02-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇక్కడకు స్మృతిలో ఉంటూ పాపాలను దగ్ధం చేసుకునేందుకు వచ్చారు, అందుకే బుద్ధియోగము నిష్ఫలమవ్వకూడదు అన్న విషయముపై పూర్తి ధ్యానమును ఉంచాలి’’

ప్రశ్న:-
ఏ సూక్ష్మ వికారము కూడా అంతిమములో కష్టము కలిగిస్తుంది?

జవాబు:-
ఒకవేళ సూక్ష్మముగానైనా లోభమనే వికారము ఉన్నట్లయితే, ఏవైనా వస్తువులను లోభము కారణముగా తమ వద్ద పోగు చేసుకొని పెట్టుకున్నట్లయితే, అదే అంతిమములో కష్టము రూపములో గుర్తుకొస్తుంది, అందుకే బాబా అంటారు - పిల్లలూ, మీ వద్ద ఏమీ ఉంచుకోకండి. మీరు అన్ని సంకల్పాలను కూడా ఇముడ్చుకొని తండ్రి స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. అందుకని దేహీ-అభిమానులుగా అయ్యే అభ్యాసాన్ని చేయండి.

ఓంశాంతి
పిల్లలకు ప్రతి రోజూ గుర్తు చేయిస్తారు - దేహీ-అభిమానులుగా అవ్వండి ఎందుకంటే బుద్ధి అటూ, ఇటూ వెళ్తూ ఉంటుంది. అజ్ఞానకాలములో కూడా ధార్మిక కథల గురించిన చర్చలు విన్నప్పుడు బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా భ్రమిస్తుంది, అందుకే ప్రతి రోజూ దేహీ-అభిమానులుగా అవ్వండి అని చెప్తారు. వారైతే, మేము ఏదైతే వినిపిస్తున్నామో దానిపై ధ్యాస పెట్టండి, ధారణ చేయండి, శాస్త్రాలనేవైతే వినిపిస్తున్నామో ఆ వచనములను ధ్యాసలో పెట్టుకోండి అని చెప్తారు. ఇక్కడైతే తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు - విద్యార్థులైన మీరందరూ దేహీ-అభిమానులుగా అయి కూర్చోండి. శివబాబా చదివించేందుకు వస్తారు. శివబాబా చదివించేందుకు వస్తున్నారు అని ఈ విధంగా భావించే కాలేజీ ఇంకెక్కడా ఉండదు. ఇటువంటి స్కూల్ పురుషోత్తమ సంగమయుగములోనే ఉండాలి. విద్యార్థులు కూర్చున్నారు మరియు పరమపిత పరమాత్మ మమ్మల్ని చదివించడానికి వస్తారు అని కూడా అర్థం చేసుకున్నారు. శివబాబా మనల్ని చదివించడానికి వస్తారు. వారు మొట్టమొదట అర్థం చేయించే విషయము ఏమిటంటే - మీరు పావనంగా అవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయండి, కానీ మాయ ఘడియ-ఘడియ మరపింపజేస్తుంది, అందుకే తండ్రి అప్రమత్తం చేస్తారు. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు కూడా మొట్టమొదట - భగవంతుడు ఎవరు అన్నది అర్థం చేయించండి. పతిత-పావనుడు, దుఃఖహర్త-సుఖకర్త అయిన భగవంతుడు ఎక్కడ ఉన్నారు? వారిని స్మృతి అయితే అందరూ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏవైనా ఆపదలు వస్తే - ఓ భగవంతుడా, దయ చూపించండి అని అంటారు. ఎవరినైనా రక్షించవలసి ఉన్నప్పుడు కూడా - ఓ భగవంతుడా, ఓ గాడ్, మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చేయండి అని అంటారు. దుఃఖాలైతే అందరికీ ఉన్నాయి. సత్యయుగాన్ని సుఖధామము అని అంటారని, కలియుగాన్ని దుఃఖధామము అని అంటారని అయితే పక్కాగా తెలుసు. ఇది పిల్లలకు తెలుసు, అయినా కానీ మాయ మరపింపజేస్తుంది. ఇలా స్మృతిలో కూర్చోబెట్టే పద్ధతి కూడా డ్రామాలో ఉంది ఎందుకంటే, మొత్తం రోజంతటిలో స్మృతి చేయనివారు ఎందరో ఉన్నారు, ఒక్క నిముషము కూడా స్మృతి చేయరు, కావున స్మృతిని కలిగించడానికి ఇక్కడ కూర్చోబెడతారు. స్మృతి చేసే యుక్తిని తెలియజేస్తారు, తద్వారా పక్కా అవుతారు. తండ్రి స్మృతి ద్వారానే మనం సతోప్రధానముగా అవ్వాలి. సతోప్రధానముగా అయ్యేందుకు తండ్రి ఫస్ట్ క్లాస్ అయిన రియల్ యుక్తిని తెలియజేశారు. పతిత-పావనుడైతే ఒక్కరే, వారు వచ్చి యుక్తిని తెలియజేస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు, ఎప్పుడైతే తండ్రితో యోగము ఉంటుందో అప్పుడు శాంతిలో కూర్చుంటారు. ఒకవేళ బుద్ధియొగము అటూ, ఇటూ వెళ్ళినట్లయితే శాంతిలో లేనట్లు అనగా అశాంతిలో ఉన్నట్లు. ఎంతసేపైతే బుద్ధియోగము అటూ, ఇటూ వెళ్తుందో అంత సమయము నిష్ఫలమైనట్లే ఎందుకంటే అందులో పాపాలైతే అంతమవ్వవు. పాపాలు ఎలా అంతమవుతాయో ప్రపంచానికి తెలియదు! ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మీరు నా స్మృతిలో కూర్చోండి అని తండ్రి అన్నారు, కావున ఎప్పటివరకైతే స్మృతి రూపీ తాడు జోడించబడి ఉంటుందో అంత సమయమూ సఫలత ఉంటుంది. బుద్ధియొగము కొద్దిగా అటూ, ఇటూ వెళ్ళినా ఆ సమయం వ్యర్థమవుతుంది, నిష్ఫలమవుతుంది. పిల్లలూ, నన్ను స్మృతి చేయండి అని తండ్రి డైరెక్షన్ ఉంది కదా, మరి స్మృతి చేయకపోతే అది నిష్ఫలమవుతుంది. దాని వలన ఏమవుతుంది? మీరు త్వరగా సతోప్రధానముగా అవ్వరు, ఇక అది అలవాటైపోతుంది, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆత్మకు ఈ జన్మ పాపాల గురించైతే తెలుసు. మాకు గుర్తు లేదు అని ఎవరైనా అన్నా కానీ బాబా అంటారు, 3-4 సంవత్సరాల ఆయువు నుండి అన్ని విషయాలూ గుర్తుంటాయి. తర్వాత అయినన్ని పాపాలు మొదట్లో అవ్వవు. రోజురోజుకు దృష్టి అశుద్ధముగా అవుతూ ఉంటుంది, త్రేతాలో రెండు కళలు తగ్గిపోతూ ఉంటాయి. చంద్రుని రెండు కళలు ఎంత సమయంలో తగ్గుతాయి? మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. 16 కళల సంపూర్ణుడు అని కూడా చంద్రుడినే అంటారు కానీ సూర్యుడిని అనరు. చంద్రుడిది ఒక మాసము యొక్క విషయము మరియు ఇది కల్పము యొక్క విషయము. రోజురోజుకు కిందకు దిగుతూ వస్తారు. మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా పైకి ఎక్కగలుగుతారు. ఇక ఆ తర్వాత మళ్ళీ స్మృతి చేసి పైకి ఎక్కవలసిన అవసరం ఉండదు. సత్యయుగము తర్వాత మళ్ళీ ఇక దిగడమే. సత్యయుగములో కూడా స్మృతి చేసినట్లయితే ఇక కిందకు దిగనే దిగరు. డ్రామానుసారంగా కిందకు దిగవలసిందే, కావున అక్కడ స్మృతే చేయరు. దిగడం కూడా తప్పనిసరియే, మళ్ళీ స్మృతి చేసే ఉపాయమును తండ్రే తెలియజేస్తారు, ఎందుకంటే పైకి వెళ్ళాలి. సంగమములోనే తండ్రి వచ్చి ఇప్పుడిక పైకి ఎక్కే కళ ప్రారంభమవుతుంది అని నేర్పిస్తారు. మనము ఇప్పుడు మన సుఖధామంలోకి వెళ్ళాలి. తండ్రి అంటారు, ఇప్పుడు సుఖధామములోకి వెళ్ళాలంటే నన్ను స్మృతి చేయండి. స్మృతి ద్వారా మీ ఆత్మ సతోప్రధానముగా అవుతుంది.

మీరు ప్రపంచముతో పోలిస్తే భిన్నమైనవారు, వైకుంఠము ఈ ప్రపంచానికి పూర్తిగా అతీతమైనది. వైకుంఠము ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. కల్పము ఆయువును పెద్దగా చేసేసిన కారణముగా మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీకు వైకుంఠం ఎంత సమీపముగా కనిపిస్తుంది. ఇంకా కొద్ది సమయమే ఉంది. స్మృతియాత్రలోనే లోపము ఉంది, అందుకే ఇప్పుడు ఇంకా సమయం ఉంది అని భావిస్తారు. స్మృతియాత్ర ఎంతగా ఉండాలో అంతగా లేదు. మీరు డ్రామా ప్లాన్ అనుసారంగా సందేశాన్ని చేరుస్తారు. ఎవరికైనా సందేశాన్ని ఇవ్వడం లేదంటే సేవ చేయడం లేదనే. మొత్తం ప్రపంచమంతటికీ - నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు అన్న సందేశాన్ని చేర్చాలి. గీతను చదివేవారికి - ఈ మహావాక్యాలున్న శాస్త్రము ఒక్క గీతా శాస్త్రమేనని తెలుసు. కానీ అందులో కృష్ణ భగవానువాచ అని వ్రాసారు కావున ఇక ఎవరిని స్మృతి చేయాలి? శివుని భక్తిని చేస్తారు కానీ శ్రీమతముపై నడిచేందుకు యథార్థమైన జ్ఞానము లేదు. ఈ సమయములో మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది, అంతకుముందు మానవ మతము ఉండేది. రెండింటికీ రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అని మానవ మతము చెప్తుంది. కానీ అలా కాదు అని ఈశ్వరీయ మతము చెప్తుంది. తండ్రి అంటారు, నేను స్వర్గ స్థాపనను చేయడానికి వచ్చాను కావున తప్పకుండా ఇది నరకమే. ఇక్కడ పంచ వికారాలు అందరిలోనూ ప్రవేశించి ఉన్నాయి. ఇది వికారీ ప్రపంచము, అందుకే నేను నిర్వికారీగా తయారుచేయడానికి వస్తాను. ఎవరైతే ఈశ్వరుని పిల్లలుగా అయ్యారో, వారిలో వికారాలైతే ఉండవు. రావణుడి చిత్రాన్ని 10 తలలతో ఉన్నట్లుగా చూపిస్తారు. రావణుడి సృష్టి నిర్వికారీ అయినది అని ఎప్పుడూ ఎవ్వరూ అనలేరు. ఇప్పుడు ఇది రావణ రాజ్యమని, అందరిలోనూ పంచ వికారాలు ఉన్నాయని మీకు తెలుసు. సత్యయుగములో రామరాజ్యము ఉంది, అందులో ఏ వికారాలు లేవు. ఈ సమయములో మనుష్యులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. శరీరానికి ఎన్ని దుఃఖాలు కలుగుతాయి, ఇది దుఃఖధామము. సుఖధామములోనైతే శారీరక దుఃఖాలు కూడా ఉండవు. ఇక్కడ ఎన్ని హాస్పిటళ్ళు నిండి ఉన్నాయి, దీనిని స్వర్గము అని అనడం కూడా పెద్ద పొరపాటే. కావున దీనిని అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. ఆ చదువైతే ఎవరికీ అర్థం చేయించేది కాదు. అక్కడ పరీక్షలు పాస్ అయి ఉద్యోగములో చేరిపోతారు. ఇక్కడైతే మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. కేవలం ఒక్క తండ్రే ఇవ్వరు కదా. ఎవరైతే చాలా తెలివైనవారు ఉంటారో, వారిని టీచర్ అని అంటారు. తక్కువ తెలివైనవారైతే వారిని విద్యార్థులు అని అంటారు. మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. భగవంతుని గురించి తెలుసా? అని అడగాలి. వారు అందరికీ తండ్రి. కావున ముఖ్యమైన విషయము, తండ్రి పరిచయాన్ని ఇవ్వడము, ఎందుకంటే వారి గురించి ఎవ్వరికీ తెలియదు. ఉన్నతోన్నతమైనవారు తండ్రి, వారు మొత్తం విశ్వాన్ని పావనంగా తయారుచేస్తారు. మొత్తం విశ్వమంతా పావనంగా ఉండేది, అందులో కేవలం భారత్ యే ఉండేది. ఇంకే ధర్మం వారూ, మేము కొత్త ప్రపంచములోకి వస్తాము అని అనలేరు. మా కంటే ముందు ఎవరో ఉండి వెళ్ళారు అని వారు భావిస్తారు. క్రైస్టు కూడా తప్పకుండా ఎవరిలోకో వస్తారు. అతని కంటే ముందు తప్పకుండా ఎవరో ఉండేవారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - నేను ఈ బ్రహ్మా తనువులోకి ప్రవేశిస్తాను. బ్రహ్మా తనువులోకి వస్తారు అన్నది కూడా ఎవ్వరూ ఒప్పుకోరు. అరే, బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు. తప్పకుండా బ్రహ్మా నుండే వస్తారు కదా. అచ్ఛా, బ్రహ్మా తండ్రి ఎవరో ఎప్పుడైనా విన్నారా? వారు గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, వారికి సాకార తండ్రి ఎవరూ లేరు. బ్రహ్మాకు సాకార తండ్రి ఎవరు? ఇది ఎవ్వరూ చెప్పలేరు. బ్రహ్మా మహిమ చేయబడ్డారు. వారు ప్రజాపిత కూడా. నిరాకార శివబాబా అని అంటారు కదా, వారి తండ్రి ఎవరో చెప్పండి? అలాగే సాకార ప్రజాపిత బ్రహ్మాకు తండ్రి ఎవరో చెప్పండి. శివబాబా ఎవరిచేతా దత్తత తీసుకోబడ్డవారు కాదు. బ్రహ్మా దత్తత తీసుకోబడ్డవారు. వీరిని శివబాబా దత్తత తీసుకున్నారు అని అంటారు. విష్ణువును శివబాబా దత్తత తీసుకున్నారు అని ఎప్పుడూ అనరు. బ్రహ్మాయే విష్ణువుగా అవుతారనైతే మీకు తెలుసు. అంతేకానీ విష్ణువు దత్తత అవ్వరు. శంకరుని పాత్ర ఏమీ లేదు అని అతని గురించి కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా అవుతారు, ఇది 84 జన్మల చక్రము. మరి శంకరుడు ఎక్కడ నుండి వచ్చారు? అతని రచన ఎక్కడుంది? తండ్రికైతే రచన ఉంది, వారు సర్వాత్మలకు తండ్రి మరియు మనుష్యులందరూ బ్రహ్మాకు రచన. శంకరుని రచన ఎక్కడుంది? శంకరుని ద్వారా మనుష్య సృష్టి ఏమీ రచించడం జరగదు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు, అయినా కానీ పిల్లలు ఘడియ-ఘడియ మర్చిపోతారు. ప్రతి ఒక్కరి బుద్ధి నంబరువారుగా ఉంది కదా. బుద్ధి ఎంతగా ఉంటుందో, అంతగా టీచర్ చదువును ధారణ చేయగలుగుతారు. ఇది అనంతమైన చదువు. చదువు అనుసారంగానే నంబరువారు పదవిని పొందుతారు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు ఒక్కటే కానీ వంశము తయారవుతుంది కదా. తాము ఏ పదవిని పొందుతాము అనేది కూడా బుద్ధిలోకి రావాలి. రాజుగా అవ్వడమైతే కష్టతరమైన విషయము. రాజుల వద్ద దాస-దాసీలు కూడా కావాలి. దాస-దాసీలుగా ఎవరు అవుతారు, ఇది కూడా మీరు అర్థం చేసుకోగలరు. నంబరువారు పురుషార్థానుసారముగా అందరికీ దాసీలు లభిస్తూ ఉండవచ్చు. మరి జన్మ-జన్మాంతరాలూ దాస-దాసీలుగా అయ్యే విధముగా చదవకూడదు. ఉన్నతముగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి.

సత్యమైన శాంతి తండ్రి స్మృతిలోనే ఉంది, బుద్ధి కొద్దిగా అటూ, ఇటూ వెళ్ళినా సమయం వ్యర్థమవుతుంది, సంపాదన తక్కువవుతుంది, సతోప్రధానులుగా అవ్వలేకపోతారు. చేతులతో పని చేస్తూ ఉండండి, హృదయముతో తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని కూడా అర్థం చేయించడం జరిగింది. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు అటూ, ఇటూ తిరగడమనేది కూడా చేయండి, ఫర్వాలేదు, కానీ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. ఒకవేళ ఎవరైనా పక్కన ఉంటే వ్యర్థమైన విషయాలను మాట్లాడకూడదు. ఇదైతే ప్రతి ఒక్కరి హృదయమూ సాక్ష్యం చెప్తుంది. ఇటువంటి అవస్థలో తిరగండి అని బాబా అర్థం చేయిస్తారు. క్రిస్టియన్ ఫాదర్లు పూర్తి శాంతిలో నడుస్తారు. మీరైతే మొత్తం సమయమంతా జ్ఞాన విషయాలను చర్చించరు కదా, మళ్ళీ మీ నోటిని శాంతపరుచుకొని శివబాబా స్మృతిలో రేస్ చేయాలి. భోజనం చేసే సమయంలో - స్మృతిలో కూర్చొని తినండి, మీ చార్టును చూసుకోండి అని బాబా అంటారు. నేనైతే మర్చిపోతాను అని బాబా తన గురించైతే చెప్తారు. నేను ప్రయత్నిస్తాను. నేను బాబాతో ఇలా అంటాను - బాబా, నేను పూర్తి సమయము స్మృతిలో ఉంటాను, మీరు నా దగ్గును ఆపు చేయండి, షుగరును తగ్గించండి. నా విషయములో నేను చేసే పురుషార్థము గురించి చెప్తాను. అయినా కానీ, నేను స్వయమే మరచిపోతే మరి దగ్గు ఎలా తగ్గుతుంది. బాబాతో నేను ఏ విషయాలనైతే మాట్లాడుతానో, వాటిని సత్యముగా వినిపిస్తాను. బాబా పిల్లలకు చెప్తారు, కానీ పిల్లలు తండ్రికి చెప్పరు, సిగ్గుపడతారు. ఊడ్చేటప్పుడు, భోజనం తయారుచేసేటప్పుడు కూడా శివబాబా స్మృతిలోనే చేయండి, అప్పుడు శక్తి వస్తుంది, ఈ యుక్తి కూడా కావాలి. ఇందులో మీ కళ్యాణమే జరుగుతుంది. అప్పుడు మీరు స్మృతిలో కూర్చుంటే ఇతరులకు కూడా ఆకర్షణ కలుగుతుంది. ఇతరులకు ఆకర్షణ అయితే కలుగుతుంది కదా. ఎంత ఎక్కువగా మీరు స్మృతిలో ఉంటే, అంత బాగా నిశ్శబ్దత ఏర్పడుతుంది. డ్రామానుసారంగా పరస్పరం ఒకరి ప్రభావం ఒకరిపై పడుతుంది. స్మృతియాత్ర చాలా కళ్యాణకారి అయినది, ఇందులో అబద్ధం చెప్పే అవసరమే లేదు. సత్యమైన తండ్రి పిల్లలు కావున సత్యముగా నడుచుకోవాలి. పిల్లలకైతే అంతా లభిస్తుంది. విశ్వ రాజ్యాధికారం లభిస్తున్నప్పుడు మరి లోభముతో 10-20 చీరలు మొదలైనవి ఎందుకు పోగు చేసుకుంటారు. ఒకవేళ చాలా వస్తువులను పోగు చేసుకుంటూ ఉన్నట్లయితే చనిపోయే సమయంలో కూడా అవి గుర్తుకొస్తాయి. అందుకే చేతికర్రను కూడా వదిలేయమని, లేకపోతే అది కూడా గుర్తుకు వస్తుంది అని భార్య చెప్పినట్లుగా ఒక ఉదాహరణ ఉంది. ఏదీ గుర్తుకు రాకూడదు. లేకపోతే తమకు తామే కష్టతరం చేసుకుంటారు. అబద్ధం చెప్పినట్లయితే పాపం 100 రెట్లు పెరిగిపోతుంది. శివబాబా భండారము సదా నిండి ఉంటుంది, ఎక్కువ పెట్టుకోవలసిన అవరమేముంది. ఎవరి వస్తువులైనా దొంగలించబడితే, వారికి అన్నీ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలైన మీకు తండ్రి నుండి రాజ్యమే లభిస్తుంది అన్నప్పుడు మరి బట్టలు మొదలైనవి లభించవా? కేవలం వ్యర్థంగా ఖర్చు చేయకూడదు ఎందుకంటే స్వర్గ స్థాపనలో అబలలే సహాయం చేస్తూ ఉంటారు. వారి ధనాన్ని అలా వ్యర్థం చేయకూడదు కూడా. వారు మీ పాలన చేస్తారు కావున వారి పాలన చేయడం మీ బాధ్యత. లేకపోతే 100 రెట్ల పాపం తలపైకి ఎక్కుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి స్మృతిలో కూర్చొనే సమయంలో కొద్దిగా కూడా బుద్ధి అటూ, ఇటూ భ్రమించకూడదు. సదా సంపాదన జమ అవుతూ ఉండాలి. స్మృతి ఎలా ఉండాలంటే నిశ్శబ్దము ఏర్పడాలి.

2. శరీరాన్ని ఆరోగ్యవంతముగా ఉంచుకునేందుకు అటూ, ఇటూ తిరగడానికి వెళ్ళినప్పుడు పరస్పరం పరచింతన విషయాలను మాట్లాడుకోకూడదు. నోటిని శాంతిగా ఉంచుకుంటూ తండ్రిని స్మృతి చేసే రేస్ చేయాలి. భోజనమును కూడా తండ్రి స్మృతిలో తినాలి.

వరదానము:-

నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి బలహీన సంకల్పాల వలను సమాప్తము చేసే సఫలతా సంపన్న భవ

ఇప్పటివరకూ మెజారిటీ పిల్లలు బలహీన సంకల్పాలను స్వయమే ఇమర్జ్ చేసుకుంటారు - అవుతుందో అవ్వదో తెలియదు, ఏమవుతుందో తెలియదు... ఈ బలహీన సంకల్పాలే అడ్డుగోడగా అవుతాయి మరియు సఫలత ఆ గోడ లోపల దాగిపోతుంది. మాయ బలహీన సంకల్పాల వలను పరిచేస్తుంది, ఆ వలలోనే చిక్కుకుపోతారు, అందుకే నేను నిశ్చయబుద్ధి విజయీ ఆత్మను, సఫలత నా జన్మసిద్ధ అధికారము - ఈ స్మృతి ద్వారా బలహీన సంకల్పాలను సమాప్తము చెయ్యండి.

స్లోగన్:-

మూడవ నేత్రమైన జ్వాలాముఖి నేత్రము తెరుచుకొని ఉన్నట్లయితే మాయ శక్తిహీనమైపోతుంది.