02-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు పరస్పరములో చాలా-చాలా ఆత్మిక స్నేహముతో ఉండాలి, ఎప్పుడూ కూడా అభిప్రాయ బేధాలలోకి రాకూడదు’’

ప్రశ్న:-
బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ఏమని ప్రశ్నించుకోవాలి?

జవాబు:-
మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - 1. నేను ఈశ్వరుని హృదయాన్ని అధిరోహించి ఉన్నానా! 2. నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు ఉంది? 3. బ్రాహ్మణుడినైన నేను ఈశ్వరీయ సేవలో ఆటంకము కలిగించడము లేదు కదా! 4. సదా క్షీరఖండము వలె ఉంటున్నానా! నేను పరస్పరములో అందరితోనూ ఏకమతముగా ఉంటున్నానా? 5. నేను సదా శ్రీమతాన్ని పాటిస్తున్నానా?

పాట:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు...

ఓంశాంతి
పిల్లలైన మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు, ఇంతకుముందు ఆసురీ సాంప్రదాయానికి చెందినవారిగా ఉండేవారు. భోళానాథుడు అని ఎవరిని అంటారు అనేది ఆసురీ సాంప్రదాయము వారికి తెలియదు. శివ-శంకరులు వేర్వేరని కూడా వారికి తెలియదు. శంకరుడు దేవత మరియు శివుడు తండ్రి. వారికేమీ తెలియదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయము వారు లేక ఈశ్వరీయ ఫ్యామిలీ, వారు రావణుడి యొక్క ఆసురీ ఫ్యామిలీ. ఎంత వ్యత్యాసము ఉంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఫ్యామిలీలో ఈశ్వరుని ద్వారా - పరస్పరములో ఏ విధముగా ఆత్మిక ప్రేమతో ఉండాలి అనేది నేర్చుకుంటున్నారు. బ్రాహ్మణ కులములో పరస్పరములో ఈ ఆత్మిక ప్రేమను ఇక్కడి నుండే నింపుకోవాలి. ఎవరికైతే పూర్తి ప్రేమ ఉండదో, వారు పూర్తి పదవిని కూడా పొందరు. అక్కడైతే ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటుంది, పరస్పరములో ఎటువంటి కొట్లాటలు ఉండవు. ఇక్కడైతే రాజ్యాలు లేవు. బ్రాహ్మణులలో కూడా దేహాభిమానము ఉన్న కారణముగా అభిప్రాయ బేధాలలోకి వచ్చేస్తారు. ఈ విధముగా అభిప్రాయ బేధాలలోకి వచ్చేవారు శిక్షలు అనుభవించి ఆ తర్వాత పాస్ అవుతారు. తర్వాత అక్కడ ఒకే ధర్మములో ఉంటారు కావున అక్కడ శాంతి ఉంటుంది. ఇప్పుడు అటువైపు ఆసురీ సాంప్రదాయము వారు లేక ఆసురీ ఫ్యామిలీ టైప్ వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నది ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్ వారు. మీరు భవిష్యత్తు కోసం దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. తండ్రి సర్వగుణ సంపన్నులుగా తయారుచేస్తారు, కానీ అందరూ అలా తయారవ్వరు. ఎవరైతే శ్రీమతముపై నడుస్తారో, వారే విజయమాలలోని మణులుగా అవుతారు. ఎవరైతే అలా తయారవ్వరో వారు ప్రజల్లోకి వచ్చేస్తారు. అక్కడైతే దైవీ గవర్నమెంట్ ఉంటుంది, 100 శాతము పవిత్రత, శాంతి, సమృద్ధి ఉంటుంది. ఈ బ్రాహ్మణ కులములో ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేయాలి. కొంతమందైతే మంచి రీతిలో దైవీ గుణాలను ధారణ చేస్తారు, ఇతరుల చేత చేయిస్తూ ఉంటారు. ఈశ్వరీయ కులమువారికి పరస్పరములో ఆత్మిక స్నేహము ఎప్పుడు ఉంటుందంటే, దేహీ-అభిమానులుగా ఉన్నప్పుడు, అందుకే పురుషార్థము చేస్తూ ఉంటారు. అంతిమ సమయములో కూడా అందరి అవస్థ ఏకరసముగా, ఒకే విధముగానైతే ఉండదు. అప్పుడు శిక్షలను అనుభవించి పదవీ భ్రష్టులైపోతారు, తక్కువ పదవిని పొందుతారు. బ్రాహ్మణులలో కూడా ఒకవేళ ఎవరైనా పరస్పరములో క్షీరఖండములా ఉండకపోతే, పరస్పరములో ఉప్పునీరులా ఉంటే, దైవీ గుణాలను ధారణ చేయకపోతే, ఉన్నత పదవిని ఎలా పొందగలరు. ఉప్పునీరులా ఉన్న కారణముగా అక్కడక్కడ ఈశ్వరీయ సేవలో కూడా ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు. దాని పరిణామము ఏమవుతుంది, వారు అంత ఉన్నత పదవిని పొందలేరు. ఒకవైపు క్షీరఖండములా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు, మరోవైపు మాయ ఉప్పునీరులా చేస్తుంది, దాని కారణముగా సర్వీస్ కు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మీరు ఈశ్వరీయ ఫ్యామిలీ, మీరు ఈశ్వరుడితోపాటు ఉంటారు కూడా. కొంతమంది వారితోపాటు కలిసి ఉంటారు, కొంతమంది వేరే-వేరే ఊళ్లలో ఉంటారు, కానీ అందరూ కలిసే ఉన్నట్లు కదా. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. శివబాబా ఎప్పుడు వస్తారు, వచ్చి ఏమి చేస్తారు అనేది మనుష్యులకు తెలియదు. మీకు తండ్రి ద్వారా ఇప్పుడు పరిచయము లభించింది. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి ఇప్పుడు మీకు తెలుసు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది, ఇప్పుడు ఏ సమయము నడుస్తుంది అనేది ప్రపంచానికి తెలియదు, పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు.

పిల్లలైన మీకు రచయిత అయిన తండ్రి వచ్చి మొత్తం సమాచారమంతా వినిపించారు. దానితో పాటు - ఓ సాలిగ్రామాల్లారా, నన్ను స్మృతి చేయండి అని అర్థం చేయిస్తారు. ఈ విధముగా శివబాబా తన పిల్లలకు చెప్తారు. మీరు పావనముగా అవ్వాలనుకుంటున్నారు కదా. నన్ను పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. భారత్ ను మళ్ళీ శివాలయముగా తయారుచేసేందుకే శివబాబా వస్తారు, రావణుడు వేశ్యాలయముగా తయారుచేసాడు. మేము పతితముగా, వికారీగా ఉన్నామని స్వయమే పాడుతారు. భారత్ సత్యయుగములో సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. నిర్వికారీ దేవతలను వికారీ మనుష్యులు పూజిస్తారు, ఆ తర్వాత నిర్వికారులే మళ్ళీ వికారులుగా అవుతారు. ఇది ఎవ్వరికీ తెలియదు. పూజ్యులుగా ఉన్నప్పుడు నిర్వికారులుగా ఉండేవారు, ఆ తర్వాత పూజారులుగా, వికారులుగా అయ్యారు, అందుకే - ఓ పతిత-పావనా రండి, వచ్చి నిర్వికారులుగా తయారుచేయండి అని పిలుస్తారు. తండ్రి అంటారు - ఈ అంతిమ జన్మ మీరు పవిత్రముగా అవ్వండి, నన్నొక్కరినే స్మృతి చేయండి, అప్పుడు మీ పాపాలు కట్ అయిపోతాయి మరియు మీరు తమోప్రధానము నుండి సతోప్రధాన దేవతలుగా అయిపోతారు, ఆ తర్వాత చంద్రవంశీ క్షత్రియ ఫ్యామిలీ టైప్ లోకి వస్తారు. ఈ సమయములో మీరు ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్ వారిగా ఉన్నారు, ఆ తర్వాత దైవీ ఫ్యామిలీలో 21 జన్మలు ఉంటారు. ఈ ఈశ్వరీయ ఫ్యామిలీలో మీరు అంతిమ జన్మను గడుపుతారు, ఇందులో మీరు పురుషార్థము చేసి సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. మీరు పూజ్యులుగా ఉండేవారు, తప్పకుండా రాజ్యము చేసేవారు, ఆ తర్వాత పూజారులుగా అయ్యారు. ఇది అర్థం చేయించవలసి ఉంటుంది కదా. భగవంతుడు తండ్రి, మనము వారి పిల్లలము, అంటే ఫ్యామిలీ అయినట్లు కదా. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము... అని పాడుతారు కూడా, అంటే ఫ్యామిలీ అయినట్లే కదా. ఇప్పుడు తండ్రి నుండి అపారమైన సుఖము లభిస్తుంది. తండ్రి అంటారు - మీరు నిస్సంకోచముగా నా ఫ్యామిలీయే, కానీ డ్రామా ప్లాన్ అనుసారముగా రావణ రాజ్యములోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దుఃఖములోకి వచ్చినప్పుడు నన్ను పిలుస్తారు. ఈ సమయములో మీరు ఏక్యురేట్ ఫ్యామిలీ. మళ్ళీ మీకు భవిష్య 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తాను. ఈ వారసత్వము మళ్ళీ దైవీ ఫ్యామిలీలో 21 జన్మలు నిలిచి ఉంటుంది. దైవీ ఫ్యామిలీ సత్య-త్రేతాయుగాల వరకు నడుస్తుంది. ఆ తర్వాత రావణ రాజ్యము ఏర్పడడముతో, మేము దైవీ ఫ్యామిలీకి చెందినవారమని మర్చిపోతారు. వామ మార్గములోకి వెళ్ళడముతో ఆసురీ ఫ్యామిలీగా అవుతుంది. 63 జన్మలు మెట్లు దిగుతూ వచ్చారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది, దీనిని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. వాస్తవానికి మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. సత్యయుగానికి ముందు కలియుగము ఉండేది. సంగమయుగములో మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడము జరుగుతుంది, మధ్యలో ఉన్నది ఈ సంగమయుగము. మిమ్మల్ని బ్రాహ్మణ ధర్మము నుండి మళ్ళీ దైవీ ధర్మములోకి తీసుకువస్తారు. లక్ష్మీ-నారాయణులు ఈ రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు అనేది అర్థం చేయించడము జరుగుతుంది. వారి కన్నా ముందు ఆసురీ రాజ్యముండేది, మరి దైవీ రాజ్యము ఎప్పుడు మరియు ఎలా ఏర్పడింది. తండ్రి అంటారు - కల్ప-కల్పము సంగమయుగములో వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలలోకి తీసుకువస్తాను. ఇది భగవంతుని ఫ్యామిలీ. అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు, కానీ తండ్రి గురించి తెలియని కారణముగా అనాథలుగా అయిపోయారు. అందుకే తండ్రి, ఘోర అంధకారము నుండి ప్రకాశమయముగా చేయడానికి వచ్చారు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది. పిల్లలైన మీరు చదువుకుంటున్నారు, దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. శివజయంతిని జరుపుకుంటారు, శివజయంతి తర్వాత ఏమి జరుగుతుంది, ఇది కూడా తెలియాలి. తప్పకుండా దైవీ రాజ్యము యొక్క జయంతి జరిగి ఉంటుంది కదా. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ ను స్థాపన చేయడానికి హెవెన్ లోకైతే రారు. నేను హెల్ (నరకము) మరియు హెవెన్ (స్వర్గము)కు మధ్యన సంగమములో వస్తానని తండ్రి అంటారు. శివరాత్రి అని అంటారు కదా, అంటే నేను రాత్రి సమయములో వస్తాను. ఈ విషయము పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారు ఇతరులకు కూడా ధారణ చేయిస్తారు. ఎవరైతే మనసా-వాచా-కర్మణా సేవలో తత్పరులై ఉంటారో, వారే హృదయాన్ని అధిరోహిస్తారు, ఎవరు ఎంతగా సేవ చేస్తారో అంతగా వారు హృదయాన్ని అధిరోహిస్తారు. కొంతమంది ఆల్రౌండ్ వర్కర్లుగా ఉంటారు. అన్ని పనులు నేర్చుకోవాలి. వంట వండటము, రోటీ తయారుచేయడము, పాత్రలు శుభ్రము చేయడము... ఇవి కూడా సేవలే కదా. తండ్రి స్మృతి ఫస్ట్. వారి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఇక్కడి వారసత్వము లభించి ఉంది. అక్కడ సర్వగుణ సంపన్నులుగా ఉంటారు, యథా రాజా రాణి తథా ప్రజా ఉంటారు. దుఃఖము అన్న మాటే ఉండదు. ఈ సమయములో అందరూ నరకవాసులుగా ఉన్నారు. అందరిదీ దిగే కళే, మళ్ళీ ఇప్పుడు ఎక్కే కళ ఏర్పడుతుంది. తండ్రి అందరినీ దుఃఖము నుండి విడిపించి సుఖములోకి తీసుకువెళ్తారు, అందుకే తండ్రిని లిబరేటర్ (ముక్తిదాత) అని అంటారు. ఇక్కడ మీకు నషా ఉంటుంది - మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము, యోగ్యులుగా అవుతున్నాము అని. ఎవరైతే ఇతరులను రాజ్య పదవికి యోగ్యులుగా తయారుచేస్తారో, వారినే యోగ్యులు అని అంటారు. చదువుకునేవారైతే చాలామంది వస్తారు అని ఇది కూడా బాబా అర్థం చేయించారు. అలాగని అందరూ 84 జన్మలు తీసుకుంటారని కాదు. ఎవరైతే కొద్దిగా చదువుకుంటారో వారు ఆలస్యముగా వస్తారు, కావున వారి జన్మలు కూడా తక్కువగా ఉంటాయి కదా. కొంతమంది 80 జన్మలు తీసుకుంటారు, కొంతమంది 82 జన్మలు తీసుకుంటారు, ఎవరు త్వరగా వస్తారు, ఎవరు వెనక వస్తారు... ఇదంతా చదువుపై ఆధారపడి ఉంది. సాధారణ ప్రజలు వెనుక వస్తారు, వారికి 84 జన్మలు ఉండవు, వారు తర్వాతర్వాత వస్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా చివరిలో ఉంటారో, వారు త్రేతాయుగ అంతిమములో వచ్చి జన్మ తీసుకుంటారు, ఇక తర్వాత వామ మార్గములోకి వెళ్తారు, దిగడము ప్రారంభమవుతుంది. భారతవాసులు 84 జన్మలను ఎలా తీసుకున్నారు అనేది ఈ మెట్ల వరుస చూపిస్తుంది. ఈ సృష్టిచక్రము డ్రామా రూపములో ఉంది. ఎవరైతే పావనముగా ఉండేవారో, వారే ఇప్పుడు పతితముగా అయ్యారు, మళ్ళీ పావన దేవతలుగా అవుతారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు అందరి కళ్యాణము జరుగుతుంది, అందుకే దీనిని శుభప్రదమైన యుగమని అంటారు. గొప్పదనమంతా అందరి కళ్యాణము చేసే తండ్రిదే. సత్యయుగములో అందరి కళ్యాణము ఉండేది, ఏ దుఃఖము ఉండేది కాదు, మేము ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్ వారము అనైతే అర్థం చేయించవలసి ఉంటుంది. ఈశ్వరుడు అందరికీ తండ్రి. నీవే తల్లివి-తండ్రివి అని ఇక్కడే పాడుతారు, అక్కడైతే (విదేశాలలోనైతే) కేవలం ఫాదర్ అని అంటారు. ఇక్కడ పిల్లలైన మీకు తల్లిదండ్రులు లభిస్తారు. ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకోవడము జరుగుతుంది. తండ్రి రచయిత కావున తల్లి కూడా ఉంటారు, లేదంటే రచన ఎలా జరుగుతుంది. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ ను ఎలా స్థాపన చేస్తారు అనేది, భారతవాసులకు కూడా తెలియదు, విదేశీయులకు కూడా తెలియదు. కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము తప్పకుండా సంగమములోనే జరుగుతుందని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ, పరమపిత పరమాత్మను స్మృతి చేయాలి. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు, సద్గురువు మధ్యవర్తిగా అయి సుందర మిలనాన్ని చేయించారు... మరి సుందరమైన మేళా ఎక్కడ జరుగుతుంది! ఆ సుందరమైన మేళా తప్పకుండా ఇక్కడే జరుగుతుంది. తండ్రి అయిన పరమాత్మ ఇక్కడకు వస్తారు, దీనిని కళ్యాణకారీ సుందరమైన మేళా అని అంటారు. జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని అందరికీ ఇస్తారు. జీవన బంధనము నుండి విముక్తులైపోతారు. శాంతిధామానికైతే అందరూ వెళ్తారు, ఆ తర్వాత ఎప్పుడైతే కిందకు వస్తారో, అప్పుడు సతోప్రధానముగా ఉంటారు. వారు ధర్మస్థాపనార్థము వస్తారు. కింద ఎప్పుడైతే వారి జనసంఖ్య పెరుగుతుందో , అప్పుడు రాజ్యము కోసం పురుషార్థము చేస్తారు, అప్పటివరకు ఎటువంటి కొట్లాటలు మొదలైనవి ఉండవు. సతోప్రధానము నుండి రజోలోకి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు యుద్ధాలు, కొట్లాటలు మొదలుపెడతారు. మొదట సుఖము, ఆ తర్వాత దుఃఖము. ఇప్పుడు పూర్తిగా దుర్గతిని పొంది ఉన్నారు. ఈ కలియుగీ ప్రపంచ వినాశనము, ఆ తర్వాత సత్యయుగీ ప్రపంచ స్థాపన జరగనున్నది. విష్ణుపురి యొక్క స్థాపనను బ్రహ్మా ద్వారా చేస్తున్నారు. ఎవరు ఎటువంటి పురుషార్థము చేస్తారో, దాని అనుసారముగా విష్ణుపురిలోకి వచ్చి ప్రారబ్ధాన్ని పొందుతారు. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా మంచి-మంచి విషయాలు. మేము ఈశ్వరుడి నుండి భవిష్య 21 జన్మల వారసత్వాన్ని పొందుతున్నామని ఈ సమయములో పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. ఎంతగా పురుషార్థము చేసి స్వయాన్ని ఏక్యురేట్ గా తయారుచేసుకుంటారో అంత... మీరు ఏక్యురేట్ గా తయారవ్వాలి. గడియారాలలో కూడా లివర్ గడియారాలు మరియు సిలిండర్ గడియారాలు ఉంటాయి కదా. లివర్ గడియారము చాలా ఏక్యురేట్ గా ఉంటుంది. పిల్లల్లో కొందరు ఏక్యురేట్ గా తయారవుతారు. కొందరు అన్ ఏక్యురేట్ గా తయారైతే, అటువంటివారు తక్కువ పదవిని పొందుతారు. పురుషార్థము చేసి ఏక్యురేట్ గా తయారవ్వాలి. ఇప్పుడు అందరూ ఏక్యురేట్ గా నడుచుకోవడము లేదు. పురుషార్థము చేయించేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. భాగ్యము తయారుచేసుకునే పురుషార్థములో లోపముంది, అందుకే తక్కువ పదవిని పొందుతారు. శ్రీమతముపై నడుచుకోని కారణముగా, ఆసురీ గుణాలను వదలని కారణముగా, యోగములో ఉండని కారణముగా ఇవన్నీ జరుగుతాయి. యోగములో లేకపోతే పండితుని వలె ఉన్నట్లే. యోగము తక్కువగా ఉంది, అందుకే శివబాబాపై ప్రేమ ఉండదు, ధారణ కూడా తక్కువగా జరుగుతుంది, ఆ సంతోషము ఉండదు. ముఖమే శవము వలె ఉంటుంది. మీ ముఖ కవళికలైతే దేవతల వలె సదా హర్షితముగా ఉండాలి. తండ్రి మీకు ఎంత వారసత్వాన్ని ఇస్తారు. ఎవరైనా పేదవాని బిడ్డ షావుకారు వద్దకు వెళ్తే, అతనికి ఎంత సంతోషము కలుగుతుంది. మీరు చాలా పేదవారిగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి దత్తత తీసుకున్నారు కావున సంతోషముండాలి. మనము ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిగా అయ్యాము. కానీ భాగ్యములో లేకపోతే ఏమి చేయగలరు. పదవి భ్రష్టులైపోతారు. పట్టపురాణులుగా అవ్వరు. తండ్రి వచ్చేదే పట్టపురాణులుగా తయారుచేసేందుకు. బ్రహ్మా, విష్ణు, శంకరులు ముగ్గురూ శివుని పిల్లలేనని పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. భారత్ ను మళ్ళీ బ్రహ్మా ద్వారా స్వర్గముగా తయారుచేస్తారు. శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది, ఇకపోతే భారత్ లోనే కొంతమంది మిగులుతారు. ప్రళయమైతే జరగదు, కానీ చాలామంది అంతమైపోతారు కావున ప్రళయము జరిగినట్లుగా అవుతుంది. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఏర్పడుతుంది. వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. ఇది పతిత-పావనుడైన తండ్రి పనే. తండ్రి అంటారు - దేహీ-అభిమానులుగా అవ్వండి, లేకపోతే పాత సంబంధీకులు గుర్తుకొస్తూ ఉంటారు. మీరు విడిచిపెట్టారు కూడా, అయినా కూడా బుద్ధి వెళ్తూ ఉంటుంది. నష్టోమోహులుగా లేరు, దీనిని వ్యభిచారి స్మృతి అని అంటారు. అటువంటివారు సద్గతిని పొందలేరు ఎందుకంటే వారు దుర్గతిలో ఉన్నవారిని స్మృతి చేస్తూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బాప్ దాదా హృదయాన్ని అధిరోహించేందుకు మనసా-వాచా-కర్మణా సేవ చేయాలి. ఏక్యురేట్ గా మరియు ఆల్రౌండర్ గా అవ్వాలి.

2. ఏ విధముగా దేహీ-అభిమానులుగా అవ్వాలంటే పాత సంబంధీకులెవ్వరూ గుర్తుకురాకూడదు. పరస్పరములో చాలా-చాలా ఆత్మిక ప్రేమతో ఉండాలి, ఉప్పునీరులా అవ్వకూడదు.

వరదానము:-
విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్యములో తమ వేలును అందించే మహాన్ మరియు నిర్మానచిత్త భవ

ఏ విధముగా ఏవైనా స్థూలమైన పదార్థాలను తయారుచేసేటప్పుడు అందులో అన్ని వస్తువులను వేస్తారో, సాధారణమైన తీపి లేక ఉప్పు తక్కువైనా కూడా, మంచి పదార్థమైనా సరే తినడానికి యోగ్యముగా అవ్వదు. అదే విధముగా విశ్వ పరివర్తన యొక్క ఈ శ్రేష్ఠమైన కార్యము కోసము ప్రతి ఒక్క రత్నము అవసరము. అందరి వేలు కావాలి. అందరూ తమ-తమ రీతిలో చాలా-చాలా అవసరము, మీరు శ్రేష్ఠమైన మహారథులు, అందుకే మీ కార్యములోని శ్రేష్ఠత యొక్క విలువను తెలుసుకోండి, మీరందరూ మహానాత్మలు, కానీ ఎంతగా మహానులుగా ఉన్నారో, అంతే నిర్మానచిత్తులుగా కూడా అవ్వండి.

స్లోగన్:-
మీ స్వభావాన్ని ఈజీగా (సరళముగా) చేసుకున్నట్లయితే అన్ని కార్యాలు ఈజీ అయిపోతాయి.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

జీవితములో ఉంటూ, సమయము నాజూకుగా ఉంటూ, పరిస్థితులు, సమస్యలు, వాయుమండలము డబల్ దూషితముగా ఉంటూ కూడా వాటి ప్రభావము నుండి ముక్తులుగా, జీవితములో ఉంటూ ఈ భిన్న-భిన్న బంధనాలన్నింటి నుండి ముక్తులుగా ఉండాలి. ఒక్క సూక్ష్మమైన బంధనము కూడా ఉండకూడదు. ఈ విధముగా బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా అవ్వాలి. సంగమయుగములోనే ఈ జీవన్ముక్త స్థితి యొక్క ప్రారబ్ధాన్ని అనుభవము చేయాలి.