ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా
అయితే భావించాలి కదా. తండ్రి పిల్లలకు అర్థం చేయించారు - మొట్టమొదట ఈ అభ్యాసం చేయండి,
నేను ఆత్మను, శరీరాన్ని కాను. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో, అప్పుడే
పరమపితను స్మృతి చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించకపోతే తప్పకుండా లౌకిక సంబంధీకులు,
వ్యాపారము మొదలైనవే గుర్తొస్తూ ఉంటాయి, అందుకే మొట్టమొదట - నేను ఆత్మను అన్న ఈ
అభ్యాసం ఉండాలి, అప్పుడే ఆత్మిక తండ్రి యొక్క స్మృతి నిలుస్తుంది. స్వయాన్ని దేహముగా
భావించకండి అన్న శిక్షణను తండ్రి ఇస్తారు. ఈ జ్ఞానాన్ని తండ్రి మొత్తం కల్పంలో
ఒకేసారి ఇస్తారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఈ వివరణ లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా
భావించినట్లయితే తండ్రి కూడా గుర్తుకొస్తారు. అర్ధకల్పం మీరు స్వయాన్ని దేహంగా
భావించారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఏ విధముగా మీరు ఆత్మనో, అదే విధంగా
నేను కూడా ఆత్మను. కానీ నేను సుప్రీమ్. నేను ఆత్మను కావున నాకు ఏ దేహమూ గుర్తుకు
రాదు. ఈ దాదా అయితే శరీరధారి కదా. ఆ తండ్రి నిరాకారుడు. ఈ ప్రజాపిత బ్రహ్మా అయితే
సాకారమైనవారు. శివబాబా యొక్క అసలైన పేరు ‘శివ’. వారూ ఆత్మయే కానీ వారు
ఉన్నతోన్నతమైనవారు అనగా సుప్రీమ్ ఆత్మ, వారు ఈ సమయంలోనే వచ్చి ఈ శరీరంలోకి
ప్రవేశిస్తారు. వారెప్పుడూ దేహాభిమానీగా అవ్వరు. దేహాభిమానులుగా సాకార మనుష్యులు
అవుతారు, కానీ వారు నిరాకారుడు. వారు వచ్చి ఈ అభ్యాసం చేయించాలి. వారంటారు - మీరు
స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, ఆత్మను అన్న ఈ పాఠాన్ని కూర్చొని చదవండి.
ఆత్మనైన నేను శివబాబా సంతానాన్ని. ప్రతి విషయములోనూ అభ్యాసం కావాలి కదా. తండ్రి
కొత్తగా ఏమీ అర్థం చేయించటం లేదు. మీరు ఎప్పుడైతే స్వయాన్ని చాలా పక్కాగా ఆత్మగా
భావిస్తారో, అప్పుడు తండ్రి కూడా పక్కాగా గుర్తుంటారు. దేహాభిమానం ఉన్నట్లయితే
తండ్రిని స్మృతి చేయలేరు. అర్ధకల్పం మీకు దేహ అహంకారం ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా
భావించండి అని ఇప్పుడు మీకు నేర్పిస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఇలా ఎవరూ
సత్యయుగంలో నేర్పించరు. శరీరానికి తప్పకుండా పేరు పెట్టడం జరుగుతుంది. లేకపోతే
ఒకరినొకరు ఏమని పిలవాలి. ఇక్కడ మీరు తండ్రి నుండి ఏ వారసత్వాన్ని అయితే పొందారో, ఆ
ప్రారబ్ధాన్నే అక్కడ పొందుతారు. ఇకపోతే, పిలవడమైతే పేరుతోనే పిలుస్తారు కదా.
శ్రీకృష్ణ అన్నది కూడా శరీరం యొక్క పేరే కదా. పేరు లేకుండా కార్య-వ్యవహారాలు
మొదలైనవి నడవలేవు. అలాగని అక్కడ, స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎవరూ అనరు. అక్కడ
ఆత్మాభిమానులుగానే ఉంటారు. ఈ అభ్యాసాన్ని మీ చేత ఇప్పుడు చేయించడం జరుగుతుంది
ఎందుకంటే తలపై చాలా పాపాలు ఉన్నాయి. మెల్ల-మెల్లగా కొద్దికొద్దిగా పాపాలు
పెరుగుతూ-పెరుగుతూ ఇప్పుడు పూర్తిగా పాపాత్ములుగా అయిపోయారు. అర్ధకల్పం ఏదైతే చేసారో,
అది అంతం కూడా అవుతుంది కదా. మెల్ల-మెల్లగా తగ్గుతూ ఉంటుంది. సత్యయుగములో మీరు
సతోప్రధానులుగా ఉంటారు, త్రేతాయుగములో సతోగా అవుతారు. వారసత్వం అనేది ఇప్పుడు
లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వం
లభిస్తుంది. ఈ విధంగా దేహీ-అభిమానులుగా అయ్యే శిక్షణను తండ్రి ఇప్పుడు ఇస్తారు.
సత్యయుగములో ఈ శిక్షణ లభించదు. తమ-తమ పేర్లు అనుసారంగానే నడుచుకుంటారు. ఇక్కడ మీరు
ప్రతి ఒక్కరూ స్మృతి బలం ద్వారా పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవ్వాలి.
సత్యయుగములో ఈ శిక్షణ యొక్క అవసరమే ఉండదు. అలాగే ఈ శిక్షణను మీరు అక్కడికి
తీసుకువెళ్ళరు కూడా. అక్కడికి ఈ జ్ఞానాన్ని తీసుకువెళ్ళరు, అలాగే యోగాన్ని
తీసుకువెళ్ళరు. మీరు పతితుల నుండి పావనులుగా ఇప్పుడే అవ్వాలి. ఆ తర్వాత
మెల్ల-మెల్లగా కళలు తగ్గిపోతాయి. ఏ విధంగా చంద్రుని కళలు తగ్గిపోతూ-తగ్గిపోతూ
చివరికి నెలవంక మిగులుతుంది కదా. అందుకే ఈ విషయంలో తికమకపడకండి. ఏదైనా అర్థం కాకపోతే
అడగండి.
మొట్టమొదట - నేను ఆత్మను అన్నది పక్కాగా నిశ్చయం చేసుకోండి. మీ ఆత్మయే ఇప్పుడు
తమోప్రధానంగా అయ్యింది. మొదట సతోప్రధానంగా ఉండేది, ఆ తర్వాత రోజురోజుకూ కళలు తగ్గుతూ
ఉంటాయి. నేను ఆత్మను అన్నది పక్కా అవ్వకపోవడం వలనే మీరు తండ్రిని మర్చిపోతారు.
మొట్టమొదటి ముఖ్యమైన విషయమే ఇది. ఆత్మాభిమానులుగా అయినట్లయితే తండ్రి గుర్తుకొస్తారు,
అలాగే వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. వారసత్వం గుర్తుకొస్తే పవిత్రంగా కూడా ఉంటారు,
దైవీ గుణాలు కూడా ఉంటాయి. లక్ష్యము-ఉద్దేశ్యమైతే ఎదురుగా ఉంది కదా. ఇది గాడ్లీ
యూనివర్సిటీ (ఈశ్వరీయ విశ్వవిద్యాలయము). భగవంతుడు చదివిస్తారు. దేహీ-అభిమానులుగా
కూడా వారే తయారుచేయగలరు, ఇంకెవరికీ ఈ కళ గురించి తెలియనే తెలియదు. ఇది ఒక్క తండ్రే
నేర్పిస్తారు. ఈ దాదా కూడా పురుషార్థం చేస్తారు. తండ్రి దేహీ-అభిమానిగా అయ్యే
పురుషార్థం చేయడానికి వారు ఎప్పుడూ దేహాన్ని తీసుకోనే తీసుకోరు. మిమ్మల్ని
దేహీ-అభిమానులుగా తయారుచేయడానికి వారు కేవలం ఈ సమయంలోనే వస్తారు. ఎవరి తలపైనెతే
ఎన్నో బాధ్యతలు ఉంటాయో, వారు ఎలా నిద్రపోగలరు... అన్న నానుడి కూడా ఉంది. చాలా
ఎక్కువ వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి ఉంటే తీరిక దొరకదు మరియు ఎవరికైతే తీరిక
లభిస్తుందో, వారు పురుషార్థం చేయడానికి బాబా ఎదురుగా వస్తారు. కొత్తవారు కూడా కొందరు
వస్తారు. జ్ఞానమైతే చాలా బాగుంది అని భావిస్తారు. తండ్రినైన నన్ను స్మృతి
చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి. తండ్రి ఈ
విషయాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి ఎవ్వరిపైనా దోషం మోపరు. మీరు పావనుల నుండి
పతితులుగా అవ్వవలసిందే మరియు వారు వచ్చి పతితులను పావనంగా తయారుచేయాల్సిందే అని
వారికి తెలుసు. ఇది తయారై తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఎవరినీ నిందించే విషయము లేదు.
పిల్లలైన మీరు ఇప్పుడు జ్ఞానాన్ని మంచి రీతిలో తెలుసుకున్నారు, ఇంకెవరికీ ఈశ్వరుని
గురించి తెలియనే తెలియదు అందుకే అనాథలుగా, నాస్తికులుగా పిలువబడతారు. ఇప్పుడు తండ్రి
పిల్లలైన మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారుచేస్తారు. టీచర్ రూపంలో శిక్షణను ఇస్తారు.
ఈ సృష్టి చక్రం ఎలా నడుస్తుంది అన్న శిక్షణ లభించడంతో మీరు కూడా తీర్చిదిద్దబడతారు.
భారత్ శివాలయంగా ఉండేది, ఇప్పుడది వేశ్యాలయంగా ఉంది కదా. ఇందులో నింద యొక్క విషయమే
లేదు. ఇది ఒక ఆట, దీని గురించి తండ్రి అర్థం చేయిస్తారు. మీరు దేవతల నుండి అసురులుగా
ఎలా అయ్యారు అనేది అర్థం చేయిస్తారు, అంతేకానీ మీరు అసురులుగా ఎందుకు అయ్యారు అని
అనరు. తండ్రి వచ్చిందే పిల్లలకు తమ పరిచయాన్ని ఇవ్వడానికి, మరియు సృష్టి చక్రము ఎలా
తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని ఇస్తారు. మనుష్యులే తెలుసుకుంటారు కదా. ఇప్పుడు మీరు
తెలుసుకొని దేవతలుగా అవుతారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు, దీనిని
తండ్రే కూర్చొని చదివిస్తారు. ఇక్కడైతే అంతా మనుష్యులే మనుష్యులు ఉన్నారు. టీచర్ గా
అయి చదివించేందుకు దేవతలైతే ఈ సృష్టిపైకి రాలేరు. చదివించే తండ్రి ఎలా వచ్చి
చదివిస్తారో చూడండి. పరమపిత పరమాత్మ ఏదో ఒక రథాన్ని తీసుకుంటారు అని అంటూ ఉంటారు,
కానీ వారు ఏ రథాన్ని తీసుకుంటారు అన్నది పూర్తిగా వ్రాయరు. త్రిమూర్తి యొక్క
రహస్యాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. పరమపిత అనగా పరమ ఆత్మ. వారు ఎలా ఉన్నారు అని
తమ పరిచయాన్ని అయితే ఇస్తారు కదా. ఇందులో అహంకారం యొక్క విషయం లేదు. ఇది అర్థం
చేసుకోని కారణంగా వీరిలో అహంకారం ఉంది అని అంటారు. నేను పరమాత్మను అని ఈ బ్రహ్మా
అయితే అనరు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. ఇవి తండ్రి మహావాక్యాలు. ఆత్మలందరికీ
తండ్రి ఒక్కరే. వీరిని దాదా అని అంటారు. వీరు భాగ్యశాలి రథము కదా. పేరు కూడా బ్రహ్మా
అని పెట్టడం జరిగింది ఎందుకంటే బ్రాహ్మణులు కావాలి కదా. ఆదిదేవుడు ప్రజాపిత బ్రహ్మా.
వీరు ప్రజలకు తండ్రి, మరి ప్రజలెవరు? ప్రజాపిత బ్రహ్మా శరీరధారి కావున వారు దత్తత
తీసుకున్నారు కదా. పిల్లలకు శివబాబా అర్థం చేయిస్తారు - నేను దత్తత తీసుకోను,
ఆత్మలైన మీరందరూ సదా నాకు పిల్లలే. నేను మిమ్మల్ని పిల్లలుగా చేసుకోను, నేనైతే
ఆత్మలైన మీ యొక్క అనాది తండ్రిని. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు,
అయినప్పటికీ మళ్ళీ స్వయాన్ని ఆత్మగా భావించండి అని అంటారు. మీరు మొత్తం పాత
ప్రపంచమంతటినీ సన్యసిస్తారు. ఈ ప్రపంచం నుండి అందరూ తిరిగివెళ్తారు అని బుద్ధి
ద్వారా తెలుసుకుంటారు. అలాగని సన్యసించి అడవులలోకి వెళ్ళాలి అని కాదు. మొత్తం
ప్రపంచమంతటినీ సన్యసించి మనం మన ఇంటికి వెళ్ళిపోతాము, అందుకే ఒక్క తండ్రి తప్ప
ఇంకేదీ గుర్తు రాకూడదు. 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత అయితే ఇక వాణి నుండి
అతీతంగా వానప్రస్థములోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి. ఈ వానప్రస్థము యొక్క విషయము
ఇప్పటికి సంబంధించినదే. భక్తి మార్గంలోనైతే వానప్రస్థం గురించి ఎవ్వరికీ తెలియనే
తెలియదు. వానప్రస్థము యొక్క అర్థాన్ని వారు తెలియజేయలేరు. వాణి నుండి అతీతమైన
స్థానము అని మూలవతనాన్ని అంటారు. అక్కడ ఆత్మలందరూ నివసిస్తారు కావున అది అందరి
వానప్రస్థావస్థ, అందరూ ఇంటికి వెళ్ళాలి. ఆత్మ భృకుటి మధ్యలో మెరుస్తున్న సితార అని
శాస్త్రాలలో చూపిస్తారు. ఆత్మ అంగుష్ఠం వలె ఉంటుందని కొందరు భావిస్తారు, అంగుష్ట
రూపాన్నే స్మృతి చేస్తారు. నక్షత్రాన్ని స్మృతి ఎలా చేయాలి? దానికి పూజ ఎలా చేయాలి?
తండ్రి అర్థం చేయిస్తారు - మీరు దేహాభిమానంలోకి వచ్చినప్పుడు పూజారులుగా అయిపోతారు.
భక్తి సమయం ప్రారంభమవుతుంది, దానిని భక్తి మార్గము అని అంటారు. జ్ఞాన మార్గం వేరు.
జ్ఞానం మరియు భక్తి కలిపి ఉండలేవు. రాత్రి మరియు పగలు కలిపి ఉండలేవు. పగలు అని
సుఖాన్ని అంటారు, రాత్రి అని దుఃఖాన్ని అనగా భక్తిని అంటారు. ప్రజాపిత బ్రహ్మా
యొక్క పగలు మరియు రాత్రి అని అంటారు. మరి ప్రజలు మరియు బ్రహ్మా, ఇరువురూ తప్పకుండా
కలిసి ఉంటారు కదా. బ్రాహ్మణులమైన మనమే అర్ధకల్పం సుఖాన్ని అనుభవిస్తాము, మళ్ళీ
అర్ధకల్పం దుఃఖాన్ని అనుభవిస్తాము అని మీరు భావిస్తారు. ఇది బుద్ధి ద్వారా అర్థం
చేసుకోవలసిన విషయము. అందరూ తండ్రిని స్మృతి చేయలేరు అని కూడా మీకు తెలుసు, అయినా
కానీ - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు
అని తండ్రి స్వయంగా అర్థం చేయిస్తారు. ఈ సందేశాన్ని అందరికీ చేర్చాలి. సేవ చేయాలి,
ఎవరైతే అసలు సేవ చేయనే చేయరో, వారు పుష్పాలు కారు. తోట యజమాని తోటలోకి వచ్చినప్పుడు
వారి ముందు పుష్పాలే ఉండాలి, అనగా ఎవరైతే సేవాధారులై ఉంటారో, అనేకుల కళ్యాణం
చేస్తారో, వారే ఉండాలి. ఎవరికైతే దేహాభిమానం ఉంటుందో, వారు - మేము పుష్పము కాదు అని
స్వయమూ అర్థం చేసుకుంటారు. బాబా ఎదురుగా మంచి-మంచి పుష్పాలు కూర్చుని ఉన్నారు.
కావున తండ్రి దృష్టి వారి వైపుకు వెళ్తుంది. (జ్ఞాన) డ్యాన్స్ కూడా బాగా జరుగుతుంది.
(డ్యాన్సింగ్ గర్ల్ ఉదాహరణ లాగ) స్కూల్లో టీచర్ కు కూడా - ఎవరు మొదటి నంబరులో
ఉన్నారు, ఎవరు రెండవ నంబరులో, ఎవరు మూడవ నంబరులో ఉన్నారు అని తెలుస్తుంది కదా.
తండ్రి యొక్క అటెన్షన్ కూడా సేవ చేసే వారి వైపుకే వెళ్తుంది. హృదయాన్ని కూడా వారే
అధిరోహించగలరు. డిస్ సర్వీస్ చేసేవారు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారా. తండ్రి
మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు, అదేమిటంటే - స్వయాన్ని ఆత్మగా
నిశ్చయం చేసుకోండి, అప్పుడే తండ్రి స్మృతి నిలుస్తుంది. దేహాభిమానం ఉన్నట్లయితే
తండ్రి స్మృతి నిలవదు. లౌకిక సంబంధీకుల వైపుకు, వ్యాపార-వ్యవహారాల వైపుకు బుద్ధి
వెళ్ళిపోతుంది. దేహీ-అభిమానులుగా అయినట్లయితే పారలౌకిక తండ్రే గుర్తుకొస్తారు.
తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించడము - ఇందులోనే శ్రమ
ఉంది. అందుకు ఏకాంతం కావాలి. 7 రోజుల భట్టీ యొక్క కోర్సు చాలా కఠినమైనది. ఎవ్వరి
స్మృతి రాకూడదు, ఎవ్వరికీ ఉత్తరాలు కూడా వ్రాయకూడదు. మీ ఈ భట్టీని ప్రారంభించడం
జరిగింది. ఇక్కడైతే అందరినీ ఉంచలేరు, అందుకే ఇంట్లో ఉంటూ అభ్యాసం చేయండి అని చెప్పడం
జరుగుతుంది. భక్తులు కూడా భక్తి చేయడం కోసం వేరే గదిని ఏర్పాటు చేసుకుంటారు. లోపల
గదిలో కూర్చొని మాలను స్మరిస్తారు, ఈ స్మృతి యాత్రకి కూడా ఏకాంతం కావాలి. ఒక్క
తండ్రినే స్మృతి చేయాలి, ఇందులో మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు. ఈ స్మృతి యొక్క
అభ్యాసం చేసేందుకు ఖాళీ సమయం కావాలి.
మీకు తెలుసు - లౌకిక తండ్రి హద్దు రచయిత, వీరు అనంతమైన రచయిత. ప్రజాపిత బ్రహ్మా
అనంతమైనవారు కదా. వారు పిల్లలను దత్తత తీసుకుంటారు. శివబాబా దత్తత తీసుకోరు,
వారికైతే ఎప్పటికీ పిల్లలమే. ఆత్మలమైన మనము శివబాబాకు అనాది పిల్లలము అని మీరు
అంటారు. బ్రహ్మా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. ప్రతి ఒక్క విషయమూ బాగా అర్థం
చేసుకోవలసినదే. తండ్రి ప్రతిరోజూ పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు అంటారు - బాబా,
స్మృతి ఉండడం లేదు. తండ్రి అంటారు - స్మృతి కోసం కొంత సమయం కేటాయించాలి. కొందరు ఎలా
ఉంటారంటే, వారు అస్సలు సమయాన్ని కేటాయించలేకపోతారు. బుద్ధిలో చాలా పని ఉంటుంది
కావున స్మృతి యాత్ర ఎలా జరుగగలదు. తండ్రి అర్థం చేయిస్తారు - స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు, ఇదే ముఖ్యమైన
విషయము. నేను ఆత్మను, శివబాబా సంతానాన్ని - ఇదే మన్మనాభవ కదా. ఇందులో కృషి చేయాల్సి
ఉంటుంది. ఆశీర్వాదాల విషయము లేదు. ఇది చదువు, ఇందులో కృప లేక ఆశీర్వాదాలు అనేవి
ఉండవు. నేను ఎప్పుడైనా మీ పైన చేతిని పెడతానా! అనంతమైన తండ్రి నుండి మనం
వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. అమర్ భవ, ఆయుష్మాన్ భవ... ఇందులో అన్నీ
వచ్చేస్తాయి. మీరు పూర్ణాయుష్షును పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు సంభవించదు.
ఈ వారసత్వాన్ని సాధు-సన్యాసులు మొదలైనవారు ఎవరూ ఇవ్వలేరు. వారు పుత్రవాన్ భవ... అని
అంటారు. కావున మనుష్యులు వారి కృప ద్వారా కొడుకు జన్మించాడు అని భావిస్తారు. దానితో
ఎవరికైతే పిల్లలు ఉండరో, వారు వెళ్ళి వారికి శిష్యులుగా అవుతారు. జ్ఞానమైతే ఒక్కసారే
లభిస్తుంది. ఇది అవ్యభిచారీ జ్ఞానము, దీని ద్వారా అర్ధకల్పం ప్రారబ్ధం నడుస్తుంది.
ఆ తర్వాత అజ్ఞానం ఉంటుంది. భక్తిని అజ్ఞానము అని అంటారు. ప్రతి ఒక్క విషయాన్ని ఎంత
మంచి రీతిలో అర్థం చేయించడం జరుగుతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.