02-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
17.02.2011
‘‘మనసా సేవ ద్వారా ఆత్మలకు అంచలిని ఇచ్చే సేవను
చేస్తూ, బహుకాలము నుండి తీవ్ర పురుషార్థము చేసి ఎవర్రెడీగా
ఉండండి, అప్పుడు మాలలోని మణిగా అయిపోతారు’’
ఈ రోజు స్నేహ సాగరుడు తమ స్నేహీ పిల్లలను కలుసుకోవడానికి
వచ్చారు. నా బాబా, రండి అని పిల్లలు గుర్తు చేసుకున్నారు. బాబా
కూడా నా స్నేహీ పిల్లలు అని అంటారు. స్నేహములో ఎంతటి ఆకర్షణ
ఉందంటే పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాను తమవారిగా చేసుకున్నారు
మరియు బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరినీ నా పిల్లలు అని అంటూ
తమలో ఇముడ్చుకున్నారు. అద్భుతముగా ఉంది, పిల్లలు నా బాబా
అన్నప్పుడు ‘నా’ అన్న పదములో ఎంత స్నేహము నిండి ఉందంటే బాబా
కూడా నా పిల్లలు అని అన్నారు. స్నేహము ఎలాంటివారిని ఎలా
చేస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకములో ఈ రోజు స్నేహపు అలలు
కదులాడుతున్నాయి, ఇది చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. స్నేహమే
హృదయాన్ని సొంతం చేసుకునేందుకు సాధనము. ప్రతి బిడ్డ లోపల ఈ రోజు
స్నేహపు అలలు కదులాడుతూ ఉండటాన్ని చూస్తూ-చూస్తూ బాప్ దాదా
సంతోషిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే 5 నిమిషాల కోసం ఒక డ్రిల్ ను బాప్ దాదా
అందరికీ చేయిస్తున్నారు. మీ మనసా శక్తితో, సృష్టిలో ఉన్న మీ
భక్తులు లేక అనేకమంది దుఃఖిత, అశాంత ఆత్మలు ఎవరైతే మిమ్మల్ని
గుర్తు చేసుకుంటున్నారో - ఓ మా పూర్వజులారా, మాకు కొద్ది సమయము
కోసమైనా శాంతిని ఇవ్వండి, కొద్దిగా సుఖము యొక్క అంచలిని ఇవ్వండి,
కాపాడండి అని అంటున్నారో, అటువంటి ఆత్మలను ఇక్కడ కూర్చునే
ఇమర్జ్ చేసుకోండి. కాపాడండి, కాపాడండి... అన్న వారి మొర
వినిపిస్తుందా! మరి అటువంటి ఆత్మలకు మీ మనసా శక్తి ద్వారా
సుఖ-శాంతుల కిరణాలను అందించండి. ఈ మనసా సేవను రోజంతటిలో పదే-పదే
చేస్తూ ఉండండి ఎందుకంటే బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా విశ్వ
సేవకులు. ఎలా అయితే రోజంతా వాణి ద్వారా చేసే సేవకు
నిమిత్తమవుతారో, అలాగే మధ్యమధ్యలో మనసా సేవను కూడా అభ్యాసము
చేస్తూ ఉండండి. ఇందులో మీకు కూడా లాభము ఉంటుంది ఎందుకంటే ఒకవేళ
మీ మనసు సదా సేవలో బిజీగా ఉన్నట్లయితే మీ వద్దకు మధ్యమధ్యలో
మాయ అనవసరమైన లేక వ్యర్థ సంకల్పాలు ఏవైతే తీసుకువస్తుందో, వాటి
నుండి రక్షింపబడతారు. శ్రమ చేయవలసిన అవసరము ఉండదు. ఇప్పుడు బాప్
దాదా ఎలా ఉన్నారు అని మిమ్మల్ని అడిగితే, మీరు ఏమని జవాబు
ఇస్తారు? పురుషార్థము జరుగుతుంది కానీ అప్పుడప్పుడూ... అని
అంటారు! సదా పురుషార్థము జరగడము లేదు. బాప్ దాదా ఇప్పుడు
పిల్లలందరి విషయములోనూ ఈ రికార్డును చూడాలనుకుంటున్నారు -
‘అప్పుడప్పుడూ’ అన్న పదము సమాప్తమైపోవాలి, ఇది వీలవుతుందా?
‘అప్పుడప్పుడు’ అన్నది సమాప్తమైపోతుందా? సమయానికి తయారైపోతారా?
‘అవుతూ ఉన్నాము’, ‘అవ్వాల్సిందే’... అనే మాటలకు బదులుగా ఇప్పుడు
ఎవర్రెడీగా అవ్వగలరా? ఎందుకని? ఎవర్రెడీగా ఉండే అభ్యాసము
ఏమిటంటే - మాయాజీత్, మన్ జీత్, జగత్ జీత్, ఈ సంస్కారాన్ని కూడా
బహుకాలము నుండి తయారుచేసుకుంటేనే అంతిమ సమయములో కూడా ఈ బహుకాలపు
అభ్యాసము విజయులుగా చేసి మిమ్మల్ని విశేషముగా మాలలోని మణిగా
చేస్తుంది. పాస్ విత్ ఆనర్ గా అవుతారు. పాస్ కాదు, పాస్ విత్
ఆనర్. మరి చెప్పండి, ఈ ధైర్యము ఉంది కదా! పాస్ విత్ ఆనర్ గా
అయితే అవ్వాలి కదా? వారే ద్వాపరము నుండి మొదలుకుని ఇప్పటివరకు
పూజ్యులుగా అవుతారు అనగా మాలలోని మణిగా అవుతారు. మరి మీకు
స్వయాన్ని మాలలోని మణిగా తయారుచేసుకునే శుద్ధ సంకల్పము ఉంది కదా!
బాప్ దాదా కూడా రోజూ అమృతవేళ తమ మాలలోని మణులను చూస్తారు
మరియు వారితో విశేష మిలనము చేస్తారు. మరి మీరందరూ స్వయాన్ని
మాలలోని మణులుగా భావిస్తున్నారా. 16 వేల మణుల మాల కూడా ఉంది,
కానీ అది రెండవ నంబరు మాల. విశేషముగా ఏ మాల అయితే గాయన
యోగ్యముగా మరియు పూజ్యనీయ యోగ్యముగా అవుతుందో, అది మొదటి మాల.
ఈ రోజు బాప్ దాదా ఆ మణులను చూస్తున్నారు ఎందుకంటే బ్రహ్మాబాబాతో
పాటు విశేషముగా రాజ్యాధికారీ సహచరులుగా వారే అవుతారు. కావున ఈ
రోజు బ్రహ్మాబాబా తమ ఇప్పటి తీవ్ర పురుషార్థీ పిల్లలను మరియు
భవిష్య రాజ్యాధికారీ పిల్లలను చూస్తున్నారు. సింహాసనముపై అయితే
ఇద్దరే కూర్చుంటారు, కానీ రాజుకు సహచరులుగా ఉండేవారిది మొదటి
మాల. మరి మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నారా. బాప్ దాదాతో పాటు
అయితే వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు మీ అందరిదీ రిటర్న్ జర్నీయే.
ఎలాగూ వెళ్ళాలి అన్నప్పుడు బాబాతో పాటు వెళ్ళాలి, ఒంటరిగా
వెళ్ళేది లేదు. మరి బాబాతో పాటు వెళ్ళే సమీప మణులు ఎవరు అవుతారు?
ఎవరైతే బహుకాలము నుండి తీవ్ర పురుషార్థులుగా ఉంటారో వారు,
పురుషార్థులు కాదు, అప్పుడప్పుడూ అని అనేవారు కాదు. బహుకాలముగా
బాబా సమానముగా ఉన్నవారే రాజ్యాధికారులుగా అవుతారు. మరి ఏమని
భావిస్తున్నారు? తీవ్ర పురుషార్థము ఉందా? నేను తీవ్ర పురుషార్థీ
లైనులో ఉన్నాను అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులెత్తండి.
తీవ్ర పురుషార్థులు, చేతులు పైకి ఎత్తండి, చిన్నగా
ఎత్తుతున్నారు. అచ్ఛా, చాలామంది ఎత్తుతున్నారు. మళ్ళీ బాగా పైకి
చేతులు ఎత్తండి, ఇలా (చిన్నగా) కాదు. అచ్ఛా!
బాప్ దాదా అయితే ప్రతిరోజూ పిల్లల చార్టును చూస్తారు.
మెజారిటీ తీవ్ర పురుషార్థులుగా కూడా ఉన్నారు, కానీ అప్పుడప్పుడూ
అన్న పదాన్ని కూడా దానితో పాటు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బాబా
ఎందుకు చెప్తున్నారు? అటెన్షన్ ప్లీజ్. సూక్ష్మముగా సంకల్పములో
కూడా అలజడి ఉండకూడదు. అచంచలముగా, స్థిరముగా, శుద్ధ
సంకల్పధారులుగా బహుకాలము నుండి అవ్వవలసిందే. కొంతమంది పిల్లలు
చాలా మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణను చేస్తుంటారు. బాబా, మేము
ఎలాగైనా సరే తయారైపోతాము అని అంటారు. ఎందుకంటే సమయము ఎంతగా
సమీపిస్తూ ఉంటుందో, అంతగా పరిస్థితులు అలజడిలోకి వస్తూ ఉంటాయి,
అప్పుడు వైరాగ్యమైతే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ అప్పుడు
మీకు టీచర్ ఎవరు అయినట్లు? సమయమా లేక బాబానా? సమయమైతే మీ రచన.
బాబా ఇప్పుడు సూచనను ఇస్తున్నారు, బహుకాలపు తీవ్ర పురుషార్థము
అంతిమములో పాస్ విత్ ఆనర్ గా చేస్తుంది. పాస్ అయితే అందరూ
అవుతారు కానీ పాస్ విత్ ఆనర్ అవ్వడానికి బహుకాలము నుండి నిరంతర
తీవ్ర పురుషార్థము చేయడము అవసరము, అందుకే ఈ రోజు తారీఖును నోట్
చేసుకోండి. ఇప్పటికీ కూడా ‘అప్పుడప్పుడూ’, ‘సమ్ థింగ్’, ‘తయారైపోతాములే’,
‘చేసేస్తాములే’ అన్న పదాలు ఉన్నాయి... ఈ మాటలు ఇకమీదట ఉండకూడదు.
బాబా ప్రేమ అయితే సదా ఉంటుంది. చివరి మణిపై కూడా బాబాకు ప్రేమ
ఉంది. ఎందుకని? మనస్ఫూర్తిగా నా బాబా అని అయితే అన్నారు. ఈ నాటి
పెద్ద-పెద్ద ఆత్మలు కూడా నా బాబా అని అనరు, కానీ చివరి మణిగా
ఉన్నవారు కూడా నా బాబా అని నమ్ముతున్నారు. అందుకే బాబా ప్రేమ
అయితే వారిపై కూడా ఉంది. పిల్లలపై ప్రేమ అయితే బాబాకు సదా ఉంది,
చివరి వరకు ఉంటుంది, చివరిలో ఉన్నవారి పట్ల కూడా ఉంది. స్నేహమే
మిమ్మల్ని బాబాకు చెందినవారిగా చేసింది. బాప్ దాదా ఇది కూడా
చెప్తున్నారు, స్నేహము మెజారిటీ పిల్లలకు ఉంది మరియు ఉంటుంది,
కానీ కేవలం స్నేహము కాదు, శక్తి కూడా కావాలి. తీవ్ర పురుషార్థము
కూడా కావాలి.
బాప్ దాదాకు అయితే పిల్లలపై నమ్మకము ఉంది కదా. ఇప్పటినుండే
అటువంటి పిల్లలకు పదమాల, పదమాల రెట్లు అభినందనలను ఇస్తున్నారు.
వాహ్ పిల్లలు వాహ్! మీరు ధైర్యము కలవారు. మీ ధైర్యము ఉంటే బాబా
సహాయము ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఒక పని చేయండి. మీ మనసును బిజీగా
పెట్టుకోవడానికి, ఎలా అయితే బాబా ఇంతకుముందు కూడా చెప్పి
ఉన్నారు కదా, సెకండులో - నేను బిందువును, బిందువు పెట్టాలి
మరియు అందరినీ బిందువు రూపములో చూడాలి. చూసేది బిందువునే
అన్నప్పుడు ఇక ఇతర ఏ సంకల్పాలు నడవవు. మనసా సేవ పట్ల అటెన్షన్
ఉంచండి. ఎంతోమంది దుఃఖిత ఆత్మలు మొర పెట్టుకుంటున్నారు, వారికి
కిరణాలను ఇచ్చే సేవలో ఎక్స్ ట్రా మనసును పెట్టండి. మనసా సేవ
చాలా శ్రేష్ఠమైన సేవ. దీని వలన దుఃఖములో ఉన్నవారికి కూడా లాభము
మరియు స్వయానికి కూడా లాభము. డబుల్ లాభము. ఎలా అయితే వాచాతో
సేవ చేస్తున్నారు మరియు ఆ సేవ పెరుగుతూ కూడా ఉంటుంది, దానిని
మనస్ఫూర్తిగా చేస్తున్నారు, సంఖ్య కూడా పెరుగుతుంది, సెంటర్లు
కూడా పెరుగుతూ ఉంటాయి, వాచా సేవ మెజారిటీ పిల్లలది బాగానే ఉంది.
అందరిదీ కాదు కానీ మెజారిటీది. అలాగే ఇప్పుడు మనసుతో విశేషముగా
ఆత్మలకు అంచలిని ఇచ్చే సేవను కూడా చేస్తూ ఉండండి. మనసును ఫ్రీగా
వదలకండి. ఏదో ఒక సేవలో పెట్టండి, మనసుతో శక్తులను ఇవ్వడము,
నోటితో వాచా సేవ, కర్మలతో గుణాల సేవ, సంబంధ-సంపర్కాలలో
సంతోషాన్ని ఇచ్చే సేవ, ఇలా భిన్న-భిన్న సేవలలో మనసును బిజీగా
పెట్టండి ఎందుకంటే మొత్తము విశ్వములో రిచెస్ట్ (అత్యంత ధనవంతులు)
ఆత్మలు ఎవరు? మీరే కదా! ఎన్ని ఖజానాలు లభించాయి? మరి ప్రతి
ఖజానాతో సేవ చేయండి. ఖజానాలను ఎంతగా సేవలో ఉపయోగిస్తారో, అంతగా
ఆ ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఎలా అయితే స్వ సేవ
పట్ల అటెన్షన్ పెడుతూ ఉంటారో, అలాగే దుఃఖముతో ఉన్న ఆత్మలకు, తమ
భక్తులకు మనసు ద్వారా కిరణాలను ఇచ్చే సేవను కూడా అటెన్షన్
పెట్టి మొత్తము రోజంతటిలో చేయండి. చాలా మొర పెట్టుకుంటున్నారు,
మీకు వినిపించడము లేదు. మెజారిటీ ప్రతి ఇంటిలో ఏదో ఒక దుఃఖము
యొక్క కారణము ఉంది. ఇలా దుఃఖములో ఉన్నవారికి సుఖాన్ని ఇచ్చేది
ఎవరు? చెప్పండి, ఎవరు? మీరే కదా. మరి ఈ మనసా సేవను రోజంతటిలో
చెక్ చేసుకోండి - ఎంత సమయము చేసాను? ఎలాగైతే స్వయము కోసం
సమయాన్ని వెచ్చిస్తారో, అలా మనసా సేవ కోసం ఎంత సమయాన్ని
వెచ్చించారు? దయార్ద్ర హృదయులు కదా. కావున దుఃఖములో ఉన్నవారిపై
దయ చూపించండి. మీ పాట కూడా ఉంది కదా - ఓ తల్లి-తండ్రి, దుఃఖములో
ఉన్నవారిపై దయ చూపించండి అని. బాప్ దాదా ఎంతగానో వారి మొరను
వినవలసి వస్తుంది. మీకు తక్కువగా వినిపిస్తుంది, కానీ ఇప్పుడిక
వినండి. వారు ఇంకెక్కడికి వెళ్తారు, ఎంతైనా వారు మీ
సోదరీ-సోదరులే కదా. కావున మీరు స్వయము కూడా లాభాన్ని పొందండి,
మనసును బిజీగా పెట్టండి మరియు దుఃఖములో ఉన్నవారి దుఃఖాన్ని
హరించండి. వారు మొర పెట్టుకుంటున్నారు, వారి మనసు
విలవిలలాడుతుంది. బాప్ దాదా అయితే వింటూ ఉంటారు, అప్పుడు
పిల్లలను గుర్తు చేసుకుంటారు - ఓ నా ప్రియమైన పిల్లలూ, చాలా
కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలూ, ఇప్పుడు దయార్ద్ర హృదయ
రూపాన్ని ధారణ చేయండి. బ్రాహ్మణులలో కూడా ఒకరికొకరు సహయోగులుగా
అవ్వండి. ఎవరు ఎటువంటి సంస్కారాలతో ఉన్నా కానీ మీ పని ఏమిటి?
సంస్కారాలతో ఘర్షణ పడటమా లేక వారిని కూడా సంస్కారాల ఘర్షణ నుండి
విడిపించడమా? దుఃఖహర్త-సుఖకర్త అన్నది మీ టైటిల్ కూడా కదా! మీరు
బాబాకు సహచరులు కదా. బాబాకు సహచరులుగా ఉండేవారు ఏ సంకల్పాన్ని
తీసుకున్నారు? ఈ విశ్వాన్ని దుఃఖము, అశాంతి నుండి పరివర్తన చేసి
సుఖ-శాంతులను స్థాపన చేయవలసిందే. చేయవలసిందే కదా! చేతులెత్తండి.
చేయాలా? లేక కేవలం చూడటమేనా? జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు
పరివర్తన జరగాలి. బ్రాహ్మణ ఆత్మ అయినా కానీ, వాళ్ళు అలా చేస్తూ
ఉన్నారు అని చూస్తూ ఉండిపోకండి, వారిని కూడా వాణి మరియు మనసా
సంకల్పాల ద్వారా పరివర్తన చేయండి. అలా చేయకూడదు అని పిల్లలు
అనటాన్ని బాప్ దాదా వింటూ ఉంటారు. మీరు బాప్ దాదా వరకు
విషయాన్ని చేర్చారు. బాబాకు విషయాన్ని అందించినప్పుడు మరి మీరు
ఇక బాబా ఇచ్చిన డైరెక్షన్లపై నడవండి. బాధ్యత బాప్ దాదాది మరియు
వారితో పాటు ఉన్న ప్రియమైన పిల్లలు నిమిత్తముగా అయిన పిల్లలు.
మరి సదా మీ మనసును వ్యర్థ సంకల్పాలకు బదులుగా ఇప్పుడు దుఃఖిత
ఆత్మలకు, వారు బ్రాహ్మణులే కావచ్చు లేక మరెవరైనా కావచ్చు,
డిస్టర్బ్ అయి ఉన్న ఆత్మలకు సహయోగాన్ని ఇవ్వండి. సహయోగులుగా
అవ్వండి. అచ్ఛా!
మొదటిసారి వచ్చిన కొత్త-కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు
ఒక్క సెకండులో 10 నిమిషాల పని చేయాలి. సమయాన్ని కొద్దిగా కూడా
వ్యర్థం చేయకండి. అటెన్షన్ పెట్టండి. తమ పురుషార్థాన్ని తీవ్రం
చేసి ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. ఇది
మీ అందరికీ బ్రాహ్మణులందరి తరఫున, బాబా తరఫున శుభ భావన, శుభ
కామన. అచ్ఛా! (మధుబన్ వారందరూ లేచి నిలబడండి)
ఒకవేళ మధుబన్ వారు లేకపోతే మీ అతిథి మర్యాదలన్నీ ఎవరు
చేస్తారు. మీరు ప్రశాంతముగా వస్తారు, తింటారు, తాగుతారు,
రిఫ్రెష్ అవుతారు, కనుక మధుబన్ వారి కోసం చప్పట్లు కొట్టండి.
స్థలం తక్కువగా ఉన్న కారణముగా మధుబన్ వారు కాస్త దూరంగా
కూర్చుని వినాల్సి వస్తుంది అన్నది బాప్ దాదాకు తెలుసు. ఇది
కూడా సేవే. మధుబన్ వారికి ఇది కూడా సేవే. ఇతరులకు సుఖాన్ని
ఇవ్వటము కూడా సేవే, సుఖదాతలుగా అయిపోయారు కదా. కనుక మధుబన్ వారి
పని సుఖాన్ని ఇవ్వటము మరియు సుఖాన్ని తీసుకోవటము ఎందుకంటే ఎవరు
వచ్చినా సరే, వారి అనుభవాల నుండి మీరు అనుభవాలను వినిపిస్తారు.
ఆ అనుభవాల వలన ఒకరికొకరికి లాభము కలుగుతుంది. చాలా లాభాలు
ఉంటాయి కానీ సమయము తక్కువగా ఉన్న కారణముగా తక్కువగా
వినిపిస్తారు. మధుబన్ వారి టైటిల్ ఏమిటి? సుఖాన్ని ఇవ్వటము
మరియు సుఖాన్ని తీసుకోవటము, సుఖదాత పిల్లలు ఫాలో ఫాదర్ చేసేవారు.
అచ్ఛా!
ఈ సారి ఎవరైతే వచ్చారో, మీరు మురళిని రెగ్యులర్ గా
వింటున్నారు కదా. మురళిని విననివారు ఎవరైనా ఉన్నారా,
చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. అచ్ఛా. ఎవరైతే మురళిని చదవరో లేక
వినరో వారు లేచి నిలబడండి. కొద్దిమంది ఉన్నారు. పరవాలేదు కానీ
ఇప్పుడు లభించిన మిగిలిన సమయములో బాబా మహావాక్యాలను తప్పకుండా
వినండి మరియు చదవండి. పరంధామము నుండి బాప్ దాదా వస్తారు,
సూక్ష్మవతనము నుండి బ్రహ్మాబాబా వస్తారు మరియు వచ్చి
మహావాక్యాలను ఉచ్చరిస్తారు, అందుకే మురళిని ఎప్పుడూ కూడా ఒక్క
రోజు కూడా మిస్ చేయకండి. మిస్ చేసినట్లయితే మీ బాప్ దాదా యొక్క
హృదయ సింహాసనము దూరమైపోతుంది, అందుకే ఎవరైతే మురళిని మిస్
చేస్తారో, వారు అర్థం చేసుకోండి - మేము మూడు సింహాసనాలకు
యజమానులుగా కాము, రెండు సింహాసనాలకు యజమానులుగా కూడా యథా శక్తి
అవుతాము, అందుకే మురళి, మురళి, మురళి ఎందుకంటే మురళిలో
ప్రతిరోజుకు అవసరమైన డైరెక్షన్లు ఉంటాయి, నాలుగు సబ్జెక్టులకు
సంబంధించిన డైరెక్షన్లు ఉంటాయి. మరి ప్రతిరోజూ వచ్చే ఆ
డైరెక్షన్లను తీసుకోవాలి కదా. కనుక ఎవరైతే మురళిని ఏ కారణము
చేతనైనా మిస్ చేస్తుంటారో, వారు మురళిని ఎలా వినాలి అన్నదాని
ప్రోగ్రామ్ ను తయారుచేసుకోండి. ఏదో ఒక పరిష్కారాన్ని చూసుకోండి.
ఈ రోజుల్లో సైన్స్ సాధనాలు మీ కోసం వెలువడ్డాయి. బ్రహ్మాబాబాలో
ప్రవేశించే కంటే 100 సంవత్సరాల ముందు ఈ సైన్స్ వెలువడింది.
సైన్స్ మీకు కూడా ఉపయోగపడనుంది, అందుకే దానిని ఉపయోగించండి,
లాభము తీసుకోండి. అచ్ఛా - ఎదురుగా కూర్చున్న వారికి మరియు
మరెక్కడైనా కూర్చుని వింటున్న పిల్లలకు మనస్ఫూర్తిగా బాప్ దాదా
యొక్క ప్రేమ పూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవ టర్న్ యు.పి, బనారస్ ది:-
యు.పి. పట్ల బ్రహ్మాబాబాకు మరియు జగదాంబకు చాలా ప్రేమ ఉండేది.
బ్రహ్మాబాబా యు.పి.కి ఎన్ని సార్లు వచ్చారో, అన్ని సార్లు
బొంబాయికి కూడా వచ్చారు. కానీ యు.పి.కి కూడా వచ్చారు. మరి ఏ
స్థానములో అయితే బ్రహ్మాబాబా కాలు మోపబడిందో, ఆ స్థానము ఎంతటి
భాగ్యశాలి అయినది. లక్నౌ మరియు కాన్పూర్ వారు, ఇద్దరూ ఈ
భాగ్యానికి అధికారిగా అయ్యాయి. బొంబాయి వారు కూడా అయ్యారు, కానీ
ఇప్పుడు ఇది యు.పి. వారి టర్న్, డైరెక్టుగా తల్లి మరియు తండ్రి
యొక్క శిక్షణల బిందువులు యు.పి.లో పడ్డాయి. ఇప్పుడు యు.పి.
మున్ముందు ఏం చేయాలి? మేళాలలో వాణి ద్వారా అయితే సేవ
చేస్తున్నారు కానీ ఇప్పటి సమయమనుసారముగా బాప్ దాదా ఏదైతే చెప్తూ
వస్తున్నారో, ఇంతకుముందు కూడా ఈ సేవ చేసారు - వారసులను,
ప్రసిద్ధమైన మైక్ లను తయారుచేయండి, ప్రసిద్ధమైనవారు అంటే అర్థం
వారు చెప్పినదాని ప్రభావము వినేవారిపై పడుతుంది అని, అటువంటి
మైక్ లను తయారుచేయండి. ఇటువంటి వారసుల గ్రూప్ ప్రతి సెంటరులోనూ
ఉండాలి. యు.పి.లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా!
అయితే అంతమంది వారసులను తయారుచేయాలి. ఎన్ని సెంటరులు ఉన్నాయి
మరియు ఎంతమంది వారసులు తయారయ్యారు అన్న లెక్కను తీయాలి. మరి
ఎంతమంది తయారవ్వాలో, అంతమంది తయారయ్యారా లేక తయారుచెయ్యాలా?
ఒకవేళ తయారుచెయ్యాలనుకుంటే, సమయముపై ఎటువంటి నమ్మకము లేదు.
త్వరత్వరగా వారసులను మరియు మైక్ లను తయారుచేయండి. వారి మాటల
ద్వారా అనేకమంది ఆత్మల భాగ్యరేఖ తెరుచుకోవాలి ఎందుకంటే మీరైతే
చాలా సేవ చేసారు, పాతవారు ఎవరైతే ఉన్నారో వారు చాలా సేవ చేసారు.
ఇప్పుడు సేవ చేయించండి. సేవ చేసేవారిని తయారుచేయండి. చెయ్యగలరు
కదా! టీచర్లు చేతులెత్తండి. అచ్ఛా! టీచర్లు కూడా చాలామంది
ఉన్నారు. కనుక అంతగానే తయారుచేయండి. ప్రతి ఒక్క సెంటరు,
చిన్నదైనా లేక పెద్దదైనా, సెంటరు లిస్టులో ఉన్నారంటే, తప్పకుండా
ఋజువును ఇవ్వాలి ఎందుకంటే సమయముపై ఎటువంటి నమ్మకము లేదు.
ఎప్పుడైనా, ఏమైనా అవ్వవచ్చు, అందుకే బాప్ దాదా ఏయే జోన్లు అయితే
వచ్చారో, రానివారికి కూడా, అన్ని జోన్ల వారికి ఇదే చెప్తున్నారు
- ఇప్పుడు ముందుకు వెళ్ళండి. క్లాసులైతే జరుగుతూ ఉంటాయి, సంఖ్య
కూడా పెరుగుతూ ఉంటుంది, కానీ ఇప్పుడు నిమిత్తముగా అయ్యేవారిని
తయారుచేయండి మరియు అలా తయారుచేసేందుకై బాప్ దాదా చూసారు - ప్రతి
జోనులోనూ నిమిత్తముగా అవ్వగలరు అనేటువంటి ఆత్మలు ఉన్నారు. కనుక
యు.పి. వారు ఒకటేమో భక్తుల కళ్యాణము చేయండి, భక్తులుగా
పిలవబడేవారు కొద్దిమందే ఉన్నా కానీ వారు భక్తులు కదా. వారికి
భక్తి ఫలాన్ని ఇప్పించండి. చాలా కష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ
తమ పురుషార్థములో మందుకు వెళ్తున్నారు కూడా అన్నదానిని బాప్
దాదా చూసారు, కానీ ఇప్పటికీ కూడా ముందుకు వెళ్ళేందుకు అవకాశము
ఉంది. చేస్తున్నారు. చెయ్యటము లేదు అని కాదు. చేస్తున్నారు కూడా,
కానీ మరి కొంత స్పీడ్ ను పెంచండి. మీరు మంచివారు మరియు మంచి
సేవను చేస్తున్నారు. దాదీలందరూ కూడా మీకు అభినందనలను ఇస్తారు.
పాండవులు కూడా ఎంతమంది వస్తుంటారు. పాండవులు కూడా తక్కువేమీ
కాదు. చాలా సేవలు ఎలాంటివి ఉన్నాయంటే, వాటిని పాండవులే
చెయ్యగలరు, అందుకే పాండవులకు కూడా బాప్ దాదా మరియు మధుబన్
నివాసులందరూ అభినందనలను తెలియజేస్తున్నారు. అచ్ఛా!
వరదానము:-
బుద్ధి రూపీ పాదాన్ని మర్యాదల రేఖ లోపల
ఉంచే సర్వ ప్రాప్తి సంపన్న శక్తిశాలి భవ
ఏ పిల్లలైతే బుద్ధి రూపీ పాదాన్ని
కొద్దిగా కూడా మర్యాదల రేఖను దాటి బయట పెట్టరో, వారు లక్కీగా
మరియు లవ్లీగా అవుతారు. వారికి ఎప్పుడూ ఏ విఘ్నము గాని, తుఫాను
గాని, ఆందోళన గాని, ఉదాసీనత గాని రాదు. ఒకవేళ వచ్చిందంటే,
తప్పకుండా వారి బుద్ధి రూపీ పాదము మర్యాదల రేఖను దాటి బయటకు
వచ్చిందని అర్థం. రేఖను దాటి బయటకు రావడము అనగా ఫకీరుగా అవ్వడము.
అందుకే, ఎప్పుడూ ఫకీరుగా అనగా యాచించేవారిగా కాదు, సర్వ
ప్రాప్తి సంపన్నులుగా, శక్తిశాలిగా అవ్వండి.
స్లోగన్:-
ఎవరైతే సదా అతీతముగా మరియు తండ్రికి ప్రియముగా ఉంటారో, వారు
సురక్షితముగా ఉంటారు.
అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి
సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి
దృఢత సఫలతకు తాళంచెవి. సఫలత పిల్లలైన మీ జన్మ సిద్ధ అధికారము,
అందుకే దృఢతను ఉపయోగించండి, నిర్యక్ష్యులుగా అవ్వకండి.
అయిపోతుందిలే, చేసేస్తాములే... అని ఇలా ఆలోచించకండి. దృఢ
సంకల్పముతో మనసులో వచ్చే వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేసి
విజయులుగా అవ్వండి.
|
|
|
|