03-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 25.10.2002


‘‘బ్రాహ్మణ జీవితము యొక్క ఆధారము - పవిత్రత యొక్క రాయల్టీ’’

ఈ రోజు స్నేహ సాగరుడు తమ స్నేహీ పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలు ఆత్మిక సూక్ష్మ దారముతో బంధింపబడి తమ మధురమైన ఇంటికి చేరుకున్నారు. పిల్లలు ఏ విధంగా స్నేహములో ఆకర్షింపబడి చేరుకున్నారో, అలాగే బాబా కూడా పిల్లల స్నేహమనే దారముతో బంధింపబడి పిల్లల సమ్ముఖానికి చేరుకున్నారు. బాప్ దాదా చూస్తున్నారు, నలువైపులా ఉన్న పిల్లలు కూడా దూరముగా కూర్చుని ఉన్నా కానీ స్నేహములో నిమగ్నమై ఉన్నారు. సమ్ముఖములో ఉన్న పిల్లలను కూడా చూస్తున్నారు మరియు దూరముగా కూర్చుని ఉన్న పిల్లలను కూడా చూస్తూ-చూస్తూ హర్షిస్తున్నారు. ఈ ఆత్మిక అవినాశీ స్నేహము, పరమాత్మ స్నేహము, ఆత్మిక స్నేహము మొత్తము కల్పములో ఇప్పుడే అనుభవం చేస్తున్నారు.

బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి పవిత్రత యొక్క రాయల్టీని చూస్తున్నారు. బ్రాహ్మణ జీవితము యొక్క రాయల్టీనే ప్యూరిటీ (పవిత్రత). పిల్లలు ప్రతి ఒక్కరి తలపై ఆత్మిక రాయల్టీకి గుర్తుగా పవిత్రతకు చెందిన ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా మీ పవిత్రత యొక్క కిరీటాన్ని, ఆత్మిక రాయల్టీ యొక్క కిరీటాన్ని చూస్తున్నారా? వెనుక ఉన్నవారు కూడా చూస్తున్నారా? కిరీటధారుల సభ ఎంతటి శోభాయమానంగా ఉంది. పాండవులూ, అవును కదా? కిరీటము మెరుస్తూ ఉంది కదా! అటువంటి సభను చూస్తున్నారు కదా! కుమారీలు, కిరీటధారులైన కుమారీలే కదా! పిల్లల రాయల్ ఫ్యామిలీ ఎంతటి శ్రేష్ఠమైనది అన్నదానిని బాప్ దాదా చూస్తున్నారు! మీ అనాది రాయల్టీని గుర్తు తెచ్చుకోండి, ఆత్మలైన మీరు పరంధామములో ఉన్నప్పుడు కూడా, ఆ ఆత్మ రూపములో కూడా మీ ఆత్మిక రాయల్టీ విశేషమైనది. ఆత్మలందరూ కూడా లైట్ రూపములో ఉంటారు కానీ మీ మెరుపు సర్వాత్మలలో కల్లా శ్రేష్ఠమైనది. పరంధామము గుర్తొస్తుందా? అనాది కాలము నుండి మీ మెరుపు, శుద్ధ గర్వము అతీతమైనది. ఏ విధముగా ఆకాశములో చూసి ఉంటారు కదా, సితారలన్నీ మెరుస్తూ ఉంటాయి, అన్నింటిలోనూ ప్రకాశము ఉంటుంది కానీ, అన్ని సితారలలోకీ కొన్ని విశేషమైన సితారల మెరుపు అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. అలాగే ఆత్మలందరి మధ్యలో మీ ఆత్మల మెరుపు ఆత్మిక రాయల్టీ, ప్యూరిటీ యొక్క మెరుపు అతీతమైనది. గుర్తొస్తూ ఉంది కదా? ఆ తర్వాత ఆది కాలములోకి రండి, ఆదికాలమును గుర్తు చేసుకున్నట్లయితే ఆది కాలములో కూడా దేవతా స్వరూపములో ఆత్మిక రాయల్టీ యొక్క పర్సనాలిటీ ఎంత విశేషమైనదిగా ఉంది? మొత్తము కల్పములో దేవతా స్వరూపములో ఉన్న రాయల్టీ మరెవరికైనా ఉండేదా? ఆత్మిక రాయల్టీ, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ (వ్యక్తిత్వం) గుర్తుంది కదా! పాండవులకు కూడా గుర్తుందా? గుర్తొచ్చిందా? ఆ తర్వాత మధ్యకాలములోకి వస్తే, మధ్యకాలమైన ద్వాపరము నుండి మొదలుకుని మీ పూజ్య చిత్రాలను ఏవైతే తయారుచేస్తారో, ఆ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ ద్వాపరము నుండి ఇప్పటివరకు మరే చిత్రానికైనా ఉందా? చిత్రాలైతే చాలామందివి ఉన్నాయి, కానీ ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరే ఆత్మలకైనా ఉందా? ధర్మపితలవైనా, నేతలవైనా, అభినేతలవైనా, చిత్రాలైతే అందరివీ తయారవుతాయి, కానీ చిత్రాలలోని రాయల్టీని మరియు పూజలోని రాయల్టీని ఎవరిదైనా చూసారా? డబుల్ విదేశీయులు తమ పూజను చూసారా? మీరు చూసారా లేక కేవలం విన్నారా? ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరియు చిత్రాలలోని మెరుపు, ఆత్మికత మరెవ్వరికీ ఇంతవరకు లేదు మరియు ఉండదు కూడా. ఎందుకని? అది పవిత్రత యొక్క రాయల్టీ, పవిత్రత యొక్క పర్సనాలిటీ. అచ్ఛా, మీ పూజను చూసుకున్నారా? చూడకపోతే చూడండి. ఇప్పుడు చివరకు అనగా సంగమయుగానికి వచ్చినట్లయితే సంగమములో కూడా మొత్తము విశ్వములో పవిత్రత యొక్క రాయల్టీనే బ్రాహ్మణ జీవితానికి ఆధారము. పవిత్రత లేకపోతే ప్రభు ప్రేమ యొక్క అనుభవము కూడా ఉండదు. పరమాత్ముని సర్వ ప్రాప్తుల అనుభవము ఉండదు. బ్రాహ్మణ జీవితము యొక్క పర్సనాలిటీ పవిత్రత మరియు పవిత్రతయే ఆత్మిక రాయల్టీ. కనుక ఆది అనాదిలో, ఆదిమధ్యాంతాలలో, మొత్తం కల్పములో ఈ ఆత్మిక రాయల్టీ ఉంటూ ఉంది.

మరి మిమ్మల్ని మీరు చూసుకోండి - దర్పణమైతే మీ అందరి వద్దా ఉంది కదా? దర్పణము (అద్దము) ఉందా? చూసుకోగలరా? మరి చూసుకోండి. మా లోపల పవిత్రత యొక్క రాయల్టీ ఎంత శాతము ఉంది? మా ముఖములో పవిత్రతతో కూడిన మెరుపు కనిపిస్తుందా? నడవడికలో పవిత్రతతో కూడిన శుద్ధ గర్వము కనిపిస్తుందా? శుద్ధ గర్వము అనగా నషా. నడవడికలో ఆ శుద్ధ గర్వము అనగా ఆత్మిక నషా కనిపిస్తుందా? మిమ్మల్ని మీరు చూసుకున్నారా? చూసుకునేందుకు ఎంత సమయము పడుతుంది? ఒక్క క్షణం కదా? మరి అందరూ స్వయాన్ని చూసుకున్నారా?

కుమారీలు:- మెరుపు, శుద్ధ గర్వము ఉన్నాయా? మంచిది, అందరూ లేవండి, నిలబడండి. (కుమారీలు ఎరుపు రంగు పట్టీలు వేసుకుని ఉన్నారు, దానిపై ఏకవ్రత అని వ్రాసి ఉంది). సుందరంగా అనిపిస్తుంది కదా. ఏకవ్రత యొక్క అర్థమే పవిత్రత యొక్క రాయల్టీ. మరి ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకున్నారా! అక్కడికి వెళ్ళి మళ్ళీ కచ్చాగా అవ్వకూడదు. మరియు కుమారుల గ్రూప్ లేవండి. కుమారుల గ్రూప్ కూడా బాగుంది. కుమారులు మనసులో ప్రతిజ్ఞా పట్టీని ధరించారు, వీరు (కుమారీలు) బయటకు కూడా ధరించారు. ఏ ప్రతిజ్ఞా పట్టీని ధరించారంటే - సదా అనగా నిరంతరము పవిత్రత యొక్క పర్సనాలిటీలో ఉండే కుమారులము అని. అటువంటివారే కదా? అవును అని చెప్పండి. కాదా లేక అవునా? లేకపోతే అక్కడకు వెళ్ళి - కొంచెం, కొంచెం ఢీలా అయిపోయాము అని ఉత్తరం వ్రాస్తారా? అలా చెయ్యకండి. ఎప్పటివరకైతే బ్రాహ్మణ జీవితములో జీవించి ఉండాలో, అప్పటివరకు సంపూర్ణ పవిత్రముగా ఉండాల్సిందే. అటువంటి ప్రతిజ్ఞను చేసారా? పక్కా ప్రతిజ్ఞ అయితే చేయి ఊపండి. టి.వి.లో మీ ఫోటో తీస్తున్నారు. ఎవరైతే ఢీలా అవుతారో వారికి ఈ చిత్రాన్ని పంపుతాము, అందుకే ఢీలా అవ్వకండి, పక్కాగా ఉండండి. అవును, పక్కాగా ఉన్నారు, పాండవులైతే పక్కాగా ఉంటారు. పక్కా పాండవులు, చాలా మంచిది.

పవిత్రత యొక్క వృత్తి అనగా శుభ భావన, శుభ కామన. ఎవరు ఎలా ఉన్నా కానీ పవిత్ర వృత్తి అనగా శుభ భావన, శుభ కామన మరియు పవిత్ర దృష్టి అనగా సదా ప్రతి ఒక్కరినీ ఆత్మిక రూపములో చూడటము లేక ఫరిశ్తా రూపములో చూడటము. కనుక వృత్తి, దృష్టి మరియు మూడవది కృతి, అనగా కర్మలలో, కర్మలలో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వటము మరియు సుఖాన్ని తీసుకోవటము. ఇది పవిత్రతకు గుర్తు. వృత్తి, దృష్టి మరియు కృతి, మూడింటిలోనూ ఈ ధారణ ఉండాలి. ఎవరు ఏం చేసినా గాని, దుఃఖాన్ని ఇచ్చినా గాని, అవమానపరిచినా గాని మన కర్తవ్యం ఏమిటి? దుఃఖాన్నిచ్చేవారిని ఫాలో చెయ్యాలా లేక బాప్ దాదాను ఫాలో చెయ్యాలా? ఫాలో ఫాదర్ చెయ్యాలి కదా! మరి బ్రహ్మాబాబా దుఃఖాన్ని ఇచ్చారా లేక సుఖాన్ని ఇచ్చారా? సుఖాన్ని ఇచ్చారు కదా! మరి మాస్టర్ బ్రహ్మా అయిన మీరు అనగా బ్రాహ్మణ ఆత్మలు ఏం చెయ్యాలి? ఎవరైనా దుఃఖాన్ని ఇస్తే మీరేం చేస్తారు? మీరూ దుఃఖాన్ని ఇస్తారా? ఇవ్వరా? ఒకవేళ వారు చాలా దుఃఖాన్నిస్తే? చాలా నిందిస్తే, చాలా అవమానపరిస్తే కొంచెమైతే ఫీల్ అవుతారా లేక ఫీలవ్వరా? కుమారీలు ఫీల్ అవుతారా? కొంచెం. ఫాలో ఫాదర్ చెయ్యండి. నా కర్తవ్యము ఏమిటి అన్నదాని గురించి ఆలోచించండి. వారి కర్తవ్యాన్ని చూసి మీ కర్తవ్యాన్ని మర్చిపోకండి. వారు నిందిస్తున్నారు, మీరు సహనశీల దేవీలుగా, సహనశీల దేవతలుగా అవ్వండి. మీ సహనశీలతతో నిందించేవారు కూడా మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. సహనశీలతలో ఇంతటి శక్తి ఉంది, కానీ కొద్ది సమయమైతే సహించాల్సి ఉంటుంది. కనుక మీరు సహనశీలతా దేవతలు మరియు దేవీలు కదా? అంతేనా? సదా ఇదే స్మృతిలో ఉంచుకోండి - నేను సహనశీలతా దేవతను, నేను సహనశీలతా దేవిని. దేవత అనగా ఇచ్చే దాత, ఎవరైనా నిందిస్తే, గౌరవించకపోతే, అది చెత్త కదా లేక మంచిదా? మరి మీరెందుకు తీసుకుంటారు? చెత్తను తీసుకోవటం జరుగుతుందా ఏమిటి? ఎవరైనా మీకు చెత్తనిస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. గౌరవించరు, అవమానిస్తారు, నిందిస్తారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, ఇవన్నీ ఏమిటి? మంచి విషయాలా? మరి మీరెందుకు తీసుకుంటారు? కొద్దికొద్దిగా అయితే తీసుకుంటారు. అయ్యో, తీసుకోకుండా ఉండాల్సింది అని తర్వాత ఆలోచిస్తారు. కనుక ఇప్పుడిక తీసుకోకూడదు. తీసుకోవటము అనగా మనసులో దానిని ధారణ చెయ్యటము, ఫీల్ అవ్వటము. మరి మీ అనాది కాలము, ఆది కాలము, మధ్య కాలము, సంగమ కాలము, మొత్తము కల్పములోని పవిత్రత యొక్క రాయల్టీని, పర్సనాలిటీని గుర్తు చేసుకోండి. ఎవరు ఏం చేసినా కానీ మీ పర్సనాలిటీని ఎవ్వరూ లాక్కోలేరు. ఈ ఆత్మిక నషా ఉంది కదా? డబుల్ విదేశీయులకైతే డబుల్ నషా ఉంది కదా! డబుల్ నషా ఉందా? అన్ని విషయాలలోనూ డబుల్ నషా. పవిత్రతలో కూడా డబుల్ నషా, సహనశీలతా దేవీ-దేవతలుగా అవ్వడములో కూడా డబుల్ నషా. డబుల్ ఉంది కదా? కేవలం అమరులుగా ఉండండి. అమర భవ అన్న వరదానాన్ని ఎప్పుడూ మర్చిపోకండి.

అచ్ఛా - ప్రవృత్తిలో ఉన్నవారు అనగా యుగళులు, మామూలుగా అయితే సింగల్ గా ఉంటారు, కానీ అనటానికి యుగళులు అని అంటారు, వారు లేవండి, నిలబడండి. యుగళులైతే చాలామంది ఉన్నారు. కుమార, కుమారీలైతే తక్కువమంది ఉన్నారు. కుమారుల కంటే యుగళులు ఎక్కువమంది ఉన్నారు. యుగళమూర్తి అయిన బాప్ దాదా మీ అందరికీ ప్రవృత్తిలో ఉండమనే డైరెక్షన్ ను ఎందుకని ఇచ్చారు? మీకు యుగళులుగా ఉండేందుకు అనుమతిని ఎందుకు ఇచ్చారు? ప్రవృత్తిలో ఉండమనే అనుమతిని ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకంటే యుగళుల రూపములో ఉంటూ ఈ మహామండలేశ్వరులను మీ పాదాలపై ఒంగేటట్లుగా చేయాలి. అంతటి ధైర్యము ఉందా? వాళ్ళు అంటారు, కలిసి ఉంటూ పవిత్రముగా ఉండటము కష్టము అని, కానీ మీరేమి అంటారు? కష్టమా లేక సహజమా? (చాలా సహజము). పక్కానా? లేకపోతే ఒక్కోసారి ఈజీ (సులభం)గా, ఒక్కోసారి లేజీ (సోమరులు)గా ఉంటారా? అందుకే బాప్ దాదా డ్రామానుసారముగా మిమ్మల్నందరినీ ప్రపంచము ముందు, విశ్వము ముందు ఉదాహరణగా తయారుచేసారు. వారితో ఛాలెంజ్ చేసేందుకు ఇలా ఉదాహరణగా చేసారు. కనుక ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తులుగా, అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండగలరా? మరి ఛాలెంజ్ చేసేవారే కదా? అందరూ ఛాలెంజ్ చేసేవారేనా, కొద్దికొద్దిగా భయపడటమైతే లేదు కదా! ఛాలెంజ్ అయితే చేసాము కానీ ఏం జరుగుతుందో తెలియదు అని అనుకోవటం లేదు కదా! కావున విశ్వాన్ని ఛాలెంజ్ చెయ్యండి ఎందుకంటే ఇక్కడ కొత్త విషయమేమిటంటే, కలిసి ఉంటూ కూడా స్వప్నమాత్రము కూడా అపవిత్రతా సంకల్పము రాకూడదు, ఇదే సంగమయుగ బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత. విశ్వమనే షోకేస్ లో మీరు ఉదాహరణ, శ్యాంపుల్ అనండి లేక ఉదాహరణ అనండి. మిమ్మల్ని చూసి - మేము కూడా అవ్వగలము అని అందరిలోనూ శక్తి వస్తుంది. సరేనా? శక్తులూ, సరేనా? పక్కాగా ఉన్నారు కదా? కచ్చా, పక్కాగా అయితే లేరు కదా? పక్కాగా ఉన్నారు. బాప్ దాదా కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. అభినందనలు. ఎంతమంది ఉన్నారో చూడండి? చాలా మంచిది.

ఇక మిగిలింది టీచర్లు. టీచర్లు లేకుండానైతే గతే ఉండదు. టీచర్లు లేవండి. అచ్ఛా - పాండవులు కూడా మంచి-మంచివారు ఉన్నారు. వాహ్! టీచర్ల విశేషత ఏమిటంటే - ప్రతి టీచరు యొక్క ఫీచర్స్ (ముఖకవళికల) ద్వారా ఫ్యూచర్ (భవిష్యత్తు) కనిపించాలి. ప్రతి ఒక్క టీచరు యొక్క ఫీచర్స్ ద్వారా ఫరిశ్తా స్వరూపము కనిపించాలి. అటువంటి టీచర్లే కదా! ఫరిశ్తాలైన మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఫరిశ్తాలుగా అయిపోవాలి. ఎంతమంది టీచర్లు ఉన్నారో చూడండి. విదేశీయుల గ్రూపులో కూడా టీచర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే కొద్దిమందే వచ్చారు. ఎవరైతే రాలేదో వారిని కూడా బాప్ దాదా గుర్తు చేస్తున్నారు. మంచిది, ఇప్పుడు టీచర్లందరూ కలిసి ఒక ప్లాన్ తయారుచెయ్యండి, అదేమిటంటే - తమ నడవడిక మరియు ముఖము ద్వారా బాబాను ఎలా ప్రత్యక్షము చెయ్యాలి? పరమాత్మ సర్వవ్యాపి అని ప్రపంచములోని వారు అంటారు కానీ మీరు వారు సర్వవ్యాపి కారు అని అంటారు. కానీ బాప్ దాదా అంటారు - ఇప్పుడు సమయమనుసారంగా ప్రతి టీచరులోనూ బాబా ప్రత్యక్షంగా కనిపించినట్లయితే వారు సర్వవ్యాపిగానే కనిపిస్తారు కదా! ఎవరిని చూసినా వారిలో బాబాయే కనిపించాలి. ఆత్మ అనేది పరమాత్మ ముందు దాగిపోవాలి మరియు పరమాత్మయే కనిపించాలి. ఇది వీలవుతుందా? అచ్ఛా, దీని తారీఖు ఏమిటి? తారీఖైతే ఫిక్స్ అవ్వాలి కదా? మరి దీని తారీఖు ఏమిటి? ఎంత సమయము కావాలి? (ఇప్పటి నుండే మొదలుపెడతాము) మొదలుపెడతారా, మంచి ధైర్యము ఉంది, ఎంత సమయము కావాలి? 2002 సంవత్సరమైతే నడుస్తుంది. ఈ రెండు వేలలో ఎంతవరకు చేస్తారు? కనుక టీచర్లు ఈ అటెన్షన్ యే పెట్టాలి - కేవలం ఇప్పుడు బాబాలో నేను లీనమై ఉన్నట్లు కనిపించాలి, నా ద్వారా బాబా కనిపించాలి. ప్లాన్ ను తయారుచేస్తారు కదా! డబుల్ విదేశీయులు మీటింగ్ లు చెయ్యటంలోనైతే తెలివైనవారు కదా? ఇప్పుడు ఈ మీటింగ్ చెయ్యండి - మన ప్రతి ఒక్కరిలో బాబా కనిపించటం ఎలా అని, ఈ మీటింగ్ చెయ్యకుండా వెళ్ళకండి. ఇప్పుడు బ్రహ్మాకుమారీలు కనిపిస్తున్నారు, బ్రహ్మాకుమారీలు చాలా మంచివారు అని కనిపిస్తున్నారు కానీ వీరి బాబా ఎంత మంచివారు అన్నది వారు చూడాలి. అప్పుడే కదా విశ్వ పరివర్తన జరుగుతుంది! మరి డబుల్ విదేశీయులు ఈ ప్లాన్ ను ప్రాక్టికల్ గా ప్రారంభిస్తారు కదా! ప్రారంభిస్తారా? పక్కానా! అచ్ఛా! అప్పుడు మీ దాది ఉన్నారు కదా, వారి ఆశ పూర్తవుతుంది. సరేనా? అచ్ఛా!

డబుల్ విదేశీయులు ఎంత మంచి సేవాధారులో చూడండి, మీ కారణంగా అందరికీ ప్రియస్మృతులు లభిస్తున్నాయి. బాప్ దాదాకు కూడా డబుల్ విదేశీయులపై ఎక్కువ ప్రేమ ఉంది అని అనరు కానీ విశేషమైన ప్రేమ ఉంది. ప్రేమ ఎందుకు ఉంది? ఎందుకంటే డబుల్ విదేశీ ఆత్మలు ఎవరైతే సేవకు నిమిత్తమయ్యారో, వారు విశ్వములోని మూలమూలల్లో బాబా సందేశాన్ని చేర్చడానికి నిమిత్తమయ్యారు. లేదంటే విదేశాలలో నలువైపులా ఉన్న ఆత్మలు దప్పికతో ఉండిపోతారు. ఇప్పుడు బాబాకు ఫిర్యాదు అయితే రాదు కదా, బాబా భారత్ లోకే వచ్చారు, విదేశాలలో ఎందుకు సందేశాన్ని ఇవ్వలేదు అని. కనుక బాబాపై ఫిర్యాదు రాకుండా ఉండేందుకు నిమిత్తం అయ్యారు. మరియు జనక్ కు (జానకి దాదికి) అయితే సందేశము అందకుండా ఏ దేశమూ మిగిలిపోకూడదు అని చాలా ఉల్లాసము ఉంది. మంచిది. బాబాపై వచ్చే ఫిర్యాదును తొలగిస్తారు కదా! కానీ వీరు (జానకి దాది) సహచరులను చాలా అలసిపోయేటట్లు చేస్తారు. అలసిపోయేటట్లు చేస్తారు కదా! జయంతి, అలసిపోయేటట్లు చేయటం లేదా? కానీ ఈ అలసటలో కూడా ఆనందము ఇమిడి ఉంది. పదే పదే ఏంటిది అని ముందు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే భాషణ చేసి ఆశీర్వాదాలను తీసుకువస్తారో, అప్పుడు ముఖం మారిపోతుంది. మంచిది, ఇద్దరు దాదీలలోనూ ఉల్లాస-ఉత్సాహాలను పెంచే విశేషత ఉంది. వీరు శాంతిగా కూర్చోలేరు. ఇప్పుడింకా సేవ అయితే మిగిలి ఉంది కదా? ఒకవేళ మ్యాప్ పెట్టుకుని చూస్తే, భారత్ లోనైనా లేక విదేశాలలోనైనా, ఒకవేళ మ్యాప్ లో ఒక్కొక్క స్థానానికి రైట్ పెట్టుకుంటూ వెళ్తే, ఇప్పటికీ కొన్ని దేశాలు మిగిలిపోయి ఉన్నాయి అన్నది కనిపిస్తుంది. అందుకే బాప్ దాదా సంతోషిస్తున్నారు కూడా మరియు ఎక్కువ అలసిపోయేటట్లు చేయకండి అని కూడా చెప్తున్నారు. మీరంతా సేవలో సంతోషంగా ఉన్నారు కదా! ఇప్పుడు ఈ కుమారీలు కూడా టీచర్లుగా అవుతారు కదా. ఎవరైతే టీచరుగా ఉన్నారో, వారు టీచరే కానీ ఎవరైతే టీచరుగా లేరో వారు టీచరుగా అయ్యి ఏదో ఒక సెంటరును సంభాళిస్తారు కదా. హ్యాండ్స్ గా తయారవుతారు కదా! డబుల్ విదేశీ పిల్లలకైతే రెండు పనులూ చేసే అభ్యాసమైతే ఉండనే ఉంది. ఉద్యోగము కూడా చేస్తారు, సెంటరును కూడా సంభాళిస్తారు, అందుకే బాప్ దాదా డబుల్ అభినందనలను కూడా ఇస్తారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న అతి స్నేహీ, అతి సమీప ఆత్మలు, సదా ఆదికాలము నుండి ఇప్పటివరకు రాయల్టీ యొక్క అధికారులు, సదా తమ ముఖము మరియు నడవడిక ద్వారా పవిత్రతా మెరుపును చూపించేవారు, సదా స్వయం సేవ మరియు స్మృతిలో తీవ్ర పురుషార్థము ద్వారా నంబరువన్ గా అయ్యేవారు, సదా బాబా సమానంగా సర్వ శక్తుల, సర్వ గుణాల సంపన్న స్వరూపములో ఉండేవారు, అన్ని వైపులా ఉండే ఇటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికీ బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

విదేశీ ముఖ్య టీచరు అక్కయ్యలతో:- అందరూ సేవా ప్లాన్లను చాలా మంచి మంచివి తయారుచేసారు కదా ఎందుకంటే సేవ సమాప్తమైన తర్వాతే మీ రాజ్యము వస్తుంది. కనుక సేవా సాధనము కూడా తప్పనిసరి. కానీ అది మనసా కూడా ఉండాలి, వాచా కూడా ఉండాలి, ఈ రెండూ కలిపి-కలిపి ఉండాలి. సేవ మరియు స్వ ఉన్నతి, రెండూ కలిసి ఉండాలి. ఇటువంటి సేవ సఫలతను సమీపంగా తీసుకువస్తుంది. మరి సేవకు నిమిత్తులుగా అయితే ఉండనే ఉన్నారు మరియు అందరూ తమ-తమ స్థానాలలో సేవను చాలా బాగా చేస్తున్నారు కూడా. ఇకపోతే, ఇప్పుడు ఏ పనినైతే ఇచ్చామో, దానికి సంబంధించిన ప్లాన్ ను తయారుచెయ్యండి. దాని కొరకు స్వయములో మరియు సేవలో ఏయే వృద్ధి కావాలి, ఏమేమి చేర్చాలి అన్నదాని ప్లాన్ ను తయారుచెయ్యండి. ఇకపోతే బాప్ దాదా సేవాధారులను చూసైతే తప్పకుండా సంతోషిస్తారు. సేవాకేంద్రాలన్నీ బాగా ఉన్నతిలోకి వెళ్తున్నాయి కదా! ఉన్నతి ఉంది కదా? మంచిది. అంతా మంచిగా జరుగుతుంది కదా, జరుగుతూ ఉంది మరియు మున్ముందు కూడా జరుగుతుంది. కేవలము ఇప్పుడు చెయ్యవలసిందేమిటంటే, విడివిడిగా చెల్లాచెదురై ఉన్నవారి సంగఠన చేసి వారిని పక్కా చెయ్యండి. అందరి ముందూ ప్రాక్టికల్ ఋజువును చూపించండి. ఏ సేవ చేస్తున్నా సరే, రకరకాల ప్లాన్లు తయారుచేస్తున్నా సరే, చేస్తున్నారు కూడా, అవి బాగా నడుస్తున్నాయి కూడా, ఇప్పుడు ఇక వారందరి గ్రూప్ లలో ఒకదానిని ఎదురుగా తీసుకురండి. సేవకు ఋజువు ఇప్పుడు మొత్తము బ్రాహ్మణ పరివారము ముందుకు రావాలి. సరేనా! ఇకపోతే, అందరూ మంచివారు, చాలా చాలా మంచివారు. అచ్ఛా! ఓం శాంతి.

వరదానము:-
మూడు స్మృతుల తిలకము ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారుచేసుకునే అచల్ అడోల్ భవ (అచలంగా స్థిరంగా కండి)

బాప్ దాదా పిల్లలందరికీ మూడు స్మృతుల తిలకాన్ని ఇచ్చారు, ఒకటేమో స్వ స్మృతి, ఇంకొకటి బాబా స్మృతి మరియు శ్రేష్ఠ కర్మల కొరకు డ్రామా స్మృతి. ఎవరికైతే ఈ మూడు స్మృతులు సదా ఉంటాయో, వారి స్థితి కూడా శ్రేష్ఠముగా ఉంటుంది. ఆత్మ స్మృతితోపాటు బాబా స్మృతి మరియు బాబాతో పాటు డ్రామా స్మృతి అత్యంత అవసరము ఎందుకంటే కర్మలో ఒకవేళ డ్రామా జ్ఞానము ఉన్నట్లయితే కింద-మీద అవ్వరు. భిన్న-భిన్న పరిస్థితులు ఏవైతే వస్తాయో, వాటిలో అచలంగా, స్థిరంగా ఉంటారు.

స్లోగన్:-
దృష్టిని అలౌకికముగా, మనస్సును శీతలముగా మరియు బుద్ధిని దయార్ద్రహృదయముతో కూడినదిగా తయారుచేసుకోండి.