01-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరందరూ పరస్పరం ఆత్మిక సోదరులు, మీకు పరస్పరం ఆత్మిక ప్రేమ ఉండాలి, ఆత్మకు ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి, శరీరం పట్ల కాదు’’

ప్రశ్న:-
తండ్రి తమ ఇంటికి సంబంధించిన ఏ అద్భుతమైన విషయాన్ని వినిపించారు?

జవాబు:-
ఏయే ఆత్మలైతే నా ఇంటికి వస్తాయో, అవి తమ-తమ సెక్షన్లలో తమ నంబరు వద్ద ఫిక్స్ అవుతాయి. అవి ఎప్పడూ కదలవు-ఊగవు. అక్కడ అన్ని ధర్మాలకు సంబంధించిన ఆత్మలు నాకు సమీపంగా ఉంటాయి. అక్కడి నుండి నంబరువారుగా, తమ-తమ సమయమనుసారంగా పాత్రను అభినయించేందుకు వస్తాయి, ఈ అద్భుతమైన జ్ఞానము ఈ సమయంలోనే, కల్పములో ఒక్కసారి మాత్రమే మీకు లభిస్తుంది. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు.

ఓంశాంతి
తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మలమైన మనకు తండ్రి అర్థం చేయిస్తారని మరియు తండ్రి స్వయాన్ని ఆత్మలకు తండ్రిగా భావిస్తారని పిల్లలకు తెలుసు. ఈ విధంగా ఎవ్వరూ భావించరు మరియు స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎవ్వరూ ఎప్పుడూ అర్థం చేయించరు కూడా. ఈ విధంగా తండ్రియే కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానము యొక్క ప్రారబ్ధాన్ని మీరు నంబరువారు పురుషార్థానుసారంగా కొత్త ప్రపంచములో తీసుకోనున్నారు. ఈ ప్రపంచం మారనున్నదని, దీనిని మార్చేవారు తండ్రి అని కూడా అందరికీ ఏమీ గుర్తుండదు. ఇక్కడైతే సమ్ముఖముగా కూర్చున్నారు, కానీ ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో అప్పుడిక రోజంతా తమ వ్యాపార, వ్యవహారాలలోనే నిమగ్నమైపోతారు. తండ్రి శ్రీమతము ఏమిటంటే - పిల్లలూ, ఎక్కడ ఉన్నా కానీ మీరు నన్నే స్మృతి చేయండి. ఏ విధంగానైతే కన్యకు తనకు ఎటువంటి భర్త లభిస్తాడనేది ముందు తెలియదు, కానీ అతని చిత్రాన్ని చూసిన తర్వాత ఇక అతని స్మృతి నిలిచిపోతుంది. ఎక్కడ ఉన్నా కానీ ఇరువురూ ఒకరినొకరు తలచుకుంటూ ఉంటారు, దీనిని దైహిక ప్రేమ అని అంటారు. ఇది ఆత్మిక ప్రేమ. ఆత్మిక ప్రేమ ఎవరి పట్ల ఉంది? పిల్లలకు ఆత్మిక తండ్రి పట్ల మరియు పిల్లలకు, పిల్లల పట్ల. పిల్లలైన మీకు పరస్పరం కూడా ఎంతో ప్రేమ ఉండాలి అనగా ఆత్మలకు ఆత్మల పట్ల కూడా ప్రేమ ఉండాలి. ఈ శిక్షణ కూడా ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. ప్రపంచంలోని మనుష్యులకు ఏమీ తెలియదు. మీరందరూ సోదరులు కావున పరస్పరంలో తప్పకుండా ప్రేమగా ఉండాలి ఎందుకంటే మీరు ఒక్క తండ్రి పిల్లలు కదా. దీనిని ఆత్మిక ప్రేమ అని అంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కేవలం పురుషోత్తమ సంగమయుగములోనే ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు సమ్ముఖముగా అర్థం చేయిస్తారు మరియు పిల్లలకు తండ్రి ఇక్కడకు వచ్చి ఉన్నారని తెలుసు. వారు పిల్లలైన మనల్ని పుష్పాల వలె పవిత్రంగా, పతితుల నుండి పావనంగా తయారుచేసి తమతో పాటు తీసుకువెళ్తారు. అలాగని వారు చేతితో పట్టుకొని తీసుకువెళ్తారని కాదు. ఆత్మలన్నీ మిడతల గుంపు ఎగిరినట్లుగా ఎగిరి వెళ్లిపోతాయి. వాటికి కూడా ఒక గైడ్ ఉంటుంది. ఆ గైడ్ తో పాటుగా మరికొన్ని గైడ్లు ఉంటాయి, అవి ముందు ఉంటాయి. మొత్తం గుంపు అంతా కలిసి వెళ్ళినప్పుడు చాలా శబ్దం వస్తుంది. సూర్యుడి ప్రకాశాన్ని కూడా మూసేస్తాయి, అంతటి పెద్ద గుంపు ఉంటుంది. ఆత్మలైన మీదైతే ఎంత పెద్ద లెక్కలేనంత గుంపు ఉంటుంది. దానిని ఎప్పుడూ లెక్కపెట్టలేము. ఇక్కడ మనుష్యులను లెక్కపెట్టలేరు. జనాభా లెక్కలు తీసినా కానీ అవి కూడా ఖచ్చితంగా వెలువడవు. ఆత్మలు ఎన్ని ఉన్నాయి అన్న లెక్కను ఎప్పుడూ తీయలేము. సత్యయుగములో ఎంతమంది మనుష్యులు ఉంటారు అన్నది అంచనా వేయడం జరుగుతుంది, ఎందుకంటే కేవలం భారత్ యే మిగిలి ఉంటుంది. మేము విశ్వాధిపతులుగా అవుతున్నాము అని మీ బుద్ధిలో ఉంది. ఆత్మ ఎప్పుడైతే శరీరములో ఉంటుందో అప్పుడు జీవాత్మగా ఉంటుంది, కావున రెండూ కలిసే సుఖాన్ని లేక దుఃఖాన్ని అనుభవిస్తాయి. ఆత్మయే పరమాత్మ అని, అది ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించదని, నిర్లేపి అని ఎంతోమంది భావిస్తారు. మేము స్వయాన్ని ఆత్మగా నిశ్చయమైతే చేసుకున్నాము, కానీ తండ్రిని ఎక్కడ స్మృతి చేయాలి? అని ఈ విషయంలో కూడా చాలామంది పిల్లలు తికమకపడతారు. తండ్రి పరంధామ నివాసి అనైతే తెలుసు. తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు. ఎక్కడైనా కూడా నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఉండడం పరంధామంలో ఉంటారు. మీ ఆత్మ కూడా అక్కడే ఉండేది, మళ్ళీ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తుంది. ఈ జ్ఞానం కూడా ఇప్పుడే లభించింది.

మీరు దేవతలుగా ఉన్నప్పుడు - ఫలానా-ఫలానా ధర్మాలకు సంబంధించిన ఆత్మలు పైన ఉన్నారు అన్నది మీకు గుర్తుండదు. వారు పై నుండి వచ్చి ఇక్కడ శరీరాలను ధారణ చేసి పాత్రను అభినయిస్తారు అన్న ఈ చింతన అక్కడ నడవదు. తండ్రి కూడా పరంధామంలో ఉంటారని, అక్కడి నుండి ఇక్కడకు వచ్చి శరీరంలోకి ప్రవేశిస్తారని ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు వారు ఏ శరీరంలోకి ప్రవేశిస్తారు అని వారు తమ చిరునామానైతే తెలియజేస్తారు. మీరు ఒకవేళ - శివబాబా, కేరాఫ్ పరంధామం అని వ్రాస్తే, అప్పుడు ఆ పరంధామానికైతే ఉత్తరం చేరుకోలేదు, అందుకే - శివబాబా, కేరాఫ్ బ్రహ్మా అని వ్రాసి, ఇక్కడి చిరునామాను వ్రాస్తారు, ఎందుకంటే తండ్రి ఇక్కడికే వస్తారని, ఈ రథంలోకి ప్రవేశిస్తారని మీకు తెలుసు. వాస్తవానికి ఆత్మలు కూడా పైన నివాసముండేవి. మీరు పరస్పరం సోదరులు. వీరు ఒక ఆత్మ అని, వీరికి ఫలానా పేరు ఉంది అని ఎల్లప్పుడూ ఈ విధంగానే భావించండి. ఆత్మను ఇక్కడ చూస్తారు, కానీ మనుష్యులు దేహాభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. తండ్రి అంటారు - మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు నన్ను స్మృతి చేయండి. ఈ సమయంలో తండ్రి అర్థం చేయిస్తారు - నేను ఎప్పుడైతే ఇక్కడకు వస్తానో, అలా వచ్చినప్పుడు పిల్లలకు జ్ఞానాన్ని కూడా ఇస్తాను. పాత ఇంద్రియాలను తీసుకున్నారు, అందులో ముఖ్యమైనది ఈ నోరు. కళ్ళు కూడా ఉన్నాయి కానీ జ్ఞానామృతం నోటి ద్వారా లభిస్తుంది. గోముఖము అని అంటారు కదా, అనగా ఇది తల్లి యొక్క నోరు. పెద్ద తల్లి ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకుంటారు. ఎవరు? శివబాబా. వారు ఇక్కడే ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. నేను మిమ్మల్ని ప్రజాపిత బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటాను. కావున వీరు తల్లి కూడా అయినట్లు. నీవే తల్లివి-తండ్రివి, మేము నీ పిల్లలము... అని గానం కూడా చేయడం జరుగుతుంది. కావున వారు ఆత్మలందరికీ తండ్రి, వారిని తల్లి అని అనరు, వారు కేవలం తండ్రి మాత్రమే. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది, వారితో పాటు తల్లి కూడా కావాలి. వారు ఇక్కడకు వస్తారు. తండ్రి పైన ఉంటారని ఇప్పుడు మీకు తెలిసింది. ఆత్మలమైన మనం కూడా పైన ఉంటాము, తర్వాత పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము. ప్రపంచానికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. వారు రాయి, రప్పల్లో పరమాత్మ ఉన్నారని అనేస్తారు, అటువంటప్పుడు లెక్కలేనంతమంది అయిపోతారు. దీనిని ఘోర అంధకారమని అంటారు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞానము అనే చీకటి తొలగిపోయింది అన్న గాయనం కూడా ఉంది. ఈ సమయంలో మీకు - ఇది రావణ రాజ్యమని, ఆ కారణంగానే అంధకారము ఉందని జ్ఞానం ఉంది. అక్కడైతే రావణ రాజ్యం ఉండనే ఉండదు, అందుకే ఏ వికారాలు ఉండవు. అలాగే దేహాభిమానం కూడా ఉండదు. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. ఇప్పుడు నేను చిన్న బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నేను యువకుడిగా అయ్యాను, ఇప్పుడు శరీరము వృద్ధాప్యానికి చేరుకుంది, అందుకే ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకోవాలి అన్న ఈ జ్ఞానం ఆత్మకు ఉంటుంది. అక్కడ, ఫలానావారు మరణించారు అని అనరు, అది ఉన్నదే అమరలోకము. సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఇప్పుడు ఆయువు పూర్తయ్యింది, ఇక దీనిని వదిలి కొత్తది తీసుకోవాలి అని అనుకుంటారు. అందుకే సన్యాసులు సర్పము యొక్క ఉదాహరణను ఇస్తారు. ఆ ఉదాహరణ వాస్తవానికి తండ్రి ఇచ్చినది, దానిని తర్వాత సన్యాసులు ఉపయోగించుకుంటారు. అందుకే తండ్రి అంటారు - ఈ జ్ఞానమేదైతే నేను మీకు ఇస్తానో, అది కనుమరుగైపోతుంది. తండ్రి చెప్పిన మాటలు కూడా ఉన్నాయి, అలాగే చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ పిండిలో ఉప్పు అంత మాత్రమే ఉన్నాయి. కావున తండ్రి కూర్చొని అర్థాన్ని వివరిస్తారు - ఏ విధంగానైతే సర్పము పాత కుబుసాన్ని విడిచిపెడుతుంది మరియు మళ్ళీ కొత్త కుబుసం వచ్చేస్తుంది, కానీ సర్పము విషయములో, అది ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరములోకి ప్రవేశించింది అని అనరు. అలా కాదు. ఇలా చర్మాన్ని మార్చే ఉదాహరణ కేవలం ఒక్క సర్పానికే ఉంది. దాని కుబుసము చూడటానికి కనిపిస్తుంది కూడా. ఏ విధంగానైతే వస్త్రాలను విడిచిపెడతారో, అలాగే సర్పము కూడా తన కుబుసాన్ని విడిచిపెడుతుంది, మళ్ళీ ఇంకొకటి లభిస్తుంది. సర్పము అయితే బ్రతికే ఉంటుంది, అలాగని అది ఎల్లప్పుడూ అమరంగా ఉంటుందని కూడా కాదు. 2-3 కుబుసాలను మార్చి ఆ తర్వాత మరణిస్తుంది. అక్కడ కూడా మీరు సమయమనుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఇప్పుడు నేను గర్భంలోకి వెళ్ళాలి అని మీకు అక్కడ తెలుస్తుంది. అక్కడ ఉన్నదే యోగబలం యొక్క విషయము. యోగబలం ద్వారా మీరు జన్మ తీసుకుంటారు, అందుకే అమరులు అని అంటారు. ఇప్పుడు నేను వృద్ధునిగా అయ్యాను, శరీరం పాతబడిపోయింది అని ఆత్మ అంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి చిన్న బాలుడిగా అవుతానని సాక్షాత్కారమవుతుంది. ఆత్మ తనంతట తానే శరీరాన్ని వదిలి పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న బాలుడిలోకి ప్రవేశిస్తుంది. అక్కడి గర్భాన్ని జైలు అని అనరు, మహలు అని అంటారు. అనుభవించవలసి వచ్చేందుకు అక్కడ పాపాలేవీ జరగవు. గర్భమహలులో విశ్రాంతిగా ఉంటారు, దుఃఖము యొక్క విషయమేమీ ఉండదు. వ్యాధిగ్రస్థులుగా అయ్యేందుకు అక్కడ ఎటువంటి అశుద్ధమైన వస్తువులూ తినిపించరు.

ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, మీరు నిర్వాణధామములోకి వెళ్ళాలి, ఈ ప్రపంచం మారనున్నది. ఇది పాతది నుండి మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ప్రతి వస్తువూ మారుతుంది. వృక్షము నుండి బీజాలు వెలువడతాయి, మళ్ళీ ఆ బీజాలను నాటినట్లయితే ఎన్ని ఫలాలు లభిస్తాయి. ఒక్క బీజము నుండి ఎన్ని గింజలు వెలువడతాయి. సత్యయుగములో యోగబలం ద్వారా ఒక్క కొడుకే జన్మిస్తాడు. ఇక్కడ వికారాల ద్వారా 4-5 పిల్లలకు జన్మనిస్తారు. సత్యయుగానికి మరియు కలియుగానికి ఎంతో తేడా ఉంది, దానిని తండ్రి తెలియజేస్తారు. కొత్త ప్రపంచం మళ్ళీ పాతదిగా ఎలా అవుతుంది, అందులో ఆత్మ ఏ విధంగా 84 జన్మలను తీసుకుంటుంది - ఇది కూడా అర్థం చేయించబడింది. ప్రతి ఆత్మ తన-తన పాత్రను అభినయించిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే తిరిగి వెళ్తుందో అప్పుడు తన స్థానములోకి వెళ్ళి నిలబడుతుంది. ఆ స్థానం మారదు. తమ-తమ ధర్మాలలో తమ-తమ స్థానాలలో నంబరువారుగా నిలబడతారు, ఆ తర్వాత మళ్ళీ నంబరువారుగానే కిందకు వస్తారు, అందుకే మూలవతనం యొక్క చిన్న-చిన్న మోడల్స్ ను తయారుచేసి పెడతారు. అన్ని ధర్మాలకు తమ-తమ సెక్షన్లు ఉంటాయి. దేవీ-దేవతా ధర్మము మొదటి ధర్మము, ఇక ఆ తర్వాత నంబరువారుగా వస్తారు. నంబరువారుగానే వెళ్ళి అక్కడ ఉంటారు. మీరు కూడా నంబరువారుగా పాస్ అవుతారు, ఆ మార్కుల ఆధారంగానే స్థానాన్ని తీసుకుంటారు. ఈ తండ్రి చెప్పే చదువు కల్పములో ఒక్కసారే ఉంటుంది. ఆత్మలైన మీ వృక్షము ఎంత చిన్నగా ఉంటుంది. ఇక్కడి మీ వృక్షము పెద్దగా ఉంటుంది. పిల్లలైన మీరు దివ్యదృష్టితో చూసి మళ్ళీ ఇక్కడ కూర్చొని చిత్రాలు మొదలైనవి తయారుచేసారు. ఆత్మ ఎంత చిన్నది, శరీరము ఎంత పెద్దది. ఆత్మలందరూ అక్కడకు వెళ్ళి కూర్చుంటారు. చాలా కొద్ది స్థలంలో దగ్గరగా వెళ్ళి ఉంటారు. మనుష్యుల వృక్షము ఎంత పెద్దది. మనుష్యులకైతే నడవడానికి, తిరగడానికి, ఆడుకోవడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి స్థలం కావాలి కదా. అన్నీ చేయడానికి స్థలం కావాలి. నిరాకారీ ప్రపంచములో ఆత్మలకు చిన్న చోటు ఉంటుంది, అందుకే ఈ చిత్రాలలో కూడా చూపించారు. ఇది తయారై-తయారుచేయబడిన నాటకము, శరీరాలను వదిలి ఆత్మలు అక్కడకు వెళ్ళాలి. మేము అక్కడ ఎలా ఉంటాము మరియు ఇతర ధర్మాలవారు ఎలా ఉంటారు, మళ్ళీ ఏ విధంగా నంబరువారుగా వేర్వేరు అవుతారు అన్నది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ విషయాలన్నింటినీ మీకు కల్ప-కల్పమూ ఒక్క తండ్రే వచ్చి వినిపిస్తారు. మిగిలినదంతా దైహికమైన చదువు. దానిని ఆత్మిక చదువు అని అనలేరు.

మనం ఒక ఆత్మ అని ఇప్పుడు మీకు తెలుసు. ‘ఐ’ అనగా ఆత్మ, ‘మై’ అనగా నాది అనగా ఇది నా శరీరము. మనుష్యులకు ఇది తెలియదు. వారికైతే సదా దైహిక సంబంధాలే ఉంటాయి. సత్యయుగములో కూడా దైహిక సంబంధాలు ఉంటాయి. కానీ అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. నేను ఒక ఆత్మను, నా ఈ శరీరము ఇప్పుడు వృద్ధాప్యానికి చేరుకుంది, అందుకే ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అన్నది తెలుస్తుంది. ఇందులో తికమకపడే విషయం కూడా ఏదీ లేదు. పిల్లలైన మీరైతే తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకోవాలి. తప్పకుండా అనంతమైన తండ్రి ఉన్నారు కదా. మనుష్యులు ఎప్పటివరకైతే జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోరో, అప్పటివరకు అనేక ప్రశ్నలు అడుగుతారు. జ్ఞానం బ్రాహ్మణులైన మీకు ఉంది. బ్రాహ్మణులైన మీ మందిరం కూడా వాస్తవానికి అజ్మీరులో ఉంది. బ్రాహ్మణులలో ఒక రకంవారు పుష్కరిణీ బ్రాహ్మణులు, ఇంకొకరు సారసిద్ధ బ్రాహ్మణులు. అజ్మీరులోని బ్రహ్మా మందిరాన్ని చూడడానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మా కూర్చొని ఉంటారు, గడ్డము మొదలైనవి చూపించారు. వారిని మానవ రూపములో చూపించారు, అలాగే బ్రాహ్మణులైన మీరు కూడా మానవ రూపములోనే ఉన్నారు. బ్రాహ్మణులను దేవతలు అని అనరు. సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు బ్రహ్మా యొక్క సంతానమైన మీరే. వారు బ్రహ్మా సంతానమేమీ కారు, తర్వాత వచ్చేవారికి ఇది తెలియదు. ఇది మీ విరాట రూపము. ఇది బుద్ధిలో గుర్తుండాలి. ఈ జ్ఞానమంతటినీ మీరు ఎవరికైనా చాలా మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. మనం ఆత్మలము, తండ్రి యొక్క పిల్లలము, ఇది యథార్థ రీతిగా అర్థం చేసుకొని ఈ నిశ్చయాన్ని పక్కాగా చేసుకోవాలి. ఆత్మలందరికీ తండ్రి ఒక్క పరమాత్మయే, అందరూ వారిని స్మృతి చేస్తారు అన్నది యథార్థమైన విషయము. ‘ఓ భగవంతుడా’ అని మనుష్యుల నోటి నుండి తప్పకుండా వెలువడుతుంది. ఎప్పటివరకైతే తండ్రి వచ్చి అర్థం చేయించరో అప్పటివరకూ పరమాత్మ ఎవరు అన్నది ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయించారు - ఈ లక్ష్మీ-నారాయణులు ఎవరైతే విశ్వాధిపతులుగా ఉండేవారో, వారికే తెలియనప్పుడు మరి ఇక ఋషులు-మునులు ఎలా తెలుసుకోగలరు! ఇప్పుడు మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు ఆస్తికులు, ఎందుకంటే మీకు రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. కొందరికి బాగా తెలుసు, కొందరికి తక్కువగా తెలుసు. తండ్రి సమ్ముఖముగా వచ్చి చదివిస్తారు, కొందరు మంచి రీతిలో ధారణ చేస్తారు, మరికొందరు తక్కువగా ధారణ చేస్తారు. చదువు పూర్తిగా సాధారణమైనది కూడా, అలాగే పెద్దది కూడా. తండ్రిలో ఎంతటి జ్ఞానం ఉందంటే, సాగరాన్ని సిరాగా చేసినా కానీ దాని అంతాన్ని పొందలేరు. తండ్రి సహజ చేసి అర్థం చేయిస్తారు. తండ్రిని తెలుసుకోవాలి, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. అంతే! అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతి సదా సహజముగా నిలిచి ఉండేందుకు నడుస్తూ-తిరుగుతూ ఈ విధంగా చింతన చేయాలి - నేను ఒక ఆత్మను, పరంధామ నివాసి ఆత్మనైన నేను ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాను. తండ్రి కూడా పరంధామంలో ఉంటారు. వారు బ్రహ్మా తనువులోకి వచ్చారు.

2. ఏ విధంగా ఆత్మిక తండ్రి పట్ల ఆత్మకు ప్రేమ ఉంటుందో, అదే విధంగా పరస్పరం కూడా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఆత్మకు ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి, శరీరము పట్ల కాదు. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి అభ్యాసము చేయాలి.

వరదానము:-

హద్దు యొక్క కామనల నుండి ముక్తులుగా ఉంటూ సర్వ ప్రశ్నల నుండి అతీతంగా ఉండే సదా ప్రసన్నచిత్త భవ

ఏ పిల్లలైతే హద్దు కోరికల నుండి ముక్తులుగా ఉంటారో, వారి ముఖముపై ప్రసన్నత యొక్క మెరుపు కనిపిస్తుంది. ప్రసన్నచిత్తులు ఏ విషయములోనూ ప్రశ్నచిత్తులుగా అవ్వరు. వారు సదా నిస్వార్థంగా ఉంటారు మరియు సదా అందరినీ నిర్దోషులుగా అనుభవం చేస్తారు, ఇతరులెవ్వరిపైనా దోషం మోపరు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ, లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవడానికి ఏ ఆత్మ అయినా ఎదుర్కునేందుకు వస్తున్నా కానీ, శారీరక కర్మభోగము ఎదుర్కునేందుకు వస్తున్నా కానీ, వారు సంతుష్టత కారణంగా సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు.

స్లోగన్:-

వ్యర్థము యొక్క చెకింగ్ ను అటెన్షన్ తో చెయ్యండి, నిర్లక్ష్యముతో కాదు.