03-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ అనంతమైన నాటకాన్ని సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే అపారమైన సంతోషము ఉంటుంది, ఈ నాటకములో మంచి పురుషార్థులు మరియు అనన్యులు ఎవరైతే ఉన్నారో, వారి పూజ కూడా అధికముగా జరుగుతుంది’’

ప్రశ్న:-
ఏ స్మృతి ప్రపంచములోని సర్వ దుఃఖాల నుండి ముక్తులుగా చేస్తుంది, హర్షితముగా ఉండేందుకు యుక్తి ఏమిటి?

జవాబు:-
సదా ఈ స్మృతి ఉండాలి - ఇప్పుడు మేము భవిష్య కొత్త ప్రపంచములోకి వెళ్తున్నాము. భవిష్యత్తు యొక్క సంతోషములో ఉన్నట్లయితే దుఃఖాన్ని మర్చిపోతారు. విఘ్నాల ప్రపంచములో విఘ్నాలైతే వస్తాయి కానీ - మేము ఈ ప్రపంచములో ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటాము అన్న స్మృతి ఉన్నట్లయితే హర్షితముగా ఉంటారు.

పాట:-
మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి...

ఓంశాంతి
ఈ పాట చాలా బాగుంటుంది. ఈ పాట వినడముతోనే, పై నుండి మొదలుకుని మొత్తము 84 జన్మల రహస్యము బుద్ధిలోకి వచ్చేస్తుంది. పిల్లలకు ఇది కూడా అర్థం చేయించడం జరిగింది - మీరు పై నుండి వచ్చేటప్పుడు వయా సూక్ష్మవతనము రారు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు వయా సూక్ష్మవతనము వెళ్ళాలి. సూక్ష్మవతనాన్ని బాబా ఇప్పుడే చూపిస్తారు. సత్య, త్రేతాయుగాలలో ఈ జ్ఞాన విషయాలు కూడా ఉండవు, అలాగే చిత్రాలు మొదలైనవి కూడా ఉండవు. భక్తి మార్గములోనైతే ఎన్నో చిత్రాలు ఉన్నాయి. దేవీలు మొదలైనవారికి పూజలు కూడా ఎన్నో జరుగుతుంటాయి. దుర్గ, కాళి, సరస్వతి ఈ ముగ్గురూ ఒక్కరే కానీ పేర్లు ఎన్ని పెట్టారు. మంచి పురుషార్థము చేసేవారు, అనన్యులు ఎవరైతే ఉంటారో, వారికి పూజ కూడా ఎక్కువగా జరుగుతుంది. మనమే పూజ్యుల నుండి పూజారులుగా అయి తండ్రి పూజను మరియు స్వపూజను చేస్తామని మీకు తెలుసు. వీరు (బాబా) కూడా నారాయణుడి పూజను చేస్తుండేవారు కదా. ఇది అద్భుతమైన నాటకము. నాటకాన్ని చూసినప్పుడు సంతోషము కలుగుతుంది కదా, అలా ఇది కూడా అనంతమైన నాటకము, దీని గురించి ఎవరికీ తెలియదు. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తము డ్రామా రహస్యమంతా ఉంది. ఈ ప్రపంచములో ఎంత అపారమైన దుఃఖము ఉంది. ఇప్పుడు ఇంకా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉందని, మనము కొత్త ప్రపంచములోకి వెళ్తున్నామని మీకు తెలుసు. భవిష్యత్తు యొక్క సంతోషము ఉన్నట్లయితే అది ప్రస్తుత దుఃఖాన్ని పారద్రోలుతుంది. బాబా, ఎన్నో విఘ్నాలు వస్తున్నాయి, నష్టము వస్తుంది అని తండ్రికి వ్రాస్తారు. తండ్రి అంటారు, ఎటువంటి విఘ్నాలు వచ్చినా, ఈ రోజు లక్షాధికారులుగా ఉన్నవారు రేపు భిక్షాధికారులుగా అయిపోయినా, మీరు మాత్రము భవిష్యత్తు సంతోషములో ఉండాలి కదా. ఇది ఉన్నదే రావణుడి ఆసురీ ప్రపంచము. నడుస్తూ-నడుస్తూ ఏదో ఒక విఘ్నము వస్తుంది. ఈ ప్రపంచానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి, ఆ తర్వాత మనము అపారమైన సుఖాలలోకి వెళ్తాము. బాబా అంటారు కదా - నిన్న నల్లగా ఉండేవాడిని, పల్లెటూరి పిల్లవాడిగా ఉండేవాడిని, ఇప్పుడు తండ్రి నాకు జ్ఞానాన్ని ఇచ్చి సుందరముగా తయారుచేస్తున్నారు. తండ్రి బీజరూపుడని, సత్యమని, చైతన్యమని మీకు తెలుసు. వారిని సుప్రీమ్ సోల్ (పరమ ఆత్మ) అని అంటారు. వారు ఉన్నతోన్నతమైన స్థానములో ఉంటారు, పునర్జన్మలలోకి రారు. మనమందరమూ జనన-మరణాలలోకి వస్తాము, వారు వీటికి అతీతమైనవారు. వారైతే అంతిమములో వచ్చి అందరికీ సద్గతిని ఇవ్వాలి. మీరు భక్తి మార్గములో జన్మజన్మాంతరాలు పాడుతూ వచ్చారు - బాబా, మీరు వస్తే మేము మీకు చెందినవారిగానే అవుతాము, నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, నేను బాబాతో పాటుగానే వెళ్తాను. ఇది దుఃఖపు ప్రపంచము. భారత్ ఎంత నిరుపేదగా ఉంది. తండ్రి అంటారు, నేను భారత్ నే షావుకారుగా తయారుచేశాను, ఆ తర్వాత రావణుడు నరకముగా తయారుచేశాడు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖముగా కూర్చున్నారు. గృహస్థ వ్యవహారములో కూడా చాలా మంది ఉంటారు. అందరూ ఇక్కడ కూర్చునేది లేదు. గృహస్థ వ్యవహారములో ఉండండి, రంగు వస్త్రాలు వేసుకోండి, తెల్లని వస్త్రాలే వేసుకోండి అని ఎవరన్నారు. బాబా ఎప్పుడూ ఎవరికీ ఈ విధంగా చెప్పలేదు. మీకు బాగా అనిపించక మీరు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. ఇక్కడ మీరు తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు కానీ రంగు వస్త్రాలు వేసుకునేవారు, ఆ వస్త్రాలలో కూడా చాలామంది కళ్యాణమును చేయగలుగుతారు. మాతలు తమ పతులకు కూడా ఈ విధంగా అర్థం చేయిస్తారు - పవిత్రముగా తయారవ్వాలి అన్నది భగవానువాచ. దేవతలు పవిత్రముగా ఉంటారు కావుననే వారి కాళ్ళకు నమస్కరిస్తారు. పవిత్రముగా అవ్వడమైతే మంచిదే కదా. ఇది సృష్టి అంతిమము అని ఇప్పుడు మీకు తెలుసు. ఎక్కువ ధనాన్ని ఏం చేసుకుంటారు. ఈ రోజుల్లో ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయి, లంచగొండితనము ఎంతగా పెరిగిపోయింది. కొందరి ధనము ధూళిలో కలిసిపోతుందని, ఎవరైతే తమ ధనాన్ని పరమాత్మ పేరు మీద వినియోగిస్తారో వారిదే సఫలమవుతుంది అన్న గాయనము ఈ సమయానికి సంబంధించినదే. ఆ నాథుడు అయితే ఇప్పుడు సమ్ముఖముగా ఉన్నారు. తెలివైన పిల్లలు తమ సర్వస్వాన్ని ఆ నాథుడి పేరు మీద సఫలము చేసుకుంటారు.

మనుష్యులలోనైతే అంతా పతితులు పతితులకే దానము చేస్తుంటారు. ఇక్కడైతే పుణ్యాత్ముల నుండి దానము తీసుకోవాలి. కేవలం బ్రాహ్మణులతో తప్ప ఇంకెవరితోనూ మీకు కనెక్షన్ లేదు. మీరు పుణ్యాత్ములు. మీరు పుణ్య కార్యాలే చేస్తారు. ఈ భవనాలను నిర్మిస్తున్నారు కదా, వాటిలో కూడా మీరే ఉంటారు. ఇక్కడ పాపము యొక్క విషయమేమీ లేదు. ఉన్న ధనమునంతా భారత్ ను స్వర్గముగా తయారుచేయడానికి ఖర్చు చేస్తూ ఉంటారు. తమ కడుపును కూడా మాడ్చుకుని ఇలా అంటారు - బాబా, మా తరఫున ఒక ఇటుకను ఇందులో పెట్టండి, తద్వారా మాకు అక్కడ మహళ్ళు లభిస్తాయి. ఎంత తెలివైన పిల్లలు. రాళ్ళకు రిటర్నులో బంగారము లభిస్తుంది. సమయము కూడా ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది. మీరు ఎంత సేవ చేస్తారు. ప్రదర్శనీలు, మేళాలు పెరుగుతూ ఉంటాయి. కేవలం పిల్లలు చురుకుగా అవ్వాలి. అనంతమైన తండ్రికి చెందినవారిగా అవ్వరు, మోహము వదలరు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను, ఇప్పడు మళ్ళీ మిమ్మల్ని స్వర్గము కొరకు తయారుచేస్తున్నాను. ఒకవేళ శ్రీమతముపై నడిచినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మొత్తము సృష్టి చక్రమంతా మీ బుద్ధిలో ఉంది - మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. తండ్రి అంటారు - పిల్లలూ, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి, ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉండండి. ఈ వ్యాపారము ఎటువంటిదో చూడండి. దీనితో స్వయమూ ధనవంతులుగా, స్వర్గానికి యజమానులుగా అవ్వాలి, అలాగే ఇతరులను కూడా తయారుచెయ్యాలి. ఎవరికి ఏ విధంగా మార్గము తెలియజేయాలి అని బుద్ధిలో ఇదే ఉండాలి. డ్రామానుసారముగా ఏదైతే గతించిపోయిందో, అది డ్రామా. క్షణ-క్షణమూ ఏదైతే జరుగుతుందో దానిని మనము సాక్షీగా అయి చూస్తాము. పిల్లలకు తండ్రి దివ్యదృష్టి ద్వారా సాక్షాత్కారము కూడా చేయిస్తారు. మున్ముందు మీరు ఎన్నో సాక్షాత్కారాలను పొందుతారు. మనుష్యులేమో దుఃఖముతో ఆర్తనాదాలు చేస్తూ అలమటిస్తూ ఉంటారు, మీరేమో సంతోషముతో చప్పట్లు కొడుతూ ఉంటారు. మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతాము కావున తప్పకుండా కొత్త ప్రపంచము కావాలి. దాని కోసమే ఈ వినాశనము నిలబడి ఉంది. మరి ఇది మంచిదే కదా. పరస్పరము కొట్లాడుకోకూడదు, శాంతి ఏర్పడాలి, అంతే అని మనుష్యులు కోరుకుంటారు. కానీ ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. రెండు కోతులు పరస్పరము కొట్లాడుకుంటే, వెన్న మధ్యలోనున్న మూడవదానికి లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు - తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు అందరికీ మార్గము తెలియజేయండి. ఉండడము కూడా సాధారణముగానే ఉండాలి, తినడము కూడా సాధారణముగానే తినాలి. ఒక్కోసారి ప్రత్యేకముగా చూసుకోవడము కూడా జరుగుతుంది. బాబా, నేను ఏ భండారము నుండైతే తిన్నానో అదంతా మీదే అని అంటారు. బాబా అంటారు, ట్రస్టీగా అయి సంభాళించండి. బాబా, ఇదంతా మీరు ఇచ్చినదే. భక్తి మార్గములో ఇలా కేవలము నామమాత్రముగా అంటారు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను - ట్రస్టీలుగా అవ్వండి. ఇప్పుడు నేను సమ్ముఖముగా ఉన్నాను. నేను కూడా ట్రస్టీగా అయి తిరిగి మిమ్మల్ని ట్రస్టీలుగా తయారుచేస్తాను. ఏం చేసినా అడిగి చేయండి. బాబా ప్రతి విషయములోనూ సలహా ఇస్తూ ఉంటారు. బాబా, ఇల్లు కట్టుకోనా, లేక ఇది చేయనా అని అడిగితే బాబా అంటారు - చేస్తే చేయండి కానీ పాపాత్ములకు ఇవ్వకూడదు. కూతురు ఒకవేళ జ్ఞానములో నడవకపోతే, వివాహము చేసుకోవాలని అనుకుంటే, ఇక ఏం చేయగలుగుతారు. నీవు ఎందుకు అపవిత్రముగా అవుతావు అని అయితే తండ్రి అర్థం చేయిస్తారు, కానీ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే పతితముగా అవుతారు. అనేక రకాల కేసులు కూడా జరుగుతూ ఉంటాయి. పవిత్రముగా ఉంటూ, ఉంటూ మాయ చెంపదెబ్బ తగులుతుంది, అశుద్ధమైపోతారు. మాయ చాలా ప్రబలమైనది. వారు కూడా కామానికి వశమైపోతారు, ఇక దానిని డ్రామా విధి అని అంటారు. ఈ ఘడియ వరకూ ఏదైతే జరిగిందో అది కల్పపూర్వము కూడా జరిగింది. కొత్త ఏమీ కాదు. మంచి పని చేయడములో విఘ్నాలు వేస్తారు, ఇది కొత్త విషయమేమీ కాదు. మనమైతే తనువు, మనసు, ధనముల ద్వారా భారత్ ను తప్పకుండా స్వర్గముగా తయారుచెయ్యాలి. సర్వస్వాన్ని తండ్రిపై స్వాహా చేస్తాము. మనము శ్రీమతము ఆధారముగా భారత్ యొక్క ఆత్మిక సేవను చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనము మన రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేసుకుంటున్నామని మీ బుద్ధిలో ఉంది. తండ్రి అంటారు, ఈ ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్శిటీని మూడడుగుల భూమిలో తెరవండి, తద్వారా మనుష్యులు సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా తయారవుతారు. మూడడుగుల భూమిని కూడా ఎవ్వరూ ఇవ్వరు. బి.కె.లు మాయ చేస్తారు, సోదరీ-సోదరులుగా చేస్తారు అని అంటారు. మీ కొరకు డ్రామాలో చాలా మంచి యుక్తి రచింపబడి ఉంది. సోదరీ-సోదరులు చెడు దృష్టిని కలిగి ఉండలేరు. ఈ రోజుల్లోనైతే ప్రపంచములో ఎంత అశుద్ధత ఉందో ఇక అడగకండి. ఏ విధంగా తండ్రికి దయ కలిగిందో, అలా పిల్లలైన మీకు కూడా దయ కలగాలి. ఏ విధంగా తండ్రి నరకాన్ని స్వర్గముగా తయారుచేస్తున్నారో అలా దయార్ద్ర హృదయులైన పిల్లలైన మీరు కూడా తండ్రికి సహాయకులుగా అవ్వాలి. ధనముంటే హాస్పిటల్ మరియు యూనివర్శిటీని తెరుస్తూ వెళ్ళండి. ఇందులో ఎక్కువ ఖర్చు యొక్క విషయమేమీ లేదు. కేవలం చిత్రాలు పెట్టండి. ఎవరైతే కల్పపూర్వము జ్ఞానము తీసుకున్నారో వారి తాళము తెరుచుకుంటూ ఉంటుంది. వారు వస్తూ ఉంటారు. ఎంతమంది పిల్లలు చదువుకునేందుకు దూరదూరాల నుండి వస్తూ ఉంటారు. బాబా ఇటువంటివారిని కూడా చూసారు - రాత్రి వేళ ఒక ఊరు నుండి వస్తారు, ఉదయము సెంటర్ కు వచ్చి తమ జోలెని నింపుకుని వెళ్తారు. జోలె అనేది లోపల ఉన్నది బయటకు కారిపోయే విధముగా కూడా ఉండకూడదు. అటువంటివారు ఏం పదవిని పొందుతారు! పిల్లలైన మీకైతే చాలా సంతోషము ఉండాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు మనల్ని చదివిస్తున్నారు. ఇది ఎంత సహజమైన జ్ఞానము. ఎవరైతే పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారో వారిని పారసబుద్ధి కలవారిగా తయారుచెయ్యాలి అని బాబా భావిస్తారు. బాబాకైతే చాలా సంతోషము ఉంటుంది. వీరు గుప్తముగా ఉన్నారు కదా. జ్ఞానము కూడా గుప్తమైనదే. మమ్మా-బాబా ఈ లక్ష్మీ-నారాయణుల వలె తయారైతే మరి మేము వారికన్నా తక్కువగా అవుతామా, మేము కూడా సేవ చేస్తాము - అన్న ఈ నషా ఉండాలి. మనము మన రాజధానిని యోగబలముతో స్థాపన చేసుకుంటున్నాము. ఇప్పుడు మనము స్వర్గానికి యజమానులుగా అవుతాము. అక్కడ మళ్ళీ ఈ జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానము ఈ సమయానికి చెందినది మాత్రమే. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తెలివైనవారిగా అయి తమ సర్వస్వాన్ని నాథుడి పేరు మీద సఫలము చేసుకోవాలి. పతితులకు దానము ఇవ్వకూడదు. కేవలం బ్రాహ్మణులతో తప్ప ఇంకెవ్వరితోనూ కనెక్షన్ పెట్టుకోకూడదు.

2. బుద్ధి రూపీ జోలిలో జ్ఞానమంతా బయటకు కారిపోయే విధంగా కన్నమేదీ ఉండకూడదు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి చదివిస్తున్నారు, ఈ గుప్తమైన సంతోషములో ఉండాలి. తండ్రి సమానముగా దయార్ద్ర హృదయులుగా అవ్వాలి.

వరదానము:-
సంపన్నత ద్వారా సంతుష్టతను అనుభవం చేసే సదా హర్షిత, విజయీ భవ

ఎవరైతే సర్వ ఖజానాలతో సంపన్నముగా ఉంటారో వారే సదా సంతుష్టముగా ఉంటారు. సంతుష్టత అనగా సంపన్నత. ఏ విధంగా తండ్రి సంపన్నముగా ఉన్నారో, కావుననే వారి మహిమలో సాగరుడు అన్న పదాన్ని ఉపయోగిస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా మాస్టర్ సాగరులుగా అనగా సంపన్నముగా అవ్వండి, అప్పుడు సదా సంతోషములో నాట్యము చేస్తూ ఉంటారు. లోపలికి సంతోషము తప్ప ఇంకేమీ రాలేదు. స్వయం సంపన్నముగా ఉన్న కారణముగా ఎవరి వలన విసుగు చెందరు. ఏ విధమైన చిక్కులైనా లేక విఘ్నాలైనా ఒక ఆటలా అనుభవమవుతాయి, సమస్య మనోరంజనము యొక్క సాధనముగా అవుతుంది. నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్న కారణముగా సదా హర్షితముగా మరియు విజయులుగా ఉంటారు.

స్లోగన్:-
నాజూకు పరిస్థితులకు గాభరా పడకండి, వాటి నుండి పాఠము నేర్చుకుని స్వయాన్ని పరిపక్వముగా చేసుకోండి.

మాతేశ్వరిగారి అమూల్య మహావాక్యాలు

‘‘పరమాత్మ గురువు, టీచర్, తండ్రి రూపాలలో భిన్న-భిన్న సంబంధాలకు చెందిన వారసత్వాన్ని ఇస్తారు’’

చూడండి, పరమాత్మ మూడు రూపాలను ధారణ చేసి వారసత్వాన్ని ఇస్తారు. వారు మన తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా. ఇప్పడు తండ్రితో తండ్రి సంబంధము ఉంది, టీచర్ తో టీచర్ సంబంధము ఉంది, గురువుతో గురుత్వపు సంబంధము ఉంది. ఒకవేళ తండ్రి నుండి పారిపోతే మరి వారసత్వము ఎలా లభిస్తుంది? ఎప్పుడైతే పాస్ అయి టీచర్ నుండి సర్టిఫికేట్ తీసుకుంటారో, అప్పుడు టీచర్ యొక్క తోడు లభిస్తుంది. ఒకవేళ తండ్రికి నమ్మకస్థులైన, ఆజ్ఞాకారియైన బిడ్డగా అయి డైరెక్షన్ పై నడవకపోతే భవిష్య ప్రారబ్ధము తయారవ్వదు. అప్పుడు పూర్ణ సద్గతిని కూడా ప్రాప్తి చేసుకోలేరు, అలాగే తండ్రి నుండి పవిత్రతా వారసత్వాన్ని తీసుకోలేరు. పరమాత్ముని ప్రతిజ్ఞ ఏమిటంటే - ఒకవేళ మీరు తీవ్ర పురుషార్థము చేసినట్లయితే మీకు 100 రెట్ల లాభాన్ని ఇస్తాను. కేవలం ఊరికే అనటం కాకుండా వారితో సంబంధము కూడా లోతైనది ఉండాలి. అందరినీ హతమార్చు, నిరంతరము నన్ను స్మృతి చెయ్యి అని అర్జునుడిని కూడా ఆజ్ఞాపించారు. పరమాత్మ అయితే సమర్థుడు, సర్వశక్తివంతుడు, వారు తాము చేసిన ప్రతిజ్ఞను తప్పకుండా నిర్వర్తిస్తారు, కానీ పిల్లలు కూడా ఎప్పుడైతే తండ్రితో తోడును నిర్వర్తిస్తారో, అందరి నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్క పరమాత్మునితో జోడిస్తారో అప్పుడే వారి నుండి సంపూర్ణ వారసత్వము లభిస్తుంది.

అవ్యక్త ప్రేరణలు:- సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

ఆవేశము వచ్చి ఒకవేళ ఎవరైనా సత్యతను నిరూపిస్తే తప్పకుండా అందులో ఏదో ఒక అసత్యత ఇమిడి ఉన్నట్లు. చాలామంది పిల్లల భాష ఎలా అయిపోయిందంటే - నేను పూర్తిగా సత్యమే మాట్లాడుతాను, 100 శాతము సత్యము మాట్లాడుతాను అని. కానీ సత్యాన్ని నిరూపించే అవసరము లేదు. సత్యము సూర్యుడు వంటిది, అది దాగి ఉండలేదు, ఎన్ని గోడలను దాని ఎదురుగా తీసుకువచ్చినా కానీ సత్యత యొక్క ప్రకాశము ఎప్పుడూ దాగి ఉండలేదు. సభ్యతాపూర్వకమైన మాటలు, సభ్యతాపూర్వకమైన నడవడిక, ఇందులోనే సఫలత ఉంటుంది.