03-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు సత్యాతి-సత్యమైన దీపపు పురుగులు,
ఇప్పుడు మీరు దీపముపై బలిహారమవుతారు, ఈ విధముగా బలిహారమవ్వడానికి స్మృతిచిహ్నమే ఈ
దీపావళి’’
ప్రశ్న:-
బాబా
తమ పిల్లలకు ఏ సమాచారాన్ని వినిపించారు?
జవాబు:-
ఆత్మలైన మీరు
నిర్వాణధామము నుండి ఎలా వస్తారు మరియు నేను ఎలా వస్తాను, నేను ఎవరిని, ఏం చేస్తాను,
రామ రాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తాను, పిల్లలైన మీరు రావణుడిపై విజయము పొందేలా ఎలా
చేస్తాను - ఇవన్నీ బాబా వినిపించారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాలన్నింటి గురించి
తెలుసు. మీ జ్యోతి వెలిగి ఉంది.
పాట:-
నీవే తల్లివి,
తండ్రివి నీవే...
ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మలు ఈ శారీరక కర్మేంద్రియాల ద్వారా
పాట విన్నారు. పాటలో మొదటి భాగము సరిగ్గానే ఉంది. చివరిలో మళ్ళీ భక్తిలోని పదాలు
ఉన్నాయి. మీ చరణాల ధూళి అని అంటారు, ఇప్పుడు పిల్లలు చరణాల ధూళి కాదు కదా. ఇది తప్పు.
తండ్రి పిల్లలకు రైట్ పదాలు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ఎక్కడి నుండైతే వస్తారో
తండ్రి కూడా అక్కడి నుండే వస్తారు, అదే నిర్వాణధామము. అందరూ ఎలా వస్తారు అన్న
సమాచారాన్ని అయితే పిల్లలకు వినిపించారు. నేను ఎలా వస్తాను, వచ్చి ఏం చేస్తాను అని
స్వయం గురించి కూడా వినిపించాను. రామ రాజ్యాన్ని స్థాపన చేసేందుకని రావణుడిపై
విజయాన్ని ప్రాప్తింపజేయిస్తారు. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము అనేవి ఈ భూమిపైనే
ఉన్నాయని అంటారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు.
భూమి, ఆకాశము, సూర్యుడు మొదలైనవన్నీ మీ చేతిలోకి వచ్చేస్తాయి. అందుకే, రావణ రాజ్యము
మొత్తం విశ్వముపై ఉంది మరియు రామ రాజ్యము కూడా మొత్తం విశ్వముపై ఉందని అంటారు. రావణ
రాజ్యములో ఎన్ని కోట్లమంది ఉన్నారు, రామ రాజ్యములో కొద్దిమందే ఉంటారు, ఆ తర్వాత
నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతారు. రావణ రాజ్యములో వృద్ధి చాలా జరుగుతుంది
ఎందుకంటే మనుష్యులు వికారీగా అయిపోతారు. రామ రాజ్యములో నిర్వికారులు ఉన్నారు. ఇది
మనుష్యుల కథే. కావున రాముడు కూడా అనంతమైన యజమాని, రావణుడు కూడా అనంతమైన యజమాని.
ఇప్పుడు అనేక ధర్మాలు ఎన్ని ఉన్నాయి. అనేక ధర్మాల వినాశనము జరుగుతుందని అంటూ ఉంటారు.
బాబా వృక్షము గురించి కూడా అర్థం చేయించారు.
ఇప్పుడు దసరా జరుపుకుంటారు, రావణుడిని కాలుస్తారు. ఇది హద్దులో కాల్చడము. మీదైతే
అనంతమైన విషయము. రావణుడిని కూడా కేవలం భారతవాసులే కాలుస్తారు, విదేశాలలో కూడా
ఎక్కడెక్కడైతే భారతవాసులు ఎక్కువగా ఉంటారో అక్కడ కూడా కాలుస్తారు. అది హద్దులోని
దసరా. లంకలో రావణుడు రాజ్యము చేసేవాడని, సీతను అపహరించి లంకకు తీసుకెళ్ళాడని
చూపిస్తారు. ఇవన్నీ హద్దులోని విషయాలు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మొత్తము
విశ్వమంతటిపైనా రావణ రాజ్యముంది. రామ రాజ్యము ఇప్పుడు లేదు. రామ రాజ్యము అనగా
ఈశ్వరుడు స్థాపించినటువంటిది. సత్యయుగాన్ని రామ రాజ్యము అని అంటారు. మాలను
స్మరిస్తారు, రఘుపతి రాఘవ రాజా రామ్ అని అంటారు, కానీ రాజు అయిన రాముడిని స్మరించరు,
ఎవరైతే మొత్తము విశ్వమంతటి సేవను చేస్తారో, వారి మాలను స్మరిస్తారు.
భారతవాసులు దసరా తర్వాత దీపావళిని జరుపుకుంటారు. దీపావళిని ఎందుకు జరుపుకుంటారు?
ఎందుకంటే దేవతల పట్టాభిషేకము జరుగుతుంది. పట్టాభిషేకము రోజున దీపాలు మొదలైనవి చాలా
వెలిగిస్తారు. ఒకటేమో పట్టాభిషేకము, మరొకటి ఇంటింటిలోనూ దీపావళి అని అంటారు. ప్రతి
ఒక్క ఆత్మ యొక్క జ్యోతి వెలుగుతుంది. ఇప్పుడు ఆత్మలందరి జ్యోతులు ఆరిపోయి ఉన్నాయి.
ఇది ఇనుపయుగము అనగా అంధకారము. అంధకారము అనగా భక్తి మార్గము. భక్తి చేస్తూ-చేస్తూ
జ్యోతి తగ్గిపోతూ ఉంటుంది. ఇకపోతే ఆ దీపావళి అయితే కృత్రిమమైనది. అలాగని
పట్టాభిషేకము జరిగినప్పుడు బాణాసంచాను కాలుస్తారని కాదు. దీపావళినాడు లక్ష్మిని
పిలుస్తారు, పూజలు చేస్తారు. ఇది భక్తి మార్గము యొక్క ఉత్సవము. ఏ రాజైతే సింహాసనముపై
కూర్చుంటారో, వారి పట్టాభిషేకపు రోజును వైభవముగా జరుపుతారు. ఇవన్నీ హద్దులోని
విషయాలు. ఇప్పుడైతే అనంతమైన వినాశనము, సత్యాతి-సత్యమైన దసరా జరగనున్నది. తండ్రి
అందరి జ్యోతులను వెలిగించేందుకు వచ్చారు. మా జ్యోతి పెద్ద జ్యోతితో కలిసిపోతుందని
మనుష్యులు భావిస్తారు. బ్రహ్మ సమాజము వారి మందిరాలలో జ్యోతి సదా వెలుగుతూ ఉంటుంది.
ఎలాగైతే దీపపు పురుగులు జ్యోతి చుట్టూ తిరిగి కాలిపోతాయో, అదే విధముగా మన ఆత్మ కూడా
ఇప్పుడు పెద్ద జ్యోతిలో కలిసిపోతుందని భావిస్తారు. దీనిని ఉదాహరణగా చూపిస్తారు.
ఇప్పుడు మీరు అర్ధకల్పము యొక్క ప్రేయసులు. మీరు వచ్చి ఆ ఒక్క ప్రియునిపై
బలిహారమయ్యారు, అంతేకానీ కాలిపోయే విషయమైతే లేదు. ఆ ప్రేయసీ, ప్రియుడు ఒకరి పట్ల
ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. ఇక్కడ వారొక్కరే ప్రియుడు, మిగిలినవారంతా ప్రేయసులు.
ప్రేయసులు ఆ ప్రియుడిని భక్తి మార్గములో స్మృతి చేస్తూ ఉంటారు. ప్రియతముడా, మీరు
వస్తే మేము మీపై బలిహారమవుతాము, మిమ్మల్ని తప్ప మేము ఇంకెవ్వరిని స్మృతి చేయము అని
అంటారు. ఇది మీ దైహిక ప్రేమ కాదు. ఆ ప్రేయసి, ప్రియులకు దైహిక ప్రేమ ఉంటుంది.
ఒకరినొకరు కేవలం అలా చూసుకుంటూ ఉంటారు, చూడడములోనే తృప్తి చెందుతారు. ఇక్కడైతే
ప్రియుడు ఒక్కరే, మిగిలినవారంతా ప్రేయసులు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు.
కొంతమంది ప్రకృతిని మొదలైనవాటిని కూడా నమ్ముతారు, అయినా కానీ, ఓ గాడ్, ఓ భగవంతుడా
అని నోటి నుండి తప్పకుండా వెలువడుతుంది. మా దుఃఖాన్ని దూరము చేయండి అని అందరూ వారిని
పిలుస్తారు. భక్తి మార్గములోనైతే ప్రేయసీ, ప్రియులు ఎంతోమంది ఉంటారు, కొందరు
కొందరిని, మరికొందరు మరికొందరిని ప్రేమిస్తూ ఉంటారు. హనుమంతునికి ఎంతమంది ప్రేయసులు
ఉంటారు? అందరూ తమ-తమ ప్రియుని చిత్రాన్ని తయారుచేసుకుని పరస్పరము కలిసి కూర్చుని
వారిని పూజిస్తారు. పూజించి మళ్ళీ ప్రియుడిని ముంచేస్తారు. దీని నుండి అర్థమేమీ
వెలువడదు. ఇక్కడ అటువంటి విషయమేదీ లేదు. మీ ఈ ప్రియుడు సదా తెల్లగా ఉంటారు, వీరు
ఎప్పుడూ నల్లగా అవ్వరు. యాత్రికుడైన తండ్రి వచ్చి అందరినీ తెల్లగా చేస్తారు. మీరు
కూడా యాత్రికులే కదా. దూరదేశము నుండి వచ్చి ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. మీలో
కూడా నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు
త్రికాలదర్శులుగా అయిపోయారు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలుసు కావున
మీరు త్రికాలదర్శీ బ్రహ్మాకుమార-కుమారీలుగా అయ్యారు. ఎలాగైతే వారికి జగద్గురు
మొదలైన టైటిల్స్ కూడా లభిస్తాయి కదా, అలా మీకు ఈ టైటిల్ లభిస్తుంది. మీకు
అన్నిటికన్నా మంచి టైటిల్ లభిస్తుంది, అదేమిటంటే - స్వదర్శన చక్రధారి. బ్రాహ్మణులైన
మీరే స్వదర్శన చక్రధారులా లేక శివబాబా కూడానా? (శివబాబా కూడా) అవును, ఎందుకంటే ఆత్మ
శరీరముతో పాటు స్వదర్శన చక్రధారిగా అవుతుంది కదా. తండ్రి కూడా వీరిలోకి వచ్చి అర్థం
చేయిస్తారు. శివబాబా స్వదర్శన చక్రధారి కాకపోతే వారు మిమ్మల్ని అలా ఎలా
తయారుచేస్తారు. వారు అందరికన్నా సుప్రీమ్, ఉన్నతోన్నతమైన ఆత్మ. దేహాన్ని అలా అనరు.
ఆ సుప్రీమ్ తండ్రియే వచ్చి మిమ్మల్ని సుప్రీమ్ గా తయారుచేస్తారు. స్వదర్శన
చక్రధారిగా ఆత్మలు తప్ప ఇంకెవ్వరూ అవ్వలేరు. ఏ ఆత్మలు? బ్రాహ్మణ ధర్మములో ఉన్నవారు.
శూద్ర ధర్మములో ఉన్నప్పుడు మీకు తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు.
ఇవి ఎంత మంచి-మంచి విషయాలు. మీరు మాత్రమే వింటారు మరియు సంతోషిస్తారు. బయటివారు ఈ
విషయాలను వింటే - ఓహో, ఇది చాలా ఉన్నతమైన జ్ఞానమని ఆశ్చర్యపోతారు. అచ్ఛా, మీరు కూడా
ఇటువంటి స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే చక్రవర్తి రాజులుగా, విశ్వానికి
యజమానులుగా అవుతారు. ఇక్కడ నుండి బయటకు వెళ్తే సమాప్తము. మాయ ఎంత ధైర్యశాలి. ఇక
ఇక్కడ విన్నది ఇక్కడే ఉండిపోతుంది. గర్భములో శిశువు ప్రతిజ్ఞ చేసి బయటకు వస్తాడు,
అయినా అక్కడిది అక్కడే ఉండిపోతుంది. మీరు ప్రదర్శనీ మొదలైనవాటిలో అర్థం
చేయించినప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటారు. జ్ఞానము చాలా బాగుంది, నేను
ఇటువంటి పురుషార్థము చేస్తాను, ఇది చేస్తాను... అని అంటారు. మళ్ళీ బయటకు రాగానే,
అక్కడిది అక్కడే ఉండిపోతుంది. కానీ ఎంతోకొంత ప్రభావముంటుంది. అలాగని వారు మళ్ళీ
రారని కాదు. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. వృక్షము వృద్ధి చెందినట్లయితే అందరినీ
ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఇది రౌరవ నరకము. గరుడ పురాణములో కూడా ఇటువంటి ఆసక్తికరమైన
విషయాలను వ్రాసారు, అవి మనుష్యులకు వినిపిస్తే కొంచెం భయపడతారని అలా వ్రాసారు.
మనుష్యులు పాములు, తేళ్లు మొదలైనవిగా అవుతారని దాని నుండే వెలువడింది. తండ్రి అంటారు,
నేను మిమ్మల్ని విషయ వైతరణీ నది నుండి బయటకు తీసి క్షీర సాగరములోకి పంపిస్తాను.
వాస్తవానికి మీరు శాంతిధామ నివాసులుగా ఉండేవారు, ఆ తర్వాత సుఖధామములో పాత్రను
అభినయించేందుకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనము శాంతిధామానికి మరియు సుఖధామానికి
వెళ్తాము. ఈ ధామాలను గుర్తు చేసుకుంటారు కదా. నీవే తల్లివి-తండ్రివి... అని పాడుతారు
కూడా. ఆ అపారమైన సుఖము సత్యయుగములో ఉంటుంది. ఇప్పుడు ఇది సంగమయుగము. ఇక్కడ అంతిమములో
దుఃఖములో రక్షణ కొరకు అలమటిస్తారు ఎందుకంటే అతి దుఃఖముంటుంది. ఆ తర్వాత సత్యయుగములో
అతి సుఖముంటుంది. అతి సుఖము మరియు అతి దుఃఖముల ఈ ఆట తయారై ఉంది. విష్ణువు అవతారము
అనే నాటకాన్ని కూడా చూపిస్తారు. అందులో లక్ష్మీ-నారాయణుల జంట పై నుండి వచ్చినట్లుగా
చూపిస్తారు. ఇప్పుడు పై నుండి శరీరధారులెవ్వరూ రారు. పై నుండి వచ్చేది ప్రతి ఒక్క
ఆత్మ. కానీ ఈశ్వరుని అవతరణ చాలా విచిత్రమైనది, వారే వచ్చి భారత్ ను స్వర్గముగా
తయారుచేస్తారు. వారి పండుగగా శివజయంతిని జరుపుకుంటారు. పరమపిత పరమాత్మ అయిన శివుడే
ముక్తి-జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తారని ఒకవేళ తెలిస్తే, ఇక విశ్వమంతటిలోనూ గాడ్
ఫాదర్ పండుగను జరుపుకుంటారు. శివబాబాయే ముక్తిదాత, గైడ్ అని అర్థం చేసుకున్నప్పుడు
అనంతమైన తండ్రి పేరు మీద పండుగను జరుపుకుంటారు. వారి జన్మే భారత్ లో జరుగుతుంది.
శివజయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు. కానీ పూర్తి పరిచయము లేకపోవడముతో సెలవు
కూడా ఇవ్వరు. సర్వులకు సద్గతిని ఇచ్చే ఆ తండ్రి యొక్క జన్మభూమిలో, వారు అలౌకిక
కర్తవ్యము చేసే భూమిలో, వారి జన్మ దినాన్ని మరియు తీర్థ యాత్రలను చాలా ఎక్కువగా
జరుపుకోవాలి. మీ స్మృతిచిహ్న మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ శివబాబాయే వచ్చి
ముక్తిదాతగా, గైడ్ గా అవుతారని ఎవ్వరికీ తెలియదు. అన్ని దుఃఖాల నుండి విడిపించి
సుఖధామములోకి తీసుకువెళ్ళండి అని అందరూ అంటారు, కానీ అర్థం చేసుకోరు. భారత్ చాలా
ఉన్నతోన్నతమైన ఖండము. భారత్ యొక్క మహిమ అపారమైనదని అంటూ ఉంటారు. ఇక్కడే శివబాబా
జన్మ జరుగుతుంది, వారిని ఎవ్వరూ నమ్మరు. వారి స్టాంపును తయారుచేయరు. ఇతరుల
స్టాంపులనైతే చాలా తయారుచేస్తూ ఉంటారు. మరి వీరి మహత్వము అందరికీ తెలిసేలా ఇప్పుడు
ఎలా అర్థం చేయించాలి. విదేశాలకు కూడా సన్యాసులు మొదలైనవారు వెళ్ళి భారత్ యొక్క
ప్రాచీన యోగాన్ని నేర్పిస్తారు. మీరు ఈ రాజయోగాన్ని తెలియజేసినప్పుడు మీకు చాలా పేరు
వస్తుంది. రాజయోగాన్ని ఎవరు నేర్పించారో ఎవ్వరికీ తెలియదని చెప్పండి. కృష్ణుడు కూడా
హఠయోగమైతే నేర్పించలేదు. ఈ హఠయోగము సన్యాసులది. చాలా బాగా చదువుకున్నవారు, ఎవరైతే
స్వయాన్ని ఫిలాసఫర్లుగా పిలుచుకుంటారో, వారు ఈ విషయాలను అర్థం చేసుకుని పరివర్తన
అవ్వాలి. మేము కూడా శాస్త్రాలు చదివాము కానీ ఇప్పుడు తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో,
అది రైట్, మిగిలినదంతా రాంగ్ అని వారు చెప్పాలి. తండ్రి వచ్చే ఈ స్థానమే తప్పకుండా
అన్నిటికన్నా గొప్ప తీర్థ స్థానమని కూడా వారు అర్థం చేసుకోవాలి. దీనిని ధర్మ భూమి
అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడున్నంత మంది ధర్మాత్మలు ఇంకెక్కడా ఉండరు.
మీరు ఎన్ని దాన-పుణ్యాలు చేస్తారు. తండ్రిని తెలుసుకుని, తనువు-మనసు-ధనము అన్నిటినీ
ఈ సేవలో పెడతారు. తండ్రియే అందరినీ విముక్తులుగా చేస్తారు. అందరినీ దుఃఖము నుండి
విడిపిస్తారు. ఇతర ధర్మస్థాపకులెవ్వరూ దుఃఖము నుండి విడిపించరు. ఆ ధర్మాలకు
చెందినవారు ధర్మస్థాపకుల వెనుక వస్తారు. అందరూ నంబరువారుగా పాత్రను అభినయించేందుకు
వస్తారు. పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ తమోప్రధానముగా అయిపోతారు, మళ్ళీ తండ్రి
వచ్చి సతోప్రధానముగా తయారుచేస్తారు. కావున ఈ భారత్ ఎంత గొప్ప తీర్థస్థానము. భారత్
అన్నిటికన్నా నంబరువన్ అయిన ఉన్నతమైన భూమి. తండ్రి అంటారు, ఇది నా జన్మభూమి, నేను
వచ్చి సర్వులకు సద్గతినిస్తాను, భారత్ ను స్వర్గముగా తయారుచేస్తాను.
తండ్రి స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు.
అటువంటి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అటువంటి
కర్మలు చేస్తారు. వీటినే అలౌకిక దివ్య కర్మలు అని అంటారు. వీటి గురించి ఎవ్వరికీ
తెలియదు అని అనుకోకండి. మీ ఈ చిత్రాలను తీసుకువెళ్ళేవారు కూడా వెలువడుతారు.
మంచి-మంచి చిత్రాలను తయారుచేస్తే వాటిని స్టీమరులో నింపుకుని తీసుకువెళ్తారు.
స్టీమరు ఎక్కడెక్కడైతే ఆగుతుందో, అక్కడ ఈ చిత్రాలను తగిలిస్తారు. మీ సేవ ఎంతగానో
జరుగనున్నది. హుండీని నింపే చాలా ఉదారచిత్తులైన వ్యక్తులు కూడా ఎంతోమంది వెలువడుతారు,
వారు ఇటువంటి పనులు చేయడం మొదలుపెడతారు, తద్వారా ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి
కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారెవరో అందరికీ అర్థమవుతుంది. మీరు కూడా మొదట తుచ్ఛ
బుద్ధికలవారిగానే ఉండేవారు, ఇప్పుడు మీరు ఎంత స్వచ్ఛ బుద్ధికలవారిగా అయ్యారు. మనము
ఈ జ్ఞానము మరియు యోగబలము ద్వారా విశ్వాన్ని స్వర్గముగా తయారుచేస్తామని మీకు తెలుసు.
మిగిలినవారందరూ ముక్తిధామములోకి వెళ్ళిపోతారు. మీరు కూడా అథారిటీలుగా అవ్వాలి. మీరు
అనంతమైన తండ్రికి పిల్లలు కదా. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. తండ్రిని వరల్డ్
ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) అని అంటారు. వారు వేద, శాస్త్రాలన్నిటి సారాన్ని
తెలియజేస్తారు. కావున పిల్లలకు సేవ యొక్క ఉత్సాహము ఎంతగా ఉండాలి. నోటి ద్వారా జ్ఞాన
రత్నాలు తప్ప ఇంకేమీ వెలువడకూడదు. మీలో ప్రతి ఒక్కరూ రూప్-బసంత్ (యోగ స్వరూపులు,
జ్ఞాన స్వరూపులు). ప్రపంచమంతా సస్యశ్యామలముగా తయారవుతుంది అన్నది మీరు చూస్తారు.
అంతా కొత్తదిగా అవుతుంది, అక్కడ దుఃఖమనే పేరే ఉండదు. పంచ తత్వాలు కూడా మీ సేవలో
హాజరై ఉంటాయి. ఇప్పుడవి డిస్సర్వీస్ చేస్తాయి ఎందుకంటే మనుష్యులు అర్హులుగా లేరు.
తండ్రి ఇప్పుడు అర్హులుగా చేస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. రూప్-బసంత్ గా (యోగ స్వరూపులుగా, జ్ఞాన స్వరూపులుగా) అయి నోటి ద్వారా సదా
జ్ఞాన రత్నాలే వెలువడాలి. సేవ యొక్క ఉత్సాహములో ఉండాలి. స్మృతిలో ఉండాలి మరియు
అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి - ఈ దివ్య అలౌకిక కార్యాన్నే చేయాలి.
2. సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అయి ఒక్క ప్రియునిపై బలిహారమవ్వాలి అనగా బలి
అవ్వాలి, అప్పుడే సత్యమైన దీపావళి జరుగుతుంది.
వరదానము:-
విశ్వ మహారాజు యొక్క పదవిని ప్రాప్తి చేసుకునే సర్వ శక్తుల
స్టాక్ తో సంపన్న భవ
ఎవరైతే విశ్వ మహారాజు పదవిని ప్రాప్తి చేసుకునే ఆత్మలు
ఉంటారో, వారి పురుషార్థము కేవలం స్వయం గురించి మాత్రమే ఉండదు. స్వయము యొక్క
జీవితములో వచ్చే విఘ్నాలను మరియు పరీక్షలను దాటి వేయడమనేది చాలా సామాన్యమైన విషయము,
కానీ విశ్వ మహారాజులుగా అయ్యే ఆత్మలు ఎవరైతే ఉంటారో, వారి వద్ద ఇప్పటినుండే సర్వ
శక్తుల స్టాక్ నిండుగా ఉంటుంది. వారి ప్రతి క్షణము, ప్రతి సంకల్పము ఇతరుల కొరకు
ఉంటుంది. తనువు, మనసు, ధనము, సమయము, శ్వాస అన్నీ విశ్వ కళ్యాణములో సఫలమవుతూ ఉంటాయి.
స్లోగన్:-
ఒక్క
బలహీనత ఉన్నా సరే, అది అనేక విశేషతలను సమాప్తము చేస్తుంది, అందుకే బలహీనతలకు
విడాకులు ఇవ్వండి.
అవ్యక్త సూచనలు -
స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి
మీ శుభ భావన, శ్రేష్ఠ
కామన, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా ఏ స్థానములో ఉన్నా కానీ మనసు
ద్వారా అనేకాత్మల సేవను చేయగలుగుతారు. దీనికి విధి ఏమిటంటే - లైట్ హౌస్, మైట్ హౌస్
గా అవ్వటము. ఇందులో స్థూల సాధనాలు ఉండటము, అవకాశము లభించటము లేక సమయము లభించటము అనే
సమస్యలు లేవు. కేవలము లైట్-మైట్ తో సంపన్నముగా అయ్యే అవసరముంది.
| | |