02-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సంగమయుగము భాగ్యశాలురుగా అయ్యే యుగము, ఇందులో మీరు ఎంత కావాలనుకుంటే అంత మీ భాగ్యపు సితారను ప్రకాశింపజేసుకోవచ్చు’’

ప్రశ్న:-
తమ పురుషార్థాన్ని తీవ్రతరం చేసుకునేందుకు సహజ సాధనము ఏమిటి?

జవాబు:-
ఫాలో ఫాదర్ చేస్తూ వెళ్ళినట్లయితే పురుషార్థము తీవ్రతరం అవుతుంది. తండ్రినే చూడండి, తల్లి అయితే గుప్తముగా ఉన్నారు. ఫాలో ఫాదర్ చేయడం ద్వారా బాబా సమానంగా ఉన్నతముగా అవుతారు, అందుకే ఏక్యురేట్ గా ఫాలో చేస్తూ ఉండండి.

ప్రశ్న:-
బాబా ఏ పిల్లలను బుద్ధిహీనులుగా భావిస్తారు?

జవాబు:-
ఎవరికైతే తండ్రిని కలుసుకున్నాము అన్న సంతోషము కూడా లేదో - వారు బుద్ధిహీనులు అయినట్లు కదా. ఇటువంటి తండ్రి, ఎవరైతే విశ్వాధిపతులుగా తయారుచేస్తారో, వారికి బిడ్డగా అయిన తర్వాత కూడా సంతోషము లేకపోతే వారిని బుద్ధిహీనులు అనే అంటారు కదా.

ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలైన మీరు లక్కీ సితారలు. మనము శాంతిధామాన్నీ స్మృతి చేస్తాము, అలాగే తండ్రిని కూడా స్మృతి చేస్తామని మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మనము పవిత్రముగా అయి ఇంటికి వెళ్తాము. ఇక్కడ కూర్చుని ఈ విషయాన్ని ఆలోచిస్తారు కదా. తండ్రి ఇంకెటువంటి కష్టమునూ ఇవ్వరు. జీవన్ముక్తి గురించి అయితే ఎవరికీ తెలియదు. వారందరూ ముక్తి కొరకే పురుషార్థము చేస్తారు, కానీ ముక్తి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. కొందరు - మేము బ్రహ్మములో లీనమైపోవాలి, మళ్ళీ తిరిగి రానే రాకూడదు అని భావిస్తారు. మనము ఈ చక్రములోకి తప్పకుండా రావలసిందే అన్నది వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. మనము స్వదర్శన చక్రధారులమైన లక్కీ సితారలమని పిల్లలైన మీకు తెలుసు. లక్కీ అని అదృష్టవంతులనే అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని అదృష్టవంతులుగా తండ్రియే తయారుచేస్తారు. తండ్రి ఏ విధంగా ఉంటారో, పిల్లలూ అలాగే ఉంటారు. కొందరు తండ్రులు షావుకారులుగా ఉంటారు, కొందరు తండ్రులు పేదవారిగా కూడా ఉంటారు. మాకైతే అనంతమైన తండ్రి లభించారు అని పిల్లలైన మీకు తెలుసు, ఎవరు ఎంత అదృష్టవంతులుగా అవ్వాలనుకుంటే అంత అవ్వవచ్చు, ఎవరు ఎంత షావుకారులుగా అవ్వాలనుకుంటే అంత అవ్వవచ్చు. తండ్రి అంటారు, ఏది కావాలనుకుంటే అది పురుషార్థము ద్వారా తీసుకోండి. మొత్తం ఆధారమంతా పురుషార్థముపై ఉంది. పురుషార్థము చేసి ఎంత ఉన్నత పదవిని తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఉన్నతోన్నతమైన పదవి ఈ లక్ష్మీ-నారాయణులు. స్మృతి చార్టును కూడా తప్పకుండా పెట్టాలి ఎందుకంటే తమోప్రధానము నుండి సతోప్రధానముగా తప్పకుండా అవ్వవలసిందే. తెలివితక్కువవారిగా ఊరికే అలా కూర్చుండిపోకూడదు. తండ్రి అర్థం చేయించారు, పాత ప్రపంచము ఇప్పుడిక కొత్తగా అవ్వనున్నది. కొత్త సతోప్రధాన ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకే తండ్రి వస్తారు. వారు అనంతమైన తండ్రి, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. వారు అర్థం చేయిస్తారు - సతోప్రధానముగా అవ్వడం ద్వారానే మీరు అనంతమైన సుఖాన్ని పొందగలరు, సతోగా అయితే తక్కువ సుఖాన్ని పొందుతారు, రజోగా అయితే అంతకన్నా తక్కువ సుఖాన్ని పొందుతారు. లెక్కనంతటినీ తండ్రి తెలియజేస్తారు. అపారమైన ధనము మీకు లభిస్తుంది, అపారమైన సుఖాలు లభిస్తాయి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు స్మృతి తప్ప ఇంకే ఉపాయమూ లేదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా స్మృతి ద్వారా ఆటోమేటిక్ గా దైవీ గుణాలు కూడా వస్తాయి. సతోప్రధానముగా అవ్వాలంటే దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. తమ చెకింగ్ ను తామే చేసుకోవాలి. ఎంత ఉన్నత పదవిని తీసుకోవాలనుకుంటే అంత మీ పురుషార్థము ద్వారా తీసుకోవచ్చు. చదివించే టీచర్ అయితే కూర్చుని ఉన్నారు. తండ్రి అంటారు, కల్ప-కల్పమూ మీకు ఈ విధంగానే అర్థం చేయిస్తాను. పదాలు రెండే ఉన్నాయి - మన్మనాభవ, మధ్యాజీభవ. అనంతమైన తండ్రిని మీరు గుర్తిస్తారు. ఆ అనంతమైన తండ్రియే అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చేవారు. పతితుల నుండి పావనులుగా అయ్యే దారిని కూడా ఆ అనంతమైన తండ్రియే అర్థం చేయిస్తారు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది కొత్త విషయమేమీ కాదు. గీతలో కూడా పిండిలో ఉప్పు ఉన్నంతగా వ్రాయబడి ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహపు ధర్మాలన్నింటినీ మర్చిపోండి. మీరు ప్రారంభములో అశరీరులుగా ఉండేవారు, ఇప్పుడు అనేక మిత్ర-సంబంధీకుల బంధనములోకి వచ్చారు. అందరూ తమోప్రధానముగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. తమోప్రధానుల నుండి మళ్ళీ మనము సతోప్రధానులుగా అవుతాము, అప్పుడు మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ పవిత్రముగా అవుతారని మీకు తెలుసు. ఎవరు ఎంతగా కల్పపూర్వము సతోప్రధానముగా అయ్యారో, అంతగానే మళ్ళీ అవుతారు. వారి పురుషార్థమే అలా ఉంటుంది. ఇప్పుడు మరి ఎవరిని ఫాలో చేయాలి. ఫాలో ఫాదర్ అన్న గాయనము ఉంది. తండ్రిని వీరు ఏ విధంగా స్మృతి చేస్తారో, పురుషార్థము చేస్తారో, అలా వీరిని ఫాలో చేయండి. పురుషార్థము చేయించేవారైతే తండ్రియే. వారు పురుషార్థము చేయరు, వారు పురుషార్థము చేయిస్తారు. మళ్ళీ, మధురాతి మధురమైన పిల్లలూ, ఫాలో ఫాదర్ చేయండి అని చెప్తారు. మాత, పితలు గుప్తమైనవారు కదా. తల్లి గుప్తముగా ఉన్నారు, తండ్రి అయితే కనిపిస్తారు, ఇది బాగా అర్థం చేసుకోవలసింది. ఇటువంటి ఉన్నతమైన పదవిని పొందాలంటే తండ్రిని బాగా స్మృతి చేయండి, ఈ బాబా స్మృతి చేసినట్లుగా స్మృతి చేయండి. ఈ తండ్రియే అందరికన్నా ఉన్నత పదవిని పొందుతారు. ఇతను చాలా ఉన్నతముగా ఉండేవారు, మళ్ళీ ఇతని యొక్క అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో నేను ప్రవేశించాను. ఇది బాగా గుర్తు చేసుకోండి, మర్చిపోకండి. మాయ అనేకులను మరపింపజేస్తుంది. మేము నరుని నుండి నారాయణునిగా అవుతాము అని మీరు అంటారు, దానికి కూడా తండ్రి యుక్తిని తెలియజేస్తారు, మీరు ఆ విధంగా ఎలా అవ్వగలరో తెలియజేస్తారు. అందరూ అయితే ఏక్యురేట్ గా ఫాలో చేయరని కూడా మీకు తెలుసు. లక్ష్యము-ఉద్దేశ్యమును తండ్రి తెలియజేస్తారు - ఫాలో ఫాదర్. ఇది ఈ సమయము యొక్క గాయనమే. తండ్రి కూడా ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు. సన్యాసులకు అనుచరులు అని అంటారు కానీ అది తప్పు కదా. నిజానికి అసలు వారిని ఫాలో చేయనే చేయరు. వారంతా బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు. వారికి జ్ఞానాన్ని ఈశ్వరుడేమీ ఇవ్వరు. తత్వజ్ఞానులుగా లేక బ్రహ్మజ్ఞానులుగా పిలువబడతారు, కానీ బ్రహ్మము లేక తత్వము వారికి జ్ఞానాన్ని ఇవ్వవు, అదంతా శాస్త్రాల జ్ఞానము. ఇక్కడ మీకు తండ్రియే జ్ఞానాన్ని ఇస్తారు, వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. దీనిని బాగా నోట్ చేసుకోండి. మీరు మర్చిపోతారు, ఇది మీ హృదయములో బాగా ధారణ చేయవలసిన విషయము. తండ్రి ప్రతి రోజూ చెప్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి. పతితులైతే వెళ్ళలేరు. పవిత్రులుగా యోగబలముతో అన్నా అవ్వాలి లేక శిక్షలు అనుభవించి అన్నా వెళ్తారు. అందరి లెక్కాచారాలు తప్పకుండా తీరాలి. తండ్రి అర్థం చేయించారు - ఆత్మలైన మీరు నిజానికి పరంధామ నివాసులు, మళ్ళీ ఇక్కడ సుఖ-దుఃఖాల పాత్రను అభినయించారు. సుఖపు పాత్ర రామ రాజ్యములో మరియు దుఃఖపు పాత్ర రావణ రాజ్యములో ఉంటుంది. రామ రాజ్యము అని స్వర్గాన్ని అంటారు, అక్కడ సంపూర్ణ సుఖము ఉంటుంది. స్వర్గవాసులు మరియు నరకవాసులు అని కూడా అంటారు. ఈ విషయాలను బాగా ధారణ చేయాలి. ఎంతెంతగా తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతూ ఉంటారో, అంతగా లోలోపల మీకు సంతోషము కూడా కలుగుతుంది. ద్వాపరములో రజోలో ఉన్నప్పుడు కూడా మీకు సంతోషము ఉండేది. అప్పుడు మీరు ఇంతటి దుఃఖితులుగా, వికారులుగా లేరు. ఇక్కడైతే ఇప్పుడు ఎంత వికారులుగా, దుఃఖితులుగా ఉన్నారు. మీరు మీ పెద్దవారిని చూడండి, వారు ఎంత వికారులుగా, మద్యము తాగేవారిగా ఉన్నారు. మద్యము చాలా చెడ్డది. సత్యయుగములోనైతే ఉన్నదే శుద్ధ ఆత్మలు, మళ్ళీ కిందకు దిగుతూ-దిగుతూ పూర్తిగా ఛీ-ఛీగా అయిపోతారు, అందుకే దీనిని రౌరవ నరకము అని అంటారు. మద్యము ఎటువంటిదంటే దానిని త్రాగేవారు కొట్లాటలకు, మారణహోమానికి, నష్టాన్ని కలిగించడానికి పెద్ద ఆలస్యం చేయరు. ఈ సమయములో మనుష్యుల బుద్ధి భ్రష్టముగా అయిపోయింది. మాయ చాలా శక్తివంతమైనది. తండ్రి సర్వశక్తివంతుడు, సుఖాన్ని ఇచ్చేవారు. అలాగే మాయ చాలా దుఃఖాన్ని ఇస్తుంది. కలియుగములో మనుష్యుల పరిస్థితి ఎలా తయారైపోతుంది, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటారు. ఏమీ అర్థం చేసుకోరు, రాతిబుద్ధి కలవారిగా ఉంటారు. ఇది కూడా డ్రామా కదా. ఎవరి భాగ్యములోనైనా లేకపోతే ఇక ఇటువంటి బుద్ధిగా తయారవుతుంది. తండ్రి జ్ఞానాన్ని అయితే చాలా సహజముగా ఇస్తారు. పిల్లలూ, పిల్లలూ అంటూ అర్థం చేయిస్తూ ఉంటారు. మాతలు కూడా అంటారు - మాకు ఐదుగురు లౌకిక పిల్లలు ఉన్నారు మరియు ఒక పారలౌకిక పుత్రుడు ఉన్నారు, వారు మమ్మల్ని సుఖధామములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. తండ్రి కూడా అర్థం చేసుకుంటారు, అలాగే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. వారు ఇంద్రజాలికుడు కదా. తండ్రి ఇంద్రజాలికుడైతే పిల్లలు కూడా ఇంద్రజాలికులుగా అవుతారు. బాబా మాకు కొడుకుగా కూడా అవుతారు అని అంటారు. కావున తండ్రిని ఫాలో చేసి ఈ విధంగా తయారవ్వాలి. స్వర్గములో వీరి రాజ్యము ఉండేది కదా. శాస్త్రాల్లో ఈ విషయాలు లేవు. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి, అవి మళ్ళీ ఉంటాయి. తండ్రి ఇది కూడా అర్థం చేయిస్తున్నారు - చదివించే టీచర్ అయితే కావాలి కదా, పుస్తకము టీచర్ అవ్వలేదు కదా. అలాగైతే ఇక టీచర్ అవసరమే ఉండదు. ఈ పుస్తకాలు మొదలైనవి సత్యయుగములో ఉండవు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఆత్మ అంటే ఏమిటో అర్థం చేసుకున్నారు కదా. ఆత్మలకు తండ్రి కూడా తప్పకుండా ఉన్నారు. ఎవరైనా వచ్చినప్పుడు హిందూ-ముస్లిం భాయి, భాయి అని అందరూ అంటారు కానీ దాని అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోరు. భాయి-భాయి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవాలి కదా. తప్పకుండా వారి తండ్రి కూడా ఉంటారు. ఈ మాత్రము జ్ఞానము కూడా లేదు. భగవానువాచ, ఇది అనేక జన్మల అంతిమములోని జన్మ. దీని అర్థము ఎంత స్పష్టముగా ఉంది. ఏ గ్లానీ చేయరు. తండ్రి అయితే దారిని తెలియజేస్తారు. నంబర్ వన్ అయినవారే లాస్ట్ అవుతారు. తెల్లగా ఉన్నవారే నల్లగా అవుతారు. మేము ఒకప్పుడు తెల్లగా ఉండేవారము, మళ్ళీ అలా అవుతాము అని మీరు కూడా భావిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆ విధంగా అవుతారు. ఇది రావణ రాజ్యము. రామ రాజ్యాన్ని శివాలయము అని అంటారు. సీత యొక్క రాముడు త్రేతాలో రాజ్యము చేశారు, ఇందులో కూడా అర్థం చేసుకోవలసిన విషయం ఉంది. రెండు కళలు తక్కువ ఉంటాయి అని అంటారు. సత్యయుగము ఉన్నతమైనది, దానినే తలచుకుంటారు. త్రేతాను మరియు ద్వాపరాన్ని అంతగా తలచుకోరు. సత్యయుగము కొత్త ప్రపంచము మరియు కలియుగము పాత ప్రపంచము. 100 శాతం సుఖము మరియు 100 శాతం దుఃఖము. ఆ త్రేతా మరియు ద్వాపరయుగాలు సెమీగా ఉంటాయి, అందుకే ముఖ్యముగా సత్యయుగము మరియు కలియుగము గానం చేయబడతాయి. తండ్రి సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీ పని పురుషార్థము చేయడము. సత్యయుగ నివాసులుగా అవుతారా లేక త్రేతా నివాసులుగా అవుతారా? ద్వాపరములో మళ్ళీ కిందకు దిగుతారు. అయినా కానీ దేవీ-దేవతా ధర్మానికి చెందినవారే కదా. కానీ పతితులుగా అయిన కారణముగా స్వయాన్ని దేవి-దేవతలుగా పిలుచుకోలేరు. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు ప్రతి రోజూ అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయము మన్మనాభవ విషయమే. మీరే నెంబర్ వన్ గా అవుతారు. 84 జన్మల చక్రములో తిరిగి చివరిలోకి వస్తారు, మళ్ళీ నెంబర్ వన్ లోకి వెళ్తారు. కావున ఇప్పుడు అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. వారు అనంతమైన తండ్రి. పురుషోత్తమ సంగమయుగములోనే అనంతమైన తండ్రి వచ్చి 21 తరాలు స్వర్గ సుఖాన్ని మీకు ఇస్తారు. ఎప్పుడైతే ఒక తరం పూర్తి అవుతుందో, అప్పుడు మీరు మీకు మీరుగానే శరీరాన్ని వదిలేస్తారు. యోగబలము ఉంది కదా. నియమమే ఆ విధంగా రచింపబడి ఉంది, దీనిని యోగబలము అని అంటారు. అక్కడ జ్ఞానపు విషయమేదీ ఉండదు. ఆటోమేటిక్ గా మీరు వృద్ధులుగా అవుతారు. అక్కడ ఎటువంటి రోగమూ మొదలైనవి ఉండవు. కుంటివారిగా లేక వంకర టింకరగా ఉండరు. సదా ఆరోగ్యముగా ఉంటారు. అక్కడ దుఃఖపు నామ-రూపాలు ఉండవు. ఆ తర్వాత మెల్లమెల్లగా కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు అనంతమైన తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థము చేయాలి. పాస్ విత్ హానర్ గా అవ్వాలి కదా. అందరూ అయితే ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే సేవనే చేయరో వారు ఏ పదవిని పొందుతారు. మ్యూజియంలో పిల్లలు ఎంత సేవను చేస్తారు, పిలవకుండానే అక్కడకు అందరూ వస్తూ ఉంటారు. దీనిని విహంగ మార్గపు సేవ అని అంటారు. దీని కన్నా ఇంకా విహంగ మార్గపు సేవ ఏదైనా వెలువడుతుందేమో తెలియదు. 2-4 ముఖ్యమైన చిత్రాలు తప్పకుండా మీతోపాటు ఉండాలి. పెద్ద-పెద్ద త్రిమూర్తి, వృక్షము, చక్రము, మెట్ల వరుస... ఇవైతే ప్రతి చోటా చాలా పెద్ద-పెద్దవి ఉండాలి. ఎప్పుడైతే పిల్లలు చురుకైనవారిగా అవుతారో అప్పుడే సేవ జరుగుతుంది కదా. సేవ అయితే జరిగేదే ఉంది. పల్లెల్లో కూడా సేవ చేయాలి. మాతలు చదువుకోకపోయినా కానీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడమైతే చాలా సహజము. పూర్వము స్త్రీలు చదువుకునేవారు కాదు. ముసల్మానుల రాజ్యములో కేవలం ఒక కన్నుకు మాత్రమే పరదా తెరుచుకొని బయటకు వెళ్ళేవారు. ఈ బాబా చాలా అనుభవజ్ఞులు. తండ్రి అంటారు, నాకు ఇవేవీ తెలియవు, నేనైతే పైన ఉంటాను. ఈ విషయాలన్నింటినీ ఈ బ్రహ్మాయే మీకు వినిపిస్తారు. ఇతను అనుభవజ్ఞులు. నేనైతే కేవలం మన్మనాభవ విషయాలనే వినిపిస్తాను మరియు సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను, ఇవి వీరికి తెలియదు. ఇతను తన అనుభవాన్ని విడిగా అర్థం చేయిస్తారు, నేను ఈ విషయాలలోకి వెళ్ళను. నా పాత్ర కేవలం మీకు దారిని చూపించడమే. నేను తండ్రిని, టీచరును, గురువును. టీచరుగా అయి మిమ్మల్ని చదివిస్తాను, అంతేకానీ ఇందులో కృప మొదలైనవాటి విషయమేమీ లేదు. నేను చదివిస్తాను, మళ్ళీ నాతోపాటు తీసుకువెళ్తాను కూడా. ఈ చదువు ద్వారానే సద్గతి లభిస్తుంది. మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకే నేను వచ్చాను. శివుని ఊరేగింపు గానం చేయబడ్డది. శంకరుని ఊరేగింపు ఉండదు. శివుని ఊరేగింపు ఉంటుంది, ఆత్మలందరూ వరుడి వెనుక వెళ్తారు కదా. వీరంతా భక్తురాళ్ళు, నేను భగవంతుడిని. పావనంగా తయారుచేసి నాతోపాటు తీసుకువెళ్ళడం కోసమే మీరు నన్ను పిలిచారు, కావున నేను పిల్లలైన మిమ్మల్ని తప్పకుండా నాతోపాటు తీసుకువెళ్తాను. లెక్కాచారాలను సమాప్తం చేయించి తప్పకుండా తీసుకువెళ్ళేదే ఉంది.

తండ్రి ఘడియ-ఘడియ మన్మనాభవ అని చెప్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వము కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది కదా. దాని కొరకు పురుషార్థము కూడా అలా చేయాలి. పిల్లలైన మీకు ఎటువంటి కష్టమూ ఇవ్వను. మీరు ఎన్నో దుఃఖాలను చూసారని నాకు తెలుసు. ఇప్పుడు మీకు ఎటువంటి కష్టమూ ఇవ్వను. భక్తి మార్గములో ఆయుష్షు కూడా చిన్నగా ఉంటుంది. అకాల మృత్యువులు జరుగుతాయి, ఎంతగా అయ్యో దేవుడా అంటూ మొరపెట్టుకుంటూ ఉంటారు. ఎంతటి దుఃఖాన్ని అనుభవిస్తారు, వారి బుద్ధే పాడైపోతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉండండి. స్వర్గాధిపతులుగా అవ్వాలంటే దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. పురుషార్థము ఎల్లప్పుడూ - మేము లక్ష్మీ-నారాయణుల్లా అవ్వాలి అని ఉన్నతముగా అయ్యేందుకే చేయడం జరుగుతుంది. తండ్రి అంటారు, నేను సూర్యవంశము, చంద్రవంశము, ఈ రెండు ధర్మాలనూ స్థాపన చేస్తాను. వారు ఫెయిల్ అవుతారు, అందుకే క్షత్రియులుగా పిలువబడతారు. ఇది యుద్ధ మైదానము కదా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సుఖధామ వారసత్వము యొక్క పూర్తి అధికారాన్ని తీసుకునేందుకు సంగమములో ఆత్మిక ఇంద్రజాలికులుగా అయ్యి తండ్రిని కూడా తమ కొడుకుగా చేసుకోవాలి. పూర్తి-పూర్తిగా బలిహారమవ్వాలి.

2. స్వదర్శన చక్రధారులుగా అయి స్వయాన్ని లక్కీ సితారలుగా (అదృష్ట సితారలుగా) తయారుచేసుకోవాలి. విహంగ మార్గపు సేవకు నిమిత్తులుగా అయి ఉన్నత పదవిని పొందాలి. ప్రతి గ్రామములోనూ సేవ చేయాలి. దానితో పాటు స్మృతి చార్టును కూడా తప్పకుండా పెట్టాలి.

వరదానము:-

దృఢ సంకల్పమనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు అనే బాణాసంచాను కాల్చే సదా విజయీ భవ

ఈ రోజుల్లో బాణాసంచాలో బాంబులను తయారుచేస్తున్నారు కానీ మీరు దృఢ సంకల్పమనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు అనే బాణాసంచాను కాల్చండి, దీని ద్వారా పాతవన్నీ సమాప్తమైపోవాలి. వారైతే బాణాసంచాలో ధనాన్ని పోగొట్టుకుంటారు కానీ మీరు సంపాదిస్తారు. వారిది బాణాసంచా కానీ మీది ఎగిరే కళ యొక్క ఆట. ఇందులో మీరు విజయులుగా అవుతారు. కావున డబల్ లాభాన్ని పొందండి, వెలిగించండి కూడా, సంపాదించండి కూడా - ఈ విధిని అలవరచుకోండి.

స్లోగన్:-

ఏదైనా విశేష కార్యములో సహయోగులుగా అవ్వటమే ఆశీర్వాదాల లిఫ్టును తీసుకోవటము.