17-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ అద్భుతమైన చదువును అనంతమైన తండ్రి చదివిస్తారు, తండ్రిపై మరియు వారి చదువుపై ఎటువంటి సంశయము కలగకూడదు, మొట్టమొదట మనల్ని చదివించేవారు ఎవరు అన్న విషయంపై నిశ్చయముండాలి’’

ప్రశ్న:-

పిల్లలైన మీకు నిరంతరమూ స్మృతియాత్రలో ఉండాలి అన్న శ్రీమతము ఎందుకు లభించింది?

జవాబు:-

ఎందుకంటే మిమ్మల్ని కింద పడేసిన మాయా శత్రువు ఇంకా ఇప్పుడు కూడా మీ వెనుక ఉంది. ఇప్పుడింకా మాయ మిమ్మల్ని వెంటాడడం వదలదు, అందుకే నిర్లక్ష్యం చేయకండి. మీరు సంగమయుగంలోనే ఉన్నా కానీ అర్ధకల్పం మాయకు చెందినవారిగా ఉన్నారు, అందుకే అది అంత త్వరగా మిమ్మల్ని వదలదు. స్మృతిని మర్చిపోతే మాయ వికర్మలను చేయిస్తుంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి. అసురీ మతంపై నడవకూడదు.

ఓంశాంతి

ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, అలాగే బాబా కూడా ఉన్నారు. బాబా అనేకులైన పిల్లలను ‘ఓ పిల్లలూ’ అని అంటారు, అప్పుడు పిల్లలందరూ తిరిగి ‘ఓ బాబా’ అని అంటారు. పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఈ జ్ఞానం ఆత్మలైన మన కొరకే ఉందని మీరు అర్థం చేసుకున్నారు. ఒక్క తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నారు. తండ్రి చదివించడానికి వచ్చారని పిల్లలకు తెలుసు. వారు మొట్టమొదట తండ్రి, ఆ తర్వాత టీచర్, ఆ తర్వాత గురువు. ఇప్పుడు తండ్రి తండ్రే కదా. మళ్ళీ పావనులుగా చేయడానికి స్మృతియాత్రను నేర్పిస్తారు. ఈ చదువు చాలా అద్భుతమైనదని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. డ్రామా ఆదిమధ్యాంత రహస్యాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ తెలియజేయలేరు, అందుకే వారిని అనంతమైన తండ్రి అని అనడం జరుగుతుంది. ఈ నిశ్చయమైతే పిల్లలకు తప్పకుండా ఉంటుంది, ఇందులో సంశయము యొక్క విషయం ఉత్పన్నమవ్వదు. ఇంతటి అనంతమైన చదువును అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. బాబా, రండి, మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు కూడా, ఎందుకంటే ఇది పతిత ప్రపంచము, పావన ప్రపంచములోకి తండ్రే తీసుకువెళ్తారు. అక్కడ మళ్ళీ - బాబా, రండి, పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిలవరు. వారు ఆత్మలైన మనకు తండ్రి అని పిల్లలకు తెలుసు. కావున దేహ భానము అంతమైపోతుంది. వారు మా తండ్రి అని ఆత్మ అంటుంది. తప్పకుండా తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇంతటి జ్ఞానాన్ని ఇవ్వలేరు అని ఇప్పుడు నిశ్చయముండాలి. మొదటైతే ఈ నిశ్చయబుద్ధి ఉండాలి. నిశ్చయము కూడా ఆత్మకు బుద్ధిలోనే ఉంటుంది. ఆత్మకు - వీరు మా బాబా అన్న జ్ఞానం లభిస్తుంది. పిల్లలకు ఈ నిశ్చయము చాలా పక్కాగా ఉండాలి. నోటితో ఏమీ అనకూడదు. ఆత్మ అయిన మనము ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము. ఆత్మలోనే సంస్కారాలన్నీ ఉన్నాయి.

ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. వారు మనల్ని ఏ విధంగా చదివిస్తారంటే, ఎటువంటి కర్మలను నేర్పిస్తారంటే తద్వారా మనం ఈ ప్రపంచంలోకి ఇప్పుడిక తిరిగి రాము. ఆ మనుష్యులు ఈ ప్రపంచంలోకే రావాలి అని భావిస్తారు. కానీ మీరు అలా భావించరు. మీరు ఈ అమరకథను విని అమరపురిలోకి వెళ్తారు. అమరపురి అనగా సదా అమరముగా ఉండే ప్రపంచము. సత్య, త్రేతాయుగాలు అమరపురి. పిల్లలకు ఎంతటి సంతోషము ఉండాలి. ఈ చదువును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. ఇక్కడ తండ్రి మనల్ని చదివిస్తారు, మిగిలిన టీచర్లెవరైతే ఉన్నారో వారు సాధారణ మనుష్యులు. ఇక్కడ మీరు ఎవరినైతే పతిత-పావనుడు, దుఃఖహర్త-సుఖకర్త అని అంటారో, ఆ తండ్రి ఇప్పుడు సమ్ముఖంగా చదివిస్తున్నారు. సమ్ముఖంగా లేకుండా రాజయోగ చదువును ఎలా చదివించగలరు? తండ్రి అంటారు, మధురమైన పిల్లలైన మిమ్మల్ని ఇక్కడ చదివించేందుకు వస్తాను. చదివించడానికి వీరిలోకి ప్రవేశిస్తాను. తప్పకుండా భగవానువాచ కూడా ఉంది, అంటే తప్పకుండా వారికి శరీరము కావాలి. కేవలం నోరు మాత్రమే కాదు, మొత్తం శరీరము కావాలి. వారు స్వయం చెప్తున్నారు - మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలూ, నేను కల్ప-కల్పము పురుషోత్తమ సంగమయుగంలో సాధారణ తనువులోకి వస్తాను. ఇతను చాలా పేదవారూ కాదు, చాలా షావుకారూ కాదు, ఇతను సాధారణమైనవారు. వారు మా బాబా, మేము ఆత్మ అని పిల్లలైన మీకు నిశ్చయముండాలి. వారు ఆత్మలైన మనకు బాబా. వారు మొత్తం ప్రపంచమంతటిలోని మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో, వారందరికీ బాబా, అందుకే వారిని అనంతమైన బాబా (అనంతమైన తండ్రి) అని అంటారు. శివ జయంతిని జరుపుకుంటారు, దాని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. శివ జయంతి ఎప్పటి నుండి జరుపుకోబడుతోంది అని ఎవరినైనా అడిగితే పరంపరగా జరుపుకుంటున్నాము అని అంటారు. అది కూడా ఎప్పటినుండి? ఏదో తారీఖైతే కావాలి కదా. డ్రామా అయితే అనాది అయినది. కానీ డ్రామాలో ఏ కార్యమైతే జరుగుతుందో దాని తిథి, తారీఖైతే కావాలి కదా. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. మా శివబాబా వస్తారు అని ఆ ప్రేమతో జయంతిని జరుపుకోరు. నెహ్రూ జయంతిని ఆ ప్రేమతో జరుపుకుంటారు, అశ్రువులు కూడా వస్తాయి. శివ జయంతి గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అనుభవజ్ఞులుగా ఉన్నారు. ఏమీ తెలియని మనుష్యులు ఎంతోమంది ఉన్నారు. ఎన్ని మేళాలు జరుగుతుంటాయి. అక్కడికి ఎవరైతే వెళ్తారో వారు సత్యం ఏమిటో తెలియజేయగలరు. ఏ విధంగా బాబా అమరనాథుని ఉదాహరణను కూడా తెలియజేశారు, అక్కడకు వెళ్ళి యథార్థంగా అక్కడ జరిగేదేమిటో చూశారు. ఇతరులైతే వేరే వారి ద్వారా ఏదైతే వింటారో, అదే తెలియజేస్తారు. మంచు లింగము తయారవుతుంది అని ఎవరో అంటే అది సత్యమే అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు సత్యమేమిటి, అసత్యమేమిటి అన్న అనుభవం లభించింది. ఇప్పటివరకు ఏదైతే వింటూ, చదువుతూ వచ్చారో అదంతా అసత్యమే. అసత్యమైన కాయము, అసత్యమైన మాయ... అన్న గాయనము కూడా ఉంది కదా. ఇది అసత్య ఖండము, అది సత్య ఖండము. సత్య, త్రేతా, ద్వాపరయుగాలు గతించిపోయాయి, ఇప్పుడు కలియుగము నడుస్తోంది. ఇది కూడా చాలా కొద్దిమందికే తెలుసు. మీ బుద్ధిలో అన్ని ఆలోచనలు ఉంటాయి. తండ్రి వద్ద జ్ఞానమంతా ఉంది, వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. వారి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దానిని ఈ తనువు ద్వారా ఇచ్చి మనల్ని తమ సమానంగా తయారుచేస్తున్నారు. ఏ విధంగా టీచర్ కూడా తమ సమానంగా తయారుచేస్తారు కదా, అలాగే అనంతమైన తండ్రి కూడా ప్రయత్నించి తమ సమానంగా తయారుచేస్తారు. లౌకిక తండ్రి అలా తమ సమానంగా తయారుచేయరు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు. నేను పిల్లల్ని నా సమానంగా తయారుచేయాలి అని వారికి తెలుసు. ఏ విధంగా టీచర్ తమ సమానంగా తయారుచేస్తారు కదా, అక్కడ నంబరువారుగా ఉంటారు. అలాగే ఈ తండ్రి కూడా నంబరువారుగా తయారవుతారు అని అంటారు. నేను ఏ చదువునైతే చదివిస్తానో అది అవినాశీ చదువు. ఎవరు ఎంత చదివినా అది వ్యర్థమవ్వదు. మున్ముందు వారే అంటారు - మేము 4 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం ఎవరి ద్వారానో జ్ఞానం విన్నాము, ఇప్పుడు మళ్ళీ వచ్చాము అని. అప్పుడిక కొందరు గట్టిగా పట్టుకుంటారు. వీరు దీపము, వీరిపై కొందరు దీపం పురుగులు పూర్తిగా బలిహారమవుతారు, మరికొందరు చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు. ప్రారంభంలో ఈ దీపముపై ఎంతోమంది దీపపు పురుగులు బలిహారమయ్యారు. డ్రామా ప్లాన్ అనుసారంగా భట్టీ తయారవ్వవలసి ఉంది. కల్ప-కల్పము ఇలా జరుగుతూ వచ్చింది. ఏదైతే గతించిందో అది కల్పపూర్వము కూడా అలాగే జరిగింది. మున్ముందు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. ఇకపోతే నేను ఆత్మను అన్న పక్కా నిశ్చయాన్ని ఉంచండి. తండ్రి మనల్ని చదివిస్తారు. ఈ నిశ్చయంలో ఉండండి, మర్చిపోకండి. తండ్రిని తండ్రిగా భావించని మనుష్యులు ఎవ్వరూ ఉండరు. వారు ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా కానీ, నేను తండ్రిని వదిలి వెళ్ళిపోయాను అనే భావిస్తారు. వీరు అనంతమైన తండ్రి, వీరినైతే మనము ఎప్పుడూ వదలము, అంతిమం వరకూ కలిసే ఉంటాము. ఈ తండ్రి అయితే సర్వుల సద్గతిని చేస్తారు. వీరు 5,000 సంవత్సరాల తర్వాత వస్తారు. సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారని కూడా మీకు తెలుసు. మిగిలినవారంతా శాంతిధామంలో ఉంటారు. ఈ జ్ఞానాన్ని కూడా ఒక్క తండ్రే వినిపిస్తారు, దీనిని ఇంకెవ్వరూ వినిపించలేరు. ఇది ఇంకెవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. ఆత్మలైన మీకు వారు తండ్రి. వారు చైతన్య బీజరూపుడు. వారు ఏ జ్ఞానాన్ని ఇస్తారు? సృష్టి రూపీ వృక్షము యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. రచయిత తప్పకుండా రచన జ్ఞానాన్ని ఇస్తారు. సత్యయుగం ఎప్పుడు ఉండేది, మళ్ళీ అది ఏమైంది అని మీకు ఇంతకుముందేమైనా తెలుసా!

ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చున్నారు, బాబా మాట్లాడుతున్నారు. వీరు ఆత్మలైన మనందరికీ తండ్రి అని, వీరు మనల్ని చదివిస్తున్నారని పక్కా నిశ్చయాన్ని ఉంచుతారు. వీరు దైహికమైన టీచర్ కాదు. ఈ శరీరంలో చదివించే ఆ నిరాకారుడైన శివబాబా విరాజమానమై ఉన్నారు. వారు నిరాకారుడై ఉండి కూడా జ్ఞానసాగరునిగా ఉన్నారు. మనుష్యులు వారికి ఏ ఆకారము లేదు అని అనేస్తారు. జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు... అని మహిమను కూడా గానం చేస్తారు, కానీ అది అర్థం చేసుకోరు. డ్రామా అనుసారంగా చాలా దూరం వెళ్ళిపోయారు. బాబా చాలా దగ్గరకు తీసుకువస్తారు. ఇది 5,000 సంవత్సరాల విషయము. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వారు మనల్ని చదివించేందుకు వస్తారని మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానం ఇంకెవ్వరి ద్వారానూ లభించదు. ఈ జ్ఞానము కొత్త ప్రపంచము కొరకే ఉంది. దీనిని మానవమాత్రులెవ్వరూ ఇవ్వలేరు ఎందుకంటే అందరూ తమోప్రధానంగా ఉన్నారు. వాళ్ళు ఎవ్వరినీ సతోప్రధానంగా తయారుచేయలేరు. వాళ్ళు తమోప్రధానంగా అవుతూనే ఉంటారు.

బాబా వీరిలోకి ప్రవేశించి మాకు తెలియజేస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు. ఆ తండ్రి అంటున్నారు - పిల్లలూ, నిర్లక్ష్యం చేయకండి. మిమ్మల్ని కింద పడేసిన శత్రువులు ఇప్పుడు కూడా మీ వెన్నంటే ఉన్నాయి. అవి ఇప్పుడు మిమ్మల్ని వెంటాడడం మానవు. మీరు సంగమయుగంలోనే ఉన్నా కానీ అర్ధకల్పము మీరు వాటికి చెందినవారిగా ఉన్నారు కావున అవి మిమ్మల్ని అంత త్వరగా వదలవు. జాగ్రత్తగా ఉండకపోతే, స్మృతి చేయకపోతే అవి ఇంకా ఎన్నో వికర్మలు చేయించేస్తాయి, దాంతో ఇక ఏదో ఒక రకంగా చెంపదెబ్బ తగులుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనుష్యులు తమకు తామే చెంపదెబ్బ వేసుకుంటున్నారు. ఏమేమో అంటూ ఉంటారు! శివ-శంకరులను కలిపేస్తారు. వారి కర్తవ్యమేమిటి, వీరి కర్తవ్యమేమిటి? ఎంత తేడా ఉంది. శివుడు ఉన్నతోన్నతుడైన భగవంతుడు, శంకరుడు దేవత, మరి శివ శంకరులు ఒక్కరే అని ఎలా అనగలరు! పాత్రలే ఇరువురివీ వేరు-వేరు. ఇక్కడ కూడా చాలామందికి - రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, శివశంకర్... అన్న పేర్లు ఉన్నాయి. రెండు పేర్లనూ స్వయానికి పెట్టుకుంటారు. ఈ సమయం వరకూ తండ్రి ఏదైతే అర్థం చేయించారో అది మళ్ళీ రిపీట్ అవుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. తండ్రి ఏమైనా ఇక్కడే కూర్చుండిపోతారా. పిల్లలు నంబరువారుగా చదువుకొని పూర్తి కర్మాతీతంగా అయిపోతారు. డ్రామా అనుసారంగా మాల కూడా తయారైపోతుంది. అది ఏ మాల? ఆత్మలందరి మాల తయారవుతుంది, అప్పుడు ఇక తిరిగి వెళ్తారు. మీ మాలే నెంబర్ వన్ మాల. శివబాబా మాల అయితే చాలా పెద్దది. అక్కడి నుండి పాత్రను అభినయించడానికి నంబరువారుగా వస్తారు. మీరందరూ బాబా-బాబా అని అంటారు. అందరూ ఒక్క మాలలోని మణులే. అందరినీ విష్ణు మాలలోని మణులు అని అనరు. ఈ విషయాలను తండ్రి కూర్చొని చదివిస్తారు. సూర్యవంశీయులుగా అవ్వవలసిందే. సూర్యవంశీయులు-చంద్రవంశీయులు ఎవరైతే గతించిపోయారో, వారు మళ్ళీ తయారవుతారు. ఆ పదవి చదువు ద్వారానే లభిస్తుంది. తండ్రి చదివించే చదువు లేకుండా ఆ పదవి లభించదు. చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ ఎవ్వరూ స్వయం ఆ విధంగా తయారయ్యే కర్మలేవీ చేయరు. సత్యనారాయణుని కథను కూడా వింటారు. గరుడ పురాణంలో అలాంటి-ఇలాంటి విషయాలున్నాయి, వాటిని మనుష్యులకు వినిపిస్తారు. ఇది విషయ వైతరిణీ నది, రౌరవ నరకము అని తండ్రి అంటారు. విశేషంగా భారత్ నే అంటారు. బృహస్పతి దశ కూడా భారత్ పైనే కూర్చుంది. వృక్షపతి కూడా భారతవాసులనే చదివిస్తారు. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. దశలు కూర్చొంటాయి. రాహువు దశ కూడా ఉంటుంది, అందుకే దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగుతుంది అని అంటారు. తండ్రి కూడా అంటారు - ఈ కలియుగాంతంలో రాహు దశ అందరిపైనా కూర్చొని ఉంది, ఇప్పుడు వృక్షపతినైన నేను భారత్ పై బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు వచ్చాను. సత్యయుగంలో భారత్ పై బృహస్పతి దశ ఉండేది. ఇప్పుడు రాహు దశ ఉంది. ఇది అనంతమైన విషయము. ఇది శాస్త్రాలు మొదలైనవాటిలో లేదు. ఈ మ్యాగజైన్లు మొదలైనవి కూడా, ఎవరైతే ఇంతకుముందు ఎంతోకొంత అర్థం చేసుకొని ఉంటారో వారికే అర్థమవుతాయి. మ్యాగజైన్లను చదవడం ద్వారా వారు ఇంకా ఎక్కువ అర్థం చేసుకునేందుకు పరుగుతీస్తారు. మిగిలినవారు ఏమీ అర్థం చేసుకోరు. ఎవరైతే కొద్దిగా చదివి మళ్ళీ వదిలేస్తారో, అటువంటివారిలో జ్ఞానమనే నేతిని వేసినట్లయితే మళ్ళీ సుజాగృతులవుతారు. జ్ఞానాన్ని నెయ్యి అని కూడా అంటారు. ఆరిపోయిన దీపాలలో తండ్రి వచ్చి జ్ఞానమనే నేతిని వేస్తున్నారు. వారు అంటారు - పిల్లలూ, మాయ తుఫానులు వస్తాయి, దీపాన్ని ఆర్పివేస్తాయి. దీపముపై దీపపు పురుగులు కొన్ని కాలి మరణిస్తాయి, కొన్ని అయితే చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. అదే విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా నడుస్తోంది. అందరూ నంబరువారు దీపపు పురుగులుగా ఉన్నారు. మొట్టమొదట ఒక్కసారిగా ఇళ్ళూ-వాకిళ్ళను వదిలేసి వచ్చారు, బలిహారమయ్యారు. ఒక్కసారిగా లాటరీ లభించినట్లయ్యింది. ఏదైతే గతించిందో, మీరు మళ్ళీ అదే విధంగా చేస్తారు. ఎవరైనా వెళ్ళిపోయినా కానీ, వారు స్వర్గంలోకి రారు అని అనుకోకండి, వారు బలిహారమయ్యారు, ప్రేయసులుగా అయ్యారు, మళ్ళీ మాయ ఓడించేసింది, కావున పదవి కూడా తక్కువగా పొందుతారు. నంబరువారుగా అయితే తప్పకుండా ఉంటారు. ఇతర సత్సంగాలలో ఇవి ఎవరి బుద్ధిలోనూ ఉండవు. ఇప్పుడు ఇవి మీ బుద్ధిలో ఉన్నాయి. తండ్రి ద్వారా కొత్త ప్రపంచం కొరకు మనమందరము నంబరువారు పురుషార్థానుసారంగా చదువుకుంటున్నాము. మనము అనంతమైన తండ్రి సమ్ముఖంలో కూర్చొని ఉన్నాము. ఆ ఆత్మ చూడటానికి కనులకు కనిపించదని కూడా మీకు తెలుసు. అది అవ్యక్తమైనది. ఆత్మను దివ్యదృష్టి ద్వారానే చూడగలరు. ఆత్మ అయిన మనము కూడా చిన్న బిందువులము. కానీ దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించడము - ఇది ఉన్నతమైన చదువు. ఆ చదువులో కూడా ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉంటుందో, అందులో ఫెయిలైపోతారు. ఈ సబ్జెక్ట్ అయితే చాలా సహజమైనది, కానీ కొందరికి ఇది కష్టమనిపిస్తుంది.

శివబాబా ఎదురుగా కూర్చున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు కూడా నిరాకార ఆత్మలే, కానీ మీరు శరీరంతోపాటు ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ అనంతమైన తండ్రే వినిపిస్తారు, వీటిని ఇంకెవ్వరూ వినిపించలేరు. మరి ఏం చేస్తారు? వారికి థాంక్స్ చెప్తారా. కాదు. బాబా అంటారు, ఈ డ్రామా అనాదిగా తయారుచేయబడి ఉంది. నేను కొత్తగా ఏమీ చేయడం లేదు కదా. డ్రామా అనుసారంగా మిమ్మల్ని చదివిస్తున్నాను. థాంక్స్ అయితే భక్తి మార్గంలో చెప్తారు. విద్యార్థులు బాగా చదివితే నా పేరు ప్రఖ్యాతమవుతుంది అని టీచర్ అంటారు. అప్పుడు విద్యార్థులకు థాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో, వారికి థాంక్స్ చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు మళ్ళీ టీచరుకు థాంక్స్ చెప్తారు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, జీవిస్తూ ఉండండి, ఇటువంటి సేవలను చేస్తూ ఉండండి, కల్పపూర్వము కూడా వీటిని చేసారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా ఈ నషా మరియు నిశ్చయము ఉండాలి - మమ్మల్ని చదివించేవారు దైహికమైన టీచర్ కాదు, స్వయంగా జ్ఞానసాగరుడు, నిరాకారుడు అయిన తండ్రే టీచర్ గా అయి మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మనం సతోప్రధానంగా అవ్వాలి.

2. ఆత్మ రూపీ దీపంలో రోజూ జ్ఞానమనే నేతిని వేయాలి. జ్ఞానమనే నెయ్యితో సదా ఎలా ప్రజ్వలితమై ఉండాలంటే, మాయ తుఫానులేవీ కదిలించలేకపోవాలి. పూర్తిగా దీపపు పురుగులుగా అయి దీపముపై బలిహారమవ్వాలి.

వరదానము:-

సదా ఒక్క తండ్రి స్నేహములో ఇమిడిపోయే సహయోగీ నుండి సహజయోగీ ఆత్మా భవ

ఏ పిల్లలకైతే తండ్రిపై అతి స్నేహము ఉంటుందో, ఆ స్నేహీ ఆత్మ సదా తండ్రి యొక్క శ్రేష్ఠ కార్యములో సహయోగిగా అవుతారు మరియు ఎవరు ఎంత సహయోగిగా ఉంటారో అంతగా సహజయోగిగా అవుతారు. తండ్రి స్నేహములో ఇమిడి ఉండే సహయోగీ ఆత్మ ఎప్పుడూ మాయకు సహయోగిగా అవ్వలేరు. వారి ప్రతి సంకల్పములో బాబా మరియు సేవయే ఉంటాయి, అందుకే నిద్రపోయినా కూడా వారికి అందులో చాలా విశ్రాంతి లభిస్తుంది, శాంతి మరియు శక్తి లభిస్తాయి. నిద్ర నిద్రలాగా అనిపించదు, సంపాదన చేసుకుని సంతోషముగా చారబడినట్లుగా అనిపిస్తుంది, అంతగా పరివర్తన అవుతుంది.

స్లోగన్:-

ప్రేమాశ్రువులు హృదయమనే డిబ్బిలో ముత్యాలుగా అవుతాయి.