18-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి దాత, పిల్లలైన మీరు తండ్రిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు, అడగడం కన్నా మరణించడమే మేలు అన్న నానుడి ఉంది’’

ప్రశ్న:-

ఏ స్మృతి సదా ఉన్నట్లయితే ఏ విషయము యొక్క చింత లేక చింతన ఉండదు?

జవాబు:-

ఏదైతే గతించిపోయిందో - మంచి లేక చెడు, అదంతా డ్రామాలో ఉంది. మొత్తం చక్రమంతా పూర్తి అయి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవరు ఏ విధమైన పురుషార్థం చేస్తారో, ఆ విధమైన పదవిని పొందుతారు. ఈ విషయము స్మృతిలో ఉన్నట్లయితే ఏ విషయం యొక్క చింత లేక చింతన ఉండదు. తండ్రి డైరెక్షన్ ఏమిటంటే - పిల్లలూ, గతించిపోయినదాని గురించి ఆలోచించకండి లేక చింతించకండి. తప్పుడు విషయాలేవీ వినకండి, వినిపించకండి. ఏ విషయమైతే గడిచిపోయిందో దాని గురించి ఆలోచించకండి మరియు దానిని రిపీట్ చేయకండి.

ఓంశాంతి

ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్ధం చేయిస్తారు. ఆత్మిక తండ్రిని దాత అని అంటారు. వారు తమకు తాముగానే పిల్లలకు మొత్తమంతా ఇస్తారు. వారు విశ్వాధిపతులుగా తయారుచేసేందుకే వస్తారు. ఏ విధముగా విశ్వాధిపతులుగా తయారవ్వాలి అన్నదంతా పిల్లలకు అర్థం చేయిస్తారు, డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. వారు దాత కదా. కావున అంతా తమంతట తామే ఇస్తూ ఉంటారు. అడగడం కన్నా మరణించడం మంచిది. ఏ వస్తువునూ అడగవలసిన పని లేదు. చాలామంది పిల్లలు శక్తి, ఆశీర్వాదము, కృప మొదలైనవాటిని అడుగుతూ ఉంటారు. భక్తి మార్గములో అలా అడుగుతూ, అడుగుతూ నుదుటిని అరగదీసుకుని నిరాశ చెంది మొత్తం మెట్లన్నీ కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు అడగవలసిన అవసరమేమీ లేదు. డైరెక్షన్ల అనుసారంగా నడుచుకోండి అని తండ్రి చెప్తారు. ఒకటేమో గతాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించకండి లేక చింతించకండి అని అంటారు. డ్రామాలో ఏదైతే జరిగిందో అది గతించిపోయింది. ఇక దాని గురించి ఆలోచించకండి. దానిని మళ్ళీ రిపీట్ చేయకండి. తండ్రి కేవలం రెండే మాటలు చెప్తారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి డైరెక్షన్ ను లేక శ్రీమతాన్ని ఇస్తారు. దానిపై నడవడం పిల్లల పని. ఇది అన్నింటికన్నా శ్రేష్ఠమైన డైరెక్షన్. ఎవరు ఎన్ని ప్రశ్నోత్తరాలు మొదలైనవి చేసినా కానీ బాబా అయితే కేవలం రెండే మాటలు అర్థం చేయిస్తారు. నేను పతిత-పావనుడిని, మీరు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి, అంతే! స్మృతి కోసం ఎక్కడైనా డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుందా! తండ్రిని స్మృతి చేయాలి, అంతేకానీ దుఃఖముతో మొరపెట్టుకోవలసిన లేక అరవవలసిన అవసరం లేదు. లోలోపల కేవలం అనంతమైన తండ్రినే స్మృతి చేయాలి. రెండో డైరెక్షన్ ఏమిస్తారు? 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి ఎందుకంటే మీరు దేవతలుగా అవ్వాలి, దేవతల మహిమనైతే మీరు అర్ధకల్పం చేసారు.

(చిన్న పిల్లలు ఏడుస్తున్న శబ్దం వచ్చింది) చిన్న పిల్లలనెవ్వరినీ తీసుకురావద్దు అని అన్ని సెంటర్ల వారికి డైరెక్షన్ ఇవ్వబడుతుంది. వారి కోసం ఏదైనా ఏర్పాటు చేయాలి. తండ్రి నుండి ఎవరైతే వారసత్వాన్ని తీసుకునేది ఉందో వారు తమకు తామే ఏర్పాట్లు చేసుకుంటారు. ఇది ఆత్మిక తండ్రి యొక్క యూనివర్శిటీ, ఇందులో చిన్న పిల్లల అవసరం లేదు. బ్రాహ్మణి (టీచర్) పని ఏమిటంటే - వారు ఎప్పుడైతే సేవకు యోగ్యులుగా అవుతారో, అప్పుడు రిఫ్రెష్ చేసేందుకు తీసుకురావాలి. ఎవరైనా పెద్దవారైనా లేక చిన్నవారైనా, ఇదైతే యూనివర్శిటీ. ఇక్కడికి ఎవరైతే చిన్న పిల్లలను తీసుకువస్తున్నారో, వారు ఇది యూనివర్శిటీ అని భావించటం లేదు. ముఖ్యమైన విషయమేమిటంటే - ఇది యూనివర్శిటీ. ఇందులో చదువుకునేవారు మంచి తెలివైనవారై ఉండాలి. అపరిపక్వంగా ఉన్నవారు కూడా డిస్టర్బ్ చేస్తారు ఎందుకంటే వారు తండ్రి స్మృతిలో ఉండకపోతే బుద్ధి అటూ-ఇటూ భ్రమిస్తూ ఉంటుంది. వారు నష్టపరుస్తారు. వారు స్మృతిలో ఉండలేరు. చిన్న పిల్లలను తీసుకువస్తే ఇందులో పిల్లలకే నష్టముంటుంది. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీ అని, ఇక్కడ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాల్సి ఉంటుందని కొందరికి తెలియనే తెలియదు. తండ్రి అంటారు, మీరు గృహస్థ వ్యవహారంలో పిల్ల-పాపలతో పాటు ఉండండి కానీ ఇక్కడున్నప్పుడు కేవలం ఒక వారము ఏమిటి, 3-4 రోజులు కూడా సరిపోతుంది. జ్ఞానమైతే చాలా సహజమైనది. తండ్రిని గుర్తించాలి. అనంతమైన తండ్రిని గుర్తించడం ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఏ వారసత్వము? అనంతమైన రాజ్యాధికారము. ప్రదర్శని లేక మ్యూజియంలలో సేవ జరగదని భావించకండి. అక్కడ లెక్కలేనంతమంది ప్రజలు తయారవుతారు. బ్రాహ్మణ కులము, సూర్యవంశము మరియు చంద్రవంశము - మూడూ ఇక్కడ స్థాపన అవుతున్నాయి. కావున ఇది చాలా పెద్ద యూనివర్శిటీ. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. బుద్ధి పూర్తిగా నిండిపోవాలి. కానీ తండ్రి సాధారణ తనువులో ఉన్నారు. చదివించడం కూడా సాధారణ రీతిలోనే చదివిస్తారు, అందుకే మనుష్యులకు ఇది అంతగా హత్తుకోవటం లేదు. గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీ ఇలా ఉంటుందా! అని అనుకుంటారు. తండ్రి అంటారు - నేను పేదల పెన్నిధిని, నేను పేదలకే చదివిస్తాను. షావుకార్లకు చదివే శక్తి లేదు. వారి బుద్ధిలోనైతే మహళ్ళు మొదలైనవే ఉంటాయి. పేదవారే షావుకార్లుగా అవుతారు, షావుకార్లు పేదవారిగా అవుతారు - ఇది నియమము. దానం ఎప్పుడైనా షావుకార్లకు ఇవ్వడం జరుగుతుందా? ఇది కూడా అవినాశీ జ్ఞాన రత్నాల దానమే. షావుకార్లు దానము తీసుకోలేరు. వారి బుద్ధిలో కూర్చోదు. వారు తమ హద్దు రచనలో, ధన-సంపదలలోనే చిక్కుకొని ఉంటారు. వారికి ఇక్కడ ఇదే స్వర్గములా అనిపిస్తుంది. మాకు ఇంకొక స్వర్గము యొక్క అవసరం లేదు అని అంటారు. ఎవరైనా గొప్ప వ్యక్తి మరణించినా స్వర్గస్థులయ్యారు అని అంటారు. వారు స్వర్గస్థులయ్యారు అని వాళ్ళకు వాళ్ళే అంటారు. అంటే తప్పకుండా ఇప్పుడిది నరకము అనే కదా అర్థము. కానీ ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే - అసలు నరకము అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు. మీ ఈ యూనివర్శిటీ ఎంత పెద్దది. తండ్రి అంటారు - ఎవరి బుద్ధికైతే తాళం వేయబడి ఉందో, వారినే నేను వచ్చి చదివిస్తాను. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడే వచ్చి తాళాన్ని తెరుస్తారు. మీ బుద్ధి తాళం ఎలా తెరుచుకుంటుందో తండ్రియే స్వయంగా డైరెక్షన్ ఇస్తారు. తండ్రిని దేని కోసమూ అడగకూడదు, ఇందులో నిశ్చయం కావాలి. వీరు అత్యంత ప్రియమైన బాబా, వీరిని భక్తిలో స్మృతి చేసేవారు. ఎవరినైతే స్మృతి చేస్తారో, వారు తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కూడా కదా. మళ్ళీ రిపీట్ అవ్వాలనే స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి వచ్చి పిల్లలకే అర్థం చేయిస్తారు. బాబా ఏ విధంగా వచ్చారు అన్నది పిల్లలు మళ్ళీ బయటివారికి అర్థం చేయించాలి. వారేమంటారు? పిల్లలూ, మీరందరూ పతితులుగా ఉన్నారు, నేనే వచ్చి పావనంగా తయారుచేస్తాను. పతితంగా అయిన ఆత్మయైన మీరు ఇప్పుడు కేవలం పతిత-పావనుడైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి, పరమ ఆత్మనైన నన్ను స్మృతి చేయండి. ఇందులో ఏమీ అడగాల్సిన అవసరం లేదు. మీరు భక్తి మార్గంలో అర్ధకల్పం అడుగుతూనే వచ్చారు, కానీ ఏమీ లభించలేదు. ఇప్పుడు అడగడం ఆపు చేయండి. నా అంతట నేనే మీకు ఇస్తూ ఉంటాను. తండ్రికి చెందినవారిగా అవ్వడం వలన వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది. పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు వెంటనే తండ్రిని అర్థం చేసుకుంటారు. 21 తరాల స్వర్గ రాజ్యాధికారమే తండ్రి ఇచ్చే వారసత్వము. ఇదైతే మీకు తెలుసు - నరకవాసులుగా ఉన్నప్పుడు ఈశ్వరార్థము దాన-పుణ్యాదులు చేయడం ద్వారా అల్పకాలిక సుఖము లభిస్తుంది. మనుష్యులు ధర్మార్థము కూడా తీస్తారు. చాలావరకు వ్యాపారస్థులు అలా తీస్తారు. మరి వ్యాపారస్థులు ఎవరైతే ఉంటారో వారు - మేము తండ్రితో వ్యాపారం చేసేందుకు వచ్చాము అని అంటారు. పిల్లలు తండ్రితో వ్యాపారం చేస్తారు కదా. తండ్రి ఆస్తిని తీసుకొని దాని ద్వారా శ్రాద్ధము మొదలైనవాటిని తినిపిస్తారు, దాన-పుణ్యాలు చేస్తారు. ధర్మశాలలు, మందిరాలు మొదలైనవి నిర్మిస్తే దానికి తండ్రి పేరును పెట్టుకుంటారు ఎందుకంటే ఎవరి నుండైతే ఆస్తి లభించిందో, వారి కోసమైతే తప్పకుండా చేయాలి. అది కూడా వ్యాపారమే అవుతుంది. అవన్నీ దైహికమైన విషయాలు. ఇప్పుడు తండ్రి అంటారు - గతించినదాని గురించి ఆలోచించకండి లేక చింతించకండి, తప్పుడు విషయాలేవీ వినకండి. ఎవరైనా తప్పుగా ఏమైనా ప్రశ్నిస్తే వారికి - ఈ విషయాలలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు మొదట తండ్రిని స్మృతి చేయండి అని చెప్పండి. భారత్ యొక్క ప్రాచీన రాజయోగం ప్రసిద్ధమైనది. ఎంతగా స్మృతి చేస్తారో, దైవీ గుణాలను ధారణ చేస్తారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇది యూనివర్శిటీ. ఇక్కడ లక్ష్యము-ఉద్దేశ్యము స్పష్టముగా ఉంది. పురుషార్థము చేసి ఈ విధంగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరికీ ఏ రకంగానూ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీరు దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రి పిల్లలు కదా. అది సేవ ద్వారా తెలుస్తుంది. చాలామంది కొత్త-కొత్తవారు కూడా వస్తారు. 25-30 సంవత్సరాల వారి కన్నా 10-12 రోజుల వారు చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. పిల్లలైన మీరు మీ సమానముగా తయారుచేయాలి. ఎప్పటివరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో, అప్పటివరకూ దేవతలుగా ఎలా అవుతారు. గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయితే బ్రహ్మాయే కదా. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో, వారి మహిమను చేస్తూ ఉంటారు, తప్పకుండా వారు మళ్ళీ వస్తారు. పండుగలు మొదలైనవేవైతే మహిమ చేయబడతాయో, అవన్నీ ఒకప్పుడు జరిగాయి, మళ్ళీ జరుగుతాయి. ఈ సమయంలో రక్షాబంధనము మొదలైన... పండుగలన్నీ జరుగుతున్నాయి. అన్నింటి రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు తండ్రికి పిల్లలు కావున పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. పతిత-పావనుడైన తండ్రిని పిలుస్తారు కావున తండ్రి మార్గాన్ని తెలియజేస్తారు. కల్ప-కల్పమూ ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారే ఏక్యురేట్ గా నడుస్తూ ఉంటారు. మీరు కూడా సాక్షీగా అయి చూస్తారు. బాప్ దాదా కూడా సాక్షీగా అయి చూస్తారు - వీరు ఎంత వరకూ ఉన్నత పదవిని పొందగలరు? వీరి క్యారెక్టర్ ఎలా ఉంది? అని. టీచరుకైతే అంతా తెలిసి ఉంటుంది కదా - ఎంతమందిని తమ సమానముగా తయారుచేస్తున్నారు? ఎంత సమయం స్మృతిలో ఉంటున్నారు? మొదట బుద్ధిలో - ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అన్నది గుర్తు ఉంచుకోవాలి. యూనివర్శిటీ ఉన్నదే జ్ఞానము కోసము. అది హద్దులోని యూనివర్శిటీ. ఇది అనంతమైనది. దుర్గతి నుండి సద్గతి, నరకము నుండి స్వర్గముగా తయారుచేసేవారు ఒక్క తండ్రియే. తండ్రి దృష్టి అయితే ఆత్మలందరి వైపుకు వెళ్తుంది. అందరి కళ్యాణము చేయాలి, తిరిగి తీసుకువెళ్ళాలి. కేవలం మిమ్మల్నే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న ఆత్మలను వారు స్మృతి చేస్తూ ఉంటారు. అందులో చదివించేది పిల్లలను. నంబరువారుగా ఎలా, ఎలా వచ్చారో, వారు మళ్ళీ అదే విధముగా వెళ్తారని కూడా మీకు తెలుసు. ఆత్మలందరూ నంబరువారుగా వస్తారు. మీరు కూడా నంబరువారుగా ఎలా వెళ్తారు - అన్నదంతా అర్థం చేయించడం జరుగుతుంది. కల్పపూర్వం ఏదైతే జరిగిందో, అదే జరుగుతుంది. మీరు ఏ విధంగా కొత్త ప్రపంచములోకి వస్తారు అన్నది కూడా మీకు అర్థం చేయించడం జరుగుతుంది. నంబరువారుగా కొత్త ప్రపంచములోకి ఎవరైతే వస్తారో, వారికే అర్థం చేయించడం జరుగుతుంది.

పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకోవడం ద్వారా మీ ధర్మాన్ని మరియు అన్ని ధర్మాలకు చెందిన వృక్షమంతటి గురించి తెలుసుకుంటారు. ఇందులో ఏమీ అడగాల్సిన అవసరం లేదు, ఆశీర్వాదము కూడా అడగాల్సిన అవసరం లేదు. బాబా, దయ చూపించండి, కృప చూపించండి అని వ్రాస్తారు. తండ్రి అయితే ఏమీ చేయరు. తండ్రి వచ్చిందే మార్గాన్ని చూపించడానికి. అందరినీ పావనంగా తయారుచేయడమే డ్రామాలో నా పాత్ర. ఏ పాత్రనైతే కల్పకల్పమూ అభినయించానో, అదే అభినయిస్తాను. మంచైనా లేక చెడైనా, ఏదైతే గతించిందో, అది డ్రామాలో ఉంది. ఏ విషయము గురించి ఆలోచించకూడదు. మనం ముందుకు వెళ్తూ ఉంటాము. ఇది అనంతమైన డ్రామా కదా. మొత్తం చక్రమంతా పూర్తి అయి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవరు ఎటువంటి పురుషార్థము చేస్తారో, అటువంటి పదవినే పొందుతారు. ఏమీ అడగవలసిన అవసరం లేదు. భక్తి మార్గములో మీరు ఎంతగానో అడిగారు. మొత్తం ధనమంతటినీ సమాప్తం చేసేసారు. ఇదంతా డ్రామాలో తయారుచేయబడి ఉంది. వారు కేవలం అర్థం చేయిస్తారు. అర్ధకల్పం భక్తి చేస్తూ, శాస్త్రాలు చదువుతూ ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడైతే మీరు ఏమీ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. తండ్రి అయితే దాత కదా. దాతకు అవసరం లేదు. వారు వచ్చిందే ఇవ్వడానికి. మేము శివబాబాకు ఇచ్చాము అని భావించకండి. అరే, శివబాబా నుండైతే ఎంతెంతో లభిస్తుంది. ఇక్కడకు మీరు తీసుకోవడానికే వచ్చారు కదా. టీచర్ వద్దకు విద్యార్థులు తీసుకోవడానికే వస్తారు. ఆ లౌకిక తండ్రి, టీచర్, గురువు ద్వారానైతే నీరు నష్టాన్నే పొందారు. ఇప్పుడు పిల్లలు శ్రీమతముపై నడవాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. శివబాబా డబుల్ శ్రీ శ్రీ, మీరు సింగిల్ శ్రీ గా అవుతారు. శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణుడు అని అంటారు. శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణుడు అంటే ఇద్దరు అయినట్లు. విష్ణువును శ్రీ శ్రీ అని అంటారు ఎందుకంటే ఇద్దరూ కలిసి ఉన్నారు. వారు ఇరువురినీ తయారుచేసేవారు ఎవరు? ఆ ఒక్క శ్రీ శ్రీ యే అలా తయారుచేస్తారు. వారు తప్ప ఇంకెవ్వరూ శ్రీ శ్రీ గా ఉండరు. ఈ రోజుల్లోనైతే శ్రీ లక్ష్మీ-నారాయణ, శ్రీ సీతా-రామ అన్న పేర్లను కూడా పెట్టుకుంటారు. పిల్లలు ఈ విషయాలన్నింటినీ ధారణ చేసి సంతోషముగా ఉండాలి.

ఈ రోజుల్లో స్పిరిచ్యుయల్ (ఆధ్యాత్మిక) కాన్ఫరెన్సులు కూడా జరుగుతూ ఉంటాయి, కానీ స్పిరిచ్యుయల్ అన్న పదము యొక్క అర్థాన్ని తెలుసుకోరు. ఆత్మిక జ్ఞానాన్ని అయితే ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. బాబా ఆత్మలందరికీ తండ్రి. వారిని ఆత్మికమైనవారు అని అంటారు. ఫిలాసఫీని కూడా స్పిరిచ్యుయల్ అని అంటారు. ఇది ఒక అడవి అని, అందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు అని మీరు అర్థం చేసుకుంటారు. అహింస పరమో దేవీ-దేవతా ధర్మము అని గానం చేయబడిందని మీకు తెలుసు. అక్కడ మారణహోమములేవీ జరగవు. కోపం చేయడం కూడా హింసయే, దానిని సెమీ-హింస అనైనా అనండి, ఇంకేమైనా అనండి. ఇక్కడైతే పూర్తిగా అహింసకులుగా అవ్వాలి. మనసా, వాచా, కర్మణా ఎటువంటి చెడు కర్మ జరగకూడదు. ఎవరైనా పోలీస్ మొదలైన వృత్తులలో ఉంటే అక్కడ కూడా యుక్తిగా పని కానివ్వాలి. ఎంత వీలైతే అంత ప్రేమగా పని కానివ్వాలి. బాబాకు తమ అనుభవం ఉంది, ప్రేమగా తమ పని పూర్తి చేసేవారు, ఇందులో చాలా యుక్తి కావాలి. ఒకటికి 100 రెట్ల శిక్ష ఎలా పడుతుంది అని వాళ్ళకు ఎంతో ప్రేమగా అర్థం చేయించాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనం దుఃఖహర్త, సుఖకర్త తండ్రికి పిల్లలము, అందుకే ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని ముందు ఉంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి. తమ సమానంగా తయారుచేసే సేవను చేయాలి.

2. డ్రామాలోని ప్రతి పాత్రను తెలుసుకుంటూ గతించిన ఏ విషయము గురించి కూడా చింతన చేయకూడదు. మనసా, వాచా, కర్మణా ఎటువంటి చెడు కర్మ జరగకూడదు - దీని పట్ల ధ్యాసను ఉంచి డబల్ అహింసకులుగా అవ్వాలి.

వరదానము:-

ఒక్క తండ్రిని కంపానియన్ (సహచరుని) గా చేసుకునే మరియు వారి కంపెనీ (సాంగత్యం) లో ఉండే సంపూర్ణ పవిత్ర ఆత్మా భవ

ఎవరికైతే సంకల్పములో మరియు స్వప్నములో కూడా బ్రహ్మచర్య ధారణ ఉంటుందో, ఎవరైతే ప్రతి అడుగులో బ్రహ్మాబాబా ఆచరణపై నడిచేవారిగా ఉంటారో, వారే సంపూర్ణ పవిత్ర ఆత్మ. పవిత్రత అంటే అర్థము - సదా తండ్రిని సహచరునిగా చేసుకోవటము మరియు తండ్రి సాంగత్యములోనే ఉండటము. సంగఠన యొక్క సాంగత్యము, పరివారం యొక్క స్నేహంతో కూడిన మర్యాద వేరే విషయము, కానీ బాబా కారణంగానే ఈ సంగఠన యొక్క స్నేహంతో కూడిన సాంగత్యం ఉంది, బాబా లేకపోతే పరివారము ఎక్కడి నుండి వస్తుంది. బాబా బీజము, బీజాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.

స్లోగన్:-

ఎవరి ప్రభావానికి ప్రభావితులయ్యేవారిగా కాదు, జ్ఞాన ప్రభావాన్ని వేసేవారిగా అవ్వండి.