01-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈ పురుషోత్తమ సంగమయుగములోనే ఉత్తమోత్తమ పురుషులుగా తయారవ్వాలి, అందరికన్నా ఉత్తమ పురుషులు ఈ లక్ష్మీ-నారాయణులే’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు తండ్రితోపాటు ఏ గుప్తమైన కార్యాన్ని చేస్తున్నారు?

జవాబు:-
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము మరియు దైవీ రాజధాని యొక్క స్థాపన - ఈ కార్యాన్ని మీరు తండ్రితోపాటు గుప్త రూపములో చేస్తున్నారు. తండ్రి తోటయజమాని, వారు వచ్చి ముళ్ళ అడవిని పుష్పాలతోటగా తయారుచేస్తున్నారు. ఆ పుష్పాలతోటలో భయానకమైన, దుఃఖాన్ని ఇచ్చే వస్తువులేమీ ఉండవు.

పాట:-
చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది...

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారు అర్థం చేయించడమైతే తప్పకుండా శరీరము ద్వారానే అర్థం చేయిస్తారు కదా. ఆత్మ ఒక శరీరము లేకుండా ఏ కార్యము చేయలేదు. ఆత్మిక తండ్రి కూడా ఒకే ఒక్కసారి పురుషోత్తమ సంగమయుగములో శరీరము తీసుకోవలసి ఉంటుంది. ఇది సంగమయుగము కూడా, దీనిని పురుషోత్తమ యుగము అని కూడా అంటారు ఎందుకంటే ఈ సంగమయుగము తరువాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. సత్యయుగాన్ని కూడా పురుషోత్తమ యుగము అని అంటారు. తండ్రి వచ్చి స్థాపన చేయడము కూడా పురుషోత్తమ యుగాన్ని స్థాపన చేస్తారు. తండ్రి సంగమయుగములో వస్తారు కావున తప్పకుండా ఇది కూడా పురుషోత్తమ యుగము అవుతుంది. ఇక్కడ కూడా పిల్లలను పురుషోత్తములుగా తయారుచేస్తారు. ఆ తరువాత మీరు పురుషోత్తమ కొత్త ప్రపంచములో ఉంటారు. పురుషోత్తములు అనగా ఉత్తమోత్తమమైన పురుషులు, వారే రాధ-కృష్ణులు లేక లక్ష్మీ-నారాయణులు. ఈ జ్ఞానము కూడా మీకు ఉంది. వీరు స్వర్గానికి యజమానులు అని ఇతర ధర్మాలవారు కూడా తప్పకుండా అంగీకరిస్తారు. భారత్ కు ఎంతో గొప్ప మహిమ ఉంది. కానీ ఆ మహిమను గురించి స్వయం భారతవాసులకే తెలియదు. ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని అంటారు కూడా కదా, కానీ స్వర్గము అంటే ఏమిటో అర్థం చేసుకోరు. వారి మాటలతో - ఫలానావారు స్వర్గానికి వెళ్ళారు అని వారు స్వయమే చెప్తున్నారు, మరి దాని అర్థము వారు ఇంతవరకు నరకములో ఉన్నారనే కదా. తండ్రి వచ్చి స్థాపన చేసినప్పుడే స్వర్గము వస్తుంది. స్వర్గము అని కొత్త ప్రపంచాన్నే అనడం జరుగుతుంది. స్వర్గము మరియు నరకము అంటూ ఈ రెండు ఉన్నాయి కదా. మనుష్యులైతే స్వర్గము లక్షల సంవత్సరాలు ఉండేదని అంటారు. కానీ పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు - నిన్నే స్వర్గముండేది, అప్పుడు వీరి రాజ్యముండేది, మళ్ళీ తండ్రి నుండి ఆ వారసత్వాన్ని తీసుకుంటున్నారు.

తండ్రి అంటారు - మధురమైన ప్రియమైన పిల్లలూ, మీ ఆత్మ పతితముగా ఉంది, కావుననే అది నరకములోనే ఉంది. కలియుగము అంతమవ్వడానికి ఇప్పుడింకా 40 వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయని అంటారు కూడా, కావున అలా అనేవారిని తప్పకుండా కలియుగవాసులు అనే అంటారు కదా. పాత ప్రపంచమైతే ఉంది కదా. మనుష్యులు పాపం ఘోర అంధకారములో ఉన్నారు. అంతిమ సమయములో ఎప్పుడైతే నిప్పు అంటుకుంటుందో, అప్పుడు ఇవన్నీ అంతమైపోతాయి. నంబరువారు పురుషార్థానుసారముగా మీ బుద్ధి ప్రీతిబుద్ధిగా ఉంది. ఎంతగా ప్రీతి బుద్ధి ఉంటుందో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఉదయమే లేచి చాలా ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి. ప్రేమలో అశ్రువులు కూడా రావచ్చు ఎందుకంటే చాలా సమయము తరువాత తండ్రి వచ్చి కలుసుకున్నారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు, మేము విషయ సాగరములో మునకలు వేస్తూ ఎంత దుఃఖితులుగా అవుతూ వచ్చాము. ఇప్పుడు ఇది రౌరవ నరకము. ఇప్పుడు మీకు బాబా మొత్తము చక్రము యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. మూలవతనము అంటే ఏమిటి అనేది కూడా తండ్రి వచ్చి తెలియజేసారు. ఇంతకుముందు మీకు తెలియదు. దీనిని ముళ్ళ అడవి అనే అంటారు. స్వర్గాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా, పుష్పాలతోట అని అంటారు. తండ్రిని తోట యజమాని అని కూడా అంటారు కదా. మరి మిమ్మల్ని పుష్పాల నుండి తిరిగి ముళ్ళగా ఎవరు తయారుచేస్తారు? రావణుడు. భారత్ పుష్పాలతోటలా ఉండేదని, అది ఇప్పుడు ఒక అడవిలా ఉందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అడవిలో జంతువులు, తేళ్ళు మొదలైనవి ఉంటాయి. సత్యయుగములో భయానకమైన జంతువులు మొదలైనవేవీ ఉండవు. శాస్త్రాలలోనైతే ఎన్నో విషయాలను వ్రాసేసారు. శ్రీకృష్ణుడిని సర్పము కాటేసిందని, ఇది జరిగిందని, అది జరిగిందని ఎన్నో వ్రాసారు. అంతేకాక శ్రీకృష్ణుడిని ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. తండ్రి అర్థం చేయించారు, భక్తి పూర్తిగా వేరు, జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే. బ్రహ్మా-విష్ణు-శంకరులు జ్ఞానసాగరులు కారు. అలా కాదు. పతిత-పావనుడు అని ఒక్క జ్ఞానసాగరుడినే అంటారు. జ్ఞానము ద్వారానే మనుష్యుల సద్గతి జరుగుతుంది. సద్గతి స్థానాలు రెండు - ముక్తిధామము మరియు జీవన్ముక్తిధామము. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది కానీ అది గుప్తముగా స్థాపన అవుతోందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రియే వచ్చి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అందరూ తమ-తమ మనుష్య దేహాలలోకి వస్తారు. తండ్రికి తన దేహమంటూ ఏదీ లేదు, అందుకే వారిని నిరాకార గాడ్ ఫాదర్ అని అంటారు. మిగిలిన వారందరూ సాకారములో ఉన్నవారు. వారిని నిరాకారీ ఆత్మల నిరాకారీ తండ్రి అని అంటారు. ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉంటారు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. కానీ వారు గుప్తము. తండ్రియే వచ్చి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మూలవతనములో ఏ దుఃఖము ఉండదు. తండ్రి అంటారు, మీ కళ్యాణము ఉన్నది ఒక్క విషయములోనే, అదేమిటంటే - తండ్రిని స్మృతి చేయండి, మన్మనాభవ, అంతే. తండ్రికి పిల్లలుగా అయ్యారంటే, పిల్లలకు వారసత్వము లభించి తీరుతుందని అన్నది అర్థమవుతుంది. భగవంతుడిని స్మృతి చేసినట్లయితే సత్యయుగీ కొత్త ప్రపంచము యొక్క వారసత్వము తప్పకుండా లభిస్తుంది. ఈ పతిత ప్రపంచము యొక్క వినాశనము కూడా తప్పకుండా జరిగి తీరవలసిందే. అమరపురిలోకి వెళ్ళవలసిందే. అమరనాథుడు పార్వతులైన మీకు అమరకథను వినిపిస్తున్నారు. తీర్థయాత్రలకు ఎంతమంది మనుష్యులు వెళ్తారు, అమరనాథ్ యాత్రకు ఎంతమంది వెళ్తారు. వాస్తవానికి అక్కడ ఏమీ లేదు. అంతా మోసమే. అంశమాత్రము కూడా సత్యము లేదు. అసత్యమైన శరీరము, అసత్యమైన మాయ... అని కూడా అంటూ ఉంటారు కదా, దీనికి కూడా అర్థము ఉండాలి. ఇక్కడ ఉన్నదే అసత్యము. ఇది కూడా జ్ఞానానికి సంబంధించిన విషయము. గ్లాసును గ్లాసు అని అనడము అబద్ధము కాదు. కానీ తండ్రి గురించి ఏదైతే వినిపిస్తూ ఉంటారో, అది అసత్యమే వినిపిస్తారు. సత్యాన్ని వినిపించేది ఒక్క తండ్రి మాత్రమే. బాబా వచ్చి సత్యాతి-సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తారని ఇప్పుడు మీకు తెలుసు. అసత్యమైన (నకిలీ) వజ్రాలు, ముత్యాలు కూడా ఉంటాయి కదా. ఈ రోజుల్లో నకిలీ వస్తువుల ఆర్భాటము చాలా ఎక్కువగా ఉంది. నకిలీ వస్తువుల మెరుపు సత్యమైన వాటికన్నా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి నకిలీ రాళ్ళు ఇంతకుముందు ఉండేవి కావు. చివరిలో విదేశాల నుండి వచ్చాయి. నకిలీవాటిని, సత్యమైనవాటిని కలిపేస్తారు, ఇక తేడా అనేది తెలియనే తెలియదు. అయితే, వాటిని పరిశీలించేందుకు కూడా సాధనాలు తయారయ్యాయి. ముత్యాలలో కూడా నకిలీవి ఎలాంటివి వచ్చాయంటే, అసలు వాటి మధ్య తేడాయే తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఏ సంశయము ఉండదు. సంశయము ఉన్నవారు ఇక మళ్ళీ రానే రారు. ప్రదర్శినీకి ఎంతమంది వస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు పెద్ద-పెద్ద దుకాణాలను తెరవండి. మీదొక్కటే సత్యమైన దుకాణము. మీరు సత్యమైన దుకాణాలను తెరుస్తారు. పెద్ద-పెద్ద సన్యాసులకు పెద్ద-పెద్ద దుకాణాలు ఉంటాయి, అక్కడకు పెద్ద-పెద్ద మనుష్యులు వెళ్తారు. మీరు కూడా పెద్ద-పెద్ద సెంటర్లు తెరవండి. భక్తి మార్గపు సామాగ్రి పూర్తిగా వేరు. భక్తి ప్రారంభము నుండి జరుగుతూ వచ్చింది అని అనరు. అలా అనరు. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది అనగా పగలు వస్తుంది. అక్కడ సంపూర్ణ నిర్వికారులుగా, విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఒకప్పుడు విశ్వానికి యజమానులుగా ఉండేవారు అన్నది కూడా మనుష్యులకు తెలియదు. సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉంటారు, వేరే ఏ ధర్మమూ ఉండదు. పిల్లలు పాట కూడా విన్నారు. మనము వచ్చి మన అనంతమైన తండ్రిని కలుసుకునే ఆ సంగమయుగము యొక్క రోజు చివరికి నేడు రానే వచ్చింది అని మీరు అర్థం చేసుకున్నారు. అనంతమైన వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థము చేస్తాము. చివరికి ఆ రోజు నేడు వచ్చింది అని సత్యయుగములో అనరు. చాలా ధాన్యము పండుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని వారు భావిస్తూ ఉంటారు. స్వర్గ స్థాపనను మేము చేస్తున్నాము అని వారు భావిస్తారు. విద్యార్థులది కొత్త రక్తము, వారు మనకు ఇందులో సహాయము చేస్తారు అని వారు భావిస్తారు, కావుననే ప్రభుత్వము విద్యార్థుల కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటుంది. అయితే రాళ్ళు మొదలైనవాటిని కూడా వారే విసురుతారు. గొడవ చేయడములో అందరికన్నా ముందు విద్యార్థులే ఉంటారు. వారు చాలా తెలివైనవారిగా ఉంటారు. వారిది న్యూ బ్లడ్ (కొత్త రక్తము) అని అంటారు. ఇప్పుడు కొత్త రక్తము యొక్క విషయమేమీ లేదు. అది రక్త సంబంధము, ఇప్పుడు ఇక్కడ మీది ఆత్మిక సంబంధము. బాబా, మేము మీ రెండు మాసాల పిల్లలము అని అంటారు కదా. కొందరు పిల్లలు ఆత్మిక బర్త్ డే ను జరుపుకుంటారు. ఈశ్వరీయ జన్మదినాన్నే జరుపుకోవాలి. ఆ దైహికమైన జన్మదినాన్ని క్యాన్సల్ చేసేయాలి. మనము బ్రాహ్మణులకే తినిపిస్తాము. వాస్తవానికి ఈ జన్మదినాన్నే జరుపుకోవాలి కదా. అది ఆసురీ జన్మ, ఇది ఈశ్వరీయ జన్మ. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. కానీ ఎప్పుడైతే నిశ్చయము ఏర్పడుతుందో అప్పుడే ఇది బుద్ధిలో ఉంటుంది. ఈశ్వరీయ జన్మదినాన్ని జరుపుకుని మళ్ళీ వెళ్ళి ఆసురీ జన్మలో పడిపోవటము కాదు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఈశ్వరీయ జన్మను జరుపుకుంటూ, జరుపుకుంటూ మళ్ళీ మాయమైపోతారు. ఈ రోజుల్లోనైతే పెళ్ళిరోజును కూడా జరుపుకుంటారు, వారు పెళ్ళిని ఒక మంచి శుభకార్యముగా భావిస్తారు. నరకములోకి వెళ్ళే రోజును కూడా జరుపుకుంటారు. విచిత్రము కదా. తండ్రి కూర్చుని ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరైతే ఈశ్వరీయ జన్మదినాన్ని బ్రాహ్మణులతోనే జరుపుకోవాలి. మనము శివబాబాకు పిల్లలము, మనము జన్మదినాన్ని జరుపుకుంటే శివబాబా స్మృతియే ఉంటుంది. ఏ పిల్లలైతే నిశ్చయబుద్ధి కలవారో, వారు జన్మదినాన్ని జరుపుకోవాలి. ఆ ఆసురీ జన్మను పూర్తిగా మర్చిపోవాలి. ఇది కూడా తండ్రి సలహాగా ఇస్తున్నారు. నేను అయితే బాబాకు చెందినవాడిగా అయిపోయాను, నాకు బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నట్లయితే ఇక అంతమతి సో గతి అవుతుంది. తండ్రి స్మృతిలో మరణించినట్లయితే మరుసటి జన్మ కూడా అదే విధముగా లభిస్తుంది. లేకపోతే అంతిమ సమయములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో... ఇది కూడా గ్రంథ్ లో ఉంది. అలాగే ఈ ప్రపంచములో ఏమంటూ ఉంటారంటే - అంతిమ సమయములో గంగా నదీ తీరములో ఉండాలి అని. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. మీకు తండ్రి చెప్తున్నారు, శరీరాన్ని వదిలే సమయములో కూడా స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. బుద్ధిలో తండ్రి మరియు చక్రమే స్మృతిలో ఉండాలి. కావున తప్పకుండా ఆ పురుషార్థము చేస్తూ ఉన్నట్లయితేనే అంత్యకాలములో స్మృతి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే పిల్లలైన మీరు ఇప్పుడు అశరీరిగా అయి తిరిగి వెళ్ళాలి. ఇక్కడ పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానులుగా అవ్వాలి. ఈ సమయములో ఆత్మయే అపవిత్రముగా ఉంది, కావున పవిత్రమైన శరీరము ఎలా లభిస్తుంది? బాబా ఎన్నో ఉదాహరణలను అర్థం చేయించారు, ఎంతైనా వీరు ఒక వజ్రాల వ్యాపారి కదా. మాలిన్యము అనేది నగలో కాదు, బంగారములో కలుస్తుంది. 24 క్యారెట్లు నుండి 22 క్యారెట్లుగా చేయాలంటే వెండిని కలుపుతారు. ఇప్పుడైతే అసలు బంగారమే లేదు. అందరి నుండి తీసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో నోట్లు కూడా ఎలాంటివి తయారుచేస్తున్నారో చూడండి. కాగితము కూడా సరిపడా లేదు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతూ వచ్చిందని పిల్లలు భావిస్తారు. పూర్తి చెకింగ్ చేస్తారు, లాకర్లు మొదలైనవి తెరిపిస్తారు, పూర్తిగా అన్నీ వెతుకుతారు. కొందరిది మట్టిలో కలిసిపోతుంది... అన్న గాయనము కూడా ఉంది. మంటలు కూడా జోరుగా అంటుకుంటాయి. ఇవన్నీ జరిగేదే ఉందని పిల్లలైన మీకు తెలుసు, అందుకే మీరు భవిష్యత్తు కొరకు పెట్టె-బేడె తయారుచేసుకుంటున్నారు. ఇంకెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. మీకే 21 జన్మల కొరకు వారసత్వము లభిస్తుంది. మీ ధనము ద్వారానే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు, అందులో మీరే నివసిస్తారు.

పిల్లలైన మీరు మీ పురుషార్థము ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. పేదల పాలిటి పెన్నిధి అయిన బాబా స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చారు, కానీ మీ చదువు ద్వారానే ఆ విధముగా తయారవుతారు, అంతేకానీ కృప లేక ఆశీర్వాదాలతో కాదు. టీచరుకైతే చదివించడమనేది ధర్మము. ఇందులో కృప యొక్క విషయమేమీ లేదు. టీచరుకు ప్రభుత్వము నుండి జీతము లభిస్తుంది. కావున తప్పకుండా చదివిస్తారు. ఇక్కడ మీకు చాలా పెద్ద బహుమానము లభిస్తుంది, పదమాపదమపతులుగా తయారవుతారు. శ్రీకృష్ణుడి పాదాలలో పద్మము గుర్తును చూపిస్తారు. భవిష్యత్తులో పదమపతులుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. మీరు ఎంతో సుఖీగా, షావుకారులుగా, అమరులుగా అవుతారు, కాలుడిపై విజయము పొందుతారు. ఈ విషయాలను మనుష్యులు అర్థం చేసుకోలేరు. మీ ఆయుష్షు పూర్తి అయిపోతుంది, మీరు అమరులుగా అయిపోతారు. దానికి గుర్తుగా వారు పాండవుల చిత్రాలను పెద్దగా, పొడవుగా చూపించారు. పాండవులు అంత పొడుగ్గా ఉండేవారని వారు భావిస్తారు. వాస్తవానికి పాండవులు మీరే. ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. మనుష్యులేమీ అంత ఎక్కువ పొడుగ్గా ఉండరు. ఉంటే ఆరడుగులు ఉంటారు. భక్తి మార్గములో మొట్టమొదట శివబాబా భక్తి జరుగుతుంది. వారు అంత పెద్దగా తయారుచేయరు. మొదట శివబాబా యొక్క అవ్యభిచారీ భక్తి జరుగుతుంది, ఆ తరువాత దేవతల మూర్తులను తయారుచేస్తారు, వారి చిత్రాలను చాలా పెద్ద-పెద్దగా తయారుచేస్తారు, ఆ తరువాత పాండవుల చిత్రాలను పెద్ద-పెద్దగా తయారుచేస్తారు. పూజ కొరకే ఈ చిత్రాలన్నింటినీ తయారుచేస్తారు. లక్ష్మీ పూజను 12 నెలలకు ఒకసారి చేస్తారు. జగదాంబ పూజను రోజూ చేస్తూ ఉంటారు. మీకు డబుల్ పూజ జరుగుతుందని కూడా బాబా అర్థం చేయించారు. నాకైతే కేవలం ఆత్మ రూపములోనే అనగా లింగము రూపములోనే జరుగుతుంది. మీకు సాలిగ్రామాల రూపములో కూడా పూజ జరుగుతుంది మరియు దేవతల రూపములో కూడా పూజ జరుగుతుంది. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు ఎన్ని సాలిగ్రామాలను తయారుచేస్తారు. మరి ఎవరు పెద్ద అయినట్లు? కావుననే తండ్రి పిల్లలకు నమస్తే చెప్తారు. తండ్రి ఎంత ఉన్నత పదవిని ప్రాప్తింపజేస్తారు.

బాబా ఎంత గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తారు, మరి పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు, భగవాన్, భగవతీలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు. వారికి ఎంతగా కృతజ్ఞతను తెలియజేయాలి. తండ్రి స్మృతిలో ఉండడము ద్వారా స్వప్నాలు కూడా మంచిగా వస్తాయి. సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ ఈశ్వరీయ ఆత్మిక జన్మదినాన్ని జరుపుకోవాలి, ఆత్మిక సంబంధాన్ని ఉంచుకోవాలి, రక్త సంబంధాన్ని కాదు. దైహికమైన ఆసురీ జన్మదినాన్ని క్యాన్సల్ చేయాలి. అది ఇక గుర్తు కూడా రాకూడదు.

2. భవిష్యత్తు కొరకు మీ పెట్టె-బేడెను తయారుచేసుకోవాలి. మీ ధనాన్ని భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవలో సఫలం చేసుకోవాలి. మీ పురుషార్థము ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి.

వరదానము:-
స్నేహము మరియు సహయోగము యొక్క విధి ద్వారా సహజయోగీ భవ

బాప్ దాదాకు పిల్లల స్నేహమే ఇష్టము. ఎవరైతే యజ్ఞ స్నేహీలుగా మరియు సహయోగులుగా అవుతారో వారు సహజయోగులుగా స్వతహాగానే అవుతారు. సహయోగమనేది సహజయోగము. మనసున్నవాడైన ఆ తండ్రికి మనసులోని స్నేహము మరియు మనసుతోకూడిన సహయోగమే ప్రియమైనవి. చిన్న మనసు కలవారు చిన్న ఒప్పందము చేసుకుని సంతోషపడిపోతారు మరియు పెద్ద మనసు కలవారు అనంతమైన ఒప్పందాన్ని చేస్తారు. విలువ అనేది స్నేహానిదే కానీ వస్తువుది కాదు, అందుకే సుదాముని పచ్చి బియ్యానికి గాయనము ఉంది. మామూలుగా కూడా ఎవరు ఎంత ఇచ్చినా సరే, స్నేహము లేనట్లయితే అది జమ అవ్వదు. స్నేహముతో కొద్దిగా జమ చేసినా సరే అది పదమాలుగా అయిపోతుంది.

స్లోగన్:-
సమయము మరియు శక్తి వ్యర్థముగా పోకూడదు, దాని కోసం ముందు ఆలోచించండి, ఆ తరువాత చెయ్యండి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

బాప్ దాదా పిల్లలకు విశేషమైన సూచనను ఇస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు తీవ్ర పురుషార్థము యొక్క లగనమును అగ్ని రూపములోకి తీసుకురండి, జ్వాలాముఖీగా అవ్వండి. మనసు యొక్క, సంబంధ సంపర్కాల యొక్క లెక్కాచారాలు ఏవైతే మిగిలి ఉన్నాయో, వాటిని జ్వాలా స్వరూపపు స్మృతితో భస్మము చేయండి.