27-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి నుండి ఆరోగ్యము, సంపద మరియు సంతోషము యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు, ఈశ్వరీయ మతంపై నడవడం ద్వారానే తండ్రి యొక్క వారసత్వం లభిస్తుంది’’

ప్రశ్న:-

తండ్రి పిల్లలందరికీ వికల్పజీతులుగా అయ్యేందుకు ఏ యుక్తిని తెలియజేసారు?

జవాబు:-

వికల్పజీతులుగా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరస్పరం సోదర దృష్టితో చూడండి. శరీరాన్ని చూడడం వలన వికల్పాలు వస్తాయి, అందుకే భృకుటిలో ఆత్మ సోదరుడిని చూడండి. పావనంగా అవ్వాలంటే ఈ దృష్టిని పక్కాగా ఉంచుకోండి. నిరంతరం పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేయండి. స్మృతితోనే తుప్పు వదులుతూ ఉంటుంది, సంతోషం యొక్క పాదరసము పైకెక్కుతుంది మరియు వికల్పాలపై విజయాన్ని పొందుతారు.

ఓంశాంతి

తమ సాలిగ్రామాల పట్ల శివ భగవానువాచ. శివ భగవానువాచ అని ఉందంటే తప్పకుండా శరీరము ఉంటుంది, అప్పుడే వాచ కూడా ఉంటుంది. మాట్లాడేందుకు నోరు తప్పకుండా కావాలి. అలాగే వినేవాళ్ళకు కూడా చెవులు తప్పకుండా కావాలి. ఆత్మకు చెవులు, నోరు కావాలి. ఇప్పుడు పిల్లలైన మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది, దీనిని రాముని మతము అని అంటారు. ఇతరులేమో రావణుని మతంపై ఉన్నారు. ఈశ్వరీయ మతము మరియు అసురీ మతము ఉన్నాయి. ఈశ్వరీయ మతము అర్ధకల్పము నడుస్తుంది. తండ్రి ఈశ్వరీయ మతాన్ని ఇచ్చి మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తారు, అప్పుడు సత్య-త్రేతా యుగాలలో ఇక అదే మతము నడుస్తుంది. అక్కడ జన్మలు కూడా తక్కువగా ఉంటాయి ఎందుకంటే వారు యోగుల వంటివారు. మరియు ద్వాపర, కలియుగాలలో రావణుని మతము ఉంటుంది, అక్కడ జన్మలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వారు భోగీ మనుష్యులు, అందుకే ఆయువు కూడా తక్కువగా ఉంటుంది. ఎన్నో సాంప్రదాయాలు ఏర్పడతాయి మరియు చాలా దుఃఖితులుగా అవుతారు. అప్పుడు రాముని మతము వారు రావణుని మతములో కలిసిపోతారు, కావున మొత్తం ప్రపంచమంతా రావణుని మతమైపోతుంది. మళ్ళీ తండ్రి వచ్చి అందరికీ రాముని మతము ఇస్తారు. సత్యయుగంలో రామ మతము, ఈశ్వరీయ మతము ఉంటుంది, దానిని స్వర్గము అంటారు. ఈశ్వరీయ మతము లభించడంతో అర్ధకల్పము కొరకు స్వర్గ స్థాపన జరుగుతుంది. అది ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు రావణరాజ్యం మొదలవుతుంది, దానిని అసురీ మతము అని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - మేము అసురీ మతముతో ఏమి చేసేవారము? మరియు ఈశ్వరీయ మతముతో ఏమి చేస్తున్నాము? ఇంతకుముందు నరకవాసులు వలె ఉండేవారు, ఆ తర్వాత శివాలయంలో స్వర్గవాసులుగా అవుతారు. సత్య-త్రేతాయుగాలను శివాలయము అని అంటారు. ఎవరి పేరుతోనైతే ఆ స్థాపన జరుగుతుందో తప్పకుండా వారి పేరు కూడా పెడతారు. కావున అది శివాలయము, అక్కడ దేవతలు ఉంటారు. రచయిత అయిన తండ్రే మీకు ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు, వారు ఏమి రచిస్తారు అనేది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మొత్తం రచనంతా ఈ సమయంలో వారిని - ఓ పతిత-పావనా లేక ఓ ముక్తిప్రదాత, రావణ రాజ్యం నుండి లేక దుఃఖాల నుండి విడిపించేవారు అని పిలుస్తుంది. ఇప్పుడు మీకు సుఖము గురించి తెలిసింది కావుననే దీనిని దుఃఖముగా భావిస్తున్నారు. లేకపోతే ఎంతోమంది దీనిని దుఃఖముగా భావించరు. ఏ విధంగా తండ్రి నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారో, మనుష్య సృష్టికి బీజరూపుడో, అదే విధంగా మీరు కూడా నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు. బీజములో వృక్షము యొక్క నాలెడ్జ్ ఉంటుంది కదా, కానీ అది జడమైనది. ఒకవేళ చైతన్యమై ఉంటే చెప్పి ఉండేది. మీరు చైతన్య వృక్షానికి చెందినవారు, అందుకే మీకు ఈ వృక్షము గురించి కూడా తెలుసు. తండ్రిని మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్-చిత్ ఆనంద స్వరూపుడు అని అంటారు. ఈ వృక్షము యొక్క ఉత్పత్తి మరియు పాలన ఎలా జరుగుతుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. అలాగని కొత్త వృక్షము ఉత్పన్నమవుతుంది అని కాదు. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు, పాత వృక్షానికి చెందిన మనుష్యులు - మీరు వచ్చి రావణుడి నుండి విడిపించండి ఎందుకంటే ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది అని పిలుస్తారు. మనుష్యులకైతే రచయితను గురించి గాని, రచనను గురించి గాని తెలియదు. స్వయం తండ్రి తెలియజేస్తున్నారు - నేను ఒక్కసారే స్వర్గాన్ని తయారుచేస్తాను. స్వర్గం తర్వాత మళ్ళీ నరకం తయారవుతుంది. రావణుడు రావడంతో ఇక వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. సత్యయుగములో ఆరోగ్యము, సంపద, సంతోషము అన్నీ ఉన్నాయి. మీరు ఇక్కడకు - తండ్రి నుండి ఆరోగ్యము, సంపద, సంతోషాల యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు ఎందుకంటే స్వర్గంలో ఎప్పుడూ దుఃఖము ఉండనే ఉండదు. మీ హృదయంలో - మేము కల్ప-కల్పము పురుషోత్తమ సంగమయుగంలో పురుషార్థము చేస్తామని ఉంది. పేరు ఎంత బాగుంది. ఇంకే ఇతర యుగాలను పురుషోత్తమ అని అనరు. వాటిలోనైతే మెట్లను కిందకు దిగుతూనే ఉంటారు. తండ్రిని పిలుస్తారు కూడా, సమర్పణ కూడా చేస్తారు. కానీ తండ్రి ఎప్పుడు వస్తారు అన్నది తెలియదు. పిలవడం పిలుస్తారు - ఓ గాడ్ ఫాదర్, విముక్తులను చేయండి, మార్గదర్శకునిగా అవ్వండి అని. ముక్తిప్రదాతగా అయినట్లయితే తప్పకుండా రావలసి ఉంటుంది, మళ్ళీ మార్గదర్శకునిగా అయి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. తండ్రి పిల్లలను చాలా రోజుల తర్వాత చూస్తే ఎంతో సంతోషిస్తారు. వారు హద్దులోని తండ్రి. వీరు అనంతమైన తండ్రి. బాబా రచయిత, వారు రచించి మళ్ళీ వారి పాలనను కూడా చేస్తారు. పునర్జన్మలనైతే తీసుకోవలసి ఉంటుంది. కొందరికి 10, కొందరికి 12 మంది పిల్లలు ఉంటారు, కానీ అవన్నీ హద్దులోని సుఖాలు, అవి కాకిరెట్టతో సమానమైనవి. తమోప్రధానముగా అయిపోతారు. తమోప్రధానములో సుఖము చాలా తక్కువగా ఉంటుంది. మీరు సతోప్రధానముగా అయినట్లయితే ఎంతో సుఖము ఉంటుంది. సతోప్రధానముగా అయ్యేందుకు యుక్తిని తండ్రి వచ్చి తెలియజేస్తారు. తండ్రిని ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) అని అంటారు. భగవంతుడు ఆల్మైటీ అథారిటీ కావున వారు ఏది కావాలనుకుంటే అది చేయగలరు, మరణించినవారిని జీవింపచేయగలరు అని మనుష్యులు భావిస్తారు. ఒకసారి ఎవరో - ఒకవేళ మీరు భగవంతుడు అయినట్లయితే చనిపోయిన ఈగను బ్రతికించి చూపించండి అని వ్రాశారు. ఇలా ఎంతోమంది ప్రశ్నలను అడుగుతారు.

మీకు తండ్రి శక్తిని ఇస్తారు, దానితో మీరు రావణునిపై విజయాన్ని పొందుతారు. కోతుల నుండి మందిరయోగ్యులుగా అవుతారు. కానీ వారు ఏమేమో తయారుచేసారు. వాస్తవానికి మీరందరూ సీతలు, భక్తురాళ్లు. మిమ్మల్నందరినీ రావణుడి నుండి విడిపించారు. రావణుడి నుండి మీకు ఎప్పుడూ కూడా సుఖము లభించదు. ఈ సమయంలో అందరూ రావణుడి జైలులో ఉన్నారు. రాముని జైలు అని అనరు. రావణుడి జైలు నుండి విడిపించేందుకే రాముడు వస్తారు. రావణుడిని 10 తలలు వానిగా తయారుచేస్తారు. అతనికి 20 భుజాలను చూపించారు. తండ్రి అర్థం చేయించారు - పంచ వికారాలు పురుషునిలో, పంచ వికారాలు స్త్రీలో ఉన్నాయి, దానినే రావణరాజ్యం అని అంటారు లేక పంచ వికారాల రూపీ మాయ రాజ్యం అని అంటారు. ధనం ఉన్నవారిని, ఇతని వద్ద ఎంతో మాయ ఉంది, మాయ నషా ఎక్కి ఉంది అని అనరు, అలా కాదు. ధనాన్ని మాయ అని అనరు. ధనాన్ని సంపద అని అంటారు. పిల్లలైన మీకు సంపద మొదలైనవి అపారంగా లభిస్తాయి. మీరు ఏదీ అడగవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది చదువు. చదువులో అడగడమనేది ఉంటుందా! టీచర్ ఏది చదివిస్తే దానిని విద్యార్థులు చదువుతారు. ఎవరు ఎంతగా చదువుతారో అంతగా పొందుతారు. అడగవలసిన అవసరం లేదు. ఇందులో పవిత్రత కూడా కావాలి. ఒక్క అక్షరానికి కూడా ఎంత విలువ ఉందో చూడండి, పదమాపదమాలు. తండ్రిని గుర్తించండి మరియు స్మృతి చేయండి. తండ్రి పరిచయాన్ని ఇచ్చారు - ఏ విధంగా ఆత్మ బిందువో, అలాగే నేను కూడా ఆత్మ బిందువునే. వారైతే సదా పవిత్రులు. వారు శాంతి, జ్ఞానం, పవిత్రతల సాగరుడు. ఒక్కరికే మహిమ ఉంది. అందరి పొజిషన్ ఎవరిది వారిదే ఉంటుంది. కణకణములో భగవంతుడు... అని నాటకాన్ని కూడా తయారుచేసారు, ఎవరైతే నాటకాన్ని చూసి ఉంటారో వారికి తెలిసి ఉంటుంది. మహావీరులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారితో బాబా అంటారు - మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ కేవలం సాక్షీగా అయి చూడాలి.

ఇప్పుడు పిల్లలైన మీరు రామరాజ్యాన్ని స్థాపన చేసి రావణరాజ్యాన్ని అంతం చేసేస్తారు. ఇది అనంతమైన విషయము. అక్కడ హద్దులోని కథలను తయారుచేసారు. మీరు శివశక్తి సైన్యము. శివుడు సర్వశక్తివంతుడు కదా. శివుని శక్తిని తీసుకొనే శివుని సైన్యము మీరే. వారు కూడా శివసేన అని పేరును పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు ఏ పేరును పెట్టాలి? మీకు ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలు అన్న పేరును పెట్టారు. శివునికైతే అందరూ సంతానమే. మొత్తం ప్రపంచములోని ఆత్మలు వారి సంతానమే. శివుని ద్వారా మీకు శక్తి లభిస్తుంది. శివబాబా మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు, దాని ద్వారా మీకు ఎంతటి శక్తి లభిస్తుందంటే ఇక అర్ధకల్పము మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేస్తారు. ఇది మీ యోగబలము యొక్క శక్తి మరియు వారిది బాహుబలపు శక్తి. భారత్ యొక్క ప్రాచీన రాజయోగము మహిమ చేయబడింది. భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని, దేని ద్వారానైతే ప్యారడైజ్ స్థాపన అయ్యిందో, దానిని నేర్చుకోవాలని కోరుకుంటారు. క్రైస్టుకు కొన్ని సంవత్సరాల పూర్వము ప్యారడైజ్ ఉండేది అని కూడా అంటారు. అది ఎలా తయారైంది? యోగము ద్వారా. మీరు ప్రవృత్తి మార్గపు సన్యాసులు. వారైతే ఇళ్ళూ-వాకిళ్ళను వదిలేసి అడవులలోకి వెళ్ళిపోతారు. డ్రామా అనుసారంగా ప్రతి ఒక్కరికీ పాత్ర లభించింది. ఇంత చిన్నని బిందువులో ఎంతటి పాత్ర ఉంది, దీనిని సృష్టి అద్భుతము అని అంటారు. తండ్రి అయితే సదా శక్తివంతుడు, గోల్డెన్ ఏజడ్ వారు (స్వర్ణిమ స్వరూపుడు). ఇప్పుడు మీరు వారి నుండి శక్తిని తీసుకుంటారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. వారు వేలాది సూర్యుల కన్నా తేజోమయుడని కాదు. వాళ్ళంతా ఎవరికి ఏ భావన కూర్చుంటే, ఇక భగవంతుడిని అదే భావనతో చూస్తారు. కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఇక ఆపుచేయండి, నేను ఇక సహించలేను అని అంటారు. తండ్రి అంటారు, ఇవన్నీ భక్తి మార్గపు సంస్కారాలు. ఇక్కడ ఇది జ్ఞానము, ఇందులో చదవవలసి ఉంటుంది. తండ్రే టీచర్ కూడా, వారు చదివిస్తున్నారు. మీరు తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వాలని వారు మనకు చెప్తున్నారు. చెడును వినకండి... అని తండ్రి అర్థం చేయించారు. ఈ మాటలు ఎవరు అన్నారు అన్నది మనుష్యులకు తెలియదు. పూర్వము కోతుల చిత్రాన్ని తయారుచేసేవారు, ఇప్పుడైతే మనుష్యుల చిత్రాన్ని తయారుచేస్తూ ఉన్నారు. బాబా కూడా నళిని బిడ్డ చిత్రాన్ని ఈ విధంగా తయారుచేయించారు. మనుష్యులకు భక్తి నషా ఎంతగా ఉంది. ఇది భక్తి రాజ్యం కదా. ఇప్పుడు ఇక జ్ఞాన రాజ్యం వస్తుంది. తేడా ఉంటుంది. తప్పకుండా జ్ఞానం ద్వారా ఎంతో సుఖము ఉంటుంది అని పిల్లలకు తెలుసు. మళ్ళీ భక్తి ద్వారా మెట్లు క్రిందికి దిగుతూనే ఉంటారు. మనం మొదట సత్యయుగంలోకి వెళ్తాము, తర్వాత పేను వలె మెల్లగా కిందకు దిగుతాము. 1,250 సంవత్సరాల్లో రెండు కళలు తగ్గుతాయి. చంద్రుని ఉదాహరణ ఉంది. చంద్రునికి గ్రహణం పడుతుంది. కళలు తగ్గడం మొదలవుతాయి, మళ్ళీ మెల్లమెల్లగా కళలు పెరిగితే 16 కళలు ఏర్పడతాయి. అది అల్పకాలికమైన విషయం. ఇక్కడ ఇది అనంతమైన విషయం. ఈ సమయంలో అందరిపైనా రాహు గ్రహణం ఉంది. ఉన్నతోన్నతమైనది బృహస్పతి దశ. అన్నింటికన్నా కింద ఉండేది రాహు దశ. పూర్తిగా దివాలా తీసేస్తారు. బృహస్పతి దశ ద్వారా మనం పైకెక్కుతాము. వారికి అనంతమైన తండ్రి గురించి తెలియదు. ఇప్పుడు రాహు దశ అయితే తప్పకుండా అందరిపైన ఉంది. ఇది కేవలం మీకే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. రాహు దశయే దివాలాకోరులుగా తయారుచేస్తుంది. బృహస్పతి దశ ద్వారా సుసంపన్నులుగా అవుతారు. భారత్ ఎంత సుసంపన్నంగా ఉండేది. ఒక్క భారత్ యే ఉండేది. సత్యయుగంలో రామరాజ్యం, పవిత్ర రాజ్యం ఉంటుంది, దాని మహిమ జరుగుతుంది. అపవిత్ర రాజ్యంలోని వారు - నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదు అని గానం చేస్తారు. నిర్గుణ సంస్థ అని పిలవబడే సంస్థలను కూడా తయారుచేసారు. అరే, ఈ ప్రపంచమంతా నిర్గుణ సంస్థయే. ఇది ఏ ఒక్కరి విషయమో కాదు. చిన్న పిల్లలను ఎప్పుడూ మహాత్ములు అని అంటారు, కానీ మీరేమో ఏ గుణము లేనివారు అని అంటున్నారే. వాస్తవానికి ఈ ప్రపంచమంతా అలాగే ఉంది, ఇందులో ఏ గుణాలూ లేని కారణంగా రాహు దశ కూర్చొంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగుతుంది. ఇప్పుడైతే అందరూ వెళ్ళవలసిందే కదా. దేహ సహితంగా దేహపు ధర్మాలన్నింటినీ వదలండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మీరు ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. పవిత్రంగా లేని కారణంగా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు తండ్రి పవిత్రంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. కొందరు అంటారు - బాబా, మేము మర్చిపోతున్నాము. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, పతిత-పావనుడైన తండ్రిని మీరు మర్చిపోతే ఇక మీరు పావనులుగా ఎలా అవుతారు. అసలు మీరు ఏమంటున్నారో ఒకసారి ఆలోచించండి, జంతువులు కూడా ఎప్పుడూ తాము తమ తండ్రిని మర్చిపోతున్నాము అని అనవు, మరి మీరేమంటున్నారు! నేను మీ అనంతమైన తండ్రిని, మీరు అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. నిరాకారుడైన తండ్రి సాకారంలోకి వచ్చినప్పుడే చదివిస్తారు. ఇప్పుడు తండ్రి వీరిలోకి ప్రవేశించారు. వీరు బాప్ దాదా. ఇరువురి ఆత్మ ఈ భృకుటి మధ్యలో ఉంది. మీరు బాప్ దాదా అని అంటారు, కావున తప్పకుండా ఇద్దరు ఆత్మలు ఉంటారు. శివబాబా మరియు బ్రహ్మా ఆత్మ. మీరందరూ ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలుగా అయ్యారు. మీకు జ్ఞానం లభిస్తుంది కావున మనమంతా పరస్పరం సోదరులము అని మీకు తెలుసు. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మా ద్వారా మనము సోదరీ-సోదరులుగా అవుతాము. ఈ స్మృతి పక్కాగా ఉండాలి. కానీ బాబా చూస్తుంటారు - సోదరీ-సోదరులలో కూడా నామ-రూపాల ఆకర్షణ ఉంటుంది. ఎంతోమందికి వికల్పాలు వస్తాయి. మంచి శరీరాన్ని చూస్తే వికల్పాలు వస్తాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడండి. ఆత్మలందరూ సోదరులే. అందరూ సోదరులైనప్పుడు మరి తప్పకుండా తండ్రి కూడా కావాలి. అందరికీ తండ్రి ఒక్కరే. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, సతోప్రధానులుగా అవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా తుప్పు తొలగుతూ ఉంటుంది, సంతోషపు పాదరసము పైకెక్కుతుంది మరియు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది - నంబరువారు పురుషార్థానుసారంగా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చదువుపై పూర్తి శ్రద్ధను ఉంచి స్వయాన్ని ఐశ్వర్యవంతులుగా తయారుచేసుకోవాలి. ఏమీ అడగకూడదు. ఒక్క తండ్రి యొక్క స్మృతి మరియు పవిత్రత ధారణ ద్వారా పదమాపదమపతులుగా అవ్వాలి.

2. రాహు గ్రహణం నుండి ముక్తులుగా అయ్యేందుకు వికారాలను దానమివ్వాలి. చెడు వినకండి... ఏ విషయాల కారణంగా మెట్లు కిందకు దిగారో, నిర్గుణులుగా అయ్యారో, వాటిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి.

వరదానము:-

‘‘మొదట మీరు’’ అన్న మంత్రము ద్వారా సర్వుల స్వమానాన్ని ప్రాప్తి చేసుకొనే నిర్మానుల నుండి మహానులుగా కండి

‘‘నిర్మానచిత్తులే అందరికంటే గొప్పవారు’’ అన్న ఈ మహామంత్రమే ఎల్లప్పుడూ గుర్తుండాలి. ‘‘మొదట మీరు’’ అని అనటమే సర్వుల నుండి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారము. మహానులుగా అయ్యే ఈ మంత్రాన్ని వరదానము రూపములో సదా తోడుగా ఉంచుకోండి. వరదానాలతోనే పాలింపబడుతూ, ఎగురుతూ గమ్యానికి చేరుకోండి. ఎప్పుడైతే వరదానాలను కార్యములో ఉపయోగించరో, అప్పుడే కష్టపడతారు. ఒకవేళ వరదానాలతో పాలింపబడుతూ ఉన్నట్లయితే, వరదానాలను కార్యంలో వినియోగిస్తూ ఉన్నట్లయితే, కష్టము సమాప్తమైపోతుంది. సదా సఫలతను మరియు సంతుష్టతను అనుభవము చేస్తూ ఉంటారు.

స్లోగన్:-

ముఖము ద్వారా సేవ చేయడానికి తమ చిరునవ్వుతో కూడిన రమణీకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి.