ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చుని మీరు ఏమి
చేస్తారు? కేవలం శాంతిలో కూర్చున్నారు అని కాదు, అర్థ సహితముగా జ్ఞానమయమైన అవస్థలో
కూర్చున్నారు. తండ్రిని మనం ఎందుకు స్మృతి చేస్తాము అన్న జ్ఞానము పిల్లలైన మీకు ఉంది.
తండ్రి మనకు చాలా పెద్ద ఆయుష్షును ఇస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన పాపాలు
కట్ అవుతాయి. మనము సత్యమైన బంగారముగా, సతోప్రధానముగా అవుతాము. మీ అలంకరణ ఎంతగా
జరుగుతుంది. మీ ఆయుష్షు పెరుగుతుంది. ఆత్మ కాంచనముగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలో
మాలిన్యము చేరింది. స్మృతియాత్ర ద్వారా రజో-తమో యొక్క మాలిన్యము ఏదైతే చేరిందో,
అదంతా తొలగిపోతుంది. అంతగా మీకు లాభము కలుగుతుంది. ఆ తర్వాత ఆయుష్షు పెరుగుతుంది.
మీరు స్వర్గవాసులుగా అవుతారు మరియు చాలా ధనవంతులుగా అవుతారు. మీరు పదమాపదమ
భాగ్యశాలులుగా అవుతారు. అందుకే తండ్రి అంటారు - మన్మనాభవ, నన్నొక్కరినే స్మృతి
చేయండి. ఈ మాట ఏ దేహధారి గురించి అనరు. తండ్రికైతే శరీరము లేదు. మీ ఆత్మ కూడా
నిరాకారిగా ఉండేది. మళ్ళీ పునర్జన్మలలోకి వస్తూ-వస్తూ పారసబుద్ధి నుండి రాతిబుద్ధి
కలదిగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాంచనముగా అవ్వాలి. ఇప్పుడు మీరు పవిత్రముగా
అవుతున్నారు. నీటి స్నానాలనైతే జన్మ-జన్మాంతరాలూ చేశారు. వీటి ద్వారా మేము పావనముగా
అవుతాము అని భావించారు కానీ పావనముగా అయ్యేందుకు బదులుగా ఇంకా పతితులుగా అయి
నష్టములో పడిపోయారు ఎందుకంటే ఇది ఉన్నదే అసత్యమైన మాయ, అందరిలోనూ అసత్యము మాట్లాడే
సంస్కారాలు ఉన్నాయి. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని పావనముగా తయారుచేసి వెళ్తాను,
మిమ్మల్ని మళ్ళీ పతితముగా ఎవరు తయారుచేస్తారు? ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు కదా.
ఎంతగా గంగా స్నానాలు చేస్తూ వచ్చారు కానీ పావనముగా అయితే అవ్వలేదు. కానీ పావనముగా
అయ్యే పావన ప్రపంచములోకి వెళ్ళవలసి ఉంటుంది. శాంతిధామము మరియు సుఖధామము పావన ధామాలు.
ఇది ఉన్నదే రావణుని ప్రపంచము, దీనిని దుఃఖధామము అని అంటారు. ఇది సహజముగా అర్థం
చేసుకునే విషయము కదా. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. అలాగే దీనిని ఎవరికైనా
వినిపించడములో కూడా ఎటువంటి కష్టమూ లేదు. ఎప్పుడైనా ఎవరైనా కలిసినప్పుడు కేవలం ఈ
మాట చెప్పండి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఆత్మల
తండ్రి పరమపిత శివ పరమాత్మ. ప్రతి ఒక్కరి శరీరానికి వేర్వేరు తండ్రులు ఉంటారు.
ఆత్మలకైతే ఒకే తండ్రి ఉన్నారు. ఎంత బాగా అర్థం చేయిస్తారు, మరియు హిందీలోనే అర్థం
చేయిస్తారు. హిందీ భాషయే ముఖ్యమైనది. మీరు పదమాపదమ భాగ్యశాలులు అని ఈ దేవీ-దేవతలనే
అంటారు కదా. వీరు ఎంత భాగ్యశాలులు. వీరు స్వర్గాధిపతులుగా ఎలా అయ్యారు అన్నది ఎవరికీ
తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి వినిపిస్తున్నారు. ఈ సహజయోగము ద్వారా ఈ పురుషోత్తమ
సంగమయుగములోనే ఈ విధంగా అవుతారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచము
యొక్క సంగమము. తర్వాత మీరు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి
కేవలం ఇదే చెప్తున్నారు - ఈ రెండు మాటలను అర్థ సహితముగా స్మృతి చేయండి. గీతలో
మన్మనాభవ అని ఉంది. ఆ మాటలు చదువుతారు కానీ వాటి అర్థము ఏమాత్రమూ తెలియదు. తండ్రి
అంటారు, నన్ను సృతి చేయండి ఎందుకంటే నేనే పతిత-పావనుడను, ఇంకెవ్వరూ ఈ విధంగా అనలేరు.
తండ్రే అంటారు, నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనముగా అయి పావన ప్రపంచములోకి
వెళ్ళిపోతారు. మొట్టమొదట మీరు సతోప్రధానముగా ఉండేవారు, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ,
తీసుకుంటూ తమోప్రధానముగా అయ్యారు. ఇప్పుడు 84 జన్మల తర్వాత మళ్ళీ మీరు కొత్త
ప్రపంచములో దేవతలుగా అవుతారు.
రచయిత మరియు రచన - ఇరువురినీ మీరు తెలుసుకున్నారు. కావున ఇప్పుడు మీరు
ఆస్తికులుగా అయ్యారు. ఇంతకుముందు జన్మ-జన్మాంతరాలూ మీరు నాస్తికులుగా ఉండేవారు.
తండ్రి ఈ విషయమునేదైతే వినిపిస్తారో, ఇది ఇంకెవరికీ తెలియనే తెలియదు. మీరు ఎక్కడకు
వెళ్ళినా, ఎవ్వరూ మీకు ఈ విషయాలను వినిపించరు. ఇప్పుడు ఇద్దరు తండ్రులూ మీ అలంకరణను
చేస్తున్నారు. ఇంతకుముందైతే తండ్రి ఒంటరిగా ఉండేవారు. శరీర రహితముగా ఉండేవారు. కానీ
పైన కూర్చుని మీ అలంకరణను చేయలేరు. ఒకటి మరియు రెండు కలిస్తే 12 అవుతాయి అని అంటారు
కదా. అంతేకానీ ప్రేరణ లేక శక్తి మొదలైనవాటి విషయమేదీ లేదు. పై నుండి ప్రేరణ ద్వారా
కలుసుకోలేరు. నిరాకారుడు ఎప్పుడైతే సాకార శరీరాన్ని ఆధారముగా తీసుకుంటారో, అప్పుడే
మీ అలంకరణను చేస్తారు. బాబా మమ్మల్ని సుఖధామములోకి తీసుకువెళ్తారు అని కూడా
భావిస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా బంధింపబడి ఉన్నారు, వారికి డ్యూటీ లభించి
ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మీ కోసం వస్తారు. ఈ యోగబలముతో మీరు ఎంత
కాంచనముగా అవుతారు. ఆత్మ మరియు శరీరము, రెండూ కాంచనముగా అవుతాయి, మళ్ళీ ఛీ-ఛీగా
అవుతారు. ఈ పురుషార్థముతో మేము ఈ విధంగా అలంకరింపబడ్డవారిగా అవుతాము అని ఇప్పుడు
మీకు సాక్షాత్కారమవుతుంది. అక్కడ వికారీ దృష్టి ఉండదు, అయినా కానీ శరీర అవయవాలన్నీ
కప్పబడే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఛీ-ఛీ విషయాలను రావణ రాజ్యములో నేర్చుకుంటారు. ఈ
లక్ష్మీ-నారాయణులను చూడండి, వస్త్రాలు మొదలైనవి ఎంత బాగున్నాయి. ఇక్కడ అందరూ
దేహాభిమానులుగా ఉన్నారు. వారిని దేహాభిమానులు అని అనరు. వారిది సహజసిద్ధమైన
సౌందర్యము. తండ్రి మిమ్మల్ని ప్రకృతిసిద్ధమైన సౌందర్యము కలవారిగా తయారుచేస్తారు. ఈ
రోజుల్లో నిజమైన నగలను ఎవరూ ధరించలేరు కూడా. ఎవరైనా ధరిస్తే వారిని దోచుకుంటారు.
అక్కడ అటువంటి విషయమేమీ ఉండదు. అటువంటి తండ్రి మీకు లభించారు, వారు లేకుండానైతే మీరు
తయారవ్వలేరు. మేమైతే డైరెక్టుగా శివబాబా నుండే తీసుకుంటాము అని చాలామంది అంటారు.
కానీ వారు అసలు ఎలా ఇస్తారు. పోనీ ప్రయత్నించి చూడండి, డైరెక్టుగా అడగండి,
లభిస్తుందేమో చూడండి! మేమైతే శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము, బ్రహ్మాను
అడగవలసిన అవసరం కూడా ఏముంది, శివబాబా తమ ప్రేరణ ద్వారా ఎంతో కొంత ఇచ్చేస్తారు అని
చాలామంది అంటారు. మంచి-మంచి పాత పిల్లలను కూడా మాయ ఇలా కరుస్తుంది. ఒక్కరినే
నమ్ముతారు, కానీ ఆ ఒక్కరూ ఏమి చేస్తారు. తండ్రి అంటారు, నేను ఒక్కడినే ఎలా రాగలను?
నోరు లేకుండా ఎలా మాట్లాడగలను? నోరు యొక్క గాయనమైతే ఉంది కదా. గోముఖము నుండి
అమృతాన్ని తీసుకునేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మళ్ళీ శ్రీనాథ ద్వారము వద్దకు
వెళ్ళి దర్శనము చేసుకుంటారు. కానీ వారిని దర్శించుకోవడం వలన ఏమవుతుంది. దానిని
బొమ్మల పూజ అని అంటారు. అందులో ఆత్మ అయితే లేదు కదా. పంచ తత్వాల బొమ్మ తయారై ఉంది
అనగా అది మాయను తలచుకోవడమే అవుతుంది. పంచ తత్వాలు ప్రకృతి కదా. వాటిని స్మృతి చేయడం
ద్వారా ఏమి లభిస్తుంది? ప్రకృతి ఆధారమైతే అందరికీ ఉంది కానీ అక్కడ ఉన్నది
సతోప్రధానమైన ప్రకృతి, ఇక్కడ ఉన్నది తమోప్రధానమైన ప్రకృతి. తండ్రికి సతోప్రధానమైన
ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకోవలసిన అవసరం ఎప్పుడూ ఉండదు. ఇక్కడైతే సతోప్రధానమైన
ప్రకృతి లభించదు. తండ్రి అంటారు, ఇక్కడ సాధు-సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ
నేనే ఉద్ధరించవలసి ఉంటుంది. నేను అసలు నివృత్తి మార్గములోకి రానే రాను. ఇది
ప్రవృత్తి మార్గము. పవిత్రముగా అవ్వండి అని అందరికీ చెప్తాను. అక్కడైతే నామ-రూపాలు
మొదలైనవన్నీ మారిపోతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ నాటకం ఎలా తయారై ఉందో
చూడండి, ఒకరి ముఖకవళికలు మరొకరితో కలవవు. ఇన్ని కోట్లమంది ఉన్నారు, అందరి ముఖకవళికలు
వేర్వేరుగా ఉన్నాయి. ఎవరు ఎంతగా ఏమి చేసినా కానీ ఒకరి ముఖకవళికలు ఇంకొకరితో కలవవు.
దీనిని ప్రకృతిసిద్ధమైనది అని అంటారు. ఇది ఒక అద్భుతము. స్వర్గాన్ని అద్భుతము అని
అంటారు కదా. అది ఎంత శోభాయమానంగా ఉంటుంది. మాయవి 7 అద్భుతాలు, తండ్రిది ఒకే అద్భుతము.
త్రాసులో ఆ 7 అద్భుతాలనూ ఒకవైపు పెట్టండి, ఈ ఒక్క అద్భుతాన్ని ఇంకొకవైపు పెట్టండి,
అయినా కూడా ఇదే ఎక్కువ బరువు తూగుతుంది. ఒక వైపు జ్ఞానాన్ని, ఇంకొక వైపు భక్తిని
ఉంచండి, అప్పుడు జ్ఞానము వైపు ఎంతో బరువు తూగుతుంది. ఇప్పుడు మీరు అర్థం
చేసుకున్నారు - భక్తిని నేర్పించేవారైతే ఎంతోమంది ఉన్నారు, జ్ఞానాన్ని ఇచ్చేవారైతే
ఒక్క తండ్రే. తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తారు, అలంకరిస్తారు. పవిత్రముగా
అవ్వండి అని తండ్రి చెప్తే, లేదు, మేమైతే ఛీ-ఛీ గానే అవుతాము అని వారు అంటారు. గరుడ
పురాణములో కూడా విషయ వైతరణి నదిని చూపిస్తారు, తేళ్ళు, బల్లులు, పాములు మొదలైనవన్నీ
ఒకదానినొకటి కాటు వేసుకుంటూ ఉంటాయి. తండ్రి అంటారు, మీరు ఎంతగా అనాథలుగా అయిపోతారు.
పిల్లలైన మీకే తండ్రి అర్థం చేయిస్తారు. బయట ఎవరితోనైనా ఇలా నేరుగా అంటే వారు
డిస్టర్బ్ అవుతారు. చాలా యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది. కొంతమంది పిల్లల్లో
మాట్లాడే తెలివి కూడా ఉండదు. చిన్న పిల్లలు చాలా అమాయకంగా ఉంటారు కావున వారిని
మహాత్ములు అని అంటారు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఎక్కడ, నివృత్తి మార్గములో
మహాత్ములుగా పిలవబడే ఈ సన్యాసులు ఎక్కడ. అది ప్రవృత్తి మార్గము. వారు ఎప్పుడూ
భ్రష్టాచారము ద్వారా జన్మించరు. వారిని శ్రేష్ఠాచారులు అనే అంటారు. ఇప్పుడు మీరు
శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. పిల్లలకు తెలుసు - ఇక్కడ బాప్ దాదా ఇరువురూ కలిసి
ఉన్నారు. వారు తప్పకుండా బాగానే అలంకరిస్తారు. ఎవరైతే ఈ పిల్లలను ఈ విధంగా
అలంకరించారో వారి వద్దకు మేము కూడా వెళ్ళాలి అని అందరికీ అనిపిస్తుంది కదా, అందుకే
మీరు రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. తండ్రి వద్దకు రావాలి అని మనసు లాగుతుంది.
ఎవరికైతే పూర్తి నిశ్చయము ఉంటుందో వారు ఏమంటారంటే - మమ్మల్ని కొట్టినా లేక ఏమి
చేసినా కానీ మేము ఎప్పుడూ వారి తోడును వదలము. కొందరైతే ఏ కారణము లేకుండా కూడా
వదిలేస్తారు. ఇది కూడా డ్రామా ఆటగా రచింపబడి ఉంది. వదిలి వెళ్ళిపోతారు లేక విడాకులు
ఇచ్చేస్తారు.
వీరు రావణుని వంశానికి చెందినవారని తండ్రికి తెలుసు. కల్ప-కల్పమూ ఈ విధంగా
జరుగుతుంది. కొందరు మళ్ళీ వచ్చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, చేతిని వదిలేయడం
వల్ల పదవి తగ్గిపోతుంది. సమ్ముఖముగా వస్తారు, మేము ఇటువంటి తండ్రిని ఎప్పుడూ వదలము
అని ప్రతిజ్ఞ చేస్తారు. కానీ మాయా రావణుడు కూడా తక్కువేమీ కాదు. వెంటనే తనవైపుకు
లాక్కుంటాడు. మళ్ళీ సమ్ముఖముగా వచ్చినప్పుడు వారికి అర్థం చేయించడం జరుగుతుంది.
తండ్రి ఏమీ కొట్టరు కదా. తండ్రి అయితే ప్రేమగానే అర్థం చేయిస్తారు. నిన్ను మాయ రూపీ
మొసలి తినేసేదే, కానీ నీవు బయటపడి వచ్చేసావు, మంచిదయ్యింది అని అంటారు. దెబ్బ
తగిలినట్లయితే పదవి తగ్గిపోతుంది. ఎవరైతే సదా ఏకరసముగానే ఉంటారో వారెప్పుడూ పక్కకు
తప్పుకోరు, ఎప్పుడూ చేయి వదలరు. ఇక్కడ తండ్రిని వదిలి, మరణించి, మాయా రావణునికి
చెందినవారిగా అవుతారు, అప్పుడు వారిని మాయ ఇంకా తీవ్రంగా తినేస్తుంది. తండ్రి అంటారు,
నేను మిమ్మల్ని ఎంతగా అలంకరిస్తాను. మీరు బాగా నడుచుకోండి, ఎవరికీ దుఃఖాన్ని
ఇవ్వకండి అని అర్థం చేయించడం జరుగుతుంది. రక్తముతో కూడా వ్రాసి ఇస్తారు, మళ్ళీ ఎలా
ఉన్నవారు ఎలా అయిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. చెవులు, ముక్కు పట్టుకుని చాలా
అలమటించేలా చేస్తుంది. ఇప్పుడు మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తారు కావున వికారీ
దృష్టి ఎప్పుడూ వెళ్ళకూడదు. విశ్వాధిపతులుగా అవ్వాలంటే ఎంతో కొంత కష్టపడవలసి ఉంటుంది
కూడా కదా. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరము, రెండూ తమోప్రధానముగా ఉన్నాయి, మాలిన్యము
చేరింది. ఈ మాలిన్యాన్ని భస్మము చేసేందుకు తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి
చేయండి. మీరు తండ్రిని స్మృతి చేయలేరా. మీకు సిగ్గు కలగడం లేదా. స్మృతి చేయకపోతే
మాయ భూతాలు మిమ్మల్ని మింగేస్తాయి. మీరు ఎంత ఛీ-ఛీగా అయిపోయారు, వికారాల ద్వారా
జన్మించనివారు రావణ రాజ్యములో ఒక్కరు కూడా లేరు. అక్కడ ఈ వికారాలు అన్న మాటే ఉండదు,
రావణుడే ఉండడు. రావణ రాజ్యము ద్వాపరము నుండే ఉంటుంది. పావనముగా తయారుచేసేవారు ఒక్క
తండ్రే. తండ్రి అంటారు, పిల్లలూ, ఈ ఒక్క జన్మయే పవిత్రముగా అవ్వాలి, ఆ తర్వాత ఇక
వికారాల విషయమే ఉండదు. అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము. ఈ పవిత్ర దేవీ-దేవతలు
ఉండేవారని, వారు 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ కిందకు వచ్చారని మీకు తెలుసు.
ఇప్పుడు పతితులుగా ఉన్నారు, అందుకే - శివబాబా, మమ్మల్ని ఈ పతిత ప్రపంచము నుండి
విముక్తులుగా చేయండి అని పిలుస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చిన తర్వాత మీకు
అర్థమయ్యింది - ఇది పతితమైన కర్మ అని. ఇంతకుముందు ఇది తెలిసేది కాదు ఎందుకంటే మీరు
అప్పుడు రావణ రాజ్యములో ఉండేవారు. ఇప్పుడు తండ్రి అంటారు, సుఖధామములోకి
వెళ్ళాలనుకుంటే ఛీ-ఛీగా అవ్వడం మానేయండి. అర్ధకల్పము మీరు ఛీ-ఛీగా అయ్యారు. తలపై
పాపాల భారము ఎంతగానో ఉంది మరియు మీరు ఎంతగానో నిందించారు కూడా. తండ్రిని నిందించడం
ద్వారా ఎంతో పాపం పెరిగిపోతుంది, ఇది కూడా డ్రామాలోని పాత్రయే. మీ ఆత్మకు కూడా 84
జన్మల పాత్ర లభించింది, దానిని అభినయించవలసిందే. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను
అభినయించాలి. మరి మీరు ఎందుకు ఏడుస్తారు! సత్యయుగములో ఎవరూ ఏడవరు. మళ్ళీ జ్ఞాన దశ
పూర్తయినప్పుడు అదే ఏడవడము-రోదించడము ప్రారంభమవుతుంది. మోహజీతుని కథను కూడా మీరు
విన్నారు. ఇలా ఒక అసత్యమైన దృష్టాంతాన్ని వారు తయారుచేశారు. సత్యయుగములో ఎవరికీ
అకాల మృత్యువులు ఉండవు. మోహజీతులుగా తయారుచేసేవారైతే ఒక్క తండ్రే. పరమపిత పరమాత్మకు
మీరు వారసులుగా అవుతారు, వారే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. ఆత్మలమైన
మేము వారికి వారసులుగా ఉన్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇకపోతే భౌతికమైన
చదువులో ఏముంది. ఈ రోజుల్లోనైతే పతిత మనుష్యుల ముఖాన్ని కూడా చూడకూడదు, అలాగే
పిల్లలకు కూడా చూపించకూడదు. బుద్ధిలో ఎల్లప్పుడూ - మేము సంగమయుగములో ఉన్నాము అని
భావించండి. ఒక్క తండ్రినే స్మృతి చేస్తాము, మిగిలినవారందరినీ చూస్తూ కూడా చూడము.
మనము కొత్త ప్రపంచాన్నే చూస్తాము. మనము దేవతలుగా అవుతాము, ఆ కొత్త సంబంధాలనే
చూస్తాము, పాత సంబంధాలను చూస్తూ కూడా చూడము. ఇదంతా భస్మమైపోనున్నది. మనము ఒంటరిగా
వచ్చాము, మళ్ళీ ఒంటరిగానే వెళ్ళిపోతాము. తండ్రి తమతోపాటు తీసుకువెళ్ళేందుకు ఒకేసారి
వస్తారు. దీనిని శివబాబా ఊరేగింపు అని అంటారు. అందరూ శివబాబా పిల్లలే. తండ్రి విశ్వ
రాజ్యాధికారాన్ని ఇస్తారు, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. ఇంతకుముందు
విషాన్ని కక్కేవారు, ఇప్పుడు అమృతాన్ని చిందిస్తున్నారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.