30-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ లెక్కాపత్రాన్ని చెక్ చేసుకోండి - మొత్తం రోజంతటిలో తండ్రిని ఎంత సమయం స్మృతి చేసాను, ఏ పొరపాటూ చేయలేదు కదా? ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరూ వ్యాపారస్థులు’’

ప్రశ్న:-

అంతర్ముఖులుగా అయ్యి ఏ కృషిని చేస్తూ ఉన్నట్లయితే అపారమైన సంతోషము కలుగుతుంది?

జవాబు:-

జన్మ-జన్మాంతరాలూ ఏదైతే చేసామో, ఏదైతే ఎదురుగా వస్తూ ఉంటుందో, వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేసే కృషిని చేస్తూ ఉండండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా అయి తండ్రిని స్మృతి చేయండి. సేవ యొక్క ఋజువును ఇచ్చినట్లయితే అపారమైన సంతోషము కలుగుతుంది.

ఓంశాంతి

తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు అనైతే పిల్లలకు తెలుసు. ఆత్మిక తండ్రి అనంతమైన తండ్రి. ఆత్మిక పిల్లలు కూడా అనంతమైన పిల్లలే. తండ్రి అయితే పిల్లలందరి సద్గతిని చేయాలి. ఎవరి ద్వారా? ఈ పిల్లల ద్వారా విశ్వం యొక్క సద్గతిని చేయాలి. మొత్తం విశ్వమంతటిలోని పిల్లలు ఇక్కడకు వచ్చి చదువుకోరు. దీని పేరే ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ముక్తి అయితే అందరికీ లభిస్తుంది. ముక్తి అనండి లేక జీవన్ముక్తి అనండి. ముక్తిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరూ జీవన్ముక్తిలోకి రావాల్సిందే. కావున ఇలా అనవచ్చు - అందరూ ముక్తిధామము మీదగా జీవన్ముక్తిలోకి వస్తారు అని. పాత్రను అభినయించేందుకు ఒకరి వెనుక ఒకరు రావాల్సిందే. అప్పటివరకు ముక్తిధామములో ఉండవలసి ఉంటుంది. పిల్లలకు ఇప్పుడు రచయిత మరియు రచనల గురించి తెలిసింది. ఈ రచన అంతా అనాది అయినది. రచయిత అయితే ఒక్క తండ్రే. ఈ ఆత్మలందరూ ఎవరైతే ఉన్నారో, అందరూ అనంతమైన తండ్రి పిల్లలే. ఎప్పుడైతే పిల్లలకు తెలుస్తుందో, అప్పుడు వారంతట వారే వచ్చి యోగాన్ని నేర్చుకుంటారు. ఈ యోగము భారత్ కొరకే ఉంది. తండ్రి రావడం కూడా భారత్ లోనే వస్తారు. భారతవాసులకే స్మృతియాత్రను నేర్పించి పావనంగా తయారుచేస్తారు మరియు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని కూడా ఇస్తారు, ఇది కూడా పిల్లలకు తెలుసు. రుద్రమాల కూడా ఉంది, అది మహిమ చేయబడుతుంది, పూజించబడుతుంది, స్మరించబడుతుంది. భక్తమాల కూడా ఉంది. అది ఉన్నతోన్నతమైన భక్తుల యొక్క మాల. భక్తిమాల తర్వాత జ్ఞానమాల ఉండాలి. భక్తి మరియు జ్ఞానం ఉన్నాయి కదా. భక్తమాల కూడా ఉంది, అలాగే రుద్రమాల కూడా ఉంది. ఆ తర్వాత రుండమాల (విష్ణుమాల) అని అంటారు ఎందుకంటే మనుష్య సృష్టిలో ఉన్నతోన్నతమైనవారు విష్ణువు, వారిని సూక్ష్మవతనంలో చూపిస్తారు. వీరు ప్రజాపిత బ్రహ్మా, వీరి మాల కూడా ఉంది. చివరిలో ఎప్పుడైతే ఈ మాల తయారవుతుందో అప్పుడే ఆ రుద్రమాల మరియు విష్ణు యొక్క వైజయంతి మాల తయారవుతాయి. ఉన్నతోన్నతమైనవారు శివబాబా, ఆ తర్వాత ఉన్నతోన్నతమైనది విష్ణు రాజ్యము. శోభనీయంగా ఉండటానికి భక్తిలో ఎన్ని చిత్రాలను తయారుచేసారు. కానీ జ్ఞానము ఏమాత్రము లేదు. మీరు ఏ చిత్రాలనైతే తయారుచేస్తారో, వాటి పరిచయాన్ని ఇవ్వాలి, తద్వారా మనుష్యులు అర్థం చేసుకోగలుగుతారు. లేదంటే శివుడిని మరియు శంకరుడిని కలిపేస్తారు.

బాబా అర్థం చేయించారు - సూక్ష్మవతనములో కూడా అంతా సాక్షాత్కారాలకు సంబంధించిన విషయమే ఉంటుంది. అక్కడ ఎముకలు, మాంసము ఉండవు. కేవలం సాక్షాత్కారము కలుగుతుంది. సంపూర్ణ బ్రహ్మా కూడా ఉన్నారు కానీ వారు సంపూర్ణమైనవారు, అవ్యక్తమైనవారు. ఇప్పుడు వ్యక్త బ్రహ్మా ఎవరైతే ఉన్నారో, వారు అవ్యక్తముగా అవ్వాలి. వ్యక్తములో ఉన్నవారే అవ్యక్తము అవుతారు, వారిని ఫరిశ్తా అని కూడా అంటారు. వారి చిత్రాన్ని సూక్ష్మవతనంలో పెట్టారు. సూక్ష్మవతనంలోకి వెళ్తారు, బాబా మాకు శూబీరసాన్ని తాగించారు అని అంటారు. వాస్తవానికి అక్కడ వృక్షాలు మొదలైనవేవీ ఉండవు. అవి వైకుంఠములో ఉంటాయి, కానీ అలాగని వైకుంఠము నుండి తీసుకొచ్చి తాగిస్తూ ఉండవచ్చు అని కాదు. ఇవన్నీ సూక్ష్మవతనంలోని సాక్షాత్కారాల విషయాలు. ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి మరియు ఆత్మాభిమానులుగా అవ్వాలి అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మనైన నేను అవినాశీ, ఈ శరీరం వినాశీ. ఆత్మ జ్ఞానం కూడా పిల్లలైన మీలో ఉంది. వారికైతే ఆత్మ అంటే ఏమిటో కూడా తెలియదు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఏ విధంగా నిండి ఉందో కూడా వారికి తెలియదు. ఈ జ్ఞానాన్ని కేవలం తండ్రే ఇస్తారు. వారు తమ గురించిన జ్ఞానాన్ని కూడా ఇస్తారు. వారు తమోప్రధానము నుండి సతోప్రధానముగా కూడా తయారుచేస్తారు. ఇప్పుడు కేవలం - నేను ఆత్మను, ఇప్పుడు పరమాత్మతో యోగాన్ని జోడించాలి అన్న పురుషార్థాన్ని మాత్రమే చేస్తూ ఉండండి. సర్వశక్తివంతుడు, పతిత-పావనుడు అని ఒక్క తండ్రినే అంటారు. సన్యాసులు - పతిత-పావనా రండి అని అంటారు. కొందరు బ్రహ్మ తత్వాన్ని కూడా పతిత-పావనా అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు - భక్తి ఎంత సమయం నడుస్తుంది, జ్ఞానం ఎంత సమయం నడుస్తుంది అని భక్తికి సంబంధించిన జ్ఞానం కూడా లభించింది. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మొదట ఏమీ తెలిసేది కాదు. మనుష్యులు అయ్యి ఉండి కూడా తుచ్ఛబుద్ధి కలవారిగా అయిపోయారు. సత్యయుగములో పూర్తిగా స్వచ్ఛబుద్ధి కలవారిగా ఉండేవారు. వారిలో ఎన్ని దైవీ గుణాలు ఉండేవి. పిల్లలైన మీరు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి. వీరు దేవత వలె ఉన్నారు అని అంటారు కదా. సాధువులు, సన్యాసులు, మహాత్ములను మనుష్యులు నమ్ముతారు వారు దైవీ బుద్ధి కలవారైతే కాదు. రజోగుణీ బుద్ధి కలవారిగా అయిపోతారు. రాజు, రాణి, ప్రజలు ఉంటారు కదా! రాజధాని ఎప్పుడు మరియు ఎలా స్థాపన అవుతుంది అన్నది ప్రపంచానికి తెలియదు. ఇక్కడ మీరు అన్నీ కొత్త విషయాలను వింటారు. మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఉన్నతోన్నతమైనవారు తండ్రి. వారి మాల పైన ఉంది. రుద్రుడు ఆ నిరాకారుడు, ఆ తర్వాత సాకారంలో లక్ష్మీ-నారాయణులు ఉన్నారు, వారి మాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల ఇప్పుడు తయారవ్వదు. అంతిమంలో బ్రాహ్మణులైన మీ మాల కూడా తయారవుతుంది. ఈ విషయాలలో ఎక్కువగా ప్రశ్నోత్తరాలు చేయవలసిన అవసరం లేదు. ముఖ్యమైన విషయము - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమపిత పరమాత్మను స్మృతి చేయండి. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. ముఖ్యమైన విషయము పతితులను పావనంగా తయారుచేయడము. మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది, మళ్ళీ పావనంగా అవ్వాలి. మూలవతనంలో కూడా అందరూ పావనమైనవారే, అలాగే సుఖధామంలో కూడా అందరూ పావనమైనవారే. మీరు పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్తారు. అనగా ఇప్పుడు పావన ప్రపంచము స్థాపనవుతుంది. ఇదంతా డ్రామాలో నిశ్చయించబడి ఉంది.

తండ్రి అంటారు, మొత్తం రోజంతటి లెక్కాపత్రాన్ని చూసుకోండి - ఏ పొరపాటు జరగలేదు కదా? వ్యాపారస్థులు ఖాతా పుస్తకాలను సంభాళిస్తారు, ఇది కూడా సంపాదనే. మీరు ప్రతి ఒక్కరూ వ్యాపారస్థులు. మీరు బాబాతో వ్యాపారం చేస్తారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి - నాలో ఎన్ని దైవీగుణాలు ఉన్నాయి? ఎంతగా తండ్రిని స్మృతి చేస్తున్నాను? ఎంతగా నేను అశరీరిగా అవుతూ ఉన్నాను? మనము అశరీరులుగా వచ్చాము, మళ్ళీ అశరీరులుగా అయ్యి వెళ్ళాలి. ఇప్పటికీ అందరూ వస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక్కరు కూడా వెళ్ళేది లేదు. అందరూ కలిసే వెళ్ళేది ఉంది. అలాగని సృష్టి ఖాళీ అవ్వదు. రాముడూ వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు... అన్న గాయనం ఉంది. కానీ ఇరువురూ ఉంటారు. రావణ సాంప్రదాయము వెళ్ళిపోయిందంటే ఇక మళ్ళీ తిరిగి రాదు. వీరు మాత్రం మిగిలిపోతారు. ఇవి కూడా మున్ముందు అన్నీ సాక్షాత్కారం అవ్వనున్నాయి. కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతూ ఉంది, చివరిలో ఏం అవుతుంది అన్నది తెలుసుకోవాలి. అప్పుడిక కేవలం మన ధర్మం మాత్రమే మిగిలి ఉంటుంది. సత్యయుగములో మీరు రాజ్యం చేస్తారు. కలియుగము సమాప్తమైపోతుంది, మళ్ళీ సత్యయుగము రావాలి. ఇప్పుడు రావణ సాంప్రదాయము మరియు రాముని సాంప్రదాయము రెండూ ఉన్నాయి. సంగమయుగములోనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇదంతా తెలుసు. తండ్రి అంటారు - రహస్యాలేవైతే మిగిలి ఉన్నాయో, వాటిని మున్ముందు నెమ్మది-నెమ్మదిగా అర్థం చేయిస్తూ ఉంటాను. రికార్డులో ఏవైతే నిశ్చయించబడి ఉన్నాయో, అవన్నీ తెరుచుకుంటూ ఉంటాయి. మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. సమయం కన్నా ముందే ఏమీ తెలియజేయడం జరగదు. ఇది కూడా డ్రామా ప్లాన్, రికార్డు తెరుచుకుంటూ ఉంటుంది. బాబా తెలియజేస్తూ ఉంటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నింటికీ సంబంధించిన వివేకం పెరుగుతూ ఉంటుంది. రికార్డు ఎలా-ఎలా తిరుగుతూ ఉంటుందో, అలా-అలా బాబా మురళి నడుస్తూ ఉంటుంది. డ్రామా రహస్యమంతా రికార్డులో నిండి ఉంది. ఏదైనా రిపీట్ అవ్వాలని రికార్డు పైనున్న ముల్లును తీసి మధ్యలో ఎక్కడైనా పెట్టడం సాధ్యం కాదు. ఒకవేళ అలా జరిగితే అది కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇదేమీ కొత్త విషయము కాదు. తండ్రి వద్ద కొత్త విషయాలేవైతే ఉంటాయో, అవి రిపీట్ అవుతాయి. మీరు వింటారు మరియు వినిపిస్తూ ఉంటారు. ఇకపోతే ఇక్కడంతా గుప్తమే. ఇక్కడ రాజధాని స్థాపనవుతుంది. మొత్తం మాల అంతా తయారవుతుంది. మీరు వేర్వేరుగా వెళ్ళి రాజ్యంలో జన్మ తీసుకుంటారు. రాజు, రాణి, ప్రజలు అందరూ కావాలి. ఇదంతా బుద్ధితో అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రాక్టికల్ గా ఏదైతే జరగబోతుందో దానిని చూడడం జరుగుతుంది. ఇక్కడి నుండి ఎవరైతే వెళ్తారో, వారు మంచి షావుకార్ల ఇంట్లోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఇప్పుడు కూడా మీకు అక్కడ ఎంతో మర్యాద ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో కూడా రత్నజడితమైన వస్తువులు అందరి వద్ద ఉంటాయి. కానీ వారిలో అంత శక్తి లేదు. శక్తి మీలో ఉంది. మీరు ఎక్కడికి వెళ్తే, అక్కడ మీ ప్రత్యక్షత చేస్తారు. మీరైతే ఉన్నతంగా అవుతారు కావున మీరు వెళ్ళి అక్కడ దైవీ చరిత్రను చూపిస్తారు. అసురీ పిల్లలు జన్మిస్తూనే ఏడుస్తూ ఉంటారు. అశుద్ధంగా కూడా ఉంటారు. మీరు ఎంతో నియమానుసారంగా పాలింపబడతారు. అక్కడ అశుద్ధత మొదలైనవాటి విషయం ఉండదు. ఈరోజుల్లోని పిల్లలైతే అశుద్ధంగా అయిపోతారు. సత్యయుగములో ఇటువంటివేమీ జరగవు. ఎంతైనా అది స్వర్గం కదా. అక్కడ అగరబత్తి వెలిగించండి అని చెప్పడానికి అసలు దుర్గంధమే ఉండదు. తోటలలో చాలా సుగంధభరితమైన పుష్పాలు ఉంటాయి. ఇక్కడి పుష్పాలలో అంతటి సుగంధము లేదు. అక్కడైతే ప్రతి వస్తువులోనూ 100 శాతం సుగంధం ఉంటుంది. ఇక్కడ 1 శాతం కూడా లేదు. అక్కడైతే పుష్పాలు కూడా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. ఇక్కడ ఎవరు ఎంత షావుకార్లుగా ఉన్నా కానీ అక్కడ ఉన్నంతైతే కాదు. అక్కడైతే రకరకాల వస్తువులు ఉంటాయి. పాత్రలు మొదలైనవన్నీ బంగారముతో చేయబడినవి ఉంటాయి. ఇక్కడ రాళ్ళు ఎలా ఉంటాయో, అలా అక్కడ బంగారమే బంగారము ఉంటుంది. ఇసుకలో కూడా బంగారము ఉంటుంది. మరి ఆలోచించండి - ఎంత బంగారము ఉంటుంది! దానితో ఇళ్ళు మొదలైనవి తయారవుతాయి. అక్కడ చలి ఉండదు, వేడి ఉండదు, అటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ ఫ్యాన్ వేయాల్సిన అవసరం పడేందుకు వేడి యొక్క దుఃఖమే ఉండదు. దాని పేరే స్వర్గము. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది. మీ వంటి పదమాపదమ భాగ్యశాలులుగా ఇంకెవ్వరూ అవ్వనే అవ్వరు. లక్ష్మీ-నారాయణులను ఎంతగా మహిమ చేస్తారు. మరి వారిని ఆ విధంగా ఎవరైతే తయారుచేస్తారో, వారిని ఎంతగా మహిమ చేయాలి. మొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది, ఆ తర్వాత దేవతల భక్తి ప్రారంభమవుతుంది. దానిని కూడా భూత పూజ అనే అంటారు. ఆ శరీరాలైతే లేవు. 5 తత్వాల పూజ జరుగుతుంది. శివబాబా గురించి ఈ విధంగా అనరు. పూజ చేయడానికి ఏదైనా వస్తువుతో లేక బంగారం మొదలైనవాటితో తయారుచేస్తారు. ఆత్మను ఏమైనా బంగారము అని అంటారా. ఆత్మ ఏ వస్తువుతో తయారయ్యింది? శివుని చిత్రము ఏ వస్తువుతో తయారుచేయబడింది అన్నది వెంటనే చెప్తారు. కానీ ఆత్మ-పరమాత్మ దేనితో తయారుచేయబడ్డాయి అన్నది ఎవ్వరూ చెప్పలేరు. సత్యయుగములో 5 తత్వాలు కూడా శుద్ధముగా ఉంటాయి. ఇక్కడ అశుద్ధముగా ఉన్నాయి. పురుషార్థులైన పిల్లలు ఈ-ఈ విధముగా ఆలోచిస్తూ ఉంటారు. తండ్రి అంటారు - ఈ విషయాలన్నింటినీ కూడా వదిలేయండి. ఏది జరగాలి అని ఉంటే అది జరుగుతుంది. మొదట తండ్రిని స్మృతి చేయండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఏదైతే వింటారో, వాటన్నింటినీ విడిచిపెట్టి ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి - మేము సతోప్రధానముగా అవ్వాలి. ఆ తర్వాత సత్యయుగములో కల్పకల్పమూ ఏదైతే జరిగి ఉంటుందో, అదే జరుగుతుంది. అందులో తేడా రాదు. ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. పూర్తి శ్రమించండి. తుఫానులైతే ఎన్నో వస్తాయి. జన్మజన్మాంతరాలు ఏవైతే చేసారో, అవన్నీ ఎదురుగా వస్తాయి. కావున అన్నివైపుల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా అయి నన్ను స్మృతి చేసే పురుషార్థం చేయండి. పిల్లలైన మీకు స్మృతి అయితే వచ్చింది, అది కూడా నంబరువారు పురుషార్థం అనుసారంగా. సేవ ద్వారా కూడా అర్థమవుతుంది. సేవ చేసేవారికి సేవ యొక్క సంతోషము ఉంటుంది. ఎవరైతే మంచి సేవ చేస్తారో, వారి సేవకు ఋజువు కూడా లభిస్తుంది. మార్గదర్శకులుగా అయి వస్తారు. మహారథులు ఎవరు, గుర్రపు స్వారీ వారు ఎవరు, పాదచారులు ఎవరు అనేది వెంటనే తెలిసిపోతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇతర విషయాలన్నింటినీ వదిలి బుద్ధిని నలువైపుల నుండి తొలగించి సతోప్రధానముగా అయ్యేందుకు అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి.

2. బుద్ధిలోకి మంచి-మంచి ఆలోచనలను తీసుకురావాలి, మన రాజ్యములో (స్వర్గములో) ఏమేమి ఉంటాయి అన్న విషయంపై ఆలోచించి స్వయాన్ని ఆ విధంగా యోగ్యులుగా, చరిత్రవంతులుగా తయారుచేసుకోవాలి. ఇక్కడి నుండి బుద్ధిని తొలగించివేయాలి.

వరదానము:-

సేవ ద్వారా ఫలాన్ని ప్రాప్తి చేసుకొనే, సర్వ హద్దు కోరికలకు దూరంగా సదా సంపన్న మరియు సమాన భవ

సేవ అంటే ఫలాన్ని అందించేది అని అర్థము. ఒకవేళ ఏ సేవ అయినా అసంతుష్టులుగా చేస్తే ఆ సేవ, సేవ కాదు. అటువంటి సేవను వదిలేసినా పర్వాలేదు కానీ సంతుష్టతను వదలకండి. ఏ విధంగా శరీర పరంగా తృప్తిగా ఉండేవారు సదా సంతుష్టంగా ఉంటారో, అలా మనస్సు పరంగా తృప్తిగా ఉండేవారు కూడా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత తృప్తికి గుర్తు. తృప్తిగా ఉండే ఆత్మలో ఏ రకమైన హద్దులోని కోరిక కానీ, గౌరవము, పేరు-ప్రతిష్టలు, సౌకర్యాలు, సాధనాల యొక్క ఆకలి కానీ ఉండదు. వారు హద్దులోని కోరికలన్నింటి నుండి దూరంగా సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటారు.

స్లోగన్:-

సత్యమైన హృదయముతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్ళటము అనగా పుణ్యం యొక్క ఖాతా జమ అవ్వటము.