ఓంశాంతి
ఎన్ని గంటలకు ఉదయము అవుతుంది? బాబా ఉదయము ఎన్ని గంటలకు వస్తారు? (కొందరు 3 గంటలకు
అని చెప్పారు, కొందరు 4 గంటలకు అని చెప్పారు, కొందరు సంగమయుగములో అని చెప్పారు,
కొందరు 12 గంటలకు అని చెప్పారు). బాబా ఎన్ని గంటలకు అని ఏక్యురేట్ గా (ఖచ్చితముగా)
అడుగుతున్నారు. 12 గంటలనైతే మీరు ఉదయము అని చెప్పలేరు. 12 గంటలు దాటిన తర్వాత ఒక్క
సెకండు గడిచినా, ఒక్క నిముషము గడిచినా ఎ.ఎమ్. అనగా ఉదయము ప్రారంభమవుతుంది. ఇది
పూర్తిగా ఉదయము. డ్రామాలో వారి పాత్ర పూర్తి ఏక్యురేట్ గా ఉంది. సెకండు కూడా ఆలస్యము
జరగదు, ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. 12 గంటలు దాటిన తర్వాత ఒక్క సెకండు
ఎప్పటివరకైతే గడవదో అప్పటివరుకు ఎ.ఎమ్. అని అనరు, ఇది అనంతమైన విషయము. తండ్రి అంటారు
- నేను ఉదయముదయమే వస్తాను. విదేశీయుల యొక్క ఎ.ఎమ్., పి.యమ్.లు ఏక్యురేట్ గా
నడుస్తాయి. ఎంతైనా వారి బుద్ధి కొంత బాగానే ఉంటుంది. వారు అంత సతోప్రధానముగా కూడా
అవ్వరు, అంత తమోప్రధానముగా కూడా అవ్వరు. భారతవాసులే 100 శాతము సతోప్రధానముగా, మళ్ళీ
100 శాతము తమోప్రధానముగా అవుతారు. తండ్రి చాలా ఏక్యురేట్ గా ఉంటారు. ఉదయం అనగా 12
గంటల ఒక్క నిమిషము. సెకండుల యొక్క లెక్క తీసుకోరు. సెకెండు గడవడమనేది తెలియను కూడా
తెలియదు. ఇప్పుడు ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ప్రపంచమైతే పూర్తిగా
ఘోర అంధకారములో ఉంది. పతిత-పావనా రండి అని తండ్రిని భక్తులందరూ దుఃఖములో
గుర్తుచేస్తారు. కాని వారు ఎవరు? ఎప్పుడు వస్తారు? ఈ విషయాలేవీ తెలియదు. మనుష్యులై
ఉండి ఏక్యురేట్ గా ఏమీ తెలియదు ఎందుకంటే పతితులుగా, తమోప్రధానముగా ఉన్నారు. కామము
కూడా ఎంత తమోప్రధానమైనది. ఇప్పుడు అనంతమైన తండ్రి ఆర్డినెన్స్ (అధికార పూర్వకమైన
ఆదేశము) జారీ చేస్తున్నారు - పిల్లలూ, కామజీతులుగా, జగత్ జీతులుగా అవ్వండి. ఒకవేళ
ఇప్పుడు పవిత్రముగా అవ్వకపోతే వినాశనము పొందుతారు. మీరు పవిత్రముగా అయినట్లయితే
అవినాశీ పదవిని పొందుతారు. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా. ‘‘బీ హోలీ, బీ
యోగీ’’ (పవిత్ర భవ, యోగీ భవ) అని స్లోగన్ లో కూడా వ్రాస్తారు. వాస్తవానికి ‘‘బీ
రాజయోగి’’ (రాజయోగీ భవ) అని వ్రాయాలి. యోగీ అన్నదైతే సాధారణమైన పదము. బ్రహ్మముతో
యోగాన్ని జోడిస్తారు, వారు కూడా యోగీలే. పిల్లలు తండ్రితో, స్త్రీ తన పతితో యోగాన్ని
జోడిస్తారు, కానీ మీది రాజయోగము. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు, అందుకే రాజయోగము
అని వ్రాయడము సరియైనది. బీ హోలీ అండ్ రాజయోగి (పవిత్ర భవ, రాజయోగీ భవ). రోజురోజుకు
కరెక్షన్లు (సవరణలు) అయితే జరుగుతూ ఉంటాయి. తండ్రి కూడా అంటారు - ఈ రోజు మీకు
గుహ్యాతి-గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. ఇప్పుడు శివజయంతి కూడా రానున్నది. శివ
జయంతినైతే మీరు చాలా బాగా జరుపుకోవాలి. శివజయంతి సందర్భముగానైతే చాలా బాగా సేవ
చేయాలి. ఎవరి వద్దనైతే ప్రదర్శినీ ఉందో, వారందరూ తమ-తమ సేవాకేంద్రాలలో లేదా ఇళ్ళలో
శివజయంతిని చాలా బాగా జరుపుకోండి మరియు ఇలా వ్రాయండి - గీతా జ్ఞానదాత అయిన శివబాబా
నుండి, ఆ తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునే మార్గాన్ని వచ్చి నేర్చుకోండి.
దీపాలు మొదలైనవి కూడా వెలిగించండి. ఇంటింటిలో శివజయంతిని జరుపుకోవాలి. మీరు జ్ఞాన
గంగలు కదా. కనుక ప్రతి ఒక్కరి వద్ద గీతా పాఠశాల ఉండాలి. ఇంటింటిలోనూ గీతను అయితే
చదువుతారు కదా. పురుషుల కన్నా మాతలు భక్తిలో చురుకుగా ఉంటారు. గీతను చదివే కుటుంబాలు
కూడా ఉంటాయి. కనుక ఇంటిలో కూడా చిత్రాలను పెట్టుకోవాలి. మీరు వచ్చి అనంతమైన తండ్రి
నుండి వారసత్వాన్ని మళ్ళీ తీసుకోండి అని వ్రాయండి.
ఈ శివజయంతి పండుగ వాస్తవానికి మీకు సత్యమైన దీపావళి. ఎప్పుడైతే శివబాబా వస్తారో
అప్పుడు ఇంటింటిలో ప్రకాశము వచ్చేస్తుంది. ఈ పండుగను చాలా బాగా దీపాలు మొదలైనవి
వెలిగించి కాంతివంతముగా జరుపుకోండి. మీరు సత్యమైన దీపావళిని జరుపుకుంటారు. ఫైనల్
దీపావళి అయితే సత్యయుగములో ఉండబోతుంది. అక్కడ ఇంటింటిలో ప్రకాశమే ప్రకాశము ఉంటుంది
అనగా ప్రతి ఆత్మ యొక్క జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడైతే అంధకారముంది. ఆత్మలు ఆసురీ
బుద్ధి కలవారిగా అయిపోయారు. అక్కడ ఆత్మలు పవిత్రముగా ఉన్న కారణముగా దైవీ బుద్ధి
ఉంటుంది. ఆత్మయే పతితముగా, ఆత్మయే పావనముగా అవుతుంది. ఇప్పుడు మీరు పైసకు
కొరగానివారి నుండి ఎంతో విలువైనవారిగా అవుతున్నారు. ఆత్మ పవిత్రముగా అవ్వడముతో
శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇక్కడ ఆత్మ అపవిత్రముగా ఉన్నందున శరీరము మరియు
ప్రపంచము కూడా అపవిత్రముగా ఉన్నాయి. ఈ విషయాలను యథార్థ రీతిలో అర్థం చేసుకునేవారు
మీలో కూడా ఏ కొందరో ఉన్నారు మరియు వారి లోపల సంతోషముంటుంది. నంబరువారుగా
పురుషార్థమైతే చేస్తూ ఉంటారు. గ్రహచారము కూడా ఉంటుంది. ఎప్పుడైనా రాహు గ్రహచారము
కూర్చుంటే ఆశ్చర్యము కలిగించేలా పారిపోతారు. బృహస్పతి దశ నుండి మారి రాహు దశ
కూర్చుంటుంది. కామ వికారములోకి వెళ్ళారంటే రాహు దశ కూర్చుంటుంది. మల్లయుద్ధము
జరుగుతుంది కదా. మాతలైన మీరు చూసి ఉండరు ఎందుకంటే మాతలను ఇంటి ఇల్లాలు అని అంటారు.
భ్రమరమును ఇల్లాలు అనగా ఇంటిని నిర్మించేది అని అంటారని ఇప్పుడు మీకు తెలుసు. ఇంటిని
నిర్మించే మంచి నైపుణ్యము కలది, అందుకే ఇల్లాలు అని పేరు ఉంది. అది ఎంతగా
శ్రమిస్తుంది. అది కూడా పక్కా మేస్త్రీ, రెండు-మూడు గదులను నిర్మిస్తుంది. 3-4 పేడ
పురుగులను తీసుకొస్తుంది. అలాగే మీరు కూడా బ్రాహ్మణీలు. ఒకరిద్దరినైనా తయారుచేయండి
లేక 10-12 మందినైనా తయారుచేయండి, 100 మందినైనా లేక 500 మందినైనా తయారుచేయండి. మండపము
మొదలైనవి నిర్మిస్తారు, అది కూడా ఇంటిని నిర్మించడమే కదా. అందులో కూర్చొని అందరికి
భూ-భూ చేస్తారు. అప్పుడు కొందరు అర్థం చేసుకుని పేడ పురుగుల నుండి బ్రాహ్మణులుగా
అవుతారు, కొందరు కుళ్ళిపోయినవారిగా వెలువడుతారు అనగా ఈ ధర్మమువారు కారు. ఈ ధర్మము
వారికి మాత్రమే పూర్తిగా టచ్ అవుతుంది. మీరైతే ఎంతైనా మనుష్యులు కదా. మీ శక్తి ఆ
భ్రమరము కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు 2 వేల మంది మధ్యలోనైనా భాషణ చేయగలరు. మున్ముందు
4-5 వేల మంది గల సభలోకి కూడా మీరు వెళ్తారు. భ్రమరముకు మీతో పోలిక ఉంది. ఈ రోజుల్లో
సన్యాసులు కూడా బయట విదేశాలకు వెళ్ళి - మేము భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని
నేర్పిస్తాము అని అంటారు. ఈ రోజుల్లో మాతలు కూడా కాషాయ వస్త్రాలను ధరించి వెళ్తారు,
విదేశీయులను మోసము చేసి వస్తారు. భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని భారత్ కు వచ్చి
నేర్చుకోండి అని వారికి చెప్తారు. కానీ మీరు భారత్ కు వచ్చి నేర్చుకోండి అని ఏమీ
చెప్పరు. మీరు విదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడే కూర్చుని అర్థం చేయిస్తారు - ఈ
రాజయోగాన్ని నేర్చుకుంటే స్వర్గములో మీ జన్మ జరుగుతుంది అని. ఇందులో వస్త్రాలు
మొదలైనవి మార్చుకోవలసిన విషమేమీ లేదు. ఇక్కడే దేహము యొక్క సర్వ సంబంధాలను మరచి
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే ముక్తిదాత (లిబరేటర్)
మరియు మార్గదర్శకుడు (గైడ్), వారు అందరినీ దుఃఖము నుండి విముక్తులను చేస్తారు.
ఇప్పుడు మీరు సతోప్రధానముగా అవ్వాలి. మీరు మొదట బంగారుయుగములో ఉండేవారు, ఇప్పుడు
ఇనుపయుగములో ఉన్నారు. పూర్తి విశ్వము, అన్ని ధర్మాల వారు ఇనుపయుగములో ఉన్నారు. ఏ
ధర్మమువారిని కలిసినా వారికి ఇలా చెప్పండి - తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు, అప్పుడు నేను నాతో పాటు
తీసుకువెళ్తాను. కేవలం ఇంతే చెప్పండి, ఎక్కువ వద్దు. ఇది చాలా సహజము. ఇంటింటిలో
సందేశాన్ని ఇచ్చారు కానీ ఎవరో ఒకరు మిగిలిపోతే అతను నాకు ఎవ్వరూ తెలియజేయలేదని
ఫిర్యాదు చేశారు అని మీ శాస్త్రాలలో కూడా ఉంది. తండ్రి వచ్చారు కనుక పూర్తిగా దండోరా
వేయించాలి. శాంతిధామము, సుఖధామముల వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చారని ఒక రోజు
అందరికీ తప్పకుండా తెలుస్తుంది. తప్పకుండా దేవతా ధర్మము ఉండేటప్పుడు ఇంకే ధర్మమూ
ఉండేది కాదు. అందరూ శాంతిధామములో ఉండేవారు. ఈ విధమైన ఆలోచనలు నడుస్తూ ఉండాలి,
స్లోగన్లు తయారుచేయాలి. తండ్రి అంటారు, దేహ సహితముగా సర్వ సంబంధాలను విడిచిపెట్టండి.
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రముగా
అవుతుంది. ఇప్పుడు ఆత్మలు అపవిత్రముగా ఉన్నాయి. ఇప్పుడు అందరినీ పవిత్రముగా
తయారుచేసి తండ్రి మార్గదర్శకులై తిరిగి తీసుకువెళ్తారు. అందరూ తమ-తమ సెక్షన్లలోకి
వెళ్ళిపోతారు. ఆ తర్వాత దేవతా ధర్మమువారు నంబరువారుగా వస్తారు. ఎంత సహజము. ఇది
బుద్ధిలో ధారణ అవ్వాలి. ఎవరైతే సేవ చేస్తారో వారు దాగి ఉండలేరు. అలాగే డిస్సర్వీస్
చేసేవారు కూడా దాగి ఉండలేరు. సేవాధారి పిల్లలను పిలుస్తూ ఉంటారు. ఎవరైతే కొద్దిగా
కూడా జ్ఞానాన్ని వినిపించలేరో వారిని ఏమీ పిలవరు. వారు ఇంకా పేరును పాడు చేస్తారు.
బి.కె.లు ఇలా ఉంటారా? అని అంటారు. పూర్తి జవాబు కూడా ఇవ్వలేకపోతారు కనుక పేరు
అప్రతిష్ఠపాలు అయినట్లే కదా. శివబాబా పేరును అప్రతిష్ఠపాలు చేసేవారు ఉన్నతమైన పదవిని
పొందలేరు. ఏ విధంగా ఇక్కడ కూడా కొందరు కోటీశ్వరులున్నారు, పదమపతులు కూడా ఉన్నారు,
కొందరిని చూడండి ఆకలితో మరణిస్తున్నారు. ఇటువంటి బికారులు కూడా వచ్చి రాకుమారులుగా
అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు - స్వర్గానికి రాకుమారునిగా ఉన్న ఆ
శ్రీకృష్ణుడే మళ్ళీ బికారి అవుతారు, మళ్ళీ బికారి నుండి రాకుమారునిగా అవుతారు. ఇతను
బికారిగా ఉండేవారు కదా, కొద్దో-గొప్పో సంపాదించారు కానీ అది కూడా పిల్లలైన మీ కోసమే.
లేకపోతే మీ పాలన ఎలా జరుగుతుంది? ఈ విషయాలన్నీ శాస్త్రాలలో లేవు. శివబాబాయే వచ్చి
తెలియజేస్తారు. తప్పకుండా ఇతను పల్లెటూరి పిల్లవానిగా ఉండేవారు, ఆ సమయములో
శ్రీకృష్ణుడు అన్న పేరేమీ కాదు. ఇది ఆత్మకు సంబంధించిన విషయము, అందుకే మనుష్యులు
తికమకలో ఉన్నారు. బాబా అర్థం చేయించారు - శివజయంతి సందర్భముగా ప్రతి ఒక్కరూ
ఇంటింటిలో చిత్రాలపై సేవ చేయండి. అనంతమైన తండ్రి నుండి 21 జన్మల కొరకు స్వర్గ
రాజ్యము సెకండులో ఎలా లభిస్తుంది, వచ్చి అర్థం చేసుకోండి అని వ్రాయండి. ఎలాగైతే
దీపావళి సందర్భముగా మనుష్యులు ఎన్నో దుకాణాలు తెరిచి కూర్చుంటారో, అలా మీరు అవినాశీ
జ్ఞాన రత్నాల దుకాణాన్ని తెరిచి కూర్చోవాలి. మీది ఎంత బాగా అలంకరింపబడిన దుకాణముగా
ఉంటుంది. మనుష్యులు దీపావళి సందర్భముగా చేస్తారు, మీరు శివజయంతి సందర్భముగా చెయ్యండి.
ఆ శివబాబా అందరి దీపాలను వెలిగిస్తారు, మిమ్మల్ని విశ్వాధిపతులుగా చేస్తారు. వారైతే
లక్ష్మి నుండి వినాశీ ధనాన్ని కోరుకుంటారు మరియు ఇక్కడ జగదంబ నుండి మీకు విశ్వ
రాజ్యాధికారము లభిస్తుంది. ఈ రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. బాబా శాస్త్రాలను
ఏమీ చదవరు. తండ్రి అంటారు, నేను జ్ఞానసంపన్నుడిని కదా. అయితే, ఫలానా-ఫలానా పిల్లలు
సేవ చాలా బాగా చేస్తారని తెలుసు, అందుకే వారు గుర్తుకొస్తారు. అంతేకానీ ప్రతి ఒక్కరి
లోపల ఏముంది అనేది కూర్చుని తెలుసుకోను. అవును, ఏదో ఒక సమయములో తెలుస్తుంది, వీరు
పతితులు అని, డౌట్ వస్తుంది. వారి ముఖమే నిరాశగా వాడిపోయినట్లు అయిపోతుంది, అప్పుడు
అతడిని అడగండి అని పై నుండి బాబా కూడా చెప్పి పంపిస్తారు. ఇది కూడా డ్రామాలో
నిశ్చితమై ఉంది. కొందరి విషయములో చెప్తారు, అంతేకానీ అందరి విషయములో చెప్తారని కాదు.
అలా అయితే నల్ల ముఖము చేసుకునేవారు చాలామంది ఉన్నారు. అలా ఎవరైతే చేస్తారో వారు తమను
తామే నష్టపరచుకుంటారు. సత్యము చెప్పడము వలన కొంత లాభముంటుంది, చెప్పకపోతే ఇంకా
ఎక్కువ నష్టపోతారు. బాబా మమ్మల్ని తెల్లగా తయారుచేయడానికి వచ్చారు, అయినా మళ్ళీ మేము
నల్ల ముఖము చేసుకుంటున్నామే అని అర్థం చేసుకోవాలి! ఇది ఉన్నదే ముళ్ళ ప్రపంచము.
ముళ్ళ వంటి మనుష్యులున్నారు. సత్యయుగాన్ని భగవంతుని పుష్పాల తోట అని అంటారు మరియు
ఇది అడవి, అందుకే తండ్రి అంటారు, ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో, అప్పుడు
నేను వస్తాను. మొదటి నంబరు శ్రీకృష్ణుడిని చూడండి, మళ్ళీ 84 జన్మల తర్వాత ఎలా
తయారవుతారు. ఇప్పుడు అందరూ తమోప్రధానముగా ఉన్నారు. పరస్పరములో కొట్లాడుకుంటూ ఉంటారు.
ఇదంతా డ్రామాలో ఉంది. ఆ తర్వాత స్వర్గములో ఇవేవీ ఉండవు. పాయింట్లు అయితే ఎన్నో
ఉన్నాయి, వాటిని నోట్ చేసుకోవాలి. ఎలాగైతే న్యాయవాదులు కూడా పాయింట్లను నోట్
చేసుకునేందుకు పుస్తకాన్ని పెట్టుకుంటారు కదా. వైద్యులు కూడా పుస్తకం పెట్టుకుంటారు,
అందులో చూసి మందులు ఇస్తారు. కావున పిల్లలు ఎంత బాగా చదువుకోవాలి, సేవ చేయాలి. బాబా
మన్మనాభవ అనే నంబరువన్ మంత్రాన్ని ఇచ్చారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి
చేసినట్లయితే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. శివజయంతిని జరుపుకుంటారు. కానీ
శివబాబా ఏం చేశారు? తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. వారు వచ్చి 5 వేల
సంవత్సరాలయింది. స్వర్గము నుండి నరకముగా, నరకము నుండి స్వర్గముగా తయారవుతుంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, యోగయుక్తులుగా అయినట్లయితే మీకు ప్రతి
విషయము చాలా బాగా అర్థమవుతుంది. కానీ యోగము సరిగ్గా లేకపోతే, తండ్రి స్మృతి ఉండకపోతే
ఏమీ అర్థం చేసుకోలేరు. వికర్మలు కూడా వినాశనమవ్వవు. యోగయుక్తముగా అవ్వకపోతే అంతటి
సద్గతి కూడా జరగదు, పాపాలు ఉండిపోతాయి. అప్పుడిక పదవి కూడా తగ్గిపోతుంది. యోగము
అస్సలు లేకుండా చాలా మంది ఉన్నారు, నామ-రూపాలలో చిక్కుకుంటూ ఉంటారు, వారి స్మృతే
వస్తూ ఉంటుంది, మరి అప్పుడు వికర్మలు ఎలా వినాశనమవుతాయి? తండ్రి అంటారు,
దేహీ-అభిమానులుగా అవ్వండి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.