15-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ సంగమయుగము ఉత్తమోత్తములుగా అయ్యే యుగము, ఇందులోనే మీరు పతితుల నుండి పావనులుగా అయి పావన ప్రపంచాన్ని తయారుచేయాలి’’

ప్రశ్న:-

అంతిమ బాధాకరమైన దృశ్యాలను చూసేందుకు దృఢత్వము ఏ ఆధారముపై వస్తుంది?

జవాబు:-

శరీర భానాన్ని తొలగిస్తూ వెళ్ళండి. అంతిమ దృశ్యం చాలా కఠినమైనది. తండ్రి పిల్లలను దృఢంగా చేసేందుకు అశరీరులుగా అవ్వమని సూచననిస్తారు. ఏ విధముగా తండ్రి ఈ శరీరము నుండి వేరుగా ఉంటూ మీకు నేర్పిస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా స్వయాన్ని శరీరము నుండి వేరుగా భావించండి, అశరీరులుగా అయ్యే అభ్యాసము చేయండి. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి.

ఓంశాంతి

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు దేహముతో పాటు ఉన్నారు. తండ్రి కూడా ఇప్పుడు దేహముతో పాటు ఉన్నారు. వారు ఈ గుర్రముపై లేక బండిపై సవారీ చేస్తున్నారు, మరి పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారు? జీవిస్తూనే మరణించడమనేది ఎలా జరుగుతుంది అన్నది నేర్పిస్తున్నారు. దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. తండ్రి పరిచయం పిల్లలందరికీ లభించింది, వారు జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. జ్ఞానము ద్వారానే మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు, మరియు పావన ప్రపంచాన్ని కూడా తయారుచేయాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా ఈ పతిత ప్రపంచము యొక్క వినాశనము జరుగనున్నది. కేవలం ఎవరైతే తండ్రిని గుర్తిస్తారో మరియు బ్రాహ్మణులుగా కూడా అవుతారో వారే మళ్ళీ పావన ప్రపంచములోకి వచ్చి రాజ్యం చేస్తారు. పవిత్రులుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ సంగమయుగము పురుషోత్తమ యుగము అనగా ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగము. సాధువులు, సన్యాసులు, మహాత్ములు, మంత్రులు, ధనికులు, ప్రెసిడెంట్ వంటి వారెందరో ఉత్తములే కదా అని అంటారు. కానీ అలా కాదు. ఇది కలియుగ భ్రష్టాచారీ ప్రపంచము, పాత ప్రపంచము. పతిత ప్రపంచములో పావనులు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మీరు సంగమయుగానికి చెందినవారిగా అవుతారు. వారు నీటిని పతిత-పావని అని భావిస్తారు. కేవలం గంగనే కాదు, ఎక్కడ నదులున్నా, ఎక్కడ నీరు కనిపించినా, నీరే పావనంగా చేస్తుందని భావిస్తారు. ఇది బుద్ధిలో కూర్చొని ఉంది. ఒక్కొక్కరూ ఒక్కో చోటుకు వెళ్తారు. అంటే నీటిలో స్నానం చేయడానికి వెళ్తారు. కానీ నీటి ద్వారానైతే ఎవ్వరూ పావనులుగా అవ్వలేరు. ఒకవేళ నీటిలో స్నానం చేయడం ద్వారా పావనంగా అవ్వగలిగినట్లయితే ఈ సమయానికి మొత్తం సృష్టంతా పావనంగా అయిపోయుండేది. అప్పుడు ఇంతమందీ పావన ప్రపంచములో ఉండాలి. ఇదైతే ఒక పాత ఆచారంగా నడుస్తూ వస్తోంది. సాగరములోకి చెత్తాచెదారమంతా వెళ్ళి పడుతూ ఉంటుంది, ఇక అది పావనంగా ఎలా తయారుచేస్తుంది? పావనంగా అవ్వవలసింది ఆత్మ. దీని కొరకు ఆత్మలను పావనంగా తయారుచేసే పరమపిత కావాలి. కావున సత్యయుగములోనే పావనులుంటారని, కలియుగములో పతితులుంటారని మీరు అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. పతితులు నుండి పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మేము శూద్ర వర్ణానికి చెందినవారిగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా ప్రజాపిత బ్రహ్మా ద్వారా అలా తయారుచేస్తారు. మనం సత్యాతి-సత్యమైన ముఖవంశావళీ బ్రాహ్మణులము. వారు కుఖ వంశావళులు. ప్రజాపిత ఉన్నట్లయితే మొత్తం అంతా ప్రజగా అయినట్లే. ఆ ప్రజలకు తండ్రి బ్రహ్మా. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. వారు తప్పకుండా ఉండేవారు, మళ్ళీ ఎక్కడకు వెళ్ళారు? పునర్జన్మలనైతే తీసుకుంటారు కదా. బ్రహ్మా కూడా పునర్జన్మలను తీసుకుంటారని పిల్లలకు తెలియజేశారు. బ్రహ్మా మరియు సరస్వతి, తండ్రి మరియు తల్లి, వారే మళ్ళీ మహారాజా, మహారాణీ, లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, వారినే విష్ణువు అని అంటారు. వారే మళ్ళీ 84 జన్మల తరువాత వచ్చి బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. ఈ రహస్యాన్ని అర్థం చేయించారు. జగదాంబ అయితే మొత్తం జగత్తు అంతటికీ తల్లి అవుతారని కూడా అంటారు. లౌకిక తల్లి అయితే ప్రతి ఒక్కరికీ తమ ఇంట్లోనే ఉన్నారు. కానీ జగదాంబ గురించి ఎవరికీ తెలియదు. ఏదో అంధశ్రద్ధతో అలా అనేస్తారు. వాస్తవానికి ఎవరి గురించీ తెలియదు. ఎవరి పూజనైతే చేస్తారో వారి కర్తవ్యము గురించి తెలియదు. రచయిత ఉన్నతోన్నతమైనవారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇది తలక్రిందుల వృక్షము, దీని బీజరూపము పైన ఉన్నారు. తండ్రి మిమ్మల్ని పావనంగా తయారుచేయడానికి పై నుండి కిందకు రావలసి ఉంటుంది. ఇప్పుడు బాబా వచ్చారని, మనకు ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్నిచ్చి మళ్ళీ ఆ కొత్త సృష్టికి చక్రవర్తీ రాజా-రాణులుగా తయారుచేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ చక్రము యొక్క రహస్యము గురించి మీకు తప్ప ఈ ప్రపంచములో ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి అంటారు - మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత వచ్చి మీకు వినిపిస్తాను. ఈ డ్రామా తయారై-తయారుచేయబడినది. డ్రామా రచయిత, డైరెక్టర్, ముఖ్య యాక్టర్ మరియు డ్రామా ఆదిమధ్యాంతాల గురించి తెలియకపోతే వారిని తెలివితక్కువవారనే అంటారు కదా. తండ్రి అంటారు, 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మీకు అర్థం చేయించాను, మీకు నా పరిచయాన్ని ఏ విధముగా ఇప్పుడు ఇస్తున్నానో, అలాగే అప్పుడూ ఇచ్చాను. ఏ విధంగా ఇప్పుడు మిమ్మల్ని పవిత్రముగా తయారుచేస్తున్నానో, అలాగే అప్పుడూ తయారుచేసాను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. వారే సర్వశక్తివంతుడు, పతిత-పావనుడు. అంత్యకాలములో ఎవరైతే ఫలానాను స్మరిస్తారో... వారు ఘడియ ఘడియ అదే యోనిలోకి వెళ్తారు అన్న గాయనము కూడా ఉంది. ఇప్పుడు ఈ సమయంలో మీరు జన్మలనైతే తీసుకుంటారు కానీ పందులుగా, కుక్కలుగా, పిల్లులుగా అవ్వరు.

ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని అని వారంటారు. వీరంతా కామ చితిపై కూర్చొని నల్లగా అయిపోయారు, వీరిని మళ్ళీ జ్ఞాన చితి పైకి ఎక్కించాలి. మీరు ఇప్పుడు జ్ఞాన చితి పైకి ఎక్కారు. జ్ఞాన చితి పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ వికారాలలోకి వెళ్ళకూడదు. మేము పవిత్రముగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా ఆ రాఖీనేమీ కట్టించరు. అది భక్తి మార్గపు ఆచారముగా నడుస్తూ వస్తుంది. వాస్తవానికి అది ఈ సమయము యొక్క విషయమే. పవిత్రముగా అవ్వకుండా పావన ప్రపంచానికి యజమానులుగా ఎలా అవ్వగలరు అని మీరు భావిస్తారు. అయినా మళ్ళీ పక్కా చేయించేందుకు పిల్లలతో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. కొందరు రక్తంతో వ్రాసి ఇస్తారు, కొందరు ఇంకెలాగో వ్రాస్తారు. బాబా, మీరు వచ్చారు, మేము మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. నిరాకారుడు సాకారములోకి వస్తారు కదా. ఏ విధముగా తండ్రి పరంధామము నుండి దిగి వస్తారో అలాగే ఆత్మలైన మీరు కూడా దిగుతారు. పై నుండి కిందకు పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇది సుఖ-దుఃఖాల ఆట అని మీరు భావిస్తారు. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖము ఉంటాయి. మూడు వంతుల కన్నా ఎక్కువ సుఖాన్ని మీరు అనుభవిస్తారని తండ్రి అర్థం చేయిస్తారు. అర్ధకల్పం తర్వాత కూడా మీరు ధనవంతులుగా ఉండేవారు. ఎంత పెద్ద-పెద్ద మందిరాలు మొదలైనవాటిని తయారుచేయిస్తారు. దుఃఖమైతే, చివరిలో ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధాన భక్తి ఏర్పడుతుందో అప్పుడు వస్తుంది. మీరు మొట్టమొదట అవ్యభిచారీ భక్తులుగా ఉండేవారని, కేవలం ఒక్కరి భక్తినే చేసేవారని తండ్రి అర్థం చేయించారు. ఏ తండ్రి అయితే మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తారో, సుఖధామంలోకి తీసుకువెళ్తారో వారినే మీరు పూజించేవారు. మళ్ళీ తరువాత వ్యభిచారీ భక్తి ప్రారంభమవుతుంది. మొదట ఒక్కరి పూజను, ఆ తర్వాత దేవతల పూజను చేసేవారు. ఇప్పుడైతే పంచ భూతాలతో తయారుచేయబడిన శరీరాలను పూజిస్తారు. చైతన్యమైన శరీరాలనూ పూజిస్తారు, అలాగే జడమైన వాటినీ పూజిస్తారు. పంచ తత్వాలతో తయారుచేయబడిన శరీరాన్ని దేవతల కన్నా ఉన్నతమైనదిగా భావిస్తారు. దేవతలనైతే కేవలం బ్రాహ్మణులే ముట్టుకుంటారు. మీకైతే లెక్కలేనంతమంది గురువులు ఉండేవారు. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. నేను కూడా అన్నీ చేసానని ఈ దాదా కూడా అంటారు. భిన్న భిన్న హఠయోగాలు, చెవులు-ముక్కు తిప్పడం మొదలైనవెన్నో చేసాను. చివరికి అన్నింటినీ వదలి వేయవలసి వచ్చింది. ఆ వ్యాపారం చేయనా లేక ఈ వ్యాపారం చేయనా? బద్ధకం వస్తూ ఉండేది, విసిగిపోయేవాడిని. ప్రాణాయామాలు మొదలైనవి నేర్చుకోవడంలో ఎంతో కష్టం కలిగేది. అర్ధకల్పం భక్తి మార్గంలో ఉన్నాము, ఇప్పుడు తెలుస్తుంది. తండ్రి పూర్తిగా ఏక్యురేట్ గా చెప్తారు. భక్తి పరంపరగా నడుస్తూ వస్తుందని వారంటారు. ఇప్పుడు సత్యయుగములో భక్తి ఎక్కడ నుండి వచ్చింది. మనుష్యులు అసలేమీ అర్థం చేసుకోరు. మూఢ బుద్ధి కలవారిగా ఉన్నారు కదా. సత్యయుగములో ఈ విధముగా అనరు. తండ్రి అంటారు - నేను ప్రతి 5,000 సంవత్సరాల తరువాత వస్తాను, ఎవరికైతే తన జన్మల గురించి తెలియదో అతని శరీరాన్నే తీసుకుంటాను. ఇతను ఎవరైతే నెంబర్ వన్ సుందరముగా ఉండేవారో, వారే ఇప్పుడు నల్లగా అయిపోయారు. ఆత్మ భిన్న-భిన్న శరీరాలను ధారణ చేస్తుంది. తండ్రి అంటున్నారు - నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో అతనిలో ఇప్పుడు కూర్చున్నాను. ఏమి నేర్పించేందుకు కూర్చున్నాను? జీవిస్తూనే మరణించడమును నేర్పించేందుకు. ఈ ప్రపంచము నుండి మరణించవలసిందే కదా. ఇప్పుడు మీరు పవిత్రముగా అయి మరణించాలి. నా పాత్రయే పావనంగా తయారుచేసే పాత్ర. భారతవాసులైన మీరు ఓ పతిత-పావనా అని పిలుస్తారు. ఇంకెవ్వరూ కూడా - ఓ ముక్తిదాతా, దుఃఖపు ప్రపంచము నుండి విడిపించేందుకు రండి అని ఈ విధంగా పిలవరు. అందరూ ముక్తిధామంలోకి వెళ్ళేందుకు కష్టపడతారు. పిల్లలైన మీరు మళ్ళీ సుఖధామం కొరకు పురుషార్థం చేస్తారు. ఇది ప్రవృత్తి మార్గము వారి కోసము. ప్రవృత్తి మార్గము వారమైన మనం పవిత్రముగా ఉండేవారమని మీకు తెలుసు. మళ్ళీ అపవిత్రముగా అయ్యాము. ప్రవృత్తి మార్గము వారి పనిని నివృత్తి మార్గము వారు చేయలేరు. యజ్ఞ-తపాదులు, దానము మొదలైనవి ప్రవృత్తి మార్గము వారు చేస్తారు. ఇప్పుడు మేము అన్నింటినీ తెలుసుకున్నామని మీరు అనుభవం చేస్తారు. శివబాబా మనందరినీ ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. వారిని మీరు చాలా సమయం తర్వాత కలుస్తారు కావున ప్రేమలో అశ్రువులు వస్తాయి. బాబా అని అనడంతోనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి - ఓహో! పిల్లలైన మన సేవలో బాబా వచ్చారు. బాబా మనల్ని ఈ చదువు ద్వారా పుష్పాలుగా తయారుచేసి తీసుకువెళ్తారు. ఈ అశుద్ధమైన ఛీ-ఛీ ప్రపంచము నుండి తమతోపాటు మనల్ని తీసుకువెళ్తారు. భక్తి మార్గంలో మీ ఆత్మ ఈ విధంగా అనేది - బాబా! మీరు వచ్చినట్లయితే మేము మీపై బలిహారమవుతాము, మేము మీకు చెందినవారిగానే అవుతాము, ఇంకెవరికీ చెందము. నంబరువారుగా అయితే ఉన్నారు. అందరికీ తమ-తమ పాత్రలు ఉన్నాయి. కొందరైతే స్వర్గ వారసత్వాన్నిచ్చే తండ్రిని ఎంతో ప్రేమిస్తారు. సత్యయుగములో ఏడ్చే మాటే ఉండదు. ఇక్కడైతే ఎంత ఏడుస్తారు. స్వర్గములోకి వెళ్ళిన తర్వాత ఇక ఎందుకు ఏడవాలి, ఇంకా వాయిద్యాలు మ్రోగించాలి. అక్కడైతే వాయిద్యాలు మ్రోగిస్తారు. సంతోషముగా శరీరాన్ని వదిలేస్తారు. ఈ ఆచారము కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళాలని ఇక్కడ మీరు అంటారు. అక్కడేమో పునర్జన్మలు తీసుకోవాలని భావిస్తారు. కావున తండ్రి అన్ని విషయాలనూ అర్థం చేయిస్తారు. భ్రమరం ఉదాహరణ కూడా మీదే. మీరు బ్రాహ్మణీలు, పేడ పురుగులకు మీరు భూ-భూ చేస్తారు. తండ్రి అంటారు - మీరైతే ఈ శరీరాన్ని కూడా వదిలివేయాలి. జీవిస్తూనే మరణించాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి అని తండ్రి అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. దేహాన్ని మర్చిపోండి. తండ్రి చాలా మధురమైనవారు. వారంటారు - నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేయడానికి వచ్చాను. ఇప్పుడు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. అల్ఫ్ మరియు బే. ఇది దుఃఖధామము. శాంతిధామము ఆత్మలైన మన ఇల్లు. మనం పాత్రను అభినయించాము, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఈ ఛీ-ఛీ శరీరమనేది ఉండదు. ఇప్పుడైతే ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న శరీరముగా అయిపోయింది. ఇప్పుడు మనకు తండ్రి సమ్ముఖంగా కూర్చొని సూచనల ద్వారా నేర్పిస్తారు. నేను కూడా ఆత్మనే, మీరు కూడా ఆత్మయే. నేను శరీరము నుండి వేరై మీకు కూడా అదే నేర్పిస్తాను. మీరు కూడా స్వయాన్ని శరీరము నుండి వేరుగా భావించండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక్కడుండేది లేదు. ఇప్పుడు వినాశనం జరగనున్నదని కూడా మీకు తెలుసు. భారత్ లో రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఆ తర్వాత భారత్ లోనే పాల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ అన్ని ధర్మాలవారూ కలిసి ఉన్నారు. అందరూ పరస్పరం కొట్లాడుకొని మరణిస్తారు. ఇది చివరి సమయములోని మృత్యువు. పాకిస్తాన్ లో ఏమేమి జరిగేవి. అది చాలా కఠినమైన దృశ్యము. ఎవరైనా చూస్తే స్పృహ తప్పిపోతారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని దృఢంగా తయారుచేస్తారు. శరీర భానాన్ని కూడా తొలగించివేస్తారు.

బాబా చూసారు - పిల్లలు స్మృతిలో ఉండటం లేదు, చాలా బలహీనంగా ఉన్నారు, అందుకే సేవ కూడా పెరగటం లేదు. ఘడియ ఘడియ వ్రాస్తూ ఉంటారు - బాబా, స్మృతిని మర్చిపోతున్నాము, బుద్ధి లగ్నమవ్వటం లేదు. బాబా అంటారు - ఆ యోగము అన్న పదాన్ని వదిలేయండి. విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రిని మీరు మర్చిపోతారా! పూర్వము భక్తిలో బుద్ధి ఇంకెటువైపైనా వెళ్ళిపోతే తమను తాము గిల్లుకునేవారు. బాబా అంటారు, ఆత్మ అయిన మీరు అవినాశీ. కేవలం మీరు పావనంగా మరియు పతితంగా అవుతూ ఉంటారు. అంతేకానీ, ఆత్మ ఏమీ చిన్నగా, పెద్దగా అవ్వదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీతో మీరు మాట్లాడుకోండి - ఓహో! బాబా మాకు సేవ చేయడానికి వచ్చారు. వారు మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే చదివిస్తున్నారు! అనంతమైన బాబా అనంతమైన సుఖాన్ని ఇస్తారు, వారిని మేము ఇప్పుడు కలుసుకున్నాము. ఈ విధంగా ప్రేమగా బాబా అని అనండి మరియు సంతోషములో ప్రేమపూరితమైన అశ్రువులు రావాలి. రొమాలు నిక్కబొడుచుకోవాలి.

2. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే అందరి నుండి మమకారాన్ని తొలగించి జీవిస్తూనే మరణించాలి. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. దీని నుండి వేరయ్యే అభ్యాసము చేయాలి.

వరదానము:-

జరిగిపోయిన విషయాలను మరియు వృత్తులను సమాప్తము చేసి సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకునే స్వచ్ఛ ఆత్మా భవ

సేవలో స్వచ్ఛ బుద్ధి, స్వచ్ఛ వృత్తి మరియు స్వచ్ఛ కర్మలు సఫలతకు సహజ ఆధారము. ఏ సేవా కార్యమునైనా మొదలుపెట్టినప్పుడు ముందుగా చెక్ చేసుకోండి - బుద్ధిలో ఏ ఆత్మ యొక్క గత విషయాల స్మృతి అయితే లేదు కదా. ఆ వృత్తి, దృష్టితోనే వారిని చూడటము, వారితో మాట్లాడటము చేస్తే... దీని ద్వారా సంపూర్ణ సఫలత లభించదు, అందుకే జరిగిపోయిన విషయాలను మరియు వృత్తులను సమాప్తము చేసి స్వచ్ఛ ఆత్మగా అవ్వండి, అప్పుడే సంపూర్ణ సఫలత ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-

ఎవరైతే స్వ పరివర్తన చేసుకుంటారో, విజయమాల వారి మెడలోనే పడుతుంది.