01-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పరచింతనను వదిలి తమ కళ్యాణము చేసుకోండి, మీరు బంగారము వలె తయారై ఇతరులకు మార్గాన్ని తెలియజేయండి’’

ప్రశ్న:-
అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని ఎవరైతే సదా చేస్తూ ఉంటారో, వారి ముఖ్యమైన గుర్తులను వినిపించండి?

జవాబు:-
వారు తమ కర్మేంద్రియాలను హఠముతో వశము చేసుకోరు. వారి కర్మేంద్రియాలు స్వతహాగానే శీతలమైపోతాయి. ఆత్మలమైన మనము పరస్పరము సోదరులము అనే స్మృతి స్వతహాగా ఉంటుంది. దేహాభిమానము తొలగిపోతూ ఉంటుంది. నామ-రూపాల నషా సమాప్తమవుతూ ఉంటుంది. ఇతరుల స్మృతి కలగదు.

పాట:-
నీవు ప్రేమ సాగరుడవు...

ఓంశాంతి
బాబా కేవలం ప్రేమసాగరుడు మాత్రమే కాదు, జ్ఞానసాగరుడు కూడా. జ్ఞానము మరియు అజ్ఞానము. జ్ఞానాన్ని పగలు అని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞానమనే పదం మంచిది. అజ్ఞానము అనే పదం చెడ్డది. అర్ధకల్పము జ్ఞాన ప్రారబ్ధము ఉంటుంది. అర్ధకల్పము అజ్ఞాన ప్రారబ్ధము ఉంటుంది. అజ్ఞాన ప్రారబ్ధము దుఃఖము. జ్ఞాన ప్రారబ్ధము సుఖము. ఇవి చాలా సహజముగా అర్థం చేసుకునే విషయాలు. పగలు జ్ఞానానికి సంబంధించింది, రాత్రి అంటే అజ్ఞానము. జ్ఞానమని దేనినంటారు, అజ్ఞానమని దేనినంటారు అనేది కూడా ఎవరికీ తెలియదు, ఇవి అనంతమైన విషయాలు. జ్ఞానమంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి అనేది మీరు అందరికీ అర్థం చేయిస్తారు. జ్ఞానము ద్వారా మీరు పూజ్యులుగా అవుతున్నారు. మీరు పూజ్యులుగా అవుతూ ఉన్నప్పుడు మీరు పూజా సామగ్రి గురించి తెలుసుకుంటారు. మందిరాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ స్మృతిచిహ్నాలని మీకు తెలుసు, వారి జీవిత కథ గురించి కూడా మీకు తెలుసు. కానీ ఎవరైతే పూజ చేయడానికి వెళ్తున్నారో, వారికి ఈ విషయాలు తెలియవు. పూజను భక్తి అని అంటారు, భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు భగవంతుడు భక్తులను కలవాల్సి ఉంటుంది. ఆ భగవంతుడే వచ్చి పూజారుల నుండి పూజ్యులుగా తయారుచేస్తారు. పూజ్యులు సత్యయుగములో, పూజారులు కలియుగములో ఉంటారు. ఈ రోజు ఏముంది, రేపు ఏమి జరగనున్నది అనేది పిల్లలైన మీకు తెలుసు. వినాశనమైతే తప్పకుండా జరుగబోతుంది, అది ఎప్పుడైనా జరగవచ్చు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అంటూ ఉంటారు. ఇలా వ్రాయాలి - గృహ యుద్ధాలను మరియు ప్రాకృతిక ఆపదలను ఈశ్వరీయ ఆపదలు అని అనరు, అవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ సంభవించనున్నాయి, అవి వినాశనములో కూడా సహయోగము చేస్తాయి, కుండపోత వర్షము కురుస్తుంది, ఆకలితో మరణిస్తారు, భూకంపాలు మొదలైనవన్నీ జరగనున్నాయి. వీటి ద్వారానే వినాశనము జరగనున్నది. ఇవన్నీ తప్పకుండా జరుగబోతున్నాయని పిల్లలకు తెలుసు. లేదంటే సత్యయుగములో ఇంత తక్కువమంది మనుష్యులు ఎలా ఉంటారు, తప్పకుండా ఒక్కసారిగా అంతా వినాశనము అవుతుంది. ఈ వస్త్రాలన్నీ శుభ్రము చేయబడతాయని, ఇది అనంతమైన పెద్ద మెషినరీ అని పిల్లలకు మంచి రీతిలో తెలుసు. మురికి పట్టిన వస్త్రాలను భగవంతుడు శుభ్రము చేస్తారని... అంటూ ఉంటారు. ఇది ఈ స్థూల వస్త్రాలకు సంబంధించిన విషయము కాదు. ఇది శరీరానికి సంబంధించిన విషయము. ఆత్మలను యోగబలముతో శుభ్రము చేసుకోవాలి. ఈ సమయములో 5 తత్వాలు తమోప్రధానముగా ఉన్నాయి కావున శరీరాలు కూడా అదే విధముగా తయారవుతాయి. పతిత-పావనుడైన తండ్రి వచ్చి పావనముగా తయారుచేస్తారు, మిగిలినవారంతా సమాప్తమైపోతారు. పావనముగా ఎలా అవుతారు అనేది మీకు తెలుసు. చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. మనుష్యులైతే ఏమీ అర్థం చేసుకోరు. ఎక్కడెక్కడైతే భక్తి, యజ్ఞాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయో, అక్కడకు వెళ్ళి ఇలా అర్థం చేయించాలి - మీరు ఎవరి భక్తినైతే చేస్తున్నారో, వారి జీవితచరిత్ర గురించి తెలుసుకుంటేనే మీరు దేవతలుగా అవ్వగలరు, వారు జీవన్ముక్తిని ఎలా పొందారు అనేదైతే అర్థం చేసుకోండి, అప్పుడు మీరు కూడా జీవన్ముక్తిని పొందగలరు అని. మందిరాలలో కూర్చుని వారి జీవిత కథను అర్థం చేయించినట్లయితే మంచి రీతిలో అర్థం చేసుకుంటారు.

మీరు కూడా తండ్రి నుండి ఇప్పుడు జీవిత కథను వింటున్నారు, పిల్లలైన మీకు ఎంత జ్ఞానము లభిస్తుంది. పరమపిత పరమాత్ముని జీవిత కథ గురించి ఎవరికీ తెలియదు. సర్వవ్యాపి అని అనడముతో అది జీవిత కథ అవ్వదు. పిల్లలైన మీకు ఇప్పుడు పరమపిత పరమాత్ముని జీవిత కథ గురించి తెలుసు అనగా ఆదిమధ్యాంతాలను గురించి తెలుసు. తండ్రి వచ్చి పతితులను పావనముగా తయారుచేస్తున్న ఈ సమయాన్ని ఆది సమయము అని అంటారు, తర్వాత మధ్యలో భక్తి పాత్ర నడుస్తుంది. తండ్రి అంటారు, ఈ సమయములో నేను వచ్చి స్థాపన చేస్తాను మరియు చేయిస్తాను, నేను చేసేవాడిని-చేయించేవాడిని. ప్రేరణ ఇవ్వడాన్ని చేయడమని అనరు. బాబా వచ్చి వీరి కర్మేంద్రియాల ద్వారా చేస్తారు, ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. చేసేవారు-చేయించేవారైతే తప్పకుండా సమ్ముఖముగా ఉంటూ చేయిస్తారు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. శరీరము లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఈశ్వరుడే ప్రేరణతో అంతా చేస్తారని చాలామంది అంటూ ఉంటారు. బాబా, నా పతి యొక్క బుద్ధి బాగయ్యేలా మీరు ప్రేరణ ఇవ్వండి అని అంటుంటారు. తండ్రి అంటారు, ఇందులో ప్రేరణ యొక్క విషయమే లేదు. అటువంటప్పుడు శివజయంతిని ఎందుకు జరుపుకుంటారు. ప్రేరణతో పని జరిగితే, ఇక వారు ఎందుకు రావాలి? వాస్తవానికి ఈశ్వరుడంటే ఎవరు అనేది తెలియదు. ఈశ్వరుని ప్రేరణతోనే అంతా జరుగుతుందని కేవలం అనేస్తారు. నిరాకారుడు ప్రేరణతో ఎలా చేస్తారు, వారు చేసేవారు-చేయించేవారు. వారు వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు. కర్మేంద్రియాల ద్వారా మురళిని వినిపిస్తారు. కర్మేంద్రియాల ఆధారము తీసుకోనంత వరకు మురళిని ఎలా వినిపించగలరు. వారు జ్ఞానసాగరుడు, మరి వినిపించడానికి నోరు కావాలి కదా.

ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలిసింది. పూర్తి జ్ఞానము లభించింది. జ్ఞానము లేకుండా గతి ఉండదని భావిస్తారు. మరి జ్ఞానము ఎవరు ఇవ్వాలి. అజ్ఞాన మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి మధ్యన ఉన్న తేడాను చూడండి. విజ్ఞానము అని కూడా అంటారు. అజ్ఞానము అంటే అంధకారము, ఇకపోతే జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని మనము ముక్తి-జీవన్ముక్తి అని కూడా అనవచ్చు. మీకు ఇప్పుడు పావనముగా అయ్యే జ్ఞానము లభిస్తుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ విషయాలను ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారు. ఆత్మ, జ్ఞానము తీసుకుంటుంది అని అంటున్నారంటే, తప్పకుండా ఆత్మ ఆ సంస్కారాలను తీసుకువెళ్తుంది కదా. మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారంటే మరి ఈ జ్ఞానము తర్వాత కూడా నిలవాలి కదా అని అంటారు. కానీ తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ పురుషార్థము ప్రారబ్ధాన్ని పొందడము కోసమే, ప్రారబ్ధము లభించిన తర్వాత ఇక జ్ఞానము యొక్క అవసరమేముంటుంది. సత్యయుగము అంటేనే పిల్లలైన మీ ప్రారబ్ధము. ఈ విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. ఈ జ్ఞానము పరంపరగా ఎందుకు నడవదు అని పిల్లలు అడిగితే, ఇది కనుమరుగైపోతుంది అని తండ్రి అంటారు. పగలు రాగానే ఇక అజ్ఞానము ఉండదు, అందుకే అక్కడ జ్ఞానము యొక్క అవసరము ఉండదు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన, అర్థం చేయించాల్సిన విషయాలు. ఒక్కసారిగా ఎవరూ అర్థం చేసుకోలేరు. శివబాబా భారత్ లోనే వస్తారు, భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు పిల్లల కోసం కానుకను తీసుకువస్తారు. భక్తి తర్వాత సద్గతి ఉంటుంది. ఈ వినాశనము కూడా తప్పకుండా జరుగుతుంది. దీని గుర్తులు కనిపిస్తున్నాయి. నిప్పు రవ్వ అంటుకుందంటే, ఇక ఒకటి-రెండు గంటల్లోనే ఇల్లు అంతా కాలిపోయి భస్మమైపోతుందని మీరు వింటూ ఉంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. వినాశనమైతే తప్పకుండా జరగాల్సిందే. సత్యయుగములో కొద్దిమంది మనుష్యులు మాత్రమే ఉంటారు, వారు శ్రేష్ఠాచారులు. మరి శ్రేష్ఠాచారులుగా అవ్వడానికి ఎంత శ్రమించాల్సి ఉంటుంది. మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది. ఈ విధముగా పడిపోయేవారికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. కోలుకునేందుకు ఎంతో సమయము పడుతుంది. అన్నింటికంటే పెద్ద దెబ్బ కామ వికారము, అందుకే కామము మహాశత్రువు అని అంటారు. ఇదే పతితముగా చేస్తుంది. వికారాల కారణముగానే గొడవలు జరుగుతాయి. ఒకవేళ వికారాల విషయములో మిమ్మల్ని వదలడము లేదంటే మీరు వారికి తప్పకుండా ఇలా చెప్పండి - దీని కన్నా పాత్రలు శుభ్రము చేయడమే మంచిది, తుడిచి, తడి బట్ట పెడతాను కానీ పవిత్రముగా ఉంటాను అని. ఇలా చెప్పడానికి చాలా ధైర్యము కావాలి. ఎవరైనా తండ్రి శరణులోకి వస్తే, మాయ కూడా యుద్ధము చేయడము మొదలుపెడుతుంది. 5 వికారాల రోగము ఇంకా ఎక్కువ అయిపోతుంది. ముందైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉండాలి. మీరు జీవిస్తూ మరణించి ఉన్నారు. ఇక్కడ నుండి లంగరు ఎత్తివేయబడింది. కలియుగీ, వికారీ తీరాన్ని మీరు వదిలేశారు. ఇప్పుడు మనము యాత్రకు వెళ్తున్నాము - మనము అశరీరిగా అయ్యి మన ఇంటికి వెళ్తాము. మనము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరములోకి వెళ్తాము అనే జ్ఞానము ఆత్మకు ఉంది. మనము గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా అయి యాత్రలో ఉంటాము. ఇది స్మశానవాటిక, తర్వాత మనము సుఖధామములోకి వెళ్తామని బుద్ధిలో గుర్తుండాలి. బాబా మనకు వారసత్వాన్ని ఇచ్చేందుకు యుక్తులను తెలియజేస్తున్నారు. పావనముగా అయ్యేందుకు మనము యోగములో ఉంటాము. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, అప్పుడు ఆత్మ శరీరాన్ని వదులుతుంది. ఇది ఎంత అద్భుతమైన యాత్ర. కేవలం తండ్రిని స్మృతి చేయండి, తమ రాజధానిని స్మృతి చేయండి. ఇంత సహజమైన విషయము కూడా గుర్తుండదు. భగవంతుడిని స్మృతి చేయండి, అంతే. కానీ మాయ అది కూడా స్మృతి చేయనివ్వదు, శ్రమ అనిపిస్తుంది. మా బాబా వచ్చి ఉన్నారని ఆత్మకు జ్ఞానము లభించింది. ఆత్మ చదువుకుంటుంది కదా. ఆత్మ శరీరము ద్వారా జన్మ తీసుకుంటుంది. ఆత్మలు పరస్పరములో సోదరులు. దేహాభిమానములోకి రావడముతో అనేక సంబంధాలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు సోదరీ-సోదరులుగా ఉన్నారు. పరస్పరములో సోదరులు కూడా, సోదరీ-సోదరులు కూడా. ఇది ప్రవృత్తి మార్గము కదా. ఇరువురికీ వారసత్వము కావాలి. ఆత్మయే పురుషార్థము చేస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించడము - ఇదే కష్టము. దేహాభిమానము ఉండకూడదు. శరీరమే లేనప్పుడు ఇక వికారాలలోకి ఎలా వెళ్తారు. మనము ఆత్మలము, తండ్రి వద్దకు వెళ్ళాలి. శరీర భానము అసలు ఉండకూడదు. ఎంతగా యోగులుగా అవుతూ ఉంటారో, అంతగా కర్మేంద్రియాలు శాంతిస్తూ ఉంటాయి. దేహాభిమానములోకి వస్తే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. ఆత్మకు, తనకు ప్రాప్తి లభిస్తున్న విషయము తెలుసు. శరీరము నుండి వేరు అవుతూ ఉంటే, కర్మేంద్రియాలు శాంతిస్తూ ఉంటాయి. సన్యాసులు మందులు తీసుకుని కర్మేంద్రియాలను శాంత పరచుకుంటారు. అది హఠయోగము అయినట్లు కదా. మీరు యోగాన్ని ఉపయోగించాలి. యోగబలముతో మీరు వశము చేసుకోలేరా? ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో, అంతగా కర్మేంద్రియాలు శాంతిస్తాయి. చాలా శ్రమించాల్సి ఉంటుంది, ప్రాప్తి చాలా ఉన్నతమైనది కదా. తండ్రి అంటారు - యోగబలముతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు, కర్మేంద్రియాలపై విజయము పొందుతారు, అందుకే భారత్ యొక్క యోగము ప్రసిద్ధమైనది. మీరు మనుష్యుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనులుగా అవుతారు. ప్రజలు కూడా స్వర్గవాసులే కదా. యోగబలముతో మీరు స్వర్గవాసులుగా అవుతారు. బాహుబలముతో స్వర్గవాసులుగా అవ్వలేరు. ఇందులో చాలా శ్రమ ఏమీ లేదు. కుమారీలకు అయితే శ్రమ ఏ మాత్రం లేనట్లే. వారు ఫ్రీగా ఉంటారు. వికారాలలోకి వెళ్తే, పెద్ద పంచాయతీ మొదలవుతుంది. కుమారీగా ఉండటము మంచిది. లేకపోతే అధర్ కుమారి అనే పేరు వస్తుంది. యుగళులుగా కూడా ఎందుకవ్వాలి! ఇందులో కూడా నామ-రూపాల నషా ఎక్కుతుంది. ఇది కూడా మూర్ఖత్వమే. జంటగా అయిన తర్వాత పవిత్రముగా ఉండటానికి చాలా ధైర్యము కావాలి. జ్ఞానము యొక్క పూర్తి పరాకాష్ఠ కావాలి. చాలామంది ధైర్యము చేస్తారు కానీ అగ్ని సెగ తగిలిందంటే ఇక ఆట సమాప్తమైపోతుంది, అందుకే బాబా అంటారు, కుమారీగా ఉండటము చాలా మంచిది. అధర్ కుమారిగా అవ్వాలనే ఆలోచన కూడా ఎందుకు చేయాలి. కుమారీల పేరు ప్రసిద్ధి చెందింది. వారు బాల బ్రహ్మచారులు. బాల బ్రహ్మచారులుగా ఉండటము మంచిది, శక్తి ఉంటుంది. ఇతరులెవరి స్మృతి కలగదు. మరి ధైర్యముంటే చేసి చూపించండి, కానీ ఇందులో శ్రమ ఉంటుంది. అక్కడ ఇద్దరు అయిపోతారు కదా. కుమారీగా ఉంటే ఒక్కరే ఉంటారు. ఇద్దరు ఉంటే ద్వైతము ఏర్పడుతుంది. ఎంత వీలైతే అంత, కుమారీగా ఉండటము మంచిది. కుమారీ సేవ చేయడానికి వెళ్ళొచ్చు. బంధనములో చిక్కుకున్నట్లయితే ఇక ఆ బంధనాలు మరింత వృద్ధి చెందుతాయి. బుద్ధి చిక్కుకుపోయే విధముగా అసలు వల అల్లుకోవడము ఎందుకు. ఇలా వలలో చిక్కుకోవడము మంచిది కాదు. కుమారీలకైతే చాలా బాగుంటుంది. కుమారీలు పేరును నిలబెట్టారు. కన్నయ్య అనే పేరును తలచుకుంటూ ఉంటారు కదా. కుమారీలుగా ఉండటము చాలా మంచిది. వారికి ఇది చాలా సహజము. విద్యార్థి జీవితము పవిత్రమైన జీవితము కూడా. బుద్ధి కూడా ఫ్రెష్ గా ఉంటుంది. కుమారులు భీష్మ పితామహుని వలె అవ్వాలి. కల్పక్రితం కూడా ఇలానే ఉన్నారు, అందుకే దిల్వాడా మందిరములో స్మృతిచిహ్నము తయారుచేయబడి ఉంది.

ఇప్పుడు తండ్రి పిల్లలను ఆజ్ఞాపిస్తున్నారు - నన్ను స్మృతి చేయండి, మిగిలిన విషయాలన్నింటినీ వదిలి మీరు మీ కళ్యాణము చేసుకోండి, తండ్రిని స్మృతి చేయడములోనే కళ్యాణముంది. పొరపాట్లు జరుగుతాయి, పిల్లలు పడిపోతూ ఉంటారు, కానీ మీరు పరచింతనను వదిలి మీ కళ్యాణము చేసుకోండి. వేరే చింతనలోకి వెళ్ళనే వెళ్ళకండి. మీరు బంగారము వలె అవ్వండి, ఇతరులకు కూడా మార్గాన్ని చూపించండి. సతోప్రధానముగా అయ్యేందుకు ఒకే ఒక్క ఉపాయముంది. పావనముగా అవ్వకుండా ముక్తిధామానికి వెళ్ళలేరు. ఉపాయము ఒక్కటే ఉంది, తర్వాత అంత మతి సో గతి అవుతుంది (అంతిమ సమయములో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది). పరచింతన విషయాలను వదిలేయండి. వదలకపోతే మిమ్మల్ని మీరే నష్టపరచుకుంటారు. తండ్రి ఏమీ శాపమివ్వరు. శ్రీమతముపై నడవకపోతే మిమ్మల్ని మీరే శాపగ్రస్తులుగా చేసుకుంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నిశ్చయబుద్ధి కలవారిగా అయి జీవిస్తూనే ఈ పాత ప్రపంచము నుండి మీ లంగరును ఎత్తివేయాలి. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాలన చేసి తమ కళ్యాణము చేసుకోవాలి.

2. ఇతరుల చింతనను వదిలి తమ బుద్ధిని స్వచ్ఛమైన బంగారము వలె తయారుచేసుకోవాలి. వ్యర్థ విషయాలలో తమ సమయాన్ని నష్టపరచుకోకూడదు. యోగబలముతో తమ కర్మేంద్రియాలను శాంతిగా, శీతలముగా చేసుకోవాలి.

వరదానము:-
మీ విజయాన్ని మరియు సఫలతను నిశ్చితము అని భావించి సదా నిశ్చింతగా ఉండే నిశ్చయబుద్ధి భవ

ఏ పిల్లలైతే సదా తండ్రి పట్ల, స్వయం యొక్క పాత్ర పట్ల మరియు డ్రామాలోని ప్రతి సెకండు యొక్క పాత్ర పట్ల వంద శాతం నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో, వారి విజయము మరియు సఫలత నిశ్చితము. విజయము నిశ్చితమైన కారణముగా వారు సదా నిశ్చింతగా ఉంటారు. వారి ముఖముపై చింత యొక్క ఎలాంటి రేఖలు కనిపించవు. వారికి సదా - ఈ కార్యము లేక ఈ సంకల్పము సిద్ధించే ఉంది అనే నిశ్చయము ఉంటుంది. వారికి ఎప్పుడూ ఏ విషయములోనూ ప్రశ్నలు తలెత్తవు.

స్లోగన్:-
వినేటప్పుడు లేక వినిపించేటప్పుడు భావనను మరియు భావాన్ని మార్చేయడమే వాయుమండలాన్ని పాడు చేయడము.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

సంపూర్ణ పవిత్రత లెక్కలో వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రత యొక్క బీజమే. మెజారిటీ పిల్లల్లో ఇప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు రావటము అనే సంస్కారము మిగిలి ఉంది. వ్యర్థ సంకల్పాలకు ఆధారము మనసు, అవి మన్మనాభవగా అవ్వనివ్వవు. అందుకే శ్రీమతము అనే కళ్ళెన్ని టైట్ చేసి వ్యర్థ సంకల్పాల అపవిత్రతను సమాప్తము చెయ్యండి.