ఓంశాంతి
పిల్లలూ, ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? 84 జన్మల చక్రము బుద్ధిలో ఉంది అనగా తమ
వెరైటీ జన్మల జ్ఞానము ఉంది. విరాట రూపము యొక్క చిత్రము కూడా ఉంది కదా. తాము 84
జన్మలు ఎలా తీసుకుంటారు అన్న జ్ఞానము కూడా పిల్లల్లో ఉంది. మూలవతనము నుండి
మొట్టమొదట దేవీ-దేవతా ధర్మములోకి వస్తారు, ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది, ఇందులో చిత్రాల
యొక్క అవసరమేమీ లేదు. మనము చిత్రాలు మొదలైనవాటినేమీ స్మృతి చేయవలసిన అవసరం లేదు.
అంతిమములో కేవలం ఇదే గుర్తుంటుంది - నేను ఆత్మను, మూలవతనవాసిని, ఇక్కడ నా పాత్ర ఉంది.
ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇవి మనుష్య సృష్టి చక్రానికి సంబంధించిన విషయాలే మరియు
ఇవి చాలా సహజమైనవి. ఇందులో చిత్రాల యొక్క అవసరం అసలు లేదు, ఎందుకంటే ఈ చిత్రాలు
మొదలైనవన్నీ భక్తి మార్గపు వస్తువులు. జ్ఞాన మార్గములోనైతే చదువు ఉంటుంది. చదువులో
చిత్రాల యొక్క అవసరం లేదు. ఈ చిత్రాలను కేవలం సరిదిద్దడం జరిగింది. వారు ఏ విధంగా
గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని అంటారో, అలా మనము శివుడు అని అంటాము. ఇవి కూడా
బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. బుద్ధిలో ఈ జ్ఞానము ఉంటుంది - మేము 84
జన్మల చక్రములో తిరిగాము, ఇప్పుడు మేము పవిత్రముగా అవ్వాలి, పవిత్రముగా అయి మళ్ళీ
కొత్తగా చక్రములో తిరుగుతాము - ఇది సారము, దీనిని బుద్ధిలో ఉంచుకోవాలి. ఏ విధంగా
తండ్రి బుద్ధిలో - ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలు మరియు 84 జన్మల చక్రము ఎలా
తిరుగుతుంది అన్న జ్ఞానము ఉందో, అలా మీ బుద్ధిలో కూడా - మొదట మేము సూర్యవంశీయులుగా
అవుతాము, ఆ తర్వాత చంద్రవంశీయులుగా అవుతాము అన్న జ్ఞానము ఉంది. చిత్రాల అవసరం లేదు.
కేవలం మనుష్యులకు అర్థం చేయించడానికని వీటిని తయారుచేసారు. జ్ఞాన మార్గములోనైతే
తండ్రి కేవలం - ‘మన్మనాభవ’ అని అంటారు. ఈ చతుర్భుజుని చిత్రము, రావణుడి చిత్రము
మొదలైనవన్నీ అర్థం చేయించడం కోసం చూపించవలసి ఉంటుంది. మీ బుద్ధిలోనైతే యథార్థమైన
జ్ఞానము ఉంది. మీరు చిత్రాలు లేకుండా కూడా అర్థం చేయించవచ్చు. మీ బుద్ధిలో 84 జన్మల
చక్రము ఉంది. చిత్రాల ద్వారా కేవలం సహజం చేసి అర్థం చేయించడం జరుగుతుంది, కానీ
వాస్తవానికి వీటి అవసరం లేదు. బుద్ధిలో ఇలా ఉంది - మొదట మేము సూర్యవంశానికి
చెందినవారిగా ఉండేవారము, ఆ తర్వాత చంద్రవంశానికి చెందినవారిగా అయ్యాము, అక్కడ చాలా
సుఖము ఉండేది, దానినే స్వర్గము అని అంటారు. ఇదంతా చిత్రాల ద్వారా అర్థం చేయించడం
జరుగుతుంది. అంతిమములో బుద్ధిలో ఉండే జ్ఞానము ఏమిటంటే - ఇప్పుడు మేము వెళ్తాము, ఆ
తర్వాత మళ్ళీ చక్రములో తిరుగుతాము. మనుష్యులకు సహజమవ్వాలి అని మెట్ల చిత్రముపై అర్థం
చేయించడం జరుగుతుంది. మనం మెట్లు ఎలా దిగుతాము, మళ్ళీ తండ్రి ఎక్కే కళలోకి ఎలా
తీసుకువెళ్తారు అని మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా కూడా ఉంది. తండ్రి అంటారు, నేను మీకు ఈ
చిత్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. ఇది 5000 సంవత్సరాల చక్రము అని సృష్టి చక్రము
యొక్క చిత్రము ద్వారా అర్థం చేయించవచ్చు. ఒకవేళ లక్షల సంవత్సరాలు అయినట్లయితే సంఖ్య
ఎంతగా పెరిగిపోయుండేది. క్రిస్టియన్లు వచ్చి రెండు వేల సంవత్సరాలు అయినట్లుగా
చూపిస్తారు. ఈ రెండు వేల సంవత్సరాలలో ఎంత ఎక్కువ జనాభా ఉంటారు, అలాగే అయిదు వేల
సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు ఉంటారు - ఈ లెక్క అంతటినీ మీరు తెలియజేస్తారు.
సత్యయుగములో పవిత్రముగా ఉన్న కారణముగా తక్కువమంది మనుష్యులే ఉంటారు. ఇప్పుడైతే
ఎంతోమంది ఉన్నారు. లక్షల సంవత్సరాల ఆయువు ఉన్నట్లయితే ఇక సంఖ్య కూడా లెక్కలేనంతగా
ఉండాలి. క్రిస్టియన్లతో పోలుస్తూ జనాభా లెక్కలను తీస్తారు కదా. హిందువుల జనాభాను
తక్కువగా చూపిస్తారు. క్రిస్టియన్లుగా ఎంతోమంది అయిపోయారు. మంచి తెలివైన
పిల్లలెవరైతే ఉంటారో, వారు చిత్రాలు లేకుండా కూడా అర్థం చేయించగలుగుతారు. ఆలోచించండి,
ఈ సమయములో ఎంత ఎక్కువ మంది మనుష్యులు ఉన్నారు. కొత్త ప్రపంచములో ఎంత తక్కువమంది
మనుష్యులు ఉంటారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము, ఇందులో ఎంతోమంది మనుష్యులు ఉన్నారు.
మరి కొత్త ప్రపంచము ఎలా స్థాపన అవుతుంది, ఎవరు స్థాపన చేస్తారు? ఇదంతా తండ్రియే
అర్థం చేయిస్తారు. వారే జ్ఞానసాగరుడు. పిల్లలైన మీరు కేవలం ఈ 84 జన్మల చక్రమునే
బుద్ధిలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనము నరకము నుండి స్వర్గములోకి వెళ్తున్నాము, కావున
లోలోపల సంతోషము ఉంటుంది కదా. సత్యయుగములో దుఃఖము కలిగించే విషయమేదీ ఉండదు. అక్కడ
పురుషార్థము చేసి ప్రాప్తి చేసుకునేందుకు అసలు అప్రాప్తి అనే వస్తువే ఏదీ ఉండదు. ఈ
మిషన్ కావాలి, ఇది కావాలి, అది కావాలి... అని ఇక్కడ పురుషార్థము చేయవలసి ఉంటుంది.
అక్కడైతే అన్ని సుఖాలు ఉంటాయి. ఉదాహరణకు మహారాజుల వద్ద అన్ని సుఖాలు హాజరై ఉంటాయి.
పేదవారి వద్దనైతే అన్ని సుఖాలు ఉండవు. కానీ ఇది కలియుగము కావున రోగాలు మొదలైనవన్నీ
ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకని పురుషార్థము చేస్తారు.
స్వర్గము, నరకము, ఇక్కడే ఉంటాయి.
ఈ సూక్ష్మవతనము యొక్క గమ్మత్తు అంతా కాలక్షేపం చేసేందుకే ఉంది. ఎప్పటివరకైతే
కర్మాతీత అవస్థ తయారవ్వదో, అప్పటివరకూ కాలక్షేపం చేసేందుకు ఇవి ఆటపాటల వంటివి.
కర్మాతీత అవస్థకు చేరుకుంటే ఇక ఇవన్నీ ఆగిపోతాయి. అప్పుడిక మీకు ఇదే గుర్తుంటుంది -
ఆత్మనైన నేను ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేసాను, ఇప్పుడు ఇక నేను ఇంటికి వెళ్తాను, ఆ
తర్వాత వచ్చి సతోప్రధాన ప్రపంచములో సతోప్రధానమైన పాత్రను అభినయిస్తాను. ఈ జ్ఞానాన్ని
బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నారు, ఇందులో చిత్రాలు మొదలైనవాటి అవసరం లేదు.
బ్యారిస్టరుగా అవ్వడానికి చదివేవారు ఎంతగా చదువుతారు, కానీ బ్యారిస్టరుగా అయిన
తర్వాత ఇక ఏ పాఠాలైతే చదివారో, అవన్నీ సమాప్తమైపోతాయి, ప్రారబ్ధము అనే రిజల్టు
వెలువడుతుంది. అలాగే మీరు కూడా ఇక్కడ చదువుకుని వెళ్ళి అక్కడ రాజ్యము చేస్తారు.
అక్కడ జ్ఞానము యొక్క అవసరముండదు. ఈ చిత్రాలలో కూడా తప్పొప్పులు ఏమేమి ఉన్నాయి అనేది
ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. లక్ష్మీ-నారాయణులు ఎవరు, ఈ విష్ణువు ఎవరు అనేది తండ్రి
కూర్చుని అర్థం చేయిస్తున్నారు. విష్ణువు చిత్రము చూసి మనుష్యులు తికమకపడతారు. ఏమీ
అర్థం చేసుకోకుండా పూజించడమంటే అది వృధా అవుతుంది. ఏమీ అర్థం చేసుకోరు. ఏ విధంగా
విష్ణువును అర్థం చేసుకోరో, అలా లక్ష్మీ-నారాయణులను కూడా అర్థం చేసుకోరు, అలాగే
బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా అర్థం చేసుకోరు. బ్రహ్మా అయితే ఇక్కడ ఉన్నారు, వీరు
పవిత్రముగా అయి వదిలి వెళ్ళిపోతారు. ఈ పాత ప్రపంచము పట్ల వైరాగ్యము ఉంది. ఇక్కడి
కర్మబంధనాలు దుఃఖమును ఇచ్చేవి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీ ఇంటికి పదండి. అక్కడ
దుఃఖము యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. మొదట మీరు మీ ఇంటిలో ఉండేవారు, ఆ తర్వాత
రాజధానిలోకి వచ్చారు, ఇప్పుడు తండ్రి మళ్ళీ పావనంగా తయారుచేయడానికి వచ్చారు. ఈ
సమయములో మనుష్యుల ఆహార-పానీయాలు మొదలైనవి ఎంత అశుద్ధముగా ఉన్నాయి. వారు ఏవేవో
వస్తువులను తింటూ ఉంటారు. అక్కడ దేవతలు ఇటువంటి అశుద్ధమైన వస్తువులను తినరు. భక్తి
మార్గము ఎలా ఉందో చూడండి, అక్కడ మనుష్యులను కూడా బలి ఇస్తుంటారు. తండ్రి అంటారు -
ఇది కూడా డ్రామాగా రచించబడి ఉంది. పాత ప్రపంచము నుండి మళ్ళీ కొత్త ప్రపంచముగా
తయారవ్వనున్నది. మనము సతోప్రధానముగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఇదైతే బుద్ధి
అర్థం చేసుకుంటుంది కదా. ఇందులోనైతే చిత్రాలు లేకపోతే ఇంకా మంచిది. లేదంటే మనుష్యులు
ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు. తండ్రి 84 జన్మల చక్రాన్ని గురించి అర్థం చేయించారు.
మనము ఈ విధంగా సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా అవుతాము, ఇన్ని
జన్మలు తీసుకుంటాము. ఈ విషయాన్ని బుద్ధిలో ఉంచుకోవలసి ఉంటుంది. పిల్లలైన మీరు
సూక్ష్మవతనము యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ధ్యానములో సూక్ష్మవతనములోకి
వెళ్తారు, కానీ అందులో యోగమూ లేదు, జ్ఞానమూ లేదు, అది కేవలం ఒక ఆచారము వంటిది.
ఆత్మను ఏ విధంగా పిలుస్తారు అనేది అర్థం చేయించడం జరుగుతుంది, ఆ ఆత్మ వచ్చినప్పుడు
ఏడుస్తుంది, నేను తండ్రి చెప్పినట్లు వినలేదే అని పశ్చాత్తాపపడుతుంది. ఇదంతా కూడా -
పురుషార్థములో నిమగ్నమైపోండి, నిర్లక్ష్యము చేయకండి అని పిల్లలకు అర్థం చేయించడం
కోసమే. పిల్లలు సదా అటెన్షన్ పెట్టాలి - మేము మా సమయాన్ని సఫలం చేసుకోవాలి, వృధా
చేయకూడదు అని. అప్పుడు మాయ మీ చేత నిర్లక్ష్యము చేయించలేకపోతుంది. బాబా కూడా అర్థం
చేయిస్తూ ఉంటారు - పిల్లలూ, సమయాన్ని వృధా చేసుకోకండి, అనేకులకు దారిని చూపించే
పురుషార్థము చేయండి, మహాదానులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు
వినాశనమవుతాయి. మీ వద్దకు ఎవరు వచ్చినా వారికి ఈ విషయాలను అర్థం చేయించండి మరియు 84
జన్మల చక్రము గురించి తెలియజేయండి. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి -
సారములో మొత్తము చక్రమంతా బుద్ధిలో ఉండాలి.
ఇప్పుడు మనం ఈ మురికి ప్రపంచము నుండి విముక్తులైపోతామని పిల్లలైన మీకు సంతోషము
ఉండాలి. స్వర్గము, నరకము ఇక్కడే ఉన్నాయని మనుష్యులు భావిస్తారు. ఎవరి వద్దనైతే ఎంతో
ధనముందో, వారు తాము స్వర్గములో ఉన్నామని భావిస్తారు. మంచి కర్మలు చేసారు కావున సుఖము
లభించింది. ఇప్పుడు మీరు చాలా మంచి కర్మలు చేస్తారు కావున 21 జన్మల కొరకు మీరు సుఖము
పొందుతారు. వారైతే ఒక్క జన్మ కొరకు తాము స్వర్గములో ఉన్నామని భావిస్తారు. తండ్రి
అంటారు, అది అల్పకాలిక సుఖము, మీది 21 జన్మల సుఖము. దీని కొరకు తండ్రి అంటారు,
అందరికీ దారిని తెలియజేస్తూ వెళ్ళండి. తండ్రి స్మృతి ద్వారానే నిరోగులుగా అవుతారు
మరియు స్వర్గానికి యజమానులుగా అవుతారు. స్వర్గములో రాజ్యము ఉంటుంది, దానిని కూడా
స్మృతి చేయండి. రాజ్యము ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఇది భారత్ కు సంబంధించిన
విషయమే, మిగిలినవన్నీ ఉపకథలు వంటివి. అంతిమములో అందరూ వెళ్ళిపోతారు, ఆ తర్వాత మనం
కొత్త ప్రపంచములోకి వస్తాము. ఇప్పుడు ఇది అర్థం చేయించేందుకు చిత్రాల అవసరం లేదు.
కేవలం అర్థం చేయించేందుకు మాత్రమే మూలవతనాన్ని, సూక్ష్మవతనాన్ని చూపిస్తారు. ఇవన్నీ
అర్థం చేయించడం జరుగుతుంది. ఇకపోతే భక్తి మార్గమువారు చిత్రాలు మొదలైనవాటిని
తయారుచేసారు, కావున మనం కూడా వాటిని సరిదిద్ది తయారుచేయవలసి ఉంటుంది, లేదంటే మీరు
నాస్తికులు అని వారు అంటారు, అందుకే వాటిని సరిదిద్ది తయారుచేయడం జరిగింది. బ్రహ్మా
ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము... వాస్తవానికి ఇది కూడా డ్రామాలో నిశ్చితమై
ఉంది. వాస్తవానికి ఎవరూ ఏమీ చేయరు. సైన్సువారు కూడా తమ బుద్ధితో ఇవన్నీ
తయారుచేస్తారు. బాంబులు తయారుచేయవద్దని ఎవరు ఎంత చెప్పినా కానీ, ఎవరి వద్దనైతే చాలా
ఎక్కువ బాంబులు ఉన్నాయో, వారు వాటిని సముద్రములో పడేసినట్లయితే ఇక ఇతరులెవ్వరూ
తయారుచేయరు. కానీ వారు ఉంచుకున్నారు కావున తప్పకుండా ఇతరులు కూడా తయారుచేస్తారు.
సృష్టి యొక్క వినాశనమైతే తప్పకుండా జరగవలసిందేనని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు.
యుద్ధము కూడా తప్పకుండా జరగనున్నది. వినాశనము అవుతుంది, ఆ తర్వాత మీరు మీ రాజ్యాన్ని
తీసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, అందరి కళ్యాణకారులుగా అవ్వండి.
పిల్లలు తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు తండ్రి శ్రీమతాన్ని
ఇస్తున్నారు - మధురమైన పిల్లలూ, మీ సర్వస్వాన్ని ఆ నాథుడి పేరు మీద సఫలం చేసుకోండి.
కొందరి ధనము మట్టిలో కూరుకుపోతుంది, కొందరిది రాజులు తింటారు. ఆ నాథుడు (తండ్రి)
స్వయంగా అంటున్నారు - పిల్లలూ, మీ ధనాన్ని ఇందులో ఖర్చు చేయండి, ఈ ఆత్మిక హాస్పిటల్
మరియు యూనివర్శిటీని తెరిచినట్లయితే అనేకుల కళ్యాణము జరుగుతుంది. ఆ నాథుడి పేరు మీద
మీరు ఖర్చు పెడతారు, దానికి ఫలితముగా 21 జన్మల కొరకు మీకు ప్రతిఫలము లభిస్తుంది. ఈ
ప్రపంచమే ఇక అంతము కానున్నది, అందుకే ఎంత వీలైతే అంత ఆ నాథుడి పేరు మీద సఫలం
చేసుకోండి. నాథుడు శివబాబాయే కదా. భక్తి మార్గములో కూడా ఆ నాథుడి పేరు మీద దానం
చేస్తుండేవారు. ఇప్పుడైతే వారు డైరెక్ట్ గా ఉన్నారు. ఆ నాథుడి పేరు మీద పెద్ద-పెద్ద
యూనివర్శిటీలు తెరుస్తూ వెళ్ళినట్లయితే దాని ద్వారా అనేకుల కళ్యాణము జరుగుతుంది, 21
జన్మల కొరకు రాజ్యభాగ్యాన్ని పొందుతారు, లేదంటే ఈ ధన-సంపదలన్నీ అంతమైపోతాయి. భక్తి
మార్గములో అంతమవ్వవు, కానీ ఇప్పుడు అంతమవ్వనున్నాయి. మీరు ఖర్చు పెట్టినట్లయితే మీకే
ప్రతిఫలము లభిస్తుంది. నాథుడి పేరు మీద అందరికీ కళ్యాణము చేసినట్లయితే 21 జన్మల
కొరకు వారసత్వము లభిస్తుంది. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు, ఇక ఎవరి
భాగ్యములో ఉంటే వారు ఖర్చు పెడుతూ ఉంటారు. తమ ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళించుకోవాలి.
ఇతని (బ్రహ్మా) పాత్ర కూడా ఈ విధంగా ఉంది. ఒక్కసారిగా పూర్తిగా నషా కలిగింది. బాబా
రాజ్యాన్నే ఇస్తుంటే ఇక నేను ఈ గాడిద చాకిరి ఏమి చేస్తాను అని అనుకున్నారు. మీరందరూ
రాజ్యాన్ని తీసుకునేందుకు కూర్చున్నారు కావున ఫాలో చేయండి కదా. ఇతను అన్నింటినీ ఎలా
వదిలేసారో మీకు తెలుసు కదా. ఓహో, రాజ్యము లభిస్తోంది అని నషా కలిగింది. వారికి
భగవంతుడు లభించేసరికి వ్యాపారములోని భాగస్వామికి కూడా రాజ్యాన్ని ఇచ్చేసారు. ఇతని
వద్ద రాజ్యము వంటి సంపద ఉండేది, తక్కువేమీ లేదు, చాలా లాభదాయకమైన వ్యాపారముండేది.
ఇప్పుడు మీకు ఈ రాజ్యము లభిస్తోంది కావున అనేకుల కళ్యాణము చేయండి. మొదట భట్టీ
తయారైంది, అందులో కొందరు పరిపక్వముగా తయారయ్యారు, మరికొందరు అపరిపక్వముగానే
ఉండిపోయారు. ప్రభుత్వము నోట్లు ముద్రిస్తుంది కదా, అవి బాగా తయారవ్వకపోతే ప్రభుత్వము
వాటిని కాల్చేయవలసి ఉంటుంది. పూర్వము అయితే వెండి రూపాయలు ఉండేవి. బంగారము మరియు
వెండి చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఏమవుతోంది. కొందరి ధనాన్ని రాజులు తింటారు,
కొందరిది దొంగలు తింటారు. దోపిడీలు కూడా ఎన్ని జరుగుతుంటాయో చూడండి. కరువు కూడా
ఏర్పడుతుంది. ఈ ప్రపంచమే ఒక రావణ రాజ్యము. రామ రాజ్యము అని సత్యయుగాన్ని అంటారు.
తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఎంతో ఉన్నతముగా తయారుచేస్తే, మీరు మళ్ళీ నిరుపేదలుగా
ఎలా తయారయ్యారు! ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో జ్ఞానము లభించింది కావున సంతోషము ఉండాలి.
రోజురోజుకు సంతోషము పెరుగుతూ ఉంటుంది. యాత్రలో గమ్యస్థానానికి ఎంత దగ్గరవుతుంటే అంత
సంతోషము కలుగుతుంది. శాంతిధామము, సుఖధామము మీ ఎదురుగా నిలబడి ఉన్నాయని మీకు తెలుసు.
వైకుంఠపు వృక్షాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మీరు అక్కడికి ఇంచుమించు
చేరుకున్నట్లే. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.