ఓంశాంతి
గీతా భగవంతుడు గీతను వినిపించారని తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు.
ఒకసారి వినిపించి వారు వెళ్ళిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు గీతా భగవానుని ద్వారా
అదే గీతా జ్ఞానాన్ని వింటున్నారు మరియు రాజయోగాన్ని కూడా నేర్చుకుంటున్నారు. వారైతే
వ్రాసి ఉన్న గీతను చదివి కంఠస్థము చేస్తారు, మళ్ళీ మనుష్యులకు వినిపిస్తూ ఉంటారు.
వారు కూడా మళ్ళీ శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొక జన్మను తీసుకుని చిన్నపిల్లలుగా అయితే
ఇక వినిపించలేరు. ఇప్పుడు తండ్రి మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేంత వరకూ మీకు
గీతను వినిపిస్తూనే ఉంటారు. లౌకిక టీచర్ కూడా పాఠాన్ని చదివిస్తూనే ఉంటారు.
ఎప్పటివరకైతే పాఠాలు పూర్తి అవ్వవో అప్పటివరకూ నేర్పిస్తూనే ఉంటారు. పాఠాలు పూర్తి
అయ్యాక ఇక హద్దు సంపాదనలో నిమగ్నమైపోతారు. టీచర్ నుండి చదువుకుంటారు, సంపాదన
చేసుకుంటారు, వృద్ధులుగా అవుతారు, ఆ తర్వాత శరీరాన్ని వదులుతారు, మళ్ళీ వెళ్ళి
ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. వారు గీతను వినిపిస్తారు, ఇప్పుడు దాని వలన ప్రాప్తి
ఏముంటుంది. అది ఎవ్వరికీ తెలియదు. గీతను వినిపించి మరుసటి జన్మలో మళ్ళీ
చిన్నపిల్లవాడిగా అయితే ఇక వినిపించలేరు. మళ్ళీ ఎప్పుడైతే పెద్దగా అవుతారో,
వృద్ధునిగా అవుతారో, గీతా పాఠకునిగా అవుతారో, అప్పుడు మళ్ళీ వినిపిస్తారు. ఇక్కడ
తండ్రి అయితే ఒకేసారి శాంతిధామము నుండి వచ్చి చదివిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు.
తండ్రి అంటారు, మీకు రాజయోగాన్ని నేర్పించి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. నేను
ఎవరినైతే చదివిస్తానో వారు మళ్ళీ వచ్చి తమ ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు, తమ సంపాదనను
చేసుకుంటారు, నంబరువారు పురుషార్థానుసారముగా ధారణ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఎక్కడకు?
కొత్త ప్రపంచములోకి. ఇది కొత్త ప్రపంచము కొరకు చదువుకునే చదువు. మనుష్యులకు పాత
ప్రపంచము అంతమై మళ్ళీ కొత్తది స్థాపన అవ్వనున్నదని తెలియదు. మనం కొత్త ప్రపంచము
కొరకే రాజయోగాన్ని నేర్చుకుంటామని మీకు తెలుసు. ఆ తర్వాత ఇక ఈ పాత ప్రపంచమూ ఉండదు,
ఈ పాత శరీరమూ ఉండదు. ఆత్మ అయితే అవినాశీ. ఆత్మలు పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచములోకి
వస్తారు. ఒకప్పుడు కొత్త ప్రపంచము ఉండేది, అందులో దేవీ-దేవతల రాజ్యముండేది, దానినే
స్వర్గము అని అంటారు. ఆ కొత్త ప్రపంచాన్ని తయారుచేసేవారు భగవంతుడే. వారు ఏక ధర్మ
స్థాపనను చేయిస్తారు. దానిని దేవతల ద్వారానేమీ చేయించరు. దేవతలు ఇక్కడ లేనే లేరు.
కావున తప్పకుండా ఎవరో ఒక మానవుని ద్వారానే జ్ఞానాన్ని ఇస్తారు, తద్వారా మళ్ళీ
దేవతలుగా అవుతారు, మళ్ళీ ఆ దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఇప్పుడు
బ్రాహ్మణులుగా అయ్యారు. భగవంతుడైతే నిరాకారుడని, వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారని
ఈ రహస్యము పిల్లలైన మీకే తెలుసు. ఇప్పుడైతే ఇది రావణ రాజ్యము. మీరు కలియుగ పతితులా
లేక సత్యయుగ పావనులా? అని మీరు అడుగుతారు. కానీ వారు అర్థం చేసుకోరు. నేను 5000
సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించాను అని ఇప్పుడు తండ్రి పిల్లలకు
తెలియజేస్తున్నారు. నేను పిల్లలైన మిమ్మల్ని అర్ధకల్పం కొరకు సుఖవంతులుగా చేయడానికే
వస్తాను, మళ్ళీ రావణుడు వచ్చి మిమ్మల్ని దుఃఖితులుగా చేస్తాడు. ఇది సుఖ-దుఃఖాల ఆట.
కల్పం ఆయువు 5000 సంవత్సరాలు కావున దానిని సగం, సగం చేయవలసి ఉంటుంది కదా. రావణ
రాజ్యములో అందరూ దేహాభిమానులుగా, వికారులుగా అయిపోతారు. ఈ విషయాలు కూడా మీరు ఇప్పుడే
అర్థం చేసుకున్నారు, ఇంతకుముందు అర్థం చేసుకునేవారు కారు. కల్పకల్పము ఎవరైతే అర్థం
చేసుకుంటారో, వారే అర్థం చేసుకుంటారు. ఎవరైతే దేవతలుగా అయ్యేవారు కారో వారిక్కడకు
రానే రారు. మీరు దేవతా ధర్మము యొక్క అంటును కడతారు. ఎప్పుడైతే వారు ఆసురీగా,
తమోప్రధానముగా అయిపోతారో అప్పుడు ఇక వారిని దైవీ వృక్షానికి చెందినవారు అని అనరు.
వృక్షము కూడా ఎప్పుడైతే కొత్తగా ఉండేదో అప్పుడు సతోప్రధానముగా ఉండేది. మనం వాటి
ఆకులుగా దేవీ-దేవతలుగా ఉండేవారము, ఆ తర్వాత రజో, తమోలలోకి వచ్చాము, పాతగా, పతితులుగా,
శూద్రులుగా అయిపోయాము. పాత ప్రపంచములో పాత మనుష్యులే ఉంటారు. ఆ పాతవారిని మళ్ళీ
కొత్తగా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దేవీ-దేవతా ధర్మమే కనుమరుగైపోయింది.
ఎప్పుడెప్పుడైతే ధర్మ గ్లాని జరుగుతుందో... అని తండ్రి కూడా అంటారు. అప్పుడు ఏ
ధర్మము యొక్క గ్లాని జరుగుతుంది అని అనడం జరుగుతుంది. తప్పకుండా ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మముదే, దానిని నేనే స్థాపించాను. ఆ ధర్మమే కనుమరుగైపోయింది. దానికి
బదులుగా అధర్మము ఏర్పడింది. కావున ఎప్పుడైతే ధర్మము నుండి అధర్మము యొక్క వృద్ధి
జరుగుతూ ఉంటుందో అప్పుడు తండ్రి వస్తారు. ధర్మము యొక్క వృద్ధి అని అనరు, ధర్మమైతే
కనుమరుగైపోయింది. ఇకపోతే అధర్మము యొక్క వృద్ధి జరుగుతోంది. వృద్ధి అయితే అన్ని
ధర్మాలదీ జరుగుతుంది. ఒక్క క్రైస్టు నుండి క్రిస్టియన్ ధర్మము ఎంతగా వృద్ధి
చెందుతోంది. ఇకపోతే దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది. పతితులుగా అయిన కారణముగా
తమకు తాముగానే గ్లాని చేస్తారు. ధర్మము నుండి అధర్మముగా ఒక్కటే అవుతుంది,
మిగిలినవన్నీ సరిగ్గానే నడుస్తున్నాయి. అందరూ తమ-తమ ధర్మాలలో నిలిచి ఉంటారు.
నిర్వికారిగా ఉన్న ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమువారు వికారులుగా అయ్యారు. నేను పావన
ప్రపంచాన్ని స్థాపన చేసాను, మళ్ళీ వారే పతితులుగా, శూద్రులుగా అవుతారు అనగా ఈ ధర్మము
యొక్క గ్లాని జరుగుతుంది. అపవిత్రులుగా అయితే తమ గ్లానిని చేయించుకుంటారు.
వికారాలలోకి వెళ్ళడంతో పతితులుగా అయిపోతారు, ఇక స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు.
స్వర్గము నుండి మారి నరకముగా అయిపోయింది. కావున వాహ్-వాహ్ (పావనులు) అంటూ ఎవరూ లేరు.
మీరు ఎంత అశుద్ధముగా, పతితులుగా అయిపోయారు. తండ్రి అంటారు, మిమ్మల్ని వాహ్-వాహ్
పుష్పాలుగా తయారుచేసాను, మళ్ళీ రావణుడు మిమ్మల్ని ముళ్ళుగా చేసేసాడు. పావనుల నుండి
పతితులుగా అయిపోయారు. మీ ధర్మము యొక్క పరిస్థితినే చూసుకోవాలి. మా పరిస్థితిని వచ్చి
చూడండి, మేము ఎంత పతితులుగా అయ్యాము, మళ్ళీ మమ్మల్ని పావనులుగా చేయండి అని పిలుస్తూ
ఉంటారు కూడా. పతితుల నుండి పావనులుగా తయారుచేయడానికి తండ్రి వస్తారు కావున మళ్ళీ
పావనులుగా అవ్వాలి. ఇతరులను కూడా అలా తయారుచేయాలి.
పిల్లలైన మీరు స్వయాన్ని చూసుకుంటూ ఉండండి, మేము సర్వగుణ సంపన్నులుగా అయ్యామా?
మా నడవడిక దేవతల వలె ఉందా? దేవతల రాజ్యములోనైతే విశ్వములో శాంతి ఉండేది. ఇప్పుడు
మళ్ళీ విశ్వములో శాంతి ఎలా స్థాపన అవుతుందో మీకు నేర్పించడానికి వచ్చాను కావున మీరు
కూడా శాంతిలో ఉండవలసి ఉంటుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు శాంతిగా అయిపోతారు,
శాంతిధామములోకి వెళ్ళిపోతారు అని శాంతిగా అయ్యే యుక్తిని తెలియజేస్తాను. కొందరు
పిల్లలైతే శాంతిగా ఉంటూ ఇతరులకు కూడా శాంతిగా ఉండడం నేర్పిస్తారు. కొందరు
అశాంతపరుస్తారు. వారు స్వయమే అశాంతిగా ఉంటారు కావున ఇతరులను కూడా అశాంతిగా
చేసేస్తారు. శాంతి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. శాంతిని నేర్చుకునేందుకు ఇక్కడకు
వస్తారు, మళ్ళీ ఇక్కడి నుండి వెళ్తే అశాంతిగా అయిపోతారు. అపవిత్రత వలననే అశాంతి
ఏర్పడుతుంది. ఇక్కడకు వచ్చి ప్రతిజ్ఞ చేస్తారు - బాబా, నేను మీవాడినే, మీ నుండి
విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి, నేను పవిత్రముగా ఉంటూ విశ్వాధిపతిగా తప్పకుండా
అవుతాను. మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో మాయ తుఫానులలోకి తీసుకువస్తుంది. యుద్ధం జరుగుతుంది
కదా. అప్పుడిక మాయకు బానిసలుగా అయి పతితులుగా అవ్వాలని కోరుకుంటారు. ఎవరైతే మేము
పవిత్రముగా ఉంటాము అని ప్రతిజ్ఞ కూడా చేసి మళ్ళీ మాయ దాడి జరగడంతో ప్రతిజ్ఞను
మర్చిపోతారో, వారే అబలలపై అత్యాచారాలు చేస్తారు. మేము పవిత్రముగా అయి పవిత్ర
ప్రపంచము యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము, మేము నిర్వికారీ దృష్టిని ఉంచుకుంటాము,
మా దృష్టిని చెడుగా ఉంచుకోము, వికారాలలోకి వెళ్ళము, వికారీ దృష్టిని వదిలేస్తాము అని
భగవంతుడితో ప్రతిజ్ఞను చేస్తారు, అయినా కానీ మాయా రావణుడితో ఓడిపోతారు. ఇక దానితో
ఎవరైతే నిర్వికారాలుగా అవ్వాలనుకుంటారో వారిని విసిగిస్తారు, అందుకే అబలలపై
అత్యాచారాలు జరుగుతాయి అని అంటారు. పురుషులైతే శక్తివంతులుగా ఉంటారు, స్త్రీ
నిర్బలముగా ఉంటుంది. యుద్ధాలు మొదలైన చోట్లకు కూడా పురుషులే వెళ్తారు ఎందుకంటే వారు
శక్తివంతులుగా ఉంటారు, స్త్రీ నాజూకుగా ఉంటుంది. ఆమె కర్తవ్యమే వేరు. ఆమె ఇంటిని
సంభాళిస్తుంది, పిల్లలకు జన్మనిచ్చి వారి పాలనను చేస్తుంది. అక్కడ ఒకే కొడుకు
ఉంటారని కూడా తండ్రి అర్థం చేయిస్తారు కానీ అక్కడ వికారాల విషయమే ఉండదు. ఇక్కడైతే
సన్యాసులు కూడా అప్పుడప్పుడు ఒక కొడుకైతే తప్పకుండా ఉండాలి అని అంటారు. వికారీ
దృష్టి గల మోసగాళ్ళు ఇటువంటి శిక్షణను ఇస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఈ
సమయములో వినాశనం ఎదురుగా నిలబడినప్పుడు ఇక పిల్లలు ఏం పని కోసము, అందరూ అంతమైపోతారు.
నేను పాత ప్రపంచాన్ని వినాశనం చేసేందుకే వచ్చాను. అది సన్యాసుల విషయము, వారికి
వినాశన విషయము గురించి తెలియనే తెలియదు. ఇప్పుడు వినాశనం జరగనున్నదని, మీ పిల్లలు
వారసులుగా అవ్వలేరని మీకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. మా కులము యొక్క చిహ్నము
ఉండాలి అని మీరు భావిస్తారు. కానీ అసలు ఈ పతిత ప్రపంచము యొక్క గుర్తులు ఏవీ ఉండవని
మీకు తెలుసు. మేము పావన ప్రపంచానికి చెందినవారిగా ఉండేవారము అని మీరు అర్థం
చేసుకున్నారు, మనుష్యులు కూడా తలచుకుంటారు ఎందుకంటే పావన ప్రపంచము ఒకప్పుడు ఉండేది,
దానిని స్వర్గము అని అనేవారు. కానీ ఇప్పుడు తమోప్రధానముగా అయిపోయిన కారణముగా అర్థం
చేసుకోలేరు. అసలు వారి దృష్టియే వికారీగా ఉంది, దీనిని ధర్మ గ్లాని అని అంటారు. ఆది
సనాతన ధర్మములో ఇటువంటి విషయాలు ఏవీ ఉండవు. పతిత-పావనా రండి, మేము పతితులుగా,
దుఃఖితులుగా ఉన్నాము అని పిలుస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, నేను మిమ్మల్ని
పావనులుగా తయారుచేసాను, మళ్ళీ మాయా రావణుడి కారణముగా మీరు పతితులుగా అయిపోయారు,
ఇప్పుడు మళ్ళీ పావనులుగా అవ్వండి. పావనులుగా అవుతారు, మళ్ళీ మాయ యుద్ధం కొనసాగుతుంది.
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేస్తుండేవారు కానీ మళ్ళీ నల్ల ముఖము
చేసుకుంటే వారసత్వాన్ని ఎలా పొందుతారు. తండ్రి తెల్లగా తయారుచేయడానికే వస్తారు.
దేవతలు ఎవరైతే తెల్లగా ఉండేవారో వారే నల్లగా అయిపోయారు. దేవతల శరీరాలనే నల్లగా
తయారుచేస్తారు. క్రైస్టు, బుద్ధుడు మొదలైనవారిని ఎప్పుడైనా నల్లగా చూశారా.
దేవీ-దేవతల చిత్రాలనే నల్లగా తయారుచేస్తారు. సర్వుల సద్గతిదాత అయిన పరమపిత పరమాత్మ
సర్వులకూ తండ్రి, వారినే పరమపిత పరమాత్మా, మీరు వచ్చి మమ్మల్ని విముక్తులను చేయండి
అని పిలుస్తారు. వారు నల్లగా ఉండలేరు. వారైతే సదా తెల్లగా, సదా పవిత్రముగా ఉంటారు.
దేవతలను మహానాత్మలు అని అంటారు. శ్రీకృష్ణుడు దేవత కదా. ఇప్పుడు ఇది కలియుగము,
కలియుగములోకి మహానాత్మలు ఎక్కడి నుండి వస్తారు! శ్రీకృష్ణుడైతే సత్యయుగపు మొదటి
యువరాజుగా ఉండేవారు, వారిలో దైవీ గుణాలు ఉండేవి. ఇప్పుడైతే దేవతలు మొదలైనవారు ఎవ్వరూ
లేరు. సాధు-సన్యాసులు పవిత్రముగా అవుతారు, అయినా కానీ పునర్జన్మలను వికారాల ద్వారానే
తీసుకుంటారు. మళ్ళీ సన్యాసము ధారణ చేయవలసి ఉంటుంది. దేవతలైతే సదా పవిత్రముగా ఉంటారు.
ఇక్కడ రావణ రాజ్యము ఉంది. రావణుడికి 10 తలలు చూపిస్తారు. 5 స్త్రీవి, 5 పురుషునివి.
పంచ వికారాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయని కూడా అర్థం చేసుకుంటారు. దేవతల్లో ఉన్నాయి
అని అయితే అనరు కదా. అది సుఖధామము, అక్కడ కూడా రావణుడు ఉన్నట్లయితే అదీ దుఃఖధామమే
అయిపోతుంది. దేవతలకు కూడా పిల్లలు పుడతారు కదా, కావున వారు కూడా వికారులే అని
మనుష్యులు భావిస్తారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని గానం చేస్తారు అన్నది
వారికి తెలియనే తెలియదు. కావుననే వారిని పూజించడం జరుగుతుంది. సన్యాసుల మిషన్ కూడా
ఒకటి ఉంది. కేవలం పురుషులనే సన్యసింపజేసి ఆ మిషన్ ను పెంచుతారు. తండ్రేమో ప్రవృత్తి
మార్గము యొక్క కొత్త మిషన్ ను తయారుచేస్తారు. జంటను పవిత్రముగా తయారుచేస్తారు.
అప్పుడు మీరు వెళ్ళి దేవతలుగా అవుతారు. మీరు ఇక్కడకు సన్యాసులుగా అవ్వడానికి రాలేదు.
మీరు విశ్వాధిపతులుగా అవ్వడానికి వచ్చారు. వారైతే మళ్ళీ గృహస్థములో జన్మ తీసుకుంటారు,
మళ్ళీ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు. మీ సంస్కారాలే పవిత్రతకు సంబంధించినవి.
ఇప్పుడు అపవిత్రముగా అయ్యారు, మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. తండ్రి పవిత్ర గృహస్థ
ఆశ్రమాన్ని తయారుచేస్తారు. పావన ప్రపంచాన్ని సత్యయుగము అని, పతిత ప్రపంచాన్ని
కలియుగము అని అంటారు. ఇక్కడ ఎంతమంది పాపాత్ములు ఉన్నారు. సత్యయుగములో ఈ విషయాలేవీ
ఉండవు. తండ్రి అంటారు, ఎప్పుడెప్పుడైతే భారత్ లో ధర్మ గ్లాని జరుగుతుందో అనగా
దేవీ-దేవతా ధర్మమువారు పతితులుగా అయిపోతారో, అప్పుడు తమ గ్లానిని చేయించుకుంటారు.
తండ్రి అంటారు, నేను మిమ్మల్ని పావనముగా తయారుచేసాను, మీరు మళ్ళీ పతితులుగా అయ్యారు,
ఎందుకూ పనికిరాకుండా ఉన్నారు. ఎప్పుడైతే ఈ విధంగా పతితులుగా అయిపోతారో అప్పుడు మళ్ళీ
పావనులుగా తయారుచేయడానికి నేను రావలసి వస్తుంది. ఇది డ్రామా చక్రము, ఇది తిరుగుతూ
ఉంటుంది. స్వర్గములోకి వెళ్ళేందుకు మళ్ళీ దైవీ గుణాలు కూడా కావాలి. క్రోధము ఉండకూడదు.
క్రోధము ఉన్నట్లయితే వారిని కూడా అసురులు అనే అంటారు. చాలా శాంతచిత్తమైన అవస్థ
కావాలి. ఎవరైనా క్రోధము చేస్తే వీరిలో క్రోధము యొక్క భూతము ఉంది అని అంటారు.
ఎవరిలోనైనా ఎటువంటి భూతమైనా ఉంటే వారు దేవతగా అవ్వలేరు, నరుని నుండి నారాయణునిగా
అవ్వలేరు. దేవతలు నిర్వికారులు, అక్కడ యథా రాజా రాణి తథా ప్రజా... అందరూ
నిర్వికారులుగా ఉంటారు. భగవంతుడైన తండ్రే వచ్చి సంపూర్ణ నిర్వికారులుగా
తయారుచేస్తారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.