‘‘బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థముగా
అయ్యి సర్వులను సమర్థముగా తయారుచేయండి’’
ఈ రోజు నలువైపులా ఉన్న సర్వ స్నేహీ పిల్లల యొక్క స్నేహముతో
కూడిన మధురాతి-మధురమైన స్మృతుల యొక్క రకరకాల మాటలు, స్నేహపు
ముత్యాల మాలలు బాప్ దాదా వద్దకు అమృతవేళ కంటే ముందే
చేరుకున్నాయి. పిల్లల స్నేహము బాప్ దాదాను కూడా స్నేహ సాగరములో
ఇమిడిపోయేలా చేస్తుంది. బాప్ దాదా చూసారు - పిల్లలు ప్రతి
ఒక్కరిలో స్నేహ శక్తి ఎడతెగనిదిగా ఉంది. ఈ స్నేహ శక్తి పిల్లలు
ప్రతి ఒక్కరినీ సహజయోగిగా తయారుచేస్తూ ఉంది. స్నేహము ఆధారముతో
సర్వ ఆకర్షణల నుండి ముక్తులై ఇంకా, ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు.
బాప్ దాదా ద్వారానైనా లేక విశేష ఆత్మల ద్వారానైనా అతీతమైన మరియు
ప్రియమైన స్నేహము యొక్క అనుభవము లేకుండా ఉన్న పిల్లలను ఒక్కరిని
కూడా చూడలేదు. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి బ్రాహ్మణ జీవితము
యొక్క ఆది కాలము స్నేహ శక్తి ద్వారానే జరిగింది. బ్రాహ్మణ
జన్మలోని ఈ స్నేహ శక్తి వరదానముగా అయ్యి ముందుకు
తీసుకువెళ్తుంది. కనుక ఈ రోజు విశేషముగా తండ్రి మరియు పిల్లల
స్నేహ దివసము. ప్రతి ఒక్కరూ తమ హృదయములో స్నేహమనే ముత్యాలతో
కూడిన చాలా, చాలా మాలలను బాప్ దాదాకు ధరింపజేసారు. ఇతర శక్తులు
ఈ రోజు మర్జ్ అయి ఉన్నాయి కానీ స్నేహ శక్తి ఇమర్జ్ అయి ఉంది.
బాప్ దాదా కూడా పిల్లల స్నేహ సాగరములో లవలీనమై ఉన్నారు.
ఈ రోజును స్మృతి దివసము అని అంటారు. స్మృతి దివసము కేవలము
బ్రహ్మాబాబా యొక్క స్మృతి దివసమే కాదు. బాప్ దాదా అంటారు - ఈ
రోజు మరియు సదా ఏమి గుర్తుండాలంటే - బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే
ఆది నుండి ఇప్పటివరకు బాప్ దాదా ఏయే స్మృతులను కలిగించారు. ఆ
స్మృతుల మాలను గుర్తు చేసుకుంటే చాలా పెద్ద మాల తయారవుతుంది.
అందరికీ అన్నింటికంటే మొదటి స్మృతిగా ఏమి లభించింది? మొదటి
పాఠము గుర్తుంది కదా! నేను ఎవరిని! ఈ స్మృతియే నూతన జన్మను
ఇచ్చింది, వృత్తి, దృష్టి, స్మృతిని పరివర్తన చేసింది. ఇటువంటి
స్మృతులు గుర్తుకు రావటముతోనే ఆత్మిక సంతోషముతో కూడిన మెరుపు
నయనాలలో, ముఖములో రానే వస్తుంది. మీరు స్మృతులను గుర్తు
చేసుకుంటారు మరియు భక్తులు మాలను స్మరణ చేస్తారు. ఒక్క స్మృతి
అయినా కూడా అమృతవేళ నుండి కర్మయోగిగా అయ్యే సమయము వరకు పదే-పదే
గుర్తున్నట్లయితే, ఆ స్మృతి సమర్థ స్వరూపమును తయారుచేస్తుంది
ఎందుకంటే ఎటువంటి స్మృతియో అటువంటి సమర్థత స్వతహాగానే వస్తుంది,
అందుకే ఈ రోజును స్మృతి దివసము అని అనడముతోపాటు సమర్థ దివసము
అని కూడా అంటారు. బ్రహ్మాబాబా మన ఎదురుగా రావటముతోనే, బాబా
దృష్టి పడటముతోనే ఆత్మలలో సమర్థత వచ్చేస్తుంది. అందరూ
అనుభవజ్ఞులే. అందరూ అనుభవజ్ఞులే కదా! సాకార రూపములో చూసినా లేక
అవ్యక్త రూపము యొక్క పాలన ద్వారా పాలింపబడుతూ అవ్యక్త స్థితి
యొక్క అనుభవాన్ని చేసినా, క్షణములో మనస్ఫూర్తిగా బాప్ దాదా అని
అంటూనే సమర్థత స్వతహాగా వచ్చేస్తుంది, అందుకే ఓ సమర్థ
ఆత్మల్లారా, ఇప్పుడు ఇతర ఆత్మలను మీ సమర్థతతో సమర్థులుగా
చెయ్యండి. ఉల్లాసము ఉంది కదా! ఉందా ఉల్లాసము, అసమర్థులను
సమర్థులుగా తయారుచెయ్యాలి కదా! బాప్ దాదా చూసారు - నలువైపులా
బలహీన ఆత్మలను సమర్థముగా తయారుచేసే ఉల్లాసము చాలా బాగుంది.
శివరాత్రి ప్రోగ్రామును చాలా వైభవముగా తయారుచేస్తున్నారు.
అందరికీ ఉల్లాసము ఉంది కదా! ఇక ఈ శివరాత్రికి అద్భుతము చేస్తాము
అని ఎవరిలో అయితే ఉల్లాసము ఉందో వారు చేతులెత్తండి. ఎటువంటి
అద్భుతము అంటే దాని ద్వారా హంగామాలు, అల్లకల్లోలాలు
సమాప్తమైపోవాలి. వాహ్! వాహ్ సమర్థ ఆత్మలూ వాహ్! అనే జయజయకారాలు
మ్రోగాలి. అన్ని జోన్ల వారు ప్రోగ్రామును తయారుచేసారు కదా!
పంజాబువారు కూడా తయారుచేసారు కదా! మంచిది. భ్రమిస్తున్న ఆత్మలు,
దప్పికతో ఉన్న ఆత్మలు, అశాంత ఆత్మలు, ఇటువంటి ఆత్మలకు అంచలినైతే
ఇవ్వండి. ఎంతైనా, వారు మీ సోదర-సోదరీలు. కనుక మీ సోదరులపై, మీ
సోదరీలపై దయ కలుగుతుంది కదా! చూడండి, ఈ రోజుల్లో పరమాత్మను ఆపద
కాలములోనే తలచుకుంటారు, కానీ శక్తులను, దేవతలలో కూడా గణేశుడు
ఉన్నారు, హనుమంతుడు ఉన్నారు, ఇంకా ఇతర దేవతలు కూడా ఉన్నారు,
వారందరినీ ఎక్కువగా తలచుకుంటారు. మరి వారు ఎవరు? మీరే కదా!
మిమ్మల్ని ప్రతి రోజూ తలచుకుంటారు. ఓ కృపాళువు, దయాళువు, దయ
చూపించండి, కృప చూపించండి, సుఖ-శాంతులతో కూడిన ఒక్క బిందువునైనా
ఇవ్వండి అని పిలుస్తున్నారు. మీ ద్వారా లభించే ఒక్క బిందువు
కొరకు వారు దప్పికతో ఉన్నారు. దుఃఖములో ఉన్న, దప్పికతో ఉన్న
ఆత్మలు - ఓ శక్తులూ, ఓ దేవతలూ అంటూ పిలుస్తున్న ఆ ధ్వని మీకు
చేరటం లేదా! చేరుతుంది కదా? బాప్ దాదా ఈ పిలుపును విన్నప్పుడు
శక్తులను మరియు దేవతలను గుర్తు చేసుకుంటారు. దాది మంచి
ప్రోగ్రామును తయారుచేసారు, బాబాకు అది నచ్చింది. స్మృతి
దివసమైతే ఎల్లప్పుడూ ఉంటుంది, అయినా కూడా నేటి ఈ రోజున స్మృతి
ద్వారా సర్వ సమర్థతలను విశేషముగా ప్రాప్తి చేసుకున్నారు,
ఇప్పుడు రేపటి నుండి శివరాత్రి వరకు బాప్ దాదా నలువైపులా కల
పిల్లలకు ఏం చెప్తున్నారంటే - ఈ విశేషమైన రోజున ఈ లక్ష్యమునే
పెట్టుకోండి - ఎక్కువలో ఎక్కువమంది ఆత్మలకు మనసా ద్వారా, వాణి
ద్వారా మరియు సంబంధ-సంపర్కముల ద్వారా, ఏదో ఒక విధితో సందేశమనే
అంచలిని తప్పకుండా ఇవ్వాలి. మీపై వచ్చే ఫిర్యాదును
తొలగించుకోండి. ఇప్పుడు వినాశన తారీఖు అయితే కనిపించటం లేదు,
కనుక ఎప్పుడో ఒక అప్పుడు ఫిర్యాదును తొలగించుకుంటాములే అని
పిల్లలు ఆలోచిస్తున్నారు, కానీ అలా అవ్వదు. ఒకవేళ ఇప్పటినుండే
ఫిర్యాదును పూర్తి చేసుకోకపోతే - మీరు మాకు ముందుగానే ఎందుకు
చెప్పలేదు, మేము కూడా ఎంతోకొంత తయారుచేసుకునేవాళ్ళము కదా అని
అంటారు. అప్పుడిక కేవలం ఓహో ప్రభూ అని మాత్రమే అంటారు. అందుకే
వారిని కూడా కొంచెమైనా వారసత్వము యొక్క అంచలిని తీసుకోనివ్వండి,
వారికి కూడా కొంచెం సమయాన్ని ఇవ్వండి. ఒక్క బిందువు ద్వారానైనా
దప్పికనైతే తీర్చండి. దాహముతో ఉన్నవారికి ఒక్క బిందువు అయినా
చాలా మహత్వపూర్ణముగా ఉంటుంది. కనుక ప్రోగ్రాం ఇదే కదా. రేపటి
నుండి బాప్ దాదా కూడా పచ్చ జెండా ఊపటం కాదు, నగారాను
మ్రోగిస్తున్నారు - ఓ తృప్త ఆత్మలారా, ఆత్మలకు సందేశాన్ని
ఇవ్వండి, సందేశాన్ని ఇవ్వండి. కనీసం శివరాత్రి నాడు, బాబా
పుట్టినరోజు సందర్భముగా, ఆ, మాకు సందేశము లభించేసింది అనేదాని
ద్వారా నోటిని అయితే తీపి చెయ్యండి. ఈ దిల్ ఖుష్ మిఠాయిని
అందరికీ వినిపించండి, తినిపించండి. సాధారణ శివరాత్రిని జరపకండి,
ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించండి. ఉల్లాసము ఉందా? మొదటి లైన్
లో కూర్చున్నవారికి ఉందా? చాలా ఘనముగా చెయ్యండి. శివరాత్రికి
ఇంత గొప్ప మహత్వము ఉంది అని తక్కువలో తక్కువ ఇదైతే వారు అర్థం
చేసుకోవాలి. మా తండ్రి యొక్క జన్మదినము అనేది విని వారు
సంతోషపడాలి.
బాప్ దాదా చూసారు - అమృతవేళలో మెజారిటీ వారి స్మృతి మరియు
ఈశ్వరీయ ప్రాప్తుల నషా చాలా బాగా ఉంటుంది. కానీ కర్మయోగీ
స్థితిలో ఉన్నప్పుడు అమృతవేళలో ఏదైతే నషా ఉంటుందో దానితో
పోలిస్తే తేడా ఉంటుంది. కారణమేమిటి? కర్మలు చేస్తున్నప్పుడు,
సోల్ కాన్షస్ (ఆత్మాభిమానీ స్థితి) మరియు కర్మ కాన్షస్, ఈ రెండు
రకాలుగానూ ఉంటున్నారు. దీనికి విధి ఏమిటంటే - కర్మలు చేస్తూ
ఆత్మనైన నేను, ఎటువంటి ఆత్మను అన్నదైతే మీకు ఎలాగూ తెలుసు,
ఆత్మకు సంబంధించిన రకరకాల స్వమానాలు ఏవైతే లభించి ఉన్నాయో,
అటువంటి ఆత్మను చేయించే ఆత్మగా అయ్యి ఈ కర్మేంద్రియాల ద్వారా
కర్మలు చేయించేవాడిని, ఈ కర్మేంద్రియాలు కర్మచారులు, కర్మచారుల
ద్వారా కర్మలు చేయించే నేను చేయించేవాడిని, ఆతీతముగా ఉన్నాను.
లౌకికములో కూడా డైరెక్టరు తన సహచరులతో, నిమిత్తముగా సేవ
చేసేవారితో సేవ చేయిస్తున్నప్పుడు, డైరెక్షన్లు ఇస్తున్నప్పుడు,
డ్యూటీ చేస్తున్నప్పుడు - నేను డైరెక్టరును అన్నది మర్చిపోతారా?
కనుక స్వయాన్ని - నేను చేయించే శక్తిశాలి ఆత్మను అని భావిస్తూ
కార్యము చేయించండి. ఆత్మ మరియు శరీరము, ఆత్మ చేయించేది, శరీరము
చేసేది, ఈ స్మృతి మర్జ్ అయిపోతుంది. బ్రహ్మాబాబా ప్రారంభములో ఏ
అభ్యాసము చేసారు అన్నది మీ అందరికీ తెలుసు, పాత పిల్లలకు తెలుసు.
ఒక డైరీని చూసారు కదా. మొత్తం డైరీ అంతా ఒకటే మాట ఉంది - నేను
కూడా ఆత్మను, జశోద కూడా ఆత్మ, ఈ పిల్లలు కూడా ఆత్మలు, ఆత్మ,
ఆత్మ... ఈ సదాకాలికమైన పునాదిని అభ్యాసము చేసారు. కనుక నేను
ఎవరిని అన్నది మొదటి పాఠము. దీనిని పదే-పదే అభ్యాసము చెయ్యాలి.
చెకింగ్ కావాలి, నేను ఉన్నదే ఆత్మగా అని ఊరికే అనుకోవటము కాదు.
ఆత్మనైన నేను చేయించేవానిగా అయ్యి కర్మలు చేయిస్తున్నాను అని
అనుభవము చెయ్యాలి. చేసేవారు వేరు, చేయించేవారు వేరు.
బ్రహ్మాబాబా యొక్క మరొక అనుభవాన్ని కూడా విన్నారు, అదేమిటంటే -
ఈ కర్మేంద్రియాలు కర్మచారులు. ప్రతి రోజూ రాత్రిపూట చేసే కచేరీ
గురించి విన్నారు కదా! కనుక యజమానిగా అయ్యి ఈ కర్మేంద్రియాల
రూపీ కర్మచారులను వాటి స్థితిగతుల గురించి అడిగేవారు కదా!
బ్రహ్మాబాబా పునాది అయిన ఈ అభ్యాసాన్ని చాలా పక్కా చేసుకున్నారు,
అందుకే ఏ పిల్లలైతే చివరి సమయములో కూడా బాబాతో పాటు ఉన్నారో,
వారు ఏం అనుభవము చేసారు? బాబా కార్యాలు చేస్తూ కూడా, శరీరములో
ఉంటూ కూడా, అశరీరీ స్థితిలో నడుస్తూ-తిరుగుతూ ఉన్నట్లుగా
అనుభవము అవుతుండేది. కర్మల లెక్కాచారము సమాప్తి చేసుకోవలసి
వచ్చినా కూడా సాక్షీగా అయ్యి, స్వయమూ కర్మల లెక్కాచారానికి
వశమవ్వలేదు, అలాగే కర్మల లెక్కాచారము పూర్తి అవుతున్న అనుభవము
ఇతరులకు కూడా కలగనివ్వలేదు. బ్రహ్మాబాబా అవ్యక్తమవుతున్నారు
అన్నది మీకు తెలిసిందా? తెలియలేదు కదా! కనుక ఇంతటి అతీతమైన
స్థితిని, సాక్షీ స్థితిని, అశరీరి స్థితిని అనగా కర్మాతీత
స్థితిని చాలా కాలము నుండి అభ్యాసము చేసారు కావుననే అంతిమములో
కూడా అదే స్వరూపము అనుభవమైంది. ఈ బహుకాలపు అభ్యాసము
పనికొస్తుంది. అంతిమములో దేహభానాన్ని వదిలేస్తాము అని ఇలా
అనుకోకండి. బహుకాలపు అశరీరీతనము యొక్క, దేహము నుండి అతీతమై
చేయించే స్థితి యొక్క అనుభవము కావాలి. అంతిమ సమయమనేది
యువకులకైనా, వృద్ధులకైనా, ఆరోగ్యవంతులకైనా, రోగులకైనా ఎవరికైనా,
ఎప్పుడైనా రావచ్చు, అందుకే బహుకాలపు సాక్షీతనము యొక్క
అభ్యాసముపై అటెన్షన్ పెట్టండి. ఎన్ని ప్రాకృతిక ఆపదలు వచ్చినా
కానీ ఈ అశరీరీతనపు స్థితి మిమ్మల్ని సహజముగా అతీతముగా మరియు
బాబాకు ప్రియముగా తయారుచేస్తుంది. అందుకే బహుకాలము అన్న మాటను
బాప్ దాదా అండర్ లైన్ చేయిస్తున్నారు. ఏదేమైనా కానీ, మొత్తం
రోజంతటిలో సాక్షీ స్థితిని, చేయించేవాడిని అన్న స్థితిని,
అశరీరీతనపు స్థితిని పదే-పదే అనుభవము చేయండి, అప్పుడు అంతిమ
సమయములో ఫరిశ్తా నుండి దేవతగా అవ్వడము అనేది నిశ్చితము. బాబా
సమానముగా అవ్వాలనుకుంటే బాబా నిరాకార్ మరియు ఫరిశ్తా,
బ్రహ్మాబాబా సమానముగా అవ్వటము అనగా ఫరిశ్తా స్థితిలో ఉండటము. ఏ
విధంగా ఫరిశ్తా రూపాన్ని సాకారములో చూసారో, ఎవరైనా మాట్లాడింది
వింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, కార్యవ్యవహారాలు
చేస్తున్నప్పుడు కూడా బాబా శరీరములో ఉంటూ కూడా అతీతముగా ఉన్నారు
అన్నది అనుభవము చేసారు. కార్యాన్ని వదిలేసి అశరీరిగా అవ్వటము
అనేది కొద్ది సమయము వరకే వీలవ్వగలదు కానీ కార్యము చేస్తూ,
సమయాన్ని కేటాయించి అశరీరి, శక్తిశాలీ స్థితి యొక్క అనుభవమును
చేస్తుండండి. మీరందరూ ఫరిశ్తాలు, బాబా ద్వారా ఈ బ్రాహ్మణ జీవిత
ఆధారమును తీసుకుని సందేశాన్ని ఇచ్చేందుకై సాకారములో కార్యము
చేస్తున్నారు. ఫరిశ్తా అనగా దేహములో ఉంటూ దేహము నుండి అతీతము
మరియు దీనికి ఉదాహరణగా బ్రహ్మాబాబాను చూసారు, కనుక అది అసంభవము
కాదు. చూసారు, అనుభవము చేసారు. ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో,
ఇప్పుడు విస్తారము ఎక్కువగా ఉన్నా కానీ బ్రహ్మాబాబాకు ఈ
క్రొత్త జ్ఞానము, క్రొత్త జీవితము, క్రొత్త ప్రపంచాన్ని
తయారుచేసే బాధ్యత ఎంతగా అయితే ఉందో, అంతగా ఇప్పుడు ఎవ్వరికీ
లేదు. కనుక అందరి లక్ష్యము బ్రహ్మాబాబా సమానముగా అవ్వటము అనగా
ఫరిశ్తాగా అవ్వటము. శివబాబా సమానముగా అవ్వటము అనగా నిరాకార
స్థితిలో స్థితులవ్వటము. ఇది కష్టమా? బాబా మరియు దాదాపై ప్రేమ
ఉంది కదా! కనుక ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారిలా అవ్వటము,
అంతేకాక బాబా సమానముగా అవ్వాల్సిందే అన్న సంకల్పము కూడా
ఉన్నప్పుడు, ఇక అది కష్టమేమీ కాదు. కావలసింది కేవలము పదే-పదే
అటెన్షన్ పెట్టడము. సాధారణ జీవితము ఉండకూడదు. సాధారణ జీవితాన్ని
జీవించేవారు ఎందరో ఉన్నారు, పెద్ద-పెద్ద కార్యాలను చేసేవారు
ఎందరో ఉన్నారు, కానీ మీ వంటి కార్యాన్ని బ్రాహ్మణ ఆత్మలైన మీరు
తప్ప ఇతరులెవ్వరూ చెయ్యలేరు.
కనుక ఈ రోజు స్మృతి దివసము నాడు బాప్ దాదా - సమానతలో
సమీపముగా రండి, సమీపముగా రండి, సమీపముగా రండి అన్న వరదానాన్ని
ఇస్తున్నారు. అందరూ హద్దు తీరాలను, సంకల్పాలలోనైనా, మాటలలోనైనా,
కర్మలలోనైనా, సంబంధ-సంపర్కాలలోనైనా, ఎటువంటి హద్దు తీరాలనైనా
వదిలేయండి. మీ మనస్సు అనే నావను ఈ హద్దు తీరాల నుండి విముక్తిగా
చెయ్యండి. ఇప్పటినుండి జీవితములో ఉంటూనే ముక్తులుగా ఉండండి,
జీవన్ముక్తి యొక్క ఇటువంటి అలౌకిక అనుభవాన్ని బహుకాలము నుండి
చెయ్యండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న పిల్లల ఉత్తరాలు చాలా అందాయి మరియు మధుబన్
వారి క్రోధముక్త రిపోర్టు, సమాచారము కూడా బాప్ దాదా వద్దకు
చేరుకుంది. ధైర్యము పెట్టినందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు.
మరియు ఇకముందు కొరకు కూడా సదా ముక్తులుగా ఉండేందుకు సహన శక్తి
యొక్క కవచాన్ని ధరించి ఉంచుకోండి, అప్పుడు ఎవరు ఎంత ప్రయత్నం
చేసినా కానీ మీరు సదా సురక్షితముగా ఉంటారు.
ఇటువంటి దృఢ సంకల్పధారులందరికీ, సదా స్మృతి స్వరూప ఆత్మలకు,
సదా సర్వ సమర్థతలను అవసరమైన సమయానికి కార్యములోకి తీసుకువచ్చే
విశేష ఆత్మలకు, సదా సర్వ ఆత్మలపై దయ చూపించే దయాహృదయ ఆత్మలకు,
సదా బాప్ దాదా సమానముగా అయ్యే సంకల్పాన్ని సాకార రూపములోకి
తీసుకువచ్చే అటువంటి చాలా, చాలా, చాలా ప్రియమైన మరియు అతీతమైన
పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.