25-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ పురుషోత్తమ యుగమే గీతా అధ్యాయము, ఇందులోనే మీరు పురుషార్థము చేసి ఉత్తమ పురుషులుగా అనగా దేవతలుగా అవ్వాలి’’

ప్రశ్న:-

ఏ ఒక్క విషయము పట్ల సదా అటెన్షన్ ఉన్నట్లయితే నావ తీరానికి చేరుకుంటుంది?

జవాబు:-

మేము ఈశ్వరీయ సాంగత్యములో ఉండాలి అన్న అటెన్షన్ సదా ఉన్నట్లయితే నావ తీరానికి చేరుకుంటుంది. ఒకవేళ సాంగత్య దోషములోకి వచ్చినా, సంశయము వచ్చినా నావ విషయ సాగరములో మునిగిపోతుంది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, అందులో పిల్లలకు కొద్దిగా కూడా సంశయం కలగకూడదు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా పవిత్రంగా మరియు జ్ఞాన సంపన్నులుగా తయారుచేయడానికి వచ్చారు. తండ్రి సాంగత్యములోనే ఉండాలి.

ఓంశాంతి

భగవానువాచ - తండ్రి 5,000 సంవత్సరాల క్రితం ఏ రాజయోగమునైతే అర్థం చేయించారో ఇప్పుడు దానినే నేర్పిస్తున్నారని పిల్లలకు తెలుసు. పిల్లలకు తెలుసు కానీ ప్రపంచానికి తెలియదు, అందుకే పిల్లలు ప్రశ్నలు అడగాలి - గీతా భగవంతుడు ఎప్పుడు వచ్చారు? నేను రాజయోగాన్ని నేర్పించి మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను అని భగవంతుడు ఏదైతే అన్నారో ఆ గీతా అధ్యాయము ఎప్పుడు జరిగింది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా వింటున్నారు. గీతా అధ్యాయము కలియుగాంతము మరియు సత్యయుగ ఆదికి మధ్యలోనే జరగాలి. భగవంతుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు కావున తప్పకుండా సంగమములోనే వస్తారు. పురుషోత్తమ సంగమయుగము తప్పకుండా ఉంది. వారు పురుషోత్తమ సంవత్సరము అని గానం చేస్తారు కానీ పాపం వారికి తెలియదు. మధురాతి-మధురమైన పిల్లలైన మీకు తెలుసు - ఉత్తమ పురుషులుగా తయారుచేయడానికి అనగా మనుష్యులను ఉత్తమ దేవతలుగా తయారుచేయడానికి తండ్రి వచ్చి చదివిస్తారు. మనుష్యులలో ఉత్తమ పురుషులు ఈ దేవతలు (లక్ష్మీ-నారాయణులు). మనుష్యులను దేవతలుగా ఈ సంగమయుగములోనే తయారుచేసారు. దేవతలు తప్పకుండా సత్యయుగములోనే ఉంటారు. మిగిలినవారంతా కలియుగములో ఉన్నారు. మనము సంగమయుగ బ్రాహ్మణులము అని పిల్లలైన మీకు తెలుసు. దీనిని పక్కా-పక్కాగా గుర్తుంచుకోవాలి. వాస్తవానికి తమ కులాన్ని ఎవ్వరూ మర్చిపోరు కానీ ఇక్కడ మాయ మరపింపజేస్తుంది. మనం బ్రాహ్మణ కులానికి చెందినవారము, తర్వాత దేవత కులానికి చెందినవారిగా అవుతాము. ఒకవేళ ఇది గుర్తున్నట్లయితే ఎంతో సంతోషము ఉంటుంది. మీరు రాజయోగాన్ని చదువుతారు. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు గీత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు మరియు భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని నేర్పిస్తున్నారని మీరు అర్థం చేయిస్తారు. మనం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. తండ్రి అన్నారు - కామం మహాశత్రువు, దీనిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగత్ జీతులుగా అవుతారు. పవిత్రత విషయంలో ఎంతగా వాదిస్తూ ఉంటారు. మనుష్యుల కొరకు వికారాలనేవి ఒక ఖజానా వంటివి. లౌకిక తండ్రి నుండి ఈ వారసత్వం లభించింది. లౌకిక తండ్రికి పిల్లలుగా అయినప్పుడు మొట్టమొదట ఆ తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది, వివాహం చేసి నాశనం చేస్తారు. కానీ అనంతమైన తండ్రి కామం మహాశత్రువు అని అంటున్నప్పుడు మరి తప్పకుండా కామాన్ని జయించడం ద్వారానే జగత్ జీతులుగా అవుతారు. తండ్రి తప్పకుండా సంగమములోనే వచ్చి ఉంటారు. మహాభారీ, మహాభారత యుద్ధం కూడా ఉంది. మనం కూడా ఇక్కడ తప్పకుండా ఉన్నాము. అందరూ వెంటనే కామంపై విజయాన్ని పొందుతారని కూడా కాదు. ప్రతి విషయంలోనూ సమయం పడుతుంది. బాబా, మేము విషయ వైతరిణీ నదిలో పడిపోయాము అన్న ఈ ముఖ్యమైన విషయాన్నే పిల్లలు వ్రాస్తారు. మరి తప్పకుండా ఏదో నియమము ఉంది కదా. కామాన్ని జయించడం ద్వారా మీరు జగత్ జీతులుగా అవుతారు అని తండ్రి ఆజ్ఞ ఉంది. జగత్ జీతులుగా అయి మళ్ళీ వికారాలలోకి వెళ్తారని కాదు. జగత్ జీతులుగా ఈ లక్ష్మీ-నారాయణులే. వీరిని సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. దేవతలను అందరూ నిర్వికారులు అని అంటారు. దానిని మీరు రామరాజ్యం అని అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. ఇది వికారీ ప్రపంచము, అపవిత్ర గృహస్థ ఆశ్రమము. మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందినవారిగా ఉండేవారని, ఇప్పుడు 84 జన్మలను తీసుకుంటూ, తీసుకుంటూ అపవిత్రులుగా అయ్యారు అని బాబా అర్థం చేయించారు. ఇది 84 జన్మల కథయే. కొత్త ప్రపంచం తప్పకుండా ఈ విధంగా నిర్వికారీగా ఉండాలి. పవిత్రతా సాగరుడైన భగవంతుడే స్థాపన చేస్తారు, తర్వాత రావణరాజ్యం కూడా తప్పకుండా రానున్నది. రామరాజ్యం మరియు రావణరాజ్యం అన్న పేర్లే ఉన్నాయి. రావణరాజ్యం అనగా అసురీ రాజ్యం. ఇప్పుడు మీరు అసురీ రాజ్యంలో కూర్చున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు దైవీ రాజ్యానికి గుర్తు.

పిల్లలైన మీరు ప్రభాత యాత్రలు మొదలైనవి నిర్వహిస్తారు. ప్రభాతము అని ఉదయమును అంటారు. ఆ సమయంలో మనుష్యులు నిదురిస్తూ ఉంటారు కావున వాటిని ఆలస్యముగా నిర్వహిస్తారు. ప్రదర్శనీ కూడా - ఎప్పుడైతే దగ్గరలో సెంటర్ ఉంటుందో అప్పుడు బాగుంటుంది. అక్కడకు వచ్చి కామం మహాశత్రువు అని, దానిపై విజయాన్ని పొందడం ద్వారా జగత్ జీతులుగా అవుతారని అర్థం చేసుకుంటారు. లక్ష్మీ-నారాయణుల ట్రాన్స్ లేట్ చిత్రము కూడా తప్పకుండా మీతోపాటు ఉండాలి. దానిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకటేమో ఈ చిత్రము, రెండవది మెట్ల చిత్రము. ట్రక్కులో ఏ విధముగా దేవతలను తీసుకువెళ్తారో, అలా మీరు ఈ 2,3 ట్రక్కులను అలంకరించి అందులో ఈ ముఖ్యమైన చిత్రాలను తీసుకువెళ్తే మంచిగా అనిపిస్తుంది. రోజురోజుకు చిత్రాల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. మీ జ్ఞానము వృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. అందులో పేదవారు, షావుకార్లు అందరూ వచ్చేస్తారు. శివబాబా భండారా నిండుతూ ఉంటుంది. ఎవరైతే భండారాను నింపుతారో వారికి అక్కడ రిటర్నులో ఎన్నో రెట్లుగా లభిస్తూ ఉంటుంది. అందుకే తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీరు పదమాపదమపతులుగా అవ్వనున్నారు, అది కూడా 21 జన్మల కొరకు అవుతారు. మీరు 21 తరాల కొరకు జగత్తుకు యజమానులుగా అవుతారు అని బాబా స్వయంగా అంటున్నారు. నేను స్వయం డైరెక్టుగా వచ్చాను. మీ కొరకు అరచేతిలో వైకుంఠాన్ని తీసుకువచ్చాను. ఏ విధంగా కొడుకు పుట్టినప్పుడు తండ్రి వారసత్వము అతని అరచేతిలోనే ఉంటుంది. ఈ ఇల్లూ, వాకిళ్ళూ మొదలైనవన్నీ నీవేనని ఆ లౌకిక తండ్రి అంటారు. అనంతమైన తండ్రి కూడా అంటున్నారు - మీరు నావారిగా అవుతారు కావున స్వర్గ రాజ్యాధికారము 21 తరాల కొరకు మీకు లభిస్తుంది ఎందుకంటే మీరు కాలుడిపై విజయాన్ని పొందుతారు, అందుకే తండ్రిని మహాకాలుడు అని అంటారు. మహాకాలుడు అనగా హతమార్చేవారనేమీ కాదు. వారి మహిమను చేయడం జరుగుతుంది. భగవంతుడు యమదూతలను పంపించి పిలిపించుకున్నారు అని భావిస్తారు కానీ అటువంటి విషయమేదీ లేదు. ఇవన్నీ భక్తిమార్గపు విషయాలు. నేను కాలుడికే కాలుడిని అని తండ్రి అంటారు. కొండలలో ఉండేవారు మహాకాలుడిని కూడా ఎంతగానో విశ్వసిస్తారు. మహాకాలుడి మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ ఇలా జెండాలు పెడతారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది రైట్ విషయమేనని మీరు అర్థం చేసుకుంటారు కూడా. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే జన్మ-జన్మాంతరాల వికర్మలు భస్మమవుతాయి కావున ఆ విషయాన్ని ప్రచారము చేయాలి. కుంభమేళాలు మొదలైనవి ఎన్నో జరుగుతాయి. స్నానాలు చేసే విషయానికి కూడా ఎంతో మహత్వము తెలియజేసారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానామృతం 5,000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. వాస్తవానికి దీని పేరు అమృతము కాదు. ఇది చదువు. ఇవన్నీ భక్తి మార్గపు పేర్లు. అమృతము అన్న పేరును విని చిత్రాలలో నీరును చూపించారు. తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. చదువు ద్వారానే ఉన్నతమైన పదవి లభిస్తుంది. అది కూడా నేనే చదివిస్తాను. భగవంతునికి అలంకరింపబడిన ఇటువంటి రూపమేమీ లేదు. ఇక్కడైతే తండ్రి వీరిలోకి వచ్చి చదివిస్తారు, చదివించి ఆత్మలను తమ సమానముగా తయారుచేస్తారు. లక్ష్మీ-నారాయణులు తమ సమానముగా తయారుచేయడానికి వారు ఇక్కడైతే లేరు కదా. ఆత్మ చదువుతుంది, ఆత్మను బాబా తన సమానముగా జ్ఞానసంపన్నంగా తయారుచేస్తారు. అంతేకానీ భగవాన్, భగవతిగా తయారుచేస్తారని కాదు. వారు శ్రీకృష్ణుడిని చూపించారు. అతను ఎలా చదివిస్తారు? సత్యయుగములో పతితులేమైనా ఉంటారా. శ్రీకృష్ణుడైతే సత్యయుగములోనే ఉంటారు. మీరు మళ్ళీ ఎప్పుడూ శ్రీకృష్ణుడిని చూడరు. డ్రామాలో ప్రతి ఒక్కరి పునర్జన్మల చిత్రము పూర్తిగా అతీతముగా ఉంటుంది. ఇది అద్భుతమైన డ్రామా. ఇది తయారై-తయారుచేయబడిన డ్రామా, అదే ఇప్పుడు మళ్ళీ తయారవుతుంది, ఇందులో కొత్తగా తయారయ్యేది ఏమీ లేదు, జరగరానిదేమీ జరగటం లేదు కావున ఇందులో చింతించాల్సిన అవసరమేమీ లేదు. తండ్రి కూడా అంటారు, అచ్చంగా ఇవే పోలికలతో, ఇవే వస్త్రాలతో కల్పకల్పమూ మీరే చదువుకుంటూ ఉంటారు. ఇది అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుంది కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి కల్పక్రితము ఏదైతే తీసుకుందో, మళ్ళీ అదే శరీరాన్ని తీసుకుంటుంది. డ్రామాలో ఎటువంటి తేడా రాదు. అవి హద్దులోని విషయాలు, ఇవి అనంతమైన విషయాలు, వీటిని అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇందులో ఎటువంటి సంశయమూ రాకూడదు. నిశ్చయబుద్ధి కలవారిగా అయి మళ్ళీ ఏదో ఒక సంశయములోకి వచ్చేస్తారు. సాంగత్యము అంటుకుంటుంది. ఈశ్వరీయ సాంగత్యములో నడుస్తూ ఉన్నట్లయితే ఆవలి తీరాన్ని చేరుకుంటారు. సాంగత్యాన్ని వదిలినట్లయితే విషయసాగరములో మునిగిపోతారు. ఒకవైపు క్షీరసాగరము ఉంది, ఇంకొకవైపు విషయసాగరము ఉంది. జ్ఞానామృతము అని కూడా అంటారు. తండ్రి జ్ఞానసాగరుడు, వారి మహిమ కూడా ఉంది. వారి మహిమ ఏదైతే ఉందో దానిని లక్ష్మీ-నారాయణులకు ఇవ్వలేము. తండ్రి పవిత్రతా సాగరుడు. ఆ దేవతలు సత్య, త్రేతాయుగాలలో పవిత్రముగా ఉన్నా కానీ వారు సదా కొరకు అలా ఉండరు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత పడిపోతారు. తండ్రి అంటారు, నేను వచ్చి అందరి సద్గతిని చేస్తాను. మీరు సద్గతిలోకి వెళ్ళిన తర్వాత ఇక ఈ విషయాలు ఉండవు. ఇప్పుడు పిల్లలైన మీరు సమ్ముఖముగా కూర్చున్నారు. మీరు కూడా శివబాబా ద్వారా చదువుకొని టీచర్ అయ్యారు. ముఖ్యమైన ప్రిన్సిపాల్ వారే. మీరు రావటం కూడా వారి వద్దకే వస్తారు. మీరు - మేము శివబాబా వద్దకు వచ్చాము అని అంటారు. అరే, వారైతే నిరాకారుడు. అయితే, వారు ఇతని తనువులోకి వస్తారు, అందుకే బాప్ దాదా వద్దకు వెళ్తున్నాము అని అంటారు. ఈ బాబా వారి రథము, వీరిపై వారి స్వారీ జరుగుతుంది. వీరిని రథము, గుర్రము, అశ్వము అని కూడా అంటారు. ఈ విషయంలో - దక్ష ప్రజాపిత ఒక యజ్ఞాన్ని రచించారు అన్న కథ కూడా ఉంది. వారు కథను ఆలా వ్రాసారు కానీ అలాగేమీ జరుగదు.

శివ భగవానువాచ - ఎప్పుడైతే భారత్ లో అతి ధర్మ గ్లాని జరుగుతుందో అప్పుడే నేను వస్తాను. గీతావాదులు యదా యదాహి... అని అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. మీది చాలా చిన్న వృక్షము, దీనికి తుఫానులు కూడా వస్తాయి. ఇది కొత్త వృక్షము కదా, దీని పునాది కూడా ఉంది. ఇన్ని అనేక ధర్మాల మధ్యలో ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క అంటును కడతారు. ఇందులో ఎంత శ్రమ ఉంది. ఇతరులకు అంత శ్రమ ఉండదు. వారు పై నుండి వస్తూ ఉంటారు. ఇక్కడైతే ఎవరైతే సత్య, త్రేతాయగాలలో వచ్చేది ఉందో, వారి ఆత్మలే కూర్చొని చదువుకుంటారు. ఎవరైతే పతితులుగా ఉన్నారో, వారిని పావన దేవతలుగా తయారుచేయడానికి తండ్రి కూర్చొని చదివిస్తారు. గీతనైతే ఇతను కూడా ఎంతగానో చదివేవారు. ఆత్మల యొక్క పాపాలు తొలగిపోవాలని ఇక్కడ ఆత్మలను గుర్తుచేసుకుని వారికి దృష్టి ఇవ్వడం జరుగుతుంది. కానీ భక్తి మార్గంలో అందుకు బదులుగా గీత ముందు జలాన్ని ఉంచి కూర్చొని చదువుతారు. తద్వారా పిత్రుల ఉద్దరణ జరుగుతుంది అని భావిస్తారు, అందుకే పిత్రులను తలచుకుంటూ ఉంటారు. భక్తిలో గీతను ఎంతో గౌరవించేవారు. అరే, బాబా ఏమైనా మామూలు భక్తుడా! రామాయణము మొదలైనవన్నీ చదివేవారు. వారికి ఎంతో సంతోషము కలిగేది. అదంతా గతించిపోయింది.

ఇప్పుడు తండ్రి అంటున్నారు - గతించినదాని గురించి ఆలోచించకండి. బుద్ధి నుండి అంతా తొలగించి వేయండి. బాబా స్థాపన, వినాశనము మరియు రాజధాని యొక్క సాక్షాత్కారాలను చేయించారు. కావున అది పక్కా అయిపోయింది. ఇదంతా అంతమవ్వనున్నది అన్నది ఇంతకుముందు తెలియదు. ఇదంతా ఉంటుందేమోనని బాబా అనుకున్నారు. అందులో పెద్ద ఆలస్యమేమీ లేదు, నేను వెళ్ళి ఫలానా రాజుగా అవుతాను అని అనుకున్నారు. బాబా ఏమేమి ఆలోచించేవారో మరి తెలియదు. బాబా ప్రవేశించడం ఎలా జరిగిందో పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయాలు మనుష్యులకు తెలియవు. బ్రహ్మా, విష్ణు, శంకరుల పేర్లు అయితే ప్రస్తావిస్తారు కానీ ఈ ముగ్గురిలోనూ భగవంతుడు ఎవరిలోకి ప్రవేశిస్తారో దాని అర్థము వారికి తెలియదు. వారు విష్ణువు అని అంటారు, కానీ అతను దేవత, అతను ఎలా చదివిస్తారు? నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను అని బాబా స్వయంగా తెలియజేస్తారు, అందుకే బ్రహ్మా ద్వారా స్థాపన అన్నది చూపించారు. అది పాలన మరియు ఇది వినాశనము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఆ భగవంతుడు ఎప్పుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు మరియు రాజ్య పదవిని ఇప్పించారు అనేది ఇప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. పూజ్యులు-పూజారుల విషయాన్ని కూడా అర్థం చేయించారు. విశ్వములో శాంతి రాజ్యం ఈ లక్ష్మీ-నారాయణులదే ఉండేది కదా, దానినే మొత్తం ప్రపంచమంతా కోరుకుంటుంది. లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉన్నప్పుడు ఆ సమయంలో అందరూ శాంతిధామంలో ఉండేవారు. ఇప్పుడు మనం శ్రీమతంపై ఈ కార్యాన్ని చేస్తున్నాము. అనేక సార్లు చేసాము మరియు చేస్తూ ఉంటాము. కోట్లాదిమందిలో ఏ ఒక్కరో వెలువడతారు అని కూడా తెలుసు. దేవీ-దేవతా ధర్మం వారికే ఇది టచ్ అవుతుంది. ఇది భారత్ విషయమే. ఈ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు వెలువడుతున్నారు మరియు వెలువడుతూనే ఉంటారు. ఏ విధంగా మీరు వెలువడ్డారో, అలాగే ఇతర ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు మంచి పదవిని పొందుతారు. ముఖ్యమైనవి జ్ఞాన-యోగాలు. యోగము కోసం కూడా జ్ఞానం కావాలి. పవర్ హౌస్ తో యోగము కూడా ఉండాలి. యోగము ద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు ఆరోగ్యవంతముగా, సుసంపన్నముగా అవుతారు. పాస్ విత్ హానర్ గా కూడా అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విషయమైతే గతించిపోయిందో దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పటివరకూ ఏదైతే చదివారో, దానిని మర్చిపోవాలి, ఒక్క తండ్రి నుండే వినాలి మరియు మీ బ్రాహ్మణ కులాన్ని సదా గుర్తుంచుకోవాలి.

2. పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా ఉండాలి. ఏ విషయములోనూ సంశయం రానివ్వకూడదు. ఈశ్వరీయ సాంగత్యాన్ని మరియు చదువును ఎప్పుడూ విడిచిపెట్టకూడదు.

వరదానము:-

ఆత్మిక ప్రియుని యొక్క ఆకర్షణలో ఆకర్షితులై శ్రమ నుండి ముక్తులయ్యే ఆత్మిక ప్రేయసి భవ

ప్రియుడు తన తప్పిపోయిన ప్రేయసులను చూసి సంతోషిస్తారు. ఆత్మిక ఆకర్షణతో ఆకర్షితులై తమ సత్యమైన ప్రియుడిని తెలుసుకున్నారు, పొందారు, యథార్థమైన గమ్యానికి చేరుకున్నారు. ఎప్పుడైతే ఇటువంటి ప్రియతమ ఆత్మలు ఈ ప్రేమ యొక్క రేఖ లోపలికి చేరుకుంటారో, అప్పుడు అనేక రకాల శ్రమల నుండి విముక్తులవుతారు ఎందుకంటే ఇక్కడ జ్ఞాన సాగరుని స్నేహ అలలు, శక్తి అలలు... సదా కొరకు రిఫ్రెష్ చేస్తాయి. ఈ మనోరంజనం యొక్క విశేషమైన స్థానాన్ని, కలుసుకునే స్థానాన్ని ప్రేయసులైన మీ కొరకు ప్రియుడు తయారుచేసారు.

స్లోగన్:-

ఏకాంతవాసులుగా అవ్వడంతోపాటు ఏకనామిగా మరియు ఎకానమీ చేసేవారిగా అవ్వండి.