14-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.03.99


‘‘కర్మాతీత అవస్థ వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ ను పెంచుకోండి, స్వరాజ్య అధికారులుగా అవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ అత్యంత ప్రియమైన రాజా పిల్లలను, పరమాత్మునికి ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్ముని ప్రీతి లేక పరమాత్ముని ప్రేమ చాలా కొద్దిమంది పిల్లలకే ప్రాప్తిస్తుంది. చాలా కొద్దిమందే ఇటువంటి భాగ్యానికి అధికారులుగా అవుతారు. ఇటువంటి భాగ్యవంతులైన పిల్లలను చూసి బాప్ దాదా కూడా హర్షిస్తారు. అత్యంత ప్రియమైనవారు అనగా రాజా పిల్లలు. మరి మిమ్మల్ని మీరు రాజులుగా భావిస్తున్నారా? పేరే రాజయోగి. రాజయోగి అనగా రాజా పిల్లలు. వర్తమాన సమయంలో కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజులు. మీ డబుల్ రాజ్య పదవిని అనుభవము చేస్తుంటారు కదా? మిమ్మల్ని మీరు చూసుకోండి - నేను రాజుగా ఉన్నానా? స్వరాజ్య అధికారిగా ఉన్నానా? రాజ్య కార్యవ్యవహారాలు చేసే కర్మచారులన్నీ మీ ఆజ్ఞ ప్రకారంగా కార్యం చేస్తున్నాయా? రాజు యొక్క విశేషత ఏమిటి అన్నదైతే తెలుసు కదా? రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ (పరిపాలన శక్తి మరియు నియంత్రణ శక్తి), ఈ రెండు శక్తులూ మీ వద్ద ఉన్నాయా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - రాజ్య కార్యవ్యవహారాలు చేసే కర్మచారులు సదా మీ కంట్రోల్లో నడుస్తున్నాయా?

బాప్ దాదా ఈ రోజు పిల్లల యొక్క కంట్రోలింగ్ పవర్ ను, రూలింగ్ పవర్ ను చెక్ చేస్తున్నారు, మరి ఏం చూసి ఉంటారో చెప్పండి? ప్రతి ఒక్కరికీ అయితే తెలుసు. బాప్ దాదా చూసారు - ఇప్పటికీ కూడా అందరికీ అఖండ రాజ్యాధికారం లేదు. అఖండంగా లేదు అనగా మధ్య-మధ్యలో ఖండితం అవుతుంది. ఎందుకు? సదా స్వరాజ్యం ఉండేందుకు బదులుగా పర రాజ్యం స్వరాజ్యాన్ని ఖండితం చేసేస్తుంది. పర రాజ్యానికి గుర్తు ఏమిటంటే - ఈ కర్మేంద్రియాలు పరాధీనమైపోతాయి. మాయా రాజ్యం యొక్క ప్రభావము పడుతుంది అనగా అది పరాధీనులుగా చేస్తుంది. వర్తమాన సమయములో కొద్దిమంది బాగానే ఉన్నారు కానీ మెజారిటీ వర్తమాన సమయములోని మాయ యొక్క విశేష ప్రభావంలోకి వచ్చేస్తారు. ఆది అనాది సంస్కారాలేవైతే ఉన్నాయో, అవి కాకుండా మధ్యమధ్యలో మధ్యలోని సంస్కారాల ప్రభావంలోకి అనగా ద్వాపరము నుండి ఇప్పటి ఈ అంతిమ సమయములో ఉన్న సంస్కారాల ప్రభావంలోకి వచ్చేస్తారు. స్వయం యొక్క సంస్కారాలే స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. అందులో కూడా విశేషమైన సంస్కారాలు ఏమిటంటే - వ్యర్థము ఆలోచించటము, వ్యర్థముగా సమయాన్ని పోగొట్టుకోవటము మరియు వ్యర్థ సంభాషణలోకి రావటము, అది వినటమన్నా కావచ్చు, వినిపించటమన్నా కావచ్చు. ఒక వైపు వ్యర్థము యొక్క సంస్కారాలు, మరొక వైపు నిర్లక్ష్యము యొక్క సంస్కారాలు రకరకాల రాయల్ రూపాలలో స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే - సమయం సమీపంగా వస్తూ ఉంది కానీ ఏ సంస్కారాలైతే ప్రారంభంలో ఇమర్జ్ అయి లేవో, ఆ సంస్కారాలు ఇప్పుడు అక్కడక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. వాయుమండలములో వేరే సంస్కారాలు ఇమర్జ్ అవుతున్నాయి, దీనికి కారణం ఏమిటి? ఇది మాయ చేసే దాడిలో ఒక సాధనము. మాయ దీని ద్వారానే తనవారిగా చేసుకుని పరమాత్ముని మార్గం నుండి నిరాశాపరులుగా చేస్తుంది. ఇప్పటివరకు కూడా ఇలానే ఉంటే ఇక సమానత యొక్క సఫలత లభిస్తుందో, లేదో తెలియదు అని అనుకుంటారు. ఏదో ఒక విషయంలో ఎక్కడైతే బలహీనత ఉంటుందో, ఆ బలహీనత రూపంలోనే మాయ నిరాశాపరులుగా చేయడానికి ప్రయత్నిస్తుంది. చాలా మంచిగా నడుస్తూ, నడుస్తూ ఉండగా ఏదో ఒక విషయంలో మాయ సంస్కారాలపై దాడి చేసి, పాత సంస్కారాలను ఇమర్జ్ చేసే రూపాన్ని ధరించి బలహీనం చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతిమంలో అన్ని సంస్కారాలు సమాప్తమయ్యేదే ఉంది, అందుకే అక్కడక్కడ మిగిలిపోయి ఉన్న సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. కానీ బాప్ దాదా భాగ్యవాన్ పిల్లలైన మీ అందరికీ సూచనను ఇస్తున్నారు - భయపడకండి, మాయ తీరును అర్థం చేసుకోండి. సోమరితనము మరియు వ్యర్థము, ఇందులో నెగెటివ్ కూడా వస్తుంది - ఈ రెండు విషయాలపై విశేషమైన అటెన్షన్ పెట్టండి. ఇది వర్తమాన సమయంలో మాయ దాడి చెసే సాధనము అని అర్థం చేసుకోండి.

బాబా తోడు యొక్క అనుభవాన్ని, కంబైండ్ స్థితి యొక్క అనుభవాన్ని ఇమర్జ్ చేసుకోండి. బాబా ఎలాగూ నా వారే, వారు ఎలాగూ నా తోడుగానే ఉన్నారు అని ఇలా అనుకోవటం కాదు, తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవము ఇమర్జ్ అయ్యి ఉండాలి. అప్పుడు ఈ మాయ దాడి, దాడిలా ఉండదు, మాయ ఓడిపోతుంది. ఇది మాయ యొక్క ఓటమి, అంతేకానీ దాడి కాదు. కేవలం ఏమైంది, ఎందుకైంది అని భయపడకండి! ధైర్యం ఉంచండి, బాబా తోడును స్మృతిలో ఉంచుకోండి. చెక్ చేసుకోండి - బాబా తోడు ఉందా? తోడు యొక్క అనుభవము మర్జ్ రూపంలోనైతే లేదు కదా? బాబా తోడుగా ఉన్నారు అన్న జ్ఞానమైతే ఉంది, కానీ జ్ఞానంతోపాటుగా బాబా శక్తి ఏమిటి? బాబా సర్వశక్తివంతుడు కనుక సర్వ శక్తుల శక్తిని ఇమర్జ్ రూపంలో అనుభవం చేయ్యండి. దీనినే బాబా తోడును అనుభవము చెయ్యటము అని అంటారు. బాబా తప్ప నాకు ఇంకెవరు ఉన్నారు, బాబాయే కదా ఉన్నారు అని అనుకుంటూ నిర్లక్ష్యులుగా అవ్వకండి. బాబాయే ఉన్నారు అని అనుకుంటే మరి ఆ శక్తి ఉందా? మీరు ప్రపంచములోని వారితో ఇలా అంటారు కదా - ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి పరమాత్ముని గుణాలు అందరిలోనూ అనుభవమవ్వాలి కదా, కనిపించాలి కదా అని. కావున బాప్ దాదా కూడా మిమ్మల్ని అడుగుతున్నారు - ఒకవేళ బాబా తోడు ఉన్నట్లయితే, వారితో కంబైండ్ గా ఉన్నట్లయితే మరి ఆ శక్తి ప్రతి కర్మలోనూ అనుభవమవుతుందా? అది ఇతరులకు కూడా అనుభవమవుతుందా? ఏమనుకుంటున్నారు? డబుల్ విదేశీయులు ఏమనుకుంటున్నారు? ఆ శక్తి ఉందా? సదా ఉందా? మొదటి ప్రశ్నకైతే అందరూ - అవును, ఉంది అని అంటారు. కానీ తరువాత - ‘సదా’ ఉందా అన్న రెండో ప్రశ్నకు జవాబు చెప్పటానికి మాత్రం ఆలోచనలో పడిపోతారు. అంటే అఖండంగా అవ్వనట్లే కదా! మీరు ఏమని ఛాలెంజ్ చేస్తారు? అఖండ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా లేక ఖండిత రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అఖండ రాజ్యమే కదా! టీచర్లు చెప్పండి, అఖండమేనా? మరి ఇప్పుడు చెక్ చేసుకోండి - అఖండ స్వరాజ్యం ఉందా? రాజ్యము అనగా ప్రారబ్ధము సదాకాలమునకు తీసుకోవాలా లేక మధ్యమధ్యలో ఖండితమైనా పర్వాలేదా? ఇలా ఆలోచిస్తున్నారా? తీసుకోవటంలోనేమో సదా కావాలి అని అనుకుంటారు, కానీ పురుషార్థములో అప్పుడప్పుడు అనేది నడుస్తుంది, ఇలానా? విదేశీయులకు చెప్పాము కదా - మీ జీవితమనే డిక్షనరీ నుండి సమ్ టైమ్ మరియు సమ్ థింగ్ (అప్పుడప్పుడు మరియు ఏదో కొద్ది కొద్దిగా) అన్న మాటలను తొలగించివేయండి. ఇప్పుడు సమ్ టైమ్ (అప్పుడప్పుడు) అన్నది సమాప్తమైపోయిందా? జయంతి, చెప్పండి, రిజల్టును ఇస్తారు కదా. మరి సమ్ టైమ్ అనటం సమాప్తమైపోయిందా? సమ్ టైమ్ అన్న మాట సదాకాలానికి సమాప్తమైపోయింది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సమాప్తమైపోయిందా లేక సమాప్తమవుతుందా? చేతులు బాగా పైకి ఎత్తండి. వతనములోని టి.వి. లో అయితే మీ చేతులు వచ్చేసాయి, ఇక్కడి టి.వి.లో అందరి చేతులు కనిపించవు. ఇది కలియుగ టి.వి. కదా, అక్కడ మ్యాజిక్ టి.వి. ఉంది, అందుకే అందులో అందరివీ వచ్చేస్తాయి. అయినా కానీ చాలామందే చేతులు ఎత్తారు, చాలా మంచిది. వారికి సదాకాలమునకు అభినందనలు. అచ్ఛా. ఇప్పుడు భారతవాసులు, ఎవరికైతే ప్రాక్టికల్ గా సదాకాలపు స్వరాజ్యం ఉందో, సర్వ కర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్ (చట్టము మరియు వ్యవస్థ)లో నడుస్తున్నాయో వారు చేతులెత్తండి. చేతిని పక్కాగా ఎత్తాలి, కచ్చాగా కాదు. సభలో చేతులు ఎత్తాము అన్నదానిని సదా గుర్తుంచుకోండి. మళ్ళీ బాప్ దాదాకు చాలా మధురాతి మధురంగా విషయాలను వినిపిస్తారు. ఏమంటారంటే - బాబా, మీకైతే తెలుసు కదా, అప్పుడప్పుడు మాయ వచ్చేస్తుంది కదా! మీ చేతి యొక్క పరువును నిలబెట్టుకోండి. మంచిది. అయినప్పటికీ ధైర్యాన్ని పెట్టారు కదా, ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. ధైర్యాన్ని పెట్టినందుకు బాప్ దాదా నుండి సహాయం తప్పకుండా ఉంటుంది.

ఈ రోజు బాప్ దాదా చూసారు - వర్తమాన సమయమనుసారంగా మీపై మీకు, ప్రతి కర్మేంద్రియముపై అనగా స్వయానికి స్వయం పట్ల ఏ కంట్రోలింగ్ పవర్ అయితే ఉండాలో అది తక్కువగా ఉంది, అది ఇంకా ఎక్కువగా ఉండాలి. బాప్ దాదా పిల్లల ఆత్మిక సంభాషణను విని నవ్వుతున్నారు. పిల్లలు అంటారు, శక్తిశాలీ స్మృతి అయితే 4 గంటలు కూడా ఉండటం లేదు. బాప్ దాదా 8 గంటల నుండి 4 గంటలు చేసారు, కానీ పిల్లలేమో 2 గంటలు సరిపోతుంది అని అంటారు. మరి చెప్పండి, ఇది కంట్రోలింగ్ పవర్ ఉన్నట్లా? అంతేకాక ఇప్పటి నుండే ఒకవేళ ఈ అభ్యాసము లేకపోతే సమయము వచ్చినప్పుడు పాస్ విత్ ఆనర్లు గా, రాజ్యాధికారులుగా ఎలా అవ్వగలరు! తయారవ్వాల్సిందే కదా? పిల్లలు నవ్వుతారు. ఈ రోజు బాప్ దాదా పిల్లలవి చాలా విషయలు విన్నారు. బాప్ దాదాను నవ్విస్తారు కూడా. ఏమంటారంటే - ట్రాఫిక్ కంట్రోల్ అనేది మూడు నిమిషాలు అవ్వటం లేదు, శరీరం కంట్రోల్ అవుతుంది, నిలబడిపోతాము, కానీ పేరేమో మనసు యొక్క కంట్రోల్ కానీ మనసు అప్పుడప్పుడు కంట్రోల్ అవుతుంది, అప్పుడప్పుడు అవ్వటం లేదు. ఇందుకు కారణం ఏమిటి? కంట్రోలింగ్ పవర్ లోపించడము. దీనిని ఇప్పుడు ఇంకా పెంచాలి. ఆజ్ఞాపించండి. ఏ విధంగానైతే చేతిని పైకి ఎత్తాలి అనుకుంటే ఎత్తుతారు కదా. చెయ్యి విరిగి లేకపోతే ఎత్తుతారు కదా! అలాగే మనసు, ఈ సూక్ష్మ శక్తి కంట్రోల్ లోకి రావాలి. తీసుకురావాల్సిందే. మనసును ఆర్డర్ చెయ్యండి - ఆగిపో అని ఆజ్ఞాపిస్తే అది ఆగిపోవాలి. సేవ గురించి ఆలోచించు అని అంటే సేవలో మునిగిపోవాలి. పరంధామాములోకి వెళ్ళు అని అంటే పరంధామములోకి వెళ్ళిపోవాలి. సూక్ష్మవతనములోకి వెళ్ళు అని అంటే ఒక్క క్షణములో వెళ్ళిపోవాలి. ఏది ఆలోచిస్తే అది ఆర్డర్ అనుసారంగా జరగాలి. ఇప్పుడు ఈ శక్తిని పెంచుకోండి. చిన్న-చిన్న సంస్కారాలలో, యుద్ధాలలో సమయాన్ని పోగొట్టుకోకండి, ఈ రోజు ఈ సంస్కారాన్ని తరిమేసాము, రేపు ఈ సంస్కారాన్ని తరిమేసాము అని కాదు. కంట్రోలింగ్ పవర్ ను ధారణ చేసినట్లయితే వేరు-వేరు సంస్కారాల వెనుక సమయం పెట్టవలసిన అవసరము ఉండదు. ఆలోచించకూడదు, చెయ్యకూడదు, మాట్లాడకూడదు. స్టాప్ అంటే స్టాప్ అయిపోవాలి. ఇదే కర్మాతీత అవస్థ వరకు చేరుకునే విధి. మరి కర్మాతీతులుగా అవ్వాలి కదా? బాప్ దాదా కూడా అంటారు - మీరే అలా అవ్వాలి, ఇంకెవరో రారు, మీరే అలా అవ్వాలి. మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను కానీ కర్మాతీతులనే తీసుకువెళ్తాను కదా. నాతో పాటు వస్తారా లేక వెనక-వెనక వస్తారా? (మీతో పాటు వస్తాము). చాలా బాగా చెప్పారు. నాతో పాటు వస్తారు, మరి లెక్కను పూర్తి చేసుకుంటారా? చేసుకుంటాము అని ఇందులో హాజీ చెప్పటం లేదు. కర్మాతీతంగా అయ్యే నాతో పాటు వస్తారు కదా. తోడుగా రావటము అనగా సహచరునిగా అయ్యి నడవటము. జోడీ సరిగ్గా ఉండాలి కదా లేక ఒకరు పొడుగ్గా, ఒకరు పొట్టిగా ఉండాలా? సమానంగా ఉండాలి కదా! కనుక కర్మాతీతులుగా అవ్వాల్సిందే. మరి ఏం చేస్తారు? ఇప్పుడు మీ రాజ్యాన్ని మంచిగా సంభాళించుకోండి. ప్రతిరోజూ మీ దర్బారును పెట్టుకోండి. రాజ్యాధికారులు కదా! కావున మీ దర్బారును పెట్టుకోండి, కర్మచారులను స్థితిగతుల గురించి అడగండి. అవి ఆర్డర్ లో ఉన్నాయా అన్నదానిని చెక్ చేసుకోండి. బ్రహ్మాబాబా కూడా ప్రతిరోజూ దర్బారును పెట్టేవారు. వారి డైరీ ఉంది కదా. దాని గురించి వీరికి చెప్పండి, చూపించండి. బ్రహ్మాబాబా కూడా కష్టపడ్డారు, ప్రతి రోజూ దర్బారు పెట్టుకునేవారు, అందుకే కర్మాతీతులుగా అయ్యారు. మరి ఇప్పుడు ఎంత సమయం కావాలి? లేక ఎవర్రెడీగా ఉన్నారా? ఈ అవస్థ ద్వారా సేవ కూడా ఫాస్ట్ గా అవుతుంది. ఎందుకని? ఒకే సమయంలో మనసా శక్తిశాలిగా, వాచా శక్తిశాలిగా, సంబంధ-సంపర్కాలలో నడవడిక మరియు ముఖము శక్తిశాలిగా ఉంటాయి. ఒకే సమయములో మూడు సేవలు ఉంటే చాలా త్వరగా రిజల్టు వస్తుంది. ఈ సాధనలో సేవ తక్కువైపోతుంది అని అనుకోకండి, అలా కాదు. సఫలత సహజంగా అనుభవమవుతుంది. మరియు ఎవరెవరైతే సేవకు నిమిత్తులుగా ఉన్నారో, వారంతా ఒకవేళ సంగఠిత రూపంలో ఇటువంటి స్థితిని తయారుచేసుకుంటే శ్రమ తక్కువ మరియు సఫలత ఎక్కువగా ఉంటుంది. కనుక విశేషంగా పెట్టాల్సిన అటెన్షన్ ఏమిటంటే - కంట్రోలింగ్ పవర్ ను పెంచుకోండి. సంకల్పాలు, సమయము, సంస్కారాలు అన్నింటిపైనా కంట్రోల్ ఉండాలి. చాలాసార్లు బాప్ దాదా చెప్పారు - మీరందరూ రాజులు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం మనస్సు-బుద్ధి లా అన్డ్ ఆర్డర్ (చట్టము మరియు వ్యవస్థ) అనుసారంగా ఉండాలి. మీరు - చెయ్యకూడదు అని చెప్పినా కానీ మరలా జరుగుతుంది లేక అవి చేస్తున్నాయి అని అంటే అది అదుపాజ్ఞలలో లేనట్లే. కనుక స్వరాజ్య అధికారులైన మీరు మీ రాజ్యాన్ని సదా ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకురండి. తీసుకురావాలి కదా? తీసుకువస్తున్నారు కూడా, కానీ ‘సదా’ అన్న మాటను కలపండి అని బాప్ దాదా అంటారు. బాప్ దాదా ఇప్పుడు చివరిలో వస్తారు, ఇప్పుడు ఇంకొక మిలము ఉంది. ఆ మిలనములో రిజల్టును అడుగుతారు. 15 రోజులు ఉంటాయి కదా. మరి ఈ 15 రోజుల్లో ఏమైనా రిజల్టు చూపిస్తారా, లేదా? టీచర్లు చెప్పండి, 15 రోజులలో రిజల్టు చూపిస్తారా?

అచ్ఛా, మధుబన్ వారు 15 రోజులలో రిజల్టు చూపిస్తారా. ఇప్పుడు చెప్పండి - చూపిస్తారా, లేదా! ఇప్పుడు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు). మీ చేతి యొక్క పరువు నిలబెట్టుకోండి. ఎవరైతే - మేము ప్రయత్నిస్తాము అని అనుకుంటున్నారో, అలా ప్రయత్నం చెయ్యాలనుకువారు చేతులెత్తండి. జ్ఞాన సరోవర్, శాంతివన్ వారు లేచి నిలబడండి. (బాప్ దాదా మధుబన్, జ్ఞాన సరోవర్, శాంతివన్ యొక్క ముఖ్యమైన నిమిత్త సోదర, సోదరీలను ఎదురుగా రమ్మని పిలిచారు).

బాప్ దాదా మిమ్మల్నందరినీ సాక్షాత్కారం చేయించేందుకు పిలిచారు. మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో చెప్తున్నారు. పాండవ భవన్ అయినా, శాంతివన్ అయినా, జ్ఞాన సరోవర్ అయినా, హాస్పిటల్ అయినా, ఈ నాలుగు ధామాలైతే ఉన్నాయి. అయిదవది చిన్నది. ఈ నాలుగు ధామాల వారి పట్ల బాప్ దాదాకు ఒక ఆశ ఉంది, అది ఏమిటంటే - బాప్ దాదా మూడు నెలల కొరకు నాలుగు ధామాలలోనూ అఖండ, నిర్విఘ్న, స్థిరమైన స్వరాజ్య అధికారీ రాజుల రిజల్టును చూడాలనుకుంటున్నారు. ఈ మూడు నెలల్లో ఎక్కడి నుండి కూడా మరే ఇతర విషయాలు వినిపించకూడదు. అందరూ నంబర్ వన్ స్వరాజ్య అధికారులుగా అవ్వాలి. మరి మూడు నెలల్లో ఇటువంటి రిజల్టును చూపించగలరా? (నిర్వైర్ భాయిజీతో) - పాండవుల తరఫున మీరు ఉన్నారు. వీలవుతుందా? దాది అయితే ఉన్నారు కానీ దాదీతోపాటుగా ఈ ముందు కూర్చున్న వీరందరూ కూడా ఉన్నారు. మరి వీలవుతుందా? (వీలవుతుంది అని దాదీ చెప్పారు) పాండవ భవన్ వారు ఎవరైతే కూర్చుని ఉన్నారో వారు చేతులెత్తండి, వీలవుతుందా? ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి, వారికి ఏమైనా అయితే మీరు ఏం చేస్తారు? తోడుగా ఉన్నవారికి కూడా తోడును అందిస్తూ రిజల్టును చూపిస్తాము అనేంత ధైర్యం ఉంచుతారా? ఇది కూడా చెయ్యగలరా లేక కేవలం మీ వరకే ధైర్యం ఉందా? ఇతరుల విషయాలను కూడా ఇముడ్చుకోగలరా? వారి పొరపాటును ఇముడ్చుకోగలరా? వాయుమండలంలో వ్యాపింపజేయకండి, ఇముడ్చుకోండి, ఇంత చెయ్యగలరా? చెయ్యగలం అని గట్టిగా చెప్పండి. అభినందనలు. 3 నెలల తర్వాత రిపోర్టు చూస్తాము. ఏ స్థానం నుండి కూడా ఎటువంటి రిపోర్టు రాకూడదు. ఇతరులకు వైబ్రేషన్లు ఇస్తూ ఇముడ్చుకోండి మరియు ప్రేమతో వైబ్రేషన్లను ఇవ్వండి. గొడవలు జరగకూడదు.

అలాగే, డబుల్ విదేశీయులు కూడా ఇటువంటి రిజల్టును ఇస్తారు కదా. అందరూ ఇలా తయారవ్వాలి కదా. మా సెంటర్లో, సహచరులతో పాటుగా 3 నెలల్లో రిజల్టును చూపిస్తాము అని అనుకునే డబుల్ విదేశీయులు చేతులెత్తండి. ఏమో చెప్పలేము, ప్రయత్నిస్తాము అని అనుకునేవారు చేతులెత్తండి. స్వచ్ఛమైన మనసు కలవారు, స్వచ్చమైన మనస్సు కలవారికి సహాయము లభిస్తుంది. అచ్ఛా. (తర్వాత బాప్ దాదా అన్ని జోన్ల సోదర, సోదరీలను కూడా చేతులెత్తించారు మరియు వారి వారి స్థానాలలో నిలబెట్టారు. మొదట మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక సోదర, సోదరీలను నిలబెట్టించారు మరియు వారి చేత ప్రమాణము చేయించారు. తర్వాత ఉత్తరప్రదేశ్ వారికి వారి సేవకు అభినందనలను తెలిపారు) అచ్ఛా!

నలువైపులా కల సర్వ స్వరాజ్య అధికారీ ఆత్మలకు, సదా అఖండ రాజ్యానికి పాత్రులైన ఆత్మలకు, సదా తండ్రి సమానంగా కర్మాతీత స్థితికి చేరుకునేవారికి, తండ్రిని ఫాలో చేసే తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా ఇతరులకు శుభ భావన, శుభ కామనల సహయోగాన్ని ఇచ్చే శుభ చింతకులైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

విఘ్నకారీ ఆత్మను శిక్షకునిగా భావించి వారి నుండి పాఠాన్ని నేర్చుకొనే అనుభవీమూర్త భవ

ఏ ఆత్మలైతే విఘ్నాలను కలిగించేందుకు నిమిత్తులుగా అవుతారో, వారిని విఘ్నకారీ ఆత్మలుగా చూడకండి, వారిని సదా పాఠాన్ని నేర్పించేవారిగా, ముందుకు తీసుకువెళ్ళే నిమిత్త ఆత్మలుగా భావించండి, వారిని అనుభవజ్ఞులుగా తయారుచేసే శిక్షకునిగా భావించండి. నిందించేవారిని మిత్రులు అని అన్నప్పుడు, మరి విఘ్నాలను దాటించి అనుభవజ్ఞులుగా తయారుచేసేవారు శిక్షకులు అవుతారు, అందుకే విఘ్నకారీ ఆత్మలను ఆ దృష్టితో చూసేందుకు బదులుగా సదా కొరకు విఘ్నాలను దాటించేందుకు నిమిత్తులుగా, అచలంగా తయారుచేసేందుకు నిమిత్తులుగా భావించండి, దీని ద్వారా ఇంకా అనుభవాల అథారిటీ పెరుగుతూ ఉంటుంది.

స్లోగన్:-

ఫిర్యాదుల ఫైల్ ను సమాప్తము చేసి ఫైన్ గా మరియు రిఫైన్ గా అవ్వండి.