01-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు జ్ఞాన వర్షాన్ని కురిపించి
సస్యశ్యామలముగా చేసేవారు, మీరు ధారణ చేయాలి మరియు చేయించాలి’’
ప్రశ్న:-
ఏ
మేఘాలైతే వర్షించవో, వాటికి ఏ పేరు పెడతారు?
జవాబు:-
వాటిని సోమరి
మేఘాలని అంటారు. వర్షించేవాటిని చురుకైన మేఘాలని అంటారు. ఒకవేళ ధారణ ఉంటే
వర్షించకుండా ఉండలేరు. ఎవరైతే ధారణ చేసి ఇతరుల చేత చేయించరో, వారి కడుపు వీపుకు
అంటుకుంటుంది, వారు పేదవారు, ప్రజలలోకి వెళ్ళిపోతారు.
ప్రశ్న:-
స్మృతియాత్రలో
ముఖ్యమైన శ్రమ ఏమిటి?
జవాబు:-
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని బిందువు రూపములో స్మృతి చేయడము, తండ్రి ఎవరో,
ఎలా ఉన్నారో, వారిని అదే స్వరూపములో యథార్థముగా స్మృతి చేయడము, ఇందులోనే శ్రమ ఉంది.
పాట:-
ఎవరైతే
ప్రియునితో ఉంటారో...
ఓంశాంతి
సాగరముపైన మేఘాలు ఉంటాయి కావున మేఘాలకు తండ్రి సాగరుడు. ఏ మేఘాలైతే సాగరముతో పాటు
ఉంటాయో వాటి నుండే వర్షము కురుస్తుంది. ఆ మేఘాలు కూడా నీటిని నింపుకుని, తర్వాత
వర్షిస్తాయి. మీరు కూడా సాగరుని వద్దకు నింపుకునేందుకు వస్తారు. మీరు సాగరుని
పిల్లలు, అనగా మేఘాలు, మధురమైన నీటిని తీసుకుని నింపుకుంటారు. ఇప్పుడు మేఘాలు కూడా
అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని చాలా ఎక్కువగా వర్షిస్తాయి, వరదలు సృష్టిస్తాయి, కొన్ని
తక్కువగా వర్షిస్తాయి. మీలో కూడా ఇలా నంబరువారుగా ఉన్నారు. ఎవరైతే చాలా ఎక్కువగా
వర్షిస్తారో, వారి పేరు కూడా మహిమ చేయడం జరుగుతుంది. ఏ విధంగా వర్షము బాగా కురిస్తే
మనుష్యులు సంతోషిస్తారో, ఇక్కడ కూడా అలాగే. ఎవరైతే బాగా వర్షిస్తారో, వారి మహిమ
జరుగుతుంది, ఎవరైతే వర్షించరో వారి మనసు సోమరిగా అయిపోతుంది, వారికి కడుపు నిండదు.
పూర్తిగా ధారణ జరగకపోవడం వలన వారి కడుపు వెళ్ళి వీపుకు అంటుకుంటుంది. కరువు వస్తే
మనుష్యుల కడుపు వీపుకు అంటుకుంటుంది. ఇక్కడ కూడా ధారణ చేసి, ధారణ చేయించకపోతే కడుపు
వెళ్ళి వీపుకు అంటుకుంటుంది. బాగా వర్షించేవారు వెళ్ళి రాజా-రాణులుగా అవుతారు మరియు
మిగిలినవారు పేదవారిగా అవుతారు. పేదవారి కడుపు వీపుకు అంటుకుంటుంది. కనుక పిల్లలు
ధారణ చాలా బాగా చేయాలి. ఇందులో కూడా ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము ఎంత సహజమైనది. మాలో
ఆత్మ మరియు పరమాత్మ, రెండింటి జ్ఞానము ఇంతకుముందు ఉండేది కాదని మీరిప్పుడు అర్థం
చేసుకుంటారు. దాని వలన కడుపు వీపుకు అంటుకుంది కదా. ముఖ్యమైనది ఆత్మ మరియు పరమాత్మల
విషయమే. మనుష్యులకు ఆత్మ గురించే తెలియకపోతే ఇక పరమాత్మను ఎలా తెలుసుకోగలరు. ఎంతో
గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైనవారు ఉన్నారు, ఎవ్వరికీ ఆత్మ గురించి తెలియదు.
ఇప్పుడు మీకు తెలిసింది - ఆత్మ అవినాశీ, అందులో 84 జన్మల అవినాశీ పాత్ర నిశ్చితమై
ఉంది, అది నడుస్తూ ఉంటుంది. ఆత్మ అవినాశీ కనుక పాత్ర కూడా అవినాశీ. ఆత్మ ఆల్రౌండ్
పాత్రను ఎలా అభినయిస్తుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. వారైతే ఆత్మే పరమాత్మ అని
అనేస్తారు. పిల్లలైన మీకు ఆది నుండి మొదలుకొని అంతిమము వరకు సంపూర్ణ జ్ఞానముంది.
వారైతే డ్రామా ఆయువునే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇప్పుడు మీకు మొత్తం
జ్ఞానమంతా లభించింది. తండ్రి రచించిన ఈ జ్ఞాన యజ్ఞములో ఈ ప్రపంచమంతా స్వాహా
అవ్వనున్నదని మీకు తెలుసు, అందుకే తండ్రి అంటారు, దేహ సహితముగా ఏదైతే ఉందో, అదంతా
మర్చిపోండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని మరియు శాంతిధామాన్ని, మధురమైన
ఇంటిని స్మృతి చేయండి. ఇది ఉన్నదే దుఃఖధామము. మీలో కూడా నంబరువారు
పురుషార్థానుసారముగా అర్థం చేయించగలరు. ఇప్పుడు మీరు జ్ఞానముతోనైతే నిండుగా ఉన్నారు.
ఇకపోతే, శ్రమ అంతా స్మృతిలో ఉంది. జన్మ-జన్మాంతరాల దేహాభిమానాన్ని తొలగించి,
దేహీ-అభిమానులుగా అవ్వండి, ఇందులో చాలా శ్రమ ఉంది. చెప్పడము చాలా సులభము కానీ
స్వయాన్ని ఆత్మగా భావించడము మరియు తండ్రిని కూడా బిందు రూపములో స్మృతి చేయడము,
ఇందులో శ్రమ ఉంది. తండ్రి అంటారు, నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలా కష్టం మీద ఎవరో
స్మృతి చేయగలరు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు అలాగే ఉంటారు కదా. స్వయాన్ని తెలుసుకుంటే
తండ్రిని కూడా తెలుసుకుంటారు. చదివించేవారైతే తండ్రి ఒక్కరేనని, చదువుకునేవారు
చాలామంది ఉన్నారని మీకు తెలుసు. తండ్రి రాజధానిని ఎలా స్థాపిస్తున్నారు అనేది
పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇకపోతే, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు
సామాగ్రి. అర్థం చేయించడం కోసమని మేము ఇలా చెప్పాల్సి ఉంటుంది, అంతేకానీ ఇందులో
అయిష్టము అన్న విషయమేమీ లేదు. శాస్త్రాలలో కూడా బ్రహ్మా యొక్క పగలు మరియు రాత్రి అని
అంటారు కానీ అర్థం చేసుకోరు. రాత్రి మరియు పగలు సగం-సగం ఉంటాయి. మెట్ల చిత్రముపై
ఎంత సులభంగా అర్థం చేయించడం జరుగుతుంది.
భగవంతుడు చాలా సమర్థుడని, వారు ఏది కావాలనుకుంటే అది చేయగలరని మనుష్యులు
భావిస్తారు. కానీ బాబా అంటారు, నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. భారత్
లోనైతే ఎన్ని ఆపదలు వస్తూ ఉంటాయి, అప్పుడు నేను ఘడియ-ఘడియ వస్తానా ఏమిటి? నా పాత్రకు
హద్దు ఉంది. ఎప్పుడైతే పూర్తిగా దుఃఖము ఏర్పడుతూ ఉంటుందో, అప్పుడు నేను నా సమయానికి
వస్తాను. ఒక్క సెకెండు కూడా తేడా రాదు. డ్రామాలో ప్రతి ఒక్కరిదీ ఏక్యురేట్ పాత్ర
నిశ్చితమై ఉంది. ఇది ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క పునః అవతరణ. తర్వాత నంబరువారుగా
తక్కువ శక్తి కలవారు అందరూ వస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి నుండి జ్ఞానము
లభించింది, దీని ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీకు ఫుల్ ఫోర్స్ తో
కూడిన శక్తి వస్తుంది. పురుషార్థము చేసి మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా
అవుతారు. ఇతరులకైతే ఈ పాత్రే లేదు. ముఖ్యమైనది డ్రామా, ఈ జ్ఞానము మీకు ఇప్పుడు
లభిస్తుంది. మిగిలినవన్నీ భౌతికమైనవి ఎందుకంటే వాటన్నింటినీ ఈ కళ్ళతో చూడడం
జరుగుతుంది. ప్రపంచములో అద్భుతమైనవారైతే బాబా, వారు రచించడం కూడా స్వర్గాన్ని
రచిస్తారు, దానిని హెవెన్, ప్యారడైజ్ అని అంటారు. వారికి ఎంత మహిమ ఉంది, తండ్రికి
మరియు తండ్రి రచనకు చాలా మహిమ ఉంది. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. ఉన్నతోన్నతమైన
స్వర్గ స్థాపనను తండ్రి ఎలా చేస్తారు, ఇది ఎవ్వరికీ ఏమాత్రమూ తెలియదు.
మధురాతి-మధురమైన పిల్లలైన మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు మరియు
దాని అనుసారముగానే పదవిని పొందుతారు, ఎవరేమి పురుషార్థము చేసినా, దానిని
డ్రామానుసారముగానే చేస్తారు. పురుషార్థము లేకుండానైతే ఏమీ లభించదు. కర్మ చేయకుండా
ఒక్క సెకెండు కూడా ఉండలేరు. ఆ హఠయోగులు ప్రాణాయామము చేస్తారు, జడము వలె అయిపోతారు,
లోపలే ఉండిపోతారు, పైన మట్టి పేరుకుపోతుంది, మట్టి పైన నీరు పడితే గడ్డి మొలుస్తుంది.
కానీ దీని వలన లాభమేమీ లేదు. ఎన్ని రోజులని అలా కూర్చుని ఉంటారు? కర్మనైతే తప్పకుండా
చేయాల్సిందే. కర్మ సన్యాసులుగా ఎవ్వరూ అవ్వలేరు. అయితే, కేవలం భోజనం మొదలైనవి
తయారుచేసుకోరు, అందుకే వారిని కర్మ-సన్యాసులని అంటారు. ఇది కూడా డ్రామాలో వారి
పాత్ర. ఈ నివృత్తి మార్గమువారు కూడా లేకపోతే భారత్ పరిస్థితి ఎలా అయిపోయుండేది?
భారత్ నంబరువన్ పవిత్రముగా ఉండేది. తండ్రి మొట్టమొదట పవిత్రతను స్థాపన చేస్తారు, అది
ఇక అర్ధకల్పము కొనసాగుతుంది. తప్పకుండా సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేది.
దైవీ రాజ్యము ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. ఇటువంటి మంచి-మంచి స్లోగన్లు
తయారుచేసి మనుష్యులను సుజాగృతులుగా చేయాలి. మళ్ళీ దైవీ రాజ్య-భాగ్యాన్ని వచ్చి
తీసుకోండి అని చెప్పండి. ఇప్పుడు మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారు. శ్రీకృష్ణుడిని
శ్యామ-సుందరుడని ఎందుకంటారు - ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ రోజుల్లోనైతే
చాలామంది ఇలాంటి-ఇలాంటి పేర్లే పెట్టుకుంటారు. శ్రీకృష్ణునితో పోటీ పడతారు.
పిల్లలైన మీకు తెలుసు - పతిత రాజులు పావన రాజుల ముందుకు వెళ్ళి తల వంచి ఎలా
నమస్కరిస్తారు, కానీ వారికి ఆ పావన రాజుల గురించి తెలియదు. ఎవరైతే పూజ్యులుగా
ఉండేవారో, వారే మళ్ళీ పూజారులుగా అవుతారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీ
బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. ఇది గుర్తున్నా కూడా అవస్థ చాలా బాగుంటుంది. కానీ
మాయ స్మరించనివ్వదు, మరపింపజేస్తుంది. సదా హర్షితముఖ అవస్థ ఉన్నట్లయితే మిమ్మల్ని
దేవతలని అంటారు. లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూసి ఎంత సంతోషిస్తారు. రాధే-కృష్ణులు
లేక రాముడు మొదలైనవారిని చూసి అంతగా సంతోషపడరు ఎందుకంటే శ్రీకృష్ణుని గురించి
శాస్త్రాలలో హంగామాకు సంబంధించిన విషయాలు వ్రాశారు. ఈ బాబా కూడా శ్రీనారాయణునిగా
అవుతారు కదా. బాబా అయితే ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూసి సంతోషిస్తారు. పిల్లలు
కూడా ఈ విధంగా భావించాలి. ఇంకా ఎంత సమయం ఈ పాత శరీరములో ఉంటాము, తర్వాత వెళ్ళి
రాకుమారులుగా అవుతాము. ఇది లక్ష్యము-ఉద్దేశ్యము కదా. ఇది కూడా కేవలం మీకే తెలుసు.
సంతోషములో ఎంతగా పులకరించిపోవాలి. ఎంతగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు,
చదువుకోకపోతే ఏం పదవి లభిస్తుంది? విశ్వ మహారాజా-మహారాణి ఎక్కడ, షావుకార్లు ఎక్కడ,
ప్రజలలో నౌకర్లు ఎక్కడ. సబ్జెక్టు అయితే ఒక్కటే. కేవలం మన్మనాభవ, మధ్యాజీ భవ, అల్ఫ్
మరియు బే (భగవంతుడు మరియు రాజ్యాధికారము), స్మృతి మరియు జ్ఞానము. వీరికి ఎంత సంతోషము
కలిగింది - బాబాకు అల్లా లభించారు, ఇక మిగిలినదంతా ఇచ్చేసారు. ఎంత పెద్ద లాటరీ
లభించింది. ఇంకేం కావాలి! మరి పిల్లల్లో సంతోషము ఎందుకు ఉండకూడదు, అందుకే బాబా
అంటారు, పిల్లలు చూస్తూ సంతోషపడేలాంటి ట్రాన్స్ లైట్ చిత్రాన్ని అందరి కోసము
తయారుచేయించండి. శివబాబా బ్రహ్మా ద్వారా మనకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు.
మనుష్యులకైతే అసలేమీ తెలియదు. పూర్తిగా తుచ్ఛబుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు
తుచ్ఛబుద్ధి నుండి స్వచ్ఛబుద్ధి కలవారిగా అవుతున్నారు. అంతా తెలుసుకున్నారు, ఇంకేమీ
చదవాల్సిన అవసరం లేదు. ఈ చదువుతో మీకు విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది, అందుకే
తండ్రిని నాలెడ్జ్ ఫుల్ అంటారు. కానీ మనుష్యులు అనుకుంటారు, వారికి ప్రతి ఒక్కరి
మనసు గురించి తెలుసు అని. కానీ తండ్రి అయితే జ్ఞానాన్ని ఇస్తారు. ఫలానావారు
చదువుతారని టీచరు అర్థం చేసుకోగలరు, అంతేకానీ వారి బుద్ధిలో ఏం నడుస్తూ ఉందని రోజంతా
కూర్చుని ఏమైనా చూస్తారా. ఇది అద్భుతమైన జ్ఞానము. తండ్రిని జ్ఞానసాగరుడు,
సుఖ-శాంతుల సాగరుడు అని అంటారు. మీరు కూడా ఇప్పుడు మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు.
తర్వాత ఈ టైటిల్స్ పోతాయి. అప్పుడు సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా
అవుతారు. ఇది మనుష్యుల్లో ఉన్నత పదవి. ఈ సమయములో ఇది ఈశ్వరీయ పదవి. ఇవి ఎంతగా అర్థం
చేసుకోవలసిన మరియు అర్థం చేయించవలసిన విషయాలు. లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూసి
చాలా సంతోషము కలగాలి. మనమిప్పుడు విశ్వానికి యజమానులుగా అవుతాము. జ్ఞానము ద్వారానే
అన్ని గుణాలు వస్తాయి. మన లక్ష్యము-ఉద్దేశ్యమును చూడడంతోనే రిఫ్రెష్ అయిపోతారు,
అందుకే బాబా అంటారు, ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రమైతే ప్రతి ఒక్కరి వద్ద ఉండాలి అని. ఈ
చిత్రము మనసులో ప్రేమను పెంచుతుంది. ఇక ఈ మృత్యులోకములో ఇది చివరి జన్మ, తర్వాత మేము
అమరలోకములోకి వెళ్ళి ఈ విధంగా అవుతాము అని మనసుకు అనిపిస్తుంది, తతత్వం (ఇది మీకు
కూడా వర్తిస్తుంది). ఆత్మయే పరమాత్మ అని కాదు. అలా కాదు, ఈ జ్ఞానమంతా బుద్ధిలో
కూర్చుని ఉండాలి. ఎప్పుడైనా ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు, వారికి చెప్పండి, మేము
ఎప్పుడూ ఎవరి దగ్గర భిక్ష అడగము. ప్రజాపిత బ్రహ్మా యొక్క పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు.
మేము మా తనువు-మనసు-ధనములతోనే సేవ చేస్తాము. బ్రాహ్మణులు తమ సంపాదనతోనే యజ్ఞాన్ని
నడిపిస్తున్నారు. శూద్రుల ధనాన్ని ఇందులో ఉపయోగించలేము. అనేకమంది పిల్లలున్నారు,
వారికి తెలుసు - ఎంతగా మేము తనువు-మనసు-ధనముతో సేవ చేస్తామో, సమర్పణ అవుతామో, అంతగా
పదవిని పొందుతాము అని. బాబా బీజం నాటారు కావున దాని ద్వారా వారు లక్ష్మీ-నారాయణగా
అవుతారని మీకు తెలుసు. ధనము ఇప్పుడు ఇక్కడ ఇక ఉపయోగపడేది లేదు అన్నప్పుడు ఈ
కార్యములో ఎందుకు ఉపయోగించకూడదు. అలాగని సమర్పణ అయినవారు ఆకలితో మరణిస్తారా ఏమిటి?
ఇక్కడ చాలా బాగా చూసుకోవడం జరుగుతుంది. బాబాను ఎంత బాగా చూసుకోవడం జరుగుతుంది.
వీరైతే శివబాబా రథము కదా. వీరు మొత్తం ప్రపంచమంతటినీ హెవెన్ గా తయారుచేసేవారు. వీరు
సుందరమైన యాత్రికుడు.
పరమపిత పరమాత్మ వచ్చి అందరినీ సుందరముగా తయారుచేస్తారు, మీరు నలుపు నుండి
తెలుపుగా, సుందరముగా అవుతారు కదా. వీరు ఎంతటి సుందరమైన ప్రియుడు, వచ్చి అందరినీ
తెల్లగా తయారుచేస్తారు. వారిపైన అయితే బలిహారమైపోవాలి, వారిని స్మృతి చేస్తూ ఉండాలి.
ఎలాగైతే ఆత్మను చూడలేము కానీ తెలుసుకోగలమో, అలాగే పరమాత్మను కూడా తెలుసుకోగలము.
చూడడానికైతే ఆత్మ-పరమాత్మ ఇరువురూ ఒకే విధముగా బిందువులా ఉంటారు. ఇక మిగిలినదంతా
జ్ఞానము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. పిల్లల బుద్ధిలో ఇవి నోట్ అయి ఉండాలి.
బుద్ధిలో నంబరువారు పురుషార్థానుసారముగా ధారణ జరుగుతుంది. డాక్టర్లకు కూడా మందులు
గుర్తుంటాయి కదా. అంతేకానీ ఆ సమయములో కూర్చుని పుస్తకము చూస్తారని కాదు. డాక్టరీకి
సంబంధించి కూడా పాయింట్లు ఉంటాయి, బ్యారిస్టరీకి సంబంధించి కూడా పాయింట్లు ఉంటాయి.
మీ వద్ద కూడా పాయింట్లు ఉన్నాయి, టాపిక్ లు ఉన్నాయి, వాటిపై అర్థం చేయిస్తారు.
ఒకరికి ఒక పాయింటుతో లాభము కలుగుతుంది, మరొకరికి ఇంకొక పాయింటుతో బాణం తగులుతుంది.
పాయింట్లు అయితే అనేకానేకమున్నాయి. ఎవరైతే మంచి రీతిలో ధారణ చేస్తారో, వారు మంచి
రీతిలో సేవ చేయగలరు. అర్ధకల్పము నుండి మహారోగీ పేషెంటులుగా ఉన్నారు. ఆత్మ పతితముగా
అయిపోయింది, దానికి ఒక్క అవినాశీ సర్జన్ మాత్రమే మందు ఇస్తారు. వారు సదా సర్జన్ గానే
ఉంటారు, ఎప్పుడూ అనారోగ్యం పాలవ్వరు. మిగిలినవారందరూ అయితే అనారోగ్యం పాలవుతారు.
అవినాశీ సర్జన్ ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఇది ఎంత
సులభము, చిత్రాన్ని సదా పాకెట్ లో ఉంచుకోండి. బాబా నారాయణుడి పూజారిగా ఉండేవారు,
లక్ష్మి చిత్రాన్ని తీసేసి ఒక్క నారాయణుడి చిత్రాన్ని ఉంచుకున్నారు. నేను ఎవరినైతే
పూజిస్తూ ఉండేవాడినో, ఇప్పుడు వారిగా తయారవుతున్నానని ఇప్పుడు తెలుస్తుంది. లక్ష్మి
చిత్రానికి వీడ్కోలు ఇచ్చాను కావున నేను లక్ష్మిగా అవ్వను అన్నదైతే పక్కా. లక్ష్మి
కూర్చుని కాళ్ళు వత్తడం, ఇది మంచిగా అనిపించేది కాదు. దానిని చూసి పురుషులు స్త్రీల
చేత కాళ్ళు వత్తించుకుంటారు. అక్కడ లక్ష్మి ఈ విధంగా ఏమైనా కాళ్ళు వత్తుతారా. ఈ
ఆచార-పద్ధతులు అక్కడ ఉండవు. ఈ ఆచారము రావణ రాజ్యానిది. ఈ చిత్రములో మొత్తం జ్ఞానమంతా
ఉంది. పైన త్రిమూర్తి చిత్రము కూడా ఉంది, ఈ జ్ఞానాన్ని రోజంతా స్మరణ చేస్తే చాలా
అద్భుతముగా అనిపిస్తుంది. భారత్ ఇప్పుడు స్వర్గముగా తయారవుతూ ఉంది. ఇది ఎంత మంచి
వివరణ, మనుష్యుల బుద్ధిలో ఎందుకు కూర్చోదో తెలియదు. నిప్పు చాలా తీవ్రంగా
అంటుకుంటుంది, ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. రావణ రాజ్యము తప్పకుండా
సమాప్తమవ్వాల్సిందే. యజ్ఞములో కూడా పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి. మొత్తం విశ్వములో
పవిత్రతను తీసుకువచ్చే చాలా భారీ యజ్ఞము ఇది. ఆ బ్రాహ్మణులు కూడా బ్రహ్మా సంతానమని
చెప్పుకుంటారు, కానీ వారు కుఖ వంశావళి. బ్రహ్మా సంతానమైతే పవిత్రమైన ముఖ వంశావళి కదా.
కనుక వారికి ఇది అర్థం చేయించాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా అయి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి
సమానముగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి. జ్ఞానము ద్వారా సర్వ గుణాలను స్వయములో
ధారణ చేయాలి.
2. ఏ విధంగా బాబా తనువు-మనసు-ధనములను సేవలో ఉపయోగించారో, సమర్పితులయ్యారో, అలాగే
తండ్రి సమానముగా తమదంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి. సదా రిఫ్రెష్ అయి ఉండేందుకు
లక్ష్యము-ఉద్దేశ్యము యొక్క చిత్రాన్ని మీతో పాటు ఉంచుకోవాలి.
వరదానము:-
ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రిని ఫాలో చేసే
ప్రసన్నచిత్త భవ
పిల్లలైన మీ కొరకు బ్రహ్మాబాబా జీవితము ఏక్యురేట్
కంప్యూటర్ వంటిది. ఏ విధంగా ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా ప్రతి ఒక్క ప్రశ్నకు
జవాబులు అడుగుతారో, అదే విధంగా మనసులో ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న తలెత్తితే, ఏమిటి,
ఎందుకు, ఎలా అన్నదానికి బదులుగా బ్రహ్మాబాబా జీవితము రూపీ కంప్యూటరులో చూడండి. ఏమిటి
మరియు ఎలా అన్న ప్రశ్నలు ఇలా అన్నదానిలోకి మారిపోతాయి. ప్రశ్నచిత్తులకు బదులుగా
ప్రసన్నచిత్తులుగా అవుతారు. ప్రసన్నచిత్త అనగా ఏకరస స్థితిలో ఒక్క తండ్రిని ఫాలో
చేసేవారు.
స్లోగన్:-
ఆత్మిక శక్తి ఆధారముగా సదా
ఆరోగ్యముగా ఉండే అనుభవం చేయండి.
విశేష సూచన:-
బ్రహ్మా వత్సలందరూ జనవరి 1 నుండి జనవరి 31, 2025 వరకు విశేషముగా అంతర్ముఖత అనే గుహలో
కూర్చుని యోగ తపస్య చేస్తూ పూర్తి విశ్వానికి తమ శక్తిశాలి మనసా ద్వారా విశేషముగా
సకాష్ ఇచ్చే సేవ చేయండి. ఈ లక్ష్యముతోనే ఈ నెలలోని పత్రపుష్పములో ఏవైతే అవ్యక్త
ప్రేరణలు పంపించడం జరిగిందో, వాటిని మొత్తం జనవరి మాసములో మురళీ కింద కూడా
వ్రాస్తున్నాము. మీరందరూ ఈ పాయింట్లపై విశేషముగా మనన చింతన చేస్తూ మనసా సేవ యొక్క
అనుభవజ్ఞులుగా అవ్వండి.
తమ శక్తిశాలి మనసు ద్వారా
సకాష్ ఇచ్చే సేవను చేయండి
శాంతి దూత పిల్లలైన మీరు,
ఎక్కడ ఉన్నా కూడా, నడుస్తూ-తిరుగుతూ సదా స్వయాన్ని శాంతి దూతగా భావిస్తూ నడుచుకోండి.
ఎవరైతే స్వయం శాంతి స్వరూపములో, శక్తిశాలి స్వరూపములో స్థితులవుతారో వారు ఇతరులకు
కూడా శాంతి మరియు శక్తి యొక్క సకాష్ ను ఇస్తూ ఉంటారు.
| | |