01-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి నాలెడ్జ్ ఫుల్, వారిని జానీ జానన్ హార్ (సర్వము తెలిసినవారు) అని అనడము, ఇది అయథార్థ మహిమ, తండ్రి మిమ్మల్ని పతితము నుండి పావనముగా తయారుచేసేందుకే వస్తారు’’

ప్రశ్న:-
తండ్రితో పాటు అందరికంటే అధిక మహిమ ఇంకెవరికి ఉంది మరియు ఎలా?

జవాబు:-
1. తండ్రితో పాటు భారత్ కు కూడా చాలా మహిమ ఉంది. భారత్ యే అవినాశీ ఖండము. భారత్ యే స్వర్గముగా అవుతుంది. తండ్రి భారతవాసులనే ధనవంతులుగా, సుఖవంతులుగా మరియు పవిత్రముగా తయారుచేసారు. 2. గీతకు కూడా అపారమైన మహిమ ఉంది, సర్వ శాస్త్రమయి శిరోమణి గీత. 3. చైతన్య జ్ఞాన గంగలైన మీకు కూడా చాలా మహిమ ఉంది. మీరు డైరెక్ట్ జ్ఞానసాగరుడి నుండి వెలువడ్డారు.

ఓంశాంతి
ఓంశాంతి యొక్క అర్థాన్ని అయితే కొత్త మరియు పాత పిల్లలు అర్థము చేసుకున్నారు. ఆత్మలమైన మనమంతా పరమాత్ముని సంతానమని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. పరమాత్మ ఉన్నతోన్నతమైనవారు మరియు అత్యంత ప్రియమైనవారు, వారు అందరి ప్రియుడు. పిల్లలకు జ్ఞానము మరియు భక్తి యొక్క రహస్యాలనైతే అర్థము చేయించారు. జ్ఞానము అనగా పగలు - సత్య, త్రేతా యుగాలు, భక్తి అనగా రాత్రి - ద్వాపర, కలియుగాలు. ఇది భారత్ యొక్క విషయమే. మొట్టమొదట భారతవాసులైన మీరు వస్తారు. 84 జన్మల చక్రము కూడా భారతవాసులైన మీ కొరకే ఉంది. భారత్ యే అవినాశీ ఖండము. భారతఖండమే స్వర్గముగా అవుతుంది, ఇతర ఖండమేదీ స్వర్గముగా అవ్వదు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో భారత్ మాత్రమే ఉంటుందని పిల్లలకు అర్థము చేయించడం జరిగింది. భారత్ యే స్వర్గముగా పిలవబడుతుంది. భారతవాసులే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు, నరకవాసులుగా అవుతారు. వారే తిరిగి స్వర్గవాసులుగా అవుతారు. ఈ సమయములో అందరూ నరకవాసులుగా ఉన్నారు, మిగిలిన అన్ని ఖండాలు వినాశనమైనా భారత్ మాత్రము మిగులుతుంది. భారతఖండము యొక్క మహిమ అపారమైనది. భారత్ లోనే తండ్రి వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది గీత యొక్క పురుషోత్తమ సంగమయుగము. భారత్ యే మళ్ళీ పురుషోత్తమముగా అవ్వనున్నది. ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమూ లేదు, రాజ్యమూ లేదు, అలాగే ఆ యుగమూ లేదు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) అని ఒక్క భగవంతుడిని మాత్రమే అంటారని పిల్లలైన మీకు తెలుసు. భారతవాసులు వారిని అంతర్యామి అని, అందరి లోపల ఏముందో వారికి తెలుసు అన్న మాట అని చాలా తప్పు చేసారు. తండ్రి అంటారు - నాకు ఎవరి లోపల ఏముందో తెలియదు. నా పనే పతితులను పావనముగా చేయడము. శివబాబా, మీరు అంతర్యామి అని చాలామంది అంటారు. బాబా అంటారు - నేను అలా లేను. నాకు ఎవరి హృదయము గురించి తెలియదు. నేను వచ్చి కేవలం పతితులను పావనముగా తయారుచేస్తాను. నన్ను పిలవడమే పతిత ప్రపంచములోకి పిలుస్తారు. మరియు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, ఆ సమయములో పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి ఉంటుంది. ఈ ప్రపంచము కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా ఎప్పుడవుతుంది అనే విషయము మనుష్యులకు తెలియదు. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా, సతో, రజో, తమోలలోకి తప్పకుండా వస్తుంది. మనుష్యులు కూడా ఇలాగే అవుతారు. బాల్యావస్థలో సతోప్రధానముగా ఉంటారు, ఆ తర్వాత యువతగా అవుతారు, ఆ తర్వాత వృద్ధులుగా అవుతారు అనగా రజో, తమోలలోకి వస్తారు. వృద్ధ శరీరముగా అయిన తర్వాత దానిని వదిలి మళ్ళీ బాలునిగా అవుతారు. కొత్త ప్రపంచములో భారత్ ఎంత ఉన్నతముగా ఉండేది అన్నది పిల్లలకు తెలుసు. భారత్ మహిమ అపారమైనది. ఇంత సుఖవంతమైన, ధనవంతమైన, పవిత్రమైన ఖండము మరొకటి లేనే లేదు. దీనిని మళ్ళీ సతోప్రధానముగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు. సతోప్రధాన ప్రపంచము స్థాపనవుతూ ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మా, విష్ణువు, శంకరులను ఎవరు సృష్టించారు? ఉన్నతోన్నతమైన శివుడు. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు కానీ అర్థమైతే తెలియదు. వాస్తవానికి త్రిమూర్తి శివ అని అనాలి, అంతేకానీ త్రిమూర్తి బ్రహ్మా అని కాదు. ఇప్పుడు దేవ దేవ మహాదేవా అని పాడుతారు. శంకరుడిని ఉన్నతముగా చూపిస్తున్నప్పుడు, మరి త్రిమూర్తి శంకరుడు అని అనాలి కదా. మరి త్రిమూర్తి బ్రహ్మా అని ఎందుకంటారు? శివుడు రచయిత. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను స్థాపన చేస్తారని గానము కూడా చేస్తారు. భక్తి మార్గములో నాలెడ్జ్ ఫుల్ తండ్రిని జానీ-జానన్ హార్ (సర్వము తెలిసినవారు) అని అంటారు, ఇప్పుడు ఆ మహిమ అర్థ సహితముగా లేదు. తండ్రి ద్వారా మనకు వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు, వారే స్వయంగా బ్రాహ్మణులైన మనల్ని చదివిస్తారు ఎందుకంటే వారు తండ్రి కూడా, సుప్రీమ్ టీచరు కూడా, ప్రపంచ చరిత్ర-భూగోళాల చక్రము ఎలా తిరుగుతుంది అనేది కూడా అర్థము చేయిస్తారు, వారే నాలెడ్జ్ ఫుల్. కానీ వారు సర్వమూ తెలిసినవారు అని కాదు. అలా అనడం పొరపాటు. నేను వచ్చి కేవలం పతితులను పావనముగా తయారుచేస్తాను. 21 జన్మల రాజ్య భాగ్యాన్ని ఇస్తాను. భక్తి మార్గములో అల్పకాలిక సుఖముంది. దాని గురించి సన్యాసులకు, హఠయోగులకు తెలియనే తెలియదు. వారు బ్రహ్మతత్వమును తలచుకుంటారు. వాస్తవానికి బ్రహ్మతత్వము భగవంతుడు కాదు. భగవంతుడు ఒక్క నిరాకార శివుడే, వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలమైన మనము నివసించే స్థానము బ్రహ్మాండము, స్వీట్ హోమ్. అక్కడి నుండి ఆత్మలమైన మనము ఇక్కడ పాత్రను అభినయించడానికి వస్తాము. నేను ఒక శరీరాన్ని వదిలి రెండవ, మూడవ శరీరాన్ని తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. 84 జన్మలు కూడా భారతవాసులకు మాత్రమే ఉంటాయి. ఎవరైతే ఎంతో భక్తి చేసారో, వారే మళ్ళీ జ్ఞానము కూడా ఎక్కువ తీసుకుంటారు.

తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారములో ఉండండి కానీ శ్రీమతముపై నడవండి. ఆత్మలైన మీరందరూ ప్రియుడైన ఒక్క పరమాత్మునికి ప్రేయసులు. భక్తి మార్గము నుండి మొదలుకుని మీరు తలచుకుంటూ వచ్చారు. ఆత్మ తండ్రిని తలచుకుంటుంది. ఇది దుఃఖధామము. వాస్తవానికి ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. ఆ తర్వాత సుఖధామములోకి వచ్చాము, తర్వాత మనము 84 జన్మలు తీసుకున్నాము. ‘హమ్ సో, సో హమ్’ అర్థాన్ని కూడా అర్థము చేయించారు. వారు ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థము చేయించారు - దేవతలుగా ఉన్న మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, మళ్ళీ శూద్రులుగా అయ్యాము. ఇప్పుడు మనము దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యాము. హమ్ సో, సో హమ్ యొక్క యథార్థ అర్థము ఇదే. వారు చెప్పిన అర్థము పూర్తిగా తప్పు. సత్యయుగములో ఒక్క దేవీ-దేవతా ధర్మము, అద్వైత ధర్మము ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చినందుకు ద్వైతము ఏర్పడింది. ద్వాపరము నుండి ఆసురీ రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. సత్యయుగములో రావణ రాజ్యమే లేదు కనుక 5 వికారాలు కూడా ఉండవు. ఆ ప్రపంచమే సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము.

ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు. కావున వీరు టీచరు కూడా అయినట్లు, తండ్రి కూడా అయినట్లు, అంతేకాక పిల్లలైన మీకు సద్గతిని ఇచ్చి స్వర్గములోకి తీసుకువెళ్తారు కనుక వీరు తండ్రి, టీచరు, గురువు, ముగ్గురూ అయినట్లు. వారికి మీరు పిల్లలుగా అయ్యారు కనుక మీకు ఎంత సంతోషము ఉండాలి. మనుష్యులకు అసలేమీ తెలియదు ఎందుకంటే ఇది రావణ రాజ్యము కదా. ప్రతి సంవత్సరము రావణుడిని కాలుస్తూ ఉంటారు కానీ రావణుడు ఎవరు, ఇది తెలియదు. ఈ రావణుడు భారత్ కు అందరికంటే పెద్ద శత్రువని పిల్లలైన మీకు తెలుసు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు మాత్రమే నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి లభిస్తుంది. ఆ తండ్రే జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు. జ్ఞాన సాగరుడి నుండి మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకుని వెళ్ళి వర్షిస్తారు. మీరు జ్ఞాన గంగలు, మహిమ మీదే! తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఇప్పుడు పావనముగా తయారుచేయడానికి వచ్చాను. ఈ ఒక్క జన్మ పవిత్రముగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. నేనే పతిత-పావనుడను. ఎంత వీలైతే అంత స్మృతిని పెంచండి. నోటితో శివబాబా అని కూడా అనకూడదు. ప్రేయసి తన ప్రియుడిని ఎలా తలచుకుంటుంది, ఒక్కసారి చూస్తే ఇక ఆమె బుద్ధిలో అతని స్మృతియే ఉంటుంది. భక్తి మార్గములో ఎవరు ఏ దేవతను స్మృతి చేస్తారో, పూజిస్తారో, వారి సాక్షాత్కారమవుతుంది. అది అల్పకాలికమైనది. భక్తి చేస్తూ కిందకి దిగుతూ వచ్చారు. ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. అయ్యో-అయ్యో అన్న ఆర్తనాదాల తర్వాత ఇక జయజయకారాలు ప్రతిధ్వనించనున్నాయి. భారత్ లోనే రక్తపు నదులు ప్రవహించనున్నాయి. గృహ యుద్ధాల యొక్క గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. అందరూ తమోప్రధానమైపోయారు. ఇప్పుడు మీరు సతోప్రధానముగా అవుతున్నారు. కల్పక్రితము ఎవరైతే దేవతలుగా అయ్యారో, వారే వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానము తక్కువగానే తీసుకుంటారు. అంతేకాక ప్రజలలో కూడా నంబరువారుగా పదవులు పొందుతారు. మంచి పురుషార్థులు శ్రీమతముపై నడుస్తూ మంచి పదవిని పొందుతారు. మ్యానర్స్ కూడా బాగుండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి, అవే 21 జన్మలు కొనసాగుతాయి. ఇప్పుడు అందరివీ ఆసురీ గుణాలు. ఇది ఆసురీ ప్రపంచము, పతిత ప్రపంచము కదా. పిల్లలైన మీకు ప్రపంచ చరిత్ర-భూగోళాలు కూడా అర్థము చేయించబడ్డాయి. ఈ సమయములో తండ్రి అంటారు, స్మృతి చేసే శ్రమ చేసినట్లయితే మీరు సత్యమైన బంగారముగా అవుతారు. సత్యయుగము బంగారు యుగము, సత్యమైన బంగారముగా ఉంటుంది, తర్వాత త్రేతాలో వెండి యొక్క లోహము కలుస్తుంది. కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ కళా లేదు, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు తండ్రి వస్తారు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది.

ఈ రావణ రాజ్యములో అందరూ వివేకహీనులుగా అయిపోయారు, ఈ అనంతమైన డ్రామాలోని పాత్రధారులుగా అయ్యి ఉండి కూడా డ్రామా ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. మీరు పాత్రధారులు కదా. మనము ఇక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చామని మీకు తెలుసు. కానీ పాత్రధారులై ఉండి కూడా డ్రామా గురించి తెలియదు. మరి అనంతమైన తండ్రి అంటారు కదా, మీరెంత తెలివిహీనులుగా అయిపోయారు అని. ఇప్పుడు నేను మిమ్మల్ని వివేకవంతులుగా, వజ్రతుల్యముగా తయారుచేస్తాను. మళ్ళీ రావణుడు గవ్వతుల్యముగా చేస్తాడు. నేనే వచ్చి అందరినీ నాతోపాటు తీసుకువెళ్తాను, ఇక తర్వాత ఈ పతిత ప్రపంచము కూడా వినాశనమైపోతుంది. దోమల వలె అందరినీ తీసుకువెళ్తాను. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. అలా మీరు తయారవ్వాలి, అప్పుడే మీరు స్వర్గవాసులుగా అవుతారు. బ్రహ్మాకూమార-కుమారీలైన మీరు ఈ పురుషార్థము చేస్తున్నారు. మనుష్యుల బుద్ధి తమోప్రధానముగా ఉన్నందుకు అర్థము చేసుకోరు. ఇంత మంది బి.కె.లు ఉన్నప్పుడు తప్పకుండా ప్రజాపిత బ్రహ్మా కూడా ఉంటారు. బ్రాహ్మణులు పిలక వంటివారు, బ్రాహ్మణులే తర్వాత దేవతలు అవుతారు... చిత్రాలలో బ్రాహ్మణులను మరియు శివుడిని మాయం చేసేశారు. బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉన్నత పదవిని పొందేందుకు శ్రీమతముపై నడుస్తూ మంచి మ్యానర్స్ ను ధారణ చేయాలి.

2. సత్యమైన ప్రేయసులుగా అయి ఒక్క ప్రియుడినే స్మృతి చేయాలి. ఎంత వీలైతే అంత స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుతూ వెళ్ళాలి.

వరదానము:-
నిమిత్త భావపు స్మృతి ద్వారా మాయా గేట్ ను మూసి వేసే డబుల్ లైట్ భవ

ఎవరైతే సదా స్వయాన్ని నిమిత్తముగా భావిస్తూ నడుచుకుంటారో వారికి డబుల్ లైట్ స్థితి యొక్క అనుభవము స్వతహాగానే కలుగుతుంది. చేసేవారు, చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తుడను - ఈ స్మృతితోనే సఫలత లభిస్తుంది. నేను అన్న భావన వచ్చింది అంటే మాయ గేట్ తెరుచుకున్నట్లు, నిమిత్తముగా భావించినట్లయితే మాయ గేట్ మూసుకుపోయినట్లు. కావున నిమిత్తులుగా భావించడము ద్వారా మాయాజీతులుగా కూడా అవుతారు మరియు డబుల్ లైట్ గా కూడా అవుతారు. దానితో పాటు సఫలత కూడా తప్పకుండా లభిస్తుంది. ఇదే స్మృతి మొదటి నంబరు తీసుకునేందుకు ఆధారమవుతుంది.

స్లోగన్:-
త్రికాలదర్శులుగా అయి ప్రతి కర్మను చేసినట్లయితే సఫలత సహజముగా లభిస్తూ ఉంటుంది.

మాతేశ్వరి గారి మహావాక్యాలు

1. ‘‘మనుష్యాత్మ తన పూర్తి సంపాదన అనుసారముగా భవిష్య ప్రారబ్ధాన్ని అనుభవిస్తుంది’’

చూడండి, చాలామంది మనుష్యులు ఎలా భావిస్తారంటే - మా పూర్వ జన్మల మంచి సంపాదన వలన ఇప్పుడు ఈ జ్ఞానము ప్రాప్తించింది అని. కానీ అటువంటి విషయమే లేదు. పూర్వ జన్మల మంచి ఫలము ఉందని మనకు తెలుసు. కల్పము యొక్క చక్రము తిరుగుతూ ఉంటుంది. సతో, రజో, తమో... మారుతూ ఉంటుంది. కానీ డ్రామానుసారముగా పురుషార్థముతో ప్రారబ్ధము తయారయ్యే అవకాశముంది, అందుకే అక్కడ సత్యయుగములో కొంతమంది రాజు-రాణుల పదవిని, కొంతమంది దాసి పదవిని, కొంతమంది ప్రజా పదవిని పొందుతారు. ఇదే పురుషార్థము యొక్క సిద్ధి. అక్కడ ద్వైతము, ఈర్ష్య ఉండవు, అక్కడ ప్రజలు కూడా సుఖముగా ఉంటారు. రాజు-రాణి తమ ప్రజలను, తల్లిదండ్రులు తమ పిల్లలను సంభాళించినట్లుగా సంభాళిస్తారు. అక్కడ పేదవారు, షావుకారులు అందరూ సంతుష్టముగా ఉంటారు. ఈ ఒక్క జన్మలోని పురుషార్థము ద్వారా 21 తరాల వరకు సుఖాన్ని అనుభవిస్తారు, ఇది అవినాశీ సంపాదన, ఈ అవినాశీ సంపాదనలో అవినాశీ జ్ఞానము ద్వారా అవినాశీ పదవి లభిస్తుంది. ఇప్పుడు మనము సత్యయుగ ప్రపంచములోకి వెళ్తున్నాము, ఈ ప్రాక్టికల్ ఆట నడుస్తూ ఉంది, ఇక్కడ మాయా-మంత్రము యొక్క విషయమేమీ లేదు.

2. ‘‘గురువుల మతము, శాస్త్రాల మతము - పరమాత్ముని మతమేమీ కాదు’’

పరమాత్మ అంటారు - పిల్లలూ, ఈ గురువుల మతము, శాస్త్రాల మతము, ఇవి నా మతమేమీ కాదు. వీరు కేవలం నా పేరుతో మతమునిస్తున్నారు కానీ నా మతము నాకు తెలుసు. నన్ను కలుసుకునే చిరునామాను నేను వచ్చి ఇస్తాను, దానికంటే ముందు నా అడ్రస్ గురించి ఎవరికీ తెలియదు. గీతలో భగవానువాచ అని ఉంది కానీ ఆ గీతను కూడా మనుష్యులే తయారుచేసారు. భగవంతుడు స్వయం జ్ఞానసాగరుడు. భగవంతుడు ఏ మహావాక్యాలనైతే వినిపించారో, వాటి స్మృతిచిహ్నముగా తర్వాత ఈ గీత తయారైంది. ఈ విద్వాంసులు, పండితులు, ఆచార్యులు ఏమంటారంటే - పరమాత్మ సంస్కృతములో మహావాక్యాలను ఉచ్చరించారు, వాటిని నేర్చుకోకుండా పరమాత్మ లభించరు అని. వారు ఇంకాస్త కర్మ కాండలలో చిక్కుకునేలా చేస్తారు. ఒకవేళ వేద-శాస్త్రాలను చదివి మెట్లు ఎక్కినట్లయితే మళ్ళీ అంతే మెట్లు దిగాల్సి వస్తుంది అనగా వాటన్నింటినీ మరచి ఒక్క పరమాత్మునితో బుద్ధియోగాన్ని జోడించాల్సి ఉంటుంది ఎందుకంటే పరమాత్మ నేరుగా చెప్తున్నారు - ఈ కర్మకాండలతో, వేదాలు, శాస్త్రాలు చదవడముతో నన్ను పొందలేరు. చూడండి, ధృవుడు, ప్రహ్లాదుడు, మీరా ఏ శాస్త్రాలను చదివారు? ఇక్కడైతే చదివినవి కూడా అన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు అర్జునుడు చదివాడు, అతను కూడా మర్చిపోవాల్సి వచ్చింది. భగవంతుడు నేరుగా చెప్పిన మహావాక్యాలు ఏమిటంటే - శ్వాసశ్వాసలోనూ నన్ను స్మృతి చేయండి. ఇందులో ఏమీ చేయవలసిన అవసరము లేదు. ఎప్పటివరకైతే ఈ జ్ఞానము ఉండదో, అప్పటివరకు భక్తి మార్గము కొనసాగుతుంది. కానీ జ్ఞాన దీపము వెలిగితే కర్మకాండల నుండి విడుదలవుతారు ఎందుకంటే కర్మకాండలు చేస్తూ-చేస్తూ ఒకవేళ శరీరము వదిలేస్తే లాభమేముంది? ప్రారబ్ధమైతే తయారవ్వలేదు. కర్మబంధనాల లెక్కాచారాల నుండైతే ముక్తి లభించలేదు. అబద్ధాలు చెప్పకుండా ఉండడము, దొంగతనాలు చేయకుండా ఉండడము, ఎవరికీ దుఃఖమివ్వకుండా ఉండడము... ఇవే మంచి కర్మలని మనుష్యులు భావిస్తారు. కానీ ఇక్కడైతే సదా కొరకు కర్మల బంధనాల నుండి విముక్తులవ్వాలి మరియు వికర్మల వేర్లను తీసివేయాలి. ఎటువంటి బీజము వేయాలంటే దాని నుండి మంచి కర్మల వృక్షము వెలువడాలి అని మనము ఇప్పుడు కోరుకుంటున్నాము, అందుకే మనుష్య జీవితము యొక్క కార్యాన్ని తెలుసుకుని శ్రేష్ఠ కర్మలు చేయాలి. అచ్ఛా. ఓంశాంతి.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపము యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

శివ శక్తి అంటే అర్థమే కంబైండ్. తండ్రి మరియు మీరు - ఇరువురిని కలిపి శివశక్తి అని అంటారు. ఎవరైతే కంబైండ్ గా ఉంటారో, వారిని ఎవరూ వేరు చెయ్యలేరు. ఇదే గుర్తు పెట్టుకోండి, మనము కంబైండ్ గా ఉండేందుకు అధికారులుగా అయ్యాము. ఇంతకుముందు వెతికేవారము కానీ ఇప్పుడు తోడుగా ఉన్నాము - ఈ నషా సదా ఉండాలి.