02-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - అన్నింటికన్నా మధురమైన పదము ‘బాబా’,
మీ నోటి నుండి సదా బాబా-బాబా అని వెలువడుతూ ఉండాలి, అందరికీ శివబాబా పరిచయాన్ని
ఇస్తూ ఉండండి’’
ప్రశ్న:-
సత్యయుగములో మనుష్యులే కాదు, జంతువులు కూడా రోగగ్రస్థముగా అవ్వవు, ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే
సంగమయుగములో బాబా సర్వాత్మలకు మరియు అనంతమైన సృష్టికి ఎటువంటి ఆపరేషన్ చేస్తారంటే,
తద్వారా రోగము యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. తండ్రి అవినాశీ సర్జన్. ఇప్పుడు మొత్తం
సృష్టి అంతా రోగగ్రస్థముగా ఉంది, ఈ సృష్టిలో ఇకపై దుఃఖము యొక్క నామ-రూపాలు ఉండవు.
ఇక్కడి దుఃఖాల నుండి రక్షించుకునేందుకు చాలా-చాలా ధైర్యవంతులుగా అవ్వాలి.
పాట:-
మిమ్మల్ని
పొంది మేము..
ఓంశాంతి
రెండు సార్లు కూడా చెప్పవచ్చు, డబల్ ఓం శాంతి. ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది.
ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. నా నివాస స్థానము శాంతిధామములో ఉంది మరియు బాబాకు
మనమంతా సంతానము. ఆత్మలందరూ ఓం అని అంటారు, అక్కడ మనమంతా పరస్పరము సోదరులము, మళ్ళీ
ఇక్కడ సోదరీ-సోదరులుగా అవుతాము. ఇప్పుడు సోదరీ-సోదరుల సంబంధముతో ప్రారంభమవుతుంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, అందరూ నా సంతానమే, బ్రహ్మాకు కూడా మీరు సంతానమే,
అందుకే పరస్పరము సోదరీ-సోదరులు అవుతారు. మీకు వేరే ఏ సంబంధమూ లేదు. ప్రజాపితకు
సంతానము బ్రహ్మాకుమార-కుమారీలు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు తండ్రి ఈ
సమయములోనే వస్తారు. తండ్రి బ్రహ్మా ద్వారానే మళ్ళీ కొత్త సృష్టిని రచిస్తారు.
బ్రహ్మాతో కూడా సంబంధముంది కదా. యుక్తి కూడా ఎంత బాగుంది. అందరూ
బ్రహ్మాకుమార-కుమారీలు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి మరియు
పరస్పరము సోదరీ-సోదరులుగా భావించాలి. అపవిత్ర దృష్టి ఉండకూడదు. ఇక్కడైతే
కుమార-కుమారీలు పెద్దవారయ్యే కొద్ది దృష్టి అపవిత్రముగా అవుతూ ఉంటుంది, ఇక తర్వాత
అపవిత్రమైన కర్మలు చేస్తారు. అపవిత్రమైన కర్మలు రావణ రాజ్యములో జరుగుతాయి.
సత్యయుగములో అపవిత్రమైన కర్మలు జరగవు. అపవిత్రత అన్న పదమే ఉండదు. ఇక్కడైతే
అపవిత్రమైన కర్మలు చాలా జరుగుతాయి. వారి కోసమని కోర్టులు మొదలైనవి కూడా ఉన్నాయి.
అక్కడ కోర్టులు మొదలైనవి ఉండవు. అద్భుతము కదా. జైళ్ళు ఉండవు, పోలీసులు ఉండరు, దొంగలు
మొదలైనవారుండరు. ఇక్కడ జరుగుతూ ఉన్న ఇవన్నీ దుఃఖపు విషయాలు, అందుకే ఇది సుఖము మరియు
దుఃఖము, గెలుపు మరియు ఓటమి యొక్క ఆట అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. దీనిని
కూడా మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మాయతో ఓడిపోతే ఓటమి అని అంటూ ఉంటారు, తండ్రి
వచ్చి అర్ధకల్పము కొరకు మాయపై విజయాన్ని అందిస్తారు, మళ్ళీ అర్ధకల్పము ఓడిపోవలసి
ఉంటుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది సాధారణమైన పైసకు విలువ చేసే ఆట, మళ్ళీ మీరు
నన్ను స్మృతి చేస్తే అర్ధకల్పము కొరకు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. రావణ
రాజ్యములో మీరు నన్ను మర్చిపోతారు. రావణుడు శత్రువు, అతడిని ప్రతి సంవత్సరము
భారతవాసులే కాలుస్తారు. ఏ దేశములోనైతే చాలామంది భారతవాసులుంటారో అక్కడ కూడా కాలుస్తూ
ఉండవచ్చు. ఇది భారతవాసుల ధర్మ ఉత్సవమని అంటారు. దసరాను జరుపుకునేటప్పుడు - అది హద్దు
యొక్క విషయమని పిల్లలు అర్థం చేయించాలి. రావణ రాజ్యమైతే ఇప్పుడు మొత్తం
విశ్వమంతటిపైనా ఉంది, కేవలం లంకపై మాత్రమే లేదు. విశ్వము అయితే చాలా పెద్దది కదా.
తండ్రి అర్థం చేయించారు, ఈ సృష్టి అంతా సాగరముపై నిలబడి ఉంది. మనుష్యులేమంటారంటే -
భూమి క్రింద ఒక నంది లేక ఆవు ఉంది, దాని కొమ్ముపై సృష్టి నిలబడి ఉంది, అది అలసిపోతే
కొమ్ము మారుస్తుంది అని. వాస్తవానికి అటువంటి విషయమేమీ లేదు. భూమి అనేది నీటిపై
నిలబడి ఉంది, నలువైపులా నీరే నీరు ఉంది. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటిలోనూ రావణ
రాజ్యము ఉంది, మళ్ళీ రామ రాజ్యాన్ని లేక ఈశ్వరీయ రాజ్యాన్ని స్థాపన చేసేందుకు తండ్రి
రావలసి ఉంటుంది. కేవలం ఈశ్వరుడు అని అన్నా సరే, ఈశ్వరుడు సర్వశక్తివంతుడు, అన్నీ
చేయగలరు అని అంటారు. ఇది అవసరము లేని మహిమ. అంతటి ప్రేమ ఉండదు. ఇక్కడ ఈశ్వరుడిని
తండ్రి అని అంటారు. తండ్రి అని అనడముతో వారసత్వము లభించే విషయము ఉంటుంది. ఎల్లప్పుడూ
బాబా-బాబా అని అంటూ ఉండాలి అని శివబాబా అంటారు. ఈశ్వరుడు లేక ప్రభువు మొదలైన పదాలను
మర్చిపోవాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా చెప్పారు. ప్రదర్శినీ
మొదలైనవాటిలో కూడా అర్థం చేయించేటప్పుడు పదే-పదే శివబాబా పరిచయాన్ని ఇవ్వండి.
శివబాబా ఒక్కరే ఉన్నతోన్నతమైనవారు, వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. బాబా అన్న పదము
అన్నిటికన్నా మధురమైనది. శివబాబా, శివబాబా అని నోటి నుండి వెలువడుతుంది. ఇక్కడ నోరు
అంటే మనుష్యులదే కదా. ఇక్కడ ఇది గోవు ముఖము అని కాదు కదా. మీరు శివశక్తులు. మీ ముఖ
కమలము నుండి జ్ఞానామృతము వెలువడుతుంది. మీ పేరును ప్రసిద్ధము చేసేందుకు గోముఖము అని
అన్నారు. గంగ కోసం ఇలా అనరు. ముఖ కమలము నుండి అమృతము ఇప్పుడే వెలువడుతుంది.
జ్ఞానామృతము తాగిన తర్వాత ఇక విషాన్ని తాగలేరు. అమృతము తాగడముతో మీరు దేవతలుగా
అవుతారు. ఇప్పుడు నేను అసురులను దేవతలుగా తయారుచేసేందుకు వచ్చాను. మీరు ఇప్పుడు దైవీ
సాంప్రదాయులుగా అవుతున్నారు. సంగమయుగము ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇది కూడా
ఎవ్వరికీ తెలియదు. మీకు తెలుసు, బ్రహ్మాకుమార-కుమారీలైన మనము పురుషోత్తమ
సంగమయుగవాసులము, మిగిలినవారెవరైతే ఉన్నారో, అంతా కలియుగవాసులు. మీరు ఎంత కొద్దిమంది
ఉన్నారు. వృక్షము యొక్క జ్ఞానము కూడా మీకు ఉంది. వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది, ఆ
తర్వాత వృద్ధి చెందుతుంది. జనాభా సంఖ్యను నియంత్రించాలని ఎన్ని పరిశోధనలు చేస్తూ
ఉంటారు. కానీ నరుడు ఒకటి కోరుకుంటే, జరిగేది వేరొకటి. అందరి మృత్యువు జరగాల్సిందే.
ఇప్పుడు పంటలు బాగా పండుతాయి, కానీ వర్షము కురిస్తే ఎంత నష్టము కలిగిస్తుంది.
ప్రకృతి వైపరీత్యాలనైతే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. దేని పైనా నమ్మకము లేదు. ఎక్కడైనా
పంటలు పండిన తర్వాత వడగళ్ళు కురిస్తే ఎంత నష్టము జరుగుతుంది. వర్షము కురవకపోయినా
నష్టమే, వీటినే ప్రాకృతిక ఆపదలని అంటారు. ఇవైతే చాలా జరిగేది ఉంది, వీటి నుండి
రక్షించుకునేందుకు చాలా ధైర్యవంతులుగా ఉండాలి. ఎవరికైనా ఆపరేషన్ జరుగుతుంటే,
చాలామంది అది చూడలేకపోతారు, చూడడముతోనే స్పృహ కోల్పోతారు. ఇప్పుడు ఈ మొత్తం ఛీ-ఛీ
సృష్టికి ఆపరేషన్ జరగనున్నది. తండ్రి అంటారు, నేను వచ్చి అందరికీ ఆపరేషన్ చేస్తాను.
మొత్తం సృష్టి అంతా రోగగ్రస్థముగా ఉంది. అవినాశీ సర్జన్ అన్న పేరు కూడా తండ్రికే
ఉంది. వారు విశ్వమంతటికీ ఆపరేషన్ చేస్తారు, ఇక తర్వాత విశ్వములో ఉండేవారికి ఎప్పుడూ
దుఃఖము కలుగదు. వారు ఎంత గొప్ప సర్జన్. వారు ఆత్మలకు కూడా ఆపరేషన్ చేస్తారు,
అనంతమైన సృష్టికి కూడా ఆపరేషన్ చేసేవారు. అక్కడ మనుష్యులే కాదు, జంతువులు కూడా
రోగగ్రస్థముగా ఉండవు. తమ పాత్ర మరియు పిల్లల పాత్ర ఏమిటి అనేది తండ్రి అర్థం
చేయిస్తున్నారు. దీనినే రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము అని అంటారు, దీనిని మీరే
తీసుకుంటున్నారు. పిల్లలకు మొట్టమొదట ఈ సంతోషము ఉండాలి.
ఈ రోజు సద్గురువారము, ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి. వ్యాపారములో కూడా సత్యము
మాట్లాడండి, మోసము చేసే మాటలు మాట్లాడకండి అని అంటారు కదా. అయినా కూడా లోభములోకి
వచ్చి కొంచెం ఎక్కువ ధర చెప్పి వ్యాపారము చేస్తారు. సత్యమునైతే ఎవ్వరూ ఎప్పుడూ
చెప్పరు. అసత్యమే అసత్యము చెప్తారు, అందుకే సత్యమైనవారిని స్మృతి చేస్తారు. సత్యము
యొక్క నామము తోడుగా ఉండాలని అంటారు కదా. సత్యమైన బాబా మాత్రమే ఆత్మలైన మనతో పాటు
వస్తారని మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు సత్యమైనవారితో ఆత్మలైన మీకు సాంగత్యము
ఏర్పడింది, కావున మీరే వారితోపాటు వెళ్తారు. శివబాబా వచ్చి ఉన్నారని, వారిని సత్యము
అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. వారు ఆత్మలైన మనల్ని పవిత్రముగా తయారుచేసి
ఒకేసారి తమతోపాటు తీసుకువెళ్తారు. సత్యయుగములో రామ నామము తోడుగా ఉండాలి లేక సత్యము
యొక్క నామము తోడుగా ఉండాలని అనరు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను పిల్లలైన మీ వద్దకు
వచ్చాను, నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తాను. ఈ కళ్ళ విషయము కాదు, అది మూడవ
నేత్రము. ఈ సమయములో తండ్రి వచ్చారని, వారితోపాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు.
శంకరుని ఊరేగింపు కాదు, ఇది శివుని పిల్లల ఊరేగింపు. వారు పతులకే పతి కూడా. మీరంతా
వధువులు, నేను వరుడిని, మీరంతా ప్రేయసులు, నేను ప్రియుడిని అని అంటారు. ప్రియుడు
ఒక్కరే ఉంటారు కదా. మీరు అర్ధకల్పము నుండి ప్రియుడినైన నాకు ప్రేయసులు. ఇప్పుడు నేను
వచ్చాను. అందరూ భక్తురాళ్ళే. భక్తులను రక్షించేవారు భగవంతుడు. ఆత్మ శరీరముతో పాటు
భక్తి చేస్తుంది. సత్య, త్రేతాయుగాలలో భక్తి ఉండదు. భక్తి ఫలాన్ని సత్యయుగములో
అనుభవిస్తారు, దానిని ఇప్పుడు పిల్లలకు ఇస్తున్నాను. వారు మీ ప్రియుడు, వారు
మిమ్మల్ని వారితోపాటు తీసుకువెళ్తారు, ఆ తర్వాత మీరు మీ పురుషార్థమనుసారముగా వెళ్ళి
రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. ఇది ఎక్కడా వ్రాసి లేదు. శంకరుడు పార్వతికి అమరకథను
వినిపించారని అంటారు. మీరంతా పార్వతులు. నేను కథను వినిపించే అమరనాథుడను. అమరనాథుడు
అని ఒక్కరినే అంటారు. ఉన్నతోన్నతమైనవారు తండ్రి, వారికి తమదంటూ దేహము లేదు.
అమరనాథుడినైన నేను పిల్లలైన మీకు అమరకథను వినిపిస్తాను అని అంటారు. శంకరుడు, పార్వతి
ఇక్కడకు ఎక్కడ నుండి వస్తారు. వారు సూక్ష్మవతనములోనే ఉంటారు, అక్కడ సూర్య-చంద్రుల
ప్రకాశము కూడా ఉండదు.
సత్యమైన తండ్రి ఇప్పుడు మీకు సత్యమైన కథను వినిపిస్తున్నారు. తండ్రి తప్ప
సత్యమైన కథను ఎవ్వరూ వినిపించలేరు. వినాశనమవ్వడానికి సమయము పడుతుందని కూడా మీకు
తెలుసు. ఇది ఎంత పెద్ద ప్రపంచము, ఎన్ని భవనాలు మొదలైనవన్నీ పడిపోయి అంతమైపోతాయి.
భూకంపాలలో ఎంత నష్టము జరుగుతుంది, ఎంతమంది మరణిస్తారు. ఇకపోతే మీ చిన్న వృక్షము
మిగిలి ఉంటుంది. ఢిల్లీ పరిస్తాన్ గా అవుతుంది. ఒక్క పరిస్తాన్ లోనే
లక్ష్మీ-నారాయణుల రాజ్యము నడుస్తుంది. ఎన్ని పెద్ద-పెద్ద భవనాలు తయారవుతూ ఉండవచ్చు.
అనంతమైన ఆస్తి లభిస్తుంది. మీరు ఖర్చు పెట్టవలసిన అవసరమేమీ ఉండదు. బాబా అంటారు, వీరి
(బ్రహ్మా) కాలములోనే ధాన్యము ఎంత చవకగా ఉండేది, మరి సత్యయుగములో ఇంకెంత చవకగా
ఉంటుంది. ఒక్కొక్కరి ఇల్లు మరియు భూమి మొదలైనవి ఢిల్లీ అంత ఉంటాయి. మధురమైన నదీ
తీరాలపై మీ రాజ్యము నడుస్తుంది. ఒక్కొక్కరి వద్ద లేనిదంటూ ఏమీ ఉండదు. సదా భోజనము
లభిస్తూనే ఉంటుంది. అక్కడి ఫలాలు-పుష్పాలు కూడా ఎంత పెద్ద-పెద్దవిగా ఉంటాయో
చూస్తుంటారు. మీరు శూబీ రసము తాగి వస్తారు. అక్కడ తోటమాలి ఉన్నారని చెప్తారు.
ఇప్పుడు తోటమాలి అయితే తప్పకుండా వైకుంఠములో లేక నదీ తీరములో ఉంటారు. అక్కడ ఎంత
కొద్దిమంది ఉంటారు. ఇప్పటి ఇన్ని కోట్లమంది ఎక్కడ, 9 లక్షల మంది ఎక్కడ మరియు అక్కడ
అన్నీ మీవిగానే ఉంటాయి. తండ్రి ఎటువంటి రాజ్యాన్ని ఇస్తారంటే, దానిని ఎవ్వరూ మన
నుండి లాక్కోలేరు. ఆకాశము, భూమి మొదలైనవాటన్నిటికీ మీరు యజమానిగా ఉంటారు. పాట కూడా
పిల్లలు విన్నారు. ఇటువంటి పాటలు 6-8 ఉన్నాయి, వాటిని వినడముతోనే సంతోషము యొక్క
పాదరసము పైకి ఎక్కుతుంది. చూడండి, ఒకవేళ అవస్థలో ఏదైనా అలజడి ఉన్నట్లయితే పాటలు
పెట్టుకోండి. ఇవి సంతోషము కలిగించే పాటలు. మీకు వాటి అర్థం కూడా తెలుసు. స్వయాన్ని
హర్షితముఖులుగా చేసుకునేందుకు బాబా ఎన్నో యుక్తులను తెలియజేస్తున్నారు. బాబా, అంత
సంతోషము ఉండడము లేదు, మాయ తుఫానులు వస్తున్నాయి అని బాబాకు వ్రాస్తారు. అరే, మాయ
తుఫానులు వస్తే, మీరు పాటలు పెట్టుకోండి. సంతోషము కోసమని పెద్ద-పెద్ద మందిరాలలో కూడా
ద్వారాల వద్ద భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. బొంబాయిలో మాధవబాగ్ లో లక్ష్మీ-నారాయణుల
మందిరము యొక్క ద్వారము వద్ద కూడా భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. ఈ సినిమా పాటలు ఎందుకు
పెడుతున్నారు అని మిమ్మల్ని అడుగుతారు. ఇవి కూడా డ్రామానుసారముగా ఉపయోగపడే
వస్తువులేనని వారికేమి తెలుసు. వీటి అర్థము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇవి
విన్నా కూడా సంతోషములోకి వస్తారు. కానీ పిల్లలు మర్చిపోతారు. ఇంటిలో ఎవరికైనా దుఃఖము
కలిగినా కూడా పాటలు విని చాలా సంతోషిస్తారు. ఇవి చాలా విలువైనవి. ఎవరి ఇంట్లోనైనా
గొడవ జరిగితే ఇలా చెప్పండి, భగవానువాచ - కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందితే
మనము విశ్వానికి యజమానులుగా అవుతాము, ఆ తర్వాత పుష్పాల వర్షము కురుస్తుంది,
జయజయకారాలు జరుగుతాయి. బంగారు పుష్పాల వర్షము కురుస్తుంది. మీరు ఇప్పుడు ముళ్ళ నుండి
బంగారు పుష్పాలుగా అవుతున్నారు కదా. ఆ తర్వాత మీ అవతరణ జరుగుతుంది. పుష్పాలు
కురుస్తాయని కాదు, కానీ మీరే పుష్పాలుగా అయి వస్తారు. బంగారు పుష్పాలు కురుస్తాయని
మనుష్యులు భావిస్తారు. ఒక రాకుమారుడు విదేశాలకు వెళ్ళారు, అక్కడ పార్టీ ఇచ్చారు,
వారి కోసం బంగారు పుష్పాలు తయారుచేయించారు. అందరి పైనా వర్షింపజేసారు. అతని సంతోషము
కారణముగా అంతటి ఆతిధ్యాన్ని ఇచ్చారు. నిజమైన బంగారముతో పుష్పాలు తయారుచేయించారు.
బాబాకు అతని రాష్ట్రము మొదలైనవాటి గురించి కూడా బాగా తెలుసు. వాస్తవానికి మీరు
పుష్పాలుగా అయి వస్తారు. బంగారు పుష్పాలైన మీరు పై నుండి దిగుతారు. విశ్వ
రాజ్యాధికారమనే లాటరీ పిల్లలైన మీకు ఎంతగా లభిస్తుంది. ఏ విధంగా లౌకిక తండ్రి, మీ
కోసం ఇది తీసుకువచ్చానని పిల్లలతో చెప్పినప్పుడు పిల్లలు ఎంతగా సంతోషిస్తారు. బాబా
కూడా మీ కోసం స్వర్గము తీసుకువచ్చాను అని చెప్తున్నారు. మీరు అక్కడ రాజ్యము చేస్తారు
కావున ఎంత సంతోషముండాలి. బాబా ఎవరికైనా చిన్న కానుకను ఇస్తే - బాబా, మీరైతే మాకు
విశ్వ రాజ్యాధికారాన్నే ఇస్తున్నారు, ఈ కానుక ఎంత అని అంటారు. అరే, శివబాబా ఇచ్చిన
జ్ఞాపిక తోడుగా ఉన్నట్లయితే శివబాబా స్మృతి ఉంటుంది మరియు మీకు పదమాలు లభిస్తాయి.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సత్యమైనవారి సాంగత్యములో తిరిగి వెళ్ళాలి, అందుకే సదా సత్యముగా ఉండాలి.
ఎప్పుడూ అసత్యము చెప్పకూడదు.
2. మనము బ్రహ్మాబాబా యొక్క పిల్లలము, పరస్పరము సోదరీ-సోదరులము, అందుకే
అపవిత్రమైన కర్మలేవీ చేయకూడదు. పరస్పరము సోదర సంబంధము మరియు సోదర-సోదరీల సంబంధము
తప్ప ఇంకే సంబంధాల భానము ఉండకూడదు.
వరదానము:-
స్మృతి బలము ద్వారా తమ మరియు ఇతరుల శ్రేష్ఠ పురుషార్థపు
గతి-విధులను తెలుసుకునే మాస్టర్ త్రికాలదర్శీ భవ
ఏ విధంగా సైన్స్ వారు భూమి నుండి అంతరిక్షములోకి
వెళ్ళేవారి యొక్క అన్ని గతి-విధులను తెలుసుకోగలరో, అలాగే త్రికాలదర్శీ పిల్లలైన మీరు
సైలెన్స్ అనగా స్మృతి బలముతో స్వయము మరియు ఇతరుల శ్రేష్ఠ పురుషార్థము మరియు స్థితి
యొక్క గతి-విధులను స్పష్టముగా తెలుసుకోగలరు. దివ్య బుద్ధి కలవారిగా అవ్వడము ద్వారా,
స్మృతి యొక్క శుద్ధ సంకల్పాలలో స్థితులవ్వడము ద్వారా త్రికాలదర్శీ భవ అన్న వరదానము
ప్రాప్తిస్తుంది మరియు ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేందుకు కొత్త-కొత్త ప్లాన్లు
స్వతహాగానే ఇమర్జ్ అవుతాయి.
స్లోగన్:-
సర్వుల
సహయోగులుగా అయినట్లయితే స్నేహము స్వతహాగానే ప్రాప్తిస్తూ ఉంటుంది.
అవ్యక్త సూచనలు -
స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి
మాకు సేవ చేసే అవకాశము
లేదు అని ఎవ్వరూ అనటానికి లేదు. ఎవరైనా మాట్లాడలేకపోతే మనసా వాయుమండలము ద్వారా సుఖపు
వృత్తితో, సుఖమయ స్థితితో సేవ చెయ్యండి. ఆరోగ్యము సరిగ్గా లేకపోతే ఇంట్లో కూర్చుని
కూడా సహయోగులుగా అవ్వండి, కేవలం మనసులో శుద్ధ సంకల్పాల స్టాక్ ను జమ చేసుకోండి, శుభ
భావనలతో సంపన్నముగా అవ్వండి.
| | |