ఓంశాంతి
సంగమములోనే తండ్రి వస్తారు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని
ప్రతిరోజూ పిల్లలకు చెప్పవలసి వస్తుంది. పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి అని
ఎందుకు చెప్తారు? వీరు అనంతమైన తండ్రి, వీరు ఆత్మలను చదివిస్తారు అన్నది తప్పకుండా
పిల్లలకు గుర్తుండాలని చెప్తారు. సేవ కొరకు భిన్న-భిన్న పాయింట్ల గురించి అర్థం
చేయిస్తారు. పిల్లలు అంటారు - సేవ లేదు, మేము బయట సేవ ఎలా చేయాలి? తండ్రి సేవా
యుక్తులనైతే ఎంతో సహజంగా తెలియజేస్తారు. చిత్రాలు చేతిలో ఉండాలి. రఘునాథుని నల్లని
చిత్రమూ ఉండాలి, అలాగే తెల్లని చిత్రమూ ఉండాలి. శ్రీకృష్ణుడు మరియు శ్రీనారాయణుని
తెల్లని చిత్రము కూడా ఉండాలి, నల్లని చిత్రము కూడా ఉండాలి. అవి చిన్న చిత్రాలైనా
ఫర్వాలేదు. శ్రీకృష్ణుని చిత్రాలు చాలా చిన్నవి కూడా తయారుచేస్తారు. మీరు
మందిరాలలోని పూజారులను అడుగవచ్చు - వీరు వాస్తవానికి తెల్లగా ఉండేవారు కదా, మరి
వీరిని నల్లగా ఎందుకు తయారుచేసారు? వాస్తవానికి శరీరమైతే నల్లగా ఉండదు కదా. మీ వద్ద
చాలా మంచి తెల్ల-తెల్లని చిత్రాలు కూడా ఉంటాయి, కానీ వీరిని నల్లగా ఎందుకు
తయారుచేసారు? ఆత్మ ఏ విధంగా భిన్న-భిన్న నామరూపాలను ధారణ చేస్తూ కిందకు దిగుతుంది
అనైతే పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. ఎప్పటి నుండైతే ఆత్మ కామచితిపైకి
ఎక్కుతుందో, అప్పటి నుండి నల్లగా అవుతుంది. జగన్నాథుడు మరియు శ్రీనాథుని ద్వారములో
ఎందరో యాత్రికులు ఉంటారు, మీకు ఆహ్వానాలు కూడా లభిస్తాయి. వారికి చెప్పండి - మేము
శ్రీనాథుని 84 జన్మల జీవిత కథను వినిపిస్తాము, సోదరీ-సోదరులారా వచ్చి వినండి.
ఇటువంటి భాషణను ఇంకెవరూ చేయలేరు. వీరు నల్లగా ఎందుకు అయ్యారు అనేది మీరు అర్థం
చేయించగలరు. ప్రతి ఒక్కరూ పావనము నుండి పతితముగా తప్పకుండా అవ్వాలి. దేవతలు
ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్ళారో, అప్పుడు వారిని నల్లగా తయారుచేసారు. కామచితిపై
కూర్చోవడం వలన ఇనుప యుగము వారిగా అయిపోతారు. ఇనుము రంగు నల్లగా ఉంటుంది, బంగారము
గోల్డెన్ గా ఉంటుంది, అక్కడి వారిని తెల్లనివారు అని అంటారు. వారే మళ్ళీ 84 జన్మల
తర్వాత నల్లగా అవుతారు. మెట్ల చిత్రము కూడా తప్పకుండా చేతిలో ఉండాలి. మెట్ల చిత్రం
కూడా పెద్దగా ఉన్నట్లయితే ఎవరైనా దూరం నుండే మంచి రీతిలో చూడగలుగుతారు, అప్పుడు -
భారత్ యొక్క పరిస్థితి ఇలా ఉందని మీరు అర్థం చేయించగలుగుతారు. ఉన్నతి మరియు పతనము
అని కూడా వ్రాయబడి ఉంది. పిల్లలకు సేవ పట్ల ఎంతో అభిరుచి ఉండాలి. ఈ ప్రపంచ చక్రము
ఎలా తిరుగుతుంది అన్నది అర్థం చేయించాలి, బంగారు యుగము, వెండి యుగము, రాగి యుగము...
ఆ తర్వాత ఈ పురుషోత్తమ సంగమయుగాన్ని కూడా చూపించాలి. ఎక్కువ చిత్రాలేమీ
తీసుకువెళ్ళకండి. భారత్ కొరకు మెట్ల చిత్రమైతే ముఖ్యమైనది. ఇప్పుడు మళ్ళీ పతితుల
నుండి పావనులుగా వారు ఎలా అవ్వగలరు అన్నది మీరు అర్థం చేయించవచ్చు. పతితపావనుడు
ఒక్క తండ్రే. వారిని స్మృతి చేయడం ద్వారా క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. పిల్లలైన
మీలో ఈ జ్ఞానమంతా ఉంది. మిగిలినవారంతా అజ్ఞాన నిద్రలో నిదురించి ఉన్నారు. భారత్
జ్ఞానంలో ఉన్నప్పుడు చాలా సంపన్నముగా ఉండేది. ఇప్పుడు భారత్ అజ్ఞానంలో ఉంది కావున
ఎంత నిరుపేదగా ఉంది. జ్ఞానీ మనుష్యులు మరియు అజ్ఞానీ మనుష్యులు ఉంటారు కదా.
దేవీ-దేవతలు మరియు మనుష్యులు ఎంతో ప్రసిద్ధమైనవారు. దేవతలు సత్య-త్రేతాయుగాలలో,
మనుష్యులు ద్వాపర-కలియుగాలలో ఉంటారు. సేవ ఎలా చేయాలి అని పిల్లల బుద్ధిలో ఎల్లప్పుడూ
ఉండాలి. అది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. అర్థం చేయించడానికి మెట్ల చిత్రము
చాలా బాగుంటుంది. తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారములో ఉండండి. శరీర నిర్వహణ కొరకు
వ్యాపారాలు మొదలైనవైతే చేయాల్సిందే. స్థూల చదువును కూడా చదవాలి. మిగిలిన సమయమేదైతే
లభిస్తుందో, ఆ సమయంలో - మేము ఇతరుల కళ్యాణాన్ని ఎలా చేయాలి అని సేవ గురించి
ఆలోచించాలి. ఇక్కడైతే మీరు అనేకుల కళ్యాణాన్ని చేయలేరు. ఇక్కడికి మీరు వచ్చేదే బాబా
మురళి వినడానికి. ఇందులోనే ఇంద్రజాలం ఉంది. బాబాను ఇంద్రజాలికుడు అని అంటారు కదా.
మీ మురళిలో ఇంద్రజాలము ఉంది... అని పాడుతారు కూడా. మీ నోటి ద్వారా ఏ మురళి అయితే
మ్రోగుతుందో, అందులో ఇంద్రజాలముంది. దాని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు.
ఒక్క తండ్రి తప్ప ఇటువంటి ఇంద్రజాలికులు ఇంకెవరూ ఉండరు. మనుష్యుల నుండి దేవతలుగా
తయారుచేయడానికి భగవంతుడికి ఎంతో సమయము పట్టదు అన్న గాయనం కూడా ఉంది. పాత ప్రపంచం
కొత్త ప్రపంచంగా తప్పకుండా అవ్వాలి. పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా తప్పకుండా
జరగాలి. ఈ సమయంలో మీరు రాజయోగాన్ని నేర్చుకుంటారు, కావున తప్పకుండా రాజులుగా కూడా
అవ్వాలి. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు - 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి నంబరు
జన్మ కావాలి ఎందుకంటే ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళికము రిపీట్ అవుతుంది.
సత్య-త్రేతాయుగాలు ఏవైతే ఒకప్పుడు ఉండేవో, అవి మళ్ళీ తప్పకుండా రిపీట్ అవ్వాలి.
మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా - మేము తిరిగి వెళ్తాము మళ్ళీ సతోప్రధాన
దేవీ-దేవతలుగా అవుతాము అన్నది బుద్ధిలో గుర్తుండాలి. వారిని దేవతలు అని అంటారు.
ఇప్పుడు మనుష్యులలో దైవీ గుణాలు లేవు, కావున మీరు ఎక్కడైనా సేవ చేయవచ్చు. ఎంతగా
వ్యాపారాలు మొదలైనవి ఉన్నా కానీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా సంపాదన చేసుకుంటూ
ఉండాలి. ఇందులో ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది. పవిత్రత ఉంటే శాంతి ఉంటుంది,
సమృద్ధిగా ఉంటారు. మీరు పూర్తిగా పవిత్రంగా అయిపోతే, ఇక్కడ ఇక ఉండలేరు ఎందుకంటే మనం
శాంతిధామానికి తప్పకుండా వెళ్ళాలి. ఆత్మ పవిత్రంగా అయిపోతే, ఇక ఈ పాత శరీరంలో ఉండదు.
ఇది అపవిత్రమైనది కదా. 5 తత్వాలే అపవిత్రంగా ఉన్నాయి. శరీరము కూడా వీటితోనే
తయారవుతుంది. దీనిని మట్టిబొమ్మ అని అంటారు. 5 తత్వాల శరీరము ఒకటి అంతమవుతుంది,
ఇంకొకటి తయారవుతుంది. ఆత్మ అయితే అలాగే ఉంటుంది. ఆత్మ తయారుచేయబడిన వస్తువేమీ కాదు.
శరీరము మొదట ఎంత చిన్నగా ఉంటుంది, ఆ తర్వాత ఎంత పెద్దగా అవుతుంది. ఎన్ని
కర్మేంద్రియాలు లభిస్తాయి, తద్వారా ఆత్మ పూర్తి పాత్రనంతటినీ అభినయిస్తుంది. ఈ
ప్రపంచమే అద్భుతమైనది. అందరికన్నా అద్భుతమైనవారు తండ్రి, వారు ఆత్మల పరిచయాన్ని
ఇస్తారు. ఆత్మలమైన మనం ఎంత చిన్నగా ఉన్నాము. ఆత్మ ప్రవేశిస్తుంది. ప్రతి ఒక్కటీ
అద్భుతమైనదే. జంతువుల శరీరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి, ఇది అద్భుతం కదా.
అన్నింటిలోనూ ఆత్మ అదే విధంగా చిన్నగా ఉంటుంది. ఏనుగు ఎంత పెద్దది, దానిలో ఇంత
చిన్నని ఆత్మ వెళ్ళి కూర్చుంటుంది. తండ్రి అయితే మనుష్య జన్మకు సంబంధించిన విషయాన్ని
అర్థం చేయిస్తారు. మనుష్యులు ఎన్ని జన్మలను తీసుకుంటారు? 84 లక్షల జన్మలైతే లేవు.
ఎన్ని ధర్మాలు ఉన్నాయో, అన్ని వెరైటీల వారు ఉంటారని అర్థం చేయించారు. ప్రతి ఒక్క
ఆత్మ ఎన్ని రూపురేఖల కల శరీరాలను తీసుకుంటుంది, అద్భుతం కదా. మళ్ళీ ఎప్పుడైతే చక్రం
రిపీట్ అవుతుందో, అప్పుడు ప్రతి జన్మలోనూ రూపురేఖలు, పేరు మొదలైనవన్నీ మారిపోతాయి.
నల్లని కృష్ణుడు, తెల్లని కృష్ణుడు అని అనరు. అలా కాదు, వారి ఆత్మ మొదట తెల్లగా
ఉండేది, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ నల్లగా అవుతుంది. మీ ఆత్మ కూడా
భిన్న-భిన్న రూపురేఖలతో, భిన్న-భిన్న శరీరాలను తీసుకొని పాత్రను అభినయిస్తుంది. ఇది
కూడా డ్రామా.
పిల్లలైన మీకు ఎప్పుడూ ఎటువంటి చింత ఉండకూడదు. అందరూ పాత్రధారులే. ఒక శరీరాన్ని
వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుని మళ్ళీ పాత్రను అభినయించాల్సిందే. ప్రతి జన్మలో
సంబంధాలు మొదలైనవి మారిపోతాయి. కావున తండ్రి అర్థం చేయిస్తారు - ఇది తయారై
తయారుచేయబడిన డ్రామా. ఆత్మయే 84 జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ తమోప్రధానంగా అయ్యింది,
ఇప్పుడు మళ్ళీ ఆత్మ సతోప్రధానంగా అవ్వాలి. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. పావన
సృష్టి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది, మళ్ళీ పావనంగా అవ్వాలి. సతోప్రధానము,
తమోప్రధానము అన్న పదాలైతే ఉన్నాయి కదా. సతోప్రధాన సృష్టి తర్వాత సతో, రజో, తమోగా
అవుతుంది. ఇప్పుడు ఎవరైతే తమోప్రధానముగా అయ్యారో, వారే మళ్ళీ సతోప్రధానముగా ఎలా
అవ్వాలి? పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి? వర్షపు నీటితోనైతే పావనంగా అవ్వరు.
వర్షాల కారణంగా మనుష్యులు చనిపోతారు కూడా. వరదలు వస్తే ఎంతమంది మునిగిపోతారు.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - ఈ ఖండాలేవీ ఉండవు. ప్రకృతి వైపరీత్యాలు కూడా
సహాయం చేస్తాయి, ఎంతమంది మనుష్యులు, జంతువులు ప్రవాహంలో కొట్టుకుపోతారు. నీటితో
పావనంగా అవుతారని కాదు, ఆ ప్రవాహంలో శరీరాలు కొట్టుకుపోతాయి. శరీరాలు పతితము నుండి
పావనంగా అవ్వాలని కాదు కదా. పావనంగా అవ్వాల్సింది ఆత్మ. పతితపావనుడు ఒక్క తండ్రే.
వారు తమను తాము జగద్గురువులుగా పిలుచుకుంటారు కానీ గురువు పని సద్గతిని ఇవ్వడము, ఆ
సద్గతిదాత అయితే ఒక్క తండ్రే. సద్గురువు అయిన తండ్రే సద్గతిని ఇస్తారు. తండ్రి అయితే
ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు, వీరు కూడా వింటారు కదా. గురువులు కూడా తమ శిష్యులకు
నేర్పించడానికి వారిని వారి పక్కన కూర్చోబెట్టుకుంటారు. వీరు కూడా వారి పక్కన
కూర్చుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, అలాగే వీరు కూడా అర్థం చేయిస్తూ ఉండవచ్చు కదా,
అందుకే గురువు అయిన బ్రహ్మా నంబరువన్ లోకి వెళ్తారు. శంకరుడు కళ్ళు తెరవడంతో భస్మం
చేసేస్తారు అని వారి గురించి అంటారు, మరి వారిని గురువు అని అనడానికి లేదు. అందుకే
తండ్రి అంటారు - పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి. కొంతమంది పిల్లలు అడుగుతారు
- ఇన్ని వ్యాపార-వ్యవహారాల చింతలో ఉంటూ, మేము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని
ఎలా స్మృతి చేయాలి? తండ్రి అర్థం చేయిస్తారు - భక్తి మార్గంలో కూడా మీరు, ఓ ఈశ్వరా,
ఓ భగవంతుడా అని అంటూ తలచుకుంటారు కదా. ఎప్పుడైనా ఏదైనా దుఃఖము కలిగినప్పుడు స్మృతి
చేస్తారు. మరణించే సమయంలో కూడా రామ-రామ అని పలకమని చెప్తారు. రామ నామాన్ని దానం చేసే
సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఏ విధముగా మీరు జ్ఞాన దానం చేస్తారో, అలా వారు - రామా-రామా
అని పలకమని చెప్తారు. మీరు కూడా శివబాబాను స్మృతి చేయండి అని అంటారు. వారికైతే
శివుని గురించి తెలియనే తెలియదు. ఏదో అలా రామ-రామ అని అనేస్తారు. మరి పరమాత్మ
అందరిలో ఉన్నప్పుడు, రామ-రామ అని అనమని కూడా ఎందుకు అంటారు? తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తారు - రాముడిని లేక కృష్ణుడిని పరమాత్మ అని అనరు, వారిని దేవతలు అని అనడం
జరుగుతుంది, వారి కళలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ప్రతి వస్తువు యొక్క కళలు తగ్గిపోతూ
ఉంటాయి. వస్త్రం కూడా మొదట కొత్తగా ఉంటుంది, ఆ తర్వాత పాతబడిపోతుంది.
తండ్రి ఇన్ని విషయాలను అర్థం చేయిస్తారు, అర్థం చేయించిన తర్వాత కూడా వారంటారు -
నా మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలూ, స్మయాన్ని ఆత్మగా భావించండి.
స్మరిస్తూ-స్మరిస్తూ సుఖాన్ని పొందండి. ఇక్కడైతే ఇది దుఃఖధామము. తండ్రిని మరియు
వారసత్వాన్ని స్మృతి చేయండి. స్మృతి చేస్తూ-చేస్తూ అపారమైన సుఖాన్ని పొందుతారు.
కలహ-క్లేశాలు, అనారోగ్యము మొదలైనవేవైతే ఉన్నాయో, అన్నీ తొలగిపోతాయి. మీరు 21 జన్మల
కొరకు నిరోగులుగా అవుతారు. కలహ-క్లేశాలు, శారీరక అనారోగ్యము అన్నీ తొలగిపోతాయి,
జీవన్ముక్త పదవిని పొందుతారు. అలా అంటూ ఉంటారు కానీ ఆచరణలోకి తీసుకురారు. తండ్రి
ప్రాక్టికల్ గా అర్థం చేయిస్తారు - తండ్రిని స్మరించినట్లయితే మీ మనోకామనలన్నీ
పూర్తవుతాయి, సుఖవంతులుగా అవుతారు. శిక్షలను అనుభవించి చిన్న పదవిని పొందడం (శిక్షలను
అనుభవించి రొట్టె ముక్కను తినడం) మంచిది కాదు. అందరికీ తాజా రొట్టెలు నచ్చుతాయి. ఈ
రోజుల్లోనైతే నూనెను ఉపయోగించడం జరుగుతుంది. అక్కడైతే నేతి నదులు ప్రవహిస్తాయి.
కావున పిల్లలు తండ్రిని స్మరించాలి. ఇక్కడ కూర్చుని తండ్రిని స్మృతి చేయండి అని కూడా
బాబా అనరు. అలా కాదు, నడుస్తూ-తిరుగుతూ, విహరిస్తూ శివబాబాను స్మృతి చేయాలి.
ఉద్యోగాలు మొదలైనవి కూడా చేయాలి. తండ్రి స్మృతి బుద్ధిలో ఉండాలి. లౌకిక తండ్రి
యొక్క పిల్లలు ఉద్యోగం మొదలైనవి చేసినప్పుడు కూడా తండ్రి అయితే గుర్తు ఉంటారు కదా.
ఎవరైనా అడిగితే వెంటనే - వారు ఎవరి పిల్లలు అనేది చెప్తారు. బుద్ధిలో తండ్రి ఆస్తి
కూడా గుర్తు ఉంటుంది. మీరు కూడా తండ్రికి పిల్లలుగా అయ్యారు కావున ఆస్తి కూడా
గుర్తుంది. తండ్రిని స్మృతి చేయాలి, ఇంకెవ్వరితోనూ సంబంధాలు ఉండకూడదు. ఆత్మలోనే
మొత్తం పాత్ర అంతా రచించబడి ఉంది, అది ఇమర్జ్ అవుతుంది. ఈ బ్రాహ్మణ కులంలో
కల్పకల్పమూ మీ పాత్ర ఏదైతే నడిచిందో, అదే ఇమర్జ్ అవుతూ ఉంటుంది. తండ్రి అర్థం
చేయిస్తారు - భోజనం తయారుచేయండి, మిఠాయిలను తయారుచేయండి, శివబాబాను స్మృతి చేస్తూ
ఉండండి. శివబాబాను స్మృతి చేస్తూ తయారుచేసినట్లయితే, ఆ మిఠాయిలు తినేవారి యొక్క
కళ్యాణం కూడా జరుగుతుంది. ఒక్కోచోట సాక్షాత్కారాలు కూడా జరుగవచ్చు. బ్రహ్మా
సాక్షాత్కారము కూడా జరుగవచ్చు. శుద్ధమైన భోజనాన్ని స్వీకరించినట్లయితే బ్రహ్మా
యొక్క సాక్షాత్కారాన్ని, శ్రీకృష్ణుడి సాక్షాత్కారాన్ని, శివుని సాక్షాత్కారాన్ని
పొందవచ్చు. బ్రహ్మా ఇక్కడ ఉన్నారు. బ్రహ్మాకుమారీ-కుమారుల పేరైతే ప్రసిద్ధమవుతుంది
కదా. అనేకులకు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మీరు తండ్రిని స్మృతి
చేస్తారు కదా. తండ్రి ఎన్నో యుక్తులను తెలియజేస్తారు. వారు నోటితో రామ-రామ అని
అంటారు, మీరు నోటితో ఏమీ అనకూడదు. ఏ విధంగా వారు గురు నానక్ కు భోగ్
అర్పిస్తున్నామని భావిస్తారో, అలాగే మీరు కూడా - మేము శివబాబాకు భోగ్ ను
అర్పించడానికి తయారుచేస్తున్నాము అని భావిస్తారు. శివబాబాను స్మృతి చేస్తూ
తయారుచేసినట్లయితే అనేకుల కళ్యాణం జరుగగలదు. ఆ భోజనంలో శక్తి నిండుతుంది, అందుకే
భోజనం తయారుచేసేవారికి కూడా బాబా అడుగుతారు - మీరు శివబాబాను స్మృతి చేస్తూ భోజనం
తయారుచేస్తున్నారా? శివబాబా గుర్తు ఉన్నారా అని కూడా వ్రాయబడి ఉంది. స్మృతిలో ఉంటూ
తయారుచేసినట్లయితే తినేవారికి కూడా శక్తి లభిస్తుంది, హృదయం శుద్ధమవుతుంది. బ్రహ్మా
భోజనం గురించి చెప్తూ ఉంటారు కదా. బ్రాహ్మణుల ద్వారా తయారుచేయబడిన భోజనాన్ని దేవతలు
కూడా ఇష్టపడతారు. ఇది కూడా శాస్త్రాలలో ఉంది. బ్రాహ్మణుల ద్వారా తయారుచేయబడిన
భోజనాన్ని తినడంతో బుద్ధి శుద్ధమవుతుంది, అందులో శక్తి ఉంటుంది. బ్రహ్మా భోజనానికి
ఎంతో మహిమ ఉంది. ఎవరికైతే బ్రహ్మా భోజనం పట్ల గౌరవం ఉంటుందో, వారు పళ్ళాన్ని కడిగి
ఆ నీరును కూడా తాగుతారు. దానిని చాలా ఉన్నతంగా భావిస్తారు. భోజనం లేకుండానైతే
ఉండలేరు. కరువు వచ్చినప్పుడు భోజనం లేక చనిపోతారు. ఆత్మయే భోజనం తింటుంది, ఈ
ఇంద్రియాల ద్వారా రుచి చూస్తుంది. బాగుంది-బాగోలేదు, ఇది చాలా రుచికరంగా ఉంది,
శక్తివంతమైనది అని ఆత్మయే అంటుంది కదా. మున్ముందు మీరు ఎంతగా ఉన్నతిని పొందుతూ
ఉంటారో, అలా భోజనం కూడా మీకు అటువంటిదే లభిస్తూ ఉంటుంది, అందుకే శివబాబాను స్మృతి
చేస్తూ భోజనం తయారుచేయండి అని పిల్లలకు చెప్పడం జరుగుతుంది. తండ్రి ఏదైతే అర్థం
చేయిస్తారో, దానిని అమలులోకి తీసుకురావాలి కదా.
ఇప్పుడు మీరు పుట్టినింటిలో ఉన్నారు, తర్వాత అత్తవారింటికి వెళ్తారు.
సూక్ష్మవతనంలో కూడా ఒకరినొకరు కలుసుకుంటారు. భోగ్ తీసుకువెళ్తారు. దేవతలకు భోగ్ ను
అర్పిస్తారు కదా. దేవతలు అక్కడకు వస్తారు, బ్రాహ్మణులైన మీరు అక్కడకు వెళ్తారు.
అక్కడ సభ జరుగుతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.