03-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ అనంతమైన నాటకములో మీరు అద్భుతమైన పాత్రధారులు, ఇది అనాది నాటకము, ఇందులో ఏ మార్పు జరగదు’’

ప్రశ్న:-
వివేకవంతులైన, దూరదృష్టి కల పిల్లలు మాత్రమే ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకోగలరు?

జవాబు:-
మూలవతనము నుండి మొదలుకొని మొత్తం డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గుహ్యమైన రహస్యము ఏదైతే ఉందో, అది దూరదృష్టి కల పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు, బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానమంతా వారి బుద్ధిలో ఉంటుంది. వారికి తెలుసు - ఈ అనంతమైన నాటకములో ఆత్మా రూపీ పాత్రధారి ఈ వస్త్రాన్ని ధరించి ఏ పాత్రనైతే అభినయిస్తుందో, అది సత్యయుగము నుండి మొదలుకొని కలియుగము వరకు పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఏ పాత్రధారి కూడా మధ్యలో తిరిగి వెళ్ళలేరు.

పాట:-
నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు...

ఓంశాంతి
ఈ పాటను పిల్లలు విన్నారు. ఇప్పుడు ఇందులో కొన్ని పదాలు కరెక్టుగా ఉన్నాయి, కొన్ని పదాలు తప్పుగా కూడా ఉన్నాయి. సుఖములో స్మరించడం జరగదు. దుఃఖము కూడా తప్పకుండా రావాల్సిందే. దుఃఖము కలిగినప్పుడే సుఖమును ఇవ్వడానికి తండ్రి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము సుఖధామము కొరకు చదువుకుంటున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. శాంతిధామము మరియు సుఖధామము. మొట్టమొదట ముక్తి, ఆ తర్వాత జీవన్ముక్తి ఉంటుంది. శాంతిధామము మన ఇల్లు, అక్కడ పాత్రను అభినయించడము జరగదు. పాత్రధారులు తమ ఇంటికి వెళ్ళిపోతారు, ఇంటిలో వారు పాత్రను ఏమీ అభినయించరు, పాత్ర అనేది రంగస్థలముపై అభినయించడం జరుగుతుంది, అలాగే ఇది కూడా ఒక రంగస్థలము. ఏ విధంగా హద్దులోని నాటకము ఉంటుందో, అలాగే ఇది అనంతమైన నాటకము. దీని ఆదిమధ్యాంతాల రహస్యము గురించి తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. వాస్తవానికి ఈ యాత్ర లేక యుద్ధము అనే పదాలను కేవలం అర్థం చేయించడానికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. అంతేకానీ ఇక్కడ యుద్ధాలు మొదలైనవి ఏవీ లేవు. యాత్ర అనే పదము కూడా ఉపయోగిస్తారు. కానీ వాస్తవానికి అది స్మృతి. స్మృతి చేస్తూ, చేస్తూ పావనముగా అయిపోతారు. ఈ యాత్ర పూర్తవ్వడం కూడా ఇక్కడే పూర్తవుతుంది. ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరము లేదు. పావనముగా అయి మన ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. అపవిత్రమైనవారైతే అక్కడికి వెళ్ళలేరు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ అయిన నాలో మొత్తం చక్రము యొక్క పాత్ర ఉంది. ఇప్పుడు ఆ పాత్ర పూర్తయ్యింది. తండ్రి సలహా ఇస్తున్నారు - నన్ను స్మృతి చేయండి, ఇది చాలా సహజము. ఇకపోతే మీరు స్మృతి చేయడానికి ఇక్కడే కూర్చుంటారు, ఎక్కడికీ వెళ్ళరు. తండ్రి వచ్చి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. ఇక్కడ యుద్ధమేమీ లేదు. స్వయాన్ని తమోప్రధానము నుండి సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. మాయపై విజయము పొందాలి. 84 జన్మల చక్రము పూర్తవ్వనున్నదని పిల్లలకు తెలుసు. భారత్ సతోప్రధానముగా ఉండేది, అక్కడ కూడా తప్పకుండా మనుష్యులే ఉంటారు, భూమి ఏమీ మారదు. ఇప్పుడు మీకు తెలుసు - మనము ఒకప్పుడు సతోప్రధానముగా ఉండేవారము, తర్వాత తమోప్రధానముగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. మీరు వచ్చి మమ్మల్ని పతితము నుండి పావనముగా చేయండి అని మనుష్యులు పిలుస్తూ ఉంటారు కూడా. కానీ వారు ఎవరు, ఎలా వస్తారు అనేదేమీ తెలియదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని వివేకవంతులుగా తయారుచేసారు. మీరు ఎంత ఉన్నతమైన పదవిని పొందుతారు. అక్కడి పేదవారు కూడా ఇక్కడి ధనవంతులకన్నా చాలా ఉన్నతముగా ఉంటారు. ఎంతో పెద్ద-పెద్ద రాజులు ఉండేవారు, వారి వద్ద ఎంతో ధనము ఉండేది, కానీ నిజానికి వారు వికారులే కదా. వీరికన్నా అక్కడి సాధారణమైన ప్రజలు కూడా చాలా ఉన్నతముగా ఉంటారు. బాబా అక్కడికీ, ఇక్కడికీ ఉన్న తేడాను తెలియజేస్తారు. రావణుడి నీడ పడడంతో పతితముగా అయిపోతారు. నిర్వికారులైన దేవతల ఎదురుగా వెళ్ళి, స్వయాన్ని పతితులుగా పిలుచుకుంటూ తల వంచి నమస్కరిస్తారు. తండ్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారిగా పైకి ఎక్కిస్తారు. ఇది ఒక్క క్షణము యొక్క విషయము. ఇప్పుడు తండ్రి జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు. పిల్లలైన మీరు దూరదృష్టి కలవారిగా అవుతారు. పైన ఉన్న మూలవతనము నుండి మొదలుకొని మొత్తం డ్రామా చక్రమంతా మీ బుద్ధిలో గుర్తుంది. హద్దులోని డ్రామాను చూసి వచ్చిన తర్వాత - వారు అందులో ఏమేమి చూశారో వినిపిస్తుంటారు కదా, వారి బుద్ధిలో అదంతా నిండి ఉంది కాబట్టే దానిని వర్ణిస్తూ ఉంటారు. ఆత్మలో దానిని నింపుకొని వస్తారు, వచ్చి దానినంతా డెలివరీ చేస్తారు (వినిపిస్తారు). అలాగే ఇవి అనంతమైన విషయాలు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల రహస్యము ఉండాలి, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ హద్దులోని నాటకములోనైతే ఒక నటుడు వెళ్ళిపోతే అతనికి బదులుగా మరో వ్యక్తి రాగలుగుతారు. ఎవరికైనా అనారోగ్యముగా ఉంటే అతనికి బదులుగా ఇంకొకరిని పెడతారు. ఇది చైతన్యమైన డ్రామా, ఇందులో ఏ చిన్న మార్పు కూడా జరగదు. పిల్లలైన మీకు తెలుసు - మనము ఆత్మ, ఇది శరీరము రూపీ వస్త్రము, దీనిని ధరించి మనము బహురూపీ పాత్రను అభినయిస్తున్నాము. నామ-రూపాలు, దేశము, ముఖకవళికలు మారుతూ ఉంటాయి. పాత్రధారులకు తమ పాత్రను గురించి తెలుస్తుంది కదా. తండ్రి పిల్లలకు ఈ చక్రము యొక్క రహస్యాన్ని అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. సత్యయుగము నుండి మొదలుకొని కలియుగము వరకు వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ కొత్తగా వచ్చి పాత్రను అభినయిస్తారు. దీనిని వివరంగా అర్థం చేయించడానికి సమయము పడుతుంది. బీజములో జ్ఞానము ఉంది కానీ అర్థం చేయించడానికి సమయమైతే పడుతుంది కదా. మీ బుద్ధిలో మొత్తము బీజము మరియు వృక్షము యొక్క రహస్యము ఉంది. అందులోనూ ఎవరైతే మంచి వివేకవంతులు ఉంటారో, వారే - ఈ వృక్షము యొక్క బీజము పైన ఉన్నారని, అలాగే దీని ఉత్పత్తి, పాలన మరియు సంహారము ఏ విధంగా జరుగుతుందని అర్థం చేసుకుంటారు. అందుకే త్రిమూర్తిని చూపించారు. దీని గురించి తండ్రి ఏదైతే వివరణ ఇస్తున్నారో, దానిని ఇతర మనుష్యులెవ్వరూ ఇవ్వలేరు. ఇక్కడికి వచ్చినప్పుడే అర్థమవుతుంది, అందుకే మీరు అందరికీ ఇక్కడికి వచ్చి అర్థం చేసుకోమని చెప్తుంటారు. కొందరు చాలా కఠినముగా ఉంటారు, వారు - మేమేమీ వినము అని అంటారు. కొందరు కాస్త వింటారు, కొందరు లిటరేచర్ తీసుకుంటారు, కొందరు తీసుకోరు. మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాలముగా, దూరదృష్టి కలదిగా తయారయ్యింది. మూడు లోకాల గురించి మీకు తెలుసు. మూలవతనము అని నిరాకారీ ప్రపంచమును అంటారు. సూక్ష్మవతనానికి సంబంధించి ఏమీ లేదు. మొత్తం కనెక్షన్ అంతా మూలవతనము మరియు స్థూలవతనముతోనే ఉంది. ఇకపోతే సూక్ష్మవతనము అనేది కేవలం కొద్ది సమయం కొరకు మాత్రమే ఉంది. మిగిలిన ఆత్మలంతా పాత్రను అభినయించేందుకు పై నుండి ఇక్కడకు వస్తారు. అన్ని ధర్మాలకు సంబంధించిన ఈ వృక్షము నంబరువారుగా ఉంటుంది. ఇది మనుష్యుల వృక్షము మరియు ఇది చాలా ఏక్యురేట్ అయినది. ఇందులో ఏ మాత్రమూ ముందు-వెనుక అవ్వదు. ఆత్మలు ఇంకే స్థానములోనూ ఇలా కూర్చోలేవు. ఆత్మలు బ్రహ్మ మహాతత్వములో నిలిచి ఉంటాయి, ఆకాశములో నక్షత్రాలు నిలిచి ఉన్నట్లుగా ఉంటాయి. ఆ నక్షత్రాలు అనేవి దూరం నుండి చిన్న-చిన్నగా కనిపిస్తాయి, వాస్తవానికి అవి పెద్దగా ఉంటాయి. కానీ ఆత్మ అనేది చిన్నగా, పెద్దగా అవ్వదు, అలాగే వినాశనము కూడా అవ్వదు. మీరు స్వర్ణిమ యుగములోకి వెళ్తారు, మళ్ళీ ఇనుప యుగములోకి వస్తారు. మనము స్వర్ణిమ యుగములో ఉండేవారమని, ఇప్పుడు ఇనుప యుగములోకి వచ్చేసామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు విలువ ఏమీ లేదు. మాయ మెరుపులు ఎన్ని ఉన్నా కానీ ఇది రావణుడి స్వర్ణిమ యుగము, అది ఈశ్వరీయ స్వర్ణిమ యుగము.

6-7 సంవత్సరాలలో ఇక చెప్పలేనంత ధాన్యము పండుతుంది అని మనుష్యులు అంటూ ఉంటారు. వారి ప్లాన్ ఎలా ఉందో మరియు పిల్లలైన మీ ప్లాన్ ఎలా ఉందో చూడండి? తండ్రి అంటారు, పాత ప్రపంచాన్ని కొత్తది తయారుచేయడమే నా ప్లాన్. మీ అందరికీ ఒకే ప్లాన్. తండ్రి శ్రీమతము ద్వారా మనము మన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మార్గాన్ని తెలియజేస్తారు, శ్రీమతాన్ని ఇస్తారు, స్మృతిలో ఉండేందుకు సలహాలు ఇస్తారు. మతము అన్న పదమైతే ఉంది కదా. తండ్రి సంస్కృత పదాలనైతే వాడరు. తండ్రి అయితే హిందీలోనే అర్థం చేయిస్తూ ఉంటారు. భాషలైతే ఎన్నో ఉన్నాయి కదా. అనువాదము చేసేవారు కూడా ఉంటారు, వారు విని మళ్ళీ వినిపిస్తూ ఉంటారు. హిందీ మరియు ఇంగ్లీష్ అయితే చాలామందికి తెలుసు, చదువుకుంటూ ఉంటారు. ఇకపోతే ఇంట్లో ఉండే మాతలైతే అంతగా చదువుకోరు. ఈ రోజుల్లో విదేశాల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ ఉంటారు. వారు హిందీలో మాట్లాడనే మాట్లాడలేకపోతారు. ఇంటికి వస్తే తమ తల్లితోనూ ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలుపెడతారు. ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేమి అర్థమవుతుంది అని పాపం ఆ తల్లి తికమకపడుతుంది. ఇక వారు ఎంతోకొంత హిందీని నేర్చుకోవలసి వస్తుంది. సత్యయుగములోనైతే ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేది, దానిని మళ్ళీ ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ సృష్టి చక్రము ఏ విధముగా తిరుగుతుంది అనేది బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఇక్కడ మీకు చాలా ఖాళీ దొరుకుతూ ఉంటుంది. ఉదయం స్నానము మొదలైనవి చేసి అలా విహరించడానికి బయటకు వెళ్తే చాలా ఆనందముగా ఉంటుంది. లోపల ఇదే స్మృతి ఉండాలి - మనమందరమూ పాత్రధారులము. ఇది కూడా ఇప్పుడే స్మృతి కలిగింది. బాబా మనకు 84 జన్మల చక్రము యొక్క రహస్యాన్ని తెలియజేసారు. మనము ఒకప్పుడు సతోప్రధానముగా ఉండేవారము, ఇది చాలా సంతోషకరమైన విషయము. మనుష్యులు అలా తిరుగుతూ ఉంటారు, దానిలో వారికి సంపాదన ఏమీ లేదు. మీరైతే చాలా సంపాదన సంపాదించుకుంటూ ఉంటారు. బుద్ధిలో చక్రము కూడా గుర్తుండాలి, అలాగే తండ్రిని కూడా స్మృతి చేస్తూ ఉండాలి. సంపాదన చేసుకునేందుకు తండ్రి చాలా మంచి-మంచి యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. ఏ పిల్లలైతే జ్ఞానాన్ని విచార సాగర మంథనము చేయరో, వారి బుద్ధిలో మాయ ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ఉంటుంది. వారినే మాయ విసిగిస్తూ ఉంటుంది. నేను ఈ చక్రములో ఏ విధంగా తిరిగాను అని లోలోపల ఆలోచించండి. సత్యయుగములో ఇన్ని జన్మలు తీసుకున్నారు, ఆ తర్వాత కిందికి దిగుతూ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. బాబా అన్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అయిపోతారు. నడుస్తూ, తిరుగుతూ బుద్ధిలో స్మృతి ఉన్నట్లయితే మాయ అలజడి సమాప్తమవుతుంది, మీకు ఎంతో లాభము కలుగుతుంది. స్త్రీ, పురుషులిరువురూ కలిసి వెళ్ళినా, ప్రతి ఒక్కరూ ఉన్నత పదవిని పొందేందుకు ఎవరికి వారే కృషి చేయవలసి ఉంటుంది. ఒంటరిగా వెళ్తే ఇంకా ఆనందముగా ఉంటుంది. ఇక మీరు మీ ధ్యాసలోనే ఉంటారు. వేరొకరు తోడుగా ఉంటే ఎంతోకొంత బుద్ధి అటూ ఇటూ వెళ్తుంది. వాస్తవానికి ఇది చాలా సహజమే. పూలతోటలు మొదలైనవి అన్ని స్థానాల్లోనూ ఉన్నాయి. ఎవరైనా ఇంజనీర్లు ఉంటే వారి బుద్ధిలో - ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి... అన్న చింతనే నడుస్తూ ఉంటుంది, వారి బుద్ధిలోకి ప్లాన్ వచ్చేస్తుంది. అలాగే మీరు కూడా ఇంట్లోనే కూర్చోండి కానీ మీ బుద్ధి అటువైపు లగ్నమై ఉండాలి. మీరు ఇది అలవాటు చేసుకున్నట్లయితే ఇక మీ లోపల ఇదే చింతన నడుస్తూ ఉంటుంది. చదువుకోవాలి కూడా, అలాగే వ్యాపారాలు మొదలైనవి కూడా చూసుకోవాలి. వృద్ధులు, యువత, పిల్లలు మొదలైనవారందరూ పావనముగా తయారవ్వాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఆత్మకు ఉంది. పిల్లలకు కూడా బాల్యములోనే ఈ బీజాలు పడినట్లయితే చాలా మంచిది. ఈ ఆధ్యాత్మిక విద్యను ఇంకెవ్వరూ నేర్పించలేరు.

మీ ఈ ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో, దీనిని మీకు తండ్రియే వచ్చి చదివిస్తారు. ఆ స్కూళ్లలో దైహికమైన విద్య లభిస్తుంది, అలాగే భక్తి మార్గములో ఉన్నది శాస్త్రాల విద్య. ఇది ఆత్మిక విద్య, దీనిని మీకు భగవంతుడు నేర్పిస్తారు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు, దీనిని స్వయంగా పరమ ఆత్మయే వచ్చి చదివిస్తారు, వారికి ఇంకే పేరు పెట్టడానికి వీల్లేదు. ఈ విద్యనైతే స్వయంగా తండ్రియే వచ్చి చదివిస్తారు. భగవానువాచ కదా. భగవంతుడు ఒకే ఒక్క సారి ఈ సమయములో వచ్చి అర్థం చేయిస్తారు, దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆ శాస్త్రాల విద్య వేరు. మీకు తెలుసు - జ్ఞానము మూడు రకాలుగా ఉంటుంది, ఒకటి - భౌతికమైన కాలేజీలలో చెప్పే జ్ఞానము, రెండవది - ఆధ్యాత్మిక శాస్త్రాల విద్య, మూడవది - ఈ ఆత్మిక జ్ఞానము. వారు ఫిలాసఫీలో ఎంత పెద్ద డాక్టర్లు అయినా కానీ వారి వద్ద ఉన్నది కూడా శాస్త్రాల విషయాలే. మీ ఈ జ్ఞానము పూర్తిగా వేరు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సర్వాత్మలకు తండ్రి అయిన ఆత్మిక తండ్రియే చదివిస్తారు. శాంతిసాగరుడు, సుఖసాగరుడు... అని వారికి మహిమ ఉంది. కృష్ణుడి మహిమ పూర్తిగా వేరు. గుణాలు, అవగుణాలు మనుష్యులలో ఉంటాయి, వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. తండ్రి మహిమను గురించి కూడా యథార్థ రీతిగా మీకు తెలుసు. వారంతా కేవలం చిలుకల వలె గానం చేస్తూ ఉంటారు కానీ అర్థమేమీ తెలియదు. తమ ఉన్నతిని ఎలా చేసుకోవాలి అని తండ్రి పిల్లలకు సలహా ఇస్తున్నారు. పురుషార్థము చేస్తూ ఉంటే పక్కాగా అవుతూ ఉంటారు. అప్పుడిక ఆఫీసులో పని చేసుకునే సమయములో కూడా ఆ స్మృతి ఉంటుంది, ఈశ్వరుని స్మృతి ఉంటుంది. మాయ స్మృతి అయితే అర్ధకల్పము కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు తండ్రి కూర్చుని యథార్థ రీతిగా అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని చూసుకోండి - మేము ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా అయిపోయాము! మళ్ళీ బాబా మమ్మల్ని ఈ విధంగా దేవతలుగా తయారుచేస్తున్నారు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. మొట్టమొదట భారత్ మాత్రమే ఉండేది. పాత్రను అభినయించేందుకు తండ్రి కూడా భారత్ లోకే వస్తారు. మీరు కూడా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారే కదా. మీరు పవిత్రముగా అవ్వాలి, లేకపోతే చివరిలో వస్తారు, ఇక అప్పుడు ఏమి సుఖము పొందుతారు. భక్తి ఎక్కువగా చేసి ఉండకపోతే రారు. వీరు ఈ జ్ఞానాన్ని అంతగా తీసుకోరు అని అర్థమవుతుంది. అది అర్థం చేసుకోగలరు కదా. చాలా కష్టపడతారు, కానీ ఏ ఒక్కరో మాత్రమే వెలువడుతారు, అయినా అలసిపోకూడదు. కృషి అయితే చేయవలసిందే. కృషి చేయకుండానైతే ఏమీ లభించదు. ప్రజలైతే తయారవుతూనే ఉంటారు.

బాబా పిల్లల ఉన్నతి కోసం యుక్తిని తెలియజేస్తున్నారు - పిల్లలూ, మీ ఉన్నతిని చేసుకోవాలంటే ఉదయముదయమే స్నానము మొదలైనవి చేసి వెళ్ళి ఏకాంతములో విహరించండి లేక కూర్చోండి. శారీరక ఆరోగ్యము కోసం వాకింగ్ చేయడం కూడా మంచిదే. దీని వలన బాబా స్మృతి కూడా కలుగుతుంది మరియు డ్రామా రహస్యము కూడా బుద్ధిలో ఉంటుంది, ఎంత సంపాదన కలుగుతుంది. ఇది సత్యమైన సంపాదన. ఆ సంపాదన పూర్తి అవ్వగానే ఇక ఈ సంపాదన కోసం చింతన చేయండి. ఇందులో కష్టమేమీ లేదు. బాబాను చూసారు కదా - ఈ రోజు ఇన్ని గంటలకు లేచాను, తర్వాత ఇది చేసాను, అది చేసాను... అంటూ మొత్తం జీవిత గాథనంతా వ్రాసుకునేవారు. తరువాత వారు చదివి నేర్చుకుంటారు అని వారు భావిస్తారు. గొప్ప-గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదువుతారు కదా. పిల్లల కోసం వ్రాస్తారు, తద్వారా పిల్లలు కూడా ఇంట్లో అటువంటి మంచి స్వభావము కలవారిగా ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేసి సతోప్రధానముగా అవ్వాలి. సతోప్రధాన ప్రపంచము యొక్క రాజ్యాన్ని మళ్ళీ తీసుకోవాలి. కల్ప-కల్పము మనము రాజ్యాన్ని తీసుకుంటాము మరియు పోగొట్టుకుంటాము అన్న విషయము మీకు తెలుసు. మీ బుద్ధిలో ఈ విషయము ఉంది. కొత్త ప్రపంచము మరియు కొత్త ధర్మము కొరకు ఇది కొత్త జ్ఞానము. అందుకే మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇక త్వరత్వరగా పురుషార్థము చేయండి. శరీరముపై ఎటువంటి నమ్మకము లేదు. ఈ రోజుల్లో మృత్యువు చాలా సహజమైపోయింది. అక్కడ అమరలోకములో ఇటువంటి మృత్యువు ఎప్పుడూ జరగదు, ఇక్కడైతే కూర్చుని, కూర్చుని ఉండగానే ఎలా చనిపోతారు, అందుకే మీ పురుషార్థము చేస్తూ ఉండండి, జమ చేసుకుంటూ ఉండండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బుద్ధిని జ్ఞాన చింతనలో బిజీగా ఉంచుకునే అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు సమయము లభించినా ఏకాంతములోకి వెళ్ళి విచార సాగర మంథనము చేయాలి. తండ్రిని స్మృతి చేసి సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి.

2. దూరదృష్టి కలవారిగా అయి ఈ అనంతమైన నాటకాన్ని యథార్థ రీతిలో అర్థం చేసుకోవాలి. పాత్రధారులందరి పాత్రను సాక్షీగా అయి చూడాలి.

వరదానము:-
మధురతా వరదానము ద్వారా సదా ముందుకు వెళ్ళే శ్రేష్ఠ ఆత్మ భవ

మధురత ఎటువంటి విశేషమైన ధారణ అంటే, అది చేదు ధరణిని కూడా మధురముగా తయారుచేస్తుంది. ఎవరికైనా రెండు క్షణాలు మధురమైన దృష్టిని ఇవ్వండి, మధురమైన మాటలను మాట్లాడండి, అప్పుడు ఏ ఆత్మనైనా సదా కొరకు నిండుగా చేయగలరు. రెండు క్షణాల మధురమైన దృష్టి మరియు మాటలు ఆ ఆత్మ యొక్క సృష్టిని పరివర్తన చేస్తాయి. మీ రెండు మధురమైన మాటలు కూడా సదా కొరకు వారిని మార్చేందుకు నిమిత్తముగా అవుతాయి, అందుకే మధురతా వరదానాన్ని సదా తోడుగా పెట్టుకోండి. సదా మధురముగా ఉండండి మరియు సర్వులను మధురముగా తయారుచేయండి.

స్లోగన్:-
ప్రతి పరిస్థితిలోనూ రాజీగా ఉన్నట్లయితే రాజయుక్తులుగా (రహస్యము తెలిసినవారిగా) అవుతారు.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి

ఎప్పుడైతే ఇతర సంకల్పాలన్నీ శాంతిస్తాయో, కేవలం ఒక్క బాబా మరియు నేను అన్న ఈ మిలనపు అనుభూతి యొక్క సంకల్పము ఉంటుందో, అప్పుడు సంకల్ప శక్తి జమ అవుతుంది మరియు యోగము శక్తిశాలిగా అవుతుంది. దీని కొరకు ఇముడ్చుకునే శక్తిని మరియు సర్దుబాటు శక్తిని ధారణ చెయ్యండి. సంకల్పాలపై ఫుల్ బ్రేక్ పడాలి, లూజ్ బ్రేక్ కాదు. ఒకవేళ ఒక్క క్షణానికి బదులుగా ఎక్కువ సమయము పట్టిందంటే, ఇముడ్చుకునే శక్తి బలహీనముగా ఉందని అర్థము.