతుంది. చిత్రాలైతే ఉన్నాయి, వాటికి పూజలు జరుగుతూ ఉంటాయి. కానీ స్వయాన్ని దేవతా ధర్మానికి చెందినవారిగా భావించరు. ఎవరు ఎవరి పూజను చేస్తారో, వారు ఆ ధర్మానికి చెందినవారే కదా. తాము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని, వారి వంశావళికి చెందినవారమని అర్థం చేసుకోలేరు. ఈ విషయాలను తండ్రే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, మీరు పావనంగా ఉండేవారు, మళ్ళీ తమోప్రధానంగా అయిపోయారు, ఇప్పుడు పావన సతోప్రధానులుగా అవ్వాలి. మరి గంగా స్నానాల ద్వారా అలా అవుతారా? పతిత-పావనుడైతే ఒక్క తండ్రే. వారెప్పుడైతే వచ్చి దారిని తెలియజేస్తారో, అప్పుడే పావనులుగా అవుతారు. వారిని పిలుస్తూ ఉంటారు కానీ వారి గురించేమీ తెలియదు. ఆత్మ ఇంద్రియాల ద్వారా - ఓ పతిత-పావన బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తుంది. అందరూ పతితులుగా ఉన్నారు, కామ చితిపై కాలుతూ ఉంటారు. ఈ ఆటయే ఈ విధంగా తయారుచేయబడి ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ పావనంగా తయారుచేస్తారు. దీనిని తండ్రి సంగమయుగములోనే అర్థం చేయిస్తారు. సత్యయుగములో ఒకే ధర్మముంటుంది, మిగిలినవారంతా తిరిగి వెళ్ళిపోతారు. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. ఈ రచన ఆదిమధ్యాంతాలు ఏమిటి, దీని కాల పరిమితి ఎంత, ఇది మీకే తెలుసు. వారంతా శూద్రులు, మీరు బ్రాహ్మణులు. మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. ఎవరైనా పొరపాటు చేస్తే వీరు తక్కువగా చదువుకున్నారన్నది వారి రిజిస్టర్ ద్వారా కనిపిస్తుంది. క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా రిజిస్టర్ ఉండాలి. ఇది స్మృతి యాత్ర, దీని గురించి ఇంకెవ్వరికీ తెలియదు. అన్నింటికన్నా ముఖ్యమైన సబ్జెక్ట్ స్మృతి యాత్ర. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. నేను ఒక శరీరాన్ని వదలి ఇంకొకటి తీసుకుంటాను అని ఆత్మ తన నోటితో అంటుంది. ఈ విషయాలన్నింటినీ ఈ బ్రహ్మాబాబా అర్థం చేయించరు, వీటిని జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ ఈ రథములో కూర్చొని వినిపిస్తారు. గౌముఖము అని అంటారు. ఆ మందిరము కూడా ఇక్కడే, మీరు కూర్చొన్న చోటనే తయారుచేయబడి ఉంది. ఏ విధముగా మీ మెట్లున్నాయో, అలాగే అక్కడ కూడా మెట్లున్నాయి. మీకు పైకి ఎక్కడంలో అలసట కలుగదు.

మీరు ఇక్కడకు తండ్రి ద్వారా చదువుకొని రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చారు. అక్కడైతే వ్యాపార వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. శాంతిగా వినలేరు కూడా. ఎవరూ చూడకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న సంకల్పం నడుస్తూ ఉంటుంది. ఎంత చింత ఉంటుంది. ఇక్కడైతే ఏ చింతా ఉండదు, హాస్టల్లో ఉన్నట్లుగా ఉంటారు. ఇక్కడ ఇది ఈశ్వరీయ పరివారము. శాంతిధామములో సోదరులే ఉంటారు. ఇక్కడ సోదరీ-సోదరులుగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ పాత్రను అభినయించాలి కావున సోదరీ-సోదరులు కావాలి. సత్యయుగములో కూడా మీరే పరస్పరం సోదరీ-సోదరులుగా ఉండేవారు. దానినే అద్వైత రాజధాని అని అంటారు. అక్కడ కొట్లాటలు, గొడవలు ఏమీ ఉండవు. పిల్లలైన మీకు - మేము 84 జన్మలు తీసుకుంటాము అని పూర్తి జ్ఞానం లభించింది. ఎవరైతే ఎక్కువ భక్తిని చేసారో వారి లెక్కలను కూడా తండ్రి తెలియజేసారు. మీరే శివుని యొక్క అవ్యభిచారీ భక్తిని చేయడం మొదలుపెడతారు. ఆ తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. అదంతా భక్తి. జ్ఞానమైతే ఒకటే ఉంటుంది. మనల్ని శివబాబా చదివిస్తారని మీకు తెలుసు. ఈ బ్రహ్మాకైతే ఏమీ తెలిసేది కాదు. ఎవరైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గా ఉండేవారో, వారు ఈ సమయంలో ఇలా అయ్యారు, మళ్ళీ యజమానిగా అవుతారు, తతత్వం. ఒక్కరే యజమానిగా అవ్వరు కదా. మీరు కూడా పురుషార్థము చేస్తారు. ఇది అనంతమైన స్కూల్. దీని శాఖలు ఎన్నో ఉంటాయి. వీధి వీధిలోనూ, ఇంటింటిలోనూ ఇవి తయారవుతాయి. మేము మా ఇంట్లో చిత్రాలు పెట్టుకున్నాము, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు వస్తే వారికి అర్థం చేయిస్తామని అంటారు. ఎవరైతే ఈ వృక్షానికి చెందిన ఆకులు ఉంటారో, వారు ఇక్కడకు వచ్చేస్తారు. వారి కళ్యాణము కొరకు మీరు ఇది చేస్తారు. చిత్రాలపై అర్థం చేయించడం సహజమవుతుంది. శాస్త్రాలైతే లెక్కలేనన్ని చదివారు, ఇప్పుడు అన్నింటినీ మర్చిపోవాలి. చదివించేవారు తండ్రి, వారే సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. డెడ్ సైలెన్స్ యొక్క డ్రిల్ ను చేసేందుకు ఇక్కడ ఏవైతే ఈ కనులకు కనిపిస్తున్నాయో వాటిని చూడకూడదు. దేహ సహితంగా బుద్ధి ద్వారా అన్నింటినీ త్యజించి, తమ ఇల్లు మరియు రాజ్యం యొక్క స్మృతిలో ఉండాలి.

2. మీ క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ ను ఉంచాలి. చదువులో ఏ విధమైన పొరపాటూ చేయకూడదు. ఈ పురుషోత్తమ సంగమయుగములో పురుషోత్తములుగా అవ్వాలి మరియు తయారుచేయాలి.

వరదానము:-

సదా సర్వ ప్రాప్తులతో నిండుగా ఉండే హర్షితముఖ, హర్షితచిత్త భవ

ఎప్పుడైతే దేవీ-దేవతా మూర్తులను తయారుచేస్తారో, అందులో ముఖాలను సదా హర్షితంగా చూపిస్తారు. ఈ సమయములోని హర్షితముఖులుగా ఉండటాన్నే స్మృతిచిహ్న చిత్రాలలో కూడా చూపిస్తారు. హర్షితముఖము అనగా సదా సర్వ ప్రాప్తులతో నిండుగా ఉండటము. ఎవరైతే నిండుగా ఉంటారో వారే హర్షితంగా ఉండగలరు. ఒకవేళ ఏ విధమైన అప్రాప్తి ఉన్నా సరే హర్షితంగా ఉండరు. హర్షితంగా ఉండేందుకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా, బయటకు నవ్వుతారు కానీ హృదయపూర్వకంగా కాదు. మీరైతే హృదయపూర్వకంగా చిరునవ్వుతో ఉంటారు ఎందుకంటే మీరు సర్వ ప్రాప్తులతో నిండుగా హర్షితచిత్తులుగా ఉంటారు.

స్లోగన్:-

పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలి.