03-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి నిర్వికారీ ప్రపంచాన్ని తయారుచేయడానికి, మీ క్యారెక్టర్స్ ను తీర్చిదిద్దడానికి వచ్చారు, మీరు పరస్పరము సోదరులు కావున మీ దృష్టి చాలా శుద్ధముగా ఉండాలి’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు నిశ్చింత చక్రవర్తులు, అయినా కూడా మీకు ఒక ముఖ్యమైన చింత తప్పకుండా ఉండాలి - అది ఏమిటి?

జవాబు:-
మేము పతితము నుండి పావనముగా ఎలా అవ్వాలి - ఇదే ముఖ్యమైన చింత. తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్ళీ తండ్రి ఎదురుగా శిక్షలను అనుభవించవలసి వచ్చే విధముగా ఉండకూడదు. శిక్షల నుండి విముక్తులుగా అవ్వాలి అనే చింత ఉండాలి, లేదంటే ఆ సమయములో చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఇకపోతే, మీరు నిశ్చింత చక్రవర్తులు, అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరైనా అర్థం చేసుకుంటే వారు అనంతమైన యజమానులుగా అవుతారు, అర్థం చేసుకోకపోతే ఇక అది వారి భాగ్యము. మీరు చింతించవద్దు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి పేరు శివ, వారు కూర్చుని తమ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరే. మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి, అప్పుడు ఇతర విషయాలు అర్థం చేసుకోవడం సహజమవుతుంది. ఒకవేళ తండ్రి పరిచయమే లభించకపోతే ఇక ప్రశ్నిస్తూ ఉంటారు. మొట్టమొదటైతే ఈ నిశ్చయాన్ని కలిగించాలి. గీతా భగవానుడు ఎవరు అనేది మొత్తం ప్రపంచానికి తెలియదు. వారు శ్రీకృష్ణుడు అని అంటారు, మనము పరమపిత పరమాత్మ అయిన శివుడు గీతా భగవానుడు అని అంటాము. వారే జ్ఞాన సాగరుడు. ముఖ్యమైనది సర్వశాస్త్రమయి శిరోమణి గీత. ఓ ప్రభూ, మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము అతీతమైనవి అని భగవంతుని విషయములోనే అంటారు. శ్రీకృష్ణుని విషయములో ఈ విధముగా అనరు. తండ్రి సత్యమైనవారు, వారు తప్పకుండా సత్యమునే వినిపిస్తారు. ప్రపంచము మొదట కొత్తదిగా, సతోప్రధానముగా ఉండేది. ఇప్పుడు ప్రపంచము పాతదిగా, తమోప్రధానముగా ఉంది. ప్రపంచాన్ని పరివర్తన చేసేది ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి ఎలా పరివర్తన చేస్తారు, అది కూడా అర్థం చేయించాలి. ఆత్మ సతోప్రధానముగా అయినప్పుడు ప్రపంచము కూడా సతోప్రధానమైనది స్థాపనవుతుంది. మొట్టమొదట పిల్లలైన మీరు అంతర్ముఖులుగా అవ్వాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. లోపలకి ప్రవేశించినప్పుడు చాలా చిత్రాలను చూసి ఇక ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. మొట్టమొదట ఒక్క విషయము గురించే అర్థం చేయించాలి. ఎక్కువగా అడిగేందుకు అవకాశము ఉండకూడదు. మీరు ఇలా చెప్పండి - మొదట ఒక్క విషయముపై నిశ్చయము ఏర్పరచుకోండి, ఆ తర్వాత మిగిలినవి అర్థం చేయిస్తాము. ఆ తర్వాత మీరు 84 జన్మల చక్రము యొక్క చిత్రము వద్దకు తీసుకురావచ్చు. తండ్రి అంటారు, నేను అనేక జన్మల అంతిమములో ప్రవేశిస్తాను. మీకు మీ జన్మల గురించి తెలియదు అని తండ్రి వీరితోనే అంటారు. తండ్రి మనకు ప్రజాపిత బ్రహ్మా ద్వారా అర్థం చేయిస్తారు. మొట్టమొదట భగవంతుడి గురించే అర్థం చేయిస్తారు. భగవంతుని గురించి అర్థం చేసుకుంటే ఇక తర్వాత ఏ సంశయము కలగదు. తండ్రి సత్యమైనవారు, వారు అసత్యాన్ని వినిపించరు అని చెప్పండి. అనంతమైన తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తారు. శివరాత్రి అని అంటూ ఉంటారంటే తప్పకుండా శివుడు ఇక్కడికే వచ్చి ఉంటారు కదా. ఏ విధముగా శ్రీకృష్ణ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. నేను బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తాను అని బాబా అంటారు. అందరూ ఆ ఒక్క నిరాకార తండ్రి పిల్లలే. మీరు కూడా వారి సంతానమే, అలాగే మీరు ప్రజాపిత బ్రహ్మాకు కూడా సంతానము. ప్రజాపిత బ్రహ్మా ద్వారా స్థాపన చేసారు కావున తప్పకుండా బ్రాహ్మణ-బ్రాహ్మణీలు ఉంటారు. పరస్పరము సోదరీ-సోదరులు అయ్యారు, ఇందులో పవిత్రత ఉంటుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా ఉండేందుకు ఇది యుక్తి. పరస్పరము సోదరీ-సోదరులు కావున ఎప్పుడూ వికారీ దృష్టి ఉండకూడదు. 21 జన్మల కొరకు దృష్టి తీర్చిదిద్దబడుతుంది. తండ్రియే పిల్లలకు శిక్షణనిస్తారు కదా. క్యారెక్టర్స్ తీర్చిదిద్దుతారు. ఇప్పుడు మొత్తం ప్రపంచములోని వారి యొక్క క్యారెక్టర్స్ తీర్చిదిద్దబడనున్నాయి. ఈ పాత పతిత ప్రపంచములో అసలు క్యారెక్టర్ లేదు. అందరిలోనూ వికారాలు ఉన్నాయి. ఇది ఉన్నదే పతిత వికారీ ప్రపంచము. మరి నిర్వికారీ ప్రపంచముగా ఎలా తయారవుతుంది? ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు. ఇప్పుడు తండ్రి పవిత్రముగా తయారుచేస్తున్నారు. ఇవన్నీ గుప్తమైన విషయాలు. మనము ఆత్మలము, ఆత్మలు పరమాత్మ అయిన తండ్రిని కలుసుకోవాలి. అందరూ భగవంతుడిని కలుసుకునేందుకే పురుషార్థము చేస్తారు. భగవంతుడు ఒక్క నిరాకారుడు. ముక్తిప్రదాత, మార్గదర్శకుడు అని కూడా పరమాత్ముడినే అంటారు. ఇతర ధర్మాల వారినెవ్వరినీ ముక్తిప్రదాత, మార్గదర్శకుడు అని అనరు. పరమపిత పరమాత్మయే వచ్చి విముక్తులుగా చేస్తారు అనగా తమోప్రధానము నుండి సతోప్రధానముగా తయారుచేస్తారు. వారు గైడ్ కూడా చేస్తారు. కనుక మొట్టమొదట ఈ ఒక్క విషయమునే బుద్ధిలో కూర్చోబెట్టండి. ఒకవేళ వారు అర్థం చేసుకోకపోతే ఇక వదిలేయాలి. భగవంతుడిని అర్థం చేసుకోకపోతే ఇక వారు ఇచ్చే వారసత్వముతో ఏం లాభము, అటువంటివారు వెళ్ళిపోయినా పర్వాలేదు. మీరు తికమకపడకండి. మీరు నిశ్చింత చక్రవర్తులు. అసురుల విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి. ఇది ఉన్నదే రుద్ర జ్ఞాన యజ్ఞము. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి మన్మనాభవ అని అంటారు. ఎంతగా పురుషార్థము చేస్తారో, దాని అనుసారముగా పదవిని పొందుతారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క రాజ్యము స్థాపన అవుతోంది. ఈ లక్ష్మీ-నారాయణుల వంశావళి ఉంటుంది. ఇతర ధర్మాల వారెవ్వరూ వంశావళిని స్థాపించరు. తండ్రి వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. ఆ తర్వాత తమ-తమ సమయాలలో ఇతర ధర్మ స్థాపకులు వచ్చి తమ ధర్మాలను స్థాపన చేయవలసి ఉంటుంది. వృద్ధి జరుగుతుంది. పతితముగా తప్పకుండా అవుతారు. పతితము నుండి పావనముగా తయారుచేయడము, ఇదైతే తండ్రి కర్తవ్యమే. ఇతర ధర్మ స్థాపకులైతే వచ్చి కేవలం ధర్మ స్థాపనను చేస్తారు. అందులో గొప్ప విషయమేమీ లేదు. మహిమ ఒక్కరిదే. వారు క్రైస్ట్ కోసం ఎంత చేస్తారు. ముక్తిప్రదాత, మార్గదర్శకుడు గాడ్ ఫాదర్ మాత్రమే అని వారికి కూడా అర్థం చేయించాలి. క్రైస్ట్ వెనుక క్రిస్టియన్ ధర్మానికి చెందిన ఆత్మలు వస్తూ ఉంటారు, కిందకు దిగుతూ ఉంటారు. దుఃఖము నుండి విడిపించేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. ఈ పాయింట్లన్నింటినీ బుద్ధిలో బాగా ధారణ చేయాలి. ఒక్క గాడ్ ను మాత్రమే దయార్ద్ర హృదయుడు అని అంటారు. మనుష్యులలో ఒక్కరు కూడా ఎవ్వరిపైనా దయ చూపించరు. ఆ తండ్రి దయ అనంతమైనది. ఒక్క తండ్రి మాత్రమే అందరిపైనా దయ చూపిస్తారు. సత్యయుగములో అందరూ సుఖ-శాంతులతో ఉంటారు. దుఃఖము అనే విషయమే ఉండదు. పిల్లలు ఒక్క భగవంతుడి విషయములో ఎవ్వరికీ నిశ్చయము కలిగించరు, ఇతర విషయాలలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ గొంతు పాడైపోయిందని అంటారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మీరు ఇతర విషయాలలోకి అసలు వెళ్ళవద్దు. మీరు ఇలా చెప్పండి - తండ్రి అయితే సత్యమే చెప్తారు కదా. బి.కె.లైన మాకు తండ్రే వినిపిస్తారు. ఈ చిత్రాలన్నీ వారే తయారుచేయించారు, ఇందులో సంశయము రానివ్వకూడదు. సంశయబుద్ధి వినశ్యంతి. మొదట మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇంకే ఉపాయమూ లేదు. పతిత-పావనుడైతే ఒక్కరే కదా. తండ్రి అంటారు, దేహము యొక్క సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి ఎవరిలోనైతే ప్రవేశిస్తారో, వారు కూడా మళ్ళీ పురుషార్థము చేసి సతోప్రధానముగా అవ్వాలి. తయారవ్వడము పురుషార్థము ద్వారానే తయారవుతారు. ఆ తర్వాత బ్రహ్మా మరియు విష్ణువుకు మధ్యన ఉన్న సంబంధము గురించి కూడా తెలియజేస్తారు. తండ్రి బ్రాహ్మణులైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు కావున మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మళ్ళీ మీరే 84 జన్మలను తీసుకుని అంతిమములో శూద్రులుగా అవుతారు. మళ్ళీ తండ్రి వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. ఈ విధముగా ఇంకెవ్వరూ చెప్పలేరు. మొట్టమొదటి విషయము, తండ్రి పరిచయాన్ని ఇవ్వడము. తండ్రి అంటారు, పతితులను పావనముగా చేసేందుకు నేనే ఇక్కడకు రావలసి ఉంటుంది. పై నుండి ప్రేరణ ఇస్తానని కాదు. వీరి పేరే భగీరథుడు. కావున తప్పకుండా వీరిలోనే ప్రవేశిస్తాను. ఇది కూడా వీరి అనేక జన్మల అంతిమ జన్మ. మళ్ళీ సతోప్రధానముగా అవుతారు. దాని కోసం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి యుక్తిని తెలియజేస్తున్నారు. నేనే సర్వశక్తివంతుడిని. నన్ను స్మృతి చేసినట్లయితే మీలో శక్తి వస్తుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణుల వారసత్వము వీరికి తండ్రి నుండి లభించింది. అది ఎలా లభించింది అనేది వారు అర్థం చేయిస్తారు. ప్రదర్శినీ, మ్యూజియం మొదలైనవాటిలో కూడా మీరు చెప్పండి - మొదట మీరు ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి, ఆ తర్వాత ఇతర విషయాలలోకి వెళ్ళండి. ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరము. లేదంటే మీరు దుఃఖము నుండి విముక్తులుగా అవ్వలేరు. ఎంతవరకైతే మొదట నిశ్చయము కలగదో అంతవరకు మీరు ఏమీ అర్థం చేసుకోలేరు. ఈ సమయములో ఉన్నదే భ్రష్టాచారీ ప్రపంచము. దేవీ-దేవతల ప్రపంచము శ్రేష్ఠాచారిగా ఉండేది. ఈ విధముగా అర్థం చేయించాలి. మనుష్యుల నాడిని కూడా చూడాలి - ఏమైనా అర్థం చేసుకుంటున్నారా లేదా వెర్రివారి వలె ఉన్నారా? ఒకవేళ వెర్రివారి వలె ఉంటే ఇక వదిలేయాలి. సమయాన్ని వృధా చేయకూడదు. ఛాత్రకులను, పాత్రులను పరిశీలించే బుద్ధి కూడా కావాలి. ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారి ముఖమే మారిపోతుంది. మొట్టమొదట అయితే సంతోషాన్ని కలిగించే విషయాన్ని చెప్పాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది కదా. స్మృతియాత్రలో పిల్లలు చాలా ఢీలాగా ఉన్నారని తండ్రికి తెలుసు. తండ్రిని స్మృతి చేయడములో శ్రమ ఉంది. ఇందులోనే మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. ఇది కూడా డ్రామాగా తయారుచేయబడి ఉంది. ఈ డ్రామా ఏ విధముగా తయారై, తయారుచేయబడి ఉంది అన్నది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ప్రపంచములోని మనుష్యులకైతే ఏ మాత్రము తెలియదు.

తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మీరు ఎవరికైనా అర్థం చేయించడములో కూడా ఏకరసముగా ఉంటారు. లేకపోతే వారు ఏవో లోపాలను వెలికితీస్తూ ఉంటారు. మీరు ఎక్కువగా ఏమీ కష్టపడకండి అని బాబా అంటారు. స్థాపన అయితే తప్పకుండా జరగనున్నది. నిశ్చితమైన విధిని ఎవ్వరూ తప్పించలేరు. తండ్రి నుండి మనము అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము అన్న ఉల్లాసములో ఉండాలి. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. చాలా ప్రేమగా కూర్చుని అర్థం చేయించాలి. తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమలో అశ్రువులు రావాలి. ఇతర సంబంధాలన్నీ కలియుగీ సంబంధాలు. ఇది ఆత్మిక తండ్రితో సంబంధము. మీ ఈ అశ్రువులు కూడా విజయమాలలో మణులుగా అవుతాయి. అటువంటి ప్రేమతో తండ్రిని స్మృతి చేసేవారు చాలా తక్కువమంది ఉన్నారు. ప్రయత్నము చేసి, ఎంత వీలైతే అంత మీ సమయాన్ని తీసి మీ భవిష్యత్తును ఉన్నతముగా తయారుచేసుకోవాలి. ప్రదర్శనీలో ఇంతమంది పిల్లలు ఉండకూడదు. ఇన్ని చిత్రాలు కూడా అవసరము లేదు. నంబరువన్ చిత్రము - గీతా భగవానుడు ఎవరు? దాని పక్కన లక్ష్మి-నారాయణుల చిత్రము, మెట్ల వరుస చిత్రము ఉండాలి. అంతే. ఇకపోతే ఇన్ని చిత్రాలేమీ అవసరము లేదు. పిల్లలైన మీరు ఎంత వీలైతే అంత స్మృతియాత్రను పెంచాలి. పతితము నుండి పావనముగా ఎలా అవ్వాలి అన్న ముఖ్యమైన చింతను పెట్టుకోవాలి. బాబాకు చెందినవారిగా అయ్యి మళ్ళీ బాబా ఎదురుగా వెళ్ళి శిక్షలను అనుభవించడం అనేది చాలా దుర్గతికి చెందిన విషయము. ఇప్పుడు స్మృతియాత్రలో ఉండకపోతే, మరి తర్వాత బాబా ఎదురుగా శిక్షలను అనుభవించే సమయములో చాలా-చాలా సిగ్గుగా అనిపిస్తుంది. శిక్షలు అనుభవించే పరిస్థితి రాకూడదు, అన్నింటికంటే ఎక్కువగా ఈ చింతే పెట్టుకోవాలి. మీరు రూప్ (యోగ స్వరూపులు) కూడా, బసంత్ (జ్ఞాన స్వరూపులు) కూడా. నేను రూప్ ను కూడా, బసంత్ ను కూడా అని బాబా కూడా అంటారు. నేను చిన్న బిందువును, కానీ జ్ఞాన సాగరుడను కూడా. మీ ఆత్మలో మొత్తం జ్ఞానాన్ని నింపుతాను. 84 జన్మల రహస్యమంతా మీ బుద్ధిలో ఉంది. మీరు జ్ఞాన స్వరూపులుగా అయ్యి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. జ్ఞానము యొక్క ఒక్కొక్క రత్నము ఎంత అమూల్యమైనవి, వీటిని ఎవ్వరూ వెల కట్టలేరు, అందుకే పదమాపదమ భాగ్యశాలి అని బాబా అంటారు. మీ చరణాలలో పద్మము గుర్తును కూడా చూపిస్తారు, దీనినెవ్వరూ అర్థం చేసుకోలేరు. మనుష్యులు పదమపతి అని పేరు పెట్టుకుంటారు. వీరి వద్ద చాలా ధనముంది అని భావిస్తారు. పదమపతి అని ఒక ఇంటిపేరును కూడా పెట్టుకుంటారు. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ఆ తర్వాత చెప్తారు - ముఖ్యమైన విషయమేమిటంటే, తండ్రిని మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. ఈ జ్ఞానము భారతవాసుల కోసమే ఉంది. మీరే 84 జన్మలను తీసుకుంటారు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము కదా. ఇతర సన్యాసులు మొదలైనవారినెవ్వరినీ స్వదర్శన చక్రధారులు అని అనరు. దేవతలను కూడా అనరు. దేవతలలో జ్ఞానము అసలు ఉండదు. మాలో జ్ఞానమంతా ఉంది, ఈ లక్ష్మీ-నారాయణులలో లేదు అని మీరు అంటారు. తండ్రి అయితే యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తారు కదా.

ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది. మీరు ఎంత గుప్తమైన విద్యార్థులు. మేము పాఠశాలకు వెళ్తున్నాము, భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని మీరంటారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఏమిటి? మేము ఈ విధముగా (లక్ష్మీ-నారాయణుల వలె) అవుతాము. ఇది విని మనుష్యులు ఆశ్చర్యపోతారు. మేము మా హెడ్ ఆఫీసుకు వెళ్తాము. ఏం చదువుకుంటున్నారు? మనుష్యుల నుండి దేవతలుగా, బికారుల నుండి రాకుమారులుగా అయ్యే చదువును చదువుకుంటున్నారు. మీ చిత్రాలు కూడా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. ధనాన్ని కూడా ఎప్పుడూ పాత్రులకే దానము చెయ్యడం జరుగుతుంది. మీకు పాత్రులు ఎక్కడ లభిస్తారు? శివుడు, లక్ష్మీనారాయణులు, సీతా-రాముల మందిరాలలో లభిస్తారు. అక్కడకు వెళ్ళి మీరు వారికి సేవ చేయండి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. గంగా నది వద్దకు కూడా వెళ్ళి మీరు అర్థం చేయించండి - పతిత-పావని గంగనా లేక పరమపిత పరమాత్మనా, సర్వుల సద్గతిని ఈ నీరు చేస్తుందా లేదా అనంతమైన తండ్రి చేస్తారా? మీరు దీనిపై మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. మీరు విశ్వానికి యజమానులుగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. మీరు దానము చేస్తారు, గవ్వ వంటి మనుష్యులను వజ్రము వలె విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. భారత్ విశ్వానికి యజమానిగా ఉండేది కదా. బ్రాహ్మణులైన మీది దేవతల కన్నా కూడా ఉత్తమమైన కులము. నేను శివబాబాకు ఏకైక ప్రియమైన బిడ్డను అని ఈ బాబా భావిస్తారు. బాబా నా ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. మీరు తప్ప ఇతరులెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. బాబా నాపై స్వారీ చేస్తున్నారు. నేను బాబాను భుజాలపై కూర్చోబెట్టుకున్నాను అనగా సేవ చేయండి అని శరీరాన్ని ఇచ్చాను. దానికి ప్రతిఫలముగా వారు ఎంత ఇస్తారు. నన్ను అందరి కన్నా ఉన్నతముగా తయారుచేసి వారి భుజాలపైకి ఎక్కించుకుంటారు, నంబరువన్ లోకి తీసుకువెళ్తారు. తండ్రికి పిల్లలు ప్రియమనిపిస్తారు కావున వారిని భుజాలపైకి ఎక్కించుకుంటారు కదా. తల్లి పిల్లలను కేవలం ఒడిలోకే తీసుకుంటుంది, తండ్రి అయితే భుజాలపైకి ఎక్కించుకుంటారు. పాఠశాలను ఎప్పుడూ ఊహ అని అనరు. పాఠశాలలో చరిత్ర-భౌగోళికాలను చదువుకుంటారు, అవి ఊహ అవుతాయా? ఇది కూడా ప్రపంచ చరిత్ర-భౌగోళికము కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చాలా ప్రేమగా కూర్చుని ఆత్మిక తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతిలో ప్రేమ యొక్క అశ్రువులు వచ్చినా కూడా, ఆ అశ్రువులు విజయమాలలో మణులుగా అవుతాయి. తమ సమయాన్ని భవిష్య ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవడములో సఫలము చేసుకోవాలి.

2. అంతర్ముఖులుగా అయ్యి అందరికీ భగవంతుని యొక్క పరిచయాన్ని ఇవ్వాలి, ఎక్కువగా మాట్లాడకూడదు. శిక్షలు అనుభవించవలసి వచ్చే కర్మలేవీ జరగకూడదు అన్న చింత ఒక్కటే ఉండాలి.

వరదానము:-
నేను ఆత్మిక యాత్రికుడిని - ఈ స్మృతితో సదా ఉపరామముగా, అతీతముగా మరియు నిర్మోహీగా కండి

ఆత్మిక యాత్రికులు సదా స్మృతియాత్రలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ యాత్ర సదా సుఖాన్ని ఇస్తుంది. ఎవరైతే ఆత్మిక యాత్రలో సదా తత్పరులై ఉంటారో, వారు వేరే ఏ యాత్ర చేయవలసిన అవసరముండదు. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉన్నాయి. మనసుతో మరియు తనువుతో భ్రమించడం ఆగిపోతుంది. కావున సదా ఇదే స్మృతి ఉండాలి - నేను ఆత్మిక యాత్రికుడిని. యాత్రికులకు ఎవ్వరి పట్ల మోహము ఉండదు. వారికి సహజముగానే ఉపరామముగా, అతీతముగా మరియు నిర్మోహులుగా అయ్యే వరదానము లభిస్తుంది.

స్లోగన్:-
సదా వాహ్ బాబా, వాహ్ భాగ్యము మరియు వాహ్ మధురమైన పరివారము - ఈ పాటనే పాడుతూ ఉండండి.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

ఏ విధముగా బాబాను సర్వ స్వరూపాలలో మరియు సర్వ సంబంధాలలో తెలుసుకోవటము అవసరమో, అదే విధముగా బాబా ద్వారా స్వయాన్ని తెలుసుకోవటము కూడా అవసరము. తెలుసుకోవటము అనగా స్వీకరించటము. నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలానే స్వీకరించి నడుచుకున్నట్లయితే దేహములో ఉంటూనే విదేహీ స్థితి, వ్యక్తములో ఉంటూనే అవ్యక్త స్థితి, నడుస్తూ-తిరుగుతూ ఉన్న ఫరిశ్తా స్థితి మరియు కర్మలు చేస్తూనే కర్మాతీత స్థితి తయారైపోతుంది.