02-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.10.2004


‘‘ఒక్కరిని ప్రత్యక్షము చేయడానికి ఏకరస స్థితిని తయారుచేసుకోండి, స్వమానములో ఉండండి, అందరికీ గౌరవాన్ని ఇవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకముపై మెరుస్తున్న మూడు భాగ్య సితారలను మెరుస్తూ ఉండటం చూస్తున్నారు. ఒకటి, పరమాత్మ పాలన యొక్క భాగ్యము, రెండు, పరమాత్మ చదువు యొక్క భాగ్యము మరియు మూడు, పరమాత్మ వరదానాల భాగ్యము. ఇటువంటి మూడు సితారలను ప్రతి ఒక్కరి మస్తకము మధ్యలో చూస్తున్నారు. మీరు కూడా మెరుస్తున్న మీ భాగ్య సితారలను చూస్తున్నారా? కనిపిస్తున్నాయా? ఇటువంటి శ్రేష్ట భాగ్య సితారలు మొత్తము విశ్వములో మరెవ్వరి మస్తకములోనూ మెరుస్తూ ఉండడం కనిపించవు. ఈ భాగ్య సితారలైతే అందరి మస్తకములోనూ మెరుస్తున్నాయి, కానీ మెరుపులో అక్కడక్కడా తేడా కనిపిస్తుంది. కొందరి మెరుపు చాలా శక్తిశాలిగా ఉంది, కొందరి మెరుపు మధ్యమముగా ఉంది. భాగ్యవిధాత పిల్లలందరికీ భాగ్యాన్ని ఒకే విధంగా ఇచ్చారు. ఎవ్వరికీ స్పెషల్ గా ఇవ్వలేదు. పాలన కూడా ఒకే విధముగా ఇచ్చారు, చదువు కూడా అందరికీ కలిపే చెప్తున్నారు, వరదానాలు కూడా అందరికీ ఒకే విధమైనవి లభించాయి. మొత్తము విశ్వములోని మూలమూలల్లో చదువు సదా ఒక్కటే ఉంటుంది. ఒకటే మురళి, ఒకటే డేట్ మరియు అమృతవేళ సమయము కూడా తమ-తమ దేశాలలోని సమయము లెక్కలో ఉన్నా కూడా సమయము ఒకటే, వరదానము కూడా ఒక్కటే, స్లోగన్ కూడా ఒక్కటే - ఇది అద్భుతము. ఏమన్నా తేడా ఉంటుందా? అమెరికా మరియు లండన్ లో తేడా ఉంటుందా? ఉండదు. అయితే మరి తేడా ఎందుకు ఉంది?

అమృతవేళ బాప్ దాదా నలువైపులా ఒకే విధమైన పాలన చేస్తారు. నిరంతర స్మృతి యొక్క విధి కూడా అందరికీ ఒకటే లభిస్తుంది, అయినా నంబరువారుగా ఎందుకు ఉన్నారు? విధి ఒక్కటే కానీ సిద్ధి యొక్క ప్రాప్తిలో తేడా ఎందుకు ఉంది? బాప్ దాదాకు నలువైపులా ఉన్న పిల్లలపై ప్రేమ కూడా ఒకే విధంగా ఉంది. బాప్ దాదా ప్రేమలో, పురుషార్థానుసారముగా నంబరులో చివరి నంబరు అయినా కానీ బాప్ దాదాకు ప్రేమ అయితే చివరి నంబరువారిపై కూడా అదే విధంగా ఉంది. చివరి నంబరువారిపై అయితే ప్రేమతోపాటు ఇంకా దయ కూడా ఉంది, వీరు లాస్ట్ నుండి ఫాస్ట్ గా, ఫస్ట్ గా అయిపోవాలి అని అనుకుంటారు. దూరదూరాల నుండి చేరుకున్న మీరందరూ ఎలా చేరుకున్నారు? పరమాత్మ ప్రేమ ఆకర్షించి తీసుకువచ్చింది కదా! ప్రేమ బంధములో ఆకర్షించబడి వచ్చేసారు. కావున బాప్ దాదాకు అందరిపైనా ప్రేమ ఉంది. ఇలానే భావిస్తున్నారా లేక నా పట్ల ప్రేమ ఉందా లేక తక్కువ ప్రేమ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుందా? బాప్ దాదాకు పిల్లలందరిపై ఒకరి కంటే ఒకరిపై ఎక్కువ ప్రేమ ఉంది. మరియు ఈ పరమాత్మ ప్రేమయే పిల్లలందరి విశేష పాలనకు ఆధారము. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు - బాబాపై నాకు ఎక్కువ ప్రేమ ఉందా అని అనుకుంటున్నారా లేక ఇతరులకు ఎక్కువ ప్రేమ ఉంది, నాకు తక్కువ ఉంది అని అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నారా? నాకు ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఉంది అని అనుకుంటున్నారు కదా? అలానే అనుకుంటున్నారు కదా? పాండవులు అలానే అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ ‘‘నా బాబా’’ అనే అంటారు. అంతేకానీ సెంటరు ఇంఛార్జ్ యొక్క బాబా, దాదా యొక్క బాబా, జానకి దాది యొక్క బాబా అని అనరు కదా. అలా అంటారా? అనరు. నా బాబా అనే అంటారు. నా వారు అని అన్నప్పుడు మరియు బాబా కూడా నా వారు అని అన్నప్పుడు, ఆ ఒక్క ‘నా’ అనే పదముతోనే పిల్లలు బాబాకు చెందినవారిగా అయిపోయారు మరియు బాబా పిల్లలకు చెందినవారిగా అయిపోయారు. ఇది కష్టమనిపించిందా? కష్టమనిపించిందా? కొంచెం-కొంచెం అనిపించిందా? అనిపించలేదా? అప్పుడప్పుడు అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. మరి కష్టమనిపించినప్పుడు ఏం చేస్తారు? అలసిపోతారా? మనస్ఫూర్తిగా, ప్రేమతో ‘‘నా బాబా’’ అని అనండి, అప్పుడు శ్రమ ప్రేమలోకి మారిపోతుంది. ‘‘నా బాబా’’ అని అనగానే బాబా వద్దకు ఆ శబ్దము చేరుకుంటుంది మరియు బాబా ఎక్స్ ట్రా సహాయము అందిస్తారు. కానీ ఇది మనసుతో చేసుకున్న ఒప్పందము, నోటితో చేసుకున్న ఒప్పందము కాదు. ఇది మనసుతో చేసుకున్న ఒప్పందము. మరి మనసుతో ఒప్పందము చెయ్యటములో తెలివైనవారే కదా? అలా చేయడం వస్తుంది కదా? వెనుక ఉన్నవారికి వస్తుందా? వస్తుంది కాబట్టే చేరుకున్నారు కదా. కానీ అందరికంటే దూరదేశీ ఎవరు? అమెరికానా? అమెరికావారు దూరదేశీయులా లేక బాబా దూరదేశీనా? అమెరికా అయితే ఈ ప్రపంచములోనే ఉంది. బాబా అయితే మరో ప్రపంచము నుండి వస్తారు. కనుక అందరికంటే దూరదేశీ ఎవరు? అమెరికావారు కారు. అందరికంటే దూరదేశీ బాప్ దాదా. ఒకరు ఆకార వతనము నుండి వస్తారు, ఒకరు పరంధామము నుండి వస్తారు, మరి వాటిముందు అమెరికా ఎంత? అసలేమీ కాదు.

ఈ రోజు దూరదేశీ బాబా ఈ సాకార ప్రపంచములోని దూరదేశీ పిల్లలను కలుస్తున్నారు. ఈ రోజు మా కోసం బాప్ దాదా వచ్చారు అన్న నషా ఉంది కదా? భారతవాసులైతే బాబాకు చెందినవారే కానీ డబుల్ విదేశీయులను చూసి బాప్ దాదా విశేషముగా సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? బాప్ దాదా ఏం చూసారంటే - భారత్ లోనైతే బాబా వచ్చారు కనుక భారతవాసులకు ఈ నషా ఎక్స్ ట్రాగా ఉంటుంది కానీ డబుల్ విదేశీయులపై ప్రేమ ఎందుకని ఉందంటే రకరకాల సంస్కృతులకు చెందినవారైనా కానీ బ్రాహ్మణ సంస్కృతిలోకి పరివర్తన అయిపోయారు. అయ్యారు కదా? ఇది భారత్ యొక్క సంస్కృతి, మా సంస్కృతి వేరు అని ఇప్పుడైతే సంకల్పము రావటం లేదా? లేదు. ఇప్పుడు బాప్ దాదా రిజల్టులో ఏం చూసారంటే - అందరూ ఒకే సంస్కృతికి చెందినవారిగా అయిపోయారు. ఏ స్థానానికి చెందినవారైనా కానీ, సాకార శరీరము పరంగా దేశాలు వేర్వేరు కానీ, ఆత్మ బ్రాహ్మణ సంస్కృతికి చెందినదిగా ఉంది. డబుల్ విదేశీయులలోని మరొక విషయము బాప్ దాదాకు చాలా బాగా అనిపిస్తుంది, అదేమిటో తెలుసా? (త్వరగా సేవ చెయ్యటములో నిమగ్నమైపోయారు). ఇంకా చెప్పండి? (ఉద్యోగము కూడా చేస్తారు, సేవ కూడా చేస్తారు), అలా అయితే ఇండియాలో కూడా చేస్తారు. ఇండియాలో కూడా ఉద్యోగము చేస్తారు. (ఏదైనా జరిగితే సత్యతతో తమలోని బలహీనతను చెప్పేస్తారు, స్పష్టవాదులు), అచ్ఛా, ఇండియావారు స్పష్టవాదులు కాదా?

బాప్ దాదా ఏం చూసారంటే - దూరముగా ఉన్నా కానీ బాబాపై ప్రేమ కారణముగా ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు. భారత్ కైతే భాగ్యము ఉండనే ఉంది కానీ దూరముగా ఉన్నా కానీ ప్రేమలో అందరూ పాస్. ప్రేమలో పర్సెంటేజ్ ఉందా అని బాప్ దాదా ప్రశ్నించినట్లయితే ఏమంటారు? బాబాపై ప్రేమ అనే సబ్జెక్టులో పర్సెంటేజ్ ఉందా? ప్రేమలో 100 శాతము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) అచ్ఛా - 100 శాతము ఉందా? భారతవాసులు చేతులెత్తటం లేదు. చూడండి, బాబా భారత్ లోనే వచ్చారు కావున భారత్ కు అందరికంటే ఎక్కువ భాగ్యము లభించింది. ఈ విషయములో బాబాకు అమెరికా ఇష్టమనిపించలేదు, భారత్ యే ఇష్టమనిపించింది. ఈమె (అమెరికా యొక్క గాయత్రి అక్కయ్య) ఎదురుగా కూర్చుని ఉన్నారు, అందుకే అమెరికా అంటున్నాము. కానీ దూరముగా ఉన్నా సరే ప్రేమ బాగుంది. సమస్యలు వస్తాయి కూడా, అయినా కానీ బాబా-బాబా అంటూ వాటిని తొలగించేస్తారు.

ప్రేమలో అయితే బాప్ దాదా కూడా పాస్ చేసేసారు, ఇప్పుడు ఇంకా ఎందులో పాస్ అవ్వాలి? ఇంకా అవ్వాలి కదా! అయ్యారు కూడా మరియు ఇంకా అవ్వాలి కూడా. వర్తమాన సమయమనుసారముగా బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరిలో స్వ పరివర్తన శక్తి యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది? ఏ విధంగా ప్రేమ శక్తిలో అందరూ చేతులెత్తారో, అందరూ చేతులెత్తారు కదా! అంతగానే స్వ పరివర్తనలో కూడా తీవ్ర గతి ఉందా? ఈ విషయములో సగమే చెయ్యి ఎత్తుతారా లేక పూర్తిగా ఎత్తుతారా? ఎలా ఎత్తుతారు? పరివర్తన చేసుకుంటారు కూడా, కానీ సమయము పడుతుంది. సమయ సమీపత అనుసారముగా స్వ పరివర్తనా శక్తి ఎంత తీవ్రముగా ఉండాలంటే, ఎలా అయితే కాగితముపై బిందువు పెట్టాలంటే ఎంత సమయములో పెట్టగలరు? ఎంత సమయము పడుతుంది? బిందువు పెట్టడానికి ఎంత సమయము పడుతుంది? ఒక్క క్షణము కూడా పట్టదు. అంతే కదా! మరి అటువంటి తీవ్ర గతి ఉందా? ఇందులో చెతులెత్తుతారా? ఇందులో సగమే చేతులెత్తుతారు. సమయము యొక్క వేగము తీవ్రముగా ఉంది, స్వ పరివర్తన యొక్క శక్తి కూడా అంత తీవ్రముగా ఉండాలి. మరియు పరివర్తన అని అన్నప్పుడు ముందుగా పరివర్తన అన్న పదానికి ముందు స్వ అన్న పదాన్ని సదా గుర్తు పెట్టుకోండి. పరివర్తన కాదు, స్వ పరివర్తన. బాప్ దాదాకు గుర్తుంది - సంస్కార పరివర్తన ద్వారా సంసార (ప్రపంచ) పరివర్తన చేస్తాము అని పిల్లలు బాబాకు ఒక సంవత్సరము కొరకు ప్రతిజ్ఞ చేసారు. గుర్తుందా? సంస్కార పరివర్తన ద్వారా ప్రపంచ పరివర్తన అన్న సంవత్సరాన్ని జరుపుకున్నారు. ప్రపంచ గతి అయితే అతిలోకి వెళ్తూ ఉంది. మరి సంస్కార పరివర్తన, దాని గతి అంత వేగముగా ఉందా? ఆ మాటకొస్తే విదేశాల విశేషత ఏమిటంటే - మామూలుగా విదేశాలు ఫాస్ట్ గా నడుస్తాయి, ఫాస్ట్ గా చేస్తాయి. కనుక బాబా అడుగుతున్నారు - సంస్కారా పరివర్తనలో ఫాస్ట్ గా ఉన్నారా? బాప్ దాదా స్వ పరివర్తన యొక్క వేగాన్ని ఇప్పుడు తీవ్రముగా చూడాలని కోరుకుంటున్నారు. బాప్ దాదా ఏం కోరుకుంటారు అని అందరూ అడుగుతారు కదా? పరస్పరము ఆత్మిక సంభాషణ చేసుకుంటుంటారు కదా, అప్పుడు బాప్ దాదా ఏం కోరుకుంటారు అని ఒకరినొకరు అడుగుతుంటారు. కనుక బాప్ దాదా దీనిని కోరుకుంటున్నారు. క్షణములో బిందువు పడాలి. కాగితముపై బిందువు పడుతుంది కదా, దానికంటే కూడా వేగముగా, పరివర్తనలో ఏదైతే అయథార్థమో, దానికి బిందువు పడాలి. బిందువు పెట్టడం వస్తుందా? వస్తుంది కదా! కానీ అప్పుడప్పుడు అది ప్రశ్నార్థకమైపోతుంది. పెట్టేది బిందువు కానీ అది ప్రశ్నార్థకమైపోతుంది. ఇది ఎందుకు, ఇది ఏమిటి? ఈ ఎందుకు మరియు ఏమిటి... ఇవి బిందువును ప్రశ్నార్థకములోకి మార్చేస్తాయి. బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - వై, వై (ఎందుకు, ఎందుకు) అని అనకండి, ఏం చేయాలి? ఫ్లై. అయితే వాహ్, వాహ్ అనండి లేదా ఎగరండి. ఎందుకు, ఎందుకు అని అనకండి. ఎందుకు, ఎందుకు అని అనటం త్వరగా వస్తుంది కదా! అది వచ్చేస్తుంది కదా? ఎందుకు అనేది వచ్చినప్పుడు దానిని వాహ్, వాహ్ గా చెయ్యండి. ఎవరైనా ఏదైనా చేస్తే, ఏదైనా అంటే - వాహ్ డ్రామా వాహ్! ఇలా ఎందుకు చేస్తారు, ఇలా ఎందుకు అంటారు అని అనవద్దు. వీరు చేసినట్లయితే నేను చేస్తాను అని కూడా అనవద్దు.

ఈ రోజుల్లో బాప్ దాదా చూసారు, వినిపించమంటారా! పరివర్తన చేసుకోవాలి కదా! ఈ రోజుల్లోని రిజల్టులో, విదేశాలలోనైనా లేక ఇండియాలోనైనా, రెండు వైపులా ఒక విషయము యొక్క అల ఉంది, అది ఏమిటి? ఇది అవ్వాలి, ఇది లభించాలి, వీరు ఇది చెయ్యాలి... నేను ఏదైతే ఆలోచిస్తానో, ఏదైతే అంటానో అది జరగాలి... ఈ కావాలి, కావాలి అనేది సంకల్పమాత్రముగా ఉన్నా కూడా ఆ వేస్ట్ థాట్స్ (వ్యర్థ ఆలోచనలు) బెస్ట్ గా అవ్వనివ్వవు. బాప్ దాదా అందరిదీ వేస్ట్ యొక్క చార్టును కొద్ది సమయము కొరకు నోట్ చేసారు. చెక్ చేసారు. బాప్ దాదా వద్దనైతే శక్తిశాలీ మెషినరీ ఉంది కదా. మీ దగ్గర ఉన్నలాంటి కంప్యూటర్ కాదు, మీ కంప్యూటర్ అయితే నిందిస్తుంది కూడా. కానీ బాప్ దాదా వద్ద ఉన్న చెకింగ్ మెషినరీ చాలా వేగవంతమైనది. బాప్ దాదా చూసారు - మెజారిటీవారికి వ్యర్థ సంకల్పాలు మొత్తము రోజంతటిలో మధ్యమధ్యలో నడుస్తూనే ఉంటాయి. ఏమవుతుందంటే ఈ వేస్ట్ సంకల్పాల బరువు ఎక్కువైపోతుంది మరియు బెస్ట్ సంకల్పాల బరువు తక్కువైపోతుంది. కనుక మధ్యమధ్యలో ఈ వ్యర్థ సంకల్పాలు ఏవైతే నడుస్తాయో, అవి బుద్ధిని భారంగా చేసేస్తాయి. పురుషార్థాన్ని భారంగా చేసేస్తాయి. బరువుగా ఉంటాయి కదా, అందుకే అవి తమవైపుకు లాగుతుంటాయి, అందుకే స్వ ఉన్నతికి లిఫ్ట్ అయిన శుభ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, అవి మెట్లు కూడా కాదు, అవి లిఫ్ట్, ఆ శుభ సంకల్పాలు తక్కువగా ఉన్న కారణముగా, శ్రమ అనే మెట్లు ఎక్కవలసి వస్తుంది. కేవలం రెండు పదాలను గుర్తు పెట్టుకోండి, అంతే - వేస్టును (వ్యర్థాన్ని) సమాప్తము చేసేందుకు అమృతవేళ నుండి రాత్రి వరకు రెండు పదాలను సంకల్పాలలో, మాటలలో మరియు కర్మలలో, కార్యములో పెట్టండి, ప్రాక్టికల్ లోకి తీసుకురండి. ఆ రెండు పదాలు ఏమిటంటే - స్వమానము మరియు సమ్మాన్ (గౌరవము). స్వమానములో ఉండాలి మరియు గౌరవాన్ని ఇవ్వాలి. ఎవరు ఎలా ఉన్నా కానీ మనము గౌరవాన్ని ఇవ్వాలి. గౌరవాన్ని ఇవ్వాలి, స్వమానములో స్థితులవ్వాలి. ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. ఒక్కోసారి స్వమానములో ఎక్కువగా ఉంటారు, ఒక్కోసారి గౌరవాన్ని ఇవ్వటములో తక్కువగా ఉంటారు. ఇతరులు గౌరవాన్ని ఇస్తే అప్పుడు నేనూ ఇస్తాను అన్నట్లు ఉండకూడదు. నేను దాతగా అవ్వాలి. శివ శక్తి పాండవ సేన దాత పిల్లలు, దాతలు. వారు ఇస్తే నేను ఇస్తాను అన్నది బిజినెస్ అయిపోతుంది, అది దాతగా అయినట్లు కాదు. మరి మీరు బిజినెస్ మ్యానా లేక దాతనా? దాత ఎప్పుడూ తీసుకునేవారిగా ఉండరు. మీ వృత్తిలో మరియు దృష్టిలో ఇదే లక్ష్యము పెట్టుకోండి - నేను సదా ప్రతి ఒక్కరి పట్ల అనగా సర్వుల పట్ల, వారు అజ్ఞానులైనా లేక జ్ఞానులైనా కానీ, అజ్ఞానుల పట్ల ఎంతైనా శుభ భావన పెట్టుకుంటారు కానీ జ్ఞాన స్వరూప ఆత్మల పట్ల పరస్పరం ప్రతి సమయము శుభ భావన, శుభ కామన ఉండాలి. వృత్తి ఆ విధంగా తయారైపోవాలి, దృష్టి ఆ విధంగా తయారైపోవాలి, అంతే. దృష్టిలో స్థూల బిందువు ఉంటుంది, ఆ బిందువు ఎప్పుడైనా మాయమైపోతుందా! కళ్ళ నుండి ఒకవేళ బిందువు మాయమైపోతే ఎలా అయిపోతారు? చూడగలుగుతారా? కనుక ఎలా అయితే కళ్ళల్లో బిందువు ఉంటుందో, అలా ఆత్మ మరియు బాబా బిందువు నయనాలలో ఇమిడి ఉండాలి. చూసే బిందువు ఎప్పుడూ ఎలా అయితే మాయమవ్వదో అలా ఆత్మ మరియు బాబా స్మృతి అనే బిందువు వృత్తి నుండి, దృష్టి నుండి మాయమవ్వకూడదు. ఫాలో ఫాదర్ చెయ్యాలి కదా! కనుక ఏ విధంగా బాబా దృష్టిలో మరియు వృత్తిలో ప్రతి బిడ్డ కొరకు స్వమానము మరియు గౌరవము ఉందో, అలాగే మీ దృష్టి-వృత్తిలో స్వమానము, గౌరవము ఉండాలి. గౌరవాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే - వీరు మారాలి, వీరు ఇది చెయ్యకూడదు, వీరు ఇలా ఉండాలి అని మనసులో ఏదైతే ఉంటుందో అది శిక్షణ ద్వారా అవ్వదు కానీ గౌరవాన్ని ఇచ్చినట్లయితే ఇది అవ్వాలి, వీరు మారాలి, వారు ఇలా చెయ్యాలి అని మనసులో ఉన్న సంకల్పాలను వారు చెయ్యటం మొదలుపెడతారు. వృత్తి ద్వారా మారుతారు, చెప్పినందు వల్ల మారరు. మరి ఏం చేస్తారు? స్వమానము మరియు గౌరవము, ఈ రెండూ గుర్తుంటాయి కదా లేక కేవలము స్వమానమే గుర్తుంటుందా? గౌరవాన్ని ఇవ్వటము అనగా గౌరవాన్ని తీసుకోవటము. ఎవరికైనా గౌరవాన్ని ఇవ్వటము అనగా గౌరవనీయులుగా అవ్వటము అని భావించండి. ఆత్మిక ప్రేమకు గుర్తు ఏమిటంటే - ఇతరుల లోపాలను తమ శుభ భావన, శుభ కామనలతో పరివర్తన చెయ్యటము. బాప్ దాదా ఇప్పుడు చివరి సందేశములో కూడా పంపించారు - వర్తమాన సమయములో మీ స్వరూపాన్ని దయాస్వరూపముగా తయారుచేసుకోండి, దయార్ద్ర హృదయముగా తయారుచేసుకోండి. చివరి జన్మలో కూడా మీ జడ చిత్రాలు దయా స్వరూపముగా అయ్యి భక్తులపై దయ చూపిస్తున్నాయి. చిత్రాలే ఇంత దయా స్వరూపముగా ఉంటే ఇక చైతన్యములో ఎలా ఉంటారు? చైతన్యములో అయితే దయలో గని వంటివారు. దయలో గనిగా అవ్వండి. ఎవరు వచ్చినా సరే దయ చూపించండి, ఇదే ప్రేమకు గుర్తు. చెయ్యాలి కదా? లేక కేవలము వినాలా? చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే. మరి బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు అన్నదానికి సమాధానము ఇస్తున్నాము. ఇలా ప్రశ్నిస్తారు కదా, అందుకే బాప్ దాదా సమాధానమిస్తున్నారు.

వర్తమాన సమయములో భారత్ లోనైనా లేక విదేశాలలోనైనా సేవలో వృద్ధి బాగా జరుగుతూ ఉంది కానీ బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే - ఏదైనా విశేష కార్యాన్ని చేసి చూపించే నిమిత్త ఆత్మను తయారుచెయ్యండి. ఇప్పటివరకు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దానిని చేసి చూపించే అటువంటి సహయోగి తయారవ్వాలి. ప్రోగ్రాములైతే చాలానే చేసారు, ఎక్కడెక్కడైతే ప్రోగ్రాములు చేసారో ఆ ప్రోగ్రాములకు సంబంధించి అన్ని వైపులవారికి బాప్ దాదా అభినందనలను ఇస్తున్నారు. ఇప్పుడు మరేదైనా నవీనతను చూపించండి. మీ తరఫు నుండి మీ సమానముగా బాబాను ప్రత్యక్షము చెయ్యాలి. ఇది పరమాత్మ చదువు అని వారి నోటి నుండి వెలువడాలి. బాబా-బాబా అన్న మాట హృదయము నుండి వెలువడాలి. సహయోగులుగా అవుతున్నారు కానీ ఇప్పుడు ఒక విషయము ఏదైతే మిగిలిపోయిందో - వీరు ఒక్కరే, వీరు ఒక్కరే, వీరు ఒక్కరే... అన్న ఈ ధ్వని వ్యాపించాలి. బ్రహ్మాకుమారీలు మంచి పని చేస్తున్నారు, వీరు చెయ్యగలరు అని ఇంతవరకైతే చేరుకున్నారు కానీ వీరు ఒక్కరే మరియు ఇది పరమాత్మ జ్ఞానము అన్నది వ్యాపించాలి. బాబాను ప్రత్యక్షము చేసేవారు నిర్భయముగా, నిస్సంకోచముగా చెప్పాలి. పరమాత్మ కార్యాన్ని చేయిస్తున్నారు, ఇది పరమాత్మ కార్యము అని మీరు అంటారు కానీ వారు ఏం చెప్పాలంటే - ఏ పరమాత్మ తండ్రినైతే అందరూ పిలుస్తున్నారో, ఇది ఆ జ్ఞానము ఇది, వారు ఇలా చెప్పాలి. ఇప్పుడు ఈ అనుభవము చేయించండి. మీ మనసులో ఎప్పుడూ ఏముంటుంది? బాబా, బాబా, బాబా... అటువంటి గ్రూపు ఏదైనా వెలువడాలి. ఇది మంచిది, వీరు చెయ్యగలరు అని ఇంతవరకు బాగానే ఉంది. ఈ పరివర్తన వచ్చింది. కానీ చివరి పరివర్తన ఏమిటంటే - ఒక్కరే, ఒక్కరే, ఒక్కరే.... అది ఎప్పుడు జరుగుతుందంటే బ్రాహ్మణ పరివారమువారు ఏకరస స్థితి కలవారిగా అయినప్పుడు. ఇప్పుడు స్థితి మారుతూ ఉంటుంది. ఏకరస స్థితి ఆ ఒక్కరిని ప్రత్యక్షము చేస్తుంది. సరేనా! మరి డబుల్ విదేశీయులు ఉదాహరణగా అవ్వండి. గౌరవాన్ని ఇవ్వటములో, స్వమానములో ఉండటములో ఉదాహరణగా అవ్వండి, నంబరు తీసుకోండి. నలువైపులా మోహజీత పరివారము యొక్క ఉదాహరణను చెప్తారు కదా, అందులో గుమాస్తా అయినా, నౌకర్లు అయినా అందరూ మోహజీతులే. అలాగే ఎక్కడికి వెళ్ళినా, అమెరికాకు వెళ్ళినా, ఆస్ట్రేలియాకు వెళ్ళి, ప్రతి దేశములోనూ ఏకరసముగా ఉండటము, ఏకమతముతో ఉండటము, స్వమానములో ఉండటము, గౌరవాన్ని ఇవ్వటము, ఇందులో నంబరు తీసుకోండి, తీసుకోగలరు కదా?

నలువైపులా ఉన్న బాబా నయనాలలో ఇమిడి ఉన్న కంటిపాపలైన పిల్లలకు, సదా ఏకరస స్థితిలో స్థితులై ఉండే పిల్లలకు, సదా భాగ్య సితార మెరుస్తూ ఉండే భాగ్యవంతులైన పిల్లలకు, సదా స్వమానాన్ని మరియు గౌరవాన్ని తోడుతోడుగా ఉంచుకునే పిల్లలకు, సదా పురుషార్థములో తీవ్ర వేగాన్ని చూపించే పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు, దీవెనలు మరియు నమస్తే.

వరదానము:-
సత్యమైన సహచరుని యొక్క తోడును తీసుకునే సర్వులకు అతీతులు, ప్రియులు అయిన నిర్మోహీ భవ

రోజూ అమృతవేళ సర్వ సంబంధాల సుఖాన్ని బాప్ దాదా నుండి తీసుకుని ఇతరులకు దానము చేయండి. సర్వ సుఖాలకు అధికారిగా అయి ఇతరులను కూడా అలా తయారుచేయండి. ఏ పని ఉన్నా అందులో సాకార సహచరులు గుర్తుకు రాకూడదు, మొదట తండ్రి గుర్తుకు రావాలి ఎందుకంటే సత్యమైన మిత్రుడు బాబా. సత్యమైన సహచరుడి యొక్క తోడును తీసుకున్నట్లయితే సహజముగానే సర్వుల నుండి అతీతులుగా మరియు ప్రియులుగా అవుతారు. ఎవరైతే సర్వ సంబంధాలతో ప్రతి కార్యములోనూ ఒక్క బాబానే స్మృతి చేస్తారో, వారు సహజముగానే నిర్మోహులుగా అవుతారు. వారికి ఎవరి పట్ల మోహము అనగా పరాధీనత ఉండదు, అందుకే మాయ చేతిలో ఓడిపోలేరు కూడా.

స్లోగన్:-
మాయను చూసేందుకు మరియు తెలుసుకునేందుకు త్రికాలదర్శులుగా మరియు త్రినేత్రులుగా అవ్వండి, అప్పుడు విజయులుగా అవుతారు.

అవ్యక్త సూచనలు:- సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

సత్యతకు గుర్తు సభ్యత. ఒకవేళ మీరు సత్యమైనవారు అయినట్లయితే, సత్యతా శక్తి మీలో ఉన్నట్లయితే, సభ్యతను ఎప్పుడూ వదలకండి. సత్యతను నిరూపించండి కానీ సభ్యతాపూర్వకముగా. ఒకవేళ సభ్యతను వదిలి అసభ్యతలోకి వచ్చి సత్యతను నిరూపించాలనుకుంటే ఆ సత్యము నిరూపించబడదు. అసభ్యతకు గుర్తు మొండితనము మరియు సభ్యతకు గుర్తు నిర్మానత. సత్యతను నిరూపించేవారు సదా స్వయం నిర్మానులుగా అయి సభ్యతాపూర్వకముగా వ్యవహరిస్తారు.