01-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
25.11.2001
‘‘ఆశీర్వాదాలను ఇవ్వండి,
ఆశీర్వాదాలను తీసుకోండి, కారణాన్ని నివారణ చేసి సమస్యలను
సమాధానపరచండి’’
ఈ రోజు ప్రేమ సాగరుడైన బాప్ దాదా తమ ప్రేమ స్వరూపులైన
పిల్లల యొక్క ప్రేమతో కూడిన బంధానికి ఆకర్షించబడి మిలనం
జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు పిలిచారు మరియు హజూర్ (ప్రభువు)
హాజరైపోయారు. అవ్యక్త మిలనాన్ని అయితే సదా జరుపుకుంటూనే ఉంటారు,
అయినా కూడా సాకారములో పిలిచారు కనుక బాప్ దాదా పిల్లల యొక్క
విశాల మేళాకు చేరుకున్నారు. బాప్ దాదాకు పిల్లల స్నేహము,
పిల్లల ప్రేమ చూసి సంతోషము కలుగుతుంది మరియు హృదయాంతరాలలో
నలువైపుల ఉన్న పిల్లల కోసం ఇలా పాట పాడుతారు - ‘‘వాహ్ శ్రేష్ఠ
భాగ్యవాన్ పిల్లలూ వాహ్! భగవంతుని ప్రేమకు పాత్రులైన ఆత్మలూ
వాహ్!’’ ఇంతటి గొప్ప భాగ్యము మరియు అది ఇంతటి సాధారణ రూపములో
సహజంగా ప్రాప్తించటము, ఇది కలలో కూడా ఆలోచించలేదు. కానీ ఈ రోజు
సాకార రూపములో భాగ్యాన్ని చూస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు,
దూరంగా కూర్చుని కూడా పిల్లలు మిలన మేళాను జరుపుకుంటున్నారు.
బాప్ దాదా వారిని చూస్తూ మిలనం జరుపుతున్నారు. మెజారిటీ మాతలకు
గోల్డెన్ ఛాన్స్ లభించింది మరియు బాప్ దాదాకు కూడా విశేషంగా
శక్తి సైన్యాన్ని చూసి ఈ సంతోషము కలుగుతుంది - నాలుగు గోడల
మధ్యన ఉండే మాతలు బాబా ద్వారా విశ్వ కళ్యాణకారులుగా అయ్యి,
విశ్వ రాజ్యాధికారులుగా అయ్యారు అని. అలా అయిపోయారా లేక అవుతూ
ఉన్నారా, ఏమంటారు? అయిపోయారు కదా! విశ్వ రాజ్యమనేది
వెన్నలాంటిది, ఆ గ్లోబ్ ఇప్పుడు మీ అరచేతిలో ఉంది కదా! బాప్
దాదా చూసారు, ఏయే మాతలైతే మధుబన్ కు చేరుకున్నారో, వారికి ఒక
విషయములో చాలా సంతోషంగా ఉంది, ఏ సంతోషము ఉంది? బాప్ దాదా
మాతలైన మమ్మల్ని విశేషంగా పిలిచారు అని. కావున మాతలంటే
విశేషమైన ప్రేమ ఉంది కదా! వారు నషాతో అంటారు - బాప్ దాదా
పిలిచారు, మమ్మల్ని పిలిచారు, మరి మేమెందుకు రాము! బాప్ దాదా
కూడా అందరి ఆత్మిక సంభాషణను వింటూ ఉంటారు, ఈ సంతోషపు నషాను
చూస్తూ ఉంటారు. ఆ మాటకొస్తే పాండవులు కూడా తక్కువేమీ కాదు,
పాండవులు లేకుండా కూడా విశ్వ కార్యము యొక్క సమాప్తి జరగదు, కానీ
ఈ రోజు విశేషంగా మాతలను పాండవులు కూడా ముందు ఉంచారు.
బాప్ దాదా పిల్లలందరికీ చాలా సహజమైన పురుషార్థపు విధిని
వినిపిస్తున్నారు. మాతలకు సహజమైనది కావాలి కదా! అందుకని బాప్
దాదా మాతలు, పిల్లలు అందరికీ చెప్తున్నారు, అన్నింటికంటే
సహజమైన పురుషార్థము యొక్క సాధనము - ‘‘కేవలము నడుస్తూ-తిరుగుతూ,
సంబంధ-సంపర్కములోకి వస్తూ ప్రతి ఒక్క ఆత్మకు హృదయపూర్వకంగా శుభ
భావనతో కూడిన ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఇతరుల నుండి కూడా
ఆశీర్వాదాలను తీసుకోండి.’’ మీకు ఎవరు ఏమిచ్చినా కానీ,
శాపనార్థాన్ని ఇచ్చినా కానీ మీరు ఆ శాపనార్థాన్ని కూడా మీ శుభ
భావనా శక్తితో ఆశీర్వాదములోకి పరివర్తన చెయ్యండి. మీ ద్వారా
ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలు అనుభవమవ్వాలి. ఆ సమయములో ఎలా అనుభవం
చేయండంటే, ఎవరైతే మీకు శాపనార్థాన్ని ఇస్తున్నారో వారు ఆ
సమయములో ఏదో ఒక వికారానికి వశీభూతులై ఉన్నారు. వశీభూతమై ఉన్న
ఆత్మ పట్ల లేక పరవశమై ఉన్న ఆత్మ పట్ల ఎప్పుడూ కూడా శాపనార్థము
వెలువడదు. వారి పట్ల సదా సహయోగాన్ని ఇచ్చే ఆశీర్వాదమే
వెలువడుతుంది. కేవలం ఒక్క విషయాన్నే గుర్తు పెట్టుకోండి,
అదేమిటంటే, మనం నిరంతరము ఒకటే కార్యాన్ని చేస్తూ ఉండాలి -
‘‘సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా,
సంబంధ-సంపర్కముల ద్వారా ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు
ఆశీర్వాదాలను తీసుకోవాలి’’. ఒకవేళ ఏ ఆత్మ పట్లనైనా ఏదైనా
వ్యర్థ సంకల్పము లేక నెగెటివ్ సంకల్పము వచ్చినా కానీ ఇదే గుర్తు
తెచ్చుకోండి - నా కర్తవ్యము ఏమిటి! ఉదాహరణకు ఎక్కడైనా మంటలు
అంటుకుంటే మరియు అక్కడ మంటలు ఆర్పేవారు ఉంటే, వారు ఆ మంటలను
చూసి నీటిని వేయాలి అనే తమ కార్యాన్ని మర్చిపోరు. మేము నీటిని
వేసేవారము, మంటలు ఆర్పేవారము అన్నది వారికి గుర్తుంటుంది, అదే
విధంగా ఒకవేళ ఎవరైనా ఏదైనా వికారమనే అగ్నికి వశమై ఏదైనా
అలాంటి-ఇలాంటి పని చేస్తే, అది మీకు మంచిగా అనిపించకపోతే,
అప్పుడు మీరు మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి - నా కర్తవ్యము
ఏమిటంటే, ఏ రకమైన అగ్నిని అయినా ఆర్పటము, ఆశీర్వాదాలను ఇవ్వటము,
శుభ భావనతో కూడిన భావన యొక్క సహయోగాన్ని ఇవ్వటము. కేవలం ఒక్క
మాటను గుర్తు పెట్టుకోండి, మాతలకు ఒక్క మాటను గుర్తు
పెట్టుకోవటము సహజము, అదేమిటంటే - ‘‘ఆశీర్వాదాలను ఇవ్వాలి,
ఆశీర్వాదాలను తీసుకోవాలి.’’ మాతలు ఇది చెయ్యగలరా? (మాతలందరూ
చేతులెత్తుతున్నారు), చెయ్యగలరా లేక చెయ్యాల్సిందేనా? పాండవులు
చెయ్యగలరా? పాండవులు ‘చెయ్యాల్సిందే’ అని అంటారు. పాండవులు అనగా
సదా విజయులు అని గాయనము ఉంది మరియు శక్తులు సదా విశ్వ
కళ్యాణకారులు అన్న పేరుతో ప్రసిద్ధులు.
బాప్ దాదాకు నలువైపుల ఉన్న పిల్లల విషయములో ఇప్పటివరకు ఒక ఆశ
ఉండిపోయింది. అది ఏ ఆశో చెప్పమంటారా? తెలిసిపోయింది కదా!
టీచర్లకు తెలిసిపోయింది కదా! పిల్లలందరూ తమ శక్తి అనుసారంగా
పురుషార్థమైతే చేస్తున్నారు. బాప్ దాదా ఆ పురుషార్థాన్ని చూసి
చిరునవ్వు నవ్వుతారు. కానీ ఒక ఆశ ఏమిటంటే పురుషార్థములో ఇప్పుడు
తీవ్ర వేగము కావాలి. పురుషార్థము చేస్తున్నారు కానీ ఇప్పుడు
తీవ్ర వేగము కావాలి. దీనికి విధి ఏమిటంటే - ‘కారణము’ అన్న పదం
సమాప్తమైపోవాలి మరియు నివారణ స్వరూపులుగా సదా కోసం అవ్వాలి.
కారణాలైతే సమయమనుసారంగా తయారవుతాయి మరియు అవుతూనే ఉంటాయి. కానీ
మీరందరూ నివారణ స్వరూపులుగా అవ్వండి ఎందుకంటే పిల్లలైన మీరందరూ
విశ్వములోని కారణాలను నివారణ చేసి అందరినీ, మెజారిటీ ఆత్మలను
నిర్వాణధామానికి పంపించాలి. కనుక ఎప్పుడైతే స్వయాన్ని నివారణ
స్వరూపులుగా తయారుచేసుకుంటారో, అప్పుడే విశ్వములోని ఆత్మలను
నివారణ స్వరూపము ద్వారా అన్ని సమస్యలను నివారణ చేసి
నిర్వాణధామానికి పంపించగలరు. ఇప్పుడు విశ్వములోని ఆత్మలు
ముక్తిని కోరుకుంటున్నారు కావున బాబా ద్వారా ముక్తి యొక్క
వారసత్వాన్ని ఇప్పించేందుకు నిమిత్తులు మీరే. కనుక నిమిత్త
ఆత్మలు ముందుగా స్వయాన్ని రకరకాల సమస్యల కారణాన్ని నివారణ చేసి
ముక్తులుగా చేసుకుంటే, అప్పుడు విశ్వానికి ముక్తి యొక్క
వారసత్వాన్ని ఇప్పించగలుగుతారు. మరి మీరు ముక్తులుగా ఉన్నారా?
ఏ విధమైన సమస్య యొక్క కారణము ఎదురుగా రాకూడదు, ఈ కారణము, ఈ
కారణము, ఈ కారణము... ఎప్పుడైనా ఏదైనా కారణము ఎదురుగా వస్తే ఆ
కారణానికి క్షణములో నివారణను ఆలోచించండి. ఇలా ఆలోచించండి - నేను
విశ్వములోని కారణాలను నివారణ చేసేవాడిని అన్నప్పుడు మరి స్వయం
యొక్క చిన్న-చిన్న సమస్యలను స్వయం నివారించలేనా! చెయ్యిలేనా!
ఇప్పుడైతే ఆత్మల క్యూ మీ ముందుకు వచ్చేదుంది ‘‘ఓ ముక్తిదాతా,
ముక్తిని ఇవ్వు’’ అని, ఎందుకంటే మీరు ముక్తిదాతకు డైరెక్ట్
పిల్లలు, అధికారీ పిల్లలు. మీరు మాస్టర్ ముక్తిదాతలు కదా. కానీ
క్యూ ఎదురుగా మాస్టర్ ముక్తిదాతలైన మీ వైపు నుండి ఆటంకములా ఒక
తలుపు మూసి ఉంది. క్యూ సిద్ధముగా ఉంది, కానీ ఏ తలుపు మూసి ఉంది?
పురుషార్థములో బలహీన పురుషార్థానికి చెందిన ఒక పదము అనే తలుపు,
అదేమిటంటే - ‘ఎందుకు’. ఇది ప్రశార్థకము (?). ఎందుకు. ఈ ఎందుకు
అన్న పదము ఇప్పుడు క్యూ ను ఎదురుగా తీసుకురాదు. కనుక బాప్ దాదా
ఇప్పుడు దేశ-విదేశాలలోని పిల్లలందరికీ ఇదే స్మృతిని
కలిగిస్తున్నారు - మీరు సమస్యల యొక్క తలుపు అయినటువంటి
‘ఎందుకు’ అన్నదానిని సమాప్తం చెయ్యండి. చెయ్యగలరా? టీచర్లు
చెయ్యగలరా? పాండవులు చెయ్యగలరా? అందరూ చేతులెత్తుతున్నారా లేక
కొంత-కొంత మందేనా? విదేశీయులు అయితే ఎవర్రెడీగా ఉన్నారు కదా!
అవునా, కాదా? ఒకవేళ అవును అని అన్నట్లయితే నేరుగా చేతులు
పైకెత్తండి. కొంతమంది ఇలా-ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఏ
సేవాకేంద్రములోనూ సమస్య యొక్క నామ-రూపాలు ఉండకూడదు. అలా
వీలవుతుందా? ప్రతి ఒక్కరూ - నేను చెయ్యాలి అని భావించాలి.
టీచర్లు నేను చెయ్యాలి అని భావించాలి, విద్యార్థులు నేను
చెయ్యాలి అని భావించాలి, ప్రవృత్తివారు నేను చెయ్యాలి అని
భావించాలి, మధుబన్ వారు మేము చెయ్యాలి అని భావించాలి. చెయ్యగలరు
కదా? సమస్య అన్న పదమే సమాప్తమైపోవాలి, కారణము సమాప్తమైపోయి
నివారణ రావాలి, ఇది సాధ్యమేనా! వీలు కానిది ఏముంది? ప్రారంభములో
స్థాపనా సమయములో వచ్చిన పిల్లలందరూ ఏమని ప్రమాణము చేసారు, మరియు
దానిని చేసి చూపించారు! అసంభవాన్ని సంభవం చేసి చూపించారు.
చూపించారు కదా? మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైపోయాయి? స్థాపన
జరిగి ఎన్ని సంవత్సరాలైపోయాయి? (65). మరి ఇన్ని సంవత్సరాలలో
అసంభవము సంభవము అవ్వలేదా? అవ్వగలదా? ముఖ్యమైన టీచర్లు
చేతులెత్తండి. పంజాబువారు చేతులెత్తడం లేదు, ఏదైనా అనుమానం ఉందా?
కొంచెం ఆలోచిస్తున్నారు, ఆలోచించకండి. చెయ్యాల్సిందే. ఇతరుల
గురించి ఆలోచించకండి, ప్రతి ఒక్కరూ మీ గురించి మీరు ఆలోచించండి,
మీ గురించైతే ఆలోచించగలరు కదా? ఇతరుల సంగతి వదిలేయండి, మీ
గురించి ఆలోచించి మీ కొరకైతే ధైర్యాన్ని పెట్టగలరు కదా? లేక
పెట్టలేరా? విదేశీయులు ధైర్యాన్ని పెట్టగలరా? (చేతులెత్తారు)
అభినందనలు. అచ్ఛా, ఇప్పుడు ఎవరైతే చెయ్యగలమని భావిస్తున్నారో
వారు మనస్ఫూర్తిగా చేతులెత్తండి, చూపించుకోవడానికి కాదు. అందరూ
చేతులెత్తుతున్నారు కావున నేను కూడా ఎత్తుతాను అన్నట్లు కాదు.
ఒకవేళ మనస్ఫూర్తిగా ఈ దృఢ సంకల్పాన్ని చేస్తే, అదేమిటంటే -
కారణాన్ని సమాప్తము చేసి నివారణ స్వరూపముగా అవ్వాల్సిందే, ఏం
జరిగినా సరే, సహనం చెయ్యాల్సి వచ్చినా, మాయను ఎదిరించాల్సి
వచ్చినా, ఇతరుల సంబంధ-సంపర్కములో సహనం చెయ్యాల్సి వచ్చినా సరే,
నేను సమస్యగా అవ్వకూడదు. ఇది సాధ్యమేనా? ఒకవేళ ఈ దృఢ నిశ్చయము
ఉన్నట్లయితే వెనుక నుండి ముందు వరకు అందరూ చేతులెత్తండి. (బాప్
దాదా అందరి చేతా చేతులెత్తించారు మరియు ఈ దృశ్యమంతా టి.వి.లో
చూసారు). బాగుంది కదా, ఎక్సర్సైజ్ అయిపోయింది! చేతులు ఇందుకోసమే
ఎత్తిస్తాము. ఎలాగైతే ఇప్పుడు ఒకరినొకరు చూసుకొని చేతులెత్తడంలో
ఉల్లాసము వస్తుంది కదా, అలాగే ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే
ఎదురుగా బాప్ దాదాను చూడండి, మనస్ఫూర్తిగా ‘బాబా’ అని అనండి,
అప్పుడు బాబా హాజరైపోతారు, సమస్య సమాప్తమైపోతుంది. సమస్య మీ
ఎదురుగా నుండి పక్కకు వెళ్ళిపోతుంది మరియు బాప్ దాదా ఎదురుగా
హాజరైపోతారు. ‘‘మాస్టర్ సర్వశక్తివాన్’’, మీ ఈ టైటిల్ ను
అన్నివేళలా గుర్తు చేసుకోండి, లేదా బాప్ దాదా ఇప్పుడు
ప్రియస్మృతులను చెప్పేటప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు అని
చెప్పకుండా శక్తివంతులు అని చెప్పాలా? శక్తివంతులైన పిల్లలకు
ప్రియస్మృతులు అని చెప్తే మంచిగా అనిపిస్తుందా? మీరు మాస్టర్
సర్వశక్తివంతులు. మాస్టర్ సర్వశక్తివంతులు చెయ్యలేనిది ఏముంది?
కేవలం మీ టైటిల్ ను మరియు కర్తవ్యాన్ని గుర్తు ఉంచుకోండి.
టైటిల్ ‘‘మాస్టర్ సర్వశక్తివాన్’’ మరియు కర్తవ్యము ‘‘విశ్వ
కళ్యాణకారి’’. కావున సదా మీ టైటిల్ ను మరియు కర్తవ్యాన్ని
గుర్తు చేసుకోవటం వలన శక్తులు ఇమర్జ్ అవుతాయి. మాస్టర్ గా
అవ్వండి, శక్తులకు కూడా మాస్టర్ గా అవ్వండి, ఆర్డర్ చెయ్యండి,
ప్రతి శక్తినీ అవసరమైన సమయములో ఆర్డర్ చెయ్యండి. వాస్తవానికి
శక్తులను ధారణ చేస్తారు కూడా, అవి ఉన్నాయి కూడా, కానీ కేవలం
లోపమేమిటంటే అవసరమైన సమయంలో వాటిని ఉపయోగించటం రావటం లేదు. సమయం
గడిచిపోయిన తర్వాత గుర్తుకొస్తాయి, ఇలా చేసి ఉంటే చాలా
బాగుండేది అని అనుకుంటారు. ఇప్పుడు ఈ అభ్యాసము చెయ్యండి - ఏ
శక్తులైతే ఇమిడి ఉన్నాయో, వాటిని సమయానికి ఉపయోగించండి. ఎలాగైతే
ఈ కర్మేంద్రియాలకు ఆర్డర్ చేసి నడిపిస్తారు కదా, చేతులను,
కాళ్ళను నడిపిస్తారు కదా! అలాగే ప్రతి శక్తినీ ఆర్డర్ అనుసారంగా
నడిపించండి. శక్తిని కార్యములో పెట్టండి. శక్తులను లోపల
ఇముడ్చుకుని పెట్టుకుంటారు, వాటిని కార్యంలో తక్కువగా
ఉపయోగిస్తారు. అవసరమైన సమయంలో కార్యంలో ఉపయోగిస్తే శక్తి తన
పనిని తప్పకుండా చేస్తుంది. మరియు సంతోషంగా ఉండండి.
అప్పుడప్పుడు కొంతమంది పిల్లల ముఖం చాలా ఆలోచనలో ఉన్నట్లు,
కొంచెం ఎక్కువ గంభీరంగా కనిపిస్తుంది. సంతోషంగా ఉండండి, ఆడండి,
పాడండి, మీ బ్రాహ్మణ జీవితము ఉన్నదే సంతోషములో నాట్యము చేసేదిగా
మరియు మీ భాగ్యము గురించి మరియు భగవంతుని గురించి పాటలు
పాడేదిగా. మరి ఆడుతూ-పాడుతూ ఉండేవారు ఉంటారు కదా, వారు ఇలా
గంభీరంగా ముఖం పెట్టుకుని నాట్యం చేస్తే, వీరికి నాట్యం చెయ్యటం
రాదు అని అంటారు. గంభీరత మంచిదే కానీ టూ మచ్ (అతి) గంభీరత ఉంటే
అది ఏదో బాగా ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ఢిల్లీలో ప్రారంభోత్సవం కానున్నది అని బాప్ దాదా ఇప్పుడు
విన్నారు (డిసెంబర్ 9, 2001న ఢిల్లీలోని గుర్గావ్ లో ఓం శాంతి
రిట్రీట్ సెంటర్ ప్రారంభోత్సవము ఉంది) కానీ బాప్ దాదా ఇప్పుడు
ఏ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు? ఆ తారీఖునైతే ఫిక్స్
చేయండి. ఈ చిన్న-చిన్న ప్రారంభోత్సవాలైతే జరిగిపోతాయి. కానీ
బాప్ దాదా ఇప్పుడు ఈ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు -
‘‘అందరూ విశ్వమనే స్టేజ్ పైకి బాబా సమానంగా సాక్షాత్తు
ఫరిశ్తాల వలె ఎదురుగా రావాలి మరియు పరదా తెరుచుకోవాలి’’.
ఇటువంటి ప్రారంభోత్సవము మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది
కదా! ఆత్మిక సంభాషణలో కూడా అందరూ ఇలా అంటూ ఉంటారు, బాబా కూడా
వింటూ ఉంటారు, ఇప్పుడు కేవలం ఇదే కోరిక ఉంది - బాబాను
ప్రత్యక్షము చెయ్యాలి. మరియు బాబా కోరిక ఏమిటంటే - ముందు
పిల్లలు ప్రత్యక్షమవ్వాలి. బాబా పిల్లలతోపాటు ప్రత్యక్షమవుతారు.
ఒంటరిగా ప్రత్యక్షమవ్వరు. కావున బాప్ దాదా అటువంటి
ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. ఉల్లాసము కూడా మంచిగా
ఉంది, ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు, ఆ ఆత్మిక సంభాషణ సమయములో
అందరి ఉల్లాసము చాలా మంచిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే
కర్మయోగులుగా అవుతారో అప్పుడు కాస్త తేడా వచ్చేస్తుంది. మరి
మాతలు ఏం చేస్తారు? మాతలది చాలా పెద్ద గుంపు. మరియు మాతలను
చూస్తే బాప్ దాదాకు చాలా సంతోషమనిపిస్తుంది. ఎవరూ కూడా మాతలను
ఇంత ముందుకు తీసుకురాలేదు కానీ బాప్ దాదా మాతలు ముందుకు వెళ్ళటం
చూసి సంతోషిస్తారు. మాతలకు విశేషంగా ఈ సంకల్పము ఉంది - ఏదైతే
ఎవ్వరూ చేసి చూపించలేదో, దానిని మాతలమైన మేము బాబాను తోడు
పెట్టుకుని చేసి చూపిస్తాము. చేసి చూపిస్తారా? ఇప్పుడు ఒక్క
చేతితో చప్పట్లు కొట్టండి. మాతలు అన్నీ చెయ్యగలరు. మాతలలో
ఉల్లాసము బాగుంది. ఏమీ అర్థం చేసుకోకపోయినా కానీ ఇదైతే అర్థం
చేసుకున్నారు కదా - నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నా వారు.
దీనినైతే అర్థం చేసుకున్నారు కదా! మేరా బాబా (నా బాబా) అని
అయితే అందరూ అంటారు కదా? మనస్ఫూర్తిగా ఈ పాటనే పాడుకుంటూ ఉండండి,
అంతే - మేరా బాబా, మేరా బాబా, మేరా బాబా...
అచ్ఛా - ఇప్పుడు బాప్ దాదా ఒక్క సెకండు ఇస్తున్నారు, అందరూ
అలర్ట్ అయి కూర్చోండి. బాప్ దాదా పట్ల అందరికీ 100 శాతము ప్రేమ
ఉంది కదా! ప్రేమ అయితే పర్సెంటేజ్ లో లేదు కదా. 100 శాతము ఉందా?
మరి 100 శాతము ప్రేమకు రిటర్ను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారా?
100 శాతము ప్రేమ ఉంది కదా. ఎవరికైతే కాస్త తక్కువగా ఉందో వారు
చేతులెత్తండి. తర్వాత రక్షించబడతారు. ఒకవేళ తక్కువగా ఉంటే వారు
చేతులెత్తండి. 100 శాతము ప్రేమ లేకపోతే వారు చేతులెత్తండి.
ప్రేమ గురించి మాట్లాడుతున్నాము (ఒకరిద్దరు చేతులెత్తారు) అచ్ఛా,
ప్రేమ లేదా, ఏమీ పర్వాలేదు, అదే వచ్చేస్తుంది. ఎక్కడికి
వెళ్తారు, ప్రేమించాల్సిందే. అచ్ఛా, ఇప్పుడు అందరూ అలర్ట్ గా
కూర్చున్నారు కదా! ఇప్పుడు అందరూ ప్రేమకు రిటర్నులో ఒక్క సెకండు
బాబా ఎదురుగా అంతర్ముఖులుగా అయ్యి మీకు మీరే మనస్ఫూర్తిగా
మనసులో ఈ సంకల్పాన్ని చెయ్యగలరా - ఇప్పుడు మేము స్వయం పట్ల గాని
లేక ఇతరుల పట్ల గాని సమస్యగా అవ్వము. ప్రేమకు రిటర్నులో ఈ దృఢ
సంకల్పాన్ని చెయ్యగలరా? ఏమైనా కానీ అనగా ఒకవేళ ఏదైనా జరిగినా
కానీ, సెకండులో స్వయాన్ని పరివర్తన చేసుకుంటాము అని ఎవరైతే
భావిస్తున్నారో, వారు మనసులో ఈ సంకల్పాన్ని దృఢంగా చెయ్యండి.
ఎవరైతే దృఢ సంకల్పాన్ని చెయ్యగలరో, వారు చెయ్యండి. బాప్ దాదా
సహాయం చేస్తారు కానీ సహాయాన్ని తీసుకునేందుకు విధి - దృఢ
సంకల్పము యొక్క స్మృతి. బాప్ దాదా ఎదురుగా సంకల్పము చేసారు, ఈ
స్మృతి యొక్క విధి మీకు సహయోగాన్ని ఇస్తుంది. మరి చెయ్యగలరా?
తల ఊపండి. చూడండి, సంకల్పముతో జరగనిదంటూ ఏముంది, భయపడకండి, బాప్
దాదా యొక్క ఎక్స్ ట్రా సహాయం తప్పకుండా లభిస్తుంది. అచ్ఛా.
ఇటువంటి సర్వ తీవ్ర పురుషార్థీ శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబా
ప్రేమకు రిటర్ను ఇచ్చే ధైర్యవంతులైన పిల్లలకు, సదా తమ విశేషతల
ద్వారా ఇతరులను కూడా విశేష ఆత్మలుగా తయారుచేసే పుణ్యాత్ములైన
పిల్లలకు, సదా సమస్యలకు సమాధాన స్వరూపులుగా ఉంటూ విశేషంగా
ముందుకు ఎగిరి వెళ్ళే పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు
నమస్తే.
వీడ్కోలు సమయములో:-
మధుబన్ లో పైన ఎవరైతే సెక్యూరిటీ కార్యములో బిజీగా ఉన్నారో వారు
ఈ రోజు విశేషంగా బాప్ దాదా ఎదురుగా వస్తున్నారు. యజ్ఞాన్ని
రక్షించేవారిగా ఉన్నవారిది చాలా పెద్ద డ్యూటీ, కాపలా
కాస్తున్నారు, దూరంగా కూర్చుని కూడా గుర్తు చేస్తున్నారు, కనుక
ప్రత్యేకంగా బాప్ దాదా ఎవరెవరైతే పైన ఏ సేవార్థమైనా కూర్చుని
ఉన్నారో, జ్ఞాన సరోవర్ లో కావచ్చు, పాండవ భవన్ లో కావచ్చు,
శాంతివన్ లో కావచ్చు, ఎవరైతే కాపలా కాస్తున్నారో, వారికి బాప్
దాదా విశేషంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. అందరూ చాలా బాగా
కష్టపడుతున్నారు. అచ్ఛా - దేశ-విదేశాల వారు ఎవరెవరైతే
ప్రియస్మృతులను పంపారో, వారు మాకు విశేష రూపములో బాప్ దాదా
స్మృతులను ఇచ్చారు అని భావించండి. అచ్ఛా!
వరదానము:-
పాత సంస్కారాలు మరియు ప్రాపంచిక
సంబంధాల యొక్క ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ ఫరిశ్తా
భవ
ఫరిశ్తా అనగా పాత ప్రపంచము యొక్క
ఆకర్షణ నుండి ముక్తులు, సంబంధం రూపంలోనూ ఆకర్షణ ఉండకూడదు, తమ
దేహము లేక ఏ దేహధారి వ్యక్తి వైపుకూ లేక ఏదైనా వస్తువు వైపుకూ
ఆకర్షణ ఉండకూడదు, అలాగే పాత సంస్కారాల ఆకర్షణల నుండి కూడా
ముక్తులుగా ఉండాలి - సంకల్పము, వృత్తి మరియు వాణి రూపములో
ఎటువంటి సంస్కారం యొక్క ఆకర్షణ ఉండకూడదు. ఎప్పుడైతే ఇటువంటి
సర్వ ఆకర్షణల నుండి మరియు వ్యర్థ సమయము, వ్యర్థ సాంగత్యము,
వ్యర్థ వాతావరణము నుండి ముక్తులుగా అవుతారో, అప్పుడే డబుల్ లైట్
ఫరిశ్తా అని అంటారు.
స్లోగన్:-
శాంతి శక్తి ద్వారా సర్వాత్మల పాలనను
చేసేవారే ఆత్మిక సమాజ సేవకులు.
|
|
|