ఓంశాంతి
మేము అవినాశీ యాత్రను అనగా ఆత్మిక యాత్రను చేస్తున్నామని పిల్లలకు తెలుసు. మనము ఈ
యాత్ర నుండి తిరిగి మృత్యులోకములోకి రాము. ఇటువంటి యాత్ర కూడా ఒకటి ఉంటుందని, అక్కడ
నుండి ఇక ఎప్పటికీ తిరిగి రావాల్సిన అవసరమే ఉండదని మనుష్యులకు తెలియనే తెలియదు. ఈ
విషయము లక్కీ స్టార్స్ అయిన మీకు ఇప్పుడు తెలిసింది. ఈ విషయాన్ని పక్కాగా
గుర్తుంచుకోవాలి. ఆత్మలమైన మనము పాత్రను అభినయిస్తాము. ఆత్మనైన నేను ఈ వస్త్రాన్ని
ధరించి పాత్రను అభినయించానని, ఇప్పుడు ఇంటికి వెళ్తానని ఆ నాటకములో ఇలా అనరు. అక్కడ
వారు తమను తాము శరీరమనే భావిస్తారు. నేను ఆత్మను, ఈ శరీరము రూపీ వస్త్రాన్ని వదిలి
వెళ్ళి ఇంకొకటి తీసుకుంటానని ఇక్కడ పిల్లలైన మీకు జ్ఞానముంది. ఇవి 84 జన్మల పాత
వస్త్రాలు, వీటిని వదిలి కొత్త ప్రపంచములో మళ్ళీ కొత్త వస్త్రాన్ని తీసుకుంటాము. ఈ
లక్ష్మీ-నారాయణులు కొత్త వస్త్రాలను ధరించారు కదా. వారు మీ రాజధానికి చెందినవారే.
మీరు కూడా వెళ్ళి అలాంటి కొత్త దైవీ వస్త్రాలను ధరిస్తారు. నిర్గుణుడినైన నాలో ఏ
గుణాలు లేవని ఇక్కడ అంటారు. తండ్రియే మళ్ళీ అటువంటి గుణవంతులుగా చేస్తారు. తండ్రి
అంటారు - నా పాత్ర కూడా ఉంది, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని నిర్వికారులుగా చేస్తాను.
ఇక్కడ ఇది జీవనబంధన ధామము, ఇది రావణ రాజ్యము. మేము పతితము నుండి పావనముగా, మళ్ళీ
పావనము నుండి పతితముగా ఎలా అవుతాము అనేది మీ బుద్ధిలో ఉంది. కలియుగము అంధకారమని
పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడిది రావణ రాజ్యము యొక్క అంతిమము, రామ రాజ్యము ఇప్పుడు
ప్రారంభము కానున్నది. ప్రస్తుతం ఇది సంగమము. కల్పము యొక్క సంగమయుగములో తండ్రియే
రావాల్సి ఉంటుంది. ఇప్పుడిది వినాశన సమయమని మరియు భగవంతుడు స్థాపనార్థం ఎక్కడో
గుప్త వేషములో ఉన్నారని ప్రపంచములోని వారు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు
ఆత్మలైన మీరు కూడా గుప్త వేషములో ఉన్నారు. ఆత్మ వేరు, శరీరము వేరు. ఈ మనుష్య శరీరము
అనేది గుప్త వేషము వంటిది. తండ్రి కూడా ఇందులో రావాల్సి ఉంటుంది. మీ శరీరానికి పేరు
ఉంటుంది, వారికైతే శరీరమే లేదు. మీరు కూడా ఆత్మలే, వారు కూడా ఆత్మనే. ఆత్మకు ఆత్మ
పట్ల ఇప్పుడు మోహము ఏర్పడింది. ఇతర సాంగత్యాలను వదిలి, మీతోనే సాంగత్యాన్ని
జోడిస్తామని పాడుతారు కూడా. మీరు ఎలాగైతే మోహజీతులుగా ఉన్నారో, మేము కూడా అలా
అవుతామని అంటారు. బాబా చాలా మోహజీతులు. కామ చితిపై కూర్చుని కాలిపోయిన పిల్లలు
ఎంతమంది ఉన్నారు. పరమపిత పరమాత్మ రావడము కూడా, పాత ప్రపంచాన్ని వినాశనము
చేయించడానికి వస్తారు, కావున వారికి మోహము ఎలా ఉంటుంది. పతితులు ఎప్పుడైతే వినాశనము
చెందుతారో, అప్పుడు శాంతి రాజ్యము ఏర్పడుతుంది. ఈ సమయములో సుఖమైతే ఎవరికీ లేదు.
అందరూ తమోప్రధానులుగా, దుఃఖితులుగా అయిపోయారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. శివబాబాయే
వచ్చి స్వర్గ స్థాపనను చేస్తారు, దానికి శివాలయమని పేరు పెట్టడము జరిగింది. శివబాబా
దేవతల రాజధానిని స్థాపన చేశారు, అది చైతన్య శివాలయము. మరియు ఏ శివాలయములోనైతే శివుని
చిత్రముందో, అది జడమైన శివాలయమైనట్లు.
లక్ష్మీ-నారాయణులు తప్పకుండా స్వర్గానికి యజమానులుగా ఉండేవారని ఇప్పుడు మీరు
అర్థం చేసుకున్నారు. వారు పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా
అవుతున్నారు. మీకు ఇప్పుడు జ్ఞానముంది. మీరు లక్ష్మీ-నారాయణుల మందిరానికి వెళ్ళి
వారికి తల వంచి నమస్కరించరు. మీరైతే వారి రాజధానిలోకి చైతన్యముగా వెళ్తారు. మేము
దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు అలా లేము అని మీకు తెలుసు. ఎవరైతే ఒకప్పుడు ఉండి
వెళ్ళారో, వారి చిత్రాలు తయారవుతాయి. లక్ష్మీ-నారాయణుల మందిరాలను అందరికన్నా
ఎక్కువగా బిర్లా నిర్మిస్తారు కనుక వారికి కూడా సేవ చేయాలి, మీరు వారికి ఇలా
చెప్పండి - మీరు ఈ లక్ష్మీ-నారాయణుల మందిరాలనేవైతే నిర్మిస్తున్నారో, మేము వారి 84
జన్మల కథను మీకు వినిపిస్తాము అని. యుక్తిగా ఈ కానుకను ఇవ్వాలి. బాబా సేవా
యుక్తులనైతే చెప్తూ ఉంటారు. మాతలు వెళ్ళి చెప్పాలి - మీరు వారి మందిరాలనైతే
నిర్మిస్తున్నారు కానీ మీకు వారి జీవిత కథ గురించి తెలియదు, మాకు తెలుసు మరియు అర్థం
చేయించగలము కూడా. అర్థం చేయించేవారు చాలా అభిరుచి కలిగేలా చెప్పేవారు కావాలి. తండ్రి
కూడా కూర్చుని అర్థం చేయిస్తారు కదా. బాబా అంటారు, ఒకవేళ మీకు రావడానికి అనుమతి
లభించకపోతే ఇంటిలో కూర్చుని స్మృతి చేయండి. మేము శివబాబా సంతానమని మీకు తెలుసు.
మురళీ అయితే లభిస్తుంది. అయితే, ఇక్కడకు వస్తే స్మృతియాత్ర బాగుంటుందని, ఇంటిలో
కూర్చుంటే స్మృతియాత్ర తగ్గిపోతుందని కాదు. మేఘాలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తాయి.
మీరు కూడా రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. బాబా వద్దకు సమ్ముఖముగా వెళ్ళాలనుకుంటారు.
ఆత్మకు జ్ఞానముంది, అయితే సమ్ముఖముగా విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ
విషయమైతే అదే. శివబాబా కూర్చుని పిల్లలకు ఎలా అర్థం చేయిస్తున్నారు అనేది మీరు
చూస్తున్నారు. ‘‘పిల్లలూ, మీరు నా వారు’’. మీరు 84 జన్మల పాత్రను అభినయించారు. మీరు
జనన-మరణాలలోకి వస్తారు, నేను రాను, నేను పునర్జన్మలు తీసుకోను. అలాగని అజన్మ (జన్మ
లేని వారు) అని కూడా కాను. నేను వస్తాను, కానీ వృద్ధ తనువులో ప్రవేశిస్తాను. ఆత్మ
అయిన మీరు చిన్న బిడ్డ శరీరములో ప్రవేశిస్తారు, నేను పరంధామము నుండి కింద పాత్రను
అభినయించడానికి వస్తాను. నేను వికారుల గర్భములోకి రాను. త్వమేవ మాతాశ్చ పితా... అని
నన్నే అంటారు. నాకు తల్లిదండ్రులెవరూ ఉండరు. నేను కేవలం శరీరాన్ని ఆధారముగా తీసుకుని
పాత్రను అభినయిస్తాను. దుఃఖాన్ని హరించి, సుఖాన్ని ఇవ్వడము కోసం మీరు నన్ను
పిలుస్తారు. ఇప్పుడు సమ్ముఖముగా వచ్చాను, ఆత్మలతో మాట్లాడుతున్నాను. ఇక్కడైతే అందరూ
బ్రాహ్మణులే ఉన్నారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు హంసలుగా మరియు కొంగలుగా అయిపోతారు.
ఇక్కడ (మధుబన్ లో) మీకు బ్రాహ్మణుల సాంగత్యమే ఉంటుంది. పరస్పరములో జ్ఞాన చర్చనే
చేసుకుంటారు. మనము మన రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము.
బాబా వచ్చి ఉన్నారు, తండ్రిని స్మృతి చేసే యుక్తిని, ఒకరికొకరు తెలియజేసుకుంటూ
ఉండండి. తండ్రిని స్మృతి చేయండి, అని భోజన సమయములో కూడా ఒకరికొకరు సంకేతాన్ని
ఇచ్చుకుంటూ ఉండండి. ఇది చాలా పెద్ద సంగఠన కదా. అక్కడైతే మీతో పాటు వికారులు ఉంటారు
కనుక వారి ఆకర్షణ ఉంటుంది. ఇక్కడైతే ఎవరి ఆకర్షణ ఉండదు. యోధులు, యోధులతో పాటు ఉంటారు.
ఇది మీ కుటుంబము. ఎవరు కలిసినా సరే, భగవంతుడిని స్మృతి చేస్తూ ఉండమని, వారికి తండ్రి
పరిచయాన్ని ఇవ్వాలి అన్న విషయమే మీ బుద్ధిలో ఉంటుంది. ఇద్దరు తండ్రులు ఉన్నారు కదా.
లౌకిక తండ్రి ఉన్నప్పటికీ కూడా భగవంతుడిని స్మృతి చేస్తారు కదా. వారు లౌకిక ఫాదర్,
లౌకిక ఫాదర్ ను గాడ్ ఫాదర్ అని అనరు. వీరు పారలౌకిక తండ్రి. తప్పకుండా గాడ్ ఫాదర్
నుండి వారసత్వము లభిస్తూ ఉండవచ్చు. ఈ విధముగా భూ-భూ చేస్తూ ఉండండి. మీరు బ్రాహ్మణులు
కదా. సన్యాసులు కూడా భూ-భూ చేస్తారు కదా. ఈ ప్రపంచపు సుఖము కాకి రెట్ట సమానమైనది,
ఎంత దుఃఖముంది. వారు హఠయోగులు, నివృత్తి మార్గము వారు, వారి ధర్మమే వేరు.
సత్యయుగములో మనము ఎంత సుఖముగా, పవిత్రముగా ఉంటాము అనేది మీకు తెలుసు. భారత్ లో
ప్రవృత్తి మార్గము ఉండేది, దేవీ-దేవతల రాజ్యముండేది. ఎవరైతే పవిత్రముగా ఉండేవారో,
వారే పతితముగా అయ్యారు. ఓ పతిత-పావనా రండి, అని పిలుస్తూ ఉంటారు కూడా. మళ్ళీ
పరమాత్మను సర్వవ్యాపి అని అనేస్తారు. మేము వెళ్ళి జ్యోతిలో కలిసిపోతామని అంటారు.
పునర్జన్మలను కూడా అంగీకరించరు. అనేక మతాలు ఉన్నాయి కదా. రోజు-రోజుకు జనాభా వృద్ధి
చెందుతూ ఉంటుంది. సన్యాసుల వృద్ధి ఎలా జరుగుతుంది అనేది కూడా తెలియజేయాలి. దిగంబర
సన్యాసుల వృద్ధి కూడా జరుగుతుంది. ఎవరిది ఏ ధర్మమో, వారు అందులోనే ఉండటముతో అంతిమ
స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. ఎవరు ఏ అభ్యాసాన్ని ఎక్కువగా చేస్తారో, ఉదాహరణకు
ఎవరైనా శాస్త్రాలు మొదలైనవాటిని చదివితే, అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది,
అప్పుడు బాల్యములోనే శాస్త్రాలు కంఠస్థమైపోతాయి. ఇప్పుడు తండ్రి అంటారు - నేను
ఫలానాను, నేను ఇది అని ఇటువంటి దేహాభిమానపు మాటలన్నీ వదిలేయండి. స్వయాన్ని అశరీరి
ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఈ శరీరాన్ని చూస్తూ కూడా చూడకండి.
దేహ సహితముగా దేహపు సంబంధాలు మొదలైనవేవైతే ఉన్నాయో, వాటన్నింటినీ వదిలేయండి.
స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి, పరమాత్మను స్మృతి చేయండి. దీనికి చాలా సమయము
పడుతుంది. మాయ స్మృతి చేయనివ్వదు. లేదంటే వానప్రస్థులకు ఇది చాలా సహజము. ఇప్పుడు
పిల్లలు-పెద్దలు, అందరిదీ వానప్రస్థ అవస్థ అని తండ్రి స్వయంగా అంటారు. ఒక వైపు
వినాశనము కూడా జరుగుతూ ఉంటుంది, మరో వైపు జన్మలు కూడా తీసుకుంటూ ఉంటారు. పునర్జన్మలు
తీసుకోవాల్సి ఉంటే వచ్చేస్తారు. పిల్లలు కూడా జన్మిస్తారు, అంతేకాక వినాశనము కూడా
జరుగుతుంది. కొందరు గర్భములో ఉంటారు, కొందరు మరెక్కడో ఉంటారు, కానీ అందరూ
సమాప్తమైపోతారని మీకు తెలుసు. అందరూ తమ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని తిరిగి
వెళ్తారు. లెక్కాచారాలు మిగిలి ఉన్నట్లయితే శిక్షలను బాగా అనుభవించవలసి ఉంటుంది.
తర్వాత అవి కూడా తేలికైపోతాయి. అలాగని యోగములో కూడా ఉంటూ, మరోవైపు పాపాలు కూడా
చేస్తూ ఉండమని కాదు. కొంతమంది పిల్లలు ఒక వైపు చార్టు కూడా వ్రాస్తూ ఉంటారు, మళ్ళీ
ఇంకొక వైపు మాయ నల్ల ముఖము చేసేసిందని అంటారు. మాయ ఓడించింది అంటే కచ్చాగా ఉన్నారని
అంటారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మేము కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాము,
ఆ తర్వాత వెళ్ళిపోతాము, ఇదంతా వినాశనము జరుగుతూ ఉంది అని మీరు భావించండి. తండ్రి
అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీ చార్టును చూసుకుంటూ
ఉండండి - మేమెంతమందికి మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాము మరియు ఎంతమంది చేత
పురుషార్థము చేయిస్తూ ఉన్నాము. తనువు, మనసు, ధనములతో ఆత్మిక సేవలో సహాయకులుగా
అవ్వాల్సి ఉంటుంది. మనసును నిస్సంకల్పముగా చేయలేకపోతున్నామని అంటారు. ఆత్మయే శాంత
స్వరూపము. ఆత్మ అయిన మనము మన పరంధామానికి వెళ్ళి కూర్చుంటాము. ప్రాపంచిక సంకల్పాలేవీ
రావు. అలాగని కళ్ళు మూసుకుని, స్పృహ లేకుండా ఉండాలని కాదు. చాలామంది ఇలాంటివి
నేర్చుకుంటారు కూడా. 10-15 రోజులు స్పృహ లేకుండా కూడా ఉండిపోతారు. అటువంటి అభ్యాసము
చేస్తారు, మళ్ళీ కొంత సమయము తర్వాత మేలుకుంటారు. టైమ్ బాంబులకు కూడా ఇన్ని గంటల
తర్వాత పేలాలని, వాటికి కూడా సమయముంటుంది.
మనము యోగము జోడిస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఎప్పుడైతే తమోప్రధానమైన చెత్త
తొలగిపోతుందో, అప్పుడు మనము సతోప్రధానముగా అయిపోతాము, అప్పుడు ఈ శరీరాన్ని
వదిలేస్తాము. మనము ఇప్పుడు యోగము యొక్క యాత్రలో ఉన్నాము. ఇప్పుడు సమయము లభించింది,
తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సే ఉంటుంది, అప్పుడిక అంతా సమాప్తమైపోతుంది. సమయము
నిశ్చితమై ఉంది, చివరిలో దోమల వలె శరీరాలను వదిలేస్తారు, వినాశనము జరుగుతుంది, మీరు
కర్మాతీత అవస్థను పొందుతారు, ఇక వినాశనము ప్రారంభమైపోతుంది. వినాశన దృశ్యము చాలా
భయంకరముగా ఉంటుంది. ఇది డ్రామాలో తప్పకుండా నిశ్చితమై ఉంది. మన అవస్థ ఏకరసముగా
ఉంటుందని మీకు తెలుసు. సంతోషములో సదా హర్షితముగా ఉంటారు. ఈ ప్రపంచమైతే
సమాప్తమవ్వాల్సిందే. కల్ప-కల్పము సంగమయుగము ఉంటుందని, అప్పుడు వినాశనము జరుగుతుందని
మీకు తెలుసు. కేవలం బాంబులే కాదు, ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయము చేస్తాయి.
ఇప్పుడు మనము వెళ్ళాలని పిల్లలకు బుద్ధిలో ఉండాలి. ఎంతగా బాబాను స్మృతి చేస్తామో,
అంతగా వికర్మలు వినాశనమవుతాయి, ఉన్నత పదవిని పొందుతాము. దానము ఇంటి నుండి
ప్రారంభమవుతుంది. దాని కోసం ప్రయత్నించాలి. కన్యలంటే పుట్టినింటిని మరియు
అత్తవారింటిని ఉద్ధరించేవారు. కనుక దానము ఇంటి నుండే ప్రారంభమైనట్లు కదా. సేవలో
తత్పరులై ఉండాలి. నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వము లభిస్తుందని శివబాబా
చెప్తున్నారని చెప్పండి. ఇది స్పష్టమైన విషయము. అల్ఫ్ (భగవంతుడు) అయిన నన్ను స్మృతి
చేసినట్లయితే స్వర్గ వారసత్వము మీది అవుతుంది. మీరు విశ్వానికి యజమానులుగా అయిపోతారు.
ఇప్పుడు వారసత్వాన్ని పొందాలంటే నన్ను స్మృతి చేయండి. ఈ సందేశాన్ని ఇవ్వడము పిల్లల
బాధ్యత. ఇంతకుముందు కూడా ఇచ్చారు. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని తెలియజేయాలి.
కలియుగము తర్వాత సత్యయుగము వస్తుంది. తండ్రియే వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. రావణుడు
నరకవాసులుగా చేస్తాడు. తండ్రి వచ్చి స్వర్గవాసులుగా చేస్తారు. ఈ కథ భారత్ కు
సంబంధించినదే. భారతవాసులను మేలుకొలపాలి. ఈ తండ్రి కొత్త సృష్టిని రచించేవారు అని
ముందు శివుని మందిరాలకు వెళ్ళి అర్థం చేయించాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ
వికర్మలు వినాశనమవుతాయని అంటారు. ఈ నిరాకార తండ్రి వచ్చి ఉన్నారు. బ్రహ్మా ద్వారా
స్వర్గ స్థాపనను చేస్తున్నారు. ఇప్పుడు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి.
84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాము, అంగీకరించడం,
అంగీకరించకపోవడము అనేది మీ ఇష్టము. మీరు చెప్పే విషయాలైతే చాలా మంచివి. తండ్రియే
దుఃఖహర్త-సుఖకర్త. ఈ విధముగా కొద్దిగా అర్థం చేయించి అక్కడి నుండి వెళ్ళొచ్చు. ఇది
మీ వ్యాపారము. ఇందులో శ్రమేమీ లేదు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారని
కేవలం నోటితో ఈ విషయాన్ని చెప్పాలి. దేహీ-అభిమానులుగా అవ్వండి. శివుని పూజారుల
వద్దకు వెళ్ళండి, తర్వాత లక్ష్మీ-నారాయణుల పూజారుల వద్దకు వెళ్ళండి. వాళ్ళకు వీరి
జీవిత కథను వినిపించండి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.