ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు - పిల్లలూ, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు
ఎవరిని స్మృతి చేస్తారు? మన అనంతమైన తండ్రిని. వారు ఎక్కడ ఉన్నారు? వారిని - ఓ పతిత
పావనా అని పిలుస్తారు కదా! ఈ రోజుల్లో సన్యాసులు కూడా - పతిత పావన సీతారామ్ అని అంటూ
ఉంటారు, అనగా పతితులను పావనముగా తయారుచేసే రామా రండి అని అర్థము. పావన ప్రపంచము అని
సత్యయుగాన్ని, పతిత ప్రపంచము అని కలియుగాన్ని అంటారని అయితే పిల్లలు అర్థం
చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? కలియుగ అంతిమములో, అందుకే - బాబా,
మీరు వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచెయ్యండి అని పిలుస్తారు. ఇక్కడ ‘మమ్మల్ని’ అంటే
ఎవరిని? ఆత్మను. ఆత్మయే పవిత్రముగా తయారవ్వాలి. ఆత్మ పవిత్రముగా అయితే శరీరము కూడా
పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ పతితమవ్వడముతో శరీరము కూడా పతితమైనది లభిస్తుంది. ఈ
శరీరమైతే ఒక మట్టిబొమ్మ వంటిది. ఆత్మ అయితే అవినాశీ. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా - మేము
చాలా పతితముగా అయిపోయాము, వచ్చి మమ్మల్ని పావనముగా చెయ్యండి అని అంటుంది,
పిలుస్తుంది. తండ్రి పావనముగా తయారుచేస్తారు. పంచ వికారాల రూపీ రావణుడు పతితముగా
చేస్తాడు. తండ్రి ఇప్పుడు స్మృతిని కలిగించారు - మనమే పావనముగా ఉండేవారము, మళ్ళీ ఇలా
84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నాము. ఈ మనుష్య సృష్టి రూపీ
వృక్షము ఏదైతే ఉందో, తండ్రి అంటారు, నేను దీనికి బీజరూపుడను. నన్ను - ఓ పరంపిత
పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్, నాకు ముక్తిని ప్రసాదించండి అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ
తమ కొరకు అంటారు, నన్ను విడిపించండి కూడా మరియు మార్గదర్శకునిగా శాంతిధామమైన ఇంటికి
తీసుకువెళ్ళండి. సన్యాసులు మొదలైనవారు కూడా - స్థిరమైన శాంతి ఎలా లభిస్తుంది అని
అంటారు. ఇప్పుడు శాంతిధామమైతే ఇల్లు. అక్కడి నుండే ఆత్మలు పాత్రను అభినయించడానికి
వస్తారు. అక్కడ కేవలం ఆత్మలే ఉన్నాయి, శరీరాలు లేవు. ఆత్మలు వివస్త్రగా అనగా శరీరము
లేకుండా ఉంటాయి. వివస్త్రగా అనగా వస్త్రాలు ధరించకుండా ఉండడము అని అర్థము కాదు. అలా
కాదు. శరీరము లేకుండా ఆత్మలు వివస్త్రగా (అశరీరి)గా ఉంటాయి. తండ్రి అంటారు - పిల్లలూ,
ఆత్మలైన మీరు అక్కడ మూలవతనములో శరీరాలు లేకుండా ఉంటారు. దానిని నిరాకారీ ప్రపంచము
అని అంటారు.
పిల్లలకు మెట్ల వరుస చిత్రముపై - ఏ విధంగా మనము మెట్లు దిగుతూ వచ్చాము అన్నది
అర్థం చేయించడం జరిగింది. పూర్తిగా 84 జన్మలు పట్టింది, ఇది మ్యాక్సిమమ్. మరికొందరు
ఒక జన్మ కూడా తీసుకుంటారు. ఆత్మలు పై నుండి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తండ్రి అంటారు
- నేను పావనముగా తయారుచేయడానికి వచ్చాను. శివబాబా బ్రహ్మా ద్వారా మిమ్మల్ని
చదివిస్తారు. శివబాబా ఆత్మలకు తండ్రి మరియు బ్రహ్మాను ఆదిదేవ్ అని అంటారు. ఈ
దాదాలోకి తండ్రి ఎలా వస్తారు, ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఓ పతిత పావనా రండి
అని నన్ను పిలుస్తారు కూడా. ఆత్మలు ఈ శరీరము ద్వారా పిలిచాయి. ముఖ్యమైనది ఆత్మ కదా.
ఇది ఉన్నదే దుఃఖధామము. ఈ కలియుగములో చూడండి, కూర్చుని-కూర్చుని ఉండగా అకస్మాత్తుగా
మృత్యువు జరిగిపోతుంది, అక్కడ ఇలా ఎవ్వరూ రోగగ్రస్థులే అవ్వరు. దాని పేరే స్వర్గము.
ఎంత మంచి పేరు. అలా అనడముతోనే హృదయం సంతోషిస్తుంది. క్రిస్టియన్లు కూడా అంటారు,
క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేది అని. ఇక్కడ భారతవాసులకైతే ఏమీ
తెలియదు ఎందుకంటే వీరు సుఖమూ ఎక్కువగా చూసారు, అలాగే దుఃఖమూ ఎక్కువగా చూస్తున్నారు.
తమోప్రధానమయ్యారు. 84 జన్మలు కూడా వీరివే. అర్ధకల్పము తర్వాత ఇతర ధర్మాలవారు వస్తారు.
ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, అర్ధకల్పము దేవీ-దేవతలు ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ
లేవు. మళ్ళీ త్రేతాలో ఎప్పుడైతే రాముడు వచ్చారో, అప్పుడు కూడా ఇస్లాములు, బౌద్ధులూ
లేరు. మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. ఈ ప్రపంచము యొక్క ఆయువు లక్షల
సంవత్సరాలని అనేస్తారు, అందుకే మనుష్యులు - ఈ కలియుగము ఇంకా బాల్యములో ఉంది అని
తికమకపడతారు. మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు - కలియుగము పూర్తి అయి ఇప్పుడు
సత్యయుగము వస్తుంది, అందుకే మీరు బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు
వచ్చారు. మీరందరూ స్వర్గవాసులుగా ఉండేవారు. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేసేందుకే
వస్తారు. మీరే స్వర్గములోకి వస్తారు, మిగిలినవారంతా కేవలం ఇల్లు అయిన శాంతిధామానికి
వెళ్ళిపోతారు. అది మధురమైన ఇల్లు, ఆత్మలు అక్కడ నివాసముంటాయి. మళ్ళీ ఇక్కడకు వచ్చి
పాత్రధారులుగా అవుతారు. శరీరము లేకుండానైతే ఆత్మ మాట్లాడలేదు కూడా. అక్కడ శరీరాలు
లేని కారణముగా ఆత్మలు శాంతిగా ఉంటాయి. మళ్ళీ అర్ధకల్పము దేవీ-దేవతలు ఉంటారు.
సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, మళ్ళీ ద్వాపర, కలియుగములలో మనుష్యులుంటారు. దేవతల
రాజ్యముండేది, మరి ఇప్పుడు వారు ఎక్కడకు వెళ్ళారు? ఎవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానము
ఇప్పుడు మీకు తండ్రి ద్వారా లభిస్తుంది. ఇంకే మనుష్యులలోనూ ఈ జ్ఞానము ఉండదు.
తండ్రియే వచ్చి మనుష్యులకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు, దీని ద్వారానే మనుష్యుల నుండి
దేవతలవుతారు. మీరు ఇక్కడకు వచ్చిందే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు. దేవతల
అన్నపానాదులు అశుద్ధముగా ఉండవు, వారెప్పుడూ బీడీలు మొదలైనవి తాగరు. ఇక్కడి పతిత
మనుష్యుల విషయము గురించి అడగకండి. ఏమేమి తింటారు! ఇప్పుడు తండ్రి అర్థం
చేయిస్తున్నారు - ఈ భారత్ మొదట సత్యఖండముగా ఉండేది. తప్పకుండా సత్యమైన తండ్రే
స్థాపన చేసి ఉంటారు. తండ్రినే ట్రూత్ (సత్యము) అని అంటారు. తండ్రే అంటారు - నేనే ఈ
భారత్ ను సత్యఖండముగా తయారుచేస్తాను. మీరు సత్యమైన దేవతలుగా ఎలా తయారుకావచ్చు, అది
కూడా మీకు నేర్పిస్తాను. ఎంతమంది పిల్లలు ఇక్కడకు వస్తారు. అందుకే ఈ ఇళ్ళు మొదలైనవి
నిర్మించవలసి వస్తుంది. అంతిమము వరకు కూడా ఇవి తయారవుతూ ఉంటాయి, చాలా తయారవుతాయి.
ఇళ్ళను కొనుగోలు కూడా చేస్తారు. శివబాబా బ్రహ్మా ద్వారా కార్యాన్ని చేస్తారు.
బ్రహ్మా నల్లనివారైపోయారు ఎందుకంటే ఇది అనేక జన్మల అంతిమ జన్మ కదా. వీరే మళ్ళీ
తెల్లనివారవుతారు. కృష్ణుని చిత్రము కూడా తెల్లగా మరియు నల్లగా ఉంది కదా.
మ్యూజియంలలో పెద్ద-పెద్ద మంచి చిత్రాలు ఉన్నాయి, వాటిపై మీరు ఎవరికైనా బాగా అర్థం
చేయించగలరు. ఇక్కడ బాబా మ్యూజియంలు తయారుచేయించరు. దీనిని టవర్ ఆఫ్ సైలెన్స్ (శాంతి
స్తంభము) అని అంటారు. మనము మన ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్తామని మీకు తెలుసు. మనము
అక్కడి నివాసులము, మళ్ళీ ఇక్కడకు వచ్చి శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తాము.
పిల్లలకు మొట్టమొదట ఈ నిశ్చయము ఉండాలి - ఇక్కడ ఏ సాధు-సన్యాసులూ చదివించటం లేదు అని.
ఈ దాదా అయితే సింధ్ లో ఉండేవారు. కానీ ఇతనిలోకి ఎవరైతే ప్రవేశించి మాట్లాడుతున్నారో,
వారు జ్ఞానసాగరుడు. వారి గురించి ఎవరికీ తెలియనే తెలియదు. గాడ్ ఫాదర్ అని అంటారు
కూడా. కానీ వారికి నామ-రూపాలే లేవు, వారు నిరాకారుడు, వారికి ఏ ఆకారమూ లేదు అని
అనేస్తారు. మళ్ళీ వారు సర్వవ్యాపి అని అనేస్తారు. అరే, పరమాత్మ ఎక్కడున్నారు? అని
అడిగితే, వారు సర్వవ్యాపి, అందరిలోనూ ఉన్నారు అని అంటారు. అరే, ప్రతి ఒక్కరిలోనూ
కూర్చున్నది ఆత్మ, అందరూ పరస్పరం భాయీ-భాయీ కదా, మరి కణకణములోనూ పరమాత్మ ఎక్కడ నుండి
వచ్చారు? అన్నింటిలోనూ పరమాత్మ కూడా ఉన్నారు, ఆత్మ కూడా ఉంది అని అనరు. పరమాత్మ అని
తండ్రిని పిలుస్తారు. బాబా, మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారుచెయ్యండి.
మీరు నన్ను ఈ వ్యాపారము, ఈ సేవ చేయడానికి పిలుస్తారు. మమ్మల్నందరినీ వచ్చి శుద్ధముగా
చేయండి. పతిత ప్రపంచములో నాకు నిమంత్రణ ఇస్తారు. బాబా, మేము పతితముగా ఉన్నాము అని
అంటారు. తండ్రి అయితే పావన ప్రపంచాన్ని చూడనే చూడరు. పతిత ప్రపంచములోనే మీ సేవ
చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యము వినాశనమైపోతుంది. మీరు ఏదైతే రాజయోగాన్ని
నేర్చుకుంటారో, దానితో మీరు వెళ్ళి రాజులకే రాజులుగా అవుతారు. మిమ్మల్ని
లెక్కలేనన్ని సార్లు చదివించాను, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్నే చదివిస్తాను.
సత్యయుగ, త్రేతాయుగ రాజధాని ఇప్పుడు స్థాపన అవుతోంది. మొదటిది బ్రాహ్మణ కులము.
ప్రజాపిత బ్రహ్మా అని గానం చేయబడుతుంది కదా, వారినే ఆడమ్, ఆదిదేవ్ అని అంటారు. ఇది
ఎవ్వరికీ తెలియదు. ఇక్కడికి వచ్చి విని మళ్ళీ మాయకు వశమయ్యేవారు చాలామంది ఉన్నారు.
పుణ్యాత్మగా అవుతూ, అవుతూ పాపాత్మగా అయిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. అందరినీ
పాపాత్ములుగా చేసేస్తుంది. ఇక్కడ పవిత్ర ఆత్మ, పుణ్యాత్మ ఒక్కరు కూడా లేరు.
దేవీ-దేవతలే పవిత్ర ఆత్మలుగా ఉండేవారు, ఎప్పుడైతే అందరూ పతితముగా అయిపోతారో, అప్పుడు
తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము, పతిత ప్రపంచము, దీనిని ముళ్ళ అడవి
అని అంటారు. సత్యయుగాన్ని పూలతోట అని అంటారు. మొఘల్ గార్డెన్ లో ఎంత మంచి-మంచి ఫస్ట్
క్లాస్ అయిన పుష్పాలుంటాయి. జిల్లేడు పుష్పాలు కూడా ఉంటాయి కానీ వాటి అర్థాన్ని ఎవరూ
అర్థం చేసుకోరు. శివునిపై జిల్లేడు పుష్పాలు ఎందుకు వేస్తారు? ఇది కూడా తండ్రి
కూర్చుని అర్థం చేయిస్తారు. నేను ఎప్పుడైతే చదివిస్తానో అప్పుడు అందులో కొందరు ఫస్ట్
క్లాస్ అయిన మల్లెలు, కొందరు రత్నజ్యోతులు, కొందరు జిల్లేడు పుష్పాలు కూడా ఉన్నారు.
నంబరువారుగా అయితే ఉన్నారు కదా. దీనిని దుఃఖధామము, మృత్యులోకము అనే అంటారు.
సత్యయుగము అమరలోకము. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. శాస్త్రాలనైతే ఈ దాదా చదివారు,
తండ్రి అయితే శాస్త్రాలను చదివించరు. తండ్రి అయితే స్వయం సద్గతిదాత. ఎప్పుడైనా గీత
గురించి ప్రస్తావిస్తారు. సర్వశాస్త్ర శిరోమణి గీతను భగవంతుడు గానం చేసారు. కానీ
భగవంతుడు అని ఎవరిని అంటారు, ఈ భారతవాసులకు తెలియదు. తండ్రి అంటారు, నేను నిష్కామ
సేవను చేస్తాను, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను, నేను అలా అవ్వను.
స్వర్గములో మీరు నన్ను స్మృతి చెయ్యరు. దుఃఖములో అందరూ స్మరణ చేస్తారు, సుఖములో
ఎవ్వరూ చెయ్యరు. దీనినే సుఖ-దుఃఖాల ఆట అని అంటారు. స్వర్గములో ఏ ఇతర ధర్మాలు ఉండవు.
అవన్నీ తర్వాతే వస్తాయి. మీకు తెలుసు, ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనమైపోతుంది,
ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు చాలా తీవ్రముగా వస్తాయి. అందరూ అంతమైపోతారు.
తండ్రి ఇప్పుడు వచ్చి బుద్ధిహీనుల నుండి తెలివైనవారిగా తయారుచేస్తున్నారు. తండ్రి
ఎంత ధనము, సంపదను ఇచ్చారు. అవన్నీ ఎక్కడకు వెళ్ళాయి. ఇప్పుడు ఎంత దీవాలా తీసేశారు.
బంగారు పిచ్చుకలా ఉన్న భారత్ ఇప్పుడు ఎలా అయిపోయింది? ఇప్పుడు మళ్ళీ పతిత-పావనుడైన
తండ్రి వచ్చి ఉన్నారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. అది హఠయోగము, ఇది రాజయోగము. ఈ
రాజయోగము ఇరువురి కోసము ఉంది, ఆ హఠయోగము కేవలం పురుషులే నేర్చుకుంటారు. ఇప్పుడు
తండ్రి అంటారు, పురుషార్థము చెయ్యండి, విశ్వానికి యజమానులుగా తయారై చూపించండి.
ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనమైతే జరిగేదే ఉంది. ఇకపోతే కొద్ది సమయమే ఉంది. ఈ యుద్ధము
అంతిమ యుద్ధము. ఈ యుద్ధము ప్రారంభమైతే ఇక ఆగలేదు. ఈ యుద్ధము కూడా మీరు ఎప్పుడైతే
కర్మాతీత అవస్థను పొందుతారో మరియు స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యులుగా అవుతారో
అప్పుడే ప్రారంభమవుతుంది. స్మృతియాత్రలో నిర్లక్ష్యులుగా అవ్వకండి అని తండ్రి
మళ్ళీ-మళ్ళీ అంటారు. ఇందులోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.