01-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మొత్తం ప్రపంచమంతటకీ శాంతినివ్వడము ఒక్క తండ్రి పని మాత్రమే, అందుకే వారిని ఓ శాంతి దేవా, అని అంటారు, కనుక ప్రైజ్ (శాంతి పురస్కారము) కూడా తండ్రికే లభించాలి’’

ప్రశ్న:-
ఏ పిల్లలు తండ్రిని పూర్తిగా ఫాలో చేయగలరు?

జవాబు:-
ఎవరైతే తండ్రి సమానముగా పావనముగా అవుతారో - వారే పూర్తిగా ఫాలో చేయగలరు. 2. ఎవరైతే పక్కా ప్రేయసులుగా అయ్యారో, వారే ప్రియుడినైన నన్ను ఫాలో చేయగలరు. అటువంటి ప్రేయసులనే నేను నాతో పాటు తీసుకువెళ్తాను. అందుకే శాస్త్రాలలో - ఆవు తోకను పట్టుకుంటే ఆవలి తీరానికి వెళ్ళగలరని చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆవు విషయము గాని, తోక విషయము గాని లేదు.

పాట:-
నీవు ప్రేమ సాగరుడవు...

ఓంశాంతి
బాప్ దాదా ఇరువురూ ఉన్నారు కదా. ఆత్మల తండ్రి శివబాబా అనైతే ఇప్పుడు పిల్లలకు తెలుసు. నేను పతిత-పావనుడిని, నేను నిరాకారుడిని అని కూడా మీకు తెలుసు. మీరు కూడా నిరాకారియే, శాంత స్వరూపులే. నిరాకార తండ్రి కూడా శాంత స్వరూపుడే, ఆత్మ కూడా శాంత స్వరూపమే. ఆత్మ స్వధర్మమే శాంతి. మీ నివాస స్థానము శాంతిధామము. యజ్ఞాలు మొదలైనవి రచించినప్పుడు శాంతిదేవా అని అంటారు, ఎందుకంటే శాంతి సాగరుడు ఆ పరమాత్మయే. మొత్తం ప్రపంచానికి శాంతిని ఇచ్చేవారు ఆ తండ్రియే. శాంతి విషయములో పురస్కారాలు అందుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా ఎవరికైనా పురస్కారము లభించినప్పుడు, వీరు శాంతి స్థాపన చేయడానికి నిమిత్తులయ్యారని అంటారు. ఇందులో పెద్ద-పెద్ద వారి పేర్లు తీసుకుంటారు. ఇప్పుడు శాంతి అనేది మొత్తం ప్రపంచానికి కావాలి. లేదంటే అశాంతిగా ఉండేవారు, ఇతరులను కూడా అశాంతిగా చేస్తారు. ఇది ఉన్నదే రావణ రాజ్యము. రావణుడు శత్రువు కదా, రాముడిని శత్రువు అని అనరు. రాముని చిత్రాన్ని ఎప్పుడూ కాల్చరు. త్రేతాయుగపు రాముని చిత్రాన్ని గాని, పరమపిత పరమాత్ముని చిత్రాన్ని గాని కాల్చరు. రామ రాజ్యాన్ని అయితే అందరూ కోరుకుంటారు, కానీ రామ రాజ్యమని దేనినంటారు, ఇది కూడా ఎవరికీ తెలియదు. కేవలం కొత్త ప్రపంచము ఉండాలని, కొత్త ఢిల్లీలో రామ రాజ్యము ఉండాలని అంటూ ఉంటారు. కొత్త ఢిల్లీ అని అంటారు, దానికి పేర్లు అయితే చాలా పెడుతూ ఉంటారు. ఢిల్లీ అన్నింటికీ రాజధానిగా ఉంటుంది. ఢిల్లీయే పరిస్తాన్ గా ఉండేది. రాధా-కృష్ణులను కూడా అక్కడే ఉన్నట్లుగా చూపిస్తారు. వీరిరువురే ముఖ్యమైన రాకుమారుడు మరియు రాకుమారి. కేవలం వీరిరువురే ఉండరు, తప్పకుండా వేరేవారు కూడా ఉంటారు. 8 రాజ్యాలు గాయనము చేయబడతాయి, బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. సత్యయుగములో తప్పకుండా వేరే రాజ్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఎన్ని రాజ్యాలు ఉన్నాయో చూడండి, వృద్ధి చెందుతూ-చెందుతూ అనేక రాజ్యాలు తయారవుతాయి. ఫలానా గ్రామానికి మహారాజు అని అంటారు, చిన్న-చిన్న గ్రామాలు కూడా చాలా ఉన్నాయి కదా. సత్యయుగములో ఇన్ని ఉండవు. అక్కడైతే లక్ష్మీ-నారాయణుల పేరే ప్రసిద్ధమైనది. 2500 సంవత్సరాలు వారి రాజ్యము నడిచింది. లక్షల సంవత్సరాలయ్యిందని మనుష్యులు అంటారు, ఇది ఆలోచించవలసిన విషయము. ఈ విషయాలు ఆత్మలకు భోజనము వంటివి. తండ్రి ఆత్మలైన మీకు, మీ బుద్ధికి ఈ ఆత్మిక భోజనాన్ని ఇస్తారు.

ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని ఋషులు, మునులు మొదలైనవారంతా అనేవారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఇలా అనరు. మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. మీరు మీ 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నారు. ఆదిలో దేవీ-దేవతలైన మీరు ఉండేవారు, మధ్యలో రావణుడు ప్రవేశించడముతో వికారులుగా అయిపోయారు. ఇప్పుడిది అంతిమము. ఇప్పుడు పాత ప్రపంచము వినాశనమై, మళ్ళీ ఆది నుండి మొదలవుతుందని మీకు తెలుసు. ఆదిలో రామ రాజ్యము ఉంటుంది. మధ్యలో రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ఇప్పుడు రావణ రాజ్యము పూర్తి అయ్యి, మళ్ళీ రామ రాజ్యము ప్రారంభమవుతుంది. నరుని నుండి నారాయణునిగా అవ్వాలి కదా. ఇది సత్య నారాయణుని కథ. సర్వ శాస్త్రమయీ శిరోమణి శ్రీమత్ గీత అని మీకు తెలుసు. శ్రేష్ఠముగా తయారయ్యేందుకే శ్రీమతము లభిస్తుంది. శ్రీ అని శ్రేష్ఠమైనవారినే అంటారు. ఒక్క గీతా శాస్త్రాన్ని మాత్రమే, దేవీ-దేవతా ధర్మ శాస్త్రమని అంటారని పిల్లలకు తెలుసు, దీని ద్వారా సంగమములో దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. సత్యయుగములోనైతే పావనముగా తయారుచేయడానికి ఎవరూ పతితులుగా ఉండరు. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - గీతను పతిత-పావని అని అనలేము. గీత ద్వారా పావనముగా అవ్వలేరు. గీతా భగవానుడిని పతిత-పావనుడని అంటారు. దీనిని మంచి రీతిలో గుర్తుంచుకోండి. గీత ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ శాస్త్రము. గీతా సమయములోనే మహాభారీ మహాభారత యుద్ధము కూడా జరిగింది, దానితో అనేక ధర్మాల వినాశనము జరిగింది మరియు ఏక ధర్మ స్థాపన జరిగింది. దేవీ-దేవతా ధర్మ శాస్త్రమని గీత గురించే అంటారు. దానిని బ్రాహ్మణుల శాస్త్రమని అనరు. బ్రాహ్మణుల పేరు గీతలో లేనే లేదు. పరమపిత పరమాత్మయే వచ్చి బ్రహ్మా ద్వారా ఈ వేద-శాస్త్రాలు మొదలైనవాటన్నింటి సారాన్ని తెలియజేస్తారు. సత్యయుగములోనైతే బ్రాహ్మణులుండరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ లక్ష్మీ-నారాయణులు, దేవతలు ఉంటారు. బ్రహ్మా తర్వాత విష్ణువు ఉంటారు. బ్రహ్మా ద్వారా విష్ణుపురి స్థాపన అని చిత్రాలలో కూడా చూపించారు. బ్రహ్మా మరియు విష్ణువులు ఒకే సమయములో కలిసి ఉండరు. బ్రహ్మా ద్వారా దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఇవి విస్తారముగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీరు శివబాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు హక్కుదారులు కదా! ముఖ్యమైన ధర్మ శాస్త్రాలు నాలుగు, శ్రీమద్భగవద్గీత నంబర్ వన్ శాస్త్రము, దాని ద్వారా నంబర్ వన్ ధర్మము యొక్క స్థాపన జరుగుతుంది. ఆ తర్వాత ఇస్లాములు, బౌద్ధులు వస్తారు. ఒక్క గీతలో మాత్రమే శ్రీమత్ భగవద్గీత అని వ్రాయబడి ఉంది, ఇంకే శాస్త్రాలలోనూ శ్రీమతము లేదు. శ్రీమత్ ఇస్లామీ లేక శ్రీమత్ బౌద్ధీ అనే శాస్త్రాలేవీ లేవు. శ్రీమత్ భగవద్గీత ఒక్కటే. దీని ద్వారా ఏ ధర్మాన్ని స్థాపన చేసారు? ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన ఇదివరకు జరిగింది మరియు మళ్ళీ అంతిమములో జరుగుతుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు.

ఇప్పుడు బాబా మనల్ని టీచరు రూపములో చదివిస్తున్నారు - ఇది బుద్ధిలో ఉండాలి. బాబా మన తండ్రి కూడా మరియు టీచరు కూడా. బాబా చదువు ద్వారా సర్వుల సద్గతి చేస్తారు కనుక వారు సద్గురువు కూడా. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు గీతలో శ్రీకృష్ణుని పేరును వేసేసారు. వారేమీ జ్ఞాన సాగరుడు కాదు. జ్ఞాన సాగరుడైన తండ్రి వారిని అలా తయారుచేసారు కనుక బాబా టీచరుగా కూడా అయినట్లు. ఇక్కడ మీరు కొత్త విషయాలను వింటారు, శాస్త్రాలు మొదలైనవైతే చాలా చదువుతూ, వింటూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా డైరెక్టుగా వింటారు. ఇంతకుముందు అందరూ శరీరధారీ మనుష్యుల ద్వారా విన్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - వాస్తవానికి ఆత్మలమైన మనము అశరీరిగా ఉండేవారము, తర్వాత శరీరాన్ని ధరించాము. బాబా కూడా అశరీరియే. శివలింగాన్ని తయారుచేస్తారు కదా. ఆత్మ శరీరము ద్వారా వారిని పూజిస్తుంది. ఓ పరమపిత పరమాత్మ, మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనముగా చేయండి అని పిలుస్తారు కూడా. లింగాన్ని పూజిస్తారు కానీ మేము ఎవరినైతే పిలుస్తున్నామో, వారు పతిత-పావనుడైన తండ్రి అని అర్థం చేసుకోరు. శివుడు భగవంతుడు, ఈశ్వరుడు అని కేవలం ఇలా అనుకుంటూ స్మృతి చేస్తారు. వారిని తండ్రి అని అంటున్నప్పుడు, మరి తండ్రి నుండి వారసత్వము లభించాలి కదా అని బుద్ధిలోకి రావాలి. మనకు వారసత్వము లభించింది, అందుకే మనము పూజిస్తాము. భారతవాసులకు వారసత్వము తప్పకుండా లభించింది కానీ ఎప్పుడు లభించింది అనేది మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మేము బాబా వద్దకు వచ్చామని పిల్లలంటారు. శివబాబా బ్రహ్మా తనువులోకి వచ్చి అర్థం చేయిస్తారు. త్రిమూర్తి అనే పేరు ప్రసిద్ధమైనది. త్రిమూర్తి మార్గమనే పేరు కూడా పెట్టారు. తండ్రి మహిమ చాలా ఉంది. ప్రేమ సాగరుడు... అని పాటలో కూడా విన్నాము. వారు సర్వుల సద్గతిదాత, సర్వులకు సుఖ-శాంతులను ఇచ్చేవారు, సర్వుల దుఃఖహర్త-సుఖకర్త. వారు చాలా ప్రియమైనవారు కదా. వారి కన్నా ప్రియమైన వస్తువు మరేదీ ఉండదు. ఏ తండ్రి అయితే స్వర్గానికి యజమానులుగా తయారుచేసారో, వారు తప్పకుండా ప్రియముగా ఉంటారు కదా. వారు అనంతమైన తండ్రి. వారు అంటారు - పిల్లలూ, నా నుండి స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది కదా. ఆత్మలైన మీరు పరస్పరములో సోదరులు. ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని ఆత్మలందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు ఆత్మ అంటుంది, బాబా పావనముగా తయారుచేయడానికి వచ్చి ఉన్నారు. బాబా అంటారు - పిల్లలూ, 5 వేల సంవత్సరాల క్రితం మిమ్మల్ని పావనముగా తయారుచేయడానికి వచ్చాను. ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. ఓ పతిత-పావనా, రండి అని పిలుస్తారు కూడా మరియు పతిత-పావన సీతా-రామా... అని భజన చేస్తూ, మొరపెట్టుకుంటూ ఉంటారు. అంటే స్వయం పతితముగా ఉన్నారనే కదా. ఇది ఉన్నదే నరకము, దీనిని రౌరవ నరకమని అంటారు. ఇది చేయడము వలన ఇలా అవుతారు, ఇలా జరుగుతుంది... అని గరుడ పురాణములోనైతే భయం పుట్టించే విషయాలను వ్రాసారు. ఇంకా, ఆవు తోక పట్టుకుంటే స్వర్గములోకి వెళ్ళిపోతారని అంటారు. ఇలాంటివేవో వ్రాసి ఉన్నాయి. ఇప్పుడిది జంతువు విషయమేమీ కాదు. మీరు గోమాతలు కదా. ఎప్పటివరకైతే ఎవరైనా మీ తోకను అనగా మిమ్మల్ని పట్టుకోరో, అప్పటివరకు వారికి మార్గము లభించదు. ఇక్కడ తోకేమీ లేదు. మీ తోక పట్టుకుని దాటేస్తామని అంటూ ఉంటారు. ఇప్పుడిక్కడ తోక పట్టుకోవాలని కాదు, కానీ ఫాలో చేయాలి. సన్యాసుల ఫాలోవర్స్ అయితే చాలామంది ఉన్నారు కానీ ఫాలో చేయడము అనగా పవిత్రముగా అవ్వడము. మీరైతే సత్యాతి-సత్యమైన ఫాలోవర్స్. శివబాబా అంటారు - నేను మిమ్మల్నందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. పావనముగా అవ్వకుండా ఫాలో చేయలేరు. శివబాబాను పూర్తిగా ఫాలో చేయాలి. ఫాలో చేయడానికే మీరు ఇక్కడ కూర్చున్నారు. భక్తి మార్గములో కూడా నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మలు ప్రేయసులని, పరమాత్మ ప్రియుడని మీకు తెలుసు. ఆత్మలు వారిని తలచుకుంటారు మరియు వారు తీసుకువెళ్ళడానికి వచ్చారు. వారు అంటారు - నన్ను ఫాలో చేసినట్లయితే మిమ్మల్ని నాతోపాటు తీసుకువెళ్తాను. ఎలా ఫాలో చేయాలి అనేది కూడా అర్థం చేయిస్తారు. నేను పావనుడిని, మీరు పతితులు కనుక తప్పకుండా పావనముగా అవ్వాల్సి ఉంటుంది, తప్పకుండా ఫాలో చేయాల్సి ఉంటుంది. వికారులైతే ఫాలో చేయలేరు. ఫాలో చేయడానికి నా సమానముగా పవిత్రముగా అవ్వండి. నేను పతితులను నాతోపాటు శాంతిధామానికి తీసుకువెళ్తానా ఏమిటి. ముక్తిని పొందేందుకని ఇంతమంది మనుష్యులందరూ భక్తి, తపస్య, దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తారు, ఎందుకంటే ఇక్కడ దుఃఖముంది. మేము మా ఇంటికి తిరిగి వెళ్ళాలి - అని కోరుకుంటారు. తండ్రి అంటారు - పవిత్రముగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. నేను పావనుడిని కావుననే మిమ్మల్ని పావనముగా చేస్తాను. నేను రావడము కూడా బ్రహ్మా తనువులోకి వస్తాను. నేను రచయితను, నేను ఈ బ్రహ్మా తనువులోకి వస్తాను. బ్రహ్మా ద్వారా తండ్రి దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని చూపిస్తారు కూడా. శివబాబాను ఫాలో చేయాలని బి.కె.లైన మీకే తెలుసు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మిమ్మల్ని పావన ప్రపంచములోకి తీసుకువెళ్తాను. ఇంకే ఉపాయము లేదు. పతిత-పావనా... అని అంటారు, అప్పుడు దృష్టి పైకి వెళ్తుంది లేదా నీటి వైపుకు చూస్తారు. గంగ అయితే పతిత-పావని కాదు. అవన్నీ సాగరము నుండి వెలువడిన నదులు. ఇప్పుడు తోకైతే మీది పట్టుకోవాలి.

తండ్రి అంటారు - మీరు పావనముగా అవ్వాలి, నన్ను ఫాలో చేయాలి, అప్పుడే నాతోపాటు రాగలరు. తండ్రి అంటారు - మీరు నాతోపాటే ఉండేవారు, ఇప్పుడు 84 జన్మల చక్రములో తిరిగి పతితముగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అవుతారు. సన్యాసులు కూడా గృహస్థులతో అంటారు - మమ్మల్ని ఫాలో చేయాలంటే ఇళ్ళు-వాకిళ్ళను వదలండి అని. తండ్రి అంటారు - నేను పరంధామములో ఉంటాను, మరి మీరు కూడా వస్తారా లేక ఇక్కడే విషయ సాగరములో ఉండటము బాగా అనిపిస్తుందా. ఓ పతిత-పావనా, రండి అని మీరైతే పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, వారు తమతో పాటు తీసుకువెళ్తారు. కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని నాతోపాటు తీసుకువెళ్తాను. తర్వాత సత్యయుగములో మీరు చాలా సుఖమయముగా ఉంటారు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. వీరికి ఇంతటి సుఖాన్ని ఇచ్చినవారు ఎవరు? హెవెన్లీ గాడ్ ఫాదర్. తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు - మీరు నా జయంతిని జరుపుకుంటారు. పరమపిత పరమాత్ముని జయంతిని భారతవాసులందరూ జరుపుకుంటారు. ఇది నా జన్మ స్థలము. క్రిస్టియన్లు నమ్మరు. వారు క్రైస్టును నమ్ముతారు. శివజయంతిని భారతవాసులే జరుపుకుంటారు. ఇది సర్వుల పతిత-పావనుడైన తండ్రి యొక్క జన్మ స్థలము. తండ్రి అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. వారు సర్వులకు విముక్తిని ఇచ్చేవారు. కనుక భారత్ ఎంత ఉన్నతమైనది.

డ్రామానుసారముగా నా పిల్లలు చాలా దుఃఖితులైనప్పుడు, నేను వారసత్వాన్ని ఇవ్వడానికి వస్తాను అని తండ్రికి తెలుసు. తండ్రి జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు... వారు పిల్లలకు వారసత్వాన్ని ఇస్తున్నారు. వారు అంటారు - నన్ను ఫాలో చేయండి. ఆత్మలమైన మనము వికారులమని మీకు తెలుసు, అందుకే శరీరము కూడా వికారీదే ఉంది. సత్యయుగములో ఆత్మ పవిత్రముగా ఉంటుంది కనుక శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, పావనముగా అవ్వండి. స్మృతితోనే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు, ఆత్మలమైన మేము పరస్పరములో సోదరులము అనేది పక్కా చేసుకోవాలి. చాలా ప్రేమగా ఉండాలి. తండ్రి ఎలాగైతే ప్రియాతి ప్రియమైనవారో, అలా ప్రియమైనవారిగా అవ్వాలి.

2. తండ్రి సమానముగా పావనముగా అయి, తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. తండ్రితో పాటు ఇల్లు అయిన శాంతిధామానికి తిరిగి వెళ్ళేందుకు పావనముగా తప్పకుండా అవ్వాలి.

వరదానము:-
నిర్బల ఆత్మలలో శక్తుల ఫోర్సును నింపే జ్ఞానదాత, వరదాత భవ

వర్తమాన సమయములో నిర్బల ఆత్మలలో జంప్ చేయగలిగే అంతటి శక్తి లేదు, వారికి ఎక్స్ ట్రా ఫోర్స్ కావాలి, కావున విశేష ఆత్మలైన మీరు స్వయములో విశేషమైన శక్తిని నింపుకుని వారి చేత హైజంప్ చేయించాలి. దీని కొరకు జ్ఞానదాతగా అవ్వడముతోపాటుగా శక్తుల వరదాతగా కూడా అవ్వండి. రచయిత ప్రభావము రచనపై పడుతుంది, అందుకే వరదానులుగా అయి మీ రచనకు సర్వ శక్తుల వరదానాలను ఇవ్వండి, ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరమే ఉంది.

స్లోగన్:-
సాక్షీగా అయి ప్రతి ఆటను చూసినట్లయితే సురక్షితముగానూ ఉంటారు మరియు మజా కూడా వస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

మహా తపస్వీ ఆత్మలైన మీరు జ్వాలా రూప శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తి కిరణాలను అనుభూతి చేయండి మరియు ఇతరులకు అనుభూతి చేయించండి. మీ తపస్వీ స్వరూపము ఇతరులకు ఇచ్చే స్వరూపము. ఎలా అయితే సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తాడో మరియు అనేక వినాశీ ప్రాప్తుల అనుభూతిని చేయిస్తాడో, అలా మీరు కూడా మీ తపస్వీ స్వరూపము ద్వారా శాంతి మరియు శక్తి కిరణాలను ఇస్తూ ఉండండి.