01-08-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు పవిత్రముగా అవ్వకుండా తిరిగి
ఇంటికి వెళ్ళలేరు, అందుకే తండ్రి స్మృతి ద్వారా ఆత్మ యొక్క బ్యాటరీని ఛార్జ్
చేసుకోండి మరియు సహజముగా పవిత్రముగా అవ్వండి’’
ప్రశ్న:-
బాబా
పిల్లలైన మీకు ఇంటికి వెళ్ళే కంటే ముందు ఏ విషయాన్ని నేర్పిస్తారు?
జవాబు:-
పిల్లలూ,
ఇంటికి వెళ్ళే కంటే ముందు జీవిస్తూనే మరణించాలి, అందుకే బాబా మీకు మొదటి నుండే దేహ
భానము నుండి అతీతముగా వెళ్ళే అభ్యాసము చేయిస్తారు అనగా మరణించడమును నేర్పిస్తారు.
పైకి వెళ్ళడము అనగా మరణించడము. వెళ్ళడము మరియు రావడము యొక్క జ్ఞానము ఇప్పుడు మీకు
లభించింది. మీకు తెలుసు, ఆత్మలమైన మనము ఈ శరీరము ద్వారా పాత్రను అభినయించడానికి పై
నుండి వచ్చాము. వాస్తవానికి మనం అక్కడి నివాసులము, ఇప్పుడు అక్కడికే తిరిగి వెళ్ళాలి.
ఓంశాంతి
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడంలో ఎటువంటి కష్టమూ లేదు. ఇందులో
గుటకలు మింగకూడదు, తికమకపడకూడదు. దీనిని సహజ స్మృతి అని అంటారు. మొట్టమొదట స్వయాన్ని
ఆత్మగానే భావించాలి. ఆత్మయే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది.
సంస్కారాలన్నీ కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ అయితే స్వతంత్రమైనది. తండ్రి అంటారు,
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఈ జ్ఞానము ఇప్పుడే మీకు
లభిస్తుంది, ఇది మళ్ళీ లభించదు. మీరు ఇక్కడ ఇలా శాంతిలో కూర్చోవడము గురించి
ప్రపంచానికి తెలియదు, దీనిని సహజమైన శాంతి అని అంటారు. ఆత్మయైన మనం ఈ శరీరము ద్వారా
పాత్రను అభినయించడానికి పై నుండి వచ్చాము. ఆత్మయైన మనం వాస్తవానికి అక్కడి నివాసులము.
బుద్ధిలో ఈ జ్ఞానముంది. అంతేకానీ ఇందులో హఠయోగము యొక్క విషయమేమీ లేదు, ఇది చాలా
సహజమైనది. ఇప్పుడు ఆత్మలమైన మనం ఇంటికి వెళ్ళాలి కానీ పవిత్రముగా అవ్వకుండా
వెళ్ళలేము. పవిత్రముగా అయ్యేందుకు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి
చేస్తూ-చేస్తూ పాపాలు అంతమవుతాయి. ఇందులో కష్టముతో కూడిన విషయమేదీ లేదు. మీరు
వాకింగ్ కు వెళ్ళినప్పుడు తండ్రి స్మృతిలో ఉండండి. ఇప్పుడే స్మృతి ద్వారా పవిత్రముగా
అవ్వగలుగుతారు. అక్కడ అది పవిత్ర ప్రపంచము. అక్కడ ఆ పావన ప్రపంచములో ఈ జ్ఞానము
యొక్క అవసరమేమీ ఉండదు ఎందుకంటే అక్కడ వికర్మలు ఏవీ జరగవు. ఇక్కడ స్మృతి ద్వారా
వికర్మలను వినాశనం చేసుకోవాలి. అక్కడైతే మీరు సహజముగా ఇక్కడ నడుస్తున్నట్లుగానే
నడుస్తారు. ఆ తర్వాత కొద్ది-కొద్దిగా కిందకు దిగుతారు. అలాగని అక్కడ కూడా మీరు ఇది
అభ్యాసం చేయాలని కాదు. అభ్యాసమును ఇప్పుడే చేయాలి. బ్యాటరీని ఇప్పుడే ఛార్జ్ చేయాలి,
ఆ తర్వాత మెల్లమెల్లగా బ్యాటరీ డిస్ఛార్జ్ అవ్వవలసిందే. బ్యాటరీ ఛార్జ్ అవ్వడము
గురించిన జ్ఞానము ఇప్పుడు మీకు ఒకసారే లభిస్తుంది. సతోప్రధానము నుండి తమోప్రధానముగా
అవ్వడములో మీకు ఎంత సమయం పడుతుంది. మొదటి నుండి బ్యాటరీ ఎంతోకొంత తగ్గుతూనే ఉంటుంది.
మూలవతనములోనైతే ఆత్మలే ఉంటాయి, శరీరాలైతే ఉండవు. కావున న్యాచురల్ గా దిగడము అనగా
బ్యాటరీ తగ్గడము అనే విషయమే ఉండదు. మోటార్ ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడే బ్యాటరీ
తగ్గుతూ ఉంటుంది. మోటార్ నిలబడి ఉంటే బ్యాటరీ నడవదు. మోటార్ ఎప్పుడైతే నడుస్తుందో
అప్పుడే బ్యాటరీ పని చేస్తుంది. మోటార్ లోని బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది
కానీ మీ బ్యాటరీ అయితే ఒకేసారి ఈ సమయములో ఛార్జ్ అవుతుంది. మళ్ళీ మీరు ఎప్పుడైతే
ఇక్కడ శరీరము ద్వారా కర్మలు చేస్తారో అప్పుడు బ్యాటరీ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది.
వారు సుప్రీమ్ తండ్రి అని, వారినే ఆత్మలందరూ తలచుకుంటారని మొదట అర్థం చేయించాలి. ఓ
భగవంతుడా అని అంటారు, వారు తండ్రి, మనం పిల్లలము. ఇక్కడ పిల్లలైన మీకు బ్యాటరీని ఎలా
ఛార్జ్ చేసుకోవాలో అర్థం చేయించడం జరుగుతుంది. తిరగండి, విహరించండి కానీ తండ్రిని
స్మృతి చేయండి, అప్పుడు సతోప్రధానులుగా అయిపోతారు. ఏదైనా విషయం అర్థం కాకపోతే
అడగవచ్చు. ఇది చాలా సహజమైనది. 5000 సంవత్సరాల తర్వాత మన బ్యాటరీ డిస్ఛార్జ్ అవుతుంది.
తండ్రి వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేస్తారు. వినాశన సమయములో అందరూ ఈశ్వరుడిని
తలచుకుంటారు. వరదలు వచ్చాయనుకోండి, అప్పుడు కూడా భక్తులు ఎవరైతే ఉంటారో వారు
భగవంతుడినే తలచుకుంటారు. కానీ ఆ సమయములో భగవంతుని స్మృతి రాదు. మిత్ర-సంబంధీకులు,
ధనము-సంపదలే గుర్తుకు వస్తాయి. ఓ భగవంతుడా అని అంటారు కానీ అది కూడా నామమాత్రముగానే
అంటారు. భగవంతుడు తండ్రి, మనం వారి పిల్లలము. ఇది తెలియనే తెలియదు. వారికి
సర్వవ్యాపి అన్న తప్పుడు జ్ఞానము లభిస్తుంది. తండ్రి వచ్చి సరైన జ్ఞానాన్ని ఇస్తారు.
భక్తి డిపార్టుమెంటే వేరు. భక్తిలో ఎదురుదెబ్బలు తినవలసి ఉంటుంది. బ్రహ్మా యొక్క
రాత్రియే బ్రాహ్మణుల రాత్రి. బ్రహ్మా యొక్క పగలే బ్రాహ్మణుల పగలు. శూద్రుల యొక్క
పగలు, శూద్రుల యొక్క రాత్రి అని అయితే అనరు. ఈ రహస్యాన్ని తండ్రి కూర్చొని అర్థం
చేయిస్తారు. ఇది అనంతమైన రాత్రి మరియు పగలు. ఇప్పుడు మీరు పగలులోకి వెళ్తారు, రాత్రి
పూర్తవుతుంది. ఈ పదాలు శాస్త్రాలలో ఉన్నాయి. బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క
రాత్రి అని అంటారు కానీ వారికి తెలియదు. మీ బుద్ధి ఇప్పుడు అనంతములోకి వెళ్ళింది. ఆ
మాటకొస్తే దేవతల విషయములో కూడా విష్ణువు యొక్క పగలు, విష్ణు యొక్క రాత్రి అని
అనవచ్చు ఎందుకంటే విష్ణువు మరియు బ్రహ్మాకు గల సంబంధాన్ని కూడా అర్థం చేయించడం
జరుగుతుంది. త్రిమూర్తుల ఆక్యుపేషన్ ఏమిటి అనేది ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. వారైతే
భగవంతుడిని కూడా కూర్మ, మత్స్య అవతారాలలోకి మరియు జనన-మరణాల చక్రములోకి
తీసుకువెళ్ళారు. రాధ-కృష్ణులు మొదలైనవారు కూడా మనుష్యులే కానీ వారు దైవీ గుణాలు
కలవారు. ఇప్పుడు మీరు ఆ విధంగా అవ్వాలి. మరుసటి జన్మలో దేవతలుగా అయిపోతారు. 84
జన్మల లెక్క ఏదైతే ఉండేదో అది ఇప్పుడు పూర్తి అయ్యింది. మళ్ళీ అది రిపీట్ అవుతుంది.
ఇప్పుడు మీకు ఈ శిక్షణ లభిస్తోంది.
తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మేము
పాత్రధారులము అని కూడా అంటారు. కానీ ఆత్మలమైన మనం పై నుండి ఎలా వస్తామో అర్థం
చేసుకోరు. స్వయాన్ని దేహధారులుగానే భావిస్తారు. ఆత్మలమైన మనం పై నుండి వస్తాము,
మళ్ళీ ఎప్పుడు వెళ్తాము? పైకి వెళ్ళడము అనగా మరణించడము, శరీరాన్ని వదలడము.
మరణించాలని ఎవరు అనుకుంటారు? ఇక్కడైతే తండ్రి - మీరు ఈ శరీరాన్ని మర్చిపోతూ ఉండండి
అని అన్నారు. జీవిస్తూనే మరణించడాన్ని మీకు నేర్పిస్తారు, దీనిని ఇంకెవ్వరూ
నేర్పించలేరు. మీరు మీ ఇంటికి వెళ్ళడానికే వచ్చారు. ఇంటికి ఎలా వెళ్ళాలి - ఈ జ్ఞానము
ఇప్పుడే లభిస్తుంది. మృత్యులోకములో ఇది మీ అంతిమ జన్మ. అమరలోకము అని సత్యయుగాన్ని
అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో, మేము త్వరత్వరగా వెళ్ళాలి అని ఉంది.
మొట్టమొదటైతే ఇంటికి, ముక్తిధామములోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ శరీరము రూపీ వస్త్రాన్ని
ఇక్కడే వదలాలి, ఆ తర్వాత ఆత్మ ఇంటికి వెళ్ళిపోతుంది. ఏ విధముగా హద్దులోని నాటకములోని
పాత్రధారులు ఉంటారో, నాటకం పూర్తి అయితే వస్త్రాలను అక్కడే వదిలేసి ఇంటి వస్త్రాలను
వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారో, అలా మీరు కూడా ఇప్పుడు ఈ వస్త్రాన్ని వదిలి వెళ్ళాలి.
సత్యయుగములోనైతే కొద్దిమంది దేవతలే ఉంటారు. ఇక్కడైతే ఎంతమంది మనుష్యులు ఉన్నారు,
లెక్కలేనంతమంది. అక్కడైతే కేవలం ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉంటుంది.
ఇప్పుడైతే స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు. తమ శ్రేష్ఠమైన ధర్మమును, కర్మను
మర్చిపోయారు, అందుకే దుఃఖితులుగా అయ్యారు. సత్యయుగములో మీ కర్మ, ధర్మము శ్రేష్ఠముగా
ఉండేవి. ఇప్పుడు కలియుగములో ధర్మభ్రష్టులుగా ఉన్నారు. మనము ఎలా పడిపోయాము అనేది
బుద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి పరిచయాన్ని ఇస్తారు. అనంతమైన
తండ్రే వచ్చి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తారు. వారు మన్మనాభవ అని అంటారు. ఇది
గీతలోని పదమే. సహజ రాజయోగ జ్ఞానముకు గీత అన్న పేరును పెడతారు. ఇది మీ పాఠశాల.
పిల్లలు వచ్చి చదువుకుంటారు, ఇది మా బాబా పాఠశాల అని అంటారు. ఎవరైనా పిల్లల యొక్క
తండ్రి ప్రిన్సిపాల్ గా ఉంటే, మేము మా తండ్రి కాలేజీలో చదువుతున్నాము అని అంటారు.
వారి తల్లి కూడా ప్రిన్సిపాల్ అయి ఉంటే, మా తల్లిదండ్రులు ఇద్దరూ ప్రిన్సిపాళ్ళే,
వారిద్దరూ చదివిస్తారు అని అంటారు. ఇది మా తల్లిదండ్రుల కాలేజీ అని అంటారు. అలాగే
మీరు ఇది మా మమ్మా-బాబా యొక్క పాఠశాల అని అంటారు. ఇక్కడ ఇద్దరూ చదివిస్తారు. ఇద్దరూ
ఈ ఆత్మిక కాలేజిని లేక యూనివర్శిటీని తెరిచారు. ఇద్దరూ కలిసి చదివిస్తారు. తండ్రి
పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇవి జ్ఞానము యొక్క చాలా గుహ్యమైన విషయాలు. తండ్రి
కొత్త విషయాన్ని ఏమీ అర్థం చేయించరు. ఈ విధంగా కల్పపూర్వము కూడా అర్థం చేయించారు. ఈ
జ్ఞానము ఎంతో అపారముగా ఉంది, ఇది రోజురోజుకు గుహ్యముగా అవుతూ ఉంటుంది. ఆత్మ యొక్క
వివరణ మీకు ఇప్పుడు ఎలా లభిస్తుందో చూడండి. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి
ఉంది. అది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఆత్మ అవినాశీ కావున అందులోని పాత్ర కూడా అవినాశీయే.
ఆత్మ చెవుల ద్వారా వింటుంది. శరీరము ఉంటే పాత్ర ఉంటుంది. శరీరము నుండి ఆత్మ వేరైపోతే
జవాబు లభించదు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలూ, మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ
పురుషోత్తమ యుగము ఎప్పుడైతే వస్తుందో అప్పుడే తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. ఇందులో
ముఖ్యముగా పవిత్రతయే కావాలి. శాంతిధామములోనైతే పవిత్ర ఆత్మలే ఉంటాయి. శాంతిధామము
మరియు సుఖధామము రెండూ పవిత్రధామాలే. అక్కడ శరీరాలు లేవు. ఆత్మ పవిత్రమైనది, అక్కడ
బ్యాటరీ డిస్ఛార్జ్ అవ్వదు. ఇక్కడ శరీరాన్ని ధారణ చేయడం ద్వారా మోటార్ నడుస్తోంది.
మోటార్ నిలబడి ఉంటే పెట్రోల్ ఏమీ తగ్గదు కదా. ఇప్పుడు మీ ఆత్మ జ్యోతి చాలా
తగ్గిపోయింది. అది పూర్తిగా ఆరిపోదు. ఎవరైనా మరణిస్తే దీపాన్ని వెలిగిస్తారు. అది
ఆరిపోకుండా ఎంతో సంభాళిస్తారు. ఆత్మ జ్యోతి కూడా ఎప్పుడూ ఆరిపోదు, అది అవినాశీ. ఈ
విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వీరు చాలా మధురమైన పిల్లలు,
వీరందరూ కామ చితిపై కూర్చొని కాలిపోయి భస్మమైపోయారు అని బాబాకు తెలుసు. వారిని మళ్ళీ
మేల్కొలుపుతాను. పూర్తిగా తమోప్రధానముగా మృతులుగా అయిపోయారు. తండ్రి గురించి తెలియనే
తెలియదు. మనుష్యులు ఎందుకూ పనికిరానివారిగా ఉన్నారు. మనుష్యుల మట్టి ఎందుకూ
పనికిరాదు. గొప్పవ్యక్తుల మట్టి ఉపయోగపడి పేదవారిది ఉపయోగపడకుండా ఉంటుందని కాదు.
ఎవరైనా సరే, మట్టి మట్టిలోనే కలిసిపోతుంది. కొందరు కాలుస్తారు, కొందరు
పూడ్చివేస్తారు. పార్శీలు నూతిపై పెడతారు, అప్పుడు పక్షులు వచ్చి మాంసాన్ని
తినేస్తాయి, మిగిలిన ఎముకలు కిందకు పడిపోతాయి. అలా అయితే ఎంతోకొంత ఉపయోగపడుతుంది.
ప్రపంచములోనైతే ఎంతోమంది మనుష్యులు మరణిస్తారు. ఇప్పుడు మీరైతే మీకు మీరుగానే
శరీరాన్ని వదిలివేయాలి. శరీరాన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళేందుకు అనగా
మరణించేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. మేము జీవన్ముక్తిలోకి వెళ్తాము అని మీరు
సంతోషముగా వెళ్తారు.
ఎవరు ఏ పాత్రను అభినయించారో అంతిమం వరకూ అదే అభినయిస్తారు. తండ్రి పురుషార్థము
చేయిస్తూ ఉంటారు, సాక్షీగా అయి చూస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము, ఇందులో
భయపడవలసిన విషయమేదీ లేదు. మనం స్వర్గములోకి వెళ్ళేందుకు స్వయమే పురుషార్థము చేసి
శరీరాన్ని వదిలేస్తాము. తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి, తద్వారా అంతమతిని బట్టి గతి
ఏర్పడుతుంది, ఇందులో శ్రమ ఉంది. ప్రతి చదువులోనూ శ్రమ ఉంటుంది. భగవంతుడే వచ్చి
చదివించవలసి ఉంటుంది. తప్పకుండా ఈ చదువు గొప్పగా ఉంటుంది, ఇందులో దైవీ గుణాలు కూడా
కావాలి. ఈ లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలి కదా. వీరు సత్యయుగములో ఉండేవారు. ఇప్పుడు
మీరు మళ్ళీ సత్యయుగ దేవతలుగా అవ్వడానికి వచ్చారు. ఇక్కడి లక్ష్యము-ఉద్దేశ్యము ఎంత
సహజమైనది. త్రిమూర్తి చిత్రములో స్పష్టముగా ఉంది. ఈ బ్రహ్మా, విష్ణు, శంకరులు
మొదలైన చిత్రాలు లేకపోతే మనం ఎలా అర్థం చేయించగలము. బ్రహ్మాయే విష్ణువుగా, విష్ణువే
బ్రహ్మాగా అవుతారు. బ్రహ్మాకు 8 భుజాలను, 100 భుజాలను చూపిస్తారు ఎందుకంటే బ్రహ్మాకు
ఎంతమంది పిల్లలు ఉంటారు. కావున వారు దానిని చిత్రముగా తయారుచేసారు, అంతేకానీ ఇన్ని
భుజాలు కలిగిన మనుష్యులంటూ ఎవరూ ఉండరు. రావణుడి యొక్క 10 తలలకు కూడా అర్థముంది,
అటువంటి మనుష్యులు ఎవరూ ఉండరు. ఈ విషయాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు,
మనుష్యులకేమీ తెలియదు. ఇది కూడా ఒక ఆట, ఇది ఎప్పటినుండి ప్రారంభమయ్యింది అన్నది
ఎవరికీ తెలియదు. పరంపర అని అనేస్తారు. అరే, అది కూడా ఎప్పటినుండి? కావున మధురాతి
మధురమైన పిల్లలను తండ్రి చదివిస్తారు, వారు టీచరు కూడా మరియు గురువు కూడా. కావున
పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి.
ఈ మ్యూజియం మొదలైనవాటిని ఎవరి డైరెక్షన్ పై తెరుస్తారు? ఇక్కడ ఉన్నది తల్లి, తండ్రి
మరియు పిల్లలు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. డైరెక్షన్ అనుసారంగా తెరుస్తూ ఉంటారు.
మీరు భగవానువాచ అని అంటారు, మరి రథము ద్వారా మాకు భగవంతుని సాక్షాత్కారాన్ని
చేయించండి అని మీతో అంటారు. అరే, మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారా? ఇంత చిన్నని
బిందువు యొక్క సాక్షాత్కారాన్ని మీరు ఏమి చూడగలరు! అసలు అవసరమే లేదు. ఆత్మను
తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది, దాని ఆధారముపైనే ఇంత పెద్ద
శరీరము నడుస్తుంది. ఇప్పుడు మీ వద్ద ప్రకాశ కిరీటమూ లేదు, అలాగే రత్నఝడితమైన కిరీటమూ
లేదు. రెండు కిరీటాలనూ తీసుకునేందుకు మళ్ళీ మీరు పురుషార్థము చేస్తున్నారు.
కల్పకల్పమూ మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా
కలిసారా అని బాబా అడుగుతారు. అప్పుడు, అవును బాబా, కల్పకల్పమూ కలుస్తూ వచ్చాము అని
అంటారు. ఎందుకు? ఈ లక్ష్మీ-నారాయణులుగా అవ్వడానికి. అందరూ ఈ మాటే చెప్తారు. తండ్రి
అంటారు, మంచిది, శుభం పలికారు, ఇప్పుడిక పురుషార్థము చేయండి. అందరూ నరుని నుండి
నారాయణునిగా అవ్వరు, ప్రజలు కూడా కావాలి. సత్యనారాయణుని కథ కూడా ఉంటుంది. వారైతే
కథను వినిపిస్తారు, కానీ బుద్ధిలోకి ఏమీ రాదు. అది శాంతిధామము, నిరాకారీ ప్రపంచము
అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ అక్కడి నుండి సుఖధామములోకి వెళ్తారు.
సుఖధామములోకి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రే. మీరు ఎవరికైనా అర్థం చేయించండి, ఇప్పుడు
తిరిగి ఇంటికి వెళ్తాము అని చెప్పండి. ఆత్మను తన ఇంటికి అశరీరి అయిన తండ్రే
తీసుకువెళ్తారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కానీ వారి గురించి తెలియదు. తండ్రి అంటారు,
నేను ఏ తనువులోకైతే వస్తానో వారి గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. రథము కూడా ఉంది కదా.
ప్రతి ఒక్క రథములో ఆత్మ ప్రవేశిస్తుంది. అందరి ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. తండ్రి
వచ్చి భృకుటి మధ్యలో కూర్చుంటారు. అర్థం చేయించడమైతే ఎంతో సహజముగా అర్థం చేయిస్తారు.
పతిత-పావనుడైతే ఒక్క తండ్రే. తండ్రి పిల్లలందరూ సమానమైనవారు. వారిలో ప్రతి ఒక్కరికీ
తమ-తమ పాత్ర ఉంది. ఇందులో ఎవరూ జోక్యము చేసుకోలేరు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ శరీరము రూపీ వస్త్రము నుండి మమకారాన్ని తొలగించుకొని జీవిస్తూనే మరణించాలి
అనగా మీ పాత లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి.
2. డబుల్ కిరీటధారులుగా అయ్యేందుకు చదువు విషయములో కష్టపడాలి, దైవీ గుణాలను ధారణ
చేయాలి. లక్ష్యము ఎలా ఉందో, శుభమైన మాటలు ఏవైతే ఉన్నాయో అలా పురుషార్థము కూడా చేయాలి.
వరదానము:-
అకళ్యాణము యొక్క సంకల్పాలను సమాప్తము చేసి అపకారులకు
ఉపకారము చేసే జ్ఞానీ ఆత్మా భవ
ఎవరైనా రోజూ మిమ్మల్ని గ్లాని చేసినా, అకళ్యాణము చేసినా,
నిందించినా కానీ, వారి పట్ల మనసులో ద్వేష భావము రాకూడదు, అపకారులకు కూడా ఉపకారము
చేయాలి - ఇదే జ్ఞానీ ఆత్మల కర్తవ్యము. ఏ విధంగా పిల్లలైన మీరు తండ్రిని 63 జన్మలు
గ్లాని చేసారు, అయినా కానీ తండ్రి కళ్యాణకారీ దృష్టితోనే చూశారు, కావున మీరు
తండ్రిని ఫాలో చేయండి. జ్ఞానీ ఆత్మ అంటేనే సర్వుల పట్ల కళ్యాణ భావన కలిగి ఉండటము అని
అర్థము. అకళ్యాణము సంకల్పమాత్రముగా కూడా ఉండకూడదు.
స్లోగన్:-
మన్మనాభవ స్థితిలో స్థితులై
ఉన్నట్లయితే ఇతరుల మనసులోని భావాలను తెలుసుకోగలుగుతారు.
| | |