23-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఏ శిక్షణలనైతే ఇస్తారో, వాటిని అమలులోకి తీసుకురండి, మీరు ప్రతిజ్ఞ చేసిన తర్వాత మీ మాట తప్పకూడదు, ఆజ్ఞ ఉల్లంఘన చేయకూడదు’’

ప్రశ్న:-

మీ చదువు యొక్క సారము ఏమిటి? మీరు ఏ అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి?

జవాబు:-

వానప్రస్థములోకి వెళ్ళడమే మీ చదువు. ఈ చదువు యొక్క సారము - వాణి నుండి అతీతముగా వెళ్ళడము. తండ్రే అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళే కన్నా ముందు సతోప్రధానంగా అవ్వాలి. దీని కొరకు ఏకాంతంలోకి వెళ్ళి దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేయండి. అశరీరులుగా అయ్యే అభ్యాసమే ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది.

ఓంశాంతి

స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు మరియు అటువంటి విశ్వానికి యజమానులుగా అవుతారు. కల్ప-కల్పమూ మీరు ఈ విధంగానే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు, మళ్ళీ 84 జన్మలలో తమోప్రధానముగా అవుతారు. అప్పుడు తండ్రి శిక్షణను ఇస్తారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. భక్తి మార్గములో కూడా మీరు స్మృతి చేసేవారు, కానీ ఆ సమయంలో మంద బుద్ధి యొక్క జ్ఞానమే ఉండేది. ఇప్పుడు సూక్ష్మ బుద్ధి యొక్క జ్ఞానం ఉంది. ప్రాక్టికల్ గా తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ కూడా నక్షత్రము వంటిదే, అలాగే తండ్రి కూడా నక్షత్రము వంటివారేనని కూడా అర్థం చేయించాలి. కేవలం వారు పునర్జన్మలను తీసుకోరు, మీరు తీసుకుంటారు, అందుకే మీరు తమోప్రధానముగా అవ్వవలసి వస్తుంది. మళ్ళీ సతోప్రధానముగా అయ్యేందుకు కష్టపడవలసి ఉంటుంది. మాయ ఘడియ, ఘడియ మరపింపజేస్తూ ఉంటుంది. ఇప్పుడు పొరపాట్లు లేనివారిగా తయారవ్వాలి, పొరపాట్లు చేయకూడదు. ఒకవేళ పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే మీరు ఇంకా తమోప్రధానముగా అయిపోతారు. మీకు డైరెక్షన్ లభిస్తుంది - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, బ్యాటరీని చార్జ్ చేసుకోండి, అప్పుడు మీరు సతోప్రధానముగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. టీచర్ అయితే అందరినీ చదివిస్తారు. విద్యార్థులు నంబరువారుగా పాస్ అవుతారు. మళ్ళీ సంపాదనను కూడా నంబరువారుగా చేసుకుంటారు. మీరు కూడా నంబరువారుగా పాస్ అవుతారు, మళ్ళీ నంబరువారుగా పదవిని పొందుతారు. విశ్వాధిపతులు ఎక్కడ, ప్రజలు, దాస-దాసీలు ఎక్కడ. ఏ విద్యార్థులైతే మంచిగా, సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా ఉంటారో వారు తప్పకుండా టీచర్ మతముపై నడుస్తారు. రిజిస్టర్ ఎంతగా బాగుంటుందో, అంతగా మార్కులు ఎక్కువ లభిస్తాయి, అందుకే తండ్రి కూడా పిల్లలకు పదే-పదే అర్థం చేయిస్తూ ఉంటారు - పొరపాట్లు చేయకండి అని. కల్ప పూర్వము కూడా ఫెయిల్ అయి ఉంటాము అని భావించకండి. మేము సేవ చేయకపోతే తప్పకుండా ఫెయిల్ అవుతాము అని చాలా మంది మనస్సులలోకి వస్తూ ఉండవచ్చు, తండ్రి అయితే అప్రమత్తం చేస్తూ ఉంటారు. మీరు సత్యయుగీ సతోప్రధానుల నుండి కలియుగీ తమోప్రధానులుగా అయ్యారు, మళ్ళీ ప్రపంచ చరిత్ర-భౌగోళము రిపీట్ అవుతాయి. సతోప్రధానముగా అయ్యేందుకు తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు పైకి ఎక్కుతూ, ఎక్కుతూ సతోప్రధానముగా అయిపోతారు. ఎక్కడం మెల్లమెల్లగా పైకి ఎక్కుతారు, అందుకే మర్చిపోకండి. కానీ మాయ మరపింపజేస్తుంది. ఆజ్ఞను ఉల్లంఘించేవారిగా చేసేస్తుంది. తండ్రి ఏ డైరెక్షన్ ను అయితే ఇస్తారో దానిని అంగీకరిస్తారు, ప్రతిజ్ఞ చేస్తారు, కానీ దానిపై నడవరు. అప్పుడు తండ్రి వారిని - ఆజ్ఞను ఉల్లంఘించి తమ మాటను తప్పేవారు అని అంటారు. తండ్రితో ప్రతిజ్ఞను చేసిన తర్వాత దానిని అమలు చేయవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి ఏ శిక్షణలనైతే ఇస్తారో అటువంటి శిక్షణలను ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మార్పు కూడా తప్పకుండా తీసుకురావలసి ఉంటుంది. చిత్రాలు ఎంత బాగున్నాయి. బ్రహ్మా వంశీయులుగా ఉన్నారు, మళ్ళీ విష్ణు వంశీయులుగా అవుతారు. ఇది కొత్త ఈశ్వరీయ భాష. దీనిని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వరు. కొన్ని సంస్థలు వెలువడ్డాయి, అవి ఆత్మిక సంస్థ అని పేరు పెట్టుకున్నాయి. కానీ మీది తప్ప ఇంకెవ్వరిదీ ఆత్మిక సంస్థ అవ్వదు. ఇమిటేషన్ ఎంతగానో జరుగుతుంది. ఇది కొత్త విషయము, మీరు చాలా కొద్దిమందే ఉన్నారు, ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మొత్తం వృక్షమంతా ఇప్పుడు ఉంది. కేవలం కాండం మాత్రం లేదు, మళ్ళీ ఆ కాండం వచ్చేస్తుంది, అప్పుడు మిగిలిన శాఖోపశాఖలు ఉండవు, అవన్నీ అంతమైపోతాయి. అనంతమైన తండ్రే అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటి పైనా రావణరాజ్యం ఉంది. ఇది ఒక లంక. ఆ లంక అయితే సముద్రానికి అవతల ఉంది. ఈ అనంతమైన ప్రపంచము కూడా సముద్రముపై ఉంది. నలువైపులా నీరే ఉంది. అవేమో హద్దులోని విషయాలు, తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఒక్క తండ్రే అర్థం చేయిస్తారు. ఇది చదువు. ఎప్పటివరకైతే ఉద్యోగం లభించదో, చదువు యొక్క రిజల్టు వెలువడదో, అప్పటివరకూ చదువులోనే నిమగ్నమై ఉంటారు. అందులోనే బుద్ధి నడుస్తుంది. విద్యార్థుల పని చదువుపై అటెన్షన్ పెట్టడం. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ స్మృతి చేయాలి. విద్యార్థుల బుద్ధిలో ఈ చదువు ఉంటుంది. పరీక్ష రోజులలో ఫెయిల్ అయిపోకూడదు అని ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. విశేషముగా ఉదయాన్నే తోటలలోకి వెళ్ళి చదువుకుంటారు ఎందుకంటే ఇంటిలోని గోల వైబ్రేషన్లు అశుద్ధముగా ఉంటాయి.

తండ్రి అర్థం చేయించారు - దేహీ-అభిమానులుగా అయ్యే అభ్యాసము చేయండి, అప్పుడు ఇక మర్చిపోరు. ఏకాంతము ఉండే స్థానాలైతే ఎన్నో ఉన్నాయి. ప్రారంభంలో క్లాస్ పూర్తి చేసుకుని మీరందరూ పర్వతాల పైకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు రోజురోజుకు జ్ఞానము ఇంకా లోతైనదిగా అవుతూ ఉంటుంది. విద్యార్థులకు లక్ష్యము, ఉద్దేశ్యము గుర్తుంటుంది. ఇది వానప్రస్థావస్థలోకి వెళ్ళేందుకు చదివే చదువు. దీనిని ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. సాధు-సన్యాసులు మొదలైనవారంతా కేవలం భక్తినే నేర్పిస్తారు. వాణి నుండి అతీతముగా వెళ్ళే దారిని ఒక్క తండ్రే తెలియజేస్తారు. ఒక్క తండ్రే అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఇది మీ అనంతమైన వానప్రస్థావస్థ, దీని గురించి ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరందరూ వానప్రస్థులు. ఇది మొత్తం ప్రపంచమంతటి వానప్రస్థావస్థ. ఎవరైనా చదివినా, చదవకపోయినా అందరూ తిరిగి వెళ్ళవలసిందే. ఏ ఆత్మలైతే మూలవతనములోకి వెళ్తారో, వారు తమ-తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. ఆత్మల వృక్షము కూడా అద్భుతముగా తయారుచేయబడి ఉంది. ఈ డ్రామా చక్రమంతా పూర్తిగా ఏక్యురేట్ గా ఉంది. ఇందులో కొద్దిగా కూడా తేడా లేదు. లివర్ గడియారము మరియు సిలెండర్ గడియారము ఉంటాయి కదా. అందులో లివర్ గడియారము పూర్తిగా ఏక్యురేట్ గా ఉంటుంది. ఇందులో కూడా కొందరి బుద్ధియోగము లివర్ గడియారములా ఉంటుంది, కొందరిది సిలెండర్ గడియారములా ఉంటుంది. కొందరిదైతే ఏ మాత్రమూ జోడింపబడదు. అంటే గడియారము అసలు నడవనే నడవటం లేదు అన్నట్లు ఉంటుంది. మీరు పూర్తిగా లివర్ గడియారము వలె తయారవ్వాలి, అప్పుడు రాజ్యములోకి వెళ్తారు. సిలెండర్ గడియారము వంటివారు ప్రజలలోకి వెళ్తారు. పురుషార్థము లివర్ గడియారములా తయారయ్యేందుకు చేయాలి. రాజ్యపదవిని తీసుకునేవారి గురించే కోట్లాదిమందిలో ఏ ఒక్కరో అని అనడం జరుగుతుంది. వారే విజయమాలలో స్మరింపబడతారు. ఇందులో తప్పకుండా శ్రమించాలి అని పిల్లలు భావిస్తారు. బాబా, ఘడియ-ఘడియ మర్చిపోతున్నాము అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, ఎంతగా పహిల్వాన్లుగా అవుతారో అంతగా మాయ కూడా శక్తివంతముగా పోరాడుతుంది. మల్లయుద్ధము ఉంటుంది కదా, అందులో చాలా జాగ్రత్తగా ఉంటారు. పహిల్వాన్ల గురించి పహిల్వాన్లకు తెలుసు. ఇక్కడ కూడా అలాగే. మహావీరులైన పిల్లలు కూడా ఉన్నారు. అందులో కూడా నంబరువారుగా ఉన్నారు. మంచి-మంచి మహారథులను కూడా మాయ బాగా తుఫానులలోకి తీసుకువస్తుంది. బాబా అర్థం చేయించారు - మాయ ఎంతగా హైరానా పరిచినా, తుఫానులలోకి తీసుకొచ్చినా మీరు జాగ్రత్తగా ఉండండి, ఏ విషయములోనూ ఓడిపోకూడదు. మనసులో తుఫానులు వచ్చినా కానీ కర్మేంద్రియాలతో చేయకూడదు. తుఫానులు పడేసేందుకే వస్తాయి. మాయ యుద్ధం జరగకపోతే పహిల్వాన్లు అని ఎలా అంటారు. మాయ తుఫానులను లెక్కచేయకూడదు. కానీ నడుస్తూ, నడుస్తూ కర్మేంద్రియాలకు వశమై ఒక్కసారిగా పడిపోతారు. కర్మేంద్రియాలతో వికర్మలు చేయకూడదు అని తండ్రి అయితే రోజూ అర్థం చేయిస్తారు. నియమవిరుద్ధమైన పనులను చేయడం మానకపోతే పైసకు కొరగాని పదవిని పొందుతారు. మేము ఫెయిల్ అయిపోతాము అని స్వయం కూడా లోలోపల భావిస్తారు. వెళ్ళడమైతే అందరూ వెళ్ళాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే ఆ స్మృతి కూడా వినాశనాన్ని పొందదు. కొద్దిగా స్మృతి చేసినా స్వర్గములోకి వస్తారు. కొద్దిగా స్మృతి చేయడం ద్వారా లేక ఎక్కువగా స్మృతి చేయడం ద్వారా ఏయే పదవులు లభిస్తాయి అనేది కూడా మీరు అర్థం చేసుకోగలరు. ఎవ్వరూ దాగి ఉండలేరు. ఎవరు ఏమేమి అవుతారు అనేది స్వయం కూడా అర్థం చేసుకోగలరు. ఒకవేళ ఇప్పుడు నా గుండె ఆగిపోతే నేను ఏ పదవిని పొందుతాను? బాబాను అడుగవచ్చు కూడా. మున్ముందు తమకు తామే అర్థం చేసుకుంటూ ఉంటారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. తుఫానులు, వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు. రావణుడైతే కూర్చొనే ఉన్నాడు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఎవరైతే పాస్ అవుతారో వారు ఉన్నత పదవిని పొందుతారు. రాజులు తప్పకుండా వివేకవంతులే కావాలి, వారు ప్రజలను సంభాళించగలగాలి. ఐ.సి.యస్. పరీక్షలో కొద్దిమందే పాస్ అవుతారు. తండ్రి మిమ్మల్ని చదివించి స్వర్గాధిపతులుగా, సతోప్రధానులుగా తయారుచేస్తారు. సతోప్రధానుల నుండి మళ్ళీ తమోప్రధానులుగా అయ్యామని మీకు తెలుసు, ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానులుగా అవ్వాలి. పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మన్మనాభవ అని అంటారు. ఇది ఆ గీత అధ్యాయమే. ద్వికిరీటధారులుగా అయ్యేందుకే గీత ఉంది. అలా తయారుచేసేదైతే తండ్రే కదా. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మంచి వివేకవంతులు ఎవరైతే ఉంటారో, వారి వద్ద ధారణ కూడా బాగా జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్ 5-1-69

పిల్లలు ఇక్కడ క్లాస్ లో కూర్చున్నారు మరియు వారికి తమ టీచర్ ఎవరో తెలుసు. ఇప్పుడు తమ టీచర్ ఎవరు అన్నది విద్యార్థులకు అన్నివేళలా గుర్తుంటుంది. కానీ ఇక్కడ మర్చిపోతారు. పిల్లలు నన్ను ఘడియ-ఘడియ మర్చిపోతారు అని ఇక్కడ టీచరుకు తెలుసు. ఇటువంటి ఆత్మిక తండ్రి అయితే ఎప్పుడూ లభించలేదు. వారు సంగమయుగములోనే లభిస్తారు. సత్యయుగము మరియు కలియుగములోనైతే దైహికమైన తండ్రి లభిస్తారు. పిల్లలకు ఇది సంగమయుగమని, ఇందులో పిల్లలైన మేము ఈ విధముగా పురుషోత్తములుగా అవ్వనున్నామని పిల్లలకు పక్కా అయిపోవాలని తండ్రి స్మృతిని ఇప్పిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ముగ్గురూ గుర్తుకురావాలి. టీచరును స్మృతి చేసినా ముగ్గురూ గుర్తుకురావాలి, అలాగే గురువును స్మృతి చేసినా ముగ్గురూ గుర్తుకురావాలి. ఇది తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయము పవిత్రముగా అవ్వడము. పవిత్రులను సతోప్రధానులు అని అనడం జరుగుతుంది. వారు సత్యయుగములోనే ఉంటారు. ఇప్పుడు చక్రము చుట్టి వచ్చారు. ఇప్పుడు ఇది సంగమయుగము. కల్ప-కల్పమూ తండ్రి కూడా వస్తారు మరియు చదివిస్తారు. మీరు తండ్రి వద్ద ఉంటారు కదా. వీరు సత్యమైన సద్గురువు అని కూడా మీకు తెలుసు. మరియు తప్పకుండా వీరు ముక్తి-జీవన్ముక్తి ధామాల దారిని చూపిస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మనం పురుషార్థము చేసి తండ్రిని ఫాలో చేస్తాము. ఇక్కడ శిక్షణను పొంది ఫాలో చేస్తాము. ఏ విధముగా వీరు నేర్చుకుంటారో, అలాగే పిల్లలైన మీరు కూడా పురుషార్థము చేస్తారు. దేవతలుగా అవ్వాలంటే శుద్ధ కర్మలను చేయాలి. అశుద్ధత ఏమీ ఉండకూడదు మరియు విశేషమైన విషయమేమిటంటే - తండ్రిని స్మృతి చేయాలి. మేము తండ్రిని మర్చిపోతున్నాము, శిక్షణను కూడా మర్చిపోతున్నాము మరియు స్మృతియాత్రను కూడా మర్చిపోతున్నాము అని అర్థం చేసుకుంటారు. తండ్రిని మర్చిపోవడం ద్వారా జ్ఞానాన్ని కూడా మర్చిపోతారు. నేను విద్యార్థిని అన్నది కూడా మర్చిపోతారు. మీకు ముగ్గురూ గుర్తుకురావాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే టీచరు, సద్గురువు తప్పకుండా గుర్తుకువస్తారు. శివబాబాను స్మృతి చేస్తారు, అలాగే దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. తండ్రి స్మృతిలోనే అద్భుతము ఉంది. ఈ అద్భుతాన్ని ఎంతగా తండ్రి పిల్లలకు నేర్పిస్తారో, అంతగా ఇంకెవ్వరూ నేర్పించలేరు. తమోప్రధానము నుండి మనము ఇదే జన్మలో సతోప్రధానముగా అవుతాము. తమోప్రధానముగా అవ్వడానికి పూర్తి కల్పము పడుతుంది. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే సతోప్రధానముగా అవ్వాలి, ఇందులో ఎవరు ఎంతగా కష్టపడితే అంత పొందుతారు. మొత్తం ప్రపంచమంతా అయితే కష్టపడదు కదా. ఇతర ధర్మాలవారు కష్టపడరు. పిల్లలైతే సాక్షాత్కారం చూసారు. ధర్మస్థాపకులు వస్తారు, ఫలానా, ఫలానా వస్త్రాలలో పాత్రను అభినయిస్తారు. వారు కూడా తమోప్రధానతలోకి వస్తారు. ఏ విధముగా మనం సతోప్రధానులుగా అవుతామో అలా ఇతరులందరూ అవుతారని వివేకము కూడా చెప్తుంది. పవిత్రతా దానమును తండ్రి నుండి తీసుకుంటారు. మమ్మల్ని ఇక్కడి నుండి విముక్తులను చేసి ఇంటికి తీసుకువెళ్ళండి, మార్గదర్శకునిగా అవ్వండి అని అందరూ పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ ఇంటికి వెళ్ళవలసిందే. అనేక సార్లు ఇంటికి వెళ్తారు. కొందరైతే పూర్తిగా 5,000 సంవత్సరాలూ ఇంట్లో ఉండరు. కొందరైతే పూర్తి 5,000 సంవత్సరాలూ ఉంటారు. అంతిమంలో వస్తే 4,999 సంవత్సరాలు శాంతిధామంలో ఉన్నారు అని అంటారు. మనము అంటాము - మేము 4,999 సంవత్సరాలు ఈ సృష్టిలో ఉన్నాము అని. మేము 83-84 జన్మలను తీసుకున్నాము అనైతే పిల్లలకు నిశ్చయం ఉంది. ఎవరైతే చాలా చురుకైనవారిగా ఉంటారో వారు తప్పకుండా మొదటే వచ్చి ఉంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సతోప్రధానముగా అయ్యేందుకు స్మృతియాత్ర ద్వారా తమ బ్యాటరీని చార్జ్ చేసుకోవాలి. పొరపాట్లు లేనివారిగా అవ్వాలి. మీ రిజిస్టర్ ను మంచిగా ఉంచుకోవాలి. ఎటువంటి పొరపాట్లు చేయకూడదు.

2. ఎటువంటి నియమవిరుద్ధమైన కర్మలనూ చేయకూడదు, మాయా తుఫానులను లెక్కచేయకుండా కర్మేంద్రియజీతులుగా అవ్వాలి. లివర్ గడియారము వలె ఏక్యురేట్ పురుషార్థము చేయాలి.

వరదానము:-

సేవ ద్వారా సంతోషము, శక్తి మరియు సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే పుణ్యాత్మ భవ

సేవకు ప్రత్యక్షఫలంగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి. సేవ చేస్తూ ఆత్మలను తండ్రి వారసత్వానికి అధికారులుగా చేయటము - ఇది పుణ్య కార్యము. ఎవరైతే పుణ్యము చేస్తారో, వారికి ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. సర్వాత్మల హృదయాలలో సంతోషపు సంకల్పాలేవైతే ఉత్పన్నమవుతాయో, ఆ శుభ సంకల్పాలు ఆశీర్వాదాలుగా అవుతాయి మరియు భవిష్యత్తు కోసం కూడా జమ అవుతుంది, అందుకే సదా స్వయాన్ని సేవాధారిగా భావిస్తూ సేవ యొక్క అవినాశీ ఫలమైన సంతోషాన్ని మరియు శక్తిని సదా తీసుకుంటూ ఉండండి.

స్లోగన్:-

మనసా-వాచా యొక్క శక్తుల ద్వారా విఘ్నాల పరదాను తొలగించండి, అప్పుడు లోలోపల కళ్యాణం యొక్క దృశ్యం కనిపిస్తుంది.