03-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఏ పతిత దేహధారుల పైనా ప్రేమను ఉంచుకోకూడదు ఎందుకంటే మీరు పావన ప్రపంచములోకి వెళ్తున్నారు, ఒక్క తండ్రినే ప్రేమించాలి’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు ఏ విషయములో విసుగు చెందకూడదు మరియు ఎందుకు?

జవాబు:-
మీరు మీ ఈ పాత శరీరముతో కొద్దిగా కూడా విసుగు చెందకూడదు ఎందుకంటే ఈ శరీరము చాలా, చాలా విలువైనది. ఆత్మ ఈ శరీరములో కూర్చొని తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీని తీసుకుంటోంది. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే సంతోషమనే ఔషధం లభిస్తూ ఉంటుంది.

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఇప్పుడు దూరదేశ నివాసులు, ఆ తర్వాత దూరదేశ యాత్రికులవుతారు. మనం ఆత్మలము మరియు ఇప్పుడు చాలా దూరదేశానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నాము. ఆత్మలమైన మనం దూరదేశ నివాసులము అని కేవలం పిల్లలైన మీకే తెలుసు. మీరు వచ్చి మమ్మల్ని కూడా ఆ దూరదేశములోకి తీసుకువెళ్ళండి అని ఆ దూరదేశములో ఉండే తండ్రిని కూడా పిలుస్తారు. ఇప్పుడు దూరదేశ నివాసి అయిన తండ్రి పిల్లలైన మిమ్మల్ని అక్కడకు తీసుకువెళ్తారు. మీరు ఆత్మిక యాత్రికులు ఎందుకంటే మీరు ఈ శరీరముతోపాటు ఉన్నారు కదా. ఆత్మయే యాత్ర చేస్తుంది. శరీరాన్ని అయితే ఇక్కడే వదిలివేస్తుంది. ఇకపోతే ఆత్మ మాత్రమే యాత్రను చేస్తుంది. ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? తన ఆత్మిక లోకములోకి. ఇది దైహిక ప్రపంచము, అది ఆత్మిక ప్రపంచము. పిల్లలకు తండ్రి అర్థం చేయించారు - ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఎక్కడి నుండైతే పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చారో అక్కడకు వెళ్ళాలి. ఇది చాలా పెద్ద రంగస్థలము లేక స్టేజ్. స్టేజ్ పై యాక్టింగ్ చేసి పాత్రను అభినయించి మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. నాటకం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడే వెళ్తారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ బుద్ధియోగము ఇంటి వైపు మరియు రాజధాని వైపు ఉంది. దీనిని పక్కాగా గుర్తుంచుకోండి ఎందుకంటే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది అన్న గాయనము ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చదువుతున్నారు, భగవంతుడైన శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. భగవంతుడైతే ఈ పురుషోత్తమ సంగమయుగములో తప్ప ఇంకెప్పుడూ చదివించరు. మొత్తం 5000 సంవత్సరాలలో నిరాకార భగవంతుడైన తండ్రి ఒకేసారి వచ్చి చదివిస్తారు. ఈ నిశ్చయము మీకు పక్కాగా ఉంది. ఈ చదువు కూడా ఎంత సహజమైనది, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఆ ఇల్లు అంటే మొత్తం ప్రపంచమంతటికీ ప్రేమ. ముక్తిధామములోకి వెళ్ళాలనైతే అందరూ కోరుకుంటారు కానీ దాని అర్థాన్ని కూడా తెలుసుకోరు. మనుష్యుల బుద్ధి ఈ సమయములో ఎలా ఉంది మరియు మీ బుద్ధి ఇప్పుడు ఎలా తయారైంది, ఎంత తేడా ఉంది. మీది నంబరువారు పురుషార్థానుసారముగా స్వచ్ఛ బుద్ధిగా ఉంది. మొత్తం విశ్వము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము మీకు చాలా బాగా ఉంది. మేము ఇప్పుడు పురుషార్థము చేసి నరుని నుండి నారాయణునిగా తప్పకుండా అవ్వాలి అని మీ హృదయములో ఉంది. ఇక్కడి నుండైతే మొదట తమ ఇంటికి వెళ్తారు కదా. కావున సంతోషముగా వెళ్ళాలి. ఏ విధముగా సత్యయుగములో దేవతలు సంతోషముగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారో, అలా ఈ పాత శరీరాన్ని కూడా సంతోషముగా వదిలివేయాలి. దీనితో విసుగు చెందకూడదు ఎందుకంటే ఇది చాలా విలువైన శరీరము. ఈ శరీరము ద్వారానే ఆత్మకు తండ్రి నుండి లాటరీ లభిస్తుంది. మనం ఎప్పటివరకైతే పవిత్రులుగా అవ్వమో అప్పటివరకూ ఇంటికి వెళ్ళలేము. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాము, అప్పుడే ఆ యోగబలం ద్వారా పాపాల భారము తొలగుతుంది లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది. పవిత్రముగా అయితే తప్పకుండా అవ్వాలి. లౌకిక సంబంధములో కూడా పిల్లలు ఏవైనా అశుద్ధమైన పతితమైన పనులు చేస్తే తండ్రి కోపములోకి వచ్చి కర్రతో కూడా కొట్టేస్తారు ఎందుకంటే నియమ విరుద్ధంగా పతితముగా అవుతారు. ఎవరితోనైనా నియమ విరుద్ధంగా ప్రేమను ఉంచినా అది తల్లిదండ్రులకు నచ్చదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరైతే ఇక్కడ ఇక ఉండేది లేదు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. అక్కడ వికారీ పతితులు ఎవ్వరూ ఉండరు. ఒక్క పతిత-పావనుడైన తండ్రే వచ్చి మిమ్మల్ని అలా పావనులుగా తయారుచేస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది, ఇంకే ఆత్మా నా సమానముగా శరీరములోకి ప్రవేశించలేదు. ధర్మ స్థాపకులు ఎవరైతే వస్తారో వారి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది, కానీ వారి విషయము వేరు. నేనైతే అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకే వస్తాను. వారైతే తమ పాత్రను అభినయించేందుకు పై నుండి కిందకు దిగి వస్తారు. నేనైతే అందరినీ తీసుకువెళ్తాను మరియు మీరు ఏ విధముగా మొట్టమొదట కొత్త ప్రపంచములోకి దిగి వస్తారు అనేది తెలియజేస్తాను. ఆ కొత్త ప్రపంచమైన సత్యయుగములో కొంగలు ఎవరూ ఉండరు. తండ్రి అయితే కొంగల మధ్యకే వస్తారు, మళ్ళీ మిమ్మల్ని హంసలుగా తయారుచేస్తారు. మీరు ఇప్పుడు హంసలుగా అయ్యారు, ముత్యాలనే గ్రోలుతూ ఉంటారు. సత్యయుగములో మీకు ఈ రత్నాలు లభించవు. ఇక్కడ మీరు ఈ జ్ఞాన రత్నాలను గ్రోలి హంసలుగా అవుతారు. కొంగల నుండి మీరు హంసలుగా ఎలా అవుతారు, ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని హంసలుగా తయారుచేస్తారు. దేవతలను హంసలు అని, అసురులను కొంగలు అని అంటారు. ఇప్పుడు మీరు చెత్తను వదిలింపజేసి ముత్యాలను గ్రోలేలా చేస్తారు.

మిమ్మల్నే పదమాపదమ భాగ్యశాలులు అని అంటారు. మీ పాదాలపై పదమాల యొక్క ముద్ర పడుతుంది. శివబాబాకైతే అలా పదమాలు ఉండేందుకు పాదాలే లేవు. వారు మిమ్మల్ని పదమాపదమ భాగ్యశాలులుగా తయారుచేస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేయడానికి వచ్చాను. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవలసినవి. మనుష్యులు స్వర్గము ఉండేది అని అయితే భావిస్తారు కదా. కానీ అది ఎప్పుడు ఉండేది, మళ్ళీ ఎలా వస్తుంది? అన్నది తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు ప్రకాశములోకి వచ్చారు. వారంతా అంధకారములో ఉన్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఎప్పుడు మరియు ఎలా అయ్యారు అన్నది తెలియనే తెలియదు. ఇది 5000 సంవత్సరాల విషయము. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, ఏ విధముగా మీరు పాత్రను అభినయించేందుకు వస్తారో అలాగే నేనూ వస్తాను. మీరు ఆహ్వానాన్ని ఇచ్చి పిలుస్తారు - ఓ బాబా, పతితులైన మమ్మల్ని వచ్చి పావనంగా తయారుచేయండి. ఇంకెవ్వరినీ ఈ విధంగా ఎప్పుడూ పిలవరు. తమ ధర్మ స్థాపకులను కూడా, మీరు వచ్చి అందరినీ పావనంగా తయారుచేయండి అని ఎవరూ పిలవరు. క్రైస్టును లేక బుద్ధుడిని పతిత-పావనుడు అని అంటారా. గురువు అనగా సద్గతిని ఇచ్చేవారు. వాళ్ళు వస్తారు, వాళ్ళ వెనుక అందరూ కిందకు దిగవలసిందే. ఇక్కడి నుండి తిరిగి వెళ్ళే దారిని తెలియజేసేవారు, సర్వులకూ సద్గతిని ఇచ్చేవారు, అకాలమూర్తి అయిన తండ్రి ఒక్కరే. వాస్తవానికి సద్గురువు అన్న పదమే సరైనది. మీ అందరికన్నా సిక్కు ధర్మం వారు సరైన పదాలను ఉపయోగిస్తారు. పెద్ద శబ్దముతో సద్గురు అకాల్ అని అంటారు. చాలా జోరుగా ధ్వని చేస్తారు, సద్గురు అకాలమూర్తి అని అంటారు. మూర్తియే లేకపోతే వారు సద్గురువు ఎలా అవుతారు, సద్గతిని ఎలా ఇస్తారు? ఆ సద్గురువు స్వయమే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు - నేను మీ వలె జన్మ తీసుకోను. మిగిలిన స్థానాలలో అంతా శరీరధారులే కూర్చొని వినిపిస్తారు. మీకు అశరీరి అయిన ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఈ సమయములో మనుష్యులు ఏదైతే చేస్తారో అదంతా తప్పే చేస్తారు ఎందుకంటే వారు రావణుడి మతముపై ఉన్నారు కదా. ప్రతి ఒక్కరిలోనూ పంచ వికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది రావణ రాజ్యము, ఈ విషయాలను విస్తారముగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. లేకపోతే మొత్తం ప్రపంచమంతటి చక్రము గురించి ఎలా తెలుస్తుంది. ఈ చక్రము ఎలా తిరుగుతుందో తెలియాలి కదా. బాబా, మీరు అర్థం చేయించండి అని కూడా మీరు అనరు, స్వయంగా తండ్రే అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఒక్క ప్రశ్నను కూడా అడగవలసిన అవసరం ఉండదు. భగవంతుడైతే తండ్రి. తండ్రి పని అంతా తమకు తామే వినిపించడము, తమకు తామే అన్నీ చేయడము. పిల్లలను స్కూల్లో తండ్రి తనకు తానే కూర్చోబెడతారు. అలాగే ఉద్యోగంలో పెట్టి పిల్లలకు ఇలా చెప్తారు - 60 సంవత్సరాల తర్వాత వీటన్నింటినీ వదిలి భగవంతుని భజన చెయ్యండి, వేద-శాస్త్రాలు మొదలైనవి చదవండి, పూజలు చేయండి అని. మీరు అర్ధకల్పం పూజారులుగా అయ్యారు, మళ్ళీ అర్ధకల్పం కొరకు పూజ్యులుగా అవుతారు. పవిత్రముగా ఎలా అవ్వాలి అనేది ఎంత సహజముగా అర్థం చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత భక్తి పూర్తిగా తొలగిపోతుంది. వారంతా భక్తి చేస్తున్నారు, మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. వారు రాత్రిలో ఉన్నారు, మీరు పగలులోకి వెళ్తారు అనగా స్వర్గములోకి వెళ్తారు. గీతలో మన్మనాభవ అని వ్రాయబడి ఉంది, ఈ పదము ప్రసిద్ధమైనది. గీతను చదివేవారు అర్థం చేసుకోగలరు, ఎంతో సహజముగా వ్రాయబడి ఉంది. జీవితమంతా గీతను చదువుతూ వచ్చారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు ఆ గీతా భగవంతుడే కూర్చొని నేర్పిస్తారు కావున పతితుల నుండి పావనులుగా అవుతారు. ఇప్పుడు మనం భగవంతుడి నుండి గీతను వింటాము, మళ్ళీ ఇతరులకు వినిపిస్తాము, పావనంగా అవుతాము.

ఇది అదే సహజ రాజయోగము అని తండ్రి మహావాక్యాలున్నాయి కదా. మనుష్యులు ఎంతటి అంధవిశ్వాసములో మునిగిపోయి ఉన్నారు, అసలు మీ మాటే వినరు. డ్రామానుసారంగా వారి భాగ్యము కూడా ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడే వారు మీ వద్దకు రాగలుగుతారు. మీ వంటి భాగ్యము ఇంకే ధర్మమువారికి ఉండదు. మీ ఈ దేవీ-దేవతా ధర్మము ఎంతో సుఖాన్ని ఇచ్చే ధర్మము అని తండ్రి అర్థం చేయించారు. తండ్రి నిజమే చెప్తున్నారు అని మీరు కూడా భావిస్తారు. శాస్త్రాలలోనైతే అక్కడ కూడా కంసుడు, రావణుడు మొదలైనవారు ఉన్నట్లు చూపించారు. అక్కడి సుఖాల గురించైతే ఎవ్వరికీ తెలియదు. దేవతలను పూజిస్తారు కానీ వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేస్తున్నారా? తండ్రి పిల్లలకు మీరు నన్ను స్మృతి చేయండి అని చెప్పడం ఎప్పుడైనా విన్నారా? లౌకిక తండ్రి ఎప్పుడైనా ఈ విధంగా స్మృతి చేయించే పురుషార్థము చేయిస్తారా? ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీరు మొత్తం విశ్వము యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకొని చక్రవర్తీ రాజులుగా అవుతారు. మొదట మీరు ఇంటికి వెళ్తారు, ఆ తర్వాత పాత్రధారులుగా అయి వస్తారు. వీరు కొత్త ఆత్మా లేక పాత ఆత్మా అన్నది ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు. కొత్త ఆత్మ పేరు తప్పకుండా ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు కూడా చూడండి, కొందరికి ఎంత పేరు ఉంటుంది! మనుష్యులు ఎంతోమంది వచ్చేస్తారు. కూర్చుని-కూర్చునే అనాయాసముగా వచ్చేస్తారు. కావున ఆ ప్రభావము పడుతుంది. బాబా కూడా వీరిలోకి అనాయాసముగానే వస్తారు కావున ఆ ప్రభావము పడుతుంది. అక్కడ కూడా కొత్త ఆత్మ వచ్చినప్పుడు పాతవారిపై ప్రభావము ఉంటుంది. శాఖోపశాఖలు వెలువడుతూ ఉంటే వాటి మహిమ జరుగుతుంది. వారికి అంత పేరు ఎందుకు వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. కొత్త ఆత్మ అయిన కారణంగా ఆ ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంతమంది అసత్య భగవంతులుగా అయిపోయారు, అందుకే గాయనముంది - సత్యము యొక్క నావ కదులుతుంది, ఊగిసలాడుతుంది, కానీ మునిగిపోదు అని. తుఫానులు ఎన్నో వస్తాయి ఎందుకంటే భగవంతుడు నావికుడు కదా. పిల్లలు కూడా కదులుతారు, నావకు తుఫానులు ఎన్నో వస్తాయి. ఇతర సత్సంగాలలోకైతే ఎంతోమంది వెళ్తారు కానీ అక్కడ ఎప్పుడూ తుఫానులు మొదలైనవాటి విషయాలు ఉండవు. ఇక్కడ అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. అయినా కానీ స్థాపన అయితే జరగవలసిందే. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు - ఓ ఆత్మల్లారా, మీరు ఎంతగా అడవి ముళ్ళులా అయిపోయారు, ఇతరులకు ముళ్ళు గుచ్చుతూ ఉంటారు కావున మీకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి. ప్రతి విషయములోనూ రెస్పాన్స్ అయితే లభిస్తుంది. అక్కడ దుఃఖము కలిగించే అశుద్ధమైన విషయాలేవీ ఉండవు, అందుకే దానిని స్వర్గము అని అంటారు. మనుష్యులు స్వర్గము-నరకము అని అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని అంటారు, వాస్తవానికి అలా అనడం కూడా తప్పే. నిరాకారీ లోకాన్ని ఎవరూ స్వర్గము అని అనరు. అది ముక్తిధామము. కానీ వారు స్వర్గములోకి వెళ్ళారు అని అంటారు.

ఈ ముక్తిధామము ఆత్మల ఇల్లు అని ఇప్పుడు మీకు తెలుసు. ఏ విధంగా ఇక్కడ ఇళ్ళు ఉంటాయో అలా అది ఆత్మల ఇల్లు. భక్తి మార్గములో ఎవరైతే చాలా షావుకార్లుగా ఉంటారో, వారు ఎంత పెద్ద మందిరాలను నిర్మిస్తారు. శివుని మందిరము ఎలా తయారుచేయబడి ఉందో చూడండి. లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని నిర్మించినప్పుడు కూడా సత్యమైన ఆభరణాలు మొదలైనవి ఎన్ని ఉంటాయి. ఎంతో ధనము ఉంటుంది. ఇప్పుడు అన్నీ నకిలీగా అయిపోయాయి. మీరు కూడా ఇంతకుముందు ఎంత సత్యమైన నగలను ధరించేవారు. ఇప్పుడైతే ప్రభుత్వానికి భయపడి సత్యమైనవాటిని దాచి పెట్టుకొని నకిలీ వాటిని ధరిస్తూ ఉంటారు. అక్కడ అంతా సత్యమైనవే ఉంటాయి, నకిలీవి ఏవీ ఉండవు. ఇక్కడ సత్యమైనవి ఉన్నా కూడా వాటిని దాచిపెట్టుకుంటారు. రోజురోజుకు బంగారము ఖరీదు పెరిగిపోతూ ఉంటుంది. అక్కడైతే అది స్వర్గము. మీకు అన్నీ కొత్తగా లభిస్తాయి. కొత్త ప్రపంచములో అన్నీ కొత్తవే ఉంటాయి, అపారమైన ధనము ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతి వస్తువూ ఎంత ఖరీదైపోయింది. ఇప్పుడు పిల్లలైన మీకు మూలవతనము నుండి మొదలుకుని అన్ని రహస్యాలనూ అర్థం చేయించారు. మూలవతనము యొక్క రహస్యాన్ని తండ్రి తప్ప ఇంకెవరు అర్థం చేయిస్తారు. మీరు కూడా టీచరుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి కానీ కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి. ఇతరులను కూడా మీ సమానముగా తయారుచేసినట్లయితే చాలా ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. ఇక్కడ ఉండేవారికన్నా వారు ఉన్నత పదవిని పొందగలుగుతారు. నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు. బయట ఉంటూ కూడా విజయమాలలో కూర్చబడగలరు. వారం రోజుల కోర్సు తీసుకొని ఆ తర్వాత విదేశాలకైనా వెళ్ళండి లేక ఇంకెక్కడికైనా వెళ్ళండి. మొత్తం ప్రపంచమంతటికీ సందేశం లభించాలి. తండ్రి వచ్చారు, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తారు. ఆ తండ్రే ముక్తిప్రదాత, మార్గదర్శకుడు. మీరు అక్కడికి వెళ్తే వార్తాపత్రికల్లో కూడా పేరు ఎంతో ప్రఖ్యాతమవుతుంది. ఇతరులకు కూడా ఇది చాలా సహజమైన విషయముగా అనిపిస్తుంది - ఆత్మ మరియు శరీరము రెండూ వేర్వేరు. ఆత్మలోనే మనస్సు-బుద్ధి ఉన్నాయి, శరీరమైతే జడమైనది. పాత్రధారిగా ఆత్మయే అవుతుంది. అద్భుతమైనది ఆత్మయే. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. బయట ఉండేవారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఇక్కడ ఉండేవారు స్మృతి చేయరు. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో మరియు తమ సమానంగా తయారుచేస్తూ ఉంటారో, ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తూ ఉంటారో, వారు ఉన్నత పదవిని పొందుతారు. ఇంతకుముందు మనము కూడా ముళ్ళగానే ఉండేవారము అని మీరు భావిస్తారు. ఇప్పుడు తండ్రి ఆజ్ఞను జారీ చేసారు - కామము మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. కానీ అలా వ్రాసినంత మాత్రాన ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా జ్ఞాన రత్నాలను గ్రోలే హంసలుగా అవ్వాలి, ముత్యాలనే గ్రోలాలి, చెత్తను వదిలివేయాలి. ప్రతి అడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకొని పదమాపదమ భాగ్యశాలులుగా అవ్వాలి.

2. ఉన్నతమైన పదవిని పొందేందుకు టీచరుగా అయి అనేకుల సేవను చేయాలి. కమల పుష్ప సమానంగా పవిత్రముగా ఉంటూ తమ సమానంగా తయారుచేయాలి. ముళ్ళను పుష్పాలుగా తయారుచేయాలి.

వరదానము:-

నీది-నాది అన్న అలజడిని సమాప్తము చేసి దయా భావనను ఇమర్జ్ చేసే దయా స్వరూప భవ

ఎప్పటికప్పుడు ఎంతమంది ఆత్మలు దుఃఖపు అలలోకి వస్తుంటారు. కొంచెము ప్రకృతి అలజడిలోకి వచ్చినా, ఆపదలు వచ్చినా, అనేక ఆత్మలు తపిస్తూ ఉంటాయి, దయ-జాలిని కోరుకుంటాయి. కావున అటువంటి ఆత్మల పిలుపును విని దయా భావనను ఇమర్జ్ చేసుకోండి. పూజ్య స్వరూపాన్ని, దయా స్వరూపాన్ని ధారణ చెయ్యండి. స్వయాన్ని సంపన్నముగా చేసుకున్నట్లయితే ఈ దుఃఖపు ప్రపంచము సమాప్తమైపోతుంది. ఇప్పుడు పరివర్తన యొక్క శుభ భావన అనే అలను తీవ్రగతితో వ్యాపింపజేసినట్లయితే నీది-నాది అన్న అలజడి సమాప్తమైపోతుంది.

స్లోగన్:-

వ్యర్థ సంకల్పాల రూపీ సుత్తితో సమస్య రూపీ రాయిని పగలగొట్టేందుకు బదులుగా హై జంప్ చేసి సమస్య రూపీ పర్వతాన్ని దాటి వేసేవారిగా అవ్వండి.