16-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు సతోప్రధానముగా అవ్వాలి కావున తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి, పారసనాథుడైన శివబాబా మిమ్మల్ని పారసపురికి యజమానులుగా చేయడానికి వచ్చారు’’

ప్రశ్న:-

పిల్లలైన మీరు ఏ ఒక్క విషయము యొక్క ధారణ ద్వారానే మహిమా యోగ్యులుగా అవుతారు?

జవాబు:-

చాలా చాలా నిర్మానచిత్తులుగా అవ్వండి. ఏ విషయము యొక్క అహంకారము ఉండకూడదు. చాలా మధురంగా అవ్వాలి. అహంకారం వచ్చిందంటే శత్రువులు అవుతారు. పవిత్రత ఆధారం పైనే ఉన్నతంగా లేక నీచంగా అవుతారు. పవిత్రముగా ఉన్నప్పుడు గౌరవము ఉంటుంది, అపవిత్రముగా ఉన్నట్లయితే అందరికీ తల వంచి నమస్కరిస్తారు.

ఓంశాంతి

ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. నేను ఈ పిల్లలకు అర్థం చేయిస్తున్నాను అని తండ్రి కూడా భావిస్తారు. భక్తి మార్గంలో భిన్న-భిన్న నామాలతో అనేకానేక చిత్రాలను తయారుచేస్తారని కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఏ విధంగా నేపాల్ లో పారసనాథుడిని నమ్ముతారు. వారిది చాలా పెద్ద మందిరము ఉంది. కానీ వాస్తవానికి అక్కడ ఏమీ లేదు. నాలుగు ద్వారాలు ఉన్నాయి, నాలుగు విగ్రహాలు ఉన్నాయి, నాలుగవ దానిలో శ్రీకృష్ణుడిని పెట్టారు. ఈ మధ్య ఏదైనా మార్పు చేసి ఉండవచ్చు. ఇప్పుడు పారసనాథుడు అని తప్పకుండా శివబాబానే అంటారు. మనుష్యులను పారసబుద్ధి కలవారిగా కూడా వారే తయారుచేస్తారు. కావున మొట్టమొదట వారికి ఇది అర్థం చేయించాలి - ఉన్నతోన్నతుడు భగవంతుడు, ఆ తర్వాతే మొత్తం ప్రపంచమంతా ఉంది. సూక్ష్మవతనంలో సృష్టి అయితే ఏమీ లేదు. ఆ తర్వాత లక్ష్మీ-నారాయణులు లేక విష్ణువు ఉంటారు. వాస్తవానికి విష్ణువు యొక్క మందిరము కూడా తప్పు. విష్ణు చతుర్భుజుడు అంటే నాలుగు భుజాల కల వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - వీరు లక్ష్మీ-నారాయణులు, వీరిరువురినీ కలిపి విష్ణువు రూపంలో చూపించారు. లక్ష్మీ-నారాయణులు ఇరువురూ వేరు-వేరు. సూక్ష్మవతనములో విష్ణువుకు నాలుగు భుజాలను చూపించారు అనగా ఇరువురినీ కలిపి చతుర్భుజునిగా చూపించారు, వాస్తవానికి అటువంటివారు ఎవ్వరూ ఉండరు. మందిరములో చతుర్భుజుడు అని ఎవరినైతే చూపిస్తారో, వారు సూక్ష్మవతనము వారు. చతుర్భుజునికి శంఖ, చక్ర, గదా, పద్మములు మొదలైనవి చూపిస్తారు. వాస్తవానికి అవేమీ లేవు. చక్రము కూడా పిల్లలైన మీకు సంబంధించినది. నేపాల్ లో విష్ణువు యొక్క పెద్ద చిత్రాన్ని క్షీరసాగరంలో చూపిస్తారు. పూజ చేసే రోజుల్లో కొద్దిగా పాలు పోస్తారు. తండ్రి ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. ఈ విధంగా ఎవ్వరూ విష్ణువు అర్థాన్ని వివరించలేరు. వారికి అసలు తెలియనే తెలియదు. ఇక్కడైతే భగవంతుడు స్వయంగా అర్థం చేయిస్తారు. భగవంతుడు అని శివబాబానే అంటారు. వాస్తవానికి వారు ఒక్కరే కానీ భక్తి మార్గమువారు అనేక పేర్లను పెట్టేశారు. మీరు ఇప్పుడు అనేక పేర్లతో పిలవరు. భక్తి మార్గములో ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు, మీరు కూడా తిన్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు మందిరాలు మొదలైనవి చూసినట్లయితే - ఇతరులకు ఎలా అర్థం చేయిస్తారంటే - ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, వారు సుప్రీమ్ సోల్, నిరాకార పరమపిత పరమాత్మ. ఆత్మ శరీరం ద్వారా - ఓ పరమపితా అని అంటుంది. వారికే జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అన్న మహిమ కూడా ఉంది. భక్తి మార్గములో ఒక్కరికి అనేక చిత్రాలు ఉన్నాయి. జ్ఞాన మార్గములోనైతే జ్ఞానసాగరుడు ఒక్కరే. వారే పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. ఉన్నతోన్నతమైనవారు పరమాత్మ, వారి గురించే - స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి అని గాయనముంది అనగా ఒక్క తండ్రినే స్మృతి చేయండి లేక స్మరిస్తూ ఉండండి, తద్వారా కలహ క్లేశాలు, శారీరక రోగాలు తొలగిపోతాయి మరియు సుఖము లభిస్తుంది, అప్పుడు జీవన్ముక్తి పదవిని పొందండి. ఇది జీవన్ముక్తి కదా. తండ్రి నుండి ఈ సుఖ వారసత్వము లభిస్తుంది. ఒంటరిగా ఇతనొక్కరే అయితే దానిని పొందరు కదా. తప్పకుండా రాజధాని ఉంటుంది కదా అనగా తండ్రి రాజధానిని స్థాపన చేస్తున్నారు. సత్యయుగములో రాజు, రాణి, ప్రజలు అందరూ ఉంటారు. మీరు జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు కావున వెళ్ళి పెద్ద కులములో జన్మ తీసుకుంటారు, చాలా సుఖం లభిస్తుంది. ఎప్పుడైతే అది స్థాపన అవుతుందో అప్పుడు అశుద్ధమైన ఆత్మలు శిక్షలను అనుభవించి తిరిగి వెళ్ళిపోతారు, తమ-తమ సెక్షన్లలోకి వెళ్ళి ఉంటారు. ఇంతమంది ఆత్మలు వస్తారు, మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటుంది. పై నుండి ఎలా వస్తారు అన్నది బుద్ధిలో ఉండాలి. రెండు ఆకులకు బదులుగా 10 ఆకులు కలిసి రావాలి అని కాదు. అలా కాదు. ఆకులు నియమానుసారంగానే వెలువడతాయి. ఇది చాలా పెద్ద వృక్షము. ఒక్క రోజులో లక్షల్లో సంఖ్య వృద్ధి చెందుతుందని చూపిస్తారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడని, పతిత-పావనుడు, దుఃఖహర్త-సుఖకర్త కూడా వారేనని మొదట అర్థం చేయించాలి. పాత్రధారులెవరైతే దుఃఖితులుగా అవుతారో, వారందరికీ వారు వచ్చి సుఖాన్ని ఇస్తారు. ధుఃఖాన్ని ఇచ్చేది రావణుడు. మనుష్యులు వచ్చి అర్థం చేసుకునేందుకు వారికి అసలు తండ్రి వచ్చారు అన్నదే తెలియదు. చాలా మంది అర్థం చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు, బయటకు వెళ్ళిపోతారు. నీటిలో స్నానము చేస్తూ-చేస్తూ కాలు జారిపోతే నీరు లోపలికి వెళ్ళిపోతుంది. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇది విషయసాగరము. బాబా మిమ్మల్ని క్షీరసాగరం వైపుకు తీసుకువెళ్తారు. కానీ మాయా రూపీ మొసలి మంచి-మంచి మహారథులను కూడా మింగేస్తుంది. జీవిస్తూనే తండ్రి ఒడి నుండి మరణించి రావణుడి ఒడిలోకి వెళ్ళిపోతారు అనగా మరణిస్తారు. ఉన్నతోన్నతమైనవారు తండ్రి, వారే రచనను రచిస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. చరిత్ర మరియు భౌగోళము అనేది సూక్ష్మవతనానిదైతే లేదు. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్తారు, సాక్షాత్కారాలు పొందుతారు. అక్కడ చతుర్భుజుడిని చూస్తారు. చిత్రాలలో ఉంది కదా. అది బుద్ధిలో కూర్చుని ఉంది కావున తప్పకుండా సాక్షాత్కారమవుతుంది. కానీ వాస్తవానికి అటువంటి వస్తువేదీ లేదు. ఇవి భక్తి మార్గపు చిత్రాలు. ఇప్పటివరకు భక్తి మార్గం కొనసాగుతోంది. భక్తి మార్గం పూర్తయ్యాక ఇక ఈ చిత్రాలు ఉండవు. స్వర్గములో ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. ఈ లక్ష్మీ-నారాయణులు చతుర్భుజుని రెండు రూపాలు అని ఇప్పుడు బుద్ధిలో ఉంది. లక్ష్మీ-నారాయణుల పూజ అనగా చతుర్భుజుని పూజ. లక్ష్మీ-నారాయణుల మందిరము అన్నా లేక చతుర్భుజుని మందిరము అన్నా విషయం ఒక్కటే. వీరిరువురి జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉందని మీకు తెలుసు. విష్ణువు రాజ్యం అనైతే అనరు. వీరు పాలన కూడా చేస్తారు. వీరు మొత్తం విశ్వానికి యజమాని కావున విశ్వము యొక్క పాలన చేస్తారు.

శివ భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. విస్తారంగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇది కూడా గీతయే అని చెప్పండి. కేవలం గీతలో శ్రీకృష్ణుని పేరును వేసేశారు. అది పొరపాటు. అందరినీ గ్లాని చేసారు, అందుకే భారత్ తమోప్రధానముగా అయ్యింది. ఇప్పుడిది కలియుగ ప్రపంచము యొక్క అంతిమము, దీనిని తమోప్రధాన ఇనుపయుగము అని అంటారు. ఎవరైతే సతోప్రధానులుగా ఉండేవారో, వారే 84 జన్మలు తీసుకున్నారు. జనన, మరణాలలోకైతే తప్పకుండా రావాలి. ఎప్పుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో అప్పుడు మళ్ళీ మొదటి నంబరులో తండ్రి రావలసి ఉంటుంది. ఇది ఒక్కరి విషయము కాదు. ఇతనిదైతే రాజధాని అంతా ఉండేది కదా, అది మళ్ళీ తప్పకుండా ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు యోగాగ్ని ద్వారా పాపాలు అంతమైపోతాయి అని తండ్రి అందరి కోసమూ చెప్తారు. కామ చితిపై కూర్చొని అందరూ నల్లగా అయిపోయారు. ఇప్పుడు నల్లనివారి నుండి తెల్లగా ఎలా అవ్వాలి? అది తండ్రే నేర్పిస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ తప్పకుండా భిన్న-భిన్న నామ-రూపాలను తీసుకుని వస్తూ ఉండవచ్చు కదా. ఎవరైతే లక్ష్మీ-నారాయణులుగా ఉండేవారో, వారే 84 జన్మల తర్వాత మళ్ళీ ఈ విధంగా అవ్వాలి. వారి అనేక జన్మల అంతిమంలో తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. అప్పుడు వారు సతోప్రధానులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు పారసనాథుడిని కూడా పూజిస్తారు, అలాగే శివుడిని కూడా పూజిస్తారు. తప్పకుండా వారిని శివుడే ఈ విధంగా పారసనాథునిగా చేసి ఉంటారు. టీచర్ అయితే కావాలి కదా. వారు జ్ఞానసాగరుడు. ఇప్పుడు సతోప్రధానులుగా, పారసనాథులుగా అవ్వాలంటే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. వారే అందరి దుఃఖాలను హరిస్తారు. తండ్రి అయితే సుఖాన్ని ఇస్తారు. ఇదంతా ముళ్ళ అడవి. తండ్రి పుష్పాల తోటగా తయారుచేయడానికి వచ్చారు. తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు. నేను ఈ సాధారణ వృద్ధ తనువులోకి ప్రవేశిస్తాను, ఇతనికి తన జన్మల గురించి తెలియదు. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. కావున ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ అవుతుంది. ఇక్కడి లక్ష్యమే రాజా-రాణులుగా అవ్వడము, కావున తప్పకుండా ప్రజలు కూడా తయారవుతారు కదా. మనుష్యులు యోగము, యోగము అని ఎంతో అంటూ ఉంటారు. నివృత్తి మార్గమువారైతే అనేక హఠయోగాలు చేస్తారు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. తండ్రిదైతే ఒకే విధమైన యోగము. వారు కేవలం - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని మాత్రమే చెప్తారు. 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయండి, మిగిలినవారందరినీ వదిలివేయండి. మీరు వచ్చినట్లయితే మేము మీ ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాము అని భక్తి మార్గములో మీరు పాడేవారు. అంటే తప్పకుండా వారి నుండి వారసత్వం లభించిందని కదా. అర్ధకల్పము స్వర్గము, ఆ తర్వాత నరకము. రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఈ-ఈ విధంగా అర్థం చేయించాలి. స్వయాన్ని దేహంగా భావించకండి, ఆత్మ అవినాశీ. ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా నిండి ఉంది, దానిని మీరు అభినయిస్తారు. ఇప్పుడు శివబాబాను స్మృతి చేసినట్లయితే నావ తీరానికి చేరుతుంది. సన్యాసులు పవిత్రముగా అవుతారు కావున వారికి ఎంత గౌరవముంటుంది. అందరూ వారికి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రత ఆధారము పైనే ఉన్నతులుగా, నీచులుగా అవుతారు. దేవతలైతే పూర్తి ఉన్నతులు. సన్యాసులేమో ఒక్క జన్మ పవిత్రంగా అవుతారు, మళ్ళీ మరుసటి జన్మ అయితే వికారాల ద్వారానే తీసుకుంటారు. దేవతలు సత్యయుగములోనే ఉంటారు. ఇప్పుడు మీరు చదువుతారు, అలాగే చదివిస్తారు కూడా. కొందరైతే చదువుతారు కానీ ఇతరులకు అర్థం చేయించలేరు ఎందుకంటే ధారణ జరగదు. బాబా అంటారు, మీ భాగ్యంలో లేకపోతే తండ్రి ఏం చేయగలరు. ఒకవేళ తండ్రి కూర్చొని అందరికీ ఆశీర్వాదము ఇస్తూ పోతే ఇక అందరూ స్కాలర్షిప్ తీసుకోవాలి. భక్తి మార్గములో అలా ఆశీర్వదిస్తారు. సన్యాసులు కూడా ఈ విధంగా చేస్తారు. వారి వద్దకు వెళ్ళి - నాకు కొడుకు పుట్టాలి, ఆశీర్వాదమును ఇవ్వండి అని అడుగుతారు. అచ్ఛా, మీకు కొడుకు పుడతాడు అని అంటారు. ఒకవేళ కూతురు పుడితే, అది వ్రాత అని అంటారు. అదే కొడుకు పుడితే వాహ్-వాహ్ అంటూ అతని చరణాలపై పడుతూ ఉంటారు. అచ్ఛా, ఒకవేళ ఆ బిడ్డ మళ్ళీ మరణిస్తే ఏడవడం మొదలుపెడతారు, గురువును తిట్టడం మొదలుపెడతారు. అప్పుడు గురువు ఇదంతా తల వ్రాత అని చెప్తారు. అప్పుడు వాళ్ళు, మరి ముందే ఎందుకు చెప్పలేదు అని అంటారు. ఒకవేళ ఎవరైనా మరణించినవారు మళ్ళీ జీవితులైతే దానిని కూడా తల వ్రాత అనే అంటారు. అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఆత్మ ఎక్కడో దాగి ఉంటుంది. డాక్టర్లు కూడా - అతను మరణించాడనే భావిస్తారు, కానీ మళ్ళీ జీవితుడైపోతాడు. చితి పైకి ఎక్కినవారు కూడా కొందరు లేచి కూర్చుంటారు. ఎవరైనా ఒకరిని విశ్వసిస్తే, ఇక అందరూ అతని వెనుక పడుతూ ఉంటారు.

పిల్లలైన మీరు చాలా నిర్మానచిత్తులుగా ఉంటూ నడుచుకోవాలి. అహంకారము కొద్దిగా కూడా ఉండకూడదు. ఈ రోజుల్లో ఎవరి వైపైనా కొద్దిగా అహంకారము చూపించినా వెంటనే శతృత్వం పెరుగుతుంది. చాలా మధురంగా నడుచుకోవాలి. నేపాల్ లో కూడా మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. ఇప్పుడు ఇది పిల్లలైన మీ మహిమా సమయం కాదు. అలా జరిగితే వారి ఆశ్రమాలన్నీ ఎగిరిపోతాయి. పెద్ద-పెద్ద వారు మేల్కొని సభలలో కూర్చొని వినిపిస్తే వారి వెనుక ఎంతోమంది వచ్చేస్తారు. ఎవరైనా ఎమ్.పి. కూర్చొని ఈ విధంగా మీ మహిమను చేయాలి - భారత్ యొక్క రాజయోగాన్ని ఈ బ్రహ్మాకుమార, కుమారీలు తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు అని. అటువంటి వారెవ్వరూ ఇంకా వెలువడలేదు. పిల్లలు చాలా చురుకుగా, చమత్కారులుగా అవ్వాలి. ఫలానా, ఫలానా వారు భాషణ ఎలా చేస్తారు అనేది నేర్చుకోవాలి. సేవ చేసే యుక్తిని తండ్రి నేర్పిస్తారు. తండ్రి ఏ మురళినైతే వినిపించారో దానిని ఖచ్చితంగా అదే విధంగా కల్పకల్పము వినిపించి ఉంటారు. అది డ్రామాలో రచింపబడి ఉంది. ఇలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వదు. డ్రామానుసారంగా ఏదైతే అర్థం చేయించాలో, అది అర్థం చేయించాను, అర్థం చేయిస్తూ ఉంటాను. వేరే వారైతే ఎన్నో ప్రశ్నలు వేస్తారు. వారికి చెప్పండి, మొదట మన్మనాభవగా అవ్వండి, తండ్రిని తెలుసుకుంటే మీరు అన్నింటినీ తెలుసుకుంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సేవా యుక్తులను నేర్చుకొని చాలా చాలా తెలివైనవారిగా మరియు చమత్కారులుగా అవ్వాలి. ధారణ చేసి మళ్ళీ ఇతరుల చేత చేయించాలి. చదువు ద్వారా తమ భాగ్యాన్ని తామే తయారుచేసుకోవాలి.

2. ఏ విషయములోనూ కొద్దిగా కూడా అహంకారాన్ని చూపించకూడదు, చాలా-చాలా మధురంగా మరియు నిర్మానచిత్తులుగా అవ్వాలి. మాయా రూపీ మొసలి నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి.

వరదానము:-

గతించిపోయినదానిని శ్రేష్ఠ విధితో గతం గతః చేసి స్మృతిచిహ్న స్వరూపాన్ని తయారుచేసే పాస్ విత్ ఆనర్ భవ

‘‘పాస్ట్ ఈజ్ పాస్ట్’’, గడిచింది ఎలాగూ గతించిపోతుంది. సమయము మరియు దృశ్యాలు, అన్నీ గతించిపోతాయి, కానీ పాస్ విత్ ఆనర్లుగా అయ్యి ప్రతి సంకల్పాన్ని మరియు సమయాన్ని దాటండి అనగా గతాన్ని ఎటువంటి శ్రేష్ఠ విధితో గతించేలా చెయ్యండంటే, ఆ గతించినదానిని స్మృతిలోకి తెచ్చుకోవటంతోనే వాహ్-వాహ్ అన్న మాటలు హృదయము నుండి వెలువడాలి. ఇతర ఆత్మలు మీ గతించిన కథ నుండి పాఠాన్ని నేర్చుకోవాలి. మీ గతము స్మృతిచిహ్న స్వరూపముగా అవ్వాలి, అప్పుడు కీర్తన చేస్తారు అనగా కీర్తిని గానం చేస్తూ ఉంటారు.

స్లోగన్:-

స్వ కళ్యాణము యొక్క శ్రేష్ఠ ప్లాన్ ను తయారుచేయండి, అప్పుడు విశ్వ సేవలో సకాష్ లభిస్తుంది.